7. దేవుని రాజ్యము కొరకైన నిరీక్షణ మరియు సిద్ధపాటు
యేసుక్రీస్తు నందలి విశ్వాసులు ఆయనరాకడను అపేక్షించుచు, ఆయన రాకడలోనిందా రహితులుగా కనబడవలెనని పరిశుద్ధ గ్రంథము తెలుపు చున్నది. కనుక 'మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు యెదురు చూచు చున్నారు” (1 కొరింధి 1:7) అని వ్రాయబడినది. మరియు, 'సమాధాన కర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును, మన ప్రభువైన యేసుక్రీస్తు రాడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక' (1 థెస్టలొనీ కయులకు 5:23) అని చదువుదుము. క్రీస్తు రెండవ రాకడలో జరుగు సంగతులను వర్ణిస్తూ అపొస్తలుడైన పేతురు, 'ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టు వారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళకంకులు గాను, నిందారహితులు గాను కనబడునట్లు జాగ్రత్త పడుడి” (2 పేతురు 3:14) అని చెప్పెను. యేసుక్రీస్తు రెండవ రాకడలో మనము యెట్లు యెదుర్కొన వలయునశన్న సంగతులను తెలుపుటకు యేసు క్రీస్తు క్రింద తెలుపబడిన ఉపమానములను చెప్తైను.
2) బుద్ధిగల కన్కకలు - బుద్ధి లేని కన్మకలు (మత్తయి
25:1-13) :
మత్తయి 25:1లో పరలోక రాజ్యము, తమ దివిటీలు పట్టు కొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలు దేరిన పదిమంది కన్మకలను పోలియున్హదని తెలుపుచున్నది. క్రీస్తు సంఘము ఒక కన్వకగా, వరుడిని యెదుర్కొనబోవు ఒక వధువుగా పరిశుద్ధ గ్రంథము వర్ణిస్తున్నది (ప్రకటన 19:7; 21:2,9; 2 కొరింథి 11:2; హోషేయా 2:19). దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని యెదుర్కొనుటకు బయలుదేరిన కశన్మకలు, క్రీస్తు సంఘము(విశ్వాసులు) ప్రభువైన యేసుక్రీస్తును తన రెండవరాకడలో యెదుర్కొందురనుటను సూచిస్తున్నారు. వెలిగింప బడిన దివిటీ విశ్వాసి యొక్క సాక్ష్యపు జీవితమును సూచిస్తున్నది. ఈ లోకములో జీవవాక్కమును చేతపట్టుకొని, జ్యోతులవలె జీవిస్తూ, ప్రభువును యెదుర్కొన వలెను (ఫిలిప్పి 2:15-16). అయితే, ఈ పదిమంది కన్యకలలో అయిదురు బుద్ధిగలవారనియు మిగతా అయిదుగురు బుద్ధిలేని వారనియు, బుద్ధిగలవారు తమదివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసికొని పోయిరనియు, బుద్ధిలేనివారు తమ దివిటీలు మాత్రమే తీసుకొని, తమతో కూడానూనె తీసుకెళ్లలేదనియు మత్తయి 25:2-4లలో చదివెదము.
బుద్ధిగల కన్యకలు యథార్థముగా క్రీస్తును వెంబడిస్తూ వుండు విశ్వాసులను సూచిస్తున్నారు (2 పేతురు 1:5-8, 10-11; 2 పేతురు 3:14,18; ప్రకటన 14:4). కనుకనే వారి జీవితములలో క్రీస్తు రండవ రాకడవరకూ నమ్మకముగా జీవించుటకు తీర్మానించుకొని యుందురు (అనగా వారి దివిటీలు ఆరిపోకుండా చివరివరకూ నూనె కలిగియుందురు). బుద్ధి లేని కన్కకలు వేషధారులను సూచిస్తున్నారు. ఏరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగపడు చున్హారుగాని, లోపల వేషధారణతోను, అక్రమముతోను నిండియున్హారు (మత్తయి 23:28). వీరుపైకి భక్తిగల వారివలె వుండియూు, దాని శక్తిని ఆశ్రయించని వారైయుందురు (2 తిమోతి 3:5). కనుకనే వారి జీవితములలో తమ దివిటీలు వెలుగించుకుని యుండుటకు నూనె లేక యుందురు. పెండ్లి కుమారుడు వచ్చిన సమయములో బుద్ధిగల కన్మకలు ఆయనను యెదుర్కొనిరనియు, బుద్ధిలేని కన్మకలు ఆయన చేత తృణీకరింపబడిరనియు మనము చదివెదము (మత్తయి 25:5-13).
ప్రియులారా, మన జీవితములలో వేషధారణ కలిగియుండుట ద్వారా యేసుక్రీస్తు మనలను చేర్చుకొనక, వెలివేయునన్న సత్యమును ఈ ఉపమానము ద్వారా నేర్వుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథములో, “ఆదినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, ప్రభువా, మేము నీనామున ప్రవచింపలేదా ? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా ? నీ నామమున అనేకమైన ఆద్భుతములు చేయ లేదా ? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ములను ఎన్నడును ఎరగను. అక్రమము చేయువారలారా, నా యొద్దనుండి పొండని వారితో చెప్పదును” అని యేసుక్రీస్తు మత్తయి 7:22-23 లో సెలవిచ్చెను. క్రీస్తును యెదుర్కొను యథార్థత మన జీవితములలో మనము కలిగియున్నామా ? క్రీస్తు రాకడ యొక్క దినమైనను, ఘడియైనను మనకు తెలియదు గనుక మెలకువగా నుండవలెను (మత్తయి 25:13).
(1) ద్వార పాలకుడు (మార్కు 13:32-37)
'బుద్ధిగల కన్మకలు - బుద్ధి లేని కన్కకలు' అను ఉపమానములో మన దివిటీలు వెలిగించుకొని (అనగా యేసుక్రీస్తు సాక్ష్యార్థమైన జీవితములు జీవిస్తూ) క్రీస్తు రెండవ రాకడకొరకు వేచియుండవలెనని చూచితిమి. 'ద్వారపాలకుడు” అను యీ ఉపమానములో “మెలకువగా వుండి), క్రీస్తు రెండవ రాకడ కొరకు (దేవుని రాజ్యము కొరకు) కనిపెట్టుకొన వలెనన్న సత్యమును గమనించుదుము. మార్కు 13:32-37లో, “ఆదినమును గూర్చియు, ఆగడియను గూర్చియు తండ్రితప్త ఏమనుష్కుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి; మెలకువగా నుండి ప్రార్థన చేయుడి; ఆకాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒబకమనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పనినియమించి, మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి, దేశాంతరము పోయినట్టే ఆకాలవు వుండును. ఇంటియజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్థరాత్రి వచ్చునో, కోడి కూయునప్పుడు వచ్చునో, తెల్ల వారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి, మీరు నిద్ర బోవు చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పు చున్హాను. మెలకువగా నుండుడనెను” అని వ్రాయబడినది.
ఫై వాక్య భాగములో 'మెలకువగా నుండుడి” అను మాట నాలుగు సార్లు వ్రాయబడినట్లుగా మనము గమనించ వలెను. క్రీస్తు రాజ్వము కొరకు మెలకువగా నుండు ద్వారపాలకుని వలె మనము యెదురు చూడవలయూును. ద్వారపాలకుడు మేల్కొనియుండి, తన యజమానుడు వచ్చినపుడు తలుపు తీయునట్లుగా క్రీస్తునందు విశ్వాసులు క్రీస్తు రెండవ రాకడలో నిద్రావన్హను నూచించెడి జీవితములు కాకుండా, యేసు క్రీస్తునామమును మహిమపరచెడి జీవితములు కలిగి క్రీస్తును యెదుర్కొనవలయునని పై ఉపమానము ద్వారా తెలుసుకొను చున్నాము.
నిద్రించుచున్న మనుష్కునిలో జీవముండును గాని, చలనముండదు. ఆత్మీయంగా నిద్రావస్సలో నుండు విశ్వాసుల పరిస్థితియిలాగేయుండును. విశ్వాసులను నిద్రావస్థలోనికి కొనిపోవు అనేక సంగతులు యీ లోకములో వున్నవి. లూకా 21:34లో, “మీహృదయములు ఒకవేళ తిండివలనను, మత్తువలనను, ఐహిక విచారములవలనను మందముగా వున్త్హందున ఆదినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా వుండుడి” అని దేవుని వాక్యము మనలను హెచ్చరించు చున్హది. 1 థెస్సలొనీకయులకు 5:5-9 వచనములలో, “మీరందరూ వెలుగు సంబంధులును, పగటి సంబంధులునై యున్హారు; మనము రాత్రి వారముకాము, చీకటి వారము కాము. కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా వుండి, మత్తులము కాక యుందము. నిద్ర పోవువారు రాత్రివేళనిద్రపోవుదురు. మత్తుగా వుండువారు రాత్రివేళమత్తుగా వుందురు. మనము పగటి వారమై యున్నాము గనుక మత్తులమైయుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము. ఎందుకనగా మనప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడుమనలను నియమించెనుగాని ఉగ్రతపాలగుటకు నియమింప లేదు” అని చదువుచున్నాము.
గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో, “మీరుశోధనలో ప్రవేశించకుండునట్లు మెళకువగా వుండి, ప్రార్థన చేయుడని” చెప్పెను (మార్కు 14:38). అపొస్తలుడైన పౌలు “నేను చెప్పనదేమనగా ఆత్మానుసారముగా నడచుకొనుడి. అప్పుడు మీరు శరీరేఛ్చను నెరవేర్టరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒక దాని కొకటి వృతి రేకముగా వున్హవి గనుక మీరేవిచేయ నిచ్చయింతురో వాటిని చేయకుందురు” అని గలతీ 5:16-17 వచనములలో సెలవిచ్చెను. శరీరకార్యములు మనలను నిద్రావస్థలోనికి కొనిపోవును. ఆత్మ కార్యములు మెలకువగా వుండునట్లు చేయును. కనుక ఆత్మకార్యములు మన జీవితములో కలిగి, క్రీస్తు రాకడ కొరకు మనము యెదురు చూడవలయును.
(1) నమ్మకమైన దానులు (లూకా 12:35-40)
'బుద్ధిగలకన్మకలు బుద్ధిలేని కన్మకలు' అను ఉపమానములో సాక్ష్యపు జీవితము కలిగియుండుట ద్వారా మరియు 'ద్వారపాలకుండు” అను ఉ పమానములో నిద్రావస్థ నుండి దూరముగా వుండుట ద్వారా క్రీస్తు రాకడకొరకు మెళకువగా వేచిచూడగలమని తెలిసికొనియున్నాము. 'నమ్మకమైన దాసులు” అను ఈ ఉపమానములో మన నడుములు కట్టుకొని, ఉపచారము చేయుచూ, క్రీస్తు రాకడ కొరకు మెళకువ కలిగియుండవలెనని నేర్చుకొందుము.
లూకా 12:35-40 లలో “మీనడుములు కట్టుకొని యుండిడి, మీ దీపములు వెలుగుచుండనియ్యడి. తమ ప్రభువు పెండ్లి విందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు యెదురుచూచు మనుష్కులవలె వుండుడి. ప్రభువు వచ్చి, యేదాసులు మెలకువగా వుండుట కనుగొనునో ఆదాసులు ధన్నులు. అతడునడుము కట్టుకొని, వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చివారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్హాను. మరియు అతడు రెండవ జామున వచ్చినను, మూడవ జామున వచ్చినను (విదాసులు) మెలకువగా వుండుట కనుగొనునో ఆ
దాసులు ధన్ములు. దొంగ యే ఘడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసిన యెడల అతడు మెలకువగా వుండి, తన యింటికి కన్హము వేయనియ్యడని
తెలిసికొనుడి. మీరు అనుకొనని ఘడియలో మనుష్పకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా వుండుడని చెప్పెను” అని వ్రాయబడినది. యీ వాక్కభాగములో "మెలకువగా వుండుటి అనుమాట మూడు సార్లు, 'సిద్ధముగా వుండుడి' అను మాట ఒక్కసారి వ్రాయబడి యున్నవి. ఈ అధ్యాయములో గత రెండు ఉ పమానములు, ప్రస్తుత ఉపమానము కలుపుకుని, 'మెలకువగా వుండుడి” అను మాట యెనిమిది సార్లు వ్రాయబడినట్లు తెలిసికొందుము. దీనిని బట్టి క్రీస్తు రాకడ కొరకు మెలకువగా వుండి, వేచి చూచుట యెంతప్రాముఖ్యమైనది మనము తెలిసికొనగలము.
యేదైనా వని చేయబూనుకొనినపుడు మనుష్యులు నడుము కట్టుకొందురు. లూకా 12:35లో 'మీనడుములు కట్టుకొనియుండుడి” అను మాటలు ఉపచారములో నిమగ్షమై యుండుడని తెలియజేయుచుశ్తవి. యోహాను 13:1,5 వచనములో యేసుక్రీస్తు 'భోజన పంక్తిలో నుండి లేచి, తనపై వస్త్రము అవతల పెట్టివేశి, యొకతువాలు తీసుకొని, నడుమునకు కట్టుకొనెను.అంతట పక్టెములో నీళ్ళు పోని, శిష్కుల పాదములు కడుగుటకును, తాను కట్టు కొనియున్న తువాలుతో తడుచుటకును మొదలు పెట్టెను అని చదువు చున్నాము. క్రీస్తు నందలి విశ్వానంలకం ఉవచారవుం చేయుచుండలెననం నత్యమంు తెలియజేయుటకు యేసు క్రీస్తు యీ విధముగా చేసెను. 1 పేతురు 1:13లో 'మీ మనస్సు అనునడుము కట్టుకొని, నిబ్బరమైన బుద్ధి గలవారై, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనపుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి” అని చదువు చున్నాము. ధైవజనుడు సశన్తద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండవలెనని 2 తిమోతి 3:17లో చదువుచున్నాము.
'మీదీపములు వెలుగుచుండనియ్య్ముడి” (లూకా 12:35) అను మాటలు
'బుద్ధిగల కన్మకలు - బుద్ది లేని కన్కకలు” అను ఉపమానములో చెప్తబడినట్లు
ఛ ధ స్ట
యేసుక్రీస్తు కొరకు సాక్ష్యపు జీవితములు జీవిస్తూ వుండవలెనన్న సత్యమును
తెలియజేయుచునశ్హవి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచి తనము, నీతి,
సత్కమను వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి (ఎఫెసి 5:9,10).
పైన చెప్తిన విధముగా జీవిస్తూ, క్రీస్తు రాకడ కొరకు మెలకువగా కనిపెట్టుకొనువారు ధన్యులు అట్టివారిని దేవుడు తానే ఘనపరచును.(లూకా 12:37). ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను యెక్కడ వుందునో అక్కడే నాసేవకుడును వుండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును (యెహాను 12:26)
(1) నమ్మకమైన, బుద్ధిగల గృ్యహనిర్వాహకుడు (మత్తయి 24:45-51; లూకా 12:42-48) :
ప్రియులారా, క్రీస్తు నందలి విశ్వాసులు నమ్మకమైన, బుద్ధిగల గృహనిర్వాహకులుగా జీవిస్తూ, క్రీస్తు రాజ్యము కొరకు యెదురు చూడవలయునని యీ ఉపమానము మనకు బోధించుచున్నది. లూకా 12:42-44 లో, “ప్రభువు ఇట్లనెను - తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారివీంద నియంవింంచు నట్టి నమ్మకమైన, బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు ? ప్రభువు వచ్చి, యెవరిని ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆదాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని యంతటిమీద వాని యుంచునని మీతో నిజముగా చెప్పుచున్హాను” అని చదువు చున్నాము.
యేసుక్రీస్తును వెంబడించువారు గృహనిర్వాహకులుగా దేవుని వాక్యములో చెప్తబడు చున్హారు. గృహనిర్వాహకుడనగా తన యజమానుని చేత ఏదైనా పని అప్పజెప్తబడి, దానిని నిర్వర్తించువాడు. దేవుడు మనలను తన పని నిమిత్తము యీలోకములో వుంచియున్హాడు. మనవ్వక్తిగత, కుటుంబ జీవితములలో. నహవపాటి విశ్వాసులమధ్యను, ఉద్యోగన్థలములలోను క్రీస్తును వెంబడించు విశ్వాసులముగా గృహ నిర్వాహకత్వము కలిగి యున్మాము. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రతుకు చున్నాము. చనిపోయినను ప్రభువు కోసమే చని పోవుచున్నాము. కాబట్టి బ్రదికినను, చనిపోయినను ప్రభువు వారమైయున్మాము (రోమా 14:8). క్రీస్తు రక్తము విలువగా పెట్టి కొనబడిన వారము గనుక మన దేహముతో దేవుని మహిమ పరచ బద్ధులమైయున్హాము (1 కొరింధి 6:20). మన జీవితములలో పరిశుద్ధత కలిగి (1 పేతురు 1:15), శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను అధిగమించి, దేవుని చిత్తము జరిగిస్తూ జీవించవలెనని (1 యెహాను 2:16,17) దేవుని వాక్కములో హెచ్చరింపబడుచున్నాము. దేవుని నానా విధమైన కృపవిషయమై మంచి గృహనిర్వాహకులై యుండి, ఒక్కొళ్ళడు కృపావరము పొందిన కొలది ఒకని కొకడు ఉపచారము చేయుమని (1పేతురు
ర5్0 4:10) పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్హది. అధ్యక్షులు దేవుని గృహనిర్వాహకులవలె నిందారహితులై యుండవలెను (తీతు 1:7). భార్యలు భర్తలకు విధేయులై యుండుటలోను, భర్తలు భార్యలను ప్రేమించుటలోను, పిల్లలు తమ తల్లిదండ్రుల మాట వినుటలోను, దాసులు తమయజమానులకు విధేయులైయుండుటలోను, యజమానులు తమదాసుల పట్ల న్మాయమైనదియు, ధర్మానుసారమైనదియు జరిగించుటలోను దేవుడు మనుష్యులకు అప్పజెప్పిన గృహనిర్వాకత్వము బయలు పరచబడినది (కొలొస్సి 3:18-4:1).
ఎవరైతే తమకు అప్పజెప్తబడిన గృహనిర్వాహకత్వము నమ్మకముగా, బుద్ధితో జరిగింతురో, వారు తమ ప్రభువునకు కలిగిన దానియంతటి మీద వుంచబడుదురని లూకా 12:44లో చదువు చున్నాము. యోసేపు తన గృహనిర్వాహకత్వము నమ్మకముగా జరిగించుటను బట్టి పోతీఫరు తనకు కలిగినదంతయు అతనికి అప్పగించెను (ఆది కాండం 39:4). తరువాత ఫరో ఐగుప్తు దేశప్రజలందరిపై అధికారిగా వుండునట్లు దేవుడు యోసేపును హెచ్చించెను (ఆది కాండం 41:40). తమ నమ్మకమైన గృహనిర్వాహకత్వమును బట్టి పరిశు ద్లులు క్రీస్తుతోకూడా తన రాజ్యములో యేలుదురని దేవుని వాక్యము సెలవిస్తున్నది. (1కొరింఠథి 6:2; దానియేలు 7:22; ప్రకటన 2:26, 20:4).
అయితే, ఆదానండం - నాయుజమానుడం వచ్చుట కాలన్యము చేయుచున్హాడని తన మనసులో అనుకొని, దాసులను, దాసీలను కొట్టి, తిని, త్రాగి, మత్తుగా వుండసారగితే, వాడు కనిపెట్టని దినములోను, ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి, వాని నరికించి, అపనమ్మకస్థులతో వానికి పాలు నియమించును (లూకా 12:45,46). యీవచనములు నామ కార్ధపు క్రైస్తవులను ఉద్దేశించి, వ్రాయబడినవి. పరిశుద్ధ గ్రంథములో శాస్త్రులు, పరిసయ్యులు దేవుని చిత్తమెరిగి యుండియు దానిని చేయక, మనుష్యుల ఆచారములను యితరులపై రుద్ది (దాసులను, దాసీలను కొట్టుటకు సాదృశ్వమూు), పాపపు జీవితములు గలిగి (తిని, త్రాగి, మత్తుగా యుండుటకు సాద్యశ్వము)
ర్1 జీవించిరి. యిట్టివారు అవిశ్వాసులకన్న మరి యెక్కువైన శిక్షకు పాత్రులగుదురని దేవుని వాక్కము తెలియజేయుచున్హది (మత్తయి1 1:21,22; హెబ్రీ 10:28,29; లూకా 12:47).
నమ్మకమైన, బుద్ధిగల గృహనిర్వాహకులుగా జీవిస్తూ, క్రీస్తు రాజ్విము కొరకు యెదురు చూచుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక!
(6) యుతక్తివరుడైన గృ్యహనిర్వాహకుడు (లూకా 16:1-13) :
"నమ్మకమైన, బుద్ధిగల గృహనిర్వాహకుడు' అను ఉపమానములో దేవుడు మనకు అప్పజెప్పిన గృహ నిర్వాహకత్వమును నమ్మకముగా నిర్వర్తిస్తూ, దేవుని రాజ్యము కొరకు యెదురు చూడవలెనని చదివియున్నాము. “యుక్తి పరుడైన గృహనిర్వాహకుడు” అను యీ ఉపమానములో అన్మాయస్థుడును మరియు యుతక్తిపరుడైన ఒక గృహనిర్వాహకుని గురించి చూచెదము. లూకా 16:1-13 వాక్కభాగమును పరిశీలించినట్లయితే, క్రింది విషయములు మనము గమనించ గలము.
(1) లూకా: 16:1,2 వచనములో ఒక ధనవంతుని యొద్ద పని చేయుచున్న ఒక గృహనిర్వాహకండం తన యజమానుని ఆస్తి పాడుచేయుచున్నందున, ఆధనవంతుడం అన్యాయముగా ప్రవర్తిస్తున్న ఆ గృహనిర్వాహకుని పనిలో నుండి తొలగించి,గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుమని అడిగినట్లు చదువుచున్నాము. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన తెలివితేటలు, సమయము, ధనము, తలాంతులను దేవుని రాజ్యము కొరకు వాడు గృహనిర్వాహకులుగా మనముండవలెను. వాటిని బట్టి దేవునికి లెక్క అవ్పజెవ్వవలని యుండును గనుక, వాటిని వ్యధా చేయకూడదని గమనించుచున్నాము. “యౌవసుడా, నీ యౌవనమందు సంతోషపడుము. నీయౌవనకాలమందు నీ హృదయము సంతుష్తిగా వుండనిమ్ము. నీ కోరిక చొప్పునను, నీదృష్టి యొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటిని
ర5్2 బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము” అని దేవుని వాక్కము ప్రసంగి 11:9లో సెలవిస్తున్నది.
(2) లూకా 16:3-8 వచనములో అన్యాయన్యుడైన యీ గృహనిర్వాహకుడు తన గృహనిర్వాహకత్వపు పని పోతున్తందున తనయజమాని రుణస్థులతో మోసకరమైన రీతిలో యుక్తిగా ప్రవర్తించెనని చదువుచున్నాము. తన యజమానుని రుణస్థుల మన్నన పొంది, వారితో చేర్చుకొనబడుటకు ఆగృ్యహనిర్వాహకుడు యీలాగు ప్రవర్తించెను. ఆగ్యహనిర్వాహకుని యుక్తిని తన యజమానుడు మెచ్చు కొనెను.
ఈ ఉవవానములో యజమానుడు వెంచ్చు కొన్నది తన గృహనిర్వాహకుని అన్యాయపు ప్రవర్తనను కాదు గానీ, అతని “యుక్తి”ని మెచ్చుకొనెనని మనము గమనించవలెను.
యీ ఉపమానము ద్వారా యేసు క్రీస్తు మనకున్న అన్మాయపు సిరిని (ధనము మోసనకరమైనది గనుక అన్మాయపు సిరిగా పిలువబడుతున్నది) న్యాయమైన రీతిలో యుక్తిగా, నిత్మత్వమును దృష్టిలో వుంచుకొని, దేవుని రాజ్యము కొరకు వాడవలెనని తెలియ జేయుచున్హాడు (లూకా 16:9). “భూమి మీద మీ కొరకు ధనమును కూర్చు కొనవద్దు; ఇక్కడ చిష్మాటయు, తుప్పను తిని వేయును, దొంగలు కన్నమువేసి, దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు. దొంగలు కన్నమువేసి, దొంగిలరు” అని యేసుక్రీస్తు మత్తయి 6:19-21లో సెలవిచ్చెను. ఈలోక నంబంధులు వెలుగం నంబంధుల కంటె (విశ్వానంలకంటె) యుక్తిపరులైయున్హారని (లూకా 16:8) యేసుక్రీస్తు తెలియజేసెను. ఈ లోకస్తులు దురాశ నెరవేర్చు కొనుటకు యేలాగైతే యుక్తిని కనుపరచుదురో, అలాంటి యుక్తిని విశ్వానంలం దేవుని మహిమ కొరకై తమ ధనమును, తెలివితేటలను వినియోగించుటలో కనపరచవలెనని యీ ఉపమానముద్వారా తెలుసుకొను చున్నాము. తద్వారా దేవుడు మనలను తన నిత్మమైన రాజ్యములోనికి చేర్చుకొని
ర5్3 ప్రతిఫలమిచ్చును (లూకా 16:9).
ఇ
భూమి మీద మనకున్న కొద్దిపాట్ిధ నము (అన్యాయపునిరి) విషయములో మనము నమ్మకముగా లేనట్లయితే దేవుని రాజ్యములో నిజమైన ఐశ్వర్యమును మనమెట్లు పొందగలమని యేసుక్రీస్తు మనలను ప్రశ్నించు చున్హాడు (లూకా 16:11). మనము మిక్కిలి కొంచెములో నమ్మకముగా వున్హ్నయెడల, యెక్కువలోను నమ్మకముగా వుందుమని లూకా 16:10 లో చదువు చున్నాము. కనుక మన ధనము న్యాయమైన రీతిలో యుక్తిగా దేవుని రాజ్యము కొరకు వెచ్చించుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక !
ప్రియులారా, గత అయిదం ఉపమానముల ద్వారా దేవుని రాజ్యముకొరకు యెలా కనిపెట్టు చుండవలెనను సంగతులను యేసుక్రీస్తు మనకు బయలుపరచెను. కనుక యేకృ్యపావరమునందును లోపములేక మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మనము యెదరు చూచు చుందుముగాక ! (1 కొరింథి 1:7).
