6. దేవుని రాజ్యమునకు అవరోధములు
ఎంతో మంది దేవుని రాజ్యనత్యమును తెలిసికొను ప్రయత్నము చేయుదురు. కానీ, దనాపేక్ష ఐహిక విచారములు మొదలగునవి వారిని దేవుని రాజ్యమును గూర్చి ఆలోచించకుండా చేయును. దేవుని రాజ్యమునకు అవరోధములుగా వున్న సంగతులను తెలియజేస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథములో క్రింద తెలుపబడిన రెండు ఉపమానములను చెప్పెను.
(2) వెర్రి ధనవంతుడు (లూకా 12:16-21) :
లూకా 12:1-12 వచనములలో యేసుక్రీస్తు పరిసయ్యుల వేషధారణ గూర్చియు, దేవుని భయము కలిగియుండుటను గూర్హియు, మనష్యాల యెదుట క్రీస్తును ఒప్పుకొనుట గూర్పియు బోధించు చుండెను. యివన్సియు యెంతో ఆత్మీయమైన సంగతులు. అయితే యివేవియు వినకుండా ఒక మనుష్యుడు, 'బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పమని” యేసుక్రీస్తును అడుగగా, యేసు ధనము గురించియే ఆలోచన కలిగిన ఆమనుష్కుని బట్టి 'వెరిధనవంతుడు” అను ఈఉపమానము చెప్తెను. దేవుని రాజ్బములో ప్రవేశించ కుండా చేయుటకు 'ధనాశి అనునది ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర మానవుల జీవితములలో కలిగియున్నదని ఈ ఉపమానము ద్వారా తెలిసికొనవచ్చును.
లూకా 12:16-19 లో ఈలాగు వ్రాయబడినది: ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను గనుక అతడు పంట సమకూర్చుకొనుటకు ఉన్మకొట్లు చాలవు గనుక, వాటిని విప్తి, వాటి కంటె గొప్పవాటిని కట్టించి, అందులో ధాన్క్మమంతటిని, ఆస్తిని సమకూర్చుకొని, “నా ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియన్వది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని” చెప్పుకొందు నను కొనెను.
పరిశుద్ధగ్రంథములో ధనముగురించి యీ విధముగా చెప్తబడినది.
1. ధనము అస్థిరమైనది (1 తిమోతి 6:17)
2. ధనము పక్షిరాజు ఆకాశమునకు యెగిరిపోవునట్లు రెక్కలు ధరించి,
యెగిరిపోవును (సామెతలు 23:5) 3. ధనము తృప్తి పొందించనిది (ప్రసంగి 4:8)
4. ధనము నాశనమును తెచ్చును (ప్రసంగి 5:13)
5. ధనము చెడిపోవునది (యాకోబు 5:2)
6. ధనము శాశ్వతము కాదు (సామెతలు 27:24) యింకను ధనమును మొదటి స్థానములో వుంచకూడదనియు
(1 రాజులు 3:11,13), ధనమును ఆశించ కూడదనియు (62 రాజులు 5:26), ధన సమ్మద్ధియందు నమ్మికయంచకూడదనియు (కీర్తన 49:6; 52:7: సామెతలు 11:28), ధన సమృద్ధిని లక్ష్యపెట్ట కూడదనియు (కీర్తన 62:10) పరిశుద్ధ గ్రంథము మనకు బోధించుచున్నది.
ఉపమానములో చెప్తబడిన ధనవంతుడు ధనమును గురించి పైన చెప్తినవేమీ తెలియక, ధనమే సర్వస్వమనుకొనెను. ఈ ఉపమానములో “నేను” అను పదము 2 సార్లు, “నా” అను అక్షరము 5 సార్లు, “నాకు” అనుపదము ఒకసారి వ్రాయబడినవి. ఈ ధనవంతుడు దేవుని గురించిన ఆలోచన లేక భూనంబంధమైన నంఃఖభోగమును కోరుకొని, తన ధనమును బట్టి అతిశయించెను. కనుకనే దేవుడు “వెర్రి వాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నాను; నీవు సిద్ధపరచి నవి యెవని వగునని” అతనితో చెప్పెను (లూకా 12:20). అంతేకాక, 'దేవుని యెడల ధనవంతుడు కాక, తన కొరకే సమకూర్చు కొనువాడు ఆలాగుననే యుండునని” యేసుక్రీస్తు చెప్పెను (మత్తయి 12:21). ఈ ఉపమానము ద్వారా అనేకులు ధన వ్యామోౌహమును బట్టి దేవుని రాజ్యము చేరలేకయున్హారని గ్రహించుచున్నాము. ధనవంతులుగా వున్న ప్రతి ఒక్కరూ ధన వ్యామోహము కలిరియుందురనుకొనకూడదు. యేసుక్రీస్తును వెంబడించిన వారిలో ధనవంతులు కూడా వున్హారు (జక్కయ్య, లూకా 19:2-10). అయితే దేవుడు ధన వ్యాపోహమును బట్టి తనకు దూరముగా వుండువారిని గద్దించుచున్హాడు. యేసు క్రీస్తు, “ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్ల్హభమని” ధనవంతుడైన అధికారిని గూర్చి తన శిష్యులతో చెప్పెను
(మార్కు 10:23)
దేవుని యందు ధనవంతులుగా వుండగోరువారు క్రీస్తునందుండి, ఆయన కొరకు జీవింతురు (2 కొరింధి 5:15), క్రీస్తునందు ఆత్మసంబంధమైన ఆశీర్వాదములు, ఆయన యొక్క అత్యధికమైన కృపామహదై శ్వర్యములు కలిగరియుందురు (ఎఫెసి1:3; 2:4-7). వారు యిహసంబంధమైన ధనమును వారి శక్తి కొలదీ బీదలకిచ్చుదురు (లూకా 12:33,34, మత్తయి 19:21; 1తిమోతి 6:17-19) మరియు పరలోకమందు తమధనమును కూడబెట్టుకొందురు (మత్తయి 6:19-21). అంతేగాక ఆత్మ్యసంధమైన విషయములలో సరియైన అవగాహన కలిగియుందురు (యాకోబు 4:13-15; హెబ్రీ 11:26; ఫిలిప్తి 4:19)
(1) విత్తువాడు (మత్తయి 13:3-23; మార్కు 4:2-20; లూకా 8:4-15) :
ప్రియులారా, 'వెరి ధనవంతుడు అను ఉపమానములో దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ధనము ఒక అవరోధముగా వున్తదని గమనించితిమి. 'విత్తువాడు' అను ఈ ఉపమానములో యేసుక్రీస్తు, మనవుడు దేవుని రాజ్యములో ప్రవేశింప లేక పోవుటకు గల యింకొన్ని కారణములు తెలియజెప్తెను (మత్తయి 13:3-23). ఈ ఉపమానమును పరిశీలించిన యెడల, క్రింద తెలుపబడిన విషయములు విదితమగును.
(1) విత్తనము నువార్త, విత్తువాడు నువార్త పరిచారకుడు :
మత్తయి 13:3లో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లైనని వ్రాయబడినది. యీ విత్తువాడు దేవుని వాక్కము లేక సువార్త సందేశమును ప్రకటించుటకు బయలువెళ్లిన పరిచారకుని నూచిస్తున్నాడు. అలాగే విత్తనము నువార్త సందేశమును సూచిస్తున్హది. ఈ విత్తనమును యేసుక్రీస్తు, రాజ్యమును గూర్చిన వాక్కము'గా వర్ణించెను (మత్తయి 13:18). ఈ విత్తనము శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమను “అక్షయ బీజము”గా చెప్తబడినది (1పేతురు 1:23). ఈ విత్తనము ఫలించేదిగావున్హది. అందుకే, “ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, వ్యాపించుచున్హట్టుగా మీరు దేవుని కృపను గూర్త్చివిని సత్యముగా గ్రహించిన నాటనుండి మీలో సయితము ఫలించుచు వ్యాపించుచున్హది” అని వ్రాయబడినది (కొలొస్టి 1:6).
(2) త్రోవ ప్రక్కన వడిన విత్తనములు (మత్తయి 13:4,19).
విత్తువాడు, విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కనపడెను; పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను (మత్తయి 13:4). త్రోవలో వాహనములు, మనుష్యులు తిరుగుచుండుట వలన రద్దీగా వుండును. అలాగుననే మనిషి యొక్క హృదయమనెడు త్రోవలో సాతాను తన దురాశలతో రట్టిగా తిరుగులాడు చుండుటవలన సువార్త విత్తనము విత్తబడినపుడు ఆమనిషి గ్రహింపక యుండును. దేవుని స్వరూపియై యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగసంబధమైన దేవత అవిశ్వాసులైన వారిమనో నేత్రములకు గ్రుడ్డి తనము కలుగ జేసెను (2 కొరింధి 4:4). తద్వారా, విత్తబడిన వాక్యమును దుష్టుడు వెంటనే ఆ మనిషి హృదయములోనుండి యెత్తికొని పోవును (మత్తయ 13:19). సాతాను దురాశలు దేవుని రాజ్యమునకు అవరోధములు.
(3) రాతినేల యందు పడిన విత్తనములు (మత్తయి 13:5,6)
కొన్ని విత్తనవులం చాలమన్నులేని రాతినేలను వడెను; అక్కడమన్నులోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెనుగాని, సూర్యుడు ఉ దయించినపుడు అవిమాడి, వేరు లేనందున ఎండి పోయెను (మత్తయి 13:5,6). యీ రెండువచనముల (మత్తయి 13:5, భావము యేసు క్రీస్తు మత్తయి 13:20,21 లలో తెలియజెప్పెను. “రాతి నేలను విత్తబడిన వాడు వాక్ష్కమువిని, వెంటనే సంతోషముతో దాని నంగీకరించును. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంత కాలము నిలుచును గాని వాక్కము నిమిత్తము శ్రమయైనను, హింసయైనను కలుగగానే అభ్యంతర పడును (మత్తయి 13:20, 21).
పైన చెప్పబడిన మనుష్యుానిలో వేరు లేనందున, వాక్యము మొలిచి, యెండిపోయినదని మనము చదువుచున్నాము. పరిశుద్ధ గ్రంథములో 2 తిమోతి 3:5లో “అంత్మదినములలో మనుష్యులు పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారై యుందురని” చదివెదము. యేసుక్రీస్తునందు వేరుపారి యుండవలెనని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేయుచున్దది (ఎఫెసి 3:17: కొలాస్సి 2:7.
(4) ముండ్లపాదలయందు వడిన విత్తనములు (మత్తయి 13:7,22)
కొన్ని విత్తనములు ముండ్లపొాదలలో పడెను; ముండ్ల పొదలు యెదిరి వాటిని అణచివేసెను (మత్తయి 13:7). మత్తయి 13:22లో యేసుక్రీస్తు 'ముండ్లపొదలలో విత్తబడినవాడు వాక్మ్కము విను వాడేగాని ఐహిక విచారమును, ధన మోహమును ఆవాక్కమును అణచివేయును గనుక వాడు నిప్తలుడవునని” చెప్పెను. క్రీస్తును వెంబడించు విషయములో ఐహిక విచారములు, ధన మోహము ముండ్లపాదలవలె మనుష్యులకు అడ్డుపడు చున్నవని దీనిని బట్టి మనము గమనించెదము. యాకోబు 1:14,15లో “ప్రతి వాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి, మరులు కొల్పబడిన వాడై శోధింపడును. దురాశ గర్జము ధరించి, పాపమును కనగా పాపము పరిపక్వమై, మరణమును కనునని” వ్రాయబడియునశ్వది.
(5) మంచి నేలను వడిన విత్తనములు (మత్తయి 13:8,23)
కొన్ని విత్తనములు మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలు గాను, ఒకటి ముప్తదంతలుగాను ఫలించెను (మత్తయి 13:8). మంచినేల అనునది వాక్య్కమువిని, దానిని గ్రహించువాని హృదయమును సూచిస్తున్నది (మత్తయి 13:23). దేవుని వాక్కమును గూర్చిన గ్రహింపు ప్రభువైన యేసుక్రీస్తు వలన కలుగును. కనుకనే, “మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి, మనకు వివేకమనుగ్రహించి యున్వాడని యెరుగుదుమని” 1 యెహాను 5:20లో వ్రాయబడినది. ”నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. తప్పమార్లములన్నియు నాకు అసహృములాయెనని” కీర్తన 119:104లో చదివెదము. కీర్తన 119:130లో దేవుని వాక్యము తెలివిలేని వారికి తెలివి పుట్టించునని” వ్రాయబడినది.
ప్రియులారా, మంచినేలను నాటబడి, నూరంతలుగా, అరవదంతలుగా, ముప్పదంతలుగా ఫలించుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక (ఫిలిప్తి 1:11).
