8. దేవుని రాజ్యవారసుల గుణగణములు
ప్రియులారా, ఈ అధ్యాయములో యేసుక్రీస్తు నందు విశ్వాసమంచి, దేవుని వాక్కానుసారమైన జీవితములు జీవించువారి యొక్క గుణగణములు తెలియజేయుటకు యేసుక్రీస్తు చెప్పిన వుపమానములను గూర్చి తెలిసి కొందుము. దేవుని రాజ్యవారసులకు వుండ వలసిన, క్రింద చెప్తబడిన గుణములను ఆయా ఉపమానముల ద్వారా యేసు క్రీస్తు తెలిపెను.
(2) ప్రేమ : దేవుడు ప్రేమా స్వరూపియని, ఆయన తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపుటద్వారా మనవులపట్ల తనకున్న ప్రేమ ప్రత్యక్షపరచబడేనని 1యెహాను 4:8,9 వచనములలో చదువుదుము. అయితే, దేవుని ప్రేమపాందిన విశ్వాసులు ఆయన పట్ల ప్రదర్శించవలసిన ప్రేమను గూర్చి తెలుపుతూ యేసుక్రీస్తు క్రింది ఉపమానమును చెప్ప్తెను.
(1) ఇద్దరు బుణన్థులు (లూకా 7:41-43)
యేసుక్రీస్తు ఒక పరిసయ్య్ముని యింటికి భోజనమునకు వెళ్లి, భోజన పంక్తిలో కూర్చున్నపుడు ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒకస్తే వెనుక తట్టు యేసు పాదముల యొద్ద నిలువబడి, యేడ్చుచు, కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొని, ఆ అత్తరు వాటికి పూసెను. అది చూచి పరిసయ్నుడు, యీయన ప్రవక్తరైన యెడల తన్నుముట్యు కొనిన స్త్రీ యెంవతెయో యెరిగియుండంనని తనలో తానాలోచించుకొనుచుండగా (లూకా 7:36-40) యేసుక్రీస్తు 'ఇద్దరు బుణస్థులు” అను వుపమానమును చెప్తెను.
లూకా 7:41-43 వచనములలో “అప్పుయిచ్చు ఒకనికి ఇద్దరు బుణస్థులుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిద్దరిలో యెవడు
ర్5 అతని యెక్కువగా ప్రేమించునని యేసు అడిగినపుడు, సీమోను, 'అతడెవనికి
ఎక్కువ క్షమించెనో వాడే'యని చెప్పెను” అని ప్రాయబడినది. యీ వాక్కభాగములో
అప్పుయిచఛ్చిన మనిషి యేసుక్రీస్తును సూచిస్తుండగా, ఐదువందలదేనారములు గ
అచ్చియున్న మనిషి పాపాత్మురాలైన స్త్రీని, యేబది దేనారములు అచ్చియుండు
మనిషి పరిసయ్యుని సూచిస్తున్నారు.
పై వాక్యభాగములో పరినయ్యుడంు న్వనీతిగలిగి, యుితరులను తృణీకరించు వేషధారులను సూచిస్తున్హాడు (సామెతలు 26:12; యెషయా 65:5; ఫిలిష్సి 2:3; తీతు 1:16). పరినయ్యుడం ఏబది దేనారములు మాత్రమే అచ్చియుండెననుటలో అసలు అర్థము యేమనగా పరిసయ్యుడు యేసుక్రీస్తు పట్ల తన విస్తారమైన బుణమును గ్రహించలేక పోయెను. కనుక, తన దృ్యష్టిలోతానే నీతిమంతుడనుకొని, పాపాత్మురాలైన స్త్రీని ద్వేషించెను. మరియు తన స్వనీతిని బట్టి, యేసుక్రీస్తును ప్రేమించలేక పోయెను. తద్వారా యేసుక్రీస్తును భోజనమునకు ఆహ్వానించినప్పటికీ, తన పాదములు కడుగుకొనుటకు యేసుక్రీస్తుకు నీళ్ళివ్వలేదు (ఆదికాండం 18:4, 19:2, 24:32, 43:24; న్యాయాధిపతులు 19:21; 1 తిమోతి 5:10), యేసుక్రీస్తును ముద్దు పెట్టుకొన లేదు (2 కొరింధి 13:12; 1థెస్స్హలొనీయులకు 5:26; 1 పేతురు 5:13), నూనెతో యేసు తలను అంటలేదు (కీర్తన 23:5; నిర్గమకాండం 29:7; లేవీ కాండం 8:12, 21:10).
అయితే, పాపాత్మురాలైన స్త్రీ, పరిసయ్య్మునితో పోల్చిచూస్తే, యేసుక్రీస్తు పట్ల తన విస్తారమైన బుణమును గ్రహించి, తన విస్తారమైన పాపములను బట్టి, పశ్వ్చాత్తాపముతో యేడ్చుచూ, ప్రభువు పాదములను తన కన్నీటితో కడిగి, తన తలవెండ్రుకలతో ఆయన పాదములను తుడిచి, ముద్దు పెట్టుకొని, తన వెంట తెచ్చిన అత్తరును యేసుక్రీస్తు పాదములకు పూసెను (లూకా 7:37,38,44,45,46). మన విస్తారమైన పాపములను యేసుక్రీస్తు క్షమించుటద్వారా ఆయనకు ఎంతో బుణస్థులమైయున్హామని గ్రహించినపుడే ప్రభువైన యేసు క్రీస్తును మనము
ర్6 అధికముగా ప్రేమించగలుగుతాము. అపొస్తలుడైన పౌలు, “పూర్వము దూషకుడను, హింసకుడను, హాని కరుడనని” 1 తిమోతి 1:12 లో తన పాపపు స్థితిని గ్రహించి, తన అధికమైన పాపములన్నింటినీ యేసుక్రీస్తు క్షమించినందుకు ఆయనను అధికముగా ప్రేమించెను. యేసుక్రీస్తు, “నీపూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీదేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని” మత్తయి 22:37 లో ధర్మ శాస్త్ర ప్రధానాజ్ఞను తెలియజెప్పెను. పాపాత్మురాలైన స్తీ విలువైన అత్తరును యేసుక్రీస్తు పాదములకు పూయుట ద్వారా ప్రభువు పట్ల తన ప్రేమను చాటి చెప్పెను.
ప్రియులారా , యీ ఉపమానము ద్వారా మనము ఎంతఫఘోర పాపులమై నప్పటికిని ప్రభువైన యేసు క్రీస్తు మన పాపములను క్షమించుటకు సిద్ధముగా వున్న్మాడనియు, మన విస్తారపాపములు ప్రభువు క్షమించెనన్న గ్రహింపు మనకున్హపుడే ప్రభువును అధికముగా ప్రేమించగలుగుతామనియు గ్రహించు చున్నాము.
(1) వినయము, తగ్గింపు :
ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము, 'మహాఘనుడును, మహోన్శతుడును, పరిశుద్ధుడును, నితవాసియునైన వాడు యీలాగు సెలవిచ్చ చున్నాడు - నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును, వినయము గలవారి యొద్దను, దీనమనస్సు గల వారియొద్దను నివసించుచున్హానని” యెషయా 57:15లో సెలవిస్తున్నది. దేవుడు గర్విష్టులను, అహంకారులను యెదిరించి, దీనులకు కృప అను గ్రహించును (1 పేతురు 5:5; సామెతలు 3:34). ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాకై, తన్ను తాను తగ్గించుకొనెనని థిలిప్పి 2:8లో మనము చదువుచున్నాము. వినయ మనన్కులుగా, దవీనమనస్సులుగా జీవించుటకు యేసుక్రీస్తు తన యందు విశ్వాసముంచినవారికి మాదిరియైయున్హాడు. విశ్వాసులు దేవుని యెదుటను, మనుష్యుల యెదుటను
ర్7 వినయమనస్కులైయుండవలెనన్న సత్యమును బయలుపరచుటకై యేసుక్రీస్తు క్రింద చెప్పబడిన రెండు ఉపమానములను తెలిపెను.
(1) నివ్ర్తయోజకులైన వానులు (లూకా 17:7-10) :
యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగములో చెప్తిన మొట్టమొదటిమాట, “ఆత్మవిషయమై దీనులైన వారుధన్నులు; పరలోక రాజ్యము వారిది” (మత్తయి 5:3). యేసు క్రీస్తు నందు విశ్వాసముంచువారు లేదా దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనువారికుండెడి ప్రధాన లక్షణము 'దీనత్వము'. మన పాపపు స్థితిని ఒప్పుకొని, మనలను మనము రక్షించుకోలేమన్న సత్వమును తెలిసికొని, యేసు క్రీస్తు నందలి రక్షణను స్వీకరించుటలో దీనత్వమున్వది. యిటువంటి దీనత్వమును లేదా దేవుని యెదుటమనకుండవలసిన దీనత్వమును తెలుపుటకు యేసుక్రీస్తు “నిష్ట్ణయోజకులైన దాసులు” అను ఉపమానమును చెప్పెను.
లూకా 17:7-10 లో, “దున్నువాడు గానీ, మేపువాడు గానీ మీలో యెవనికైనా ఒక దాసుడుండగా, వాడు పొలములో నుండి వచ్చినపుడు - నీవు యిప్పుడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పనా ? చెప్పడు. అంతేకాక "నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని, నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము. అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చు కొనవచ్చునని” వానితో చెప్పను గాని, ఆదాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడుదయచూపెనని వానిని మెచ్చునా ? అటువలె మీరును మీకు ఆజ్ఞాపింప బడిన వన్షియు చేసిన తరువాత మేము నిష్తయోజకులమైన దాసులము. మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను” అని వ్రాయబడియున్వది.
పై ఉపమానమును పరిశీలించినట్లయితే, యిహలోక యజమానుడు తన దాసుని పట్ల యెటువంటి ప్రవర్తనకలిగియుండునన్నది యేసుక్రీస్తు చెప్పెను.
ర్8 (1) యిహలోక యజమానుడు పొాలములోనుండి వచ్చిన తన దాసునితో భోజనమునకు కూర్చొనమని చెప్తడు (లూకా 17:7). (0) తన దాసుడు తనకు భోజనము వడ్డించి, తాను తిన్న తరువాత తన దాసుడు తినునని అనుకొనును (లూకా 17:8). (0) తన దాసుడు తనకు భోజనము వడ్డించినందుకు ఆ యజమానుడు తన దాసునికి వందనములు తెలియజేయడు (లూకా 17:9).
అయితే, పరలోకపు యజమానుడు (దేవుడు మనలను రక్షించడానికి తనకెటువంటి బాధ్యత లేక పోయినప్పటికీ, తన కృపను బట్టి మన పాపములనుండి మనలను రక్షించెను. అంత మాత్రమే గాక, ఆయన యెడల మనము జరిగించిన పరిచర్మను బట్టి, 'భళా, నమ్మకమైన మంచి దాసుడా” అని మెచ్చుకొని (మత్తయి 25:21), బహుమానముల నిచ్చి (2 కొరింథి 5:10), తనతో విందునకు ఆహ్వానించి, భోజనము పెట్టును (లూకా 12:37; కీర్తన 23:5). దేవుని (పరలోక యజమానుని) తీరు, యుిహలోకయజమానుని తీరుతో పోలిస్తే, పూర్తిగా ఖభిన్నమైనదని మనము గమనించగలము. కనుక మనము దీనత్వముతో, “అయోగ్యాలమైన, నివ్తయోజకులమైన దానులము” గా దేవుని యెదుట వుండవలెనని గ్రహించుచున్నాము. మన క్రియలను బట్టిగాక, దేవుని కృప చేతనే రక్షించబడియున్హాము (ఎఫెసి 2:8,9). కనుక వుచితముగా పొందియున్హ రక్షణను బట్టి, 'నిష్టయోజకులమైన దాసులము'గా మనలను పరిగణించుకొని, దేవుని సేవించ బద్ధులమైయున్హామని యీ ఉపమానము ద్వారా తెలుసుకొంటున్నాము.
పరిశుద్ధగ్రంథములో దీనత్వమును లేదా వినయమును కలిగి యుండిన కొందరిని చూచెదము. యోహాను 1:27లో బాప్తిన్మమిచ్చు యోహాను, తాను యేసుక్రీస్తు చెప్పల వారును విప్పటకైనను యోగ్యుడను కానని చెప్పెను. లూకా 15:19 లో తప్పిపోయిన కుమారుడు తన తండ్రితో, 'నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీకూలివారిలో ఒకనిగాపెట్టు కొనుమని” చెప్పుకొనదల చెను. ఆదికాండం 32:10లో యాకోబు, 'నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, సమస్త సత్యమునకును
ర5్9 అపాత్రుడనని' ప్రార్ధించెను. మత్తయి 8:8లో శతాథధిపతి యేసుక్రీస్తుతో, 'ప్రభువా, నీవునాయింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానని” చెప్పెను. అపొస్తలుడైన పౌలు,'నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఫుమును హింసించినందున అపొస్తలుడన బడుటకు యోగ్యడను కానని” చెప్పెను (1కొరింథి 15:9). దేవుని బలిష్టమైన చేతిక్రింద దీనమనస్కులై యుందుము గాక (1 పేతురు 5:6).
(2) కడవటి చోటు (లూకా 14:7-11)
'నిష్ట యోజకులైన దాసులు” అను ఉపమానములో దేవుని యెదుట వినయముతో జీవించవలెనను సత్యమును గమనించితిమి. 'కడపటి చోటు” అనం ఈ ఉవవమానవులో నమాజములోని మనువ్యాల యెదుట వినయమనస్కులమై యుండవలయుననశ్న సత్యమును చూచెదము. లూకా 14:7-11 వచనములలో ఈలాగు వ్రాయబడియున్నది. “పిలువబడినవారు భోజనపంక్తిని అగ్రపీఠములు వఏర్పరచుకొనుట చూచి, ఆయన వారితో ఈ ఉ పమానము చెప్పెను. నిన్వైవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్ర పీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీ కంటే ఘనుడు అతని చేత పిలవబడగా నిన్నును, అతనిని పిలిచిన వాడువచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పడు నీపు సిగ్గుపడి, కడపటి చోటున కూర్చుండసాగుదువు. అయితే నీపు పిలువబడినపుడు, నిన్ను పిలిచినవాడువచ్చి, స్పేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడ కూర్చుండు వారందరి యెదుట నీకు ఘనతకలుగును. తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపడును. తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.”
పై ఉపమానములో పెండ్లి విందుకు పిలువబడిన వారు అగ్రపీఠములను ఏర్పరచుకొను చుండిరని చదువు చున్హాము. స్వభావ సిద్ధముగా ప్రతిమనిషీ తన్నుతాను హెచ్చించుకొనును లేదా గర్వించును. పరిశుద్ధ గ్రంథములో “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకం ముందు అహంకారమైన మనస్సు నడచును” అని వ్రాయబడినది (సామెతలు 16:18. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయమనస్కుడు ఘనత నొందును (సామెతలు 29:23). “గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్మములు”. అని దేవుని వాక్యము సామెతలు 8:13లో సెలవిస్తున్నది. అహంభావము మనిషి హృదయములోనుండి వచ్చుననియు (మార్కు 7:22), జీవపు డంబము ఈలోకపు తీరనియు (1 యోహాను 2:16) మనము చదివెదము.
అయితే, ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి 11:29లో “నేను సాత్వికుడను, దీనమనస్సు గల వాడను గనుక మీమీద నా కాడి యెత్తికొని, నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును” అని చెప్తెను. క్రీన్తానందం విశ్వానముంచువారం వినయమును ధరించుకొనవలెనని చెప్తబడుచున్హారు (కొలొస్త్హయలకు 3:12). విశ్వాసులు వినయమైన మనస్సు గలవారై, ఒకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుకొన వలయును (ఫిలిప్తి 2:3). వారు మనుష్మాలందరి యెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడ మాడని వారును, శాంతులు నైయుండలెను (తీతు 3:2). “న్మాయముగా నడచు కొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు గలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్హడుగు చున్హాడు” అని మీకా 6:8లో చదువు చున్నాము.
యీ ఉపమానములో పెండ్లివిందులో అగ్రపీఠములను కోరుకొని, ఘనత పొందాలనుకున్నవారు తరువాత సిగ్గుకు, అవమానమునకు గురవుదురని చదువుచున్నాము (లూకా 14:9). అందుకే, “దేవుడు అహంకారులను యెదిరించి, దీనులకు కృప అనుగ్రహించును” అని దేవుని వాక్కములో చదువు చున్నాము (1పేతురు 5:5; యాకోబు 4:6; కీర్తనలు 18:27). కనుకనే యేసు క్రీస్తు, తన దినముల యందలి శాస్తులను, పరిసయ్మూలను గద్దిస్తూ, వారు విందులలో అగ్ర చా ద ఈ
స్థానములను, నమాజమందిరములలో అగ్ర పీఠములను, నంతవీధులలో వందనములను, మనుష్ముల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురని చెప్పెను (మత్తయి 23:6,7). అయితే, తమ్ముతాము తగ్గించుకొని, కడపటి చోటు కోరుకొనువారు హెచ్చింపబడుదురు (లూకా 14:10-11).
(0) క్షమించు న్వభావము :
యేసుక్రీస్తు నందలి విశ్వాసులు 'క్షమించు స్వభావము” కలిగిన వారు. పేతురు యేసునొద్దకువచ్చి, 'ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసిన యెడల నేనెన్ని మారులు అతని క్షమింవలెను ? ఏడుమారులమట్టుకా” అని అయనను అడిగినపుడు, యేసు “డెబ్బది యేళ్ల మారుల మట్టుకని” చెప్తి, ఈ క్రింది ఉపమానము చెప్పెను.
(1) కనికరము లేని చెడ్డ దాసుడు (మత్తయి 18:23-35)
ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన పాపక్షమాపణ యెంతో గొప్పది, లెక్కలేనంత, విస్తారమైన మన పాపబుణమును యేసు క్రీస్తు పరిహరించిన దానిని బట్టి మనము కూడా యితరులు మన పట్ల జరిగించు తప్తిదములను బట్టి వారిని క్షమించవలెనను సత్యమును తెలియ జేయుటకు ఆయన 'కనికరము లేని చెడ్డదాసుడు” అను ఉపమానమును చెప్పెను.
ఉపమాన భాగము మత్తయి 18:23-35 పరిశీలించినట్లయితే, యీ క్రింది విషయములు మనము గమనించవచ్చును.
(1) అత్మధికమైన పాపబుణము (మత్తయి 18:23,24) :
మత్తయి 18:23,24లో 'పరలోక రాజ్యము తన దాసులయొద్ద లెక్క చూచుకొనగోరిన యొక రాజును పోలియున్హదనియు, అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినపుడు పదివేల తలాంతులు అచ్చియున్న యొకడు రాజునొద్దకు తేబడెనని” చదువుచున్నాము. ప్రియులారా, భూమిమీద మన జీవితముల యొక్క లెక్క ఒకానొక దినమున దేవునికి మనము అప్ప్తజెప్తవలసిన వారముగా మనమున్నాము (ప్రసంగి 11:9; 2 కొరింథి 5:10). 'దేవుని రాజ్యము కొరకైన నిరీక్షణ మరియు సిద్ధపాటు” అను అధ్యాయములో చెప్తబడిన ఉపమానములో 'గృహనిర్వాహకులము”గా మన జీవితములు దేవునికి అంగీకార యోగ్బములుగా జీవించవలెనని చూచితిమి. ఈ ఉపమానములో 'పదివేల తలాంతులు” అచ్చియున్న యొకడు (మత్తయి 18:24) దేవుని పట్ల అత్యధికమైన పాప బుణమును అచ్చియున్న ఒక పాపిని సూచిస్తున్నాడు. ఈ బుణము తిరిగి చెల్లించలేనిది. అందుకే కీర్తన 49:9లో “వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్సటికిని తీరక అట్లుండవలసినదే” అని వ్రాయబడియున్వది. దావీదు రాజు “లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్హవి. నాదోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తలయెత్తి చూడలేక పోతిని. లెక్కకు అవి నాతల వెంట్రుకలను మించియుశ్తవి.” అని చెప్పెను (కీర్తన 40:12). దేవుని వాక్కములో సొదొమ, గొమొళ్టాల పాపము బహు భారమైనదనియు (ఆదికాండం 18:20), హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలదనియు (యిర్మియా 17:9) చదువుదుము.
(11) పాపమునకు వచ్చు జీతము మరణము (మత్తయి 18:25) :
ఉపమానములోని దాసుడు తన అధికమైన బుణమును చెల్లించలేని స్థితిలో యుండినందున రాజు అతని భార్యను, పిల్లలను, అతనికి కలిగిన యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను (మత్తయి 18:25). ఈ మాట ఒక పాపికి దేవుని పట్లనున్న అత్యధికమైన పాపబుణమునకు గాను కలుగు పర్యవసానమును సూచిస్తున్నది. రోమా 6:23లో 'పాపము వలన వచ్చు జీతము మరణమని; యాకోబు 1:15 లో, “దురాశ గర్భము ధరించి, పాపమును కనగా, పాపముపరిపక్వమై, మరణమును కనునని”, చదువు చున్నాము. శారీరక మరణము మొదటి మరణమైతే, యిది రెండవ మరణము. ప్రకటన 21:8లో, “పిరికి వారును, అవిశ్వానంలును, అనవ్యాలును, నరహంతకంులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అడ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. యిది రెండవ మరణము” అని వ్రాయబడినది.
(11) దాసుని యొక్క వేడ్కోలు (మత్తయి 18:26) :
మత్తయి 18:26లో, “కాబట్టి ఆదాసుడు అతని యెదుట సాగిలవడి, ప్రుక్కి, నాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పె నని” వ్రాయబడినది. దీనిని బట్టి, ఆదాసుడు తన దయనీయమైన స్థితిని ఒప్పుకొని, రాజుయెదుట సాగిలపడినట్లు చూచు చున్నాము. ఈ మాట ఒక పాపి, తన పాపమును బట్టి పశ్చాత్తాపపడి, క్షమించుమని దేవుని ప్రార్ధించుటను సూచిస్తున్నది. దావీదు రాజు, యెహోవా, నాపాపము బహు ఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము” అని ప్రార్ధించెను (కీర్తన 25:11). మరియు 'నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపము బప్పుకొంటిని' (కీర్తన 32:5) అని చెప్పెను. 1 యోహాను 1:9లో, 'మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి, సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” అని చెప్తబడినది. (11) రాజు యొక్క కనికరము, క్షమాభిక్ష (మత్తయి 18:27) :
దాసుడు తన యెదుట సాగిల పడి, (మ్రొక్కుటను చూచి, రాజు కనికరపడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను (మత్తయి 18:27). దేవుడు పాపులను కనికరించి, తన కుమారుడైన యేసుక్రీస్తు నందు వారినివిమోచించి, వారి పాపములను క్షమించి వేసెనని దీనిని బట్టి గమనించుచున్నాము (యెహాను 3:16, 5:24). భక్తిహీనులు, దుష్పులు యోహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారియందు జాలిపడును. వారిని బహుగా క్షమించును (యెషయా 55:7. 'ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు. నీకు మొతజ్టపెట్టు వారందరి యెడల కృపాతిశయము గలవాడవు” (కీర్తన 86:5)
(1) దాసుని కనికరములేని, కఠినమైన స్వభావము (మత్తయి 18:28-30)
మత్తయి 18:28-30 వచనములలో అత్కధికమైన బుణమునుండి తన యజమాని యొద్ద క్షమాభిక్షపాదిన ఆ దాసుడు కేవలము నూరు దేనారములు తనకు అచ్చియున్న ఒక తోటిదాసుడిని క్షమించక, ఆ మొత్తమును చెల్లించువరకు తన తోటిదాసున్ని చెరసాలలో వేయించెనని చదువు చున్నాము. రూపాయిలో తర్జుమా చేస్తే, ఆదాసుడు తన యజమానునికి అచ్చియున్హది మూడు కోట్ల అరవై లక్షల రూపాయలైతే, తనతోటి దాసుడు ఆ దాసునికి అచ్చియున్నది యాభై రూపాయలు మాత్రమే. ఆ దాసుని కనికరములేని, కఠినమైన వైఖరిని గురించి తెలుసుకున్న తన యజమానుడు ఆదాసునిపై కోపగించి, బాధపరచు వారికి తనను అప్పరించెనని మత్తయి 18:32-34లో చదువు చున్నాము.
దేవుడు యేసు క్రీస్తునందు మన విస్తారమైన పాపములను క్షమించిన ప్రకారము విశ్వాసులు కూడా యితరులు తమ పట్ల జరిగించు తప్తిదములను క్షమించవలెనని యీ ఉపమానము ద్వారా నేర్చుకుంటున్నాము (మత్తయి 6:14;15; మత్తయి 18:35; మార్కు 11:25; కొలొస్ప్హయులకు 3:13). తనను హింసించిన వారిని క్షమించుమని సిలువలో తండ్రియైన దేవుని ప్రార్ధించుట ద్వారా, యేసు క్రీస్తు క్షమించు విషయములో మనకు మాదిరియైయున్హాడు (లూకా 23:34). అంతేగాక, “మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము” అని తన మాదిరి ప్రార్ధన మనకు నేర్పియున్హాడు
(లూకా 11:4). (1) జ్ఞానము :
యేసుక్రీస్తునందు విశ్వాసముంచి, ఆయన మాటల ననుసరించి నడుచుకొనువారు 'జ్ఞానము'తో ప్రవర్తించుదురను సత్యమును తెలియజేయుటకు యేసు క్రీస్తు, 'ఇల్లుకట్టువారు' అను ఉపమానమును చెప్పెను. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము (సామెతలు 9:10, యోబు28:28; కీర్తన 111:10). దేవుని వాక్యములో జ్ఞానమును గురించి సామెతల గ్రంథములో యెన్హోసంగతులు వ్రాయబడి యూుశ్హవి. జ్ఞానము ఘోషించుచున్హది. వివేచన తన స్వరము వినిపించు చున్నది (సామెతలు 8:1). జ్ఞానము ముత్వములకన్న శ్రేష్టమైనది. విలువగల సాత్తులేవియు దానితో సాటికావు (పామెతలు 8:11). మేలిమి బంగారము కంటెను, అపరంజికంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండికంటె నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది (సామెతలు 8:19. అయితే, యింతగొప్ప జ్ఞానము యేసు క్రీస్తు నందు, ఆయన మాటలయందు యిమిడి యున్నదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై యుశన్హవి” (కొలొస్హయులకు 2:3). యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై యున్మ్హాడు (1కొరింథి 1:24). కనుకనే ఆయన మాటలననుసరించి, జీవించు వారు ఆయన 'జ్లానము” కలిగి యుందురు.
(1) ఇల్లు కట్టువారు (మత్తయి 7:24-27; లూకా 6:47-49)
లూకా 6:47-49 లో యిలాగు పవ్రాయబడియున్వది :
“నా యొద్దకువచ్చి, నామాటలు విని, వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు యిల్లు కట్టవలెననియుండి, లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసిన వాని పోలియుండును. వరదవచ్చి, ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింప లేక పోయెను. అయితే, నా మాటలు వినియు, చేయని వాడు పునాది వేయక, నేలమీద యిల్లుకట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను; ఆ యింటిపాటు గొప్తదని చెప్పెను.”
పై వాక్య భాగములో యేసుక్రీస్తునందు విశ్వాసముంచి, ఆయన మాటల చొప్పున చేయువాడు, లోతుగా త్రవ్వి బండమీద పునాదివేసి, యిల్లుకట్టిన వాని పోలియున్హ్మాడని చదువు చున్నాము. అట్టివాడు బుద్ధిమంతుడుగా, జ్ఞానిగా యెంచబడుచున్హాడు. మనము యిల్లు కట్టుకొనునప్పుడు భూమినిలోతుగా త్రవ్వి, రాతినేల మీద పునాది వేయుదుము. అలాగే మన ఆత్మీయ జీవితము కూడా క్రీస్తు అను పునాది మీద కట్టబడవలెనని దేవుని వాక్యము సెలవిస్తున్నది (1 కొరింథి 3:11). మత్తయి 7:25లో యేసుక్రీస్తు, బండమీద కట్టబడిన యింటిమీద వాన కురిసి, వరదలు వచ్చి, గాలి విసరి కొట్టినను ఆయింటిపునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదనిచెప్తెను. వాన కురుయుట, వరదలు వచ్చుట, గాలివిసరుట అనునవి విపరీత పరిస్థితులకు సూచనగా వున్హవి. యివి విశ్వాసుల జీవితములలో కలుగు శ్రమలు,ఉపద్రవములు, వేదనలను సూచిస్తున్నవి. అట్టి పరిస్థితులలో జ్ఞానియరైనవాడు తన విశ్వానమందు స్థిరముగా నిలబడి, కదలింపబడడను సత్మమును యీ ఉపమానము ద్వారా గ్రహించుచున్నాము. పరిశుద్ధగ్రంథములో అనేక వచనములు యీ సత్యమును తెలియ జేయుచుశ్హవి. నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు (సావెతలు 28:1). యగథార్థవంతులు ఎప్పుడును కదిలింపబడరు (కీర్తన 112:6). యథార్థవంతుని హృదయము యెహోవాను ఆశ్రయించి, స్థిరముగా వుండును. అతడు దుర్వార్తకు జడియడు, అతని మనస్సు స్థిరముగా వుండును (కీర్తన 112:7,8). ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. యెహోవా యెహోవాయే నిత్కాశ్రయదుర్లము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి (యెషయా 26:3,4). నీతిమంతుడు నిత్మము నిలుచు కట్టడమువలె వున్హాడు (సామెతలు 10:25). దేవుని యొక్క స్థిరమైన పూనాది నిలకడగా వుండును (2 తిమోతి 2:19). యథార్థ వంతులు దేవుని 'శైలము, కోట, కేడెము, రక్షణశృ్చంగము, వున్హతదుర్లము, ఆశ్రయదుర్లము, ఆశ్రయశైలము, కొండగా కలిగి యుందురని దేవుని వాక్కము సెలవిస్తున్పది (కీర్తన 18:2;28:1, 31:2-3, 62:6-7, 94:22, 95:1, 78:35). యెహోవా ఉత్తముడు. శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక యుంచువారిని ఆయన యెరుగును (నహూము 1:7).
67?
అయితే, 'నా మాటలు విని, వాటి చొప్పున చేయని ప్రతివాడును యిసుక మీద యిల్లుకట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను. గాలి విసిరి ఆయింటిమీద కొట్టెను. అప్పుడది కూలబడెను. దాని పాటు గొప్తదని” యేసు క్రీస్తు మత్తయి 7:26,27వచనములలో సెలవిచ్చు చున్హాడు. యీ వాక్కభాగమును గమనించినట్లయితే, యిందులో చెప్తబడిన వారు యేసుక్రీస్తు బోధను వినియు దాని ప్రకారము చేయకున్హారు. అట్టి వారు బుద్ధిహీనులని యేసు క్రీస్తు సెలవిచ్చు చున్హాడు. దేవుని మరచు వాని ఆశ నిరర్థకమగును. అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే. అతడు తన యింటిమీద ఆనుకొనగా అదినిలువదు. అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును (యెబు 3:13,14,15). యేసుక్రీస్తు దినములలో శాస్త్రులు, పరిసయులు ఆయన బోధ వినియు, దానిని త్రోసి పుచ్చిర. తమ జీవితములలో వేషధారణ కలిగి జీవించిరి (మత్తయి 23:13-19). ఇనుక మీద యిల్లు కట్టు కొనువారు తమస్వనీతిని ఆధారము చేసికొనిన శాస్త్రులు, పరిసయ్యులను సూచిస్తున్నారు (లూకా 7:36-50). మానవుని స్వనీతి దేవుని దృష్టిలో మురికిగుడ్డల వలెయున్హదని దేవునివాక్కము సెలవిస్తున్నది (యెషయా 64:6). యిసుక మీద కట్టబడిన యిల్లు పడిపోవునట్లు, మానవుని స్వనీతియు దేవుని దృష్టిలో యెంతమాత్రమూ నిలువ నేరదు. కనుకనే యేసుక్రీస్తు, “శాస్త్రులనీతికంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను” అని సెలవిచ్చెను (మత్తయి 5:20). ప్రియులారా, యేసుక్రీస్తు మాటలు విని, ఆప్రకారము చేయు చున్హామా ?
(0) ప్రార్థనా జీవితము
యేసుక్రీస్తు భూమి మీద మానవ రూపములో నున్నపుడు ప్రార్ధించుటలో యెంతో సమయము గడిపి, మనకు మాదిరియాయెను. యేసుక్రీస్తు బాప్తిన్మము పొందినపుడు ప్రార్థన చేయుచుండెను (లూకా 3:21). తన శిష్కులను ఏర్పరచు కొనక మునుపు రాత్రంతయు ప్రార్ధించెను (లూకా 6:12-13). పెందలకడనే లేచి, యింకను చాలా చీకటి యుండగానే అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థించుచుండెను (మార్కు 1:35). బంటరిగా నుండి ప్రార్ధించు చుండెను (లూకా 5:16, 9:18, 11:1; మత్తయి14:23). తన శిష్ముల కొరకు ప్రార్ధించెను (యోహాను 17). చివరకు కలువరి సిలువలో ప్రార్ధించెను (లూకా 23:34,46). దీనిని బట్టి విశ్వాసులు ప్రార్ధనలో తమ సమయము గడుపుట యెంత ప్రాముఖ్యమైనదో తెలియుచున్హది. మన ప్రార్ధనలు యెలా వుండవలయుననశ్న సత్యమును తెలియజేయుటకు యేసుక్రీస్తు యీ క్రింద చెప్తబడిన మూడు ఉ పమానములను తెలిపెను.
(1) వరినయ్యాడు - నుంకరి (లూకా 18:9-14)
మనము దేవుని యెదుట నీతిమంతులమని యెంచుకొనక, తగ్గించుకుని, వినయ మనస్కులమై ప్రార్థించవలెనన్న సత్యమును తెలియజేస్తూ.యేసు క్రీస్తు 'పరిసయ్యుడు - సుంకరి అను ఉపమానమును చెప్టైను. లూకా 18:9-14లో ఈలాగు వ్రాయబడినది. “తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని, యితరులను తృణీ కరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్ధన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులును, అన్మాయస్థులును, వ్యభిచారులునైన యితర మనుష్యుల వలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉ ండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండుమారులు ఉపవాసము చేయుచు, నా సంపాదన అంతటిలో పదియవవంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించు చుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక, రొమ్ము కొట్టు కొనుచు - దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటె యితడు నీతిమంతుడుగా తీర్జబడి, తన యింటికి వెళ్లైనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింప బడుననియు చెప్తెను.”
పై ఉపమానములో పరినయ్యుని ప్రార్థనకు, సుంకరి ప్రార్థనకు వ్యత్యాసమును గమనించినట్లయితే, పరిసయ్యునిది స్వనీతితో కూడిన ప్రార్థన యనియు, సుంకరిది తగ్గింపుతో, దేవుని నీతితో కూడిన ప్రార్ధన యనియు తెలిసికొందుము. పరిసయ్యుని స్వనీతి వేషధారణతో కూడుకొన్నది. అట్టి వారు 'మా దాపునకు రావద్దు. ఎడముగా ఉండుము. నీకంటే మేము పరిశుద్ధులమని” చెప్పుదురు (యెషయా 65:5). తామే నీతిమంతుల మనుకొని, యితరులను తృణీకరింతురు (లూకా 18:9), వారు యితరుల తప్తిదములు వేలెత్తి చూపి, తమ తప్పిదములవైపు చూడరు (లూకా 18:11, మత్తయి 7:3-5). బయంటికి నీతిమంతులుగా కనిపించగోరుదురు (మత్తయి 6:2,5,16). వారు న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిన వారు (మత్తయి 23:23), లూకా 18:12లో చెప్తబడినట్లు పారంపర్యాచారములు కలిగి యుందురు (మత్తయి 15:1-9). వెలుపల మాయ వేషము కలిగి (లూకా 20:46-47), లోపల మారుమనసు అనుభవము లేని వారు (లూకా 11:39). యిటువంటి వారి ప్రార్థన దేవుని యెదుట అంగదీకరింవబడదని ఈ ఉవవమానవంుం ద్వారా తెలుసుకొంటున్నాము.
అయితే, నుంకరిని గమనించినట్లయితే, తాను దూరముగా నిలుచుండెను (లూకా 18:13). యిది తగ్గింపును సూచిస్తున్నది. లూకా 17:11-13 వచనములలో పదిమంది కుష్టురోగులు దూరముగా నిలచి, యేసుప్రభువా, మమ్ముకరుణించుమని కేకలువేసిరి. బాప్తిస్మమిచ్చు యోహాను, “ఆయన హెచ్చవలసియునశ్హది. నేను తగ్గవలసియున్హదని” యేసుక్రీస్తు యెదుట తగ్గించుకొనెను (యోహాను 3:30). లూకా 18:13లో సుంకరికి ఆకాశమువైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలలేదని చదువుచున్నాము. దావీదురాజు కీర్తన 40:12లో, 'లెక్క లేని అపాయములు నన్ను చుట్టు కొనియున్హవి. నా దోషములు నన్ను తరిమి, పట్టుకొనగా, నేను తల యెత్తి చూడలేకపోతిని” అని చెప్పెను. తన పాపములను బట్టి పశ్చాత్తాపము నొందిన సుంకరి, రొమ్ము కొట్టుకొనుచు, 'దేవా, పాపినైన నన్ను కరుణించుమని' ప్రార్ధించెను (లూకా 18:13). తమ పాపములను బట్టి ఒప్పింపబడిన వారిలో నిజమైన తగ్గింపు, వినయము కనబడునని గమనించుచున్నాము. దేవుడు అట్టి ప్రార్హనను అంగీకరించును. యెషయా దేవుని మహిమను చూసిన వాడై, తన్నుతాను తగ్గించు కొనెను (యెషయా 6:5).
ఆది కాండము 4:2-7లో కయీను, హేబెలు అర్హించిన అర్హణ పైన చెప్తబడిన ఉపమానమునకు సమాంతరముగా వున్నది. దుష్టుని సంబంధియైన కయీను చెడ్డ క్రియలు కలవాడై తెచ్చిన అర్హణను దేవుడు లక్ష్యపెట్టలేదు (1 యోహాను 3:12; ఆదికాండం 4:5). హేబెలు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలిని దేవునికి అర్హించెను (హెబ్రీ 11:4). తాను పాపినన్న భావముతో తగ్గించుకొని, పశ్చాత్తాపముతో పాపపరిహారము నిమిత్తము దేవునికి బలి అర్హించినందున దేవుడు అతని అర్దణను లక్ష్యపెట్టెను (ఆది కాండం 4:4).
(2) అవనరములో నున్న స్నేహితుడు (లూకా 11:5-13) :
విశ్వాసులు తమ ప్రార్థనలలో యెడతెగక యుండవలెనన్న సత్యమును తెలియజేయుటకు యేసు క్రీస్తు 'అవసరములో నున్న స్నేహితుడు” అను ఉ పమానమును చెప్టైను. కొన్షి విషయములను గూర్చ్తి మనము ప్రార్ధించవలెనని తలం చినపుడు, కొంతకాలము ప్రార్ధించి, తరువాత దేవుడు ఆ మనవులకు జవాబు యివ్వడేమో అని ప్రార్ధించుట మానివేస్తాం. అయితే దేవుడు మనము విసుగక, యెడతెగక ప్రార్థించవలెనని కోరుకుంటున్నట్లు యీ ఉపమానము చివర యివ్వబడిన వచనములద్వారా మనము తెలిసికొందుము.
లూకా 11:5-13లో యీలాగు వ్రాయబడినది. “మరియు ఆయన వారితో యిట్లనెను - మీలో యెవనికైన ఒక స్పేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆస్పేహితునియొద్దకు వెళ్లి, స్నేహితుడా, నాకుమూడు రొట్టెలు బదులిమ్ము, నా
స్ గా అ
స్నేహితుడు ప్రయాణము చేయుచు, మార్గములో నా యొద్దకు వచ్చియున్హాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద యేమియు లేదని అతనితో చెప్పిన యెడల, అతడు లోపలనేయుండి, నన్ను తొందరపెట్టవద్దు. తలుపు వేసియుశ్హది. నా చిన్హపిల్లలు నాతోకూడ పండుకొనియున్హారు. నేను లేచి యియ్యాలేనని చెప్పనా ? అతడు తన స్నేహితుడైనందున లేచియియ్యక పోయినను, అతడు సిగ్గుమాలి, మాటిమాటికి అడుగుటవలన నైనను లేచి అతనికి కావలసిన వన్నియు యిచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలెమీరును అడుగుడి, మీ కియ్యబడును. వెదకుడి, మీకు దొరకును. తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికియ్యబడును. వెదకు వానికి దొరకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్ప చున్నాను. మీలో తండ్రియైన వాడు తన కుమారుడు చేపనడిరితే చేపకు ప్రతిగా పామునిచ్చునా ? గుడ్డునడిగితే తేలునిచ్చునా ? కాబట్టి, మీరు చెడ్డ వారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చమముగా అను గ్రహించుననెను.”
పై ఉపమానమును పరిశిలించినట్లయితే, యీ క్రింది సంగతులు మనకు తెలియుచున్చది.
(1) పై ఉపమానములో చెప్తబడిన స్పేహితుడు తన కొరకు కాకుండా, తన యొద్దకు వచ్చి, అవసరములో వున్న మనుష్ముని కొరకు తన స్వేహితుని యొద్ద విన్త్హవించుకుంటున్నాడు(లూకా 1 1:6). 'పరిసయ్య్ముడు - సుంకరి: ఉపమానములో తగ్గింపు గలిగి ప్రార్ధ్థించాలని చూచితిమి. యీ ఉపమానములో “యితరుల కొరకు” ప్రార్ధించవలెనని చూచుచున్నాము. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్ధించెను (యోబు 42:10). దానియేలు ఇశ్రాయేలీయుల పక్షమున ప్రార్థించెను (దానియేలు 9:4-19). ధవైవజను లెందరో తమ అవసరములకన్న యితరుల అవసరములకు ప్రాధాన్యత నిచ్చిరి.
(1) యీ స్నేహితుడు అర్థరాత్రి వేళ తన స్నేహితుని యొద్దకు వెళ్లెను (లూకా 11:5). మన విజ్ఞాపనలను దేవుని సన్నిధికి యే సమయములోనైనా తీసుకు వెళ్లవచ్చును. మనము కనికరింపబడి, సమయోచితమైన సహాయము కొరకు కృపపొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము (హెబ్రీ 4:16).
(111) యీ స్పేహితుడు తన స్తేహితుని యొద్ద మాటిమాటికి విన్తవించుకొనుట ద్వారా అతని గెలిచెనని చూచుచున్నాము (లూకా 11:8). దీనిని బట్టి మన ప్రార్థనలు యెడతెగక దేవుని సన్నిధికి తీసుకుని రావలెనని గమనిస్తున్నాము. 'వినుగకుండా, యెడతెగక ప్రార్ధించుటి యనునది మన విశ్వానములో బలపడుకొలథి వచ్చే అనుభవము. కనుకనే యేసుక్రీస్తు లూకా 11:9,10 వచనములలో “అడుగుట, “వెదకుట, 'తట్టుటి గురించి చెప్తెను. యేదైనా విషయమును దేవునితో “అడుగుదుము'. ఆ విషయమును గురించి అధికముగా తెలుసుకున్నపుడు దానిని 'వెదకుదుము'. దానిని పొందే స్థితిలోనికి వచ్చినపుడు 'తట్టుదుము'. విశ్వాసి యీ మూడుమెట్లు యెక్కువరకూ తన ప్రార్థనా జీవితములో “యెడతెగక”ి యుండవలెను. అపొస్తలుడైన పౌలును, యితరులను ప్రార్థన యందు యెడతెగక యుండుటను యీ క్రింది వచనముల ద్వారా చూడవచ్చును.
ఎపెసీ 6:18-సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా వుండుడి. కొలొస్హయులకు 1:3- యెల్లపుడు మీనిమిత్తము ప్రార్థన చేయుచు,
మన ప్రభువువగు యేసుక్రీస్తు యొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్చించుచున్నాము.
కొలొన్హయులకు 4:12- ఎపఫ్రా యెల్లప్పడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్హాడు.
అపా.ఠా.12:5- పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతని కొరకు అత్మాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను
రోమా 1:9- నా ప్రార్థనల యందు ఎల్లవ్వడం ఆయనను బతిమాలుకొనుచు, మిమ్మును గూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను.
1 థెస్టలోనీకయులకు 1:3- మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు, మీఅందరి నిమిత్తము ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
1 థెనస్సలోనీకయులకు 2:13 మేమును మానక దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము.
2 తిమోతి 1:3 నా ప్రార్ధనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నాను.
1 థెస్టలొనీయులకు 5:15 - యెడ తెగక ప్రార్ధన చేయుడి.
ప్రియులారా, నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమ యందు పీరు గల వారమై, యీ ఉపమానములో చూచినట్లు ప్రార్థన యందు పట్టుదల కలిగి యుందుముగాక (రోమా 12:12).
(3) గోజాడుచున్న విధవరాలు (లూకా 18:1-8)
'పరిసయ్యుడు - సుంకరి అను ఉపమానములో మన స్వనీతిని వదలి, తగ్గింపుతో దేవుని ప్రార్ధించవలెననియు, “అవసరములో వున్న స్పేహితుడు” అను ఉపమానములో యితరుల కొరకు” పట్టుదలతో యెడతెగక ప్రార్ధించవలెననియు చూచితిమి. 'గోజాడుచున్న విధవరాలు” అను యీ ఉపమానములో మన “సొంత అవసరముల కొరకు” ప్రార్ధించునపుడు మన “నిస్హహాయ స్థితి”ని గుర్తించి, విసుకక, నిత్సమూ ప్రార్ధించవలెనను సత్యమును తెలిసి కొందుము. “అవసరములో వున్న స్నేహితుడు" ఉపమానములో మాదిరి యీ ఉపమానములో కూడా ఎల్లప్పుడును ప్రార్థించవలెనను సత్యము చెప్పబడుచున్నది.
లూకా 18:1-8లో యీలాగు వ్రాయబడినది. “వారు విసుకక నిత్యము ప్రార్ధన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు, మనుష్యులను లక్ష్యపెట్టకయునుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో వుండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగా వచ్చి, నాప్రతివాదికిని, నాకును న్యాయము తీర్చుమని అడుగుచువచ్చెను గాని, అతడు కొంతకాలము ఒప్పక పోయెను. తరువాత అతడు-నేను దేవునికి భయపడకయు, మనుష్యులను లక్ష్మపెట్టకయు వుండినను, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి, గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను. మరియు ప్రభువిట్లనెను. అన్మాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను యేర్చరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొజపెట్టు కొనుచుండగా వారికి న్మాయము తీర్చడా ? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన వీర్ధశాంతము చూపుచున్హాడనిమీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చు నప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా ?”
పై ఉపమానములో చెప్తబడిన విధవరాలు ఒక నిస్తహాయ స్థితి ని సూచిస్తున్నది. నిస్సపోయ స్థితి అనగా తనకు తాను సహాయము చేసుకొనలేని స్థితి. మరియు వేరొకరు తనకు సహాయము చేయలేని స్థితి. దేవుని సన్నిధికి వెళ్లి, ప్రార్థించునపుడు మన నిస్సహాయ స్థితిని అంగీకరిస్తూ, ప్రార్ధించవలెను. యితర మార్గములు లేక వ్యక్తుల ద్వారా సహాయము వస్తుందన్న భావముతో ప్రార్థించిన యెడల అసలు ప్రార్ధించడము దేనికి ? దావీదురాజు కీర్తన 34:6లో “ఈ దీనుడు మొత్జపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించెను” అని సాక్ష్యమిచ్చెైను.
నిస్తహాయురాలైన విధవరాలు దేవుని కనికరము పొందును. పరదేశికే గాని, తండ్రి లేని వానికేగాని న్యాయముతఫప్తి, తీర్చు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు (ద్వితీయోపదేశకాండము 24:17). పరదేశులకు, తండ్రిలేనివారికి, విధవరాండ్రకు పాలములో వెనుకనున్న పరిగెను వదలివేయవలెను (ద్వితీయోపదేశ కాండము 24:19-21). తండ్రిలేని వారిని, విధవరాండ్రను బాధించకూడదు. వారికి న్యాయము తీర్చవలెను (నిర్గమకాండం 22:22-24; యెషయా 1:17). విధవరాండ్రను సన్మానింపవలెను (1తిమోతి 5:3), వారి యిబ్బందిలో వారిని పరామర్శించవలెను (యాకోబు 1:27). యీ వచనములగ్నిటి ద్వారా విధవరాండ్ల పట్ల దేవుని ప్రేమ వ్యక్తమవుచున్నది.
విధవరాలు తనయెద్దకు తరచుగా వచ్చి, న్యాయము తీర్చుమని అడుగుచున్నందున అన్మాయస్థుడైన ఆ న్యాయాధిపతి ఆమె మాటిమాటికి వచ్చి, గోజాడకుండునట్లు ఆమెకు న్మాయము తీర్తునని, తనలో తాననుకొనెను (లూకా 18:5). అదే విధానములో, విశ్వాసులు దేవుని సన్నిధిలో దివారాత్రములు చేయు ప్రార్ధనలనుబట్టి మరి త్వరగా దేవుని చేత ఆలకించబడి, న్యాయము తీర్జబడుదురన్న సత్యమును ఈ ఉపమానము ద్వారా గ్రహించు చున్నాము. విశ్వాసులు పెట్టు మొత్తను బట్టి దేవుడు రక్షింపబడని వారి పట్ల దీర్ధశాంతము కలిగి, వారి రక్షణ నిమిత్తము వేచియున్హాడనియు ఈ ఉపమానము మనకు తెలుపు చున్తది (లూకా 18:8)
విధవరాలిని పోలిన ప్రార్ధనా జీవితము మనము కలిగియుండవలెను. ఆలాగు జీవించునట్లు దేవుడు మనకు సహాయము చేయునుగాక.
(1) సాక్యపు జీవితము
యేసుక్రీస్తు ప్రేమను రుచిచూచి, మారుమనస్సు అనుభవము లోనికివచ్చిన ప్రతి విశ్వాసి తన జీవితము ద్వారా ఆయనకు సాక్షిగా వుండవలె నన్నది దేవుని చిత్తమై యున్హది. యేసు క్రీస్తు పరలోకమునకు ఆరోహణమై వెళ్లటకు ముందు “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరుషలేములోను, యూదయ, సమరయ దేశముల యందం తటను, భూ దిగంతములవరకును నాకు సాక్షులైయుందురని” తన శిష్యులతో చెప్పెను (అపా.కా.1:8). అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేను పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి (అపా.కా.4:33). యేసుక్రీస్తు తన శిష్ములతో, “మీరు మొదట నుండి నా యొద్ద వున్నవారు గనుక మీరును సాక్షమిత్తురు” అని చెప్పెను (యోహాను 15:27).
యేసుక్రీస్తు చెప్పిన ఉపమానములను బట్టి క్రింద తెలుపబడిన మూడు విధములుగా మనము ఆయనకు సాక్షులుగా జీవించవలయును.
(1) మన వృక్తిగత నడవడిక యేసు క్రీస్తును పోలియుండుట ద్వారా (పాతతిత్తులలో క్రొత్తద్రాక్షారసము, పాతబట్టపై క్రొత్త గుడ్డ ఉపమానము)
(2) యితరుల పట్ల సత్రియలు కలిగి యుండుట ద్వారా (దీప స్తంభము మీది దీపమును గూర్పిన ఉపమానము)
(3) పరలోక రాజ్యసువార్తను యితరులకు తెలియ జెప్పుటద్వారా (శాస్త్రిని గూర్చిన ఉపమానము)
పై మూడు ఉపమానములకు వివరణ క్రిందనివ్వబడినది. (1) పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారనము, పాతబట్టపై క్రొత్త గుడ్డ (మత్తయి 9:16-17; మార్కు 2:21-22; లూకా 5:36-38)
యేసుక్రీస్తు తన శిష్కుడుగు లేవి (మత్తయి) యింటిలో భోజనమునకు కూర్చున్నపుడు నుంకరులును యితరులు అనేకులును ఆయనతో కూడ భోజనమునకు కూర్చుండిరి. అది చూచి శాస్త్రులు, పరిసయ్యులు, యేసుక్రీస్తు శిష్యులపై, పాపులతో సహవాసము చేయుచున్హారని సణుగుకొనిరి. అంతేగాక యోహాను శిష్యులు తరచుగా ఉపవాసము చేయుచుండగా నీ శిష్యులేల తినిత్రాగుచున్హారని ఆయనను అడిగిరి (లూకా 5:27-33). యేసు క్రీస్తు వారి హృదయములను యెరిగియుండి, వారడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, యీ ఉపమానమును చెప్పెను. లూకా 5:36-38 వచనములలో యీలాగు
వ్రాయబడినది.
“ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసికవేయడు. అదియును గాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు. పోసినయెడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్హును. రసము కారిపోవును. తిత్తులును పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి, వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు, పాతదే మంచిదనునని చెప్తెను”.
పై ఉపమానములో క్రొత్తగుడ్డ, క్రొత్త ద్రాక్షారసము అనునవి ప్రభువైన
మం యేసుక్రీస్తు నందలి రక్షణను సూచిస్తున్నవి. పాతబట్ట పాతతిత్తులు అనునవి మోషే ధర్మశాస్త్ర ఆచార సాంప్రదాయములను సూచిస్తున్నవి. పాతనిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పాపమనగా యెట్టిదో, దేవుని నీతియనగా యెట్టిదో తెలియబరుచుటకు మోషే ద్వారా ధర్మశాస్త్రమును అనుగ్రహించెను (రోమా 3:20; రోమా 7:12-24). సున్హతిపొందుట (అపా.కా. 15:11), చేతులు కడుగు కొనుట (మార్కు 7:5), ఉపవాసముండుట (లూకా 5:33) వెొఎొదలగునవి ధర్మ శాస్త్రమందలి ఆచారములు. యీ ధర్మశాస్త్రము ద్వారా మనుష్మాలెవరునూ నీతిమంతులుగా తీర్చబడలేరనియు (గలతి 2:16, 3:11; అపా.కా. 13:39, రోమా 3:28), ధర్మశాస్త్రము క్రీస్తువైపునడిపించుటకు బాల శిక్షకుడాయెననియు (గలతి 3:24,25) దేవుని వాక్యము సెలవిస్తున్హది. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచుశన్హది. అది యేసు క్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారికందరికీ కలుగు దేవుని నీతియై యుశ్వది (రోమా 3:21,22).
అయితే, యేసుక్రీస్తునందలి రక్షణ ప్రత్యక్షమైన తరువాత కూడా ఆనాటి శాస్త్రులు, పరిసయ్ములు ధర్మశాస్త్ర ఆచారములను (పాత తిత్తులను, పాత బట్టలను) యితరులపై రుద్దుటకు ప్రయత్నించు చుండిరి. మోయ శక్కముగాని భారమైన బరువులు కట్టి, మనుష్ముల భుజముల మీద వారు పెట్టుదురేగాని, తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు (మత్తయి 23:4). వారు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్మాచారమును గైకొను చున్హ్నారు (మార్కు 7:8,9; మత్తయి 12:1-2, 9-12, 15:1-9). వారి నీతి వేషధారణతోను, కపటము తోను నిండుకొనియుశ్తది (మత్తయి 23:5-36). అందుకే యేసుక్రీస్తు “శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కాని యెడల, మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరని” చెప్పెను (మత్తయి 5:20). తమ ఆచారములను హత్తు కొని యుండుట వలన క్రీస్తు రక్షణను స్వీకరించ లేరని తెలుపుటకు యేసుక్రీస్తు పై ఉపమానమును చెప్పెను. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే, లోకములో బదుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను, పద్దతులను అనుసరించి - చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేల ? అవన్నియు వాడం కొనుట చేత నశించి పోవును. అట్టివి స్వేచ్చారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని యెంచబడు చున్హవే గాని, శరీరేచ్చా నిగ్రహ విషయములో (పాపము చేయకుండుటలో) ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు (కొలొస్హయులకు 2:20-23).
క్రొత్తద్రాక్షారసము పాత తిత్తులలో యిమడదు. క్రొత్త గుడ్డ పాతబట్టపై వేయబడదు. అదే రీతిలో, ఆచార సాంప్రదాయములకు కట్టు బడియుండగోరితే, యేసుక్రీస్తును వెంబడించలేమని యీ ఉపమానము ద్వారా తెలుసుకుంటున్నాము. క్రొత్త ద్రాక్షారసము నూతనమైన సంతోషమును కలుగ జేయును (యోహాను 2:1-11). అలాగే, విశ్వాసమూలమున కలుగు యేసుక్రీస్తు రక్షణ మనుష్యులకు నూతనత్వము కలుగ జేసి, ఆచార సాంప్రదాయములను నిరర్థకము చేయును. యిటు వంటి రక్షణను ధరించినపుడు యేసు క్రీస్తునకు సాక్షులుగా వుందుము. 'మనము ధర్మశాస్త్రమునుండి విడుదల పాొందితిమి గనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము” (రోమా 7:6).
(2) దీవ స్తంభము మీది దీవము (మత్తయి 5:14-16, మార్కు 4:21-22, లూకా 8:16-17, 11:33-36)
'పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము, పాతబట్టపై క్రొత్త గుడ్డ' అను ఉ పమానములో మన సొంత జీవితములు నూతన పరచబడుట ద్వారా యేసుక్రీస్తుకు సాక్షులైయుందుమని చూచితిమి. 'దీప స్తంభము మీది దీపము” అను యీ ఉ పమానములో “యితరుల” పట్ల సత్రియలు కలిగి యుండుట ద్వారా యేసు క్రీస్తుకు సాక్షులైయముండవలెనన్న సత్యమును చూచెదము. మత్తయి 5:14-16 వచనములలో యీలాగు వ్రాయబడియున్నది. “మీరు లోకమునకు వెలుగై యున్హారు. కొండమీదనుండు పట్టణము మరుగై యుండ నేరదు. మనుష్యులు దీపము వెలిగించి, కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్రియలను చూచి, పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి యెదుట మీవెలుగు ప్రకాశింప నియ్య్ముడి”.
దేవుడు లోకమునకు వెలుగైయున్హాడు. “నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపువెలుగు కలిగయుండునని” యేసు క్రీస్తు చెప్టైను (యోహాను 8:12). ఆయన మరుగు మాటలను, మర్మములను బయలు పరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దవున్నది (దానియేలు 2:22). 'అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె వుండును అని నేనను కొనిన యెడల చీకటియైనను నీకు చీకటికాక పోవును. రాత్రి పగటివలె నీకు వెలుగుగా వుండును. చీకటియు, వెలుగును నీకు యేకరీతిగా వున్తవి' (కీర్తన 139:11-12).
యిటువంటి దేవుని వెలుగు లోకములోనికి వచ్చెను గాని, తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యాలు వెలుగును ప్రేమింపక, చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుపష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగు నొద్దకు రాడు (యోహాను 3:19,20) యేసు క్రీస్తు వెలుగుగా లోకములో వుండెను. లోక మాయన మూలముగా కలిగెను గానీ లోకమాయంనను తెలినికొనలేదం. తన న్వకీయులే ఆయననం అంగీకరింపలేదం (యోహాను 1:9-11). 2 కొరింథి 4:4లో “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెనని” చదువు చున్నాము. తద్వారా అవిశ్వాసులు అంధకారములో యున్హారని దేవుని వాక్కము సెలవిచ్చుచున్హది.
అయితే, యేసు క్రీస్తు తన వెలుగును తన యందు విశ్వాసముంచి, తనను వెంబడించు వారికందరికీ కలుగ జేసెను గనుక, విశ్వాసులు యీ ఉ పమానములో చెప్పబడినట్లు దీపములను సూచిస్తున్నారు. దీపము దీపస్తంభము మీద పెట్టబడి, గదియంతటికీ వెలుగు నిచ్చులాగున విశ్వాసులు తమ సత్రియల ద్వారా అంధకారమయంమైన యీ లోకమునకు వెలుగు నియ్యవలయును (మత్తయి 5:16) “మీరు పూర్వమందు చీకటియై యుంటిరి. యిప్పడైతే ప్రభువునందు వెలుగై యున్హారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచి తనము, నీతి, నత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువు కేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి. నిప్తలమైన అంధకార క్రియలలో పాలివారై యుండక, వాటిని ఖండించుడి” (ఎఫెసీ 5:8-12). యింకను యాకోబు 3:13లో, “మీలో జ్ఞాన వివేకములు గల వాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తన
వలన తన క్రియలను కనుపరచవలెనని” చదువు చున్నాము. మన క్రియలు మన మాటల కంటే గట్టిగా మాటలాడునని చెప్తబడినట్లు
అవిశ్వాసులను యేసుక్రీస్తు వెలుగు నొద్దకు తీసుకు వచ్చుటకు మన సత్రియలతో వారి యెదుట సాత్లులుగా వుండవలయును. 'వాటియందం మనము నడచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్రియలు చేయుటకై, మనము క్రీస్తు యేనంనందు నృష్టింపబడిన వారమై, ఆయన చేసిన పనిరయైయున్హాము (ఎఫెసి 2:10). మూర్ధమైన వక్రజనము మధ్య నిరపరాధులును, నిష్కళంకులును, అనింద్య్ములునైన దేవుని కుమారులగునట్లు జీవ వాక్కమును చేతపట్టుకొని, లోకమందు జ్యోతులలె కనబడుటకు దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక (ఫిలిప్తి 2:15).
(3) శాస్త్రి (మత్తయి 13:51-52)
'“బీప స్తంభము మీది దీపము” అను ఉపమానములో విశ్వాసులు తమ నత్రియల ద్వారా యీ లోకములో యితరులకు సాక్షులైయుండవలెనని చూచితిమి. '“శాస్త్ర' అను యీ ఉపమానములో యేసుక్రీస్తు 'రక్షణ సువార్తను యితరులకు ప్రకటించుట ద్వారా యిలోకములో సాక్షులముగా వుండగలమని చూతుము. మత్తయి 13:51-52 వచనములలో యీలాగు వ్రాయబడినది. “వీటిన్షిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చుయుంటియజమానుని పోలియున్హాడని వారితో చెప్తెను.”
"శాస్త్ర' అనగా ధర్మశాస్త్రమును యెరిగియుండి, దానిని యితరులకు బోధించువాడు. దేవుని వాక్యములో “ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యోహోవా అనుగ్రహించిన మోషేయొక్క ధర్మ శాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రి'యని ఎజ్రా 7:6లో చదువుచున్నాము. పై ఉపమానములో దేవుని రాజ్యసంగతులు తెలిసి,దేవుని రాజ్యవారసులుగా వున్న వారందరూ “శాస్త్రులు” గా చెప్తబడుచున్హారు. యీ ఉ పమాన వాక్య భాగమును పరిశీలించినట్లయితే, యీ క్రింది సంగతులను గ్రహింపవచ్చును.
(1) దేవుని రాజ్యమును గూర్చిన జ్ఞానము ఒక ధననిధి (మత్తయి 13:52) :
'దేవుని రాజ్యము యొక్క విలువి అను అధ్యాయములో 'దాచబడిన ధనము” అనుఉపమానములో చెప్తబడిన రీతిగా పరలోక రాజ్యము ఒక పాలములో దాచబడిన ధనమును పోలియున్హది (మత్తయి 13:44). యెహోవా న్య్వాయవిధులు సత్కమైనవి. అవి కేవలము న్మాయమైనవి. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును (కీర్తన 19:9-11). వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుకంటె జ్ఞాన లాభమునొందుట మేలు. పగడముల కంటె అది ప్రియమైనది (సామెతలు 33:14-15). బుద్ధిజ్ఞానముల సర్వసంపదలు యేసుక్రీస్తు నందే గుప్తములైయుశ్హవి (కొలోస్టయులకు 2:3).
(1) శాస్త్రి తన ధననిధిలో నుండి క్రొత్త పదార్ధములను వెలుపలికి తెచ్చును. (మత్తయి 13:52):
పైన చెప్తబడినమాట దేవుని రాజ్యవారసులు (విశ్వాసులు) యేసు క్రీస్తు రక్షణ సువార్తను యితరులకు ప్రకటింతురన్హ సత్యమును సూచిస్తున్నది. క్రొత్త పదార్థమనగా కృప చేత విశ్వాసమూలమున నీతి మంతులముగా తీర్చబడి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుండుట (రోమా 5:1). యీ రక్షణ సువార్తను యేసు క్రీస్తు యాదుల సమాజమందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించెను (మత్తయి 4:23). అపొస్తలులు బహుబలముగాయీ రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించిరి (అపా.కా.4:33) అపొన్హలండైన పౌలు, “నంవార్త ప్రకటింవవలనిన భారమునా వీంద మోపబడియునశ్హది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయిన యెడల నాకు శ్రమ” అని చెప్పెను (1 కొరింథి 9:16). క్రీస్తు ఐశ్వర్యమును అన్మజనులలో ప్రకటించుటకు తనకు కృప అనుగ్రహింపబడెనని పౌలు ఎఫెసి. 3:11లో చెప్పెను.
(11) శాస్త్రి తన ధననిధిలోనుండి పాత పదార్ధములను వెలుపలికి తెచ్చును. (మత్తయి 13:52:
పాతపదార్థము దేవుడు ఇశ్రాయేలీయుల కనుగ్రహించిన మోషే ధర్మశాస్త్రమును సూచిస్తున్నది. ధర్మ శాస్త్రములో చెప్పబడిన బలులు క్రీస్తునందున్న రక్షణను సూచిస్తున్హవి. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా వచ్చి, తానే నిత్మమైన విమోచన సంపాదించి, మేకల యొక్కయు, కోడెలయొక్కయూు, రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్క సారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. నిత్యుడగు ఆత్మద్వారా తన్హుతాను దేవునికి నిర్దోషినిగా అర్హించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, నిల్దీవ క్రియలను విడిచి, జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని యెంతో యెక్కువగా శుద్ధిచేయును (హెబ్రీ 9:11,12,14). ప్రియులారా, యేసుక్రీస్తు రక్షణ సువార్తను యితరులకు ప్రకటించుచున్హామా ?
(£) త్యాగము - క్రమ శిక్షణ : దేవుని రాజ్య వాసులు క్రీస్తును వెంబడించుటలో త్యాగమును మరియు క్రమశిక్షణను కనుపరచుదురని తెలుపుటకు యేసుక్రీస్తు యీ క్రింద చెప్తబడిన ఉపమానమును తెలిపెను. క్రీస్తును వెంబడించుటకు విశ్వాసులు చెల్లించు మూల్చము యీ ఉపమానములో మనకు తెలుపబడినది
(1) గోవురము కట్టువాడు - యుద్ధము చేయువాడు (లూకా 14:25-35) :
లూకా 14:25-33 వచనములలో యీలాగు వ్రాయబడినది. 'బహుజన సమూహములు ఆయనతో కూడ వెళ్లుచున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి ఎవడైనను నాయొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్తదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని, నన్ను వెంబడింపనియెడల వాడు నాశిష్యుడు కానేరడు. మీలో యెవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దానిని కొన సాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా ? చూచుకొనని యెడల అతడు దాని పునావివేసి, ఒకవేళ దాని కొనసాగింపలేక పోయినందున, చూచువారందరూ ఈ మనుష్యుడు కట్టమొదలుపెట్టెను గాని కొన సారింపలేక పోయెనని అతని చూచి, యెగతాళి చేయ సాగుదురు. మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదకి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి, మొదట ఆలోచింపడా?శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి, సమాధానము చేసికొన చూచును గదా! ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు'.
ఫై ఉపమానములో రెండు దృష్టాంతములను గమనించు చున్నాము. మొదటిది గోపురము కట్టుట, రెండవది యుద్ధము చేయుట. గోపురము కట్టుటకును, యుద్ధము చేయుటకును ప్రణాళిక, త్యాగము, క్రమ శిక్షణ అవసరము. యివి లేని యెడల గోపురము కట్టుట మధ్యలో నిలిచిపోవును. యుద్ధములో ఓడిపోవుట సంభవించును. గోపురము కట్టుట మధ్యలో నిలిచిపోతే, అది యితరుల ఎగతాళికి కారణమగును (లూకా 15:30). తద్వారా దేవుని నామమునకు అవమానము కలుగును. కనుకనే, 'మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన జనుల మధ్యను దూషింపబడుచుశన్హది?” అని చదువు చున్నాము (రోమా 2:24). యుద్ధము నుండి వెనుకకు పారిపోతే, విశ్వాసములో తప్తిపోయిన వారమై, ఓడిపోదుము. అప్పుడు కుక్కతన వాంతికి తిరిగినట్టును, పంది బురదలో దొర్లు టకు మళ్లినట్టును వుండునని దేవుని వాక్యము సెలవిస్తున్నది (2 పేతురు 2:20-22).
పై రెండు దృష్టాంతములు క్రైస్తవ జీవితములో క్రీస్తును యెలా వెంబడించాలి అన్న సత్యమును తెలియజేయుచునశ్హవి. క్రీస్తును వెంబడించుటలో జయ జీవితము కలిగి యుండుటకు, పైన చెప్పబడినట్లు క్రమశిక్షణ, త్యాగము అవసరము.
(1) క్రమశిక్షణ : క్రీస్తును వెంబడించుట అనునది ఒక పందెపురంగముతో పోల్చబడినది. పందెపురంగమందు పరుగెత్తువారందరూ బహుమానము పొందునట్లుగా పరిగెత్తవలెననియు, దాని కొరకు శరీరమును నలగగొట్టి, దానిని లోబరచుకొనవలెననియు దేవుని వాక్యములో వ్రాయబడినది (1 కొరింథి 9:24,27). విశ్వాసులు అనుదిన ప్రార్థన, వాక్కధ్యానము, సంఘసహవాసము, పరిచర్య అను విషయములలో క్రమశిక్షణ కలిగియుందురని మనము గమనించుదుము.
(11) త్యాగము =: క్రీస్తును వెంబడించుటకు విశ్వాసులు చేయు త్యాగము యీ క్రింద చెప్తబడిన సంగతులద్వారా బయలుపడును.
వారు క్రీస్తును తమ జీవితములలో ప్రథమ స్థానములో కలిగి యుందురు. రక్త సంబంధీకులు, అయినవారి కన్న క్రీస్తును యెక్కువగా ప్రేమించుదురు (లూకా 14:25-26; మత్తయి 10:37, 19:29). తమ సమయము, ధనము క్రీస్తు కొరకు వెచ్చింతురు.
తమ్మును తాము ఉపేక్షించుకొని, సిలువనెత్తుకొని, అనుదినము క్రీస్తును వెంబడింతురు (మత్తయి 16:24-26, మార్కు 8:34-38; లూకా 9:23-26). ఉ పేక్షించుకొనుట అనగా ఉన్నవి లేనట్టుగా, నష్టముగా యెంచుకొనుట. ఉపేక్షించు కొనుటలో తగ్గింపు యిమిడి వున్హది. సాధారణముగా మనిషిలో “అహం” అనునది పనిచేయును. తన కున్న ఆస్తిపాస్తులను బట్టి, విద్య ఉద్యోగమును బట్టి, సామాజిక అంతస్తును బట్టి గర్వించి, యెదుటి మనిషిని లెక్క చేయని రీతిలో మాటలాడును, ప్రవర్తించును. అయితే, క్రీస్తు ప్రేమను రుచి చూచిన విశ్వాసులు అలాగు చేయక, యుిహమందు తమకు కలిగినవన్నీ నష్ప్వముగా యెంచుకొని, క్రీన్తును వెంబడించుదురు. అపొస్తలుడైన పౌలు యెంతో విద్మావంతుడును, సామాజిక జౌన్హత్యము కలిగిన వాడైనప్పటికీ, దానిని బట్టి అతిశయించక, క్రీస్తు శ్రమలలో పొలివాడగుట యెట్టిదో యెరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని, వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనెను (ఫిలిప్తి 3:11). నిష్టయోజకులైన దాసులు, కడపటిచోటు అను ఉపమానములలో చెప్తబడినట్లుగా దేవుని యెదుటను, మనుష్ముల యెదుటను విశ్వాసులు తగ్గింపును కనపరచ వలయును.
వారు క్రీస్తు నిమిత్తము కలుగు శ్రమలలో సహనము వహింతురు (అపా.కొ.14:22; 1 థెస్సలొనీకయులకు 3:3; 2 తిమోతి 3:12). అపాస్తులుడైన పౌలు క్రీస్తు నిమిత్తము పొందిన శ్రమలు 2 కొరింథి 11:23-27 వచనములలో వ్రాయబడినవి. మోషే పెద్దవాడైనపుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తు విషయమైన నింద గొప్పభాగ్యమని యెంచుకొని, అల్హకాలము పాపభోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరోకుమార్తె యొక్క కుమారుడనిపించుకొనుటకు బఒప్పుకొనలేదు. ఏలయనగా అతడం ప్రతి ఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను (హెబ్రీ1 11:24-26).
యీరీతిగా మనకు కలిగిన వాటిని నష్పముగా యెంచుకొని, అనుదినము ఉపేక్షించుకొని, సిలువనెత్తి కొని ముందుకు సాగుతూ, క్రీస్తు కొరకు శ్రమలనుభవించుటద్వారా మన త్వాగమును కనుపరచి, విశ్వాసయాత్రలో జయ జీవితము కలిరి యుందుము. 'గోధుమ రింజ భూమిలోపడి, చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును. అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును (యోహాను 12:24). మన విశ్వాస యాత్రలో జయ జీవితము కలిరియుందుము గాక !
