Part 14 of 14

10. దేవుని రాజ్యమును తృణీకరించు వారికి తీర్పు

10. దేవుని రాజ్యమును తృణీకరించు వారికి తీర్పు

ప్రియులారా, అయిదవ అధ్యాయములో దేవుని రాజ్యము కొరకైన యేసుక్రీస్తు పిలుపును త్యణీకరించు వారిని గురించి నాలుగు ఉపమానముల ద్వారా తెలిసి కొంటిమి. చివరిదైన యీ అధ్యాయములో యేసుక్రీస్తు పిలుపును తృణీకరించి, దేవుని రాజ్యమును, యేసుక్రీస్తు పరిపాలనను ధిక్కరించిన యెడల కలుగు శిక్షను గురించి దేవుని వాక్యములో చెప్త బడిన నాలుగు ఉపమానములను గూర్చి తెలిసికొందము.

యేసుక్రీస్తును గురించి యోహాను 1:11లో, 'ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు” అని చదవుచున్నాము. ఇశ్రాయేలీయులు యెహావాను విసర్దించి, ఆయనను విడిచి, తొలగిపోయి, నిత్యము తిరుగుబాటు చేసిరి (యెషయా 1:45). 'దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్మకార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడును లేడని” కీర్తన 14:1లో వ్రాయబడియునశ్హది. రోమా1:21-23 వచనములలో “వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వృర్థులైరి. వారి అవివేక హృదయము అంధకార మయమాయెను. తాను జ్ఞానులమని చెప్పుకొనుచు, బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్ముల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్టాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్పిరని” చదివెదము. ప్రతి అక్రమమును, అవిధేయత యు న్హాయమైన ప్రతిఫలము పొందును (హెబ్రీ 2:2). యిదిగో త్వరగా వచ్చు చున్నాను. వానివాని క్రియచాొప్పన ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద వున్నది (ప్రకటన 22:12). దేవుని తీర్పును తెలియ జేయుటకు యేసుక్రీస్తు చెప్తిన నాలుగు ఉపమానములు యీ క్రింద తెలుపబడినవి.

(2) ఫలింవని అంజారపు చెట్టు (లూకా 13:6-9)

యేసుక్రీస్తు దినములలో, పిలాతం చేత చంపబడిన కొందరు గలిలయుల విషయము మరియు సిలోయములోని గోపురముపడి, చచ్చిన పదునెనిమిది మంది విషయము తన దృష్టికి తీసుకురాబడినపుడు, ఆయన, ఆరీతిగా చనిపోయిన వారు బ్రతికియున్న మిగిలినవారికంటె యెక్కువ పాపమేమియు చేయలేదని చెప్పెను. మరియు వారు మారుమనసు పొందని యెడల చని పోయిన వారివలె వారుకూడా నశించుదురని యూదులతో చెబుతూ, 'ఫలింపని అంజూరపుచెట్టు" ఉపమానమును చెప్పెను (లూకా 13:1-5).

లూకా 13:6-9 వచనములలో యీలాగు వ్రాయబడినది :

'మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్తెను - ఒక మనుష్యుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టొకటి నాటబడియుండెను. అతడు దానిపండ్లు వెదకవచ్చినపుడు ఏమియు దొరకలేదు. గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను యీ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చు చున్హానుగానీ, యేమియు దొరకలేదు, దీనిని నరికివేయుము. దీనివలన యీ భూమియు ఏల వృర్థమై పోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను. అయితే వాడు - అయ్యా, నేను దాని చుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరముకూడా ఉండనిమ్ము, అదిఫలించిన సరి. లేనియెడల నరికించి వేయుమని అతనితో చెప్పెను.

పై వాక్య భాగములో యేసుక్రీస్తు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి, వారిని అంజూరపు చెట్టుతో పోల్చి చెప్పినప్పటికీ, యీసత్యము అందరికీ వర్తిస్తున్నది. యీ వాక్కభాగములో క్రింద చెప్తబడిన విషయములను గమనించుదుము.

(1) ఒక మనువ్యాడం అంజారవు చెట్టును ద్రాక్మతోటలో నాటెననుమాట దేవుడు ఇశ్రాయేలీయులను శ్రేష్టమైన దేశములో వుంచి, వారు దేవుని కట్టడలను అనుసరించునట్లుగా ధర్మ శాస్త్రమును, ప్రవక్తలను వారి మధ్యనుంచెనను సత్యమును సూచిస్తున్నది. 'దుష్టులైన ద్రాక్షతోట కాపులు” ఉ పమానములో యీ సత్మమును గూర్చి తెలిసికొంటిమి. యెషయా 5:1-2లో, 'నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి. అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నాప్రియునికొక ద్రాక్షతోట యుండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి, రాళ్ళను ఏరి, అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగెలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించు ద్రాక్ష తొట్టిని తొలిపించెను.” అని చదువు చున్నాము.

(2) అంజారవు చెట్టును నాటిన మనుష్మ్యాడు దాని వండ్య్లు వెదకవచ్చినవుడు యేమియు దొరక లేదు (లూకా 13:6) : దేవుడు మనికిచ్చిన ఆయు రారోగ్యములు, ఐశ్వర్శము, జ్ఞానమును బట్టి దేవుని మరచిపోక, ఆయన నెరిగి జీవించుట దేవుని ఉద్ధేశ్యమై యున్నది. అంజూరపు చెట్టు ఫలించకపోవడమనునది మానవుడు తన పాపమును బట్టి మారు మనస్సు పొందక పోవుటను సూచిస్తున్నది. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడని బాప్తిస్మమిచ్చు యోహాను ఇశ్రాయేలీయులకు చెప్తెను. అయితే, దేవుడు, వివేకము కలిగరితనను వెదకువారం కలరేవెర అని ఆకాశమునుండి నరులను పరిశీలించినపుడు, వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్హారని, మేలు చేయువారెవరును లేరని దేవుని వాక్యము సెలవిస్తున్నది. (కీర్తన 14:2,3). ఏ భేదమూ లేదు. అందరును పాపము చేసి, దేవుడను గ్రహించు మహిమను పొందలేక పోవు చున్హారు (రోమా 3:23).

(3) ఆ మనుష్యుడు అంజూరవు చెట్టు ఫలముకొరకు మూడు నంవత్సరములు యెదురు చూచెను (లూకా 13:7) :

పైన చెప్పబడిన మాట మానవుని పట్ల దేవునికున్న సహనమును గూర్చి తెలియజేయుచున్నది. మనప్రభువు యొక్క దీర్ధశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి (2 పేతురు 3:15). కొందరు ఆలస్కమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్కము చేయువాడు కాడుగాని యెవడును నశింపవలెనని యిచఛచ్చయింపక, అందరు మారుమనసు పొందవలెనని కోరుచు, మీయెడల దీర్ధశాంతము గలవాడై యున్హాడు (2 పేతురు 3:9). ఆయన, మనుష్మాలందరు రక్షణపాంది, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై యుండవలెనని యిచ్చయించు చున్హాడు (1 తిమోతి 2:4).

(4)ఆమనుమ్యుడు అంజారవు చెట్టును నరికి వేయమని నవుడు తోటమాలి ఆగుమని (బతిమాలెను (లూకా 13:7,8) :

తోట యాజమానుడు ఫలించని అంజూరపు చెట్టును నరికి వేయుమని తోటమాలితో చెప్పినపుడు ఆయన, అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినసరి, లేనియెడల నరికించి వేయుమని అతనితో చెప్పెను (లూకా 13:7-9). యీ వాక్కభాగములో 'తోటమాలి' ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు (1 తిమోతి 2:5). యేసు క్రీస్తు మృతులలోనుండి లేచి, దేవుని కుడిపార్శమున ఉ నృవాడై, మనకొరకు విజ్ఞాపనము చేయుచున్హాడు (రోమా 8:34). తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపసనము చేయుటకు నిరంతరము జీవించు చున్నాడు (హెబ్రీ 7:25). ఫలింపని అంజూరపు చెట్టును నరికి వేయించుటకు ముందు యింకొక్క సంవత్సరము ఆగుమని తోటమాలి తనయజ మానునితో చెప్తినట్లు, ప్రభువైన యేసుక్రీస్తు మానవుల కొరకు తండ్రియైన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్హాడు. పరిశుద్ధ గ్రంధములో మోషే, యెహోషువ, దాని యేలు, పౌలు మొదలగువారు యితరులకొరకు విజ్ఞాపన చేసిరని వ్రాయబడినది (నిర్గమ కాం. 32:11-13: యెహోషువ 7:6-9; దానియేలు 9:3-19, కొలొస్హయులకు 1:9-12).

(5) థలింపవని అంజారవు చెట్టు నరికించి వేయబడును (లూకా 13:9) బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని రాజ్యమును గూర్చి యూదులకు బోధిస్తూ, “ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్హది గనుక మంచిఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి, అగ్నిలోవేయబడునని' చెప్తెను (మత్తయి 3:10). 'నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసిపారవేయును. 'ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల, వాడు తీగెవలె బయట పారవేయబడి, యెండిపోవును” (యెహోను 15:2,6). దేవుని వాక్యములో 'పిరికివారును, అవిశ్వాసులును, అనవ్యాలును, నరహంతకులునం వ్యభి చారులును, మాంత్రికంలును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అడ్నిగంధకములతోమండు గుండములో పాలు పొందుదురు. ఇది రండవ మరణము” (ప్రకటన 21:8) అని చదువు చున్నాము.

తోటమాలి తన యజమానుడు అంజూరపు చెట్టును నరికించి వేయకుండా ఒక సంవత్సరము ఆపిన లీతిలో, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఉగ్రత లోకము మీద రాకుండా విజ్ఞాపన చేయుచున్హాడని యీ ఉపమానముద్వారా తెలుసు కొనుచున్నాము. అయితే, సంవత్సర కాలమైన తరువాత, యజమానుడు ఫలించని అంజూరపు చెట్టును యే లాగు నరికించునో, ఆలాగు యేసుక్రీస్తు విజ్ఞాపన కాలము పూర్తయిన వెంటనే దేవుని ఉగ్రత లోకము మీదికి వచ్చునని మనము గ్రహింపవచ్చును (2 పేతురు 3:7,10).

(1) గురుగులు(మత్తయి 13:24-30, 36-43) :

యీలోకములో దేవుని రాజ్యనంబంధంలతో పాటు దువ్వుని సంబంధులుగగురుగులు) ఉన్మారనియు, దేవుని తీర్చు యుగాంతమందు దుష్టుని సంబంధులపై ఉండుననియు తెలియజేయుటకు యేసుక్రీస్తు “గురుగులు” అను ఉపమానమును చెప్తెను.

మత్తయి 13:24-30 వచనములలో యీలాగు ప్రాయబడినది. 'ఆయన మరియొక ఉపమానము వారితో చెప్తెను. విమనగా పరలోక రాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియుశన్హది. మనుష్కులు నిద్రించుచుండగా, అతని శత్రంవువచ్చి, గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి, గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు యింటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీపొలములో మంచి విత్తము విత్తితివిగదా, అందులోగురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్తగా, ఆదాసులు, మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా ? అని అతనిని అడిగిరి. అందుకతను - వద్దు, గురుగులను పెరుకుచుండగా, వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. కోతకాలము వరకూ రెంటిని యెదుగనియ్య్ముడి. కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి, వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నాకొట్టులో చేర్చి, పెట్టుడని కోతగాండ్రతో చెప్పదుననెను.”

పై ఉపమాన భావమును తెలియజేయుమని యేసుక్రీస్తును తన శిష్యులు అడిగినపుడు మత్తయి 13:36-43 వచనములలో ఆయన ఉపమాన భావమును యీ క్రింది విధముగా చెప్పెను.

(1) మంచి విత్తనము విత్తువాడు మనువ్యకుమారుడు (మత్తయి 13:37) : మంచి విత్తనముదేవుని రాజ్యమును గూర్చిన సువార్త. దానిని విత్తువాడు యేసుక్రీస్తు. యేసు యూదుల సమాజమందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచుండెను (మత్తయి 4:23,9:35; 11:1; లూకా 4:43). యోహాను చెరపట్ట బడిన తరువాత యేనం - కాలము సంపూర్ణమైయున్హది. దేవుని రాజ్యము సమీపించి యున్నది. మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను (మార్కు 1:14-15).

(2) పొలము లోకము (మత్తయి 13:38) : యీలోకము (దేవునెరుగని పాపముతో కూడిన వ్యవస్థ) ఒక పాలముగా వర్ణించబడినది. దేవుడు యిటువంటి లోకమును యెంతో ప్రేమించెను (యోహాను 3:16). పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను (1 తిమోతి 1:15). యేసుక్రీస్తు దేవుని యొద్దనుండి బయలు దేరి లోకమునకు వచ్చెనని యోహాను 16:28లో వ్రాయబడినది. యేసు క్రీస్తు తన శిష్యులతో, 'సర్వలోకమునకు వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడని' చెప్పెను (మార్కు 16:15).

(3) మంచి విత్తనములు రాజ్య నంబంధులు (మత్తయి 13:38) దేవుని రాజ్య సువార్తనుగైకొని, తమ పాపములను బట్టి పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొాందువారందరూ మంచి విత్తనములుగా యెంచబడుచున్నారు. అట్టివారు వెలుగు సంబంధులును, పగటి సంబంధులునై యున్హారు (1థెస్టలోనీకయులకు 5:5). వారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొందురు గనుక రాజ్య సంబంధులుగా పిలువబడు చున్నారు.

(4) గురుగులు దుమ్ణని నంబంధులు (మత్తయి 13:38): యేసు క్రీస్తు 'మీరు మీతండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి, సత్యమందు నిలిచినవాడం కాడు. వాడు అబద్ధికుడును, అబధద్ధమునకు జనకుడునై యున్వాడని” సాతానుని గూర్చియు, వానిని వెంబడిస్తున్న యూదులను గూర్చియు చెప్పెను (యోహాను 8:44). అట్టి వారు దుర్నీతి పరులుగా చెప్తబడుచున్నారు (మత్తయి 13:41). వారు పాపములచేతను అపరాధములచేతను చచ్చినవారై, వాయుమండల సంబంధమైన అధిపతిని (సాతానును అనుసరించి, యీ ప్రపంచధర్మము చొప్పున నడుచుకొనుచున్హారని ఎఫెసి 2:2లో చదువుచున్నాము. దుష్టుని నంబంధులు విశ్వాసులమధ్య కూడా ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తున్నది. అపొ.కా.20:29-30 వచనములలో పౌలు, “నేను వెళ్లిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును. వారు మందను కనికరింపరు. మరియు శిష్యాలను తమవెంట ఈడ్సుకొని పోవలెనని వంకరమాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలు దేరుదురని' చెప్తెను. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొను చున్హాడు (2 కొరింథి 11:14).

(5) గరుగులను విత్తిన శత్రువు అవవాది (మత్తయి 13:38) ఏదేను వనములో సాతాను సర్ప్జరూపములో ప్రవేశించి, హవ్వను మోసపరచుట ద్వారా లోకములో పాపమును ప్రవేశపెట్టెను. అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు, తిరుగుచున్హాడు (1 పేతురు 5:8). యీ అపవాది అవిశ్వాసుల మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేయును (2 కొరింథి 4:4). వారిని మోసపరచును (ప్రకటన 20:7,8).

(6) కోతయుగనమాప్తి, కోత కోయువారు దేవదూతలు (మత్తయి 13:39): యుగసమాప్తియందు ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అడ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని యెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునని 2 థెస్టలోనీకయులకు 1:6-8 లో చదువుచున్నాము. యీూవచనములు గమనించినచో, యుగ సమాప్తియందు నీతిమంతులనుండి దుష్టులు వేరు పరచ బడుదురు (మత్తయి 7:21-23, 25:41-46, లూకా 13:25-27)

దుమష్ణులకు కలుగబోవు ప్రతిదండన:

(1) వారు అడ్నిగుండ ములో పడవేయబడుదురు (మత్తయి 13:41; ప్రకటన 20:12-15): యీ అగ్నిగుండము నరకాగ్షిగా (మత్తయి 5:22, 10:28, 18:8-9), అగ్నిగంధకములతో మండు గుండముగా (ప్రకటన 21:8), ఆరని అగ్షిగా (మార్కు9:43-48, మత్తయి 25:41), వెలుపటి చీకటిగా (మత్తయి 8:12, 22:13, 25:30), నిత్మ శిక్షగా (మత్తయి 25:46) చెప్పబడినది.

(2) అచ్చట ఏడ్డును, పండ్లు కొరకుటయు వుండును (మత్తయి 8:12, 22:13, 24:51, 25:30): ప్రియులారా, యిటువంటి దేవుని ఉగ్రత నుండి తప్తించుకొనుమని యేసుక్రీస్తు తెలియజేసెను. 'నామాటవిని, నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్హాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” (యెహాను 5:24). తన దవినములలో నువార్తను నమ్మని వట్టణములను దేవుని ఉగ్రతను గూర్చి హెచ్చరించెను (మత్తయి 10:15, 11:20-24).

(01) వల (మత్తయి 13:47-50) :

ప్రస్తుతలోకములో దేవుని రాజ్వము అదృశ్వ్యముగా వున్నది. కనుక “గురుగులు” అను ఉపమానములో చూచినట్లు, యిందులో గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగు చున్హవనియు, గోధుమలు కొట్లలో చేర్చబడి, గురుగులు కాల్చబడు లాగున యుగాంతమందు నీతిమంతులు పరలోక రాజ్యములో చేర్చబడి, అనీతిమంతులు దేవుని శిక్షను యెదుర్కొందురు. యిదే సత్యమును తెలియ జేయుటకు యేసుక్రీస్తు 'వలి అను మరొక ఉపమానమును చెప్పెను.

మత్తయి 13:47-50 వచనములలో ఈలాగు వ్రాయబడినది. 'పరలోక రాజ్యము సముద్రములో వేయబడి, నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియుశ్హది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి, కూర్చుండి, మంచివాటిని గంపలలో చేర్చి, చెడ్డవాటిని బయట పార వేయుదురు. ఆలాగే యుగసమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి, నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి, వీరిని అడ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్తును, పండ్లు కొరుకుటయును ఉండును”.

పై ఉపమానములో సముద్రములో వేయబడిన వలలోనికి నానా విధములైన చేపలు వచ్చు చున్నవనుమాట, యీలోకము నీతిమంతులు, అనీతిమంతులు యిరువురితో నిండుచున్హదని తెలియ జేయుచున్నది. 'వల నిండుటి యనునది 'యుగసమాప్తి'ని సూచిస్తున్నది. మంచి చేపలు గంపలలో చేర్చబడి, చెడ్డ చేపలు పార వేయబడులాగున యుగ నమాప్తియందు నీతిమంతులు పరలోక రాజ్యములో చేర్చబడి, దుష్టులు నిత్మశిక్షకు లోనగుదురు.

(3) ధనవంతుడు - లాజరు (లూకా 16:19-31)

యేసుక్రీస్తు దేవుని వాక్యములో 'ఒక మనుష్క్ముడు లోక మంతయు సంపాదించుకొని, తన ప్రాణమును పోగొట్టు కుంటే అతనికేమి ప్రయోజనము ? ఒక మనుష్కుడు తన ప్రాణమునకు ప్రతిగా యేమి యియ్యగలడు?” (మత్తయి 16:26) అని చెప్పెను. మరియు వెర్రి ధనవంతుని గూర్చిన ఉపమానము తెలియజేస్తూ 'ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని” చెప్తెను (లూకా 12:15). ధనాపేక్ష గలిగి, ధనమునే సర్వస్వమని నమ్ము పరిసయ్నుల నుద్దేశించి (లూకా 16:14) యేసుక్రీస్తు 'ధనవంతుడు-లాజరు” అను ఉ పమానమును చెప్తెను. ధనవంతులుగా వుండియు దేవుని యెరుగని జీవితములతో నరకములో మండుటకంటే, భూమిమీద దరిద్రులుగా జీవించియు, దేవుని యెరిగి, పరలోక రాజ్యములో ప్రవేశించుట యెంతో మేలన్న సత్యమును తెలియజేస్తూ ఆయన ఈ ఉపమానమును చెప్పెను.

లూకా 16:19-31 వచనములలో యీలాగు వ్రాయబడినది: 'ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని, ప్రతి దినము బహుగా సుఖపడు చుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండేను. వాడు కురుపులతో నిండిన వాడై, ధనవంతుని యింటి వాకిట పడి యుండి, అతని బల్లమీదనుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రహాము రొమ్మున (ఆనుకొనుటకం ) కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి, పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధవపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రహామును, అతని రొమ్మున (ఆనుకొనియున్తు లాజరును చూచి, '“తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను నీళ్లలోముంచి, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను యీ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను” అందుకు అబ్రహాము - కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసి కొనుము. ఇప్పుడైతే వాడు యిక్కడ నెమ్మది పొందుచున్హాడు. నీవు యాతన పడుచున్హావు. అంతేగాక ఇక్కడ నుండి మీయొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్హదని చెప్తెను. అప్పడతడు - తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు. వారును యీ వేదనకరమైన స్థలమునకు రాకుండ, వారికి సాక్ష్మమిచ్చుటకై నా తండ్రియింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొను చున్హాననెను. అందుకు అబ్రాహాము, వారి యొద్ద మోషేయు, ప్రవక్తలును ఉన్హారు. వారి మాటలు వినవలెనని అతనితో చెప్తగా, అతడు - తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు. మృతులలోనుండి ఒకడు వారి యొద్దకు వెళ్లిన యొడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు - మోషేయు ప్రవక్తలును (చెప్తిన మాటలు) వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను'.

ఫై వాక్య భాగములో యీ క్రింది సత్యము గ్రహింపగలము (1) దేవుని యెడల మనము ధనవంతులమై యుండవలెను

యీ ఉపమానములో చెప్తబడిన ధనవంతుడు ఖరీదైన వస్త్రములు ధరించు కొని, బహుగా సుఖపడుచుండెడి వాడని చూచితిమి (లూకా 16:19). అయితే, ఈ ధనవంతుడు దేవుని భయము యేమాత్రమును లేక, తన యింటి వాకిట పడియున్న లాజరును కనికరింపలేదు (లూకా 16:20,21). దేవుని ప్రేమను రుచి చూసిన వారు యెదుటి వారిని ప్రేమింతురు. నిన్నువలె నీ పారుగు వానిని ప్రేమింపవలయును (లూకా 10:29). మన పారుగువారికి మనము దానధర్మములు చేయట ద్వారా రక్షింపబడము (ఎఫెసి 2:9). కానీ, మనలో జరిగిన రక్షణ కార్యమును బట్టి మనము నివ్తలులము కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను (తీతు 3:14). యీ ధనవంతుడు దేవుని యెరిగియున్న వాడైన యెడల జబీదవాడైన లాజరుకు సహాయము చేసియుండువాడు (సామెతలు 14:21,31; 19:17). కానీ దేవుని నిర్లక్ష్యము చేసిన వాడుగా జీవించెను. కనుక యీ ధనవంతుడు దేవుని యెడల దరిద్రుడైన వ్యక్తిని సూచిస్తున్నాడు (లూకా 12:21). అయితే, బీదవాడైన లాజరు యిహలోకములో దరిద్రుడైనప్పటికిని, దేవుని యెడల ధనవంతుడైన వృక్తిని సూచిస్తున్హాడని క్రింద తెలుపబడిన సత్మమును బట్టి గమనించుదుము (యాకోబు 2:5)

(2) మరణము తరువాత జీవము : పతిమానవుడు తన కిష్టమున్హను, లేకున్నను శారీరకముగా ఒకానొక రోజు మరణమును యెదుర్కొనవలయును.

అయితే, భూమిమీద తాను జీవించు జీవితము మీద మరణించిన తరువాత తన నిత్యత్వము ఆధారపడునని దేవుని వాక్యము సెలవిచ్చు చున్నది. యోహాను 5:8-29లో యేసు క్రీస్తు, 'ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో నున్న వారందరం ఆయున శబ్దమం విని, వేలు చేనిన వారం జీవ పునరుత్థానమునకును, కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు” అని సెలవిచ్చెను. మేలు చేయుట యనగా యేసుక్రీస్తు నందు పాపక్షమాపణ పొంది, దేవుని వాక్కానుసారము జీవించుట. కీడు చేయుట యనగా క్రీస్తును తృణీకరించుట. ఉపమానములో చెప్తబడిన ధనవంతుడు చనిపోయి, పాతాళములో తన నిత్యత్వ మనుభవింప సాగెను (లూకా 16:23). పాతాళములో బాధ, నిట్టూర్పు, వేదన, ఏడ్తును, పళ్లు కొరుకుటయును వుండును (లూకా 16:24). అచ్చట అగ్ని ఆరదు. పురుగు చావదు (యెషయా 66:24). అచ్చటనుండు వారికి భూమిమీద జీవితము యొక్క జ్ఞాపక స్మృతులు వుండును. వారు యితరులను గుర్తించెదరు. ధనవంతుడు అబ్రహామును, లాజరును గుర్తించెను. తన యింటివారిని రక్షించమని బ్రతిమాలు కొనెను (లూకా 16:27,28).

బీదవాడైన లాజరు వరలోక రాజ్యములో అబ్రహాము రొమ్మున ఆనుకొనియుండుటకు కొనిపోబడెనని లూకా 16:22లో చదువు చున్నాము. అబ్రహాము రొమ్ము అనునది దేవుని పరిశుద్ధ పట్టణమును సూచిస్తున్నది (ప్రకటన 21:2, 10-27; 22:1-5). దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడునైయున్హాడో, పునాదులు గల ఆపట్టణము కొరకు అబ్రహాము యెదురు చూచు చుండెనని హెబ్రీ 11:10లో చదువుచున్నాము. యిది శ్రేష్టమైన దేశము, పరలోక సంబంధమైన దేశముగా (హెబ్రీ 11:16), పరధైసుగా (2 కొరింథి 12:2,4; లూకా 23:43), దేవుని రాజ్మ్యముగా (మత్తయి 25:34) చెప్తబడినది. అచ్చట దుఃఖమైనను, ఏడైనను, వేదనయైనను వుండదు (ప్రకటన 21:4). రాత్రి యికనెన్షడు వుండదు. దీపకాంతి యైనను, సూర్య కాంతి యైనను వారి కక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యముచేయుదురు (ప్రకటన 22:5).

ధనవంతుడు తన సహోదరులు మరణించిన లాజరు తిరిగి లేచివెళ్లు ట ద్వారా దేవునియందు విశ్వాసముంచుదురు గనుక లాజరును పంపమని అబ్రహామును వేడుకొనెను. అందుకు అబ్రహాము భూమిమీదనున్న మోషేయు, ప్రవక్తలును చెప్పిన మాటలు వారు వినని యెడల, మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను (లూకా 16:27-31). విశ్వాసము వినుట వలన కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును (రోమా 10:17). యేసుక్రీస్తు మరియ సోదరుడగు లాజరును మృతులలోనుండి సజీవునిగా లేపినపుడు ప్రధానయాజుకులు క్రీస్తునందు విశ్వాసముంచక, లాజరును చంపవలెనని ఆలోచన చేసిరి (యోహాను 12:9-11). అలాగే కొరాజీను, బెత్సయిదా పట్టణములవారు యేసుక్రీస్తు వారిమధ్య విస్తారమైన అద్భుతములు చేసనినవ్పటికీ, మవారువమననం పొందలేదని వుత్తంం11:20-22 లో చదువుచున్నాము.

ప్రియులారా, యీ అధ్మాయములో చెప్తబడిన నాలుగు ఉపమానములు (ఫలింపని అంజూరపు చెట్టు, గురుగులు, వల, ధనవంతుడు - లాజరు) యేసుక్రీస్తునందు విశ్వసించని వారిపై రాబోవు దేవుని ఉగ్రతను గూర్చి వివరిస్తున్హవి. దేవుని కుమారుని (యేసుక్రీస్తును అంగీకరించువాడు జీవము గల వాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే (1 యోహాను 5:12). దేవుడు యీ ఉపమానముల ద్వారా మీతో మాటలాడు చున్న యెడల, 'యేసు ప్రభువా ! నేను పాపిని, నాపాపములను కడుగుము. నిత్యజీవము దయచేయుమని” ప్రార్ధించిన యెడల దేవుని రక్షణ పొందినవారై, ఉగ్రతనుండి తప్పించ బడుదురు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమునందు విశ్వసించిన యెడల నీవు రక్షింప బడుదువు (రోమా 10:9). దేవుని కృప మనకు తోడైయుండును గాక !

↑ Back to top

↑