సత్య సాక్షి – భాగము 4 (పుటలు 45–54)
పులివెందులకు తీసుకొచ్చి, గంగిరెడ్డి బావ గారి హాస్పటల్‌లోనే ఉంచాము. ఆ రోజు నేను “నడిపించు నా నావ” అనే పాట పాడి, ప్రార్థనచేసి, నిద్రపట్టే వరకు ఉండి ఇంటికి వెళ్ళిపోయాము.
ఉదయాన్నే తిరిగి హాస్పటల్‌కు వెళ్ళినప్పుడు ఆయన నన్ను వదలి ఎక్కడికి వెళ్ళవద్దని అడిగాడు. అందుకు నేను - మీరు డిశ్చార్జి అయ్యేంతవరకు మీతోనే ఉంటాను, ఎక్కడికీ వెళ్ళనని చెప్పాను. ఆ కారణాన ఏదైనా క్యాంప్ ఉన్నా వెంటనే వెళ్ళి వచ్చేవాణ్ణి. ఆయన ఆశీర్వాదంవలనే నేను ఇప్పటికీ నా వ్యాపార సంబంధమైన ఆర్డర్లకోసం క్యాంపులకు వెళ్ళే అవసరం రాలేదు. చనిపోయే ముందురోజు మా అందరిమీద చేతులుంచి “గాడ్ BS యు” అని ఆశీర్వదిస్తున్న సమయంలో ఊళ్లో చాలామంది ఆయన ఆశీర్వాదం కోసం రావడం చౌవ్వుకోవలనిన విషయం. మా నాన్చగారు గంగిరెడ్డి బావగారి హాస్పటల్లో ఉన్న మూడు నెలలు మా మేనమామ BABE rb, వారి కుమారులైన జనార్థన రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గార్లు నాన్న గార్కి ఎంతో ప్రేమతో పరిచర్య చేసారు.
(ఆయన మా నాన్న!”
సత్ ప్రవర్తన మాకు నేర్పించావు సనాతన మార్గాలు SPQ HPA) సన్మార్గంలో నడిపించావు సత్యంతో జీవించమన్నావు
సదా దైవాన్ని ధ్యానించమన్నావు నిత్యత్వంలో జీవించమన్నావు మా కొరకు “సత్యసాక్షిగా మాలో జీవిస్తున్నావు.
అందరినీ ఆదరించమన్నావు ఆర్థించే వారిని ఆదుకోమన్హావు ఆదర్శంగా నిలవమన్హావు ఆచరించి చూపించావు “ఆదరణను” పొందమన్నావు
కనిపించే వన్ని కల్లలన్నావు
కనిపించని దానిని వెదకమన్హావు
కన్నీటితో ప్రార్థించమన్నావు
కల్వరి మన్ననలను పొందమన్నావు
దైవాన్ని ధ్యానించమన్నావు
దేహి అని అడగమన్నావు
దాసత్వం (సేవ) చేయమన్న్చావు
ధన్యతగా జీవించమన్నావు కుమారుడు
- 3.08. ప్రకాళ్ రెడ్డి J నాన్న గారు ఎవ్వరితో మాటపడే మనిషికాదు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా కూడా ఎదురు మాట్లాడకుండా ఇంటికి వచ్చి బాధపడేవారు. కష్టాలు ఎన్నున్నా నిత్యం ప్రార్ధనలో సమయాన్ని గడిపేవారు. హాస్పటల్లో ఉన్నంత కాలం నిత్యం సువార్త వినడం, ప్రార్థనలు చేయడమే వారి జీవిత విధానం. ఎవ్వరి గురించి అనవసరంగా మాట్లాడేవారు కాదు. చివరి రోజుల్లో నా ప్రాణం ఆదివారం పోతే బాగుండును అని ఆశపడేవారు. సాయంత్రం 5:80 గం॥ల ప్రాంతంలో ప్రభుదాస్ చిన్నాన్నను బాగా కలవరించారు. నాన్న గారు కోరుకున్నట్లుగానే 1998 సం॥ నవంబరు 14 ఆదివారం తుది శ్వాస వదిలి నిత్య విశ్రాంతిలో ప్రవేశించారు.
నా మట్టుకైతే ఆయన నడిపింపును బట్టే (ప్రభువును నమ్ముకొని ఏ పనిలోనైనా ప్రార్ధన ద్వారా సఫలతను పొందుకుంటున్నాను. జీవితంలో ప్రభువు నాకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసారు. ఈ జీవితంలో సాధించవలసింది ఏమీ లేదు. ఈ నా స్థితికి యేసయ్య కృప, నాన్న ఆశీర్వాదం, నా భార్య పద్మావతి నిత్య ప్రార్థనలేనని నిరాటంకంగా చెప్పగలను. చర్చికి వెళ్ళిప్పుడల్లా చిన్నాన పురుషోత్తమరెడ్డిగారు సమక్షంలో ఉంటే నాకు, తండ్రి ప్రక్కనే ఉన్నాడనే భావన ఇప్పటికీ వస్తుంది. నాన్న గారు లేని లోటు ఎప్పటికీ వెలితిగానే ఉంటుంది.
ఆధ్యాత్మిక క్రమశిక్షణ :-
నాన్చగారు నేర్పిన ఆధ్యాత్మికతతో కూడిన క్రమశిక్షణ అన్నదమ్ములందరిలో, అకృచెల్లెళ్ళందరిలో ఇప్పటికీ సంపూర్ణంగా ఉంది. అందువల్లనే (ప్రభువు మమ్మల్ని సంవుంలో, సమాజంలో గౌరవంగా జీవించడానికి కావలసిన వనరులు సమకూర్చియున్నారు.
ఈ ఆధ్యాత్మిక మార్గంలో నిత్యం నడవడానికి ఈ వాక్యభాగాలు ఎక్కువగా
స్మరణకు వస్తుంటాయి.
. దేని కాలమందు అది చక్కగా జరుగునట్లు సమస్తమును ఆయన
నియమించి యున్నాడు. (ప్రసంగి 3:11
. కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చిన వరమే, అందులో మన
గొప్పతన మేమి లేదు. (ప్రసంగి 3:13
. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైననూ నీ శక్తి లోపము లేకుండా
చేయుము. (ప్రసంగి 9:10
. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై యుండుట అసాధ్యము. హెట్రీ 11:6
5. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి
10.
11.
12.
13.
14.
15. 16.
యందు యెహోవా ఆనందించువాడైయున్నాడు. 885 147:11
. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. సామెత 10:21 . నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసి వేయకుము.
సామెత 6:20
b అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి $08, నీతితో కూడిన కొంచెమే
శ్రేష్టము. సామెత 16:8
. పరాక్రమశాలి కంటే దీరశాంతము కలవాడు (Spe; పట్లణము పట్లుకొను మ్ 3B ట్ ట్
వాని కంటె మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్టుడు. సామెత 16:32
నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. సామెత 10:7 నీతిమంతుడు బాధనుండి తప్పింపబడును. సామెత 11:8 సత్ ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొన వలయును. 1 పేతురు 4:19 తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతినొందిరి. a 11:13 నీతి మార్గములో జీవము కలదు, దాని త్రోవలో మరణము లేదు.
సామెత 12:28 ఆయన ఆత్మని దయచేసిన దేవుని యొద్దకు చేరును. (ప్రసంగి 12:7
ఆయన ఏర్పరచిన స్థలములో నివాసము చేయుటకు వెళ్లినారని నమ్ముచున్నాము. యోహాను 14: 1-4 త్యాగానికి ప్రతిరూపమైన తల్లి ప్రేమ
దేవుని సృష్టి కార్యంలో స్రీకి ఎంతో ప్రాధాన్యత వుంది. పురుషుని ద్వారా స్రీ అని రాయబడినప్పటికి, సృష్టికార్యంలో స్రీకి ఉన్న ప్రాధాన్యత పురుషునికి తక్కువే! ఓ కుటుంబంలో తండ్రి ఇంటి యజమానిగా గుర్తింపబడినా - బిడ్డల పుట్టుకలో, పోషణలో పురుషాధిక్యత ఉన్నా - తండ్రి శ్రమ కంటే తల్లి త్యాగం ఎంతో గొప్పది. తన బిడ్డల ఎదుగుదలకు తన జీవితాన్ని ధారపోస్తుంది.
తండ్రి నిర్మాతగా కుటుంబాన్ని నిర్మించినా, తల్లి సూత్రధారియై ఆ కుటుంబాన్చి నడపిస్తుంది. తల్లి తన బిడ్డలకోసం మూడు దుర్భరమైన కష్టాలను భరిస్తుంది. మొదటిది తొమ్మిది నెలలు తన బిడ్డను మోస్తుంది. రెండవది ప్రసవ సమయంలో ఆమె పడే బాధ వర్ణనాతీతం. మూడవది పుట్టిన బిడ్డకు తన పాలను, శక్తిని ఇచ్చి పోషిస్తుంది. తండ్రి తన సంపాదనతో ఎక్కువ వసతులు సమకూర్చినా, తల్లి చాకచక్యంతో ఆ వసతులను సరియైన విధానంలో ఉపయోగించుకునేలా ఓర్పుతో, నేర్పుతో వారిని ముందుకు నడిపిస్తుంది. తన కుటుంబం కోసం తన ఆరోగ్యాన్ని సహితం లెక్కచేయకుండా శ్రమిస్తుంది. అందుకే తల్లిని తండ్రిని దూషించకూడదని పెద్దలంటారు. మనిషి చేసే పాపాలలో తల్లిని దూషించడం ఘోరమైన అత్యంత పాపకార్యంగా పరిగణించ బడుతుంది.
మన సమాజంలో స్రీ చిన్నతనంలో తండ్రి మీద, వివాహమైన తరువాత భర్తమీద, ముదిమి వయసులో బిడ్డల మీద ఆధారపడుతుంది. అన్ని వయస్సులలో వీరందరి మన్ననలను పొందగలిగిన స్రీ ఎంతో ఘనురాలు.
ప్రభువైన క్రీస్తు సిలువ మరణం పొందుతున్న సమయంలో కూడా తన తల్లిని గూర్చిన ఆవేదనతో, తన తల్లి బాధ్యతను శిష్యుడైన యోహానుకు అప్పగించినట్లుగా సిలువమీద పలికిన మూడవ మాటలో మనం గమనించగలం. కుటుంబంలో, సంఘంలో, సమాజములో ప్రతి స్రీకి స్వేచ్చ, గౌరవాన్ని మనం తప్పనిసరిగా ఇవ్వాలి. ఆమెను ఒంటిరిని చేసి, ప్రతి పని ఆమెకు అప్పగించి మానసికంగా ఎదగనివ్వకుండా చదువుకు దూరం చేయకూడదు. సమాజంలో స్రీ విలువ దిగజారిపోవడానికి కారణం - స్త్రీని పురుషునితో సమానంగా చూడకపోవడం వలననే. "Behind every Succesful Man Stands a Woman" అనే మాటను అక్షరాల నిజం చేయగలిగింది మా అమ్మగారు!
మా అబ్బగారైన (తాతగారైన) వెంకటరెడ్డి గారి మొదటి భార్య లక్ష్మమ్మ గారి, ఏకైక సంతానంగా మా నాన్న చిన్నకొండారెడ్డి గారు జన్మించారు. అనారోగ్య కారణంగా లక్ష్మమ్మగారు చనిపోయారు. ఆ తరువాత రెండవ భార్య మంగమ్మ గారికి సుగుణమ్మ, రత్నమ్మ, ప్రభుదాసురెడ్డి, రాజమ్మ, రాజారెడ్డి, మేరమ్మ, పురుషోత్తమ రెడ్డి, కమలమ్మగారు జన్మించారు. క్రమేణా వెంకటరెడ్డి గారి ఆరోగ్యం క్షీణించడం వలన కుటుంబ బాధ్యతలు మా నాన్చగారైన చిన్న కొండారెడ్డి గారు స్వీకరించాల్సి వచ్చింది.
మా అమ్మ రాజమ్మ గారు మంగమ్మ గారి పెదనాన్న కొడుకైన పెద్ద సుబ్బి గారి కుమార్తె. మా అమ్మ తన స్వగ్రామమైన రాజుపాళెం నుండి చదువు నిమిత్తం బలపనూరు గ్రామానికి వచ్చింది. అత్యంత ఉన్నత విద్యార్హతలు గల కుటుంబీకులుగా, జిల్లాలో తొలిగ్రాడ్యుయేట్లుగా పేరుపొందిన ఇంటిలో చదువురాని వారు ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మ రాజమ్మగారే! ఆమె మంచితనము వల్ల వెంకటరెడ్డిగారి రెండవ కోడలుగా చిన్న కొండారెడ్డి గారికి సతీమణి కాగలిగింది. అందరి మన్ననలు పొందగలిగింది.
18 మంది సంతానానికి జన్మనిచ్చినా, ఆడబిడ్డలను, మరుదులను తన సొంత బిడ్డలుగా ఆదరించి వారి చదువులకు, ఎదుగుదల కోసం, నిస్వార్ధంగా భర్తతో సహకరించి జీవితం కొనసాగించిన ఆదర్శ మూర్తురాలు. నాన్నగారు కాంట్రాక్టు పనుల మీద ఎప్పుడూ క్యాంపుల్లో ఉండేవారు. కాని ఆ లోటు ఎన్నడూ మాకు తెలియలేదు. “చదువు - సంస్కారం” అని అంటారు కాని, సంస్కారవంతుల్ని చేయడానికి చదువుతో పనిలేకుండా మమ్మల్బందర్చీ ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్ద గలిగిందంటే అది మా అమ్మ కృషే! ఉన్నత విద్యను అభ్యసించిన విద్యావేత్తలకంటే మా అమ్మ గొప్పవ్యక్తి. అంతటి ఉన్నత్రమైన స్వభావం, ఆధ్యాత్మిక లక్షణాలు కలిగిన స్త్రీ మూర్తి కాబట్టి వెంకటరెడ్డిగారి రెండవ కోడలిగా న్యాయం చేకూర్చగలిగింది.
ఉదయమే 4 గం॥లకు నిద్రలేవటం, ప్రార్ధన చేసుకోవడం, పాడి పశువులను
చూసుకోవడం, ఇంటిల్లిపాదికి భోజన సదుపాయాలు చూడటం, ఇంటి పనులన్నీ చక్క బెట్టుకోవడం, సాయంత్రం అయ్యేసరికల్లా కూలీలకు ధాన్యాన్ని కొలిచి ఇవ్వడం, రోజంతా పనిలో నిమగ్నమవ్వటం, రాత్రి కుటుంబ ప్రార్థనలో పాల్గొని, 9:30 గం! లకు నిద్రకు ఉపక్రమించటం ఆమె దినచర్య. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, మన పని మనం చేసుకోవటం లాంటి ఎన్నో పాఠాలను మా అమ్మే మాకు బోధించేది. అమ్మే మా అందరికీ తొలి గురువు.
( సై ఆమె మా అమ్మ - ఆదర్శమూర్తి!
అహర్షిశం మా కోసం అలుపెరుగక శ్రమించావు
ఆసరా లేకున్నా అన్ని నెరవేర్చావు
అక్షర జ్ఞానం లేకున్నా - ఇంగిత జ్ఞానం నేర్పించావు
క్రమం తప్పని రీతిలో క్రమశిక్షణ నేర్పించావు
కష్టించే జీవితంలో కన్నీళ్ళుండవన్నావు
పదమూడు మంది సంతానంలో
పదవ దశాబ్దంలో కూడా మా కోసం శ్రమిస్తున్నావు
తల్లులకు తల్లిగా నేటికి మా కళ్లు తెరవజేస్తున్నావు
అనురాగం ఆమె స్వంతం ఆదరణ ఆమె హక్కు అంతా నా వారే నని ఆరాటపడ్డావు అధితుల్ని అక్కున చేర్చుకున్నావు అందరి మన్ననలు పొందుకున్నావు అందుకున్నావు దైవాశీర్వాదాల్ని అధికురాలిగా ఆరాధించబడుచున్నావు కుమారుడు - వైయస్. (SF రెడ్డి |
S
అలుపెరగని ఆమె జీవిత పయనంలో ఏ లోటు తెలియని మా అమ్మకు తాను చదువుకోలేకపోయాననే బాధ వెంటాడుతూ ఉండేది. నేను ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజుల్లో వార్తా పత్రికలోని పెద్ద పెద్ద అక్షరాలను కూడా పలుక్కొని చదవడానికి ప్రయత్నిస్తూ ఉండేది. ఆమె అభిరుచిని గమనించిన నేను సి. ఎస్.ఐ. చర్చిలో పని చేస్తున్న బైబిల్ అమ్మగారిని అడిగి పెద్ద అక్షరాల బైబిలు “క్రీస్తు కథలు”
అనే పుస్తకాలను తీసుకున్నాను. అవి సైకిల్ వెనుక క్యారియర్‌లో పెట్టుకుని మిస్సమ్మ బంగ్లానుండి తీసుకొని వస్తుండగా, అవి దారిలో ఎక్కడో పడిపోయాయి. ఆ తరువాత ఎంత వెదకినా అవి దొరకలేదు. ఈ విషయం తెలుసుకున్న అమ్మ విచారంగా - “నేను చదవడం ఆ భగవంతునికి కూడా ఇష్టం లేదేమో” అని నిరుత్సాహంగా పలికిన మాటలు నా మనసును చాలా గాయపరిచాయి.
పిల్లలంతా పెద్దవారై చదువులకోసం ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోవడం, కుటుంబ భారం పెరగడం వలన ఆ కొంచెం చదువుకూడా అమ్మకు పూర్తిగా దూరమైంది. విద్యలేకున్నా సనాతన హిందూ సాంప్రదాయం నుండి వచ్చినా, అన్ని సమయాలలో నాన్నకు చేదోడు వాదోడుగా వుంటూ, నిత్యం కుటుంబ ప్రార్థనలో తన విశ్వాసాన్ని నిరూపించుకోగలిగింది. “స్త్రీ” అనే పదానికి సంపూర్ణతను కలుగచేయుటలో ఆమె జీవితమే ఒక సజీవ సాక్ష్యం. ఎవరైనా క్రీస్తును నమ్ముకున్నావా? - అని ప్రశ్నించినప్పుడు, చదువు రాని కారణంగా బైబిల్‌ని చదవలేదు, ప్రసంగాలు చేయలేదు అని వేదన చెందుతూ ఉండేది. బైబిల్ చదవలేనంత మాత్రాన, ప్రసంగాలు చేయలేనంత మాత్రాన క్రీస్తుని నమ్ముకోలేదనుకోవటం అజ్ఞానం. “నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు” అన్న వాక్యాన్ని తన జీవితం ద్వారా పదిమందికి అర్థమయ్యేటట్లు చేసిన నిజ విశ్వాసి - మా అమ్మ!
ఒక కూతురుగా, భార్యగా, కోడలుగా, తల్లిగా, అత్తగా, అమ్మమ్మగా, నాయనమ్మగా, అందరి మన్ననలను పొంది “స్త్రీ యొక్క ఆర్థానికి సంపూర్ణతను కలుగ చేయటంలో ఆమె జీవితమే ఓ నిలువెత్తు సాక్ష్యం.
ఇట్టి తల్లిదండ్రులకు బిడ్డలమైన మేము మళ్లీ జన్మంటూ ఉంటే వీరికే బిడ్డలుగా జన్మించాలని మనసారా కోరుకుంటాము. ఇటువంటి తల్లిదండ్రులను ప్రసాదించిన ఆ క్రీస్తు భగవంతునికి సర్వదా ఎంతో బుణస్థులమై ఉన్నాము.
నేను దైవలేఖన (గ్రంథాన్ని ప్రార్ధనాపూర్వకముగా DONA) ప్రతిసారీ సామెతలు 31 ఆధ్యాయంలోని ఈ క్రింది వచన భాగములలో చెప్పబడినట్లుగా మేము మా తల్లిని గూర్చి హృదయపూర్వకముగా చెప్పుకొనుచున్నాము.
గుణవతియైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. ఆమె BIDE ఆమెయందు నమ్మికయుంచును
అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు.
ఆమె తాను బ్రదుకు దినములన్నియు
అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు.
తన చేతులార పనిచేయును.
ఆమె చబీకటితోనే GD, తన యింటివారికి భోజనము సిద్ధపరచుము తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును.
ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని
చేతులతో బలముగా వనిచేయును.
దీనులకు తన చెయ్యి చావును, దరిద్రులకు తన చేతులు చావును ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడ కూర్చుండును
గవినియొద్ద పేరుగొనినవాడై యుండును.
బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు
జ్ఞానము కలిగి తన నోరు తెరచును
Hilo ఉపదేశము ఆమె బోధించును.
ఆమె తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్టును వనిచేయకుండ ఆమె భోజనము చేయదు.
ఆమె కుమారులు లేబి ఆమెను ధన్యురాలందురు
చాలామంది కుమార్తెలు వతిప్రతాధర్భము ననుసరించియున్నారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును.
అందము మోసకరము, సౌందర్యము వ్యర్ధము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్రీ కొనియాడబడును. చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె వనులు ఆమెను కొనియాడును.
శ్రీ వై.యస్. ప్రకాష్ రెడ్డి గారి చిన్న కుమారుడు వై యస్.పాల్ neta లేటు) గారి వివాహసమయంలో నవ దంపతులను ఆశీర్వదిస్తున్న శ్రీమతి రాజమ్మగారు
శ్రీ వైయస్, , ప్రకాష్ రెడ్డి గారి చిన్న కుమారుడు వైయస్, పాల్ జగన్మోహనరెడ్డి (లేటు) గారి వివాహసమయంలో చిన్న కొండారెడ్డిగారితో దివంగత ముఖ్యమంత్రి డా! వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు
~S se గొప్ప దాత వై.యస్. ప్రభుదాస్ పెద్ద తమ్ముడు నంద్యాల, ఆర్. యస్.
మా తండి వై.యస్. వెంకటరెడ్డి గారి రెండవ
కుమారుడు వై.యన్. చిన్నకొండారెడ్డి. తన యవ్వన కాలములో తన ప్రభువును స్వంత రక్షకుడుగా ఎరిగి, అందరివలె కుటుంబములో బాధ్యత కలిగి తండ్రికి పనులలో సహకార మిచ్చాడు. అయితే వయస్సులో పెద్దవాడైన తరువాత కొంత అస్వస్థతను బట్టి తన అల్లుడు, కుమార్తె వారి గృహమునందు ఉంటూ చికిత్స పొందుతున్న సమయమున నేను వారి కొరకు Gore. ప్రభువు కీర్తనలపట్ల ఆసక్తి కల్లి, ఆయన సేవయందలి భారము కలిగి పులివెందులలో సువార్త కొరకై వ్యాన్ కొనబోవుచుండగా అందులో ఆయన చూపిన దాతృత్వం ఎంతో గొప్పది. ప్రభువు కార్యములపట్ల అపారమైన ఆసక్తి కలిగి ఉండేవారు. తన జీవితంలో దేవుని కార్యములకు, ప్రార్థనకు, వాక్యమునకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు.
ఆయన కుమారులలో కొందరు ప్రభువును అంగీకరించి ప్రభువు కొరకు సాక్షులుగా ఎదుగుతున్నారు. వారి కుమారులు వై.యన్. ప్రకాశ్‌రెడ్డి తన కుటుంబముతో కూడా ప్రభువును అంగీకరించి సాక్షిగా నిలువగల్లినాడు. దానిని బట్టి మరి కొందరు తన చెల్లెండ్రు తమ్ముల్లు కూడా ప్రభువు యందు ఆసక్తి కలిగి జీవించగల్లు చున్నారు. ఇదీలాగు జరుగుచుండగా మా అన్నయగు చిన్న కొండారెడ్డిగారు ప్రభువునందు నిద్రించి మహిమలో చేర్చబడినారు. మా వదినమ్మగారు శ్రీమతి రాజమ్మ బహువృద్దురాలై పులివెందులలో నివసించుచున్నది.
లం (మ.
