సత్య సాక్షి – భాగము 11 (పుటలు 115–124)
ఆయన హోస్పేటలో ఉన్న దినాలలో ఆయన దగ్గరే వుండినాము. నిత్యం ప్రార్ధనా జీవితం గడిపేవారు. క్రైస్తవ సోదరులు ఎవ్వరు వచ్చినా సహాయము చేసేవారు. రేడియో ప్రసంగంములు బాగుగా వినెడివారు. ఆఖరు దినాలలో అనగా 91, 92, 93 సం॥రములలో సువార్త పరిచర్య కొరకు సొంత వాహనములో పోయి మడూరు, బలపనూరు, బెస్తవారిపల్లె, పులివెందుల, ఉలిమెల్ల గ్రామములలో పరచర్యలు చేస్తూ ఉండినారు. చాలా క్రమశిక్షణ కలిగిన వారు. పనులలో నాణ్యతను పాటించేవారు. ఆయన పని వద్దకు వచ్చే సమయములో గవర్నమెంటు వారి కంటే ఆయన వచ్చినపుడు ఎక్కువ భయపడేవారము, పనుల విషయంలో రాజీ పడే వ్యక్తిత్వంకాదు. ఈ కొద్ది మాటలు ఆయనను గురించి వ్రాయుటకు నాకు ఈ అవకాశము దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
Bo ఛిన్న చెన్నారెడ్డి
సత్యానికి సాక్షిని కావాలన్న ధ్యేయంతోనే నేను పుట్టాను, ఈ కారణం వల్లే నేనీలోకంలోకి వచ్చాను. సత్యానికి కట్టుబడ్డ (ప్రతివాడు నా స్వరం వింటాడు. ఈ మాటల్లో క్రీస్తు ఎంతెంతో ఇమిడ్జి చెప్పాడు.
- ఒక యోగి ఆత్థ్ర కథ Real Human Being Mr. K.Jagadeswar Chetty
We all the family members own a lot to late Sri. 315.6. Konda Reddy Garu and thank God ev- eryday for having given such a well wisher to our family. He was so kind and helping nature that we
all benefited for our education career for which he
‘ has helped finacially uncoditionally. This made all of us to prosecute higher studies and reach to the present positions.
My father late Sri. K. Buchappa chetty who worked with him in his contractual ventures was always over-whelmed with his kindness to all needy all poor. He used to pray even for the welfare of labour every- day in his daily prayers who worked in his organization.
To put it in a simple word about his qualities he is a true human being and incarnation of kindness.
From
1) Sr. K. Arunachalam - General Murchant, Madanpalli. 2) Late Sri. K.Krishnamurthy, AMIE (1) - Rtd. Lecturer, polytechnic, Nandyal.
3) Sri. K. Malikarjuna Chetty, Phd Rtd. Professor and Head of Dept Electrical Engineering GVCE Bangalore
4) Sri. K. Balasubramanyam, BE (Mech) Rtd Dy. General, Manapur HMT - Hyderabad.
5) Sri K.Jagadeeswara chetty, Rt. SE, Bangalore
Pek గురుదేవ!
జి. శివరామ నాయుడు
హైదరాబాద్
అవి నేను 1978 నుండి 1975 సం॥లలో శ్రీ
వై.యస్.సి కొండారెడ్డి గారి వద్ద రేణిగుంట-గుంతకల్ డబల్‌లైన్ Formation work (Southern Railways) లో Site Engineer గా పని చేస్తున్న రోజులు. చినకొండారెడ్డి గారు ఉదయం 5 Moles కాలకృత్యాలు తీర్చుకొని బైబిల్‌ను సుమారు 15 నిమిషాలు చదివేవారు. ఎంతో ఓపికగా పని వాళ్లందరికీ కాఫీగానీ, టీ గాని ఇప్పించి పనికి పంపేవారు. ఆయన దగ్గర చేరిన రెండు రోజులకే వారికి పని మీద ఎంత GEE తెలుసుకున్నాను. ఆఫీసర్లతో పని విషయమై మాట్లాడేటప్పుడు పని నాణ్యత గురించి ఎక్కువగా పట్టించుకొనేవారు. అప్పుడప్పుడూ నాతో "Work is Worship" అనేవారు. చిన్న వయసులో ఉన్న నాకు ఆయన మాటల్లోని అంతరార్థం అంతగా అర్థమయ్యేదిగాదు.
రెడ్డి గారికి పని మీద ఎంతో అవగాహన ఉండేది ఒకసారి ఆయనతో కలిసి (ట్రాలీలో ప్రయాణం చేస్తూ, అంతవరకు చేసిన పని అంచనా వేస్తున్నాము. సుమారు 8 గం! వ్యవధిలో 12 కి.మీ ప్రయాణం చేసి ఆయన సుమారుగా ఇంతమాత్రం Bill రావచ్చు అన్నారు. ఇదే విషయం నేను Railways Officers తో చర్చిస్తే అందులో 60% గూడా రాదు అన్నారు. ఆ తర్వాత 4 రోజులు పాటు Officers అందరూ 8111 చేస్తే రెడ్డి గారి అంచనాకు 5% తేడాతో బిల్లు తయారయ్యింది. అంటే సుమారు 3 గం!॥లో ఆయన చేసిన estimate ని ఆఫీసర్లందరూ కలిసి సుమారు 4 రోజులు పాటు చేశారు. ఇది ఆయన మేధావి తనానికి చిహ్నం.
రెడ్డిగారు 3110 మీదకు Inspection వస్తున్నారంటే మాకు గుండె దడగా ఉండేది. ఎలాంటి చిన్న తప్పుచేసినా ఆయన సహించేవారు కాదు. ఆ రోజుల్లో 3 Reach Banking పని ప్రారంభించేసరికి రోజుకు సుమారు 3000/- రూపాయలు నష్టం వస్తూండేది. అటువంటి సమయంలో Reach [11లో 20% Bridge Foun- dation కాంక్రీటు వేస్తున్నాము. నేను Foundations® ఉండి కాంక్రీటు వర్కు సూపర్వైజ్ చేస్తున్నాను. పై నుండి రెడ్డిగారు వచ్చి Supervise చేస్తున్నారని నాకు తెలియదు. Bridge Foundation లో ఒక 8" సైజు గ్రానైటు రాయి ఉంది. Speci- fication ప్రకారం ఆ రాయిని తీసివేసి కాంక్రీటు వెయ్యాలి. నేను అలా చెయ్యకుండా ఆ రాయిని కాంక్రీటులో కప్పివేశాను. ఇంతలో పైనుండి - మిమ్మల్ని పెద్దరెడ్డిగారు పిలుస్తున్నారు సార్ అని ఎవరో చెప్పారు. ఎందుకోనని పైకి వెళ్లాను. రెడ్డిగారు చాలా కోపంగా ఉన్నారని ఆయన ముఖం చూస్తేనే తెలిసింది. ఎందుకు కోపంగా ఉన్నారో తెలియదు. మా సంభాషణ ఈ విధంగా సాగింది.
రెడ్డిగారు : పంతులూ, నీవు చేసిన పని ఏమిటి (సార్ నన్ను పంతులు అని పిలుస్తారు)
నేను : ఏమి చేశాను సార్?
రెడ్డిగారు. : ఏ పని చేశావో నీకు తెలియదా ?
నేను : నాకు తెలియదు సార్
రెడ్డిగారు. : కాంక్రీటుతో రాయిని కప్పలేదా?
నేను : కప్పాను సార్
రెడ్డిగారు : ఎందుకు చేశావ్ ?
నేను : రాయికూడా గ్రానైట్ కాబట్టి, కాంక్రీటులో కప్పితే తప్పుగాదు..... రెడ్డిగారు. : అలా అని Specification లో ఉందా ?
నేను : లేదుసార్
రెడ్డిగారు : నీకు నీ ఇంజనీరింగ్‌లో ఇలా చెప్పారా ?
నేను : లేదుసార్
నాకు భయం వేసింది "రెడ్డిగారు అంటున్న మాటలు వింటున్నాను. నిన్ను నమ్మి నేను పనిమీద పెడితే Specification కి againsts గా చేస్తావా? ఇదేనా నీ చదువు? - అని రెండోసారి గొడుగుతో కొట్టబోయేసరికి నాకు భయం వేసి అక్కడనుండి పరిగెత్తాను. కంకర రాళ్లు నావైపు విసరబడుతున్నాయి. తొందరగా ఆయన నుండి దూరంగా పారిపోయాను.
సాయంత్రమయ్యింది ఒంటరిగా కూర్చుని ఉన్నాను. రాత్రి భోజనాలు పూర్తి అయ్యాయి. ఎప్పుడూ సార్ దగ్గరే ఉండి Bard), వంటవాడు వచ్చి, సార్ రెడ్డిగారు మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నారు అన్చాడు. భయంగా వెళ్లి ప్రక్కనే కూర్చున్నాను. భోజనం మొదలు అయింది. మా సంభాషణ మొదలు అయింది.
రెడ్డిగారు : ఎందుకు చేశావ్ ఆ పని ? నేను : (కాస్త ఉక్రోషంగా) రోజుకు 3000/- Loss వస్తూంది. పని త్వరగా పూర్తికావాలి. ఆ రాయి కాంక్రీటులో ఉంటే కొంచెమైన లాభమే గాని నష్టం రాదు గదా సార్.
రెడ్డిగారు : పంతులూ..నా లాభనప్టాలతో నీకేం పని. నీ డ్యూటీ ఏమిటి? Specification (ప్రకారం పనిచెయ్యి. నా లాభనష్టాల గురించి ఆలోచించి పనిని భిన్నంగా చెయ్యడం నేను సహించను. నా మనసాక్షి ఒప్పుకోదు. చూడు పంతులూ, నీవు ఇంజనీర్‌వి, భవిష్యత్తులో ప్రభుత్వం నిన్ను నమ్మి ఎంతో బాధ్యతను అప్పగిస్తుంది. నీవు వేరే కోణాల్లో ఆలోచించి పనిలో నాణ్యతను కాపాడకపోతే అది ఒక మహాపాపం అవుతుంది. ప్రభువు తన బిడ్డలు పాపం చేయడాన్ని ఇష్టపడడు. ఇంకెప్పుడూ అలా చెయ్యొద్దు అనారు శాంతంగా.
భోజనం అయిన తర్వాత ఒంటరిగా కూర్చొని జరిగిన సంఘటన, రెడ్డిగారి వ్యక్తిత్వము, వైఖరి ఆలోచిస్తే - ఆయన ఎంతటి మహోన్నతమైన వ్యకో నాకు పూర్తిగా అర్ధమయ్యింది. ఆనాటి నుండి పని మీదనా దృక్పధమే మారిపోయింది. నేను ఇటీవలే యస్. ఇ.గా రిటైర్ అయ్యాను. జె.ఇ.గా డిపార్ట్మెంట్లో చేరి యస్.ఇ.గా నేను రిటైర్ అయ్యేంతవరకు ఆయన స్ఫూర్తితో నేను పని చేసేవాణ్ణి, నాణ్యతతో గూడిన పనిని చేస్తే సమాజానికి ఎంతటి క్షేమమో నేను బాగా ఎదిగిన తర్వాత అర్థమయ్యింది. ఎన్నో సందర్భాలలో క్లిష్ట సమయాల్లో ఆయన్ని గుర్తుతెచ్చుకొనేవాణ్మి, ఆయన ద్వారానే ఆ కుటుంబంతో ఇంతవరకు ఆత్మీయ బంధాన్ని పెంచుకున్నాను. నిజంగా ఆయన గురించి వ్రాయాలంటే ఎంతో ఉంది. చివరిగా నేను నిత్యం చదివే భగవద్గీతలోని ఒక శ్లోకంలో ఆయన దర్శనమిస్తాడు.
“యద్యతాచరతి శ్రేష్ట: తత్తరేవేతరోజన: సయత్ర్రమాణం కురుగే లోకస్తదనువర్తతే”
అనగా- అర్జునా, శ్రేష్టులైన వారు ఏ పనిని చేస్తారో, సామాన్యులు గూడా వారిని అనుసరిస్తారు శ్రేష్టుడవైన నీవు అలా చేయడం తగదు. సమంజసము కాదు.
ఎంతటి ఆలోచన! ఎంతటి (SE! "Work is Worship" అనే మహాసూక్తిని నేను నేర్చుకున్నాను. నాకే కాదు ఆ రోజుల్లో ఆయన ఎంతో మందికి మార్గదర్శకుడు. అలాంటి మహానుభావులు మనుగడలోనే నీతి, నిజాయితీలు నిలబడతాయి. అటువంటి తండ్రి కన్న ఈ బిడ్డలు నిజంగా ఎంతో అదృష్టవంతులు. సెలవు
ఆ.శివరామనాయండూు, (S.E Rid)
థామస్ రెడ్డి మడూరు పాఠకులకు క్రీస్తు నామమున శుభములు. తొండూరు మండలం, మడూరు గ్రామవాసి అయిన | శ్రీ నారాయణ రెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, పెద్దకుమారుడు నారాయణరెడ్డి, చిన్న కుమారుడు అశ్వతారెడ్డి, అశ్వతారెడ్డిగారు 1912 సంవత్సరంలో ప్రభువును రక్షకునిగా స్వీకరించారు.
అశ్వత రెడ్డిగారికి నలుగురు కుమారులు ఒక కుమార్తె. 1. థామస్ రెడ్డి 2. పురుషోత్తమ రెడ్డి 8.పౌలురెడ్డి 4. క్రీస్తుపాదము నారాయణరెడ్డి. చెల్లెలు సుగుణమ్మ. అశ్వత్తరెడ్డి గారు తన ఊరిలోనే క్రీస్తు సువార్త ప్రకటిస్తూ కొంతకాలానికి ఆయన 1998 సం॥లో (ప్రభువునందు నిద్రించారు.
ఆ తరువాత శ్రీ వై.యస్. చిన్న కొండారెడ్డి గారితో థామస్‌రెడ్డి అయిన నేను పులివెందులలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. నన్ను ఎన్నో (గ్రామాలకు సువార్త ప్రకటనకు తీసికెళ్ళేవారు. సమయాన్ని సద్వినియోగంచేస్తూ వారితో దేవుని గురించి మరెన్నో విషయాలు తెలుసుకున్నాను. వారితో సువార్త సేవ చేయుటం నాకెంతో ఆశీర్వాదకరంగా ఉండేది.
మా గ్రామములో చర్చికోసం కొంత స్థలం కేటాయించి, ఆలయం నిర్మాణం దొరలకాలంలో కట్టడం జరిగింది. ఈ ఆలయం కొంతకాలనికి దెబ్బతినడం వల్ల శ్రీ వై.యస్. చిన్న కొండారెడ్డి గారి రెండవ కుమారుడు శ్రీ వై.యస్. ప్రకాశ్ రెడ్డి గారు ఆలయ మంతటిని బాగుచేయించారు.
థామస్ రెడ్డి Pr పేదల పాలిటి పెన్నిధి వల్లెపు నాగప్ప కాంట్రాక్టర్, పులివెందుల. రాజశ్రీ Sud వై.యస్.సి. కొండారెడ్డి గారితో నాకున్న పరిచయం తెలియచేయుటకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే వారింట్లో నేను కూడా ఫ్యామిలీ మెంబరుగా ఎంతో శ అవినాభావ సంబంధంగా ఉన్నాను. కొండారెడ్డిగారు మంచి కాంట్రాక్టరు. ఆ రోజుల్లో నేను పులివెందుల్లో చాలా మంది కాంట్రాక్టర్ల దగ్గర పని చేసినాను. అందరి మనస్తత్వం వేరు, కొండారెడ్డి గారి మనస్తత్వం వేరు. ఎందుకంటే కదిరి మలుపుల్లో పని చేసేటప్పుడు వీరితోపాటు ఇంకా ఇద్దరు భాగస్తులు ఉండేవారు. ఆ పనిలో మేము సైడు గోడ కట్టుటకు యూనిట్ రేటుకు తీసుకొని పని చేస్తుంటిమి. సహజంగా ఏ పని అయినా గుత్త రేటుకు తీసుకుంటే పనిని బాగా స్పీడుగా చేస్తారు. ఆ పద్దతిలో మేము పనిని బాగా వేగంగా చేస్తు ఎక్కువ మోతాదులో పని చేస్తుంటే రోజు కూలి బాగా గిట్టుబాటు అవుతుండేది. ఆ సమయంలో వాళ్ళ భాగస్తులు 'పేమెంటు రోజున కొండారెడ్డి గారితో వీరికి పని బాగా జరుగుతుంది. రోజు కూలి కంటే డబుల్ కూలి పడుతున్నది, ఏదో ఒకటి చెప్పి రోజు కూలి కట్టించు అని చెప్పగా, లేదప్పా వద్దు అని వారిని వారించి, మనం చెప్పిన రేటు ప్రకారం చెల్లించాలి, అలాగైతే మన పనులు సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు రోజు కూలి ఇస్తామంటే పనులకు రారు అని మాకు గుత్త రేటు ప్రకారం మెజర్మెంట్సు తీసుకొని అదే రేటు (ప్రకారం మాకు డబ్బులు చెల్లించినారు. అందుకు మాకు చాలా సంతోషం వేసి కంట్రాక్టరు అంటే కొండారెడ్డి గారే అని పొగడుకున్నాము. మేము కూడా కొండారెడ్డి గారు ఎప్పుడు పని చెబుతారా అని ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే ప్రతి గురువారం పులివెందులలో సంత జరుగుతుంది. ఆ రోజు ప్రతి కాంట్రాక్టరు పని వాళ్ళకు పేమెంటు ఇవ్వాలి. కొండారెడ్డి గారు మాకు పేమెంట్ ఇచ్చేదానికి మా కోసం ఎదురుచూసేవారు. ఒక రోజు ఇంటి దగ్గర పని ఉండి ఆలస్యంగా పేమెంట్ కోసం వెళ్లా- ఆ సమయంలో కొండారెడ్డి గారు ఏం నాగప్పా, ఇంత ఆలస్యం. మీ కోసం ఎదురుచూస్తున్నా ఉదయాన్నే వచ్చి డబ్బు తీసుకొని వెళ్లి సంతచూసుకొని ఇంటికి పోయి పిల్లా పాపలతో సంతోషంగా వారానికి ఒకసారైనా ఉండొచ్చు కదా అన్న మాటలు ఇప్పటికీ ఒక్క రోజైనా నాకు గుర్తుంది. ఆ కాలంలో అలా పేమెంట్లు ఉండేవి. ఈ రోజుల్లో కొంతమంది కాంట్రాక్టర్లు తప్పుడు మెజర్మెంట్లు తీసి, ఇచ్చే పేమెంట్‌లో “ఈ రోజు డబ్బు సర్దుబాటు కాలేదు, ఈ డబ్బుతో SHWE’, తరువాత చూస్తా” అని చెబుతున్నారు. “ఇది సత్యం” తరువాత కొండారెడ్డి గారిలో అతి ముఖ్యమైన విషయం ఏమంటే - మేము పని చేసే సైటులో గానీ ఇంటి దగ్గర కానీ ఎప్పుడూ “ఒరే” అని ఏనాడు పిలువలేదు. (ప్రతి విషయంలోను “ఏమప్పా” అనో లేక పేరు పెట్టి గానీ పిలిచేవారు. మరొక్క విషయం ఏమిటంటే - సాధారణంగా ఏ కాంట్రాక్టరు అయినా ఒక పని చేసేటప్పుడు (గవర్చమెంటు పని) ఈ రోజుల్లో కూలీలకు కొన్ని సూచనలు ఇస్తారు. అవి ఏమంటే (ఉదాహరణకు) చూడయ్యా, నీవు చేసే ఈ పని 4 యూనిట్లు వస్తుంది. 2 బస్తాల సిమెంటుతో అయిపోవాలి. బాండు రాల్లు పెట్టినట్లుగా అటువైపు, ఇటువైపు గుర్తులు పెట్టు అని చెప్పి మరీ ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుత కాంట్రాక్టర్లు మేము ఆ రోజుల్లో కొండారెడ్డి గారి దగ్గర పని చేసేటప్పుడు అలాంటి సూచనలు ఎప్పుడూ మాకు చెప్పలేదు. ఆఫీసర్లు కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టకుండా ఉండేవారు. ఎందుకంటే మేము కూడా ఏ విషయంలో కూడా రాజీ లేకుండా పని చేస్తుండేవారము.
జమ్మలమడుగు ఏటిలో కాజ్వే పని జరుగుతున్నప్పుడు - ఈ పని చాలా దృఢంగా ఉండాలి నాగప్పా, ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువ ఉధృతంగా వస్తుంది. భవిష్యత్తులో ఏమైనా జరిగితే మనకు చెడ్డపేరు వస్తుంది. క్వాలిటీ ఏ మాత్రం తగ్గకుండా చూడండని మాకు పదే పదే చెప్పేవారు. ఇక వేముల కొత్తపల్లె దగ్గర చెరువు పని చేస్తుండేవారము. కొండారెడ్డి గారు పని దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి పనులు ప్రభుత్వం వారు మన జిల్లాలో నాలుగు పనులు మంజూరు చేసినారు. అన్ని పనుల కంటే మన పని ముందుగా అయిపోవాలి అని ఒత్తిడి తెచ్చేవారు. మేము కూడా చాలా వేగంగా పని నడిపించి మిగతా చోట్ల పనులు 25% ఉండగానే చెరువు పని పూర్తిచేయడం జరిగింది. అందుకు కొండారెడ్డి గారు బాగా సంతోషించి - మీ బ్యాచ్ బాగా పని చేసి నా మాట నిలబెట్టారు నాగప్పా” అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏది ఏమైనా కొండారెడ్డి గారు అంకురిత దీక్షాపరులు. ఏ పని దగ్గరకైనా ఎంత దూరమైనా సైకిల్లో ప్రయాణించేవారు. కుటుంబ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డ వ్యక్తి, ఎంతో సౌమ్యుడు. ఆయన పడ్డ కష్టం నాకు బాగా తెలుసు.
తన తండ్రి Susu వెంకటరెడ్డి గారిని సైకిల్లో ఎక్కించుకొని బలపనూరు నుంచి వేంపల్లి పని వద్దకు వచ్చి తన తండ్రిని పని దగ్గర వదిలేవారు. అటునుంచి మళ్ళీ కూలీల కొరకు వేరే పల్లెకు పోయి వచ్చి సాయంత్రం బలపనూరుకు ఇద్దరు వెళ్లేవారు. ఇకపోతే ఈయన యేసుక్రీస్తును ఎంతో నమ్మేవారు. చర్చికి ఎప్పుడూ కాలి నడకన వెళ్ళేవారు. మాతో అనేవారు - దేవుడు గొప్పవాడు, ఆయనకు మనం కట్టుబడి ఉండాలి, (ప్రతి విషయంలోను దేవుణ్ణి అనుగ్రహం ఉంటుంది. మీరంతా బాగా దేవున్ని నమ్ముకొనండి అని చెబుతుండేవారు. దేవుడు ఎప్పటికైనా మనకు సహాయం చేస్తాడు అని ప్రభువును బాగా నమ్ముకొన్న వ్యక్తి. ఆయన ప్రతి రోజు ప్రభుని ప్రార్థించి అందరూ క్షేమంగా ఉండాలి మంచి ప్రవర్తనతో మెలగాలి. మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని, ప్రార్ధించేవారు.
కుటుంబసభ్యులు తన కుమారులు, కుమార్తెలు గురించి :- నా కుమారులు, బాగా చదివి పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వాలని ఆయన అంటుండేవారు. (ప్రస్తుతం డాక్టరుగా ఉన్న సుగుణమ్మ గార్కి క్రీ శే! మాజీ ముఖ్యమంత్రి డా! వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారికి యం. బి. బి.యస్. సీట్ల కొరకు నేను, వైయస్. రాజారెడ్డి గారు బళ్లారికి వెళ్ళాము. అక్కడ గుల్బర్గా మెడికల్ కాలేజికి సంబంధించిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఇద్దరికి యం.బి.బి.యస్. సీట్లు ఖాయం చేసుకొని పులివెందుల వచ్చి కొండారెడ్డి గారికి చెప్పగా, ఆయన ఎంతో సంతోషపడి - “నా మీసం నిలబెట్టిందిరా సుగుణమ్మ అన్న మాటలు నా మదిలో మెదులుతుంటాయి. ఏది ఏమైనా కుటుంబ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి మన కొండారెడ్డి గారు.
ఇక బీదా సాదా గురించి :- ఎవరైనా పేదవారు వచ్చి, అయ్యా - మా అబ్బాయి చదువులకు డబ్బులేక ఇబ్బంది పడుచున్నాము. ఏదో తమరు ఏమైనా సహాయం చేయండి అని వచ్చిన వారిని ఖాళీ చేతులతో వెళ్లని దృశ్యాలు చూచి నాకు కూడా సంతోషమయ్యేది. మా ఊర్లో మా దగ్గర బంధువు వెంకటనాగులు అనే అతని తండ్రి కొండారెడ్డి గారి పనులు చేస్తుండేవారు. వెంకటనాగులు డిగ్రీ కంప్లీట్ చేసి పి.జి. కోర్సు వెళ్లేందుకు డబ్బులేక కొండారెడ్డి గారిని కలిసి విషయం చెప్పగా - “ఏం పరవాలేదు, నేను సహాయం చేస్తా, పి.జి. కోర్సు చెయ్యమని ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం చేయగా” ఆయన (వెంకటనాగులు) ఇప్పుడు జూనియర్ కాలేజి ప్రిన్సిపల్ గా రిటైర్డ్ అయ్యాడు. ఇలా చాలామంది పేద విద్యార్థులకు సహాయం చేస్తుండేవారు.
దేవునికి భయపడేవారు
యం. గంగిరెడ్డి పులివెందుల
నాకు ఇప్పుడు 79 సం॥రాల వయస్సు. 10 సం॥రాల వయస్సులో కొనిరెడ్డిపల్లెలో ఉన్నాను. 8s చిన్న _ కొండారెడ్డిగారు వారి తండ్రి వెంకటరెడ్డిగారి కోరిక ప్రకారం
కొనిరెడివల్లెనుండి బలపనూరులోని వారి ఇంటికి
తీసుకెళ్ళారు. అప్పటినుండి వారి మరణ పర్యంతం వారి ఇంట్లోనే ఉన్నాను. మరణించే సమయాన నేను, ఆయన బావమరిది చెన్హారెడ్డిగారు కలిసి ఉన్నాము. చనిపోయిన తరువాత కొండారెడ్డి కుమారుడైన శ్రీ వై.యస్. ప్రకాశ్ రెడ్డి గారి మైన్సులో Dr పనిచేశాను. కొన్ని సంవత్సరాల తరువాత వృద్ధాప్యము వలన పని చాలించాను. దాదాపు 58 సం॥రాలు వారి కుటుంబముతో సంబంధముంది. వారు నన్ను కుటుంబ సభ్యులలో ఒకరిగా చూసారు.
వెంకటరెడ్డిగారు జీవించిన కాలంలో 1950 సం॥లో వారు విడిపోయేంత వరకు వారిది ఉమ్మడి కుటుంబం, చాలా పెద్ద కుటుంబం. పులివెందులలో, బలపనూరులో వీరికి ఆస్తులున్నాయి. Sus వెంకటరెడ్డి గారి మొదటిభార్య కుమారుడు చిన్న కొండారెడ్డిగారిని, ఆయన (వై.యస్. వెంకటరెడ్డి గారి) రెండవ arts Sdn మంగమ్మగారు పెంచి పెద్దచేసారు. ఆమె తన స్వంత బంధువులలోనే చిన్న కొండారెడ్డిగారికి పెండ్లి చేసింది.
చిన్నకొండారెడ్డిగారు తన తండ్రికి కాంట్రాక్టు పనుల్లో, ఇంటిపనుల్లో, చేదోడుగా ఉంటూ కుటుంబాన్ని నడిపించారు. కొండారెడ్డి గారికి సంతానం ఎక్కువే!
ఆ సంతానమే తన ఆస్తి అనేవారు!
