సత్య సాక్షి – భాగము 3 (పుటలు 35–44)
వీరి దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ఆరుగురు కుమారులు, ఐదుమంది కుమార్తెలను అనుగ్రహించారు. వారి సంతాన క్రమము
కుమారులు - కుమార్తెలు 1. సుశీల 2. వేదమణి 8. ఆనంద్‌రెడ్డి 4. ప్రకాశ్‌రెడ్డి 5. ప్రతాప్‌రెడ్డి 6. సుగుణ 7. సులోచన 8. శ్యామల 9. భాస్కర్ రెడ్డి 10. మనోహరరెడ్డి 11. జోసఫ్ రెడ్డి.
చిన్న కొండారెడ్డిగారి భార్య రాజమ్మగారు పూర్తిగా నిరక్షరాస్యులైనప్పటికీ, కుటుంబాన్ని ఎంతో నేర్పుతో, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టేవిధంగా నడిపిస్తూ, భర్తకు అన్ని పరిస్థితుల్లో సహచరణిగా ఉంటూ, పిల్లలందర్చీ ఎంతో సంస్కార వంతులుగా, ఆధ్యాత్మికమైన వాతావరణంలో విద్యావంతులుగా, (ప్రయోజకులుగా పెంచి పెద్దచేశారు. తల్లి పెంపకమే తన బిడ్డలకు గొప్ప ఆశీర్వాదంగా పరిణమించింది. కుటుంబంలో కష్టాలు వాటిల్లినప్పుడు కలత చెందకుండా దేవుడిచ్చిన ధైర్యంతో కుటుంబ పురోగతికి సహాయకురాలై నిలిచింది. అలా 1949 సం॥ వరకు ఉమ్మడి కుటుంబంగా తమ స్వంత వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేసుకుంటూ సాగిపోయారు.
కాంట్రాక్టర్‌గా చిన్నకొండారెడ్డి గారు
వీరి తండి వెంకటరెడ్డిగారు అప్పటికే గొప్ప పేరు కల్గిన కాంట్రాక్టరుగా ఆయా (ప్రాంతాలలో నిర్మాణపనులు జరిగించేవారు. తండ్రిగారితో కలిసి పనిలో మెళుకువలు, మంచి నైపుణ్యాన్ని చిన్న కొండారెడ్డి గారు సంపాదించారు. కాంట్రాక్ట్ పనులలో ఎంతో సమర్థవంతంగా నాణ్యతలో రాజీలేకుండా జరిగించారు. క్లాస్ 1 కాంట్రాక్టర్‌గా ప్రభుత్వ గుర్తింపును పొందారు.
తన కాంట్రాక్ట్ పనులన్నీ పర్యవేక్షించే అధికారులు చూడకపోయినప్పటికీ, దేవుని భయం కలిగి దేవుడు చూస్తున్నాడనే భావంతో ఎంతో నిజాయితీగా తన కివ్వబడిన కాంట్రాక్టు బాధ్యతలను స్పెసిఫికేషన్స్ ప్రకారం పూర్తి చేసేవారు. ధన లాభం కంటే గౌరవాభిమానాల కొరకు పనిచేస్తున్నాను అన్ని చెప్పేవారు.
తనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కాంట్రాక్టు రంగంలోనే ఊహించని సంక్షోభం ఎదుర్కోనవలసి వచ్చింది. ఆ కారణాన ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తంగా మారిపోయాయి.
చిన్న కొండారెడ్డిగారి జీవితంలో అత్యంత సంక్షోభాత్మక సమస్య ఆయనను మానసికంగా కృంగుదలకు లోనయ్యేటట్లు చేసింది. “కొండారెడ్డి ఒప్పుకున్న పని చేయలేకపోయాడు అనే అపఖ్యాతి నాకు రాకూడదు” అని ఆర్థికంగా కృంగిపోయినా, ఒప్పుకున్న పని కొనసాగించాడు. అందుకోసం అక్కడక్కడ కొంతమంది దగ్గర అప్పులు చేయాల్సివచ్చింది. ఫలితంగా చిన్న కొండారెడ్డి గారు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడ్డారు.
ఈలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారి కుమారులు ఈ సంక్షోభాన్ని ఒక సవాలుగా తీసుకొని ఎంతో కష్టపడి దేవుని కృపను బట్టి, తన పట్టుదల, శ్రమతో ఈ సమస్యల నుండి, ఆర్థిక సంక్షోభం నుండి నెమ్మది నెమ్మదిగా కుటుంబాన్ని గట్టెక్కించారు.
దేవునిపై వ్యక్తిగత విశ్వాసం
చిన్నకొండారెడ్డిగారు హైందవ కుటుంబంలో జన్మించినా, చిన్న తనమునుండి తండ్రిగారైన వెంకటరెడ్డిగారు నిష్టగల హైందవమత జీవితంలో నుండి యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా ఎంతో పరిశోధనాత్మకంగా తెలుసుకొని అంగీకరించిన విధానం చిన్నకొండారెడ్డిగారి జీవితంపై బలమైన (ప్రభావాన్ని చూపింది. వీరి వివాహ అనంతరం భార్య రాజమ్మ(అచ్చెమ్మ గారు) హైందవ కుటుంబం నుండి వచ్చినప్పటికీ క్రీస్తునందు విశ్వాసం గల మంచి గృహజీవితానికి దోహదపడింది.
కాంట్రాక్టరుగా వీరు ఎంత పనిభారం కలిగివున్నా బైబిలు చదవడం, ప్రార్థించడం, ఆదివారం క్రమం తప్పకుండా కుటుంబమంతా కలిసి సి.యస్.ఐ. చర్చి పులివెందులకు ఆరాధనకు వెళ్ళేవారు. దేవుని ఆలయం నిర్మాణం
పులివెందులలో మొట్టమొదటి క్రైస్తవ దేవాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటికీ కొన్ని ఆర్థిక కొరతలు కారణంగా అసంపూర్ణంగా ఉన్నప్పుడు అప్పటి సంఘగురువు రెవ. యాడికి సత్యాజోసఫ్గారు దేవాలయ నిర్మాణం పూర్తిచేయడానికి అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని లండన్ మిషన్ సొసైటి నుండి తెప్పించి, మంచి పేరు కలిగిన కాంట్రాక్టురుగా ఉన్న వై.యస్. చిన్న కొండారెడ్డి గారికి ఆ రోజుల్లో 2,000 Suen ఇచ్చి ఆలయ నిర్మాణపు పనులు పూర్తిచేయాలని ఓ బాధ్యత అప్పగించారు.
చిన్నకొండారెడ్డిగారు. ఆ బాధ్యతను ఎంతో సంతోషంతో స్వీకరించి ఆలయ కప్పునకు అవసరమైన కలపదూలముల కోసం బలార్షా ప్రాంతానికి వారే స్వయంగా వెళ్ళి మేలైన, నాణ్యతలో ఉన్న కలప దూలములను అంత దూరము నుండి తీసుకొచ్చి త్వరిత గతిన ఆ ఆలయ నిర్మాణమును పూర్తిచేసి తనకిచ్చిన 2,000 రూ.లలో కేవలం 1500 రూ॥లకే పనంతా పూర్తిచేసి మిగిలిన 500 Gruen రెవ.యాడికి సత్య జోసఫ్ అయ్యగారికి
క. యస్: a. pols చర్, ప్రూజితెందుల
నమ్మకంగా అప్ప చెప్పడం జరిగింది. అయనకు అప్పగించిన Sodso బాధ్యతలను ఎంతో అంకిత భావంతో, దేవుని పట్ల వారికున్న
ఆరాధన భావంతో, నమ్మకంగా వ్యవహరించిన ఒక మంచి క్రైస్తవ
విశ్వాసి.
వాక్య పఠన
పరిశుద్ధ గ్రంథ పఠన వీరికెంతో ఇష్టం. వాక్యాన్ని బాగా చదివి, అర్థం చేసుకున్న తరువాత సంఘ ఆరాధనలో సైతం ఎంతో చక్కగా బోధించేవారు. నెమ్మదిగా ప్రతి ఆదివారం వీరు కొంత సేపు సంఘంలో వాక్య పరిచర్య చేసేవారు. వయస్సులో పెద్దవారైనా, దేవుని మందిరంలో ఎంతో తగ్గించుకుని సంఘములో అందరితోపాటు క్రింద కూర్చొని సంఘ ఆరాధనలో పాల్గొనేవారు.
కాంట్రాక్టు పనులు, వ్యాపారాలు, వ్యవసాయం, ఫ్యాక్టరీ తన కుమారులు చూచుకునే స్థాయికి వచ్చినపుడు వీరు పూర్తిగా దేవుని సేవకే తన జీవితాన్ని అంకితం చేసుకుని దైవచింతనలో ఎక్కువ సమయం గడిపేవారు. సువార్త ఎడల ఎంతో ఆసక్తి, అపేక్ష కలిగిన వారుగా ఎన్నో (గ్రామాలు తిరిగి అనేక (ప్రాంతాలలో బహిరంగముగా తన జీవిత సాక్ష్యాన్ని నిర్మొహమాటంగా తెలియజేస్తూ క్రీస్తు సువార్తను ప్రకటించారు. వీరు ప్రతి ఆదివారం ఎదో ఒక గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించేవారు. ఈ నేపథ్యంలో వీరు మడూరు, బలపనూరు, ఎద్దులయేనె, బెస్తవారి పల్లె (గ్రామాలు ఎక్కువ వెళ్ళేవారు. పులివెందుల పట్టణ ప్రధాన కూడలిలో నిలబడి తాను ఏ విధంగా సత్యదేవుడైన యేసుక్రీస్తును తెలుసుకున్నారనే విషయం, తన జీవితంలో ఆయా పరిస్థితులలో, కష్టాలలో (ప్రభువు ఏ విధంగా సహాయం చేసారో ఓ సాక్ష్యరూపములో బహిరంగంగా అందరి ఎదుట నిర్భయంగా ప్రకటించిన వ్యక్తి.
దైవజనులకు, దైవపరిచర్యకు ఆర్థిక సహాయం చేయడంలో ఎంతో (86 కనపరిచేవారు.
రాజకీయ జీవితం - సమాజసేవ
మొదటినుండి పులివెందుల ప్రాంతంలో వై.యస్. కుటుంబాలకు గొప్ప రాజకీయ చరిత్ర వుంది. వీరికున్న రాజకీయ అనుభవం, సామాజిక స్పృహ, నాయకత్వపు లక్షణాలు, వీరి సహజ విలక్షణం. ప్రజలకు అత్యంత చేరువై ప్రజలందరితో మమేకమై ఉండేవారు, ప్రజాసేవయే పరమావధిగా భావిస్తూ, మంచి రాజకీయ చరిత్ర SOS కుటుంబము నుండి వచ్చిన వై.యస్. చిన్న కొండారెడ్డిగారు 1966 సం॥ పులివెందుల పంచాయితీ ఎన్నికలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంచాయితీ ైసిడెంట్గా 1966-1971 సం॥రముల వరకు తన పదవీకాలన్నీ ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు.
అక్కరలో ఉన్నవారికి శక్తివంచన లేకుండా సాయపడేవారు. వారు చేసే ఏ సహాయమైనా వేరొకరికి తెలియకుండా గోప్యంగా చేసేవారు. ఎన్నో కుటుంబాలను నిలబెట్టారు. ఎందరో జీవితాలకు ఓ దారి చూపిన ధర్మశీలి. ఎంతో మందికి చదువులు చెప్పించారు. వివాహాలు చేసారు. వీరి సహాయం పొందినవారు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈనాటికి చిన్న కొండారెడ్డి గారు చేసిన సహాయాలను ఎంతో కృతజ్ఞతాభావంతో జ్ఞాపకం చేసుకుంటున్నవారు ఎందరో ఉన్నారంటే అతిశయోక్తికాదు.
వృద్ధాప్యం - చివరి రోజులు
వయసు పైబడే కొద్ది వ్యాపార, కుటుంబ బాధ్యతలు నెమ్మదిగా తన కొడుకులకే అప్పచెప్పి, 1979 సం॥లో కుమార్తెలకు, కుమారులకు భాగపరిష్కారాలు చేసారు. 1980 సం!నుండి తన చిన్న కుమారుడైన జోసఫ్ రెడ్డి గారి ఇంటిలోనే ఉంటూ వచ్చారు. వ్యవసాయంలో చిన్న కొడుకుకు తోడుగా ఉండాలని అక్కడే తన జీవిత చివరి కాలమంతా గడిపారు.
టెలిఫోను ద్వారా బిడ్డల క్షేమ సమాచారాలు, యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారు. తనకు శక్తి ఉన్నంత వరకూ క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూండేవారు.
చివరికి 1998 నవంబర్ 14 వ తేదీన తన తుదిశ్వాస విడిచి నిత్య విశ్రాంతిలోకి ప్రభువు నందు నిద్రించారు. ఒక మహోన్నత విలువలతో నిండిన వీరి జీవితం క్రమశిక్షణతో కూడిన వీరి అనుభవాలు అనేకమందికి ఆదర్శం, అసమానం, దేవునికి స్తోత్రం!!!
రెన, dak నరప్రుసాద్ CRY
(శమభారంతో కృంగిన మనసా సిలువక్రింద చితికిన మనసా, తెలుసుకో నీ అపార నష్టమే నీ అంతులేనిలాభం, త్యాగమే నీ (బ్రతుకున తరగని నిధి ఎకరాలనిందా SPS పూలన్నీ కలివితే ఒకటీ రెండు చుక్కల వరిమళమవుతుంది.
తండ్రిని గూర్చి... వై.యస్. ప్రకాశ్ రెడ్డి పులివెందుల నా పేరు ప్రకాశ్ రెడ్డి మా కుటుంబములో నేను ఆరవ సంతానం. ఇప్పుడున్న వారిలో నాల్గవ వాణ్ణి. కుమారులలో రెండవ సంతానం. మా అన్న ఆనంద్ రెడ్డిగారికి నాకు మధ్య ఇంకొక అన్న ఉండేవారు. నాకు ఊహ తెలియక ముందే వారు మరణించారని తెలుసుకున్నాను. మా నాన్న గారు మా పుట్టిన రోజుల వివరములలో రాసినట్లుగా పెద్ద కుమారుడు ఆనందరెడ్డి. రెండవకుమారుడు ప్రకాశ్‌రెడ్డి, మూడవ కుమారుడు జోసఫ్ రెడ్డి. రెండవ కుమారుడు ప్రకాశ్‌రెడ్డి మరణానంతరం నా పేరును ప్రకాశ్ రెడ్డిగానే ఉంచారని రికార్డులు వల్ల
(
తెలుసుకున్నాను.
పేరుకు నేను రెండవకుమారుణ్ణి అయినప్పటికీ, అన్నయ్య ఆనంద్‌రెడ్డి వివాహం అయిన తర్వాత హైదరాబాద్‌లో ఉండటం వలన, నేను పెద్దవాడిగా అన్ని విషయాలు ఇంటి దగ్గర చూస్తూ ఉన్నాను. నాకంటే వయసులో పెద్దవారు ఉన్నా పెద్దరికం నేను అలవర్చుకున్నాను. అది కేవలం మా తండ్రి గారి ఆశీస్సులు మరియు దేవుని కృపగానే భావిస్తాను. నాకు అందరి దగ్గర ఎక్కువ చనువు ఉండేది. ఎవరికి ఏ అవసరం వచ్చినా నా దగ్గరకు వచ్చేవారు. అలా నన్నెంతో గౌరవిస్తూ ఉండేవారు. అన్నదమ్ములలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరం ఒకే మాటమీద ఉండే వాళ్ళం. అన్న ఎప్పుడు వచ్చినా అందరిని వ్యక్తిగతంగా వచ్చి పలకరించేవారు. మేము హైదరాబాద్ వెళ్ళినా అలాగే వెళ్ళే వాళ్లము.
1973 Son అక్టోబర్ నెలలో రేణుగుంటనుండి బాలపల్లె రైల్వే కాంట్రాక్టుకు మూడు - టెండర్లకు ఆహ్వానం వచ్చింది. అందులో మొదటిది, మూడవది మాకు వచ్చాయి. “వైయస్సి కొండారెడ్డి & కంపెనీ” పేరు మీద టెండర్లు వచ్చాయి. రెండవది అనంతపురం కాంట్రాక్టరు హంపిరెడ్డిగారు ప్రారంభించారు. అనుకోకుండా 1974సం॥ ఏప్రిల్ నెలలో డీజిల్, పెట్రోల్, లారీ విడిభాగాలు రేట్లు విపరీతంగా పెరగడం వలన, కొన్ని లారీలు సరిగా పనిచేయనందున, కూలీల రేట్లు పెరగడం వలన పనిలో నష్టం రావడం మొదలైంది. 1974 So ఆఖరుకు మొదటి దశ పని పూర్తి చేయగలిగాము. అప్పటికీ పెట్టుబడులు పోయి పనిలో విపరీతంగా నష్టం రావడం వలన మూడవ రీచీ పనులు నిలిపి వేయాల్సిన పరిస్థితి కనబడింది. పని విడిచి పెట్టినట్లయితే 20,000 Gr/- డిపాజిట్టు మాత్రమే పోతుంది, లేని యెడల రోజూ 2 లేక 8 వేలు అదనంగా నష్టపోవలసి వస్తుందని చెప్పినారు. పనులు నిలిపివేస్తే 20,000 రూ/- డిపాజిట్ ఇవ్వరు.
ఆ పని కొనసాగిస్తే రోజుకు 2 వేలు నుండి 3 వేల రూపాయల వరకు నష్టంతో పని చేయాల్సివస్తుందని నాన్నగారి తెలియజేసి పని ఆపేద్దాం అని అడిగాము. అప్పుడు ఆయన మనం సంపాదించినదంతా కాంట్రాక్టులోనే గనుక అంతా పోయినా పర్వాలేదు, కొండారెడ్డి పని వదలిపెట్టి పారిపోయాడనే చెడ్డపేరు మనకు రాకుండా చూడండని మాకు చెప్పారు. అప్పుడు వారి మాట ప్రకారం పనులు ప్రారంభించాము. ఆ సమయంలో మా చిన్చాన్నగారు కోడూరులో ముగ్గురాయి పనులు చేస్తుండేవారు. అప్పుడప్పుడు బట్వాడాలకు డబ్బు అడిగినప్పుడల్లా సహాయం చేస్తుండేవారు. బిల్లు వచ్చిన వెంటనే తిరిగి డబ్బు చెల్లించేవాళ్ళం.
ఇలా జరుగుతున్న సందర్భంలో రెండవ కాంట్రాక్టరు అప్పులు ఎక్కువ చేసి పనిలో నష్టం రావడం వలన ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత ఆ పనిని నెల్లూరు వాళ్ళు చేపట్టారు. 1976 Sou దివిసీమ వర్షాలు కారణంగా తుఫాను సమయంలో పనిలో అపారమైన నష్టం వాటిల్లింది. 1977 సం॥లో పోయిన నష్టం పూడ్చమని నాన్న గారు ఇంజనీర్లను అడిగారు, గాని వారు అందుకు సమ్మతించలేదు. కనీసం చేసిన పనికి బిల్లులు ఇవ్వమని అడిగినా పని పూర్తయ్యాకే చేస్తామని చెప్పడం వలన ఇన్స్పెక్చన్ మధ్యలో ఆఫీసర్స్‌తో విభేదించి వారితో ఓ ప్రాముఖ్యమైన మాట చెప్పారు- పనులు నిలిపివేస్తున్నామని చెప్పి సామానులతో మమ్ములను ఇంటికి రమ్మని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు నాన్చగారు వారితో అన్నమాట
"People came to know about the greatness of Jesus only after His Crucifiction" ఇంత చేసినా మీరు నన్ను అర్ధం చేసికోలేదని అన్నారు. అప్పుడు అక్కడున్న ఆఫీసర్లు అందరూ నా దగ్గరకు వచ్చి మీ నాన్నగారికి నచ్చ చెప్పి పనిని పూర్తిచేస్తే రెండు నెలల్లోగా మీ పేమెంట్ మొత్తం ఇప్పించే ఏర్పాటు చేస్తాము. ప్రస్తుతానికి కొంత పేమెంట్ ఇస్తామని నన్ను నాన్నగారి దగ్గరకు పంపారు.
నేను నానృగారిని ఒప్పించి బెంగుళూరు ఆఫీసుకు తీసికెళ్ళి సి.ఇ.గారితో రాజీ చేయించి పని పూర్తిచేసేటట్లు మాట్లాడాము. 1978 సం॥లో పనిని పూర్తిచేసి ఫైనల్ బిల్లు రాయించి ఇంటికి వచ్చేసాను. వచ్చాక రైల్వేమీద ఆర్బిట్రేషన్పోయి దాదాపు 6,00,000/- రూపాయలు ఆ రోజుల్లో రాబట్టగలిగాము. ఆ క్లిష్ట పరిస్థితులలో ఉన్న ఆస్తులు అమ్మవలసి వచ్చింది. ఆస్థిపరంగా విడిపోవడం
అస్థిపరంగా మా అన్నదమ్ములకు ఎప్పుడూ విభేదాలు లేవు. దయచేసి గమనించండి - మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ 1979 సం॥లో ఆస్తిపరంగా విడిపోయినాము. అలా జరగడం నాకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా అందరితో పాటు సర్దుకుపోయాను. విడిపోయినా నాన్నగారిని నా దగ్గర ఉండమని కోరాను. తమ్ముడు చిన్నవాడు, పొలాలు ఒక్కడే చూడలేడని, వేరే పనులు తను చేయలేడని నాన్నగారు తమ్ముని దగ్గరనే ఉంటానని అన్నారు. ఆ సమయంలో తన జరుగుబాటుకు ఏర్పాటు చేసితిమి. అందులోనుండి కొంత వాపసుచేస్తూ, ఆయన- తండ్రిగా నాకు ఒక బాధ్యతను గుర్తుచేశారు. మీరు దండిగా సంపాదించినప్పుడు నేను ఖర్చు చేయగలను, నా కొడుకులు ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను బ్యాంకులో డబ్బు దాచుకోవటం నాకు ఇష్టం లేదని అన్నారు.”
ఆ మాట విని నేను కన్నీళ్ళ పర్యంతం అయ్యాను. ఆ రోజునుండి ప్యాక్టరీ కట్టాలనే నిర్ణయానికి వచ్చి రేయింబగళ్ళు కష్టించాల్సి వచ్చింది. పిల్లలు ఎదిగారు, చదువులో కొనసాగుతుండగా స్వంతగా కాంట్రాక్టుపనులు, రైల్వే కేసులు అన్ని చూసుకోడానికి సమయం సరిపోయేదికాదు. బైబిలు చదవడం క్రమంగా తగ్గింది. పాటలుమాత్రం నిద్రవచ్చేవరకు పాడుకునేవాణ్ణి. నా భార్యమాత్రం నిత్యం ప్రార్థనలో గడుపుతూ దేవునిపట్ల నమ్మకంగా కొనసాగేవారు.
కొన్ని సందర్భాలలో విసుకు కలిగి నా ముఖ్యమైన స్నేహితులతో నా భక్తి జీవితం గురించి ప్రస్తావించినప్పుడు వారు ఆ సందర్భంలో నాతో చెప్పిన మాటలు నా కళ్ళు తెరిపించాయి. “ఆమె ప్రార్థనలవల్లె నీ ప్రయాణాలు, వ్యాపారాలు సంక్రమంగా జరుగుతున్నాయి. రాత్రిళ్ళు ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు జరగవచ్చు, అయినా నీకు ఏనాడూ ప్రమాదం జరుగలేదు, నీ బండికూడా ఎప్పుడూ చెడిపోలేదు అంటే ఆమె ప్రార్థనా శక్తివలనే అని నీవనుకోవచ్చు గదా” అని నాతో అన్నారు.
ఫ్యాక్టరీ ఫౌండేషన్ వేసే రోజు నాన్నగారు నాతో ఏమన్చారంటే - “నీవేమో మైన్స్, ఆఫీస్ అని బైట పనుల్లో తిరుగుతావు. పిల్లలేమో కాలేజీకి వెళుతుంటారు. ఫ్యాక్టరీలో ఎవరుంటారు? అని అడిగారు.
అప్పుడు నాన్చగారితో ఓ మాట చెప్పాను- మా నాన్న గారిని గూర్చి అందరూ ఒకప్పుడు - కొండారెడ్డి మిషనులో ఉన్హాడని చెప్పుకునేవారు. మరలా అలాంటి మాట నేను వినాలనే ఉద్దేశ్యంతో తప్పు, ఫ్యాక్టరీలో వ్యాపారం చెయ్యాలని కాదు- అని అన్చప్ప్రుడు, “ఇంత మొండితనం మంచిది కాదని అన్నారు.” ఇది ఇలా ఉండగా, ఫ్యాక్టరీలో లాభాలు రాలేదు. పెట్టుబడిలో రూ 20,000/- లు వాడుకున్నానని నాన్న గారు నాతో చెప్పినప్పుడు లాభం కోసం, వ్యాపారం కోసం కాదని ముందే చెప్పాను గదా అని అన్నాను. అప్పుడాయన చెప్పాల్సిన బాధ్యత నాకుంది అన్నారు.
గంగిరెడ్డి బావగారి హాస్పటల్ కన్స్ట్రక్షన్ సమయంలో కూడా చాలాసార్లు నా అభిప్రాయం కోసం వచ్చి అడిగారు. ఆయన నాకు ఇచ్చిన గౌరవం ఏ తండ్రీ తన బిడ్డలకు ఇచ్చి ఉండరని నా అభిప్రాయం.
కుటుంబంలో సాన్నిహిత్యం
కుటుంబమంతటిలో మా నాన్చగార్కి నాకు ఉన్న సాన్నిహిత్యం మిగతా ఎవ్వరితో లేదని నా అభిప్రాయము. వ్యాపార విషయాలలో ఓ తండ్రిగానే కాకుండా ఎంతో ఆప్యాయత కనబరిచే వారు. ఇద్దరం ఎన్ఫోసార్లు కఠినంగా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇద్దరం కలిసి ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికి మరుసటి నిమిషంలోనే ఒకరి మనస్సు ఒకరం విప్పి మాట్లాడుకోవడం అన్నింటికంటే ప్రాముఖ్యత సంతరించుకుంది.
కొన్ని సందర్భాలలో నన్ను చాలా మొండివాడనని అనేవారు. కొన్నిసార్లు నా దగ్గర వుంటే నెమ్మదిగా ఉందని అనేవారు. అలాంటి సందర్భాలలో నా అనుభూతి వర్ణించనలవికాని విధంగా ఉండేది.
ఏ తండ్రి అయినా తన కుమారునితో నీ దగ్గర నాకు మనశ్శాంతి ఉంది అని అంటారో అప్పుడే ఆ కుమారుని జన్మ సార్థకమవుతుంది. అలాంటప్పుడు ప్రాణం పోయినా బాధలేదనిపిస్తుంది. ఆ రోజున అన్ని సాధించాననే నమ్మకం కలిగింది.
1993 Xo జూలై నెల 18వ తేది సాయంత్రం 6 Koo సమయంలో కుటుంబ విషయంలో అన్నదమ్ములం ఆయన దగ్గరకు వెళ్ళి కఠినంగా మాట్లాడి, మనస్సు నొప్పించి అందరం మా ఇంటికి వచ్చేసాము. అప్పుడు నిదానంగా ఆలోచిస్తే ఆ రోజు ఆయన పుట్టిన రోజని గుర్తుకు వచ్చి, అందరం ఎంతో బాధపడి ఆ క్షణమే ఫోనులో క్షమించమని అడిగి ఉదయమే మీరు చెప్పినట్లు నడచుకుంటామని మేమంతా ఆయనకు మాట ఇచ్చాము.
మేము మాట్లాడుతున్న సమయంలో మా నాన్నగారి బాధను అప్పుడు ఆ పరిస్థితిలో మేము గమనించలేకపోయాము. 14వ తేది ఉదయం ఆయన దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడిగాము.
ఆ రోజు దాదాపు ఉదయం 10 No సమయంలో ఆఖరి తమ్ముడు జోసఫ్ రెడ్డి ఫోన్ చేసి నాన్చగార్మి ఊపిరితిత్తులనుండి నీరు తీసి చెక్చేస్తే రక్తము, చీము వచ్చిందని చాలా విచారముగా మాట్లాడి నప్పుడు నాకు ఏడ్చు ఆగలేదు. వెంటనే హాస్పటల్‌కు వెళ్ళాను. లేబ్లో రిపోర్టు ప్రకారం దాదాపు మధ్యాహ్నం 2 గం॥ల సమయాన, ఆయనకు క్యాన్సర్ అని రిజల్ట్ వచ్చింది.
డా॥ గంగిరెడ్డి బావగారి సలహా మేరకు హైదరాబాద్ వెళ్ళాము. 155 తేది మెడ్విన్ హాస్పటల్లో చేర్చించి, అక్కడ కీమో థెరపీ చేయించి 23 రోజుల తరువాత
