సత్య సాక్షి – భాగము 7 (పుటలు 75–84)
శ్యామల వీరారెడ్డి
ఐదవ కుమార్తె-కడప
అరుణ, రవీంద్రారెడ్డి, శారద
ప్రకాశళ్రెడ్డి అన్న నన్ను నాన్న గారితో నీకున్న
అనుబంధం గూర్చి క్లుప్తంగా కొన్ని వాక్యాలు వ్రాయమన్నారు.
అది విన్న వెంటనే ఎన్నో జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. నాన్నను
ల్ల తలచుకుంటూ బాల్యంలోకి వెళ్ళిపోయాను. ఊహ తెల్సిన
నాటి నుండి మా పట్ల చూపిన ప్రేమానురాగాలు గుర్తు
కొచ్చాయి. ఎంతో క్రమబద్ధమైన జీవితం అలవర్చారు. తప్పు చేసినప్పుడు సున్నితమైన మాటలతో సరిదిద్దేవారు.
నా వివాహమునకు ముందు అమ్మను ఉదాహరణగా చెప్తూ కుటుంబములో స్రీ ఏ విధమైన బాధ్యత కల్లియుండవలసినది మరియు ఏ లోటును లోటుగా కాక
వై.యస్. చిన్నా కొండారెడ్డి గారి దంపతులు, ఎడమవైపు కుమార్తె శ్యామలా వీరారెడ్డి గారు, శ్రీమతి వై.యస్. పద్మావతి గారు, కుడివైపు ప్రకాష్ రెడ్డి గారి కుమార్తె మంజులా సర్వోత్తమ రెడ్డి
ర్4 జము. సనన్ ఉన్నదానిలో సర్దుకు పోయే నైజము కల్లియుండవలెనని తెలియపరిచే వారు. ఆ మాటలే ఇప్పుడు ఎటువంటి పరిస్థితి నైనా చక్కపరచుకునేందుకు దోహదం చేస్తున్నాయి. అలాగే అమ్మ ఇంటి వ్యవహారములలో కనుపరచిన ఓర్పు, సహనము, శాంతము, ఆదరణ మా వైవాహిక జీవితంలో ఎంతో స్ఫూర్తి నిచ్చాయి.
మా గృహప్రవేశం చేసిన సమయంలోను, మా పెద్దమ్మాయి వివాహ విషయంలోను, మా కుమారుడు పై చదువుల నిమిత్తము అమెరికా వెళ్లినప్పుడు నానృ్చగారు ప్రత్యేక ప్రార్థనలు చేసి మమ్ములను ఆశీర్వదించిన సందర్భములు DENYSE మరువలేనివి. నా భర్త ఎన్నో సందర్భాలలో నాన్న గారు తన తండ్రిని మరిపింప చేశారని అన్నారు. ఆ మాట నన్నెంతో సంతోషపరిచేది. నాన్న గారి వద్ద నుండి ఉత్తరాలు వస్తే ఎన్నోసార్లు చదువుకునే వాళ్ళము, అవి నందేశాత్మకంగా ఉండేవి. ఇలా నాన్న గారు ప్రభువునందు నిద్రించు వరకు ఎన్నెన్నో అనుభూతులు పొందియున్నాము. అవి ఎప్పటికి చెరిగిపోని జ్ఞాపకాలు.
ఈ సందర్భంగా బాల్యము నుండి నాన్న మాతో ఉన్నంత వరకు ఉన్న ప్రతి సందర్భాన్ని పూర్తిగా గుర్తు చేసుకునే అవకాశం కలిగించిన అన్న గారికి మా కృతజ్ఞతలు.
శ్యానుల వీరారెడ్డి, 11/0.వీరారెడ్డి రిటైర్డ్ జనరల్ మేనేజర్, కో-ఆపరేటివ్ బ్యాంక్ వై.యస్.భాస్కర్ రెడ్డి, oe డే నాల్లవ కుమారుడు-పులివెందుల
(1
మా నాన్న గారు చిన్నకొండారెడ్డి గారిని
గురించి కొన్ని సంగతులు మీతో పంచుకొనుచున్నాను. మా నాన్న గారి గురించి అందరికీ తెలుసు. కాబట్టి నేను కొడుకుగా ఎక్కువ చెప్పడము మంచిది కాదన్న ఉద్దేశ్యముతో నేను ప్రత్యక్షముగా చూసిన ఆయన ప్రార్థనా శక్తి గురించి కేవలము ఒక సంఘటన మాత్రమే చెప్పదలచుకున్నాను.
నాన్నగారు తన జీవితంలో ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడేవారు. (ప్రతివిషయంలోను దేవుని కృపమీద ఆధారపడమని మాకు నేర్పించేవారు.
మా చిన్నత్రనములో వర్షాకాలపు సెలవు దినాలలో నాన్న గారితో కలసి నేను, నా తమ్ముండ్లు కారులో హైదరాబాద్ నుండి పులివెందులకు ప్రయాణిస్తుండగా, రోడ్డు సరిగా లేక బురదలో ఇరుక్కుని మధ్యాహ్నాము భోజన సమయానికి జమ్మలమడుగు చేరవలసి వుండగా, చాలా ఆలస్యమై రాత్రి 11 Kone సమయములో చేరుకున్నాము. నాన్నగారు జమ్మలమడుగు మీదగా ఎక్కడికైనా ప్రయాణము చేస్తే తప్పకుండ మా మేనత్త డి. SH గారి ఇంటికి పోయేవారు. కాని ఆ రోజు రాత్రి చాలా ఆలస్యమైనందున మా మేనత్త గారిని ఇబ్బంది పెట్టకూడదని నేరుగా పులివెందులకు వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాము.
జమ్మలమడుగు సమీపములో ఉన్న పెన్నా కాజ్వే పైన నీరు ఉధృతంగా పారుచుండెను. BS ప్రకాష్ నీటి ప్రవాహము చూసి నాన్నగారితో కారు నీటిలో దింపడము (శ్రేయస్కరము కాదు అని చెప్పడం జరిగింది. కానీ నాన్నగారు - ఈ కాజ్వే కాంట్రాక్టు పని నేనే చేసినాను, నీరు ఎంత లోతు ఉంటుందో, ఎంత వేగము ప్రవహిస్తుందో నాకు తెలుసు అని క్రైవరును కారును దింపమని చెప్పినాడు. క్రైవరు WHIPS మాట కాదనలేక కారు డ్రైవ్ చేస్తూ, కాజ్వే మధ్యలోనికి పోయిన తరువాత సైలన్సర్ లోకి నీరు పోయి కారు ఆగిపోవడం జరిగింది. నన్ను స్టీరింగ్ దగ్గర కూర్చోమని నాన్నగారు, డ్రైవరు దిగి తొయ్యడం జరిగింది, కాని ఎక్కువ దూరము నెట్టలేకపోయారు.
నాన్నగారు కారులో కూర్చోని కొంత సేపు ప్రార్థన చేయడము జరిగింది. కీర్తన 41:1లో “ఆపృ్కత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు” అని సెలవిచ్చినట్లుగా దేవుని శక్తిని నమ్మి ప్రార్థన పూర్తి చేసిన తరువాత, కారు స్టార్ట్ చేసే ప్రయత్నము చేయగా దేవుని గొప్ప మహిమ, నాన్నగారి ప్రార్థనాశక్తితో కారు స్టార్ట్ అయి కాజ్వే నుంచి బయటకు రావడము జరిగింది. మామూలుగా పెట్రోలు కారు సైలెన్సర్ లోకి నీరు పోయిన తరువాత స్టార్టు కావడము అసాధ్యము. యెషయా 48:2లో దేవుడు వాగ్ధానము చేసినట్లుగా - “నీవు జలములలోబడి పోయినప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలోబడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్తిపారవు” అన్న అద్భుతకార్యాన్ని మా కన్నులారా చూచి ప్రభువును ఎంతగానో స్తుతించాము.
నేను వివరించిన ఈ సంఘటన ఒక్క ఉదాహరణ మాత్రమే. ఈ విధంగా ప్రార్ధన ద్వారా ఆయన దేవుని నుండి పొందిన అద్భుతమైన కార్యాలు నాన్నగారి జీవితంలో కోకొల్లలు గలవు.
చివరగా మా నాన్నగారు మమ్ములను చిన్న వయస్సు నుండి ఎంతో క్రమశిక్షణతో పెంచడము వల్ల, మాకు పెద్ద ఆస్తులు ఇవ్వలేకపోయినా ఆయన కున్న మంచి పేరుతోనే తాలూకా ప్రజలు మమ్ములను ఎంతో గౌరవిస్తున్నారు. మా అబ్బగారి (తాతగారి) సంతతిలో అందరు ఎంతో క్రమశిక్షణతో పెరిగినవారే. నా కంటూ మరుజన్మ ఉంటే ఇటువంటి తల్లిదండ్రులకే జన్మించాలని నా కోరిక,
వై.యస్.భాస్కర్ రెడ్డి
Pek
కలతలు మనల్ని కలవరపెడతాయి
కాని మన wien TOL Hoar
మనం పెద్ద (ప్రమాదంలో వడకుండా దేవుని HHS అడ్డుకుంటాయి.
క్రమ శిక్రణగల కెస్తవుడు య్య 6 వై.యస్. లక్షి, నాల్గవ కోడలు - పులివెందుల నౌ పేరు లక్ష్మి. నేను చిన్నకొండారెడ్డి గార్కి 4వ కోడలును. మా మామ గారి గురించి కొన్ని సంగతులు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన దేవునికి స్తోత్రం! మా మామ గారు క్రమశిక్షణ కలిగిన క్రైస్తవుడు. ప్రతిదినం ఉదయం 5 Kone ఒక పాట పాడి, బైబిలు చదివి ప్రార్ధన చేసుకొని తరువాత దినమును ప్రారంభించేవారు. ప్రతి రాత్రి కూడ భోజనం తరువాత కుటుంబమంతటితో కలిసి పాట పాడి, బైబిలు ఒక్కొక్క దినం ఒక్కొక్కరితో చదివించేవారు. తరువాత మా మామ గారే ప్రార్థన చేసేవారు. మా మామగారి దినచర్య ప్రార్థనతో ప్రారంభమై ప్రార్థనతో ముగిసేది. మా మామ గారు 1993 జూలై 14 నుండి నవంబరు 14 వరకు జబ్బుతో పడకలో ఉండినారు. జూలై 18వ తేది వరకు కూడ పొలం పనులు చేయించినారు. అప్పటికి ఆయన వయస్సు 80 సం॥లు. మా మామ గారి దగ్గరకు వచ్చే వాళ్లలో కొందరు ప్రార్థన చేసి వెళ్ళేవారు. మా నాన్న కూడా అదే సమయంలో హాస్పిటల్ లో జబ్బుతో పడకలో ఉండినారు. కాబట్టి నేను ఎక్కువగా మా మామను, నాన్నను చూడడానికి వెళ్ళేదానను. మా మామ గారు నన్ను ఆంధ్రక్రైస్తవ కీర్తనలలో ఆయనకు నచ్చిన పాట చెప్పి పాడమనేవారు. బైబిలు చదివించేవారు, ప్రార్ధన కూడా చేయించేవారు. ఒక దినాన నా అంతటి నేనే “స్తోత్రము చెల్లింతును - స్తుతి స్తోత్రం చెల్లింతుము” అనే పాట పాడినాను. ఆ పాట మా మామగారికి చాలా నచ్చింది. కమలాంటి, జయాంటి ఆ దినం సాయంత్రం వెళ్లినపుడు ఉదయం పాప పాడిన పాట చాలాబాగుందమ్మా, ఆ పాట పాడమని చెప్పినారని కమలాంటి చెప్పినారు. నాకు ఆ విధంగా ఆత్మీయంగా మా మధ్య దిన దినానికి అనుబంధం వృద్ధి చెందినది. నేను కూడ ఆత్మీయంగా బలం పొందినాను. మా మామ గార్మి ఇష్టమైన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 1. యేసు నన్ను ప్రేమించినావు - పాపినైన నన్ను ప్రేమించినావు. 2. ఘనమైన క్రీస్తు కృపను కనుగొంటినపుడు 3. సీయోను పాటలు పాడుచు సీయోను వెళ్ళెదము, 4. కరుణ పీఠము జేరరే నాన్న - మేరుపర్వతం అమ్మ - ధీరవనిత
వై.యస్. మనోహర రెడ్డి ఐదవ కుమారుడు - పులివెందుల
మా నాన్న గారితో నా అనుభవాలు పంచుకొనే ముందు, మాకు స్నేహం, ఆప్యాయత, (ప్రేమ పంచిన మా మాతృమూర్తి గురించి మొదటిగా చెప్పుకోవాలి. మా బాల్యం గురించి, మా భవిష్యత్తు గురించి, మా ఆలన, పాలన గురించి ఎంతో (శ్రమించే అమ్మను చూసి మాకు ఎప్పటికీ ఆనందంగా ఉంటుంది. మా ఆదర్శ కుటుంబంలో అమ్మ పాత్ర అజరామరము. ముఖ్యముగా మా అమ్మ నాపై కురిపించిన (ప్రేమ నేనెప్పటికీ మరువలేను. ఆ కాలంలోనే అంటరానితనాన్ని రూపుమాపాలని మాకు బోధించిన మహాసాద్వి, ఆచరించి చూపిన ధీరవనిత మా అమ్మ.
ఇక మా నాన్నగారి గురించి చెప్పాలంటే మేరు పర్వతము లాంటి వాడు, కష్టాలు, అవాంతరాలు ఎన్ని ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికి తాను బలైపోయినా మొక్కవోని విశ్వాసముతో ముందుకెళ్ళిన ధీరుడు మా నాన్న స్వచతకు, ఆత్మ విశ్వాసానికి, నాణ్యతకు, నమ్మకానికి పెట్టింది పేరు మానాన్న. అలాంటి నాన్నను పొందిన మా జీవితము చరితార్థము.
WATE గురించి పుస్తక ప్రచురణ చేయాలనే తలంపు మా అన్నగారికి కలిగి, అందులో మా అనుభవాలు కూడా కొన్ని జత చేయమని మా అన్న వై.యస్. ప్రకాశ్‌రెడ్డి గారు కోరినప్పుడు, నాన్నతో నా అనుభవాలు పంచుకొనే అవకాశం కలిగినందుకు నాలో కలిగిన సంతోషం వర్ణణాతీతం. నాన్న గురించి ఈ పుస్తకములో నా అనుభవాలు కొన్నైనా పంచుకొనేందుకు అవకాశం కలిగించిన మా అన్చగారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
నా మీద మా HPSS బాగా చదవగలనని గట్టి నమ్మకము ఉండేది. నన్ను యం.బి.బి.యస్. చదివించే ప్రయత్నము చేశారు. మా అన్న వై.యస్. ప్రకాశ్ రెడ్డి గారు కూడ నన్ను యం. బి.బి.యస్. లో చేర్పించాలని చాలా ప్రయత్నము చేశాడు. కానీ అప్పటి మా ఆర్థిక పరిస్థితి, మా చదువులను, పెళ్ళిలను శాసించాయి. నాన్న SOS నెరవేర్చలేక పోయాను. నాన్న మనసెరిగిన నేను ఎలాగైనా ఎప్పటికైనా, వా కుటుంబంలో నుంచి కనీనం ఒకరిశైన యం.బి.బి.యన్. చదివించాలనుకొన్నాను. నా చిన్నకుమారుడు వై.యస్. అరుణ్ కుమార్ రెడ్డి నాలోని తపనను, మా నానృగారి కోరికను నెరవేర్చగలిగినాడు.
నా బాల్యంలో నాన్న గారితో ఎక్కువగా పనుల వద్దకు వెళ్ళెడివాడిని, నాన్న గారు పనిలో దైవత్వము చూపేవారు. ఒకసారి ఒక్క నిర్ణయానికి వచ్చాక వెనక్కి తగ్గేవారు కాదు. నాన్న గారికి 1976-77లో రేణిగుంట - బాలపల్లెలో ఒక రైల్వే కాంట్రాక్టు పని వచ్చింది. మారిన పరిస్థితులవల్ల ధరలు తీవ్రముగా పెరగడము, డీజిల్ ధరలు దాదాపు రెండింతలు కావడము వల్ల ఆ కాంట్రాక్టులో విపరీతముగా నష్టమువచ్చే పరిస్థితి అని ముందే తెలిసినా ఇచ్చిన మాటకు కట్టుబడిన వాడైన మా నాన్న మా ఆస్థి మొత్తము అమ్మి బుణములను తీర్చుటకు వెనుకడుగు వేయలేదు. ఆ కాంట్రాక్టు పని జరుగుచుండగా ఒక రోజు నాకు జ్వరము వచ్చినది. ఆ రోజు ఉదయం కూలి వాండ్లను పనిలోకి పెట్టి నేను టిఫిన్ చేయడానికి రూములోనికి వచ్చాను. అప్పుడే అక్కడకు వచ్చిన నాన్న పనిమీద అశ్రద్ధ చూపించావని, రేపటి గురించి ఏర్పాట్లు చేయలేదని తీవ్రంగా మందలించారు. కాని నా జ్వరం తీవ్రత వల్ల మరుసటి రోజు కావలసిన ఇసుక, కంకరు విషయం గమనించలేక పోయాను. మరుసటి రోజు విషయము తెలుసుకున్న నాన్న పనివద్ద తీసుకొనవలసిన జాగ్రత్తలు, పని చేయించాల్సిన విధానం నాకు బాగా చెప్పారు. అప్పుడు నాకు చాలా సంతోషము అనిపించింది. మా నాన్న గారు నా భవిష్యత్తు కొరకు ఈ సలహాలను ఇచ్చారనిపించింది.
నేను 1979 ఏప్రిల్ నెలలో పులివెందులలో వర్కుషాపు పెట్టాను. (మొదట్లో నా నిర్ణయాన్ని మా నాన్నగారు ఒప్పుకోలేదు) నాన్నగారు, మా మామ సి.వి. సుబ్బారెడ్డి గారు చాలా బాగా సహకరించినారు. అయితే మా నాన్నకు నేను వర్కుషాపు పెట్టడం నచ్చలేదు. నన్ను వైద్యునిగా చూడాలన్నది నాన్నగారి కోరిక. నాన్నగారు మా వర్కుషాపు పనితీరును గమనించి నన్ను అభినందించారు. ఇంతమంది పనివారికి ఉపాధి కల్పించిన నువ్వు ఐ.టి.ఐ. ఒక స్కూలు పెట్టి పేదలకు ఉచితముగా విద్య నేర్పించమని కోరినారు. అప్పటి మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను నాన్న ప్రతిపాదనలను నిరాకరించాను.
అయితే కాలక్రమేణా నాన్నగారి మాటలు పదే పదే నాకు గుర్తుకు వచ్చేవి. అప్పటినుండి పేద పిల్లల చదువు కొరకు సహాయం చేయడం అలవాటుగా, బాధ్యతగా తీసుకొన్నాను.
నాన్న గారు తన కుటుంబం, తనవారి గురించే కాక ఇతరులను గురించి, వారి ఇబ్బందుల గురించి కూడా ఆలోచించేవారు, ఒకసారి మా నాన్న గారితో కలిసి ధర్మవరంనకు కారులో బయలుదేరాను. కదిరి ఘాట్‌లో మూడవ మలుపు వద్ద ఒక బండరాయి రోడ్డు మీద ఉండినది. ఆ కాలంలో లారీలు ఘాట్ రోడ్డులో సరిగ్గా ఎక్కలేక వాటిని టైర్ల క్రింద పెట్టుకొని ఘాట్‌ను ఎక్కించేవారు. వెంటనే నాన్న గారు క్రైవరును కారు ఆపమని చెప్పి, నన్ను దిగి ఆ రాయిని తొలగించమని చెప్పారు. అలాగే ఘాట్ మలుపులలో ఉన్న రాళ్ళను నాతో తీయించారు. ఆ రాత్ర్లవలన మా కారుకు ఎటువంటి ఆటంకము లేకున్నా ఇతరులకు ఆ రాళ్లతో సమస్య రాకూడదని దూరదృష్టితో ఆ పని నాతో చేయించారు. నాన్న గారి మనసెరిగిన నేను చాలా సంతోషపడ్డాను.
1998 జూలై నెలలో నాన్న గారికి అకస్మాత్తుగా ఆరోగ్యము క్షీణించింది. హైదరాబాదునకు తీసుకొని వచ్చారు. అప్పుడు నేను హైదరాబాదులోనే ఉన్నాను. ఆ రోజు “మెడ్విన్ హాస్పిటల్”లో నాన్చగారికి వీపు నుండి నీరు తీసేటప్పుడు ఆయన పడిన బాధ నేను చూడలేకపోయాను. ఇప్పుడు కూడా ఆ సంఘటన చాలాసార్లు గుర్తుకొస్తుంది.
నాకు ఇప్పుడు కూడా అనిపించేది ఒక్కటే - మా నాన్నగారు యేసుక్రీస్తును నమ్మి పదిమందికి యేసుక్రీస్తును గురించి గొప్పగా బోధించినప్పటికిని, ఆయనకు అలాంటి పరిస్థితి రావడము ఏమిటని? మా నాన్చగారు తరువాత పులివెందులకు వచ్చి ఇక్కడ గంగిరెడ్డి బావ, సుగుణక్క దగ్గర ట్రీట్మెంట్ తీసుకొంటూ, కొన్ని నెలల తరువాత అంటే 1998 నవంబరు 14వ తేదిన (ఆదివారం) పరమపదించి నారు. ఆ కొద్ది కాలములో మా నాన్న గారికి కొంతైనా సేవ చేసే భాగ్యము కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది.
మా అమ్మ నాన్నలకు ఎక్కువగా సేవ చేసే భాగ్యము నాకు కలుగలేదు. మా అమ్మ నాన్న మా తమ్ముడు దగ్గరే ఉండేవాళ్ళు. ఒకసారి వారిద్దరు మా ఇంటికి వచ్చి మేము ఇంక ఇక్కడే ఉంటామని అన్నారు. అమ్మ నాన్నకు సేవ చేసే భాగ్యము వచ్చిందని అనుకున్నాను. కాని ఆ మరుసటి రోజే వాళ్ళిద్దరు మళ్లీ మా తమ్ముని దగ్గరకు పోయినారు. అప్పుడు చాలా బాధపడ్డాను. కాని నా బాధ కంటే వాళ్ళ సంతోషమే ముఖ్యం కాబట్టి దాన్ని గురించి అంత ఎక్కువగా పట్టించుకోలేదు. అయితే మా తమ్ముడు అమ్మ నాన్నలను బాగా చూసుకునేవాడు. నిజంగా అమ్మ నాన్నలు నా దగ్గర ఉన్నా అంత బాగా చూసుకోలేనేమో అని అనిపించింది. ఇప్పుడు నాన్న చనిపోయిన తరువాత కూడా అమ్మ మా తమ్ముడు “జోసఫ్ రెడ్డి” దగ్గర చాలా సంతోషముగా ఉంది.
మా నాన్నగారు అందరిని (ప్రేమించడము నేర్పించారు. పేదలకు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, నమ్మివచ్చిన వారికి అండగా ఉండడం, కష్టపడి (బ్రతకడము నేర్పించారు. బైబిల్ చదవడము నేర్పించారు. ప్రార్థన చేయడము నేర్పించారు.
PHP ఎంతో (శ్రద్ధగా మాకు నేర్పించిన ఆధ్యాత్మిక భక్తి జీవితంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇదే మేము ఆయనకు ఇవ్వగలిగిన నిజమైన బహుమానం.
వై.యస్.మనోహర రెడ్డి
Pek నిత్య ప్రార్ధనాపరుడు! వై.యస్. జోసఫ్ రెడ్డి కనిష్ట కుమారుడు - పులివెందుల
నా పేరు వైయస్.జోసఫ్ రెడ్డి ఆరు మంది అన్న
దమ్ములలో అందరికన్నా చిన్నవాణ్ణి. నేను చదువు చాలించిన కొద్ది రోజులకే పెద్దలు నిర్ణయించిన ప్రకారం మా పెద్దక్క గారి కుమార్తెను వివాహమాడాను. తర్వాత మాకు ఇద్దరు కుమార్తెలు మీన, వీణ జన్మించారు. పెద్దమ్మాయికి పెండ్లి చేసినాను. వారు అమెరికాలో ఉన్నారు. చిన్నమ్మాయి హైదరాబాద్‌లో చదువు కుంటున్నది. మా పెళ్ళి అయిన కొద్ది రోజులకే అన్నదమ్ము లందరము వేరుగా ఉంటున్నాము. అందరికంటే చిన్న వాణ్ణి అని అమ్మ నాన్న ఇరువురు నా వద్దనే ఉంటారు. నాన్న గారి సంరక్షణలోనే పుట్టింది మొదలు కొని వారిని విడిచి ఉండలేదు. వారు కూడ చిన్నవాణ్ణి అని నన్ను ప్రేమతో చూచుకొనేవారు. ఏదైనా సలహా ఇచ్చినా కూడా దాన్ని గౌరవించేవారు.
నాన్న గారు నిత్యం ప్రార్థన జీవితం గడిపేవారు. ఆయన నిత్యం ప్రార్థనలో ఉన్నా అప్పుడప్పుడు ఆయన పడే శ్రమలు కష్టాలు చూచి కొన్ని పర్యాయములు నాన్న గారితో ఇదే విషయం అడిగినాను. నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు మనకెందుకు కష్టాలు వస్తాయి అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఒక్కటే - “అన్ని మనకు అనుకూలంగా ఉండవు, దేవుని సృష్టిలో సుఖము, కష్టము రెండు వుంటాయి. కొంత మందికి కొన్ని ఎక్కువగాను, కొంతమందికి కొన్ని తక్కువగాను ఉంటాయి. అందువల్ల దేవున్ని మనము ప్రశ్నించగలమా?” అని అనేవారు.
ఇప్పుడు ఆయన మరణించి దాదాపు 17 Soe అయినా అమ్మ నాతోనే వుంది. అందువల్ల ఆయన కూడ మా వద్దే ఉన్నారన్న అనుభూతితో జీవిస్తున్నాము. అందరిని గౌరవించమనేవారు. ఏ రోజు పని ఆ రోజే చేయాలని చెప్పేవారు. ఎవరికైనా సమయం ఇస్తే ఆ సమయం తప్పక పాటించేవారు. క్రమం తప్పక గుడికి వెళ్లడం, కుటుంబ ప్రార్ధన చేయడం తప్పక పాటించేవారు సాయంత్రం ఆర్. ఆర్.కె. మూర్తి గారి రేడియో ప్రసంగం వినడం తప్పని సరిగా చేసేవారు.
