Part 14 of 16

సత్య సాక్షి – భాగము 10 (పుటలు 105–114)

సత్య సాక్షి – భాగము 10 (పుటలు 105–114)

పురుషోత్తమరెడ్డి గారి విద్యా బాధ్యత తనపై నుండెనని, అతడొక గొప్ప డాక్టరు అగుటను బట్టి ఎంతో సంతోషించేవాడనని గారు చెప్పేవారు. తన పిన తల్లి కుమార్తెలందరూ పెద్ద విద్యావంతులైనందున చాలా సంతోషించినారట.

కొండారెడ్డిగారు దేవుని యందలి భయభక్తులతో జీవించిన వారు. తన తల్లిదండ్రులను సన్మానించిన వారు. బహుకాలము జీవించి తన పిల్లల పిల్లలను చూచి సిద్ధపడి మంచి క్రైస్తవ విశ్వాసిగా ప్రభువు నందు నిద్రించారు. కొండారెడ్డి గారు పులివెందుల సి.యస్‌.ఐ. సంఘమునకు చెందినవారు. సంఘమును, సంఘ సభ్యులను (ప్రేమించి ఆదివారపు దైవారాధనలకు తప్పక సతీ సమేతంగా పాల్గొనేవారు. వారు ఎక్కడున్నను గుడికి వెళ్ళేవారు. ఆళ్లగడ్డలో సి.యస్‌.ఐ. గుడికి ఒకటి రెండుసార్లు వచ్చి సామాన్యమైన సంఘవిశ్వాసులతో కలసి వారితో పాటు క్రింద కూర్చొని దేవుని ఆరాధించేవారు. మా తండ్రి అక్కడ పాస్టరుగా యుండేవారు. ప్రతి దినం బైబిల్‌ చదువుట, ధ్యానించుట, (ప్రార్థనలో గడుపుట ఆయన విధిగా ఉండేది. అందరినీ గౌరవించేవారు. Rox బహుగా గౌరవించేవారు. ఆయనది ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్కారం, వారు మితభాషి.

రాయలసీమ అధ్యక్షమండలము కౌన్సిల్‌ సభలకు పులివెందుల డివిజన్‌ నుండి రెండు పర్యాయములు ఎన్సుకోబడెను. రెవ. జె.జి.మార్పడన్‌ దొరగారు డయాసిస్‌ ప్రాపర్టి బోర్డు కన్వీనర్‌గా ఉన్నకాలములో కొండారెడ్డి గారిని డయాసిస్‌ బిల్లింగ్స్‌ కన్‌సల్జెంట్‌గా ఎన్నుకొనియున్నారు. మిషనరీ దొరలకు Susi వెంకటరెడ్డిగారన్నా కొండారెడ్డిగారన్నా ఎంతో గౌరవము. కారణం వారి నిజాయితీ గల జీవితం.

పులివెందులలోయున్న మిషన్‌ బంగాళాను అనగా లేడీస్‌ బంగళాను వేరొకరు ఆక్రమించుకొని దానిని ar) చేయక డయాసిస్‌ను కష్టపెడుతున్న సమయంలో కొండారెడ్డిగారు జోక్యము చేసికొని, దానిని ఖాళీ చేయించి డయాసిస్‌ వారికి అప్పగించారు. బంగాళా మన చేతికి వచ్చియున్చది కదా, దానిలో అంధబాల బాలికలకు స్కూల్‌పెట్టండి. జర్మనీ నుండి స్కాలర్‌షిప్‌లు తెప్పించండి, నా స్వంత డబ్బుతో 4 తరగతి గదులను కట్టిస్తానని నాతో చెప్పారు. నేను అప్పటి బిషప్‌ యల్‌. వి.అజర్యా తండ్రిగారితో సంప్రదించినపుడు, ఆయన కొండారెడ్డిగారు మాట చెప్పితే తప్పక చేస్తాడని చెప్పి, బెంగుళూరు వారితో సంప్రదించారు. అంధబాల బాలికల కొరకు డయాసిస్‌వారు చేసిన (ప్రయత్నము ఫలించలేదు. అందును బట్టి

చాలా విచారపడ్డారు.

చిన్నకొండారెడ్డిగారి కుమారుడైన ప్రకాశ్‌రెడ్డిగారు తన తండ్రి గురించి కొన్ని విషయములు తెలిసికోవాలంటే హైదరాబాద్‌లోయున్న శ్రీ సి.చంద్రశేఖర్‌రెడ్డి గారికి (శ్రీ వై.యస్‌. సుధీకర్‌రెడ్డి మామగారు, కీ!శే!॥ జార్జిరెడ్డి గారి బావగారు) మా పెద్దనాన్న 1B పెద్దకొండారెడ్డి కుమారుడైన చిన్నపరెడ్డి గారిని కలిసికొనమని చెప్పారు, చంద్రశేఖర్‌ రెడ్డిగారు చెప్పినదేమంటే - కొండారెడ్డిగారు వై.యస్‌. కుటుంబములలో మరువలేని వ్యక్తియని, గొప్ప గృహస్తుడని, కుటుంబము యెడల తన ధర్మాన్ని ఎన్నడూ మరువలేదని కుటుంబ జీవితంలో ఆయన గొప్ప మాదిరియని చెప్పారు. కాంట్రాక్టరుగా ఆయనకు ఆయనే సాటి. అలాంటి కాంట్రాక్టరును చూడలేము. చిన్నపురెడ్డిగారు తన చిన్నాన్నయగు కొండారెడ్డి గారిని గురించి - “నన్ను నెల్లూరుకు పంపి చదివించుటను బట్టి నేను, నా సంతానము హైదరాబాద్‌లో గొప్పవారము కాగల్గినాము. ఆయన నాకు చిరస్మరణీయుడు. ఆయన ఇప్పటికీ అప్పుడప్పుడు నాకు కలలో కనబడుతారు” అని అన్నారు. కొన్ని నెలల క్రితమే చిన్నపురెడ్డిగారు

మరణించి యున్నారు. కొండారెడ్డిగారి జీవితమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రియైన దేవుని ఇంట కొండారెడ్డిగారికి స్థలము సిద్ధపరచియున్నాడని నా నమ్మకము. అక్కడ నిత్యవెలుగు

నిత్య శాంతియున్నది. ఆయన విడిచి వెళ్లిన తన ప్రియ భార్యకు, కుమారులకు, కుమార్తెలకు వారి పిల్లలకు దేవుడు సదా తోడైయుండి ఆశీర్వదించి ఈ లోకంలో వర్ధిల్ల చేయునుగాక. ఇట్లు,

రెవ, యం. ధియోఫిలస్‌ AJATHASATHURUVU

S.V. Narayana Reddy

Pulivendula Sri Y.S.Chinna Konda Reddy was a Gentleman

of the highest caliber. He came from a humble fam-

ily and started his life as a Contractor. He made a name as a Good Contractor. He never qualified on

the nature of work. He gave preference to the com-

promised of the work. Some of the works he did, stand good even today. He was unanimously elected as the president of Pulivendula Panchayathi for a Term. During his tenure he gave good performance all the small lanes were as C.C.Roads. They stand good even today after laps of Fifty Years. He is a Philanthropist and helped people who approached him any help. He is 'AJATHASATHURUVU".

S.V. Narayana Reddy

Pek

సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగినకాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి (ప్రతి జీవి కోరికను 8) పరచుచున్నావు. - $65 145:15,16 యథార్థ్ధవాది

బి. నరసింహారెడ్డి

రామరెడ్డిపల్లి, 6:.సర్పంచ్‌

స్వర్ణీయ శ్రీ వై.యస్‌. చిన్న కొండారెడ్డి గారితో నాకు

1964 సం!॥లో పరిచయమైంది. అప్పట్లో ఆయన

పులివెందుల పంచాయితీ అధ్యక్షులుగా ఉండేవారు. నేను

| రామిరెడ్డి పల్లె గ్రామ సర్పంచ్‌గా ఉండేవాడిని. డా॥డి.యన్‌.

రెడ్డి గారు సమితి అధ్యక్షులుగా యుండేవారు. సమితి

సమావేశాల సందర్భములో శ్రీ కొండారెడ్డి గారిని తరచు కలుసుకుంటూ

ఉండేవారము. మేము ఇరువురము YB ఫైనాన్స్‌ స్టాండింగ్‌ కమిటి సభ్యులుగా ఉండేవారము.

వ్యక్తిగతంగా ఆయన గురించి చెప్పాలంటే సహృదయుడు, స్నేహశీలి, ఎంతో ఉదార స్వభావము గలవారు. సమావేశాల్లోను, ఇతర సందర్భాలలో కలుసుకున్నప్పుడు ఆయన సమాజ సేవ గురించి, ఇతర సేవా కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలు మాకు చెప్తూ ఉండేవారు. ఆయన క్రమశిక్షణ, సేవాకార్యక్రమాల్లో అంకితభావము గురించి మాట్లాడేవారు. సాంఘిక దురాచారాలను తీవ్రంగా ఖండించేవారు. సమితి సమావేశాల సందర్భంలో ఎన్నో విషయాల గురించి సక్రమంగా ప్రసంగించేవారు. కొండారెడ్డి గారు స్వయంగా క్రాస్తవమతస్థుడైనా ఇతర మతాలపట్ల ఎంతో గౌరవభావం కలిగి ఉండేవారు.

1964 సం॥ మధ్యలో డా! డి.యస్‌.రెడ్డి గారు కడప జిల్లా పరిషత్తు చైర్మన్‌గా ఎన్నికైన తరువాత అప్పట్లో సమితి ఉపాధ్యక్ష పదవిలో ఉన్న నన్ను ఇన్‌చార్జి సమితి అధ్యక్షులుగా నియమించారు. తరువాత సమితికి పూర్తిస్థాయి అధ్యక్షుని ఎన్నుకోవలసి వచ్చింది. వేంపల్లి సమితి మాజీ అధ్యక్షులుగా యుండిన శ్రీ నాగిరెడ్డి గారిని సమితి అధ్యక్షపదవికి ప్రతిపాదించటం జరిగినది. ఆ సమయంలో శ్రీ నాగిరెడ్డి గారు సమితి సభ్యుల మద్దతు పొందవలసి వచ్చింది. శ్రీ నాగిరెడ్డి గారు మొట్టమొదటగా పులివెందుల పంచాయితీ అధ్యక్షులుగా ఉన్న శ్రీ కొండారెడ్డి గారిని తీసుకొని ఆయన మద్ధతు కోరడానికి నిశ్చయించుకొని నన్ను కలుసుకొని ఆయన మద్ధతు కోరినాము. ఆ సందర్భంలో శ్రీ కొండారెడ్డి గారు నాగిరెడ్డి గారిని ఉద్దేశించి “ఏమండి నాగిరెడ్డి గారు, మీరు ఇదివరలో వేంపల్లె సమితి అధ్యక్షులుగా ఉన్న సమయంలో సమితి స్టాప్‌ పట్ల చాలా మెతకవైఖరి నవలంబించేవారని విన్నాను. ఆ విధంగా ఉంటే అధికారులు ప్రజలకు సహకరించి వారి పట్ల శ్రద్ధ చూపరు గదా! అందువలన మీకు స్ట్రాప్‌ పట్ల డ్యూటీ విషయంలో కఠినంగా వ్యవహరించవలెనని హితబోధ చేశారు. అందుకు ఆయన తప్పక మీ సలహా పాటిస్తానని మాట ఇచ్చారు. తరువాత శ్రీ కొండారెడ్డి గారు నాగిరెడ్డి గారికి పూర్తి మద్దతు పలికారు.

పై విషయాల గురించి ఆలోచిస్తే శ్రీ కొండారెడ్డి గారు క్రమశిక్షణకు డ్యూటిలో అంకిత భావానికి ఎంతో ప్రాధాన్యత నిచ్చేవారో మనకు విశదమౌతుంది.

ఆయన ఆత్మకు దేవుడు శాంతిని ప్రసాదించాలని ప్రార్ధించుచున్నాను. ఇ. నరసింహారెడ్డి

తన్ను ఎందరంగీకరించిరో వారందరికి అనగా తన నామమునందు విశ్వాన ముంచినవారికి, దేవుని విల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. - యోహాను 1:12 సౌమ్యుడు - వితరణ శీలి

నరైడ్డి శివరామిరెడ్డి మాజీ శాసనసభ్యులు, హైదరాబాద్‌

బలపనూరు సందింటి చిన్నకొండారెడ్డి గారితోను, వారి కుటుంబ సభ్యులందరితోను నాకు చిరకాల పరిచయము మైత్రి ఉందని చెప్పుకోడానికి సంతోషిస్తున్నాను. 1952లో నేను శాసనసభ్యునిగా ఎన్నిక అయినప్పుడు బలపనూరు నా నియోజక వర్గములోనిదే.

నేను చిన్నప్పుడు 1985, 89 సంవత్సరముల మధ్య ఐదేండ్లు పులివెందుల హైస్కూలులో చదువుతున్నప్పుడు చిన్నకొండారెడ్డి గారి సోదరుడు ప్రభుదాసు రెడ్డి నా సూ విద్యార్థి, స్నేహితుడు కూడా. (్రభుదాస్‌ రెడ్డిది మెత్తని స్వభావము. శాసనసభ, పార్లమెంటు ఎన్నికలలో సందింటి కుటుంబము మాకు సహాయపడేవాడు.

నేను కమ్యూనిస్టు రాజకీయాలలో జిల్లా బాధ్యతలు చేపట్టిన సుదీర్ధకాలములో ప్రతి సం॥ము పులివెందులలో వై.యస్‌. చిన్న కొండారెడ్డి గారిని కలుసుకునేవారము. వారి ఇంటిలో ప్రవేశించగానే ఆప్యాయత, అనురాగాలు గుభాలించేవి. ఉదారంగా విరాళము అందించేవారు. వారిది ఆతిధ్యానికి మారు పేరు.

చిన్నకొండారెడ్డి గారు శాంతి స్వభావం కలవారు. వారు ఫ్యాక్షన్‌, రాజకీయాలకు దూరముగా ఉండేవారు. తండ్రి స్వభావము పుణికి పుచ్చుకున్న వారి రెండవ కుమారుడు ప్రకాష్‌ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడుగా క్రీర్తి సంపాదించుకున్నాడు. నా స్మృతి ఫలకం మీద చిన్నకొండారెడ్డి గారి చెరగని ముద్ర పడింది. దానిని నేను విలువైనదిగా భావిస్తాను.

నరైడ్డి శివరామిరెడ్డి మాజీ శాసనసభ్యులు సిసలైన వ్యక్తిత్వమున్న మనిషి

ధా మల్లికార్డున రావు కడప

శ్రీ వై.యస్‌. చిన్నకొండారెడ్డి గారు ఉదాత్తమైన వ్యక్తిత్వ మున్న మహా మనీషి. ఒక్క భగవంతునికి, తన మనస్సాక్షికి తప్ప ఇతరులెవ్వరికీ భయపడని థీరగుణమున్న వారు. ఆయన మాటల్లో కాస్త కరకుదనం కనిపించినా, ఆయన మనసు మాత్రం చాలా సున్నితమైనది. నిస్వార్థం, (పేమ, దయ, నిజాయితీ ఇలాంటి సుగుణాలన్నీ ఆయనలో ప్రతిబింబిస్తాయి.

వీరు ఐదురుగు అన్నదమ్ములు. వీరిలో పెద్దవారు పెద్ద కొండారెడ్డి. ఆయన కుటుంబ బాధ్యతల్ని కొంతవరకు విస్మరించడంవల్ల బాధ్యతలు తరువాత వాడైన

చిన్నకొండారెడ్డి గారిపై పడ్డాయి. వీరి తమ్ముడు ప్రభుదాస్‌ రెడ్డి కూడా క్రైస్తవ భక్తి స్వీకరించి ఆ సేవలో నిమగ్నమై ఉండిపోయాడు.

ఆ పరిస్థితుల్లో చిన్నకొండారెడ్డి గారు చదువు చాలించి ఇంటి బాధ్యతలు మోయవలసి వచ్చింది. తరువాత నాలుగవ వారు వై.యస్‌. రాజారెడ్డి గారు. వీరు ఇంటర్‌ మీడియెట్‌ వరకు చదువుకొని తరువాత ఆర్మీలో కొంతకాలం పనిచేశారు.

ఐదవవారు పురుషోత్తమ రెడ్డిగారు. వీరు డాక్టర్‌. పులివెందులలోని వై.యస్‌.రాజారెడ్డి హాస్సిటల్‌లో వీరు వైద్యులుగా ఉన్నారు.

ఇంకా వీరికి సుగుణమ్మ, రత్నమ్మ, రాజమ్మ, మేరమ్మ, కమలమ్మ అనే ఐదుగురు అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అటు ముగ్గురు తమ్ముళ్ళను, ఇటు ఐదుగురు అకృచెల్లెళను పెంచి, పోషించి, గొప్ప చదువులు చెప్పించి, మంచి ఉద్యోగాలలో స్థిరపడే విధంగా చేసి, వారి వారి వృత్తుల్లో రాణించేటట్లు తీర్చిదిద్దుతూ తానే తండ్రిగా, అన్నగా ఉంటూ అండగా నిలిచి, వివాహాలు చేసి, తన బాధ్యతను తాను చక్కగా నిర్వర్తించిన మంచి మనిషి చిన్నకొండారెడ్డి గారు. అందరికన్నా మిన్నైన అన్న వారి మనసు అప్పుడే తీసిన వెన్న వారికి వారే సాటి. వారికి సర్వదా అండ యేసుప్రభువు. వారు నమ్మిన సిద్ధాంతాన్నీ వారు నమ్మిన దేవుణ్ణి విస్మరించకుండా జీవనయానం చేసిన మహనీయుడు చిన్న కొండారెడ్డి గారు.

అలాగే వీరి ధర్మపత్ని శ్రీమతి రాజమ్మగారు ఈయనకు తగిన ఇల్లాలు. భర్త అడుగు జాడల్లో పయనిస్తూ, మాట జవదాటని ఇల్లాలుగా ఉంటూ, అటు మరదలుకు, ఇటు తోడి కోడళ్ళకు పెద్ద దిక్కుగా నిలిచి, కన్న తల్లిగా లాలించి వారిని తీర్చి దిద్దిన గొప్ప సంస్కారవంతురాలు శ్రీమతి రాజమ్మగారు.

రెడ్డిగారికి పదమూడుమంది సంతానం కాగా, అందులో ఇద్దరు కాలధర్మం చేశారు. మిగతా పదకొండుమందిలో ఆరుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. వీళ్లందరికీ చక్కని విద్యాబుద్ధులు నేర్పి సంఘంలో వారికి SAS వృత్తి ఉద్యోగాలలో ఉత్తీర్ణుల్ని చేసి, వివాహాలు జరిపించి, అందరినీ ఉత్తమస్థాయిలో నిలబెట్ట గలిగారు.

రెడ్డిగారు ఎంతో సమర్థవంతంగా ఒకవైపు తోబుట్టువులను, మరోవైపు తన సంతానాన్ని చక్కని సంస్కారవంతులుగా, క్రమశిక్షణతో నడిపించి, సంఘంలో గొప్ప క్రీర్తి ప్రతిష్టలు పొందేలా చేశారు. వై.యస్‌.వంశీయులందరినీ ఉన్నత శిఖరాలు అధిరోహించేలా మలచిన ఆదర్శమూర్తి చిన్న కొండారెడ్డి గారు.

రెడ్డి గారు చదువు చాలించిన తరువాత కాంట్రాక్టర్‌ వృత్తిని ఎంచుకొన్నారు. 1928లో ఎంతో అంకితభావం కలిగి ప్రవర్తించేవారు. 1977S సంవత్సరం సెంట్రల్‌ రైల్వే కాంట్రాక్ట్‌ పనిలో ఉన్నప్పుడు, ఆ పని విషయమై అధికారులతో కొంత గొడవ పడవలసి వచ్చింది. మీకు నష్టం వస్తుందని వారు హెచ్చరించారు. అయినప్పటికీ వీరు ఒప్పుకోలేదు. నేను నష్టపోయినా పరవాలేదు. కానీ, నేను చేసే పనిలో నాణ్యత ఉండాలి. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తే లేదు అంటూ ఆ సందర్భంలో వీరు ఒక్కమాటన్నారు- “యేసుక్రీస్తు నిజాయితీపరుడని, భగవంతుడని ఆయన OBB ఉన్నప్పుడు ఎవ్వరూ గుర్తించలేదు. ఆయనను హింసించిన తరువాత అందరూ పశ్చాత్తాప పడవలసి వచ్చింది” అన్నారు.

చిన్న కొండారెడ్డి గారు చాలా ఖచ్చితమైన మనిషి, తనకు సాయపడ్డవారిపట్ల ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉండేవారు.

1960లో వారితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పుడు వారు నా దగ్గర

ట్రాక్టర్‌ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి మా పరిచయం కొనసాగింది. ఆయనలో

ఉన్న ముక్కుసూటి తనం, నిజాయితీ నన్ను బాగా ఆకర్షించాయి. ఎవ్వరికీ

తలవంచనివారు, వృత్తిలో క్రమశిక్షణ, కార్యదీక్షలో పట్టుదల ఉన్నవారు. చాలా

గొప్ప వ్యక్తిత్వమున్చవారు. వారితో నాకున్న పరిచయం ఎంతో విలువైంది. అందుకే

వారిపై నాకు తండ్రికంటే మిన్నగా గౌరవం ఏర్పడింది. వీరు 14-11-1998

సంవత్సరం పరమపదించారు. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి నాకున్న అనుబంధాన్ని

ఈ రెండు మాటల ద్వారా తెలియపరుస్తున్నందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను.

ఇట్లు

భవదీయుడు

సుధా LOSES రావ్ర

(శ్రీ దుర్గా ఆటోమోటివ్స్‌)

886 విజయదుర్దాదేవి ఆలయ వ్యవస్థాపకులు, కడప.

Pek ఆదర్శవంతుడు

పాళెం చిన్న చెన్నారెడ్డి కాంట్రాక్టరు - పులివెందుల

మౌ బావగారు కీర్తిశేషులు వై.యస్‌. చిన్న కొండారెడ్డి గారు, మా అక్క అయిన (అచ్చమ్మ) రాజమ్మ గారిని వివాహమాడిన తొలిదినాలలోనే మా ఊరిలో పార్టీ గొడవల వల్ల ఒకే రోజు నాలుగు ఖూనీలు అయినవి. అందువల్ల

చిన్న HAP ఉండిన నన్ను అక్కడ వుంటే చెడిపోయి, ఆ పార్టీల ప్రభావము మా మీద పడుతుంది అనే సదుద్దేశ్యంతో నన్ను పులివెందులకు తెచ్చి తన ఇంటిలో ఉంచుకొని చదువు చెప్పించి, టీచరు ట్రయినింగ్‌ ఇప్పించినారు. వారు ఆ విధంగా చేయడం వల్ల ఆ ఊరి గొడవలలో సంబంధము లేకుండా పులివెందులలోనే ఉండి నా వివాహ తదనంతరము నేను స్వయముగా కాంట్రాక్టు పనులు చేసుకుంటూ నా పిల్లలను చదివించుకోగలిగినాను.

నా ఇద్దరు కుమారులలో పెద్దవాడు జనార్ధన రెడ్డి పాల్‌బెక్సికల్‌ పులివెందులలో పనిచేయుచున్నాడు. వారి పిల్లలు ఒకడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా బెంగుళూరులో వనిచేయుచున్నాడు. ఇంకొక పిల్లవాడు కర్నూలు మెడికల్‌ కాలేజీలో యం.వి. బి.యస్‌. పూర్తి చేసి హౌస్‌ సర్జన్‌గా చేయుచున్నారు. ఇంకొక కుమారుడు రాజశేఖర రెడ్డి టీచరుగా పులివెందుల దగ్గర పల్లెలో పనిచేయుచున్నాడు.

ప్రస్తుత దినాలలో నా కుటుంబం ఇంత ప్రశాంతంగా ఉండటానికి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందటానికి చిన్నకొండారెడ్డిగారే కారణం.

చిన్నకొండారెడ్డి గారు నాకు మాత్రమే కాకుండా, మా బంధువులలో ఎవరికైనా ఎప్పుడైనా ఏ అవసరములోనైనా సహాయము చేయుచుండెడివారు. వారి వల్లనే నేను, నా కుటుంబము బాగుపడ్డాము.

↑ Back to top

↑