సత్య సాక్షి – భాగము 1 (పుటలు 15–24)
మా మామ - ఒక మహిమాన్వితుడు! సి.సి. 6B
దేవుడెట్లా ఉంటాడో ఎవరికీ తెలియదు. కానీ బైబిల్లోనూ, ఇతర మతగ్రంథాలలోనూ దేవుని లక్షణాల గురించి మనం చదివాం. మనిషి దేవుడవుతాడని నేననుకోను, కాని కొద్దిమంది మనుష్యులను చూసినప్పుడు దేవునిపై ఉన్న
(ప్రేమ, గౌరవం, విశ్వాసం వారిపైనా కలుగుతాయి. ఇలాంటి వారికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. వారికి ఎదురుగా కూర్చోవాలన్సిస్తుంది. వారి మాటల్ని వినాలన్పిస్తుంది. అలాంటి అరుదైన వ్యక్తి మా మామ చిన్చకొండారెడ్డి. ఆయనను ప్రేమించిన వారు తప్ప ద్వేషించిన వారు ఎవరూ ఉండరని నా నమ్మకం. నేను ఎప్పుడో తప్ప వారితో చాలాకాలం గడపలేదు. ఆ స్వల్ప కాలంలోనే నేను ఒక మహావ్యక్తిని చూశానని, ఆయనతో గడిపినవి క్షణాలే అయినా అవి నా జీవితంలో నిల్చిపోయిన మధుర క్షణాలని భావిస్తాను.
ఆయన మహా ధనికుడు కాదు. గొప్ప మేధావికాదు. దేనిలోనూ పండితుడు కాదు. ఆయనకున్నవి రూకలుకాదు. ఆయన నమ్మి ఆచరించిన మానవ విలువలే ఆయన ధనరాసులు. మేధావి కాకపోయినా కష్ట సుఖాలను వడబోసి నిగ్గు తేల్చుకున్న అసాధారణ మానవుడు. ఆయన మాటల్లో పాండిత్య ప్రకర్షణ కన్పించదు. కాని ఆణిముత్యాల్లాంటి జీవిత సత్యాలు కన్పిస్తాయి. ఆయన గుండెల్లో సాగరాలు పొంగుతున్నా మనకు పైకి కన్పించేది మాత్రం చల్లగా మెల్లగా సాగిపోయే సెలయేరులాంటి చిరునవ్వు.
ఆయన వ్యాపారస్తుడు. వ్యాపారాలన్నీ లాభాల కోసమే. ఈ లాభార్జన కోసం చాలామంది అబద్ధాలాడుతారు. మోసము చేస్తారు. నిలువెత్తు బురదలో మునిగి పోతారు. కానీ చిన్న కొండారెడ్డి గారు చేసిన వ్యాపారంలో ఆయన ఏ బురదనూ అంటించుకోలేదు. వారి సంపాదన అన్యాయార్జితం కాదు. కేవలం కష్టార్జితం
Vv మాత్రమే. ఆయన ఎంత సంపాదించాడో లేదో తెలియదు కానీ లేమి తాకలేని సంపద ఆయనది. ఆయనో నిండుకుండ. తన పరిధిలో అర్హులైన వారికి కావాల్సినంత ఆ కుండలోంచి లభించింది.
చరిత్ర పుటల్లోకెక్కిన వారి కోవలో లేరు ఆయన. కోటాను కోట్ల మంది ఆయన వెంట నడువలేదు. అయినా మహానుభావుల జీవితాల్లో ఎన్ని విలువలు నిండాయో మాన్యుడైన మా మామలోనూ ఆ విలువలన్నీ ఉన్నాయి. చరిత్రలో కాకపోయినా మా అందరి గుండెల్లో నిండిపోయిన మహా మనిషి ఆయన. మంచిని ప్రేమించిన, పొరుగు వారిని ప్రేమించిన మహాత్ముడు ఆయన.
నా కంటె చాలా ఎక్కువ కాలం గడిపిన వారు, మేధావులు ఆయన చుట్టూ ఉన్నా ఆయన గురించి రాయటానికి నాకు లభించిన ఈ అదృష్టాన్ని చూసి గర్వపడుతున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యాలే కాదు మనకు కావాల్సింది. అవి గ్రంథాలు నిండా ఉన్నాయి. కాని ఆ వాక్యాల అంతరార్థాల్ని తమ జీవితాల ద్వారా చూపగల్గ్లిన మా మామలాంటి మనుషులే మనకిప్పుడు కావాల్సింది. వారు నడిచిన దారులే మన జీవితాలకు దిశా నిర్దేశాలవు తాయి. యేసుక్రీస్తు దేవుడా - మనిషా, మనిషిగా పుట్టిన దేవుడా అనే చర్చ ఇప్పటికీ సాగుతూనే ఉంది. కానీ దేవుని ఎరిగిన మా మామలాంటి వారి ద్వారా దేవుని మహిమలు, ఆశీస్సులు సదా మనకందుతాయి.
సిసి, రెడ్డి దేవుని అనాది సంకల్పం!
రెవ. టి.యస్.ఆర్. ప్రసాద రెడ్డి ఫిలదెల్ఫియ బైబిల్ ఇనిస్టిట్యూట్, కవిటం సృష్టికర్తయైన యేసుక్రీస్తు ప్రభువు భూమిమీద ఆయా కాలములలో ఆయా స్థలములలో కొంతమంది వ్యక్తుల ద్వారా భూమిపై తన రక్షణకార్యమును ప్రారంభించి - విస్తరింప చేస్తున్నాడు. ఆంధ్రరాష్ట్రములో జగ్రక్షకుడైన క్రీస్తు సత్యసువార్త ప్రకటించబడుతున్న తొలిదినములలో దేవుడు కొంతమంది వ్యక్తులను ఆయా జాతులలోనుండి ఏర్పరచుకున్నాడు. దేవుని అనాది సంకల్పాన్ని బట్టి తొలిదినములలోనే సత్య దేవుని దివ్య సువార్తను ధైర్యంగా అంగీకరించి, మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆరాధ్య దైవంగా స్వీకరించి, జగద్గురువైన యేసుక్రీస్తు ప్రభుని ఉపదేశం ప్రకారం జీవించినవారు శ్రీ వై.యస్.వెంకటరెడ్డిగారు, వారి తనయులు శ్రీ వై.యస్. చిన్నకొండారెడ్డిగారు.
పరుగెడుతున్న కాలపు ఇసుక పొరల క్రింద (కాలగర్భంలో) మరెన్బటికీ రాకుండా కప్పబడిపోకముందే ఆ మహాభక్తుని జీవిత చరిత్రను అక్షరబద్ధం చేయాలన్న స్ఫూర్తితో ఈ భక్తుని జీవితచరిత్రను మీ ముందుంచుచున్నాము.
ఈ పుస్తకంలో శ్రీ వై.యస్. చిన్నకొండారెడ్డిగారి జీవితంలోని కొన్ని విషయములను సంఘటనలను మాత్రమే పొందుపరచగలిగాము. నిజానికి ఈ పుస్తకం స్వర్గీయ వై.యస్. చిన్నకొండారెడ్డిగారి జీవితానికి ఒక అంగుష్ట మాత్ర చిత్రణ మాత్రమే!
ఈ పుస్తకం రూపకల్పన చేసిన తర్వాత దీనికి ఏ పేరు పెట్టాలా అనే ఆలోచన కలిగింది. చిన్నకొండారెడ్డిగారు సత్యదేవుడైన యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించి, ఆ దేవుని సత్యగ్రంధాన్ని ఆనుదినం పారాయణం చేసి, సత్యసంధత్వ వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్న మహావ్యక్తి గనుక ఈ మహనీయుని జీవితగాథకు “సత్యసాక్షి” అని పేరుపెట్టాము.
అనుభవజ్ఞులు, పితృసమానులైన వై.యస్. ప్రకాశ్రెడ్డిగారి నేతృత్వంలో నేను ఈ (గ్రంథరూపకల్పన చేయటం నాకెంతో ఆశీర్వాదకరం!
ఈ అమూల్య చిరు (గ్రంథం భారతజాతి ప్రజలందరికీ, సార్వత్రిక క్రీస్తు సంఘమునకూ సత్యమార్గదర్శకంగానూ, ఆశీర్వాదకరముగానూ ఉండాలని నా ప్రార్ధన. ఆమేన్!
దీయస్.6రపుసాద రెడ్డి INTRODUCTION
The Rev. Dr. B.D. Prasada Rao Pastor, CSI-JCM Church, Madanapalle
At the outset I thank brother YS Prakash
Reddy for giving me this rare opportunity to translate
this cherishable publication. Cherishable because I am the best beneficiary of this book through the inspiration I received. The Autobiography of late Sri. Chninna Konda Reddy along with the promising witnesses of his family and friends is indeed a classic story of Christian faith in action. Chinna Konda Reddy proved some thing which we think impossible to live such an honest life in the midst of huge
scope for temptations.
I am over whelmed when brother Prakash Reddy asked me to translate this book into English, because my taste of doing similar work on “ Turn of the spirit” still remain in mind. How many more jewels are
to be unearthed from YS families we need to wait.
The way the material is collected and compiled is a miracle and providential. I am grateful to God for having given this opportunity. God has given me many answers to my spiritual struggles through these stories, which I can never obtain from any theological libraries .This book is a classic model of bringing out the shared Gospel of Jesus’ Love stories translated into the language of charismatic lives such as Chinna Konda
Reddy.
The book contains two phases namely the Autobiography by Late Sri Chinna Konda Reddy and in the second phase the stories of several near and dear ones who have been influenced by the sparks that glittered
from his faith story.
The way the book is compiled by Bro T.S.R. Prasada Reddy is simply meticulous in order, progressive spell of information and in a design of a lovely extended family. The contributors belong to inter generational and multi cultured nature. The witnesses are complementary to the biography. The illustrations fixed in different pages take the readers
join the YS families to experience the shared gospel of a faith community.
I also note with respect the preface written by the Most Rev. S.Vasnthakumar the Moderator of Church of South India, who I am sure would bring out many faith stories such as Sri Chinna Konda Reddy from all corners of the CSI, which would consolidate the strength and
guidance not only to the leadership but also to the younger generation.
Iam sure that God would bless this book in wide readership.
The Rev. Dr. B.D. Prasada Rao Pastor CSI-JCM Church, Madanapalle Rev. P. Isaac Vara Prasad Presbyter, CSI Town Church
Dear Rey. Prasad Greetings to you from the Diocese of Nandyal.
I am pleased to know that, a publication is planned by you and Rev. Theophilus to honour and prepetuate the memory of Late. Sri. Y.S.C.Konda
Reddy of pulivendula. I recall my pleasant memo-
ries of meeting this man and exchanging thoughts with him. I know him as a man of integrity, who has conducted his busi- ness with honesty and christian values.
It is important that such publications on Christian leaders are made available to the general public which will be an inspiration and guidance for the younger generation.
It is indeed very rare to find such Chirstian Witness from such prominent business men belonging to CSI Church. I commend this Godly work done by both of you and I wish it will have wider reader ship and influence.
May God bless his family members. I wish all the success for this publication.
With kind regards,
Yours sincerely,
Rt. Rev. Dr. P.J.Lawrence BISHOP
Diocese of Nandyal.
స్వీయ చరిత్ర ee
వైయస్. చిన్న కొండారెడ్డి
కుటుంబ నేపథ్యం!
నా పేరు వై.యస్. చిన్నకొండారెడ్డి. నేను వై.యస్. వెంకటరెడ్డి గారి రెండవ కుమారుడను. మేము కడప జిల్లా పులివెందుల తాలూకా బలపనూరు వాస్తవ్యులము. బలపనూరు గ్రామంలో మా పూర్వీకుల ఇల్లు ఒక సందులో ఉన్నందుచేత మా కుటుంబమునకు సందింటి వారు అని పేరు వచ్చింది (యెడుగూరు సందింటివారు). అందువలననే మా కుటుంబాలను వై.యస్. కుటుంబములని పిలుస్తూ వచ్చారు.
నా తండ్రి వై.యస్. వెంకటరెడ్డి గారు సనాతన భారతీయ సాంప్రదాయాలపట్ల నిష్టాగరిష్టులు. వారు బాల్యం నుండి భారతీయ ee సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎంతో మక్కువ కలిగినవారు. వేదాంత సభలలో భక్తిపురాణ (గ్రంథాలను చదివి వినిపించేవారు. మా తండ్రిగారు గురోపదేశం పొంది, అనేకమందికి భజనా విధానాలను నేర్పిస్తూ వుండేవారు. ప్రతిదినము దీక్షాస్పానం ఆచరిస్తూ, రుద్రాక్షలు ధరించి అధికంగా పూజలు ఆచరించేవారు. నా తండ్రి బాల్యంలోనే భారతీయ భక్తి/గ్రంధాలు అన్నింటిని చదివి వాటిలోని నీతివాక్యాలు అనేకమందికి ఉపదేశిస్తూ ఉండేవారు.
re ag
నా తండ్రి వెంకటరెడ్డిగారు మా కుల వృత్తి అగు వ్యవసాయమందు విశేషమైన (88 గలిగి ఉండేవారు. నా తండ్రికి బట్రాజులు హిందూమత వేదాంత విషయములను ఉపదేశించుట వలన స్వయంగా భజనకూటములు జరిపించే యోగ్యత లభించింది. మనశ్శాంతి కోసం నిరంతరం పురాణాలు పరించేవారు. మత గురువులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ దేవాలయాలు దర్శించేవారు. మెడలో రుద్రాక్షలు, నొసట విభూది ధరించి, నమఃశివాయ మంత్రం జపించేవారు. తిరుమల వెంకటేశ్వరుని కొలుస్తూ ఆ భక్తిభావంతో తన ఐదుగురి పిల్లలకు “వెంకటి అను పేరు కలుపుతూ నామకరణం చేస్తారు. బలపనూరు ప్రాంతం పచ్చని పైరుపంటలకు నిలయమైనట్టుగానే వెచ్చని రాజకీయాలకు నిలయముగా ఉండేది. ఆ (గ్రామంలో రైతులు, భూస్వాములు (ధనికవర్గాలు, అణగారిన వర్షాలు) వారు నివసించేవారు. నా తండి వెంకటరెడ్డిగారు ఎవ్వరికి హాని కలుగకుండా పేదప్రజలకు ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని సామరాస్యంగా పరిష్కరిస్తూ అనాధ ప్రజల పాలిట ఆపద్భాంధవుడిలా ఉండేవారు. (గ్రామంలో అందరూ సామరస్యంగా ఉండాలనే సదుద్ధేశ్యంతోనే ఆయన అందరికీ అందుబాటులో ఉండేవారు. నా బాల్యం
నా తండ్రి వెంకటరెడ్డి గారు ఇద్దరు స్త్రీలను వివాహమాడినట్లు నాకు తెలియవచ్చింది. మొదటిసారి పులివెందుల తాలూకా బోనాల (గ్రామవాస్తవ్యులు సిద్ధారెడ్డిగారి కుమార్తె లక్ష్మమ్మ అను ఆమెను పెండ్లి చేసుకొనెను. ఆమెకు సంతానం లేనందున నా తండ్రి రెండవసారి కమలాపురం తాలూకా ఉలవలపల్లె రాజుపాలెం వాస్తవ్యులు పాళెం చెన్చారెడ్డి గారి కుమార్తె అయిన మంగమ్మ అను ఆమెను వివాహమాడినట్లు తెలియవచ్చింది. రెండవ భార్య మంగమ్మ గారు గర్భము ధరించిన కొంతకాలానికే నా తల్లి అయిన లక్ష్మమ్మ గారు కూడా గర్భము ధరించగా, ఆ కాన్పులో జన్మించిన కుమార్తె చనిపోయింది. తదుపరి రెండవసారి లక్ష్మమ్మ గారు గర్భం ధరించగా, దేవుని మహాకృపనుబట్టి నేను జన్మించాను. నేను జన్మించినది 1918వ సం!రం జూలై 18వ తేదీ అని నా తండ్రి పొందుపరిచిన వివరములను బట్టి తెలుసుకున్నాను.
నేను దాదాపు ర5వ తరగతి వరకు బలపనూరు ఎలిమెంటరీ స్కూలులో చదువుకున్నాను. తరువాత 1924వ సం!లో పులివెందుల రైతుల హైస్కూల్లో 5వ తరగతిలో చేరితిని. నేను 1928 వరకు ఫోర్త్ ఫాం (9వ తరగతి) ముగించి సర్టిఫికెట్ తీసుకొని చదువు ముగించాను. నేను ఇంటి వద్ద ఉన్న సమయంలో నా తండ్రికి వ్యవసాయ పనులలో సహకరిస్తూ ఉండేవాడిని. సత్యదేవుని దివ్య ప్రత్యక్షత
నా తండ్రిగారు ఒక వైపు సనాతన భారతీయ హిందూ మతాచారములపట్ల ప్రగాఢ నమ్మకం పెంపొందించుకుని, మరోవైపు సామాజిక Der, సేవాదృక్పథం కలిగి ఎంతో ఆదర్శప్రాయమైన జీవితాన్ని కలిగియుండేవారు. నా తండ్రి వై.యస్. వెంకటరెడ్డి గారికి బాల్యము నుండి క్రెస్తవమతమంటే ద్వేషం కలిగి ఉండి, ఇది పరాయి మతమని, మాల, మాదిగలకే ఈ మతం పరిమితమని అపహాస్యంగా చూసేవారు. యేసుక్రీస్తు విదేశీ దేవుడని ద్వేషిస్తూ ఉండేవారు.
నేను 12 సం॥రముల వయస్సులో ఉండగా బలపనూరులో బడిపంతులుగా పనిచేస్తూ ఉన్నఐజయ్యగారు మా నాన్నగారికి యేసుక్రీస్తు ప్రభువు జీవిత చరిత్రగల క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఇచ్చి - “అయ్యా, దయచేసి దీనిని బాగుగా చదవండి, మీకు ఇష్టం లేకపోతే వాపసు ఇవ్వండి” అని చెప్పారు. క్రొత్తనిబంధన (గ్రంథంలోని తప్పులను, పొరపాట్లను కనుగొనాలన్న ఉద్దేశ్యంతో (గ్రంథాన్ని తెరిచారు. సరిగ్గా అదే సమయములో మడూరు వాస్తవ్యులు డాక్టర్ నంబి నరసయ్య గారి స్పేహంతో క్రీస్తు భగవానుని గూర్చిన సత్య సువార్త పరిచయం జరిగింది. ఈ సమయంలోనే దేవుని దర్శనములను బట్టి మా ఇంట్లో మా తమ్ముడు దేవరాజారెడ్డి జన్మించటం జరిగింది. ఫలితంగా మా ఇంట్లో క్రీస్తు ప్రభువు పట్ల విశ్వాసం అధికమైంది. బైబిల్ గ్రంథ పఠనం చేస్తుండగా క్రీస్తుప్రభుని ఉపదేశంలో- “నిన్నువలె నీ పొరుగువానిని (ప్రేమించుము” (మత్తయి 22:39) అనే మాట మా తండ్రి గారిని ఎంతో ఆకర్షించింది. ఈ విధంగా (ప్రేమోపదేశాన్ని చేసినవారు ప్రపంచ చరిత్రలో మరొకరు లేరని గ్రహించారు. “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు” అని కీర్తన 144: 15లో వ్రాయబడిన ప్రకారం మహాదేవుడైన యేసుక్రీస్తును దేవునిగా విశ్వసించే మహాభాగ్యం మాకు లభించింది.
బైబిల్ గ్రంథ పఠనద్వారా మా తండ్రి వై.యస్. వెంకటరెడ్డిగారు యేసుక్రీస్తు ప్రభువే సాక్షాత్తూ లోకరక్షకుడని, ఆయన కార్చిన పవిత్రరక్తం ద్వారానే పాపికి విమోచన, మోక్షమూ లభిస్తాయనే సత్యాన్ని (గ్రహించారు. ఆ విధంగా మేము యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించి ఆరాధించటం (ప్రారంభమైనది. మా తండ్రిగారితో కలిసి నేనూ యేసుక్రీస్తునందు విశ్వాసముంచి బాప్తిస్మం పొందాను.
ఆ రోజులలో కూలి పనికి వచ్చే వ్యక్తులకు జీతముగా (సేరుముంతలు) ముంతలతో గింజలు కొలిచి ఇచ్చేవారము. పనివారికి జీతపు గింజలు కొలిచే పాత్రల పరిమాణము 1/3 వ భాగం తక్కువ పరిమాణము ఉన్నట్టు తెలిసింది. అది ఎంతో అన్యాయముగా నేను భావించాను.
యెహెజ్కేలు 45వ అధ్యాయం 9వ వచనం (ప్రకారం - “యెహోవా సెలవిచ్చుచున్నాడు. ...నా జనుల సొమ్మును అపహరింపక నీతిన్యాయములను
