Part 13 of 16

సత్య సాక్షి – భాగము 9 (పుటలు 95–104)

సత్య సాక్షి – భాగము 9 (పుటలు 95–104)

COMMITTED CHRISTIAN

Rt. Rev.Dr. C.B.M. Frederick

Bishop in Rayalaseema (Retd),

Church of South India,

Gooty - 515401

I am happy to say a few words about late Y.S.C.Konda Reddy Garu. I am happy the locals at

Pulivendula are writing a brief biography of him

which shall be a great witness to our Lord. Before I became the Bishop of the Diocese I was in-charge of Pulivendula Division for about 11 Months. During that period I used to meet him quite often at the worship services and at his home. My late father Sri. Ch. Jacob used to tell about Y.S. families specially about late Y.S. Venkata Reddy and his sons late Y.S.C. Konda Reddy and Y.S. Raja Reddy. They were responsible for constructing our mission. High School buildings at Gooty as contractors. After I became Bishop I was in touch

with many Y.S. families. They had been very good to me.

With my limited contacts and association I say the following words about late Y.S.C.Konda Reddy.

He was a committed Christian. He belonged to Ex.L.M.S.Church background. He had highest respect for the congregational church tradi- tions, theology and value. In his opinion the laity in the Church has equal responsibilities in the mission of the Church along with the clergy. He belived that all who trust in the Lord Jesus are equal irrespective of caste,creed, race or nationality. He never aspired for positions in the Dio- cese. He was a storng supporter of the Diocese silently. There was a terrible crisis in nineties in the Diocese. He had concern for the Diocese and used

to advise and guide the diocese without the least fear of church authorities.

He led a very simple but very appealing life. He had vistas of Bib- lical knowledge. He was not only a philosopher but lived his Christian philosophy.

The Y.S. families are the first converted Christians from Reddy Community in Kadapa District. Late Y.S.C. Konda Reddy was a re- markable Christian in that families and lived an exempliary life. We praise God for his values and life.

The impact of the faith of late Konda Reddy can be in his family members specially with Mr. Y.S.Prakash Reddy. When I see him imme- diately his late father Konda Reddy comes to my mind.

God bless all Y.S. Families, may His soul rest in peace.

Rt. Rev. Dr. C.B.M. Frederick Bishop (Retd).

Pek

యేసుక్రీస్తు ఎంత గొవ్పవాడంటే - ఆయన దేవుని కుమారుడు, దేవుని ప్రతినిధి. ఎలాంటి దోషములేనివాడు అయినా అతనిని సిలువవేసారు. ఆయన భగవత్‌ చైతన్యాన్ని వ్యావింపచేయాలనుకున్నాడు. మేము ఆయనను గుర్తించి భగవంతుని ప్రతినిధిగా, నర్చవిధాలా గౌరవిస్తాం. నిశ్చయంగా అతను భగవంతుని ్రతినిధే అందువల్ల మేము యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తాం - అంజలి ఘటిస్తాం. - @&) సాక్షాత్య్మార శాస్త్రం చిరస్మరణీయుడు

రెవ. బి. ప్రభాకర రెడ్డి రాయలసీయ గాస్పల్‌ మినిస్ట్రీస్‌ ట్రస్ట్‌(ర), అనంతపురం

సన్మాన పాత్రులు, పితృ సమానులైన (8 OSes గారిని గూర్చి నా మనసులోని అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశాన్ని నాకిచ్చిన మా ప్రియమైన ప్రకాశ్‌రెడ్డి అన్చగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

సనాతాన భారతీయ సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన నేను, యవ్వన ప్రాయంలో, నిజదేవుడైన యేసు (ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి, ఆ మహాదేవుని పిలుపునుబట్టి ఆయన పవిత్రమైన పాదసేవకు అంకితం అయ్యాను. 25 సం॥రాల క్రితం యౌవ్వనస్థునిగా దేవుని పరిచర్య ప్రారంభించిన తొలిదినాలలో నన్ను అందరికంటే ఎక్కువగా (ప్రేమించి, దేవుని సేవకై నన్ను అత్యంత అధికంగా ప్రోత్సహించిన వారు శ్రీ వై.యస్‌. చిన్నకొండారెడ్డి గారు. ప్రభువు సేవలో ఉన్న నన్ను నా బంధుమిత్రులు విడిచిన ఆ దినములలో నన్ను ఒక తండ్రిలా ఆదరించి, వెన్నుతట్టి ప్రోత్సహించి, ఆత్మీయంగాను, ఆర్థికంగాను వారు చేసిన ఉపకారములను నేను ఎన్నటికీ మరువలేను.

నేను 1986,87,88,89 సం॥రములలో చిన్నకొండారెడ్డి గారితో కలిసి వారానికి ఒకసారి పులివెందుల పరిసర (గ్రామాలకు వెళ్లి సువార్త ప్రకటించేవారము. ఎక్కువగా మడూరు, బలపనూరు, బెస్త bendiicenb- వారిపల్లె మరియు చట్టు ప్రక్కల క్రీసునుపటించుచ్చున్నామ్తు.. | (గ్రామాలకు వెళ్లి నువార్త ప్రకటించేవారము.

ఆ దినములలో పులివెందులలో ॥ నిర్వహించిన సువార్త సభలకు

— sx) అనేక సార్లు వాక్యోప రెవ. బి. ప్రభాకర రెడ్డి గారిచే స్థాపించబడిన దేశకునిగా చిన్న కొండా రెడ్డి (ఆ

రాయలసీయ గాస్పల్‌ D905 ట్రస్ట్‌ ©), 1987 రు, పురుషోత్తమ రెడి గారు సం॥రంలో ప్రథమ వార్షికోత్సవసభకు ముఖ్య అతిథిగా గారు, పురుషోత్తమ రెడ్డి గా వై.యస్‌. చిన్నకొండారెడ్డిగారు విచ్చేసినప్పటి దృశ్యం. ఆహ్వానించారు.

నేను పులివెందుల వెళ్ళిన ప్రతిసారి కొండారెడ్డిగారి ఇంటికి వెళ్ళేవాడిని. ప్రతిసారి కొండారెడ్డిగారే ఇంటి వద్ద (ప్రేమతో భోజనం వడ్డించేవారు. వారు ఎంతో తగ్గించుకొని భోజనం వడ్డిస్తుంటే, సాక్షాత్తూ యేసుప్రభువే భోజనం పెడుతున్న భావన నాకు కలిగేది. రాయలసీమలోని అన్ని జిల్లాలలో అన్ని మండలాలో, గ్రామాలలో సువార్త ప్రకటించాలన్న రాయలసీమ గాస్పల్‌ DAYS దర్శనాన్ని అర్ధం చేసుకొని నన్ను ఎంతో ప్రోత్సహించేవారు.

1987 Sond రాయలసీయ గాస్పల్‌ మినిస్ట్రీస్‌ ప్రథమ వార్షికోత్సవ మహా సభకు వారు ముఖ్య అతిధిగా విచ్చేసి వారి అమూల్య హస్తాల మీదగా క్రీస్తు సుత్తి Aes? అనే క్రైస్తవ ఆధ్యాత్మిక గీతాలు క్యాసెట్‌ను ఆవిష్కరించారు. వారితో మాకున్న అమూల్య అనుబంధాన్ని, వారి ద్వారా మేము పొందిన ఆధ్యాత్మిక దీవెనలను మాటలలో వివరించలేనివి, కలంతో ప్రాయలేనివి. వారు బైబిల్‌ గ్రంథంలోని క్రీస్తు ఉపదేశాన్ని సంపూర్ణంగా అనుసరించిన మహాభక్తుడని నేను మనసారా చెప్పుచున్నాను.

Bb. ఇ. ప్రభాకరరెడ్డి

రెవ. బి. ప్రభాకర్‌ రెడ్డి గారిచే స్థాపించబడిన రాయలసీయ గాస్పల్‌ మినిస్ట్రీస్‌ ట్రస్ట్‌ వారిచే సిద్ధపరచబడిన “క్రీస్తు స్తుతి గీతావళి” ఆడియో పాటల క్యాసెట్‌ను (8 వైయస్‌. చిన్నకొండారెడ్డి గారి అమూల్య హస్తాలతో ఆవిష్కరిస్తున్న దృశ్యం. 10 5 1987 ఒక్క మాట "Faith come by the hearing and hearing by the word of God". Rom 10:17

ఆచార్య ఆర్‌. ఆర్‌. కె. మూర్తి

సహోదరుడు వై.యస్‌.సి.కొండారెడ్డి గారిని నేను

రెండు మూడు సార్లు కలుసుకున్నాను. వారి సాక్ష్యం విన్నాను. ఆయన్ను చూచాను. యేసుక్రీస్తును అంగీకరించడమే కాదు. యేసుకు నమ్మకమైన బలమైన సాక్షిగా జీవించిన ఉత్తమ క్రైస్తవుడు కొండారెడ్డిగారు. ఆయన సౌశీల్యం అందరిని ఆకర్షించింది. పులివెందుల ప్రాంతము ఆయన వ్యక్తిత్వ సౌరభవంతో పరిమలించింది.

స్వర్గీయ కొండారెడ్డిగారు క్రైస్తవ విశ్వాసపంథాలో తిన్నని మార్గంలో తన ప్రభువు అడుగుజాడల్లో నడిచారు (1913-1993). కొండారెడ్డి గారికి నా రేడియో ప్రసంగాలంటే ప్రాణం. ఆర్‌.ఆర్‌.కె. రచనలు అంటే నేను వ్రాసిన (గ్రంథాలు ఆప్యాయంగా చదివేవారు.

పులివెందులలో వారి స్వగృహంలో అథితిగాయున్న జ్ఞాపకాలు నాకున్నాయి. సువార్తను హైందవ అగ్రవర్ణాల వారికి ఆకర్షణీయమైన విధానంలో చెప్పుతూ చూపటం వారి నైజమని నాకు తెలుసు. S181 కొండారెడ్డిగారి కుటుంబాన్ని యేసు ప్రభువు ఆశీర్వదించి సాక్ష్యార్థ మై నిలువబెట్టిన విధానం అందరికి ఆమోదయోగ్యమైంది. దైవకృప, శాంతి. అపొ.కా. 1:8.

క్రీస్తునందు సేవలో ఆచార్య 60%, మూర్తి శుభవార్త వక్త

హైదరాబాద్‌.

క్రీస్తు తత్వం! వై. పాల్‌ రెడ్డి పులివెందుల

ప్రభువునందు అత్యంత గౌరవనీయులైన ఆత్మీయ తండ్రి స్వర్గీయ శ్రీ వై.యస్‌. చిన్న కొండారెడ్డి గారిని గురించిన సంక్షిప్త సాక్ష్యము.

మస్తిష్కం మత్తేభానికి సంబంధము ఏమిటి అన్నది లోక సామెత. ఆయనకు నాకు పోలిక అలాంటిది. ఆయనతో నా సహవాసము, ఆయనను గురించిన సాక్ష్యమును వ్రాయమని పెద్దలు పాస్టరు థియోఫిలస్‌ గారు, శ్రీ వై.యస్‌. ప్రకాశ్‌రెడ్డిగారు కోరడం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది.

1980 నుండి ఆయన మరణదినం వరకు తండ్రి కొండారెడ్డి గారితో నాకు ఉన్న సాన్చిహిత్యము, ఆత్మీయ బాంధవ్యము మరువరానిది. వారితో నా సహవాసము, ఆత్మీయ బాంధవ్యము ఆవగింజలాగా కొద్దిపాటిగా ఆరంభమై, మరింతగా బలపడి స్థిరపడి ఒకరిలో ఒకరంగా, ఒకరి ఆత్మీయతలో మరొకరం పరస్పరం ఆనందించగలిగేంత వరకు సాగింది.

వయోబేధాన్ని మరిచి, అంతస్తు బేధాన్ని విడిచి, ఆత్మీయతను గుర్తించి, అభినందించి ఆశీర్వదించే ఉదాత్తమైన భావికుడు స్వర్గీయ శ్రీ వై.యస్‌.సి. కొండారెడ్డి గారు. అది వారిలోని క్రైస్తవ సుగుణానికి మచ్చుతునక. (ప్రభువైన యేసుక్రీస్తు సుగుణాలైన (ప్రేమ, దయ, జాలి, కరుణ, దీనత్వము, ఆప్యాయత, అనురాగములను నిండుగా పుణికి పుచ్చుకున్న భక్తుడు.

దైవవాక్యమును వినమ్రంగా పఠించి, సగౌరవముగా పాటించిన దీనుడు. పనిలో పటిష్టత, ఆర్ధనలో సముపార్ణనలో ఆలంబన కలిగి అలుపు సలుపు ఎరుగని కష్టజీవి. వయస్సు పైబడినా అలసట పైబడినా చేయితట్టి వెన్నుతట్టి అవసరాలలో ఉన్నవారిని ఆదుకున్న ఆప్తుడు. మేలును కీడును, లాభమును నష్టమును సమానముగా ఎంచిన దీర్ధదర్శి. తంత్రాలు, మంత్రాలు, కుతంత్రాలు కాకుండా సత్యమే నిత్యమని, సత్వమే జయము అని నమ్మిన సిద్ధాంతకర్త, శ్రీమంతులు వారు.

చిన్న కొండారెడ్డి గారు నిజంగా చిన్న కొండారెడ్డిగారే, తన దగ్గరకు వచ్చిన చిన్న పిల్లలను చూచి పరలోక రాజ్యం ఈలాంటి వారిది, మార్పు పొంది బిడ్డలవంటి వారైతేగాని పరలోకరాజ్యము చేరలేరనే ప్రభువు మాట ఆయన జీవితంలో కనబడుతుంది. ఆయన ఎత్తైన మనిషి అందుకోలేనంత ఉదాత్తమైన ఆత్మీయ విలువలు, మానవ ధర్మాలు, ఆదర్శభావాలు, పరలోకపు అంచుల వరకు ఎదిగిన ఆత్మీయత. ఆయన ధరించే తెల్లటి నూలు వస్రాలు ఆయన పవిత్ర జీవితానికి సంకేతాలు. తినేది తక్కువ - ఇతరులకు పెట్టేది ఎక్కువ. ఆయన చుట్టు ఉన్నవారి కడుపులు నిండిపోతే ఆయన కడుపు చల్లబడుతుంది. స్వధర్మం కన్న పరధర్మం పరమోన్నతంగా భావించిన ధర్మబద్ధులు స్వర్గీయ శ్రీ వై.యస్‌.సి. కొండారెడ్డిగారు.

ఆయన భక్తి విశ్వాసాలు ఆచరణాత్మకమైనవి. ఆదర్శప్రాయమైనవి, అనుసరణీయమైనవి. మనుష్యుల మెప్పును కోరక, యుక్తినికాక భక్తిని కోరి, శక్తిని పొంది ముక్తిని చేరిన వారు స్వర్గీయ శ్రీ వై.యస్‌.సి. కొండారెడ్డిగారు. సుఖ సౌఖ్యాలకు దూరంగా ఉండి సామాన్యజీవితాన్ని గడిపిన సౌమ్యుడు. కళంకములేని హృదయంతో, నిండైన మనస్సుతో ఆప్యాయతలను పంచి పెట్టిన ఆత్మీయుడు. ఆయన ఇంటా, బయటా అందరి మన్ననలు ప్రశంసలు అందుకున్న అభినందనీయుడు.

“పనియే ఆరాధన, ఆరాధనయే పని” అన్న సూక్తిని ఆచరణలో పెట్టి ఆదివారపు ఆరాధనలో తప్పక ఉండే ఆదర్శప్రాయుడు. కలిమిలేములు కష్టసుఖాలు, ఇరుకు ఇబ్బందులను ఆనందంతో ఆస్వాదించి అలరించిన ఆశావహులు. శ్రమను, శ్రమజీవులను గౌరవించి, వారి ప్రతి స్వేదబిందువుకు లెక్కగట్టి (ప్రతిఫలం ఇచ్చే ఆసామి ఆయన. పుష్కలమైన దైవాశీస్సులతో పుప్పించిన పుత్రసంతానం ఆయనది. తేనెవంటి మనస్సుతో మమతానురాగాలను వెదజల్లుతున్న ఆడబిడ్డలు ఆయన గర్భసాఫల్యమే.

బలపనూరులో మామిడితోటలో శ్రీమతి రాజమ్మగారితో ఆయనకు జరిగిన వివాహము మొదలుకొని ఆయన జీవితానుభవములన్నిటిని దాపరికం లేకుండా పూసగుచ్చినట్టు నాకు చెప్పిన విషయాలను అనేక ఘట్టాలుగా చెప్పుకోవచ్చు, అయినా వాటిని ఇక్కడ ప్రస్తావించలేను.

కుటుంబ సభ్యుల భక్తి విశ్వాసాల నిమిత్తమై పరితపించిన పప్రార్ధనాపరుడు. జీవితాంతము తన కొరకు, తన కుటుంబము కొరకు పాటుబడి ప్రభువు కొరకు ఏమిచేయలేదనే జీవిత సత్యాన్ని (గ్రహించిన అంతర్యుఖుడు స్వర్గీయ శ్రీ వై.యస్‌.సి.కొండా రెడ్డిగారు. అంతర్ముఖుడై మానవ సేవను దైవసేవగా భావించి, కార్యోన్ముఖుడై ప్రజలకు చేయూత నివ్వడానికి తనకు సంక్రమించిన జేష్టత్వపు భాగమును వ్యయపరిచిన ధన్యజీవి ఆయన.

పరలోకంలో ఫలంకొరకు నిరీక్షణ కలవారుగా సువార్తను ప్రకటించాలన్న ప్రభువాజ్ఞను శిరసావహించి అంకుఠిత దీక్షతో శరీరములో శక్తి లేకపోయినా స్వంత కారులో సహకారులను వెంటబెట్టుకొని స్వంత గ్రామాలలో సువార్తను, ప్రభు రక్షణ మార్గమును ప్రకటించిన సువార్తికుడు. ఘనమైన ప్రభు సువార్తను గణనీయంగా ప్రకటించుట కొరకు తన జేష్టత్వపు భాగమును ధారాళముగ అందించిన దాతృత్వం ఆయనది. అనాధలను గురించి ఆలోచించే ఆయనకు, సహకారులు అందుబాటులో లేక ఎందరినో కోరినా, కొందరైన ముందుకురాక పోవడంతో ఆయన ఆశ, ఆశయాలకు గండిపడింది. అనాధలకు ఆపన్నహస్తం అందించాలన్న తపన గల బాంధవుడు. వారి కోరిక తీరకనే ఆయన ఆత్మ ప్రభువు చెంతకు చేరింది. ఈ విషయమై ఆయన నన్ను ఎంతగానో ్రేరేపించారు. కాని అప్పట్లో ఆయన ప్రతిపాదనకు నేను సిద్ధపడలేదు. ఆనాటి ఆయన స్ఫూర్తియే ఇప్పుడు మేము నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి కారకం, ప్రేరకం.

వారి బంధువులకు నన్ను బంధువుగా పరిచయం చేసేవాడు. నేనెలా బంధువునో చెప్పలేక పోయేవాడిని, అది వారిలోని గొప్పతనం. అది ఆత్మీయతత్వం, క్రీస్తుతత్వం కనుకనే వారు నాకు మార్గదర్శకం.

వై. పాల్‌ రెడ్డి 81-011 వై.యసి.సి.కొండారండ్డి గారిని

గురించి కొన్ని మాటలు

రెవ. యం. ధథియోఫిలస్‌ పులివెందుల

Qs dercinxyomsrsey నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” నిర్గమ 20:12. “యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరు ధన్యులు” కీర్తన 128:1. “నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు” కీర్తన 128: 3. “తండ్రియే కుమారులకు అలంకారము” సామె 17:6. కీ శే! కొండారెడ్డిగారితో నాకు పరిచయము:

1977 సంవత్సరమున నేను పులివెందుల డివిజన్‌కు డివిజనల్‌ ఛైర్మన్‌గా వచ్చాను. 1977 నుండి 1988 సంవత్సరము మధ్య కాలములో కొండారెడ్డిగారితో ఉన్న పరిచయాన్ని బట్టి, కొండారెడ్డి గారిని గురించి ఈ మాటలు బ్రాస్తున్నాను. వారితో పాటు మూడుసార్లు బెంగుళూరుకు వెళ్లియుంటిని. ఆయనతో కలిసి సువార్త సేవకు బలపనూరు, మడూరు గ్రామములకు పలుమార్లు వెళ్ళాను. రెండుసార్లు బెస్తవారిపల్లెకు వెళ్ళాను. ప్రతినెల తన ఇంట ఆయనను దర్శించాను. చివరకు వారి అంత్యక్రియలు యందు కూడా పాల్గొన్నాను. ఆయనతో నాకున్న పరిచయం నా సంఘపరిచర్యలో నాకు బహుగా తోడ్పడింది.

కొండారెడ్డిగారు 80 సంవత్సరములు జీవించిన పూర్ణజీవి (1913-1993). కీ!|శే॥యెడుగూరి సందింటి వెంకటరెడ్డి గారి రెండవ కుమారుడు వై.యస్‌.సి. కొండారెడ్డిగారు. వీరి తండ్రి YS. వెంకటరెడ్డిగారు 1925 సంవత్సరములో యేసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరించి బాప్తీస్మము పొంది నిజమైన క్రైస్తవ జీవితమును జీవించారు. వెంకటరెడ్డిగారి పెద్ద కుమారుడు పెద్ద కొండారెడ్డిగారు కాంట్రాక్టు పనుల మీద మైసూర్‌ రాష్ట్రమునకు యవ్వన దశలోనే రెండవ కుమారుడగు చిన్న కొండారెడ్డిగారు తన తండ్రికి తోడుగా ఇంటిలోనే ఉంటూ వ్యవసాయ పనులలో, తండి కాంట్రాక్టు పనులలోఆయనకు తోడుగా ఉండేవారు. తన తండ్రి క్రమశిక్షణతో కూడుకొన్న జీవితమును కొండారెడ్డిగారు యవ్వనదశ నుండే అలవరచుకున్నారు. తండ్రి నుండి కాంట్రాక్టు పనులలోని మెలకువలు నమ్మకమైన గట్టిపనిని చేయడాన్ని నేర్చుకొన్నాడు.

డబ్బు సంపాదించటానికే కాంట్రాక్టు పనులు చేయకుండా, పనిని సేవగా భావించి నమ్మకమైన పని చేసి కేంద్రరాష్ట్ర ప్రభుత్వముల ప్రశంసలందుకున్నాడు. రైల్వే కాంట్రాక్టు పనులలో గొప్ప నష్టానికి గురైన పరిస్థితులలో కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె ఉన్నారు (కీర్తన 125:1). కారణం, ఆయన దేవుని యందు నమ్మికయుంచి ముందుకు సాగిపోవుటవలనే.

ఆయన వివాహము బలపనూరు గ్రామములో ఒక వనములో జరిగినదని ఆనాటి మిషనెరీలైన రెవ. విల్‌ఫ్రెడ్‌ VY, BS. రూఫస్‌ దొరలు వారి వివాహమును జరిపించారని చెప్పారు. పెండ్లిరోజున శాకాహారము పెట్టినారు, కానీ దొరల కోరిక మేరకు తన తండ్రి వెంకటరెడ్డిగారు మరుసటి రోజు ఆ దొరలకు మాంసాహార విందునిచ్చినారట. మిషనెరీ దొరలు వై.యస్‌. వెంకటరెడ్డిగారిని బహుగా ప్రేమించే వారు, గౌరవించేవారు. కారణం క్రైస్తవ విలువతో కూడిన ఆయన నిజమైన ఆధ్యాత్మిక విశ్వాస జీవితం.

నాకు బహు సంతానాన్నిచ్చి నా కుటుంబమును ఒక వనముగా దేవుడు మార్చాడని కొండారెడ్డిగారు చెప్పేవారు. నా సంతానమే నా ఆస్తియని చెప్పేవారు. నా పిల్లలకు నేను ఎక్కువగా సంపాదించి పెట్టలేక పోయాను. రైల్వే కాంట్రాక్టు పనులలో గొప్పనష్టమునకు గురై చాలా ఆస్తిని పోగొట్టుకున్నాను కానీ దేవుని కృపామహ దైశ్వర్యమునుబట్టి నా కుమారులంతా ప్రయోజకులైనారని తృప్తిపడేవారు.

ఆనాటి కుటుంబ విషయాలకు వస్తే చిన్నకొండారెడ్డి గారి అన్నగారైన పెద్దకొండారెడ్డిగారు 1948 సంవత్సరములో మరణించారు. తమ్ముడు ప్రభుదాస్‌రెడ్డి గారు యవ్వన దశలోనే యేసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరించి సువార్తసేవకు వెళ్ళిపోయారు. తమ్ముడు Sid రాజారెడ్డిగారు రెండవ (ప్రపంచ యుద్ధమునకు వెళ్లి తిరిగివచ్చి, జయమ్మగారిని వివాహమాడి కాంట్రాక్టు పనులు చేయుచు, మైన్సు సంపాదించి పెద్ద వ్యాపార వేత్తగా మారి అనేక ప్రజలకు దీవెనకరమైన కార్యములు చేపట్టి విద్య, వైద్య, సాంఘిక సేవలు చేపట్టారు. ఇక చిన్నకొండారెడ్డి గారైతే తమ్ముడు

↑ Back to top

↑