Chapter 4 of 11

సాక్ష్యాలు 13–15

తన కోడలు సంతోషంగా ఉండాలని కోడలు ముఖములో సంతోషము

చూడాలని నయోమ యొక్క తపన రాతు కళ్ళముకువెళ్ళి వచ్చిన

తరువాత నీ పని యెుట్లు జరిగినదని అడుగుచున్నది. రాతు బోయజు

వివాహము జరుగగానే నయోమ మరల మధురముగా మారిపోయినది.

బోయాజు రాతులకు కుమారుడు కలుగగానే ఆ భడను తీసుకొని

కౌగిట నంచుకొని వానికి దాదీగా మారిపోయినది నయోమ. ఎంత

మంచి అత్త నయోమ. అత్త స్థానానికి న్యాయం చేకూర్చినది. ఈ

పుస్తకము చదువుచున్న అతతలందరు నయోమవలై ఉందురు గాక!

మీ కోడండ్రను అర్థము చేసుకుంటున్నారా? ఆదరిస్తున్నారా?

ప్రేమిస్తున్నారా? వారి కేషమము కోరుతున్నారా? వారి భడడ్లకు దాదిగా

ఉన్నారా? వారి భడడ్లను కౌగిటిలో ఉంచుకొని ప్రేమను

పంచుచున్నారా? ఇవేవి కూడా అనుభవం లేకుండ చెప్పుట లేదు.

ఆచరణలో పెట్టుకొనే అనుభవముతో ధైర్యంగా చెప్పుచున్నాను. ప్రభువు

మహా కృపను బట్టి ఒక అమ్మమ్మగా, నాయనమ్మగా నా బాధ్యతలను

నెరవేర్చి కృపను దేవుడు నాకిచ్చుచున్నాడు. ప్రభువు నాకు ఐదుగురు

మనుమలను, నలుగురు మనుమరాడ్రను ఇచ్చాడు. మనము ఆచరించే

దేవుని బిడ్డలుగా ఉండాలనేదే దేవుని ఉద్దేశ్యము కొన్ని సార్లు కోడండ్లు

అర్థం చేసుకోకపోవచ్చు కొన్ని సార్లు అతతలు అర్థం చేసుకోకపోవచ్చు

ఎవరికి వార మంచి మనసాక్షి కలిగి యండాలి. దేవుని యెదుట

క్రీస్తు న్యాయ పీఠము యెదుట మనమందరము నిలువ వలసి ఉ

ంటుంది. ఈ రోజుల్లో చాలా కుటుంబాలలో ఇదే అసలైన గొడవ.

ఐక్యత ఉన్న దగ్గర ఆశీర్వాదము ఉంటుంది. ప్రేమ ఎప్పుడు ఓడిపోదు.

ప్రేమతో, దేవుని భయంతో ప్రతి సమస్య మనము జయించగలము.

ఈ నాటి కుటుంబాలకు నయోమ రాతు మారగదర్శికం ఎవరి పరిధిలో

వారు ఉంటే సమస్యలను జయించవచ్చు. ఒకరి ఇషాటన్ని మరొకరి

మీద బలవంతంగా రుద్దకుండ అన్ని విషయాలు వివరంగా అర్థం

అయేయ విధంగా వివరిసేత కలహాలు రాకుండా చూచుకుంటే, ఒకవేళ్

వచ్చినా వెంటనే మర్చిపోయే చిన్న పిల్లల మనస్థ్వాం ఉంటే,

సమాదానాన్ని పెంచుకొనుటకు ప్రయాస పడితే దేవునికి మహిమ

మనకు ఆశీర్వాదం. దేవుడు మనలను దీవించనుగాక. ఆమెన్

బైబిలు గ్రంథదము ఏక పక్షంగా ఎప్పుడు చెపపదు. ఎవరికి బోధించేది

వారికి బోధిస్తుంది. (ఒక వైపు మాత్రమే కాదు) అత్తకు బోధిస్తుంది,

కోడలకు బోధిస్తుంది. భార్యకు బోధిస్తుంది, భర్తకు బోధిస్తుంది,

తల్లిదండ్రులకు బోధిస్తుంది. పిల్లలకు బోధిస్తుంది, ఎవరికి దేవుడు

ఏది చెప్పుచున్నాడో అది మనము తీసుకోవాలి.

ఉదా�� భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని ప్రభువు

పసలవిచ్చాడు గనుక ప్రేమిస్తే సరిపోతుంది.

భార్యలారా మీ భర్తలకు లోబడి యండుడి అని ప్రభువు పసలవిచ్చాడు

గనుక లోబడితే సరిపోతుంది. ఎవరికి వార నిరణయించుకోవాలి గాని

భార్య భర్త దగ్గరకు వెళ్ళి ఆ వాక్యాన్ని చెప్పడం, భర్త భార్య దగ్గరకు

వెళ్ళి ఆ వాక్యాన్ని చెప్పి గొడవ పడడం కాదు. ఎవరికి వార వాక్యాన్ని

పాటించాలి. నిన్ను వలై నీ పొరుగువారిని ప్రేమించుము అని చెప్పిన

దేవుడే నీ పొరుగువానిది ఏదియు ఆశింపకూడదు అని చెప్పాడు.

్రిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుమని చెప్పిన దేవుడే

మీ పిల్లలకు కోపము రపకూడదని చెప్పాడు.

వాక్యం ఎదుటి వారికి చెప్పడం కంటే మనకు మనము

బోదించుకోవడం మంచిది. రగైకొనక బోధిస్తే పరలోకంలో అలుపలము

అయిపోతాము అని మత్తయి 5:19లో దేవుడు పసలవిస్తున్నాడు గనుక

రగైకొని ఎదుటి వారికి చెప్పాలి. పరలోక రాజ్యములో గొప్పవారముగా

ఉండాలంటే వాక్యమును రగైకొనువారవై యండాలి. దేవుని త్రాసులో

మనలను తాచినపుడు వాక్యం అనే కొలమానముతోనే

తాచబడుతాము. దేవుని త్రాసులో తేలిపోకుండా ఉండే భాగ్యాన్ని

అతతలకు, కొడ్రండకు దేవుడు దయ చేయును గాక.

Photograph from page 51 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 51

సాక్ష్యం 13. బోయాజు కళ్ళము దగ్గరికి వెళ్ళిన రాతు

బోయాజు కళ్ళములోనికి వెల్లిన రాతు సిద్ధపాటుతో వెల్లినది.

తన అత్త పసలవిచ్చిన ప్రకారము వెళ్ళినది.

నీవు సా�నము చేసి తైలము రాసుకొని నీ బట్టలు వేసుకొని ఆ

కళ్ళమునకు వెళుిము అతడు అన్న పానములు పుచ్చుకొనుట చాలించు

వరకు నీవు అతనికి మరురగై యండుము అతడు పండుకొనిన తరువాత

అతడు పండుకొనిన స్థలము గురెతరిగి లోపలికి పోయి అతని కాళ్ళమీద

నున్న బటటను తీసి పండుకొనవలైను. నీవు చేయవలసిన దానిని

అతడు నీకు తెలియజేయును. రాతు 3:3, 4.

యజమానుడైన బోయజు దగ్గరికి వెళ్ళినపుడు సిద్ధపాటుతో వెల్లాలి.

సిద్దపాటకు ముందు సా�నము చేయాలి. మలినం కడికగసుకోవాలి.

శుభ్ర�ంగా, పరిశుద్ధంగా

ఉండాలి. పరిరగ ఏరుకునేటపుడు ఇంతగా సిద్దపడనవసరము లేదు

గాని కళ్ళములోనికి బోయజు దగ్గరికి వెళ్ళాలంటే మాత్రము సిద్దపాటు

అవసరము.

నీ దేవుని సన్నిధిని కనబడుటకు నీవు సిద్ధపడుము. ఆమోసు

4:12

తైలము రాసకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, నీ తలకు

నానె తకుకవ చేయకూడదు ప్రసంగి 9:8

యోసేపు చెరసాల నుండి పఘరో దగ్గరికి వచ్చినపుడు మంచి బట్టలు

కటకొని ఆదికాండము 41::14

శరీర మాలిన్యము తొలగించుకొనుటకు సువాసన కలిగిన సబ్బులు

వినియోగిస్తుంటాము. మురికిని తొలగించుకుంటాము. అలాకగ ఆత్మను

శుద్ధి చేసుకొవాలంటే వాక్యమనే సబ్బు కావాలి. అందుకే కీర్తనా

కారుడైన దావీదు ఇలా ప్రార్థన చేస్తున్నాడు.

నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును

పరిహారింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు

నన్ను కడుగుము. కీర్తన 51:7 హిస్సోపు అనగా గోడలోనుండి

వెులిచే తీగ మొక్క 1రాజులు 4:33

పూర్వాకాలము సా�నానికి తీగలాంటి ఈ చెటుటను వాడేవారు

అందుకే దావీదు హిస్సోపుతో కడుగుమని చెప్పుచున్నాడు.

బోయాజు ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యము, రాతు

సంఘమునకు సాదృశ్యము, సా�నము బాపీతస్మమునకు సాదృశ్యము.

రాతు సా�నము చేసుకొని బోయాజు దగ్గరకు వెళ్ళినది. నానె

ప్రార్థనకు పరిశుదా�త్మకు సాదృశ్యము. మంచి బట్టలు అనగా బైబిలులో

రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, ప్రశసత వస్త్రము, ఉల్లాస్ వస్త్రము, పెండ్లి

వస్త్రము, దీనమనససు అనే వస్త్రము, రకరకాల వస్త్రముల గురించి

వివరించబడింది. అందుకే మంచి బట్టలు కట్టుకొని వెళ్ళాలి.

అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళ్ంకవైనను,

ముడతయె�ునను అట్టిది మరి యేదైనను లేక, పరిశుద్ధవైనదిగాను,

నిరో�షవైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట

దానిని నిలువబైట్టుకొనవలైనని, వాక్యముతో ఉదక సా�నము చేత,

దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుట్రై దాని కొరకు తన్ను తాను

అపపగించుకొనెను. ఎ్రేఫసి 5:27.

బోయాజు దగ్గరికి వెల్లిన రాతు సా�నము చేసి తలకు నానె

రాసుకొని, వస్త్రములు ధరించుకొని సిద్ధపడినది. అటువలైనే దేవుని

బిడ్డలు బాపీతస్మము తీసుకొని ప్రార్థనతోను, పరిశుదా�త్మతోను క్రీస్తును

ఎదుకొకన వలసి యున్నదని గ్రహించి జీవించవలైను. ప్రతి దినము

మనలను మనమే ఆత్మ సహాయంతో సిద్దపరచుకోవాలి. రాతు

బుయాజు పాదాల దగ్గర ఉన్నటుటగానే, దేవుని బిడ్డలు ఎల్లప్పుడు

దేవుని పాదాలు ఆశ్రయించాలి. రాతు నేను నీ దాసురాలను అని

చెప్పుచున్నది. రాతు 3:9.

Photograph from page 54 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 54

సాక్ష్యం 14. యోగ్యరాలు

అతడు - నా కుమారీ, యెహోవా చేత నీవు దీవెన నొందిన

దానవు, కొద్దివారినే గాని, గొప్పవారినే గాని, యవవానసు�లను నీవు

వెంబడించక యండుట వలన నీ మునుపటి సత్ ప్రవర్తన కంటే

వెనకటి సత్ప్రవర్తన మరి యెకుకవైనది. కాబట్టి నాకుమారీ,

భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేపసదను. నీవు

యోగ్యరాలవని నా జనులందరు ఎరుగుదురు. రాతు 3:11

రాతు చాలా సత్ప్రవర్తన కలది. తన ప్రవర్తనను చాలా

కాపాడుకొన్నది. ఎవరివైపు ఎప్పుడు చూడలేదు. నిందించుటకు

ఎవవారికి అవకాశమవవాలేదు. ఏ కోణంలో చూసినా సుబుద్దిగల

మాటలోను, చూపులోను, పనిలోను, ప్రవర్తనలోను, అలంకరణలోను,

ఏవిషయంలో కూడ తప్పు పటటలేనంత జాగ్రత్తగా తన్ను తాను

కాపాడుకొన్నది.ఈనాటి పిల్లలకు మాదిరిగా నిలిచింది.

నీ యవవానమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించనీయకుము

గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను,

పవిత్రతలోను, వివ్వాసులకు మాదిరిగా ఉండుము. 1తిమోతి 4:

అను దేవుని వాక్యమును రాతు తాచ తప్పకుండా పాటించింది.

యోగ్యరాలు అనగా అన్ని అర�తలు కలిగినది. ఆ సంగతి జనులందరికి

తెలసు.

ఇలాంటి ప్రవర్తన కలిగినవారు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు.

ఇలాంటి ప్రవర్తన లేక ఎన్నో కుటుంబములు కూలిపోవుచున్నవి.

పసల్ఫోనులో గంటల కొద్ది మాట్లాడుతూ ఎవరితో మాట్లాడుతున్నామో

తెలియకుండా, ఎవరితో మాట్లాడుతున్నామో అర్థము కాకుండా

ముఖమునకు ముసుగు కప్పుకొని, క్రమము లేకుండా ఉంటు భర్తలకు

ఇష్టము లేని వారితో మాటలు, పరిచయాలు పెంచుకొంటు విచ్చల

విడిగా దేవుని భయము లేకుండా బ్రతికితే కుటుంబములు ఎలా

స్థిరపడును. దేవునికి ఒక ్రకమమున్నది. ఆ ్రకమమును రాతులో

చూడగలము. అందుకే యోగ్యరాలుగా ఎంచబడింది.

ఈనాడు ఇలాంటి ప్రార్థన విన్నపములే చాలా మంది ఇస్తున్నారు.

మా పిల్లల కుటుంబాలు స్థిరపడాలని కన్నీరు పెట్టుకునేవారు

అనేకమంది ఉన్నారు గనుక ప్రియమైన దేవుని భడడ్లారా, తల్లులారా,

మన పిల్లలను చక్కని ఉపదేశములోను, ్రకమములోను పెంచవలైను

అనే బాధ్యత దేవుడు మనకిచ్చాడని మరువకూడదు. రాతు మోయాబు

దేశసతురాలైనా, ఆమె దేవుని క్రమములో పెరిగినది. అందుకే ఆమె

యోగ్యరాలని అందరికి తెలిసినది. కొంత మంది నా భర్తకు నేను

నాకు నా భర్త ఉంటే చాలు అన్నట్లుగా ఉంటారు. కాని రాతు

యోగ్యరాలు అని జనులందరు తెలసుకునే విధంగా ప్రవర్తించింది.

ఇంట, బయట మంచి సాక్ష్యము పొందుకోవాలి.

నీ ప్రవర్తన అంతటియుందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము

సామె 3:6

దయను, సత్యమును ఎన్నడును నిన్ను విడచిపోనీయకుము, ..

అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టియుందును నీవు

దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. సామెతలు 3:3

మరియు చనిపోయిన వారి పేరిట అతని స్వాస్థ్యము

స్థిరపరచనట్లును చనిపోయినవారి పేర్లు అతని స�దరులలో

నుండియు, అతని స్థలము యొక్క ద్వారము నుండియు కొట్టి వేయబడక

యండునట్లును నేను వహ్లోను భార్యయె�న రాతను

మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను.

దీనికి మీరు ఈ దినమున సాక్షులైయున్నారని పెద్దలతోను,

్రపజలందరితోను చెప్పెను. రాతు 4:10

ఈ రీతిగా క్రమమైన పద్ధతిలో బోయజు రాతును పెండ్లి

చేసుకొనెను.

యోగ్యరాలు తన పెనిమటికి కిరీటము. సామెతలు 12:4

Photograph from page 57 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 57

సాక్ష్యం 15. యేసు క్రీస్తు వంశావ[లోకి వచ్చిన రాతు

యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్రీతని ఇశ్రాయేలీయుల వంశమును

వర్థిల్లచేసిన రాేాలనును పోలిన దానిగాను, లేయాను పోలిన

దానిగాను చేయును గాక.

రాతు 4:12

కాబట్టి బుయాజు రాతును పెండ్లి చేసికొని ఆమె యొద్దకు

పోయినపుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను

గనుక ఆమె కుమారుని కనెను.రాతు 4:13

అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రియైన

యెష�యి యొక్క తండ్రి.రాతు 4:17

కేవలము ఎండిపోయిన రాతు, మోడుబారిన రాతు, ఇంతగా

ఆశీర్వాదింపబ డుటకు కారణము?

భర్త లేడు, సంతానము లేదు, శాపగ్రస్తమైన వంశము అత్త తప్ప

నా అనే వారు లేరు. తనకున్నదల్లా మంచి ప్రవర్తన పని చేసే

చేతులు, యధార్థమైన భక్తి. ఈ సుగుణాలు ఎవరు కలిగి ఉన్నా

దేవుడు తప్పక దీవిస్తాడు. రాతును దేవుడు ఆశీర్వాదించాడు.

కూడివచ్చిన స్రీతలందరు రాతును వెుచ్చుకొన్నారు.

రాతు ఏడుగురు కుమారుల కంటే ఎకుకవ. రాతు 4:

వంశ్వృకషమును వర్థిల్లచేసిన స్రీత. ఏ పొలములో పరిరగ ఏరుకున్నదో,

దానికి ఆమె ఇప్పుడు యజమానురాలు. రాతును బట్టి నయోమకి

బందువులు కలిగారు. దేవునికి మహిమ కలిగినది. రాతు కుమారుడు

నయోమకి ముస్లితనమందు పోషకుడయయాడు

అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదము రాతు క్రీస్తు వంశావ[లోకి

వచ్చినది.

మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము మొదలుకొని

యేసు క్రీస్తు వరకు 42 తరముల వంశ వృక్షము వ్రాయబడియున్నది.

అందులో కేవము ఐదుగురు స్రీతలను మాత్రమే ఉదహారించాడు.

తామారు, రాహాబు, రాతు, }రియా భార్యగా ఉండిన ఆమె (పేరు

రాయబడలేదు), మరియ. ఈ ఐదుగురు స్రీతలు మాత్రమే క్రీస్తు

వంశావ[లోకి చేర్చబడుట ఎంతో గొప్ప విషయము.

అబ్రాహాము శారానందు, ఇస్సాకు రిబాక నందు అని

వ్రాయబడలేదు గాని పైన ఉదహారించబడిన ఐదుగురు స్రీతలు కూడా

చాలా ప్రతికూల పరిస్థితులలో నుండి వచ్చిన వార ఇందులో రాతు

చేర్చబడుట ఎంత సంతోషకరము.

నయస్సోను శల్మానను కనెను, శల్మాను రాబునందు

బోయాజును కనెను, బోయాజు రాతునందు ఓబైదును కనెను. ఓబేదు

యెష�యిని కనెను, యెష�యి రాజైన దావీదును కనెను. మత్తయి

1:5

రాతును చెయియ పట్టి నడిపించిన దేవుడు ఎవవారినయినా

నడిపించగలడు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎన్నడును మాట

తపపనివాడు. మాట తప్పని దేవుని దగ్గర మాట తప్పని జీవితము

జీవిద్దాము.

నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను

అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు,

నేను భయపడను, నరమాత్రుడు నాకేమ చేయగలడు? అని మంచి

ధైర్యముతో చెపపగలవారవైయున్నాము.

హెా;్ర 13:5, 6

సమస్యలను బట్టి ఎవరు కృంగిపోకూడదు. కృంగిన వారిని లేవనెతేత

దేవుడు, పడిపోయిన వారిని ఉద్దరించే దేవుడు.

రాతును దీవించిన దేవుడు నిన్ను దీవించను గాక!

ముగింపు

రాతు మొదటి అధ్యాయంలో బైత్లహేాము అను }రిలోనికి వచ్చినది

రెండవ అధ్యాయంలో బోయాజు పొలములోనికి వచ్చినది

మాడవ అధ్యాయంలో కళ్ళములోనికి వచ్చినది

నాలుగవ అధ్యాయంలో కళ్యాణములోనికి వచ్చినది

మత్తయి సువార్త మొదటి అద్యాయంలో

రాతు క్రీస్తు వంశావ[లోనికి వచ్చినది.

ఈ రీతిగా రాతు అంచలంచలుగా వర్థిల్లినది.

నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన యెడల, సరవాశకుతడగు దేవుని

బతిమాలుకొనిన యెడల, నీవు పవిత్రుడవై యధార్థవంతుడవైనయెడల

నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా

నీ నివాస స్థలమును వర్థిల్లజేయును. అపుడు నీ స్థితి కొద్దిగా

ఉండినను నీవు తుదకు మహాభివృది� పొందుదువు. యోబు 8:5-7

రాతును దీవించిన దేవుడు వాక్యానుసారముగా జీవించే ప్రతి

ఒక్కరిని దీవించగలడు.

రాతు జీవితము

↑ పైకి / Back to top