Chapter 3 of 9

సాక్ష్యాలు 10–16

యేసు క్రీస్తు మలచిన జీవితాలు66

Photograph from page 36 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 36

సాక్ష్యం 10. అన్య కుటుంబంలో జన్మించి బాల్యంలో

పూజలు చేస్తూ గడిపాను. పేరికంలో జీవించాము.

నాన్న అకాల మరణం వల్ల అమ్మ నన్ను, అక్కను కష్టపడి

పెంచింది. నా బంధువుల ద్వారా క్రీస్తును నవ్ముకొని

భక్తితో వెంబడించాము. ఆత్మీయంగా ఎదిగాము.

మంచి భర్తను, పిల్లలను దేవుడు అనుగ్రహించాడు.

నాకు సేవ పిలుపునిచ్చారు. నేను నా భర్త సేవలో

సాగిపోతున్నాము.

సిస్టర్ కరుణ గ్రేస్ గారు,

అనకాపల్లి

ఫోను : 7032805191

నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కీర్తన 103:1

1. పరిచయం:

ప్రభువు నామములో వందనాలు. నా సాక్ష్యము

వివరించు ధనయకై దేవుని స్తుతిస్తున్నాను. నేను హిందా

కుటుంబంలో జన్మించాను. విపరీతంగా పూజలు

చేసేదానిని. నా పేరు భారతి క్రీస్తును నమ్మిన తరువాత

నా పేరు కరుణ గ్రేస్గా మార్చబడింది. నా తండ్రి పేరు అట్ట

బాబురావుగారు, అమ్మ పేరు నాగమణిగారు. ఇద్దరు కుమారెతలు ఒక

కుమారుడు కలిగారు. నేను రెండవ కుమార్తెను. తల్లిదండ్రుల మాటను

బట్టి శివ పూజ ఎకుకవగా చేసేదాన్ని. కారితకమాసంలో మరెకుకవగా పూజలు

చేసేదానిని. కారితక సోమవారం కొరకు అన్ని ముందుగానే సిద్ధపరచుకునే

దాన్ని. స్వయంగా వత్తులు చేసేత దీవెన వస్తుందని నేనే వత్తులు చేసేదానిని.

భవాని మాల నాన్నగారు తరచగా వేసేవారు. పూజ కొరకు అరటిపండ్లు,

కుంకుమ, పసుపు, హారతి, వత్తి సిద్ధపరచి, శారదా నది ప్రాంతం చేరదానిని.

101 వత్తులు చేసేదాన్ని తెల్లువారుజామున 4 గంటలకు ముఖానికి పసుపు

రాసుకొని, సా�నం చేసి, మట్టిని తీసుకొని, విగ్రహాంగా చేసి, పూజ చేసి,

హారతి ఇచ్చి, హారతిని నీటిలో వేసి, చంద్దుని చూచి, అరటి ఆకులో

అన్నం తినేదాన్ని. దీపం నదిలో వేసినపుడు మునిగిపోగా చాలా ఏడ్చాను.

మా నాన్న బాగా ్రతాకగవారు. రోజు గొడవపేవాడు. నాన్న తాగినపుడు

అకారణంగా బాధించేవాడు. పిల్లలం ఇంటి నుండి పారిపోయి తెలిసిన

వారి ఇంట్లో పండుకొని ఉదయాన్నే తిరిగి వచ్చేవారము. ఆ బాధలు

తట్టుకోలేక అమ్మ, మేము కలిసి తుని అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాము.

అమ్మమ్మ క్రీస్తును నమ్మిన విశ్వాసుల ద్వారా క్రీస్తును నమ్మి ప్రార్థన

చేసుకునేది. మందిరానికి క్రమంగా వెళ�్లది. మేము డిపసంబరులో వెళ్ళినందున

ఆమెతో పాటు మందిరానికి వెళ్ళాము. అమ్మమ్మ పేరు నర్సమ్మ గారు

మంచి విశ్వాసిగా జీవించారు.

ఆ రాత్రి పూరిపాకలో ఆరాధనకు నేను అమ్మ, అక్క వెళ్ళాము.

మంచి భావం గల పాటలు పాడారు. నాకు చాలా ఆనందం కలిగింది.

నేను ఆ రక్రైస్తవ వాతావరణాన్ని చాలా ఇష్టపడాను. పాటలు వింటున్న

సమయంలో ఒక స్వరమును విన్నాను. నేనే దేవుడను, నేనే దేవుడను అనే

మాటలు వినబడ్డాయి. దేవుడు తనకు తాను నాకు పరిచయం చేసుకున్నాడు.

చాలా ఆశ్యర్యం కలిగింది, నాకు వింత అనుభవం. నేను దేవుని కొరకు

కనిపెటాటను. నేను యేసయ్యను నవ్ముకుంటనని నిబంధన చేసుకున్నాను.

నాకు తెలిసిన మాటల్లో ప్రభువా నీ మాటలను నమ్ముతున్నాను. నేను

విగ్రహారాధన చేయను, నీవే నా దేవుడవు అని తెలిపాను. దేవునిని రక్షకునిగా

అంగీకరించాను. ఎవరికి భయపడరాదని దృడిడ నిశ్చయంతో ఉన్నాను.

2007లో నాకు దేవుడు వాగ్దానమిచ్చాడు.

నా పరిశుద్ధ పరవాతమునకు నిన్ను తోడుకొని వచ్చెదను అనే వాగ్దానం

పొందాను. దీనిని బట్టి దేవుని మహిమ పరుస్తూ దేవునిని స్తుతించాను.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు68

నా అనుభవం గురించి ఎవరితో చెప్పుకోలేదు. అమ్మమ్మ గారి ఇంటి

నుండి మా ఇల్లు చేరాను. మా నాన్న పూజ చేసి వెళ్ళిన తరువాత టి.వి.లో

వాక్యం వింటూ బలపడాను. క్రీస్తును గురించి తెలసుకోవాలన్న ఆశ

నెరవేర్చారు. మా నాన్న వ్యసనాల వల్ల మరణించారు. అమ్మ కూడ దేవునిని

నవ్ముకున్నారు. అమ్మమ్మ అమ్మను మందిరానికి నడిపించింది. నేను

రహస్యంగా భక్తిని చేయుటకు ఆరంభించాను. నేను ఇంటర్లో ఉన్నపుడు

మామాలుగా చదివేదాన్ని, కానీ దేవుని నమ్మి, ప్రార్థించిన తరువాత నా

చదువును దేవుడు గొప్పగా దీవించగా, బై.పి.సిలో ప్రథమ స్థానం పొందాను.

తరగతిలో ప్రగతి పొందాను. కొందరు సొవ్ము ఇచ్చారు. ఇంటర్ తరువాత

నర్సింగ్ చదువాలనుకున్నాను. అప్లై చేసి రోజు ఆశతో ఎదురు చూచేదాన్ని.

ఒక పుస్తకంలో వాక్యం రాసుకొని కంఠత చేసేదాన్ని. నర్సింగ�లో సీటు

రాలేదు. ఆ పుస్తకంలో ఒక మాట రాసాను.

ప్రభువా ఏది చేసినా నీవు నాకొరకు మంచిది చేయగలవని నమ్మాను.

ఆ తరువాత వారంలో నాన్న మరణించారు, సీటు వచ్చాక నాన్న మరణానికి

మరలా రావలసి వచ్చేది. అది వేలుగా తోచింది. మేము ఆర్థికంగా దీన

స్థితికి చేరాము. బాల్యంలో రాయి తగిలి బుప్పి కట్టింది. అది పెరుగసాగింది.

అది తీసివేయాలి అన్నారు. అది పెరిగితే చాలా ప్రమాదం అన్నారు. తగిన

సమయంలో ఆపరషను చేయగా స్వస్థత పొందాను. మరొకసారి నా పండ్ల

చిగురు నుండి రక్తం కార్సాగింది. ఆసుప్రతిలో శుభ్రం చేయించుకున్నాను.

పండ్ల ఇరుకులకు కుట్లు వేసారు. స్వస్థత కొరకు ప్రార్థించాను. నేటి వరకు

ఆరోగ్యంతో ఉన్నాను. నాకు మరొక బాధ ఆరంభవుయింది. నా రొవ్ముపై

బుప్పి చూచి బాధపడాను. డాక్టు పరీక్షించి ఆపరషను చేయాలన్నారు.

ఆపరషను వద్దు ప్రభువా, అని ప్రార్థన చేయగా ప్రార్థన నానె రాయగా

దేవుడు స్వస్థతనిచ్చాడు. బుడిపెను తీసేసాడు. అక్క టీచరుగా చేరింది.

నేను కంప్యూటరు నేరచుకున్నందన చిన్న ఉద్యోగంలో చేరాను. వివాహాల

కొరకు భారంగా ప్రార్థన చేసాము. మాకు ఒక చిన్న పెంకుటిల్లు ఉంది.

అక్క పని చేస్తున్న సాకలులో ప్రధానోపాధ్యాయుడు కట్నం లేకుండా అక్కను

వివాహం చేసుకున్నాడు. అమ్మమ్మ నా కొరకు సంబంధం చూడాలని ఫోటో

ఇస్తుండగా, ఒకామె మంచి సంబంధం గురించి తెలిపింది. నాకిచ్చిన

వాగ్దానం చూడమని ప్రభువు తెలిపారు. 2 రోజులు నా వివాహం కొరకు

ప్రార్థించాను. నాన్న లేకపోయినా దేవుడు ఏ లోటు రాకుండా పోషించాడు.

కట్నం ఇవ్వకుండా వివాహం జరగాలని ప్రార్థన చేసాను. నాకు అద్భుతంగా

దేవుడు వివాహం జరిపించారు. నేను నా భర్త విశాఖలో స్థిరపడ్డాము.

నేను గర్బుపఘలం కొరకు ప్రార్థన చేయగా నాకు గర్బుపఘలం దయచేసారు.

డాక్టు సహాయం లేకుండా నార్మల్ డెలివరీ జరిగింది. అందమైన పాపను

ఇచ్చారు. చాలా బాధలు ఎదురొకన్నాము. యోసేపు జీవితం జ్ఞాపకం

చేసారు. సేవకు రావాలని ఆశించాము. అది కరోనా రెండవ సారి వచ్చింది.

జ్వరం వచ్చి తగ్గలేదు, నా భర్త చాలా శ్రద్ధగా పరిచర్య చేసారు. కరోనా

రావద్దని ప్రార్థన చేసాను. ప్రభువు నాతో భయపడవద్దు అని మాట్లాడారు.

ఆసుప్రతికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నాను కరోనా పాజిటివ్ వచ్చింది.

నా భర్తకు, పాపకు కరోనా రావద్దని ప్రార్థన చేసాను. మాడవ

రోజు చాలా బలహీనంగా మారాను. పల్స్ 90 నుండి 50కి పడిపోయాయి.

మరణం చెందకుండా నేను బ్రతకాలి ప్రభువా అని ప్రార్థన చేసాను. వెంటనే

పల్స్ నార్మకు చేరింది. ప్రభువు మాట ప్రకారం సేవ కొరకు పల్లెటూరు

వెళ్ళడానికి నిరణయించుకున్నాము. నా చిన్న పాప కూడ నాకు ధైర్యం చెప్పి

ప్రార్థన చేసింది. 13 రోజుల తరువాత కరోనా పూర్తిగా తగిగంది. నా పాప

నన్ను చూచి ఆనందంతో ముద్దాడింది. నా భర్త ఉద్యోగానికి రిజైన్ చేసారు.

మా పెద్దనాన్నగారి అబ్బాయితో మాకు మాటలు లేవు. అన్నయ్యతో

సమాధానం పొందాలని ప్రార్థన చేయగా ప్రేమగా మాట్లాడాడు. నాకు

రెండవసారి గర్బుపఘలం కావాలని ప్రార్థించాను. నా చేతిలో ఒక పఘలం

ఉంచినట్లు దర్శనంలో చూచాను. నా భర్తతో చెప్పాను. అది ఆత్మ పఘలవెా,

గర్బుపఘలవెా తెలియదు అన్నాను. తరువాత 15 రోజులకు గర్బుం నిలిచిందని

యేసు క్రీస్తు మలచిన జీవితాలు70

Photograph from page 38 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 38

తెలసుకున్నాను. దేవునికి మహిమ స్తుతి చెల్లించాను. నేను రౌతులపుడి

నుండి విశాఖ చేరి మరలా అదే గ్రామం చేరాము. నాకు పరీక్ష చేయాలన్నారు.

వి.డి.ఆర్.ఎల్ పరీక్ష చేయగా పాజిటివ్ వేసత అబార్షను చేయాలన్నారు.

మరలా కనిపెడదాం అని ధైర్యం చెప్పారు. ప్రార్థించుట ఆపలేదు. పరీక్ష

రిపోరుట ఫోనుకు పంపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల దేవునికి రిపోరుట

నెరగటివ్ రావాలని భారంతో ప్రార్థించాను. నీ సన్నిధిలో సాక్ష్యం చెబుతాను

అని మొఱ్ఱపెట్టాను. ప్రభువు నెరగటివ్ రిపోర్టు దయచేసారు.

నేను 9 నెలల గర్బుంతో ఉండగా ఉమ్మ నీరు తకుకవగా ఉంది

అన్నారు. నొప్పులు లేవు అన్నారు, భడడ్ బరువుగా ఉంది అన్నారు. నొప్పులు

లేకుండా తగిన సమయంలో ఆయన కృపతో నార్మల్ డెలివరి అయింది.

చక్కని పాపను ఇచ్చారు. పాపకు కామెర్లు వచ్చాయి, పాపను బాక్సులో

పెటాటరు. కన్నీటి ప్రార్థనలో నా బలహీనతలను ఒప్పుకున్నాను. పాపకు

దేవుడు ఇచ్చిన జీవమును బట్టి జైస్సికా అని పేరు పెటాటను. ఆ పేరుకు

దేవుని శక్తి అని అర్థం. మందిరంలో సాక్ష్యం చెప్పాను. కృతజ్ఞతతో నా

జీవితాన్ని పాటగా రాసాను. నా కొరకు సేవ కొరకు ప్రార్థన చేయండి.

లోకానికి వచ్చావా ప్రభువా అనయల నుండి లకొకచ్చావా

లోకాశల నుండి లకొచ్చావా, నీవు ఎవరో తెలియదు ఒకపుడు

నీ }సే తెలియదు నాకపుడు వ్యర్థంగా తిరిగాను వ్యరు�డనైపోయాను.

తల్లిదండ్రులు వెుకికంది పూజలు చేసాను. నను రక్షించిన దేవా వందనాలు

ప్రభువు అందరిని దీవించను గాక. ఆమెన్

సాక్ష్యం 11. పల్లెటూరులో విందువుగా జీవించాను

చదువు లేనందన డ్రైవరుగా పనిలో చేరి వ్యసనాలకు

గురయయాను. దురభ్యాసాలకు బానిసగా మారాను.

విశ్వాసుల సువార్త ద్వారా నా తల్లి రక్షించబడి నా

కొరకు ప్రార్థించగా రక్షణ పొందాను.

దేవుడు నన్ను సేవలో నిలిపారు.

బ్రదర్ సీటపెఫన్ గారు,

పఫిరంగిపురం

ఫోను : 9948432777

ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను

అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్దపు అగాధములలో నీవు

పడవేతువు. మీకా 7:19

1. పరిచయం:

ప్రభువు నామములో వందనాలు. మేము మా తాతల

కాలం నుండి విగ్రహారాదికులం. అంకమ్మ దేవతను

పూజించేవారం. నాన్న పేరు అంకమ్మ తల్లి, అమ్మ పేరు

సీతారావమ్మ. ముగ్గురం అన్నదవ్ముళ్ళం. సత్య నారాయణ,

దురాగరావు, నా పేరు ఏడు కొండలు అని పేరు పెటాటరు. మాది కృషాణ

జిల్లా ఇబ్రహీం పట్నం మండలం, కేతన కొండ గ్రామము. జీవనోపాదిరకై

గుంటూరు మర్చియూరడులో అన్నయ్యలు పని చేసేవారు. కొందరి విశ్వాసుల

సువార్త ద్వారా మా రెండవ అన్న, వదిన క్రీస్తును నవ్మారు. నీటి బాప్తిస్మం

తీసుకున్నారు. మందిరానికి వెళూత ఆత్మీయంగా బలపడ్డారు. నేను 10వ

తరగతి వరకు చదివిన తరువాత ముర�ా పని చేసేవాడిని. తరువాత మోటరు

పని చేస్తూ క్లీనరుగా చేరాను. 1995లో డ్రైవరుగా మారాను. ఆ తరువాత

యేసు క్రీస్తు మలచిన జీవితాలు72

దురలవాట్లు నేరచుకొని పతనమయయాను. అమ్మ కూడ క్రీస్తును నవ్ముకున్నది.

మా దగ్గరలో సువార్త కూటములు పెటాటరు. ఆదరణ కర్తతో స్థాపించిన

మాధయగారు మేనత్త మేనమామ పిల్లలము. మీటింగుల సమయంలో

దారంగా వెళ్ళాను. నన్ను చూచి పిల్లను ఇవ్వడానికి ముందుకు రాలేదు.

నేను కూడ పంతులు దగ్గరకు వెళ్ళి మాలపాడులో సీతరామయ్య అల్లుడు

పురోహితుడుగా ఉండేవాడు. మా అమ్మ నమ్మిన దేవుడు గొప్ప దేవుడు

మంచి దేవుడన్నాడు. మరి మీరెందుకు వెంబడించలేదని ప్రశ్నించాను.

నీవు అడుగరాదు నేను చెపపకూడని సత్యాలు అన్నాడు. ఆయన శ్లోకాలు

చెప్పాడు. అసతోమ సదగమయా, సమతోవు జోతిర్గమయా మృత్యోమ

అమృతాంగమయా వివరించాడు.

అసత్యంలో నుండి సత్యంలోకి నడిపించుట, చీకటిలో నుండి

వెలుగులోకి నడిపించుట, మరణం నుండి జీవంలోకి నడిపించుట అని

అర్థం. ఆ దేవుని గురించిం తెలసుకోవాలని ఆశించాను. నాలుగు శ్లోకాలు

తెలిపాడు. దేవాది దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో కన్యక గర్బుమున

జన్మించాలి. ఆయన పరిశుదు�డై యండాలి అన్నాడు. అంతే కాదు ఒక

చెట్టు కొమ్మకు వ్రేలాడదీయబడి, మేలుకు కొటాటలి అన్నాడు. ఆయన

నిరో�షవైన, నిషకలంకవైన రక్తం చిందించబడాలి అన్నాడు. ప్రాణం పెట్టి

మరణించి తిరిగి లేవాలి. ఆయనే క్రీస్తు అన్నాడు. ఆయననే నీ తల్లి

ఆరాదిస్తుంది. ఆమె నమ్మిన దేవునిని నవ్ముకో అన్నాడు. ఆ మాటలు విని

ఇంటికి వెళ్ళాను. ్రతాగుతానే కాసత ఆలోచించాను. ఇంటికి వెళ్ళిన తరువాత

తల్లి ఏడసతూ నా కోసం ప్రార్థించుట చూచాను. మాథదయస్ స్నేహితుని

ద్వారా ఒక పేద అవ్మాయితో వివాహం జరిగించాడు. దైవజనుడు మంచి

వాక్యం చెప్పాడు. త్రాగుడు పందికి కూడ నచ్చిదు. మీరెందుకు

తాగుతున్నారని ప్రశ్నించగా, నేను త్రాగడం మానేసాను. నేను దొంగ లెక్కలు

రాసేవాడిని మానేసాను. 5 వేలు ఖరచు పెట్టి మాథదయస్ తవ్ముడు సేవ చేసే

వ్యక్తితో స్నేహంగా ఉండేవాడిని. ఆదరణ కరత మందిరానికి వెళ్ళి ఆ జీపు

తోలేవాడిని. ఆ రోజుల్లో కమయానిస్టులతో తిరిగాను. నాటకాలలో చేరాను.

నేను 1994లో హీరో వేషం వేసాను. 2001లో నాకు వివాహం అయింది.

2002లో నీటి బాప్తిస్మం తీసకున్నాను. ఉద్యోగం మానేసి చిన్న వ్యాపారం

చేసుకుంటా, సేవకులను వెంబడించేవాడిని. 2005లో 5 మంది సేవకు

సమర్పించుకున్నారు. ఆయా ప్రాంతాలకు సేవ కొరకు పంపేవారు. నన్ను

మాత్రం దారం పంపలేదు. జీపు నడపడానికి నేను అవసరమయయాను.

మునగపాడులో సేవకు పంపారు. 150 రూపాయలు ఇచ్చారు. సంఘం

లేదు ప్రార్థన చేయమన్నారు. భయ్యం ఇచ్చారు. ప్రతి చెట్టు దగ్గర కగదెలను

కట్టేవారు. ఆదివారం చెటుట కింద పటాట కట్టి నేను నా భార్య కూరచున్నాము.

్రడవ్ము కూడ లేదు. చప్పట్లు కొడుతా ప్రార్థన చేయసాగాము.

ఎయిడ్సతో బాధపడిన వ్యక్తిని మీ దేవునికి ప్రార్థన చేయండి అని

ఒక చాపపై పడుకో బైటాటరు. ఒక గంట ప్రార్థన చేసాము. ఆమె పేరు

రమాదేవి. ప్రార్థన చేసిన తరువాత లేచి కూరచున్నది. నీళ్ళు తాగింది.

గతంలో ఆమె లేచి కూరచునేది కాదు. వీపుపై గడడ్ ఉండేది. అది పగిలింది.

ఎవరా దగ్గరికి రాలేదు. ఆ గడనుండి చీము రక్తం కారుచుండగా, శుభ్ర�

పరిచాము. ఆమె స్వస్థత ద్వారా ఆ ప్రాంతీయులకు నమ్మకం కలిగింది.

దగ్గరలో చిన్న స్థలం ఆ }రి వాళ్ళు చూపారు. ఒక చిన్న పాకను ని]్మంచి,

ప్రార్థన ప్రారంభించాము. మరొక రోగిని తెచ్చారు. ఆమెకు ప్రార్థన నేరాపము,

పాక పరిచర్య చేయమని ఒప్పుకోమన్నాము. ఆమె మందు వాడుట

మానేసింది. ఆ పాక వర�కాలంలో బభ్రదతనిచ్చింది. సమీపంలో ఉన్న

ఇళ్ళు దర్శంచేవారం. మెదడులో వుచ్చి గల స్రీత చాలా స్థలాలలో వైద్యం

చేయించుకొనగా స్వస్థత పొందలేదు. నా దీన ప్రార్థన ద్వారా స్వస్థత

పొందింది. చాలా కాలంగా పరిచర్యలో ఉంది. ఒక అమ్మాయికి రకత స్రావం

కలిగింది. వివాహానికి పనికి రావన్నారు. తల్లిదండ్రులు దు:ఖపడ్డారు. ప్రార్థన

ద్వారా స్వస్థత పొందింది. ప్రభుకుమారి కండకటరుగా పని చేస్తుంది. వివాహం

అయింది, దేవుడు కుమారుని ఇచ్చాడు. నా సేవలో మొదటి సాక్షి రమాదేవి,

రెండవ సాక్షి మెదడులో వుచ్చి ఉన్న స్రీత స్వస్థత పొందింది. రకతస్రావం గల

స్రీత బాగయింది. ప్రభుకుమారి మంచి ఆరోగ్యం పొందింది. సతెతనపల్లిలో

స్థిరపడింది. నాకు నాలుగు పసంట్ల స్థలం ఇచ్చారు. చర్చి ని]్మంచాము.

నాకు ఇద్దరు పిల్లలు కలిగారు. చాలా అవమానాలు ఎదురొకన్నాము. స్థలం

యేసు క్రీస్తు మలచిన జీవితాలు74

Photograph from page 40 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 40

పల్లముగా ఉన్నందన 50 ట్రిపపుల మట్టి కావాలన్నారు. 49 పూరతయిన

తరువాత ఒక వ్యక్తి నరుకుతానని వచ్చాడు. పని ఆగిపోయింది. నన్ను

బాధించిన వ్యక్తి ట్రాక్టు కింద పడి మరణించారు. డబ్బు లేదు, భయ్యం

కూరలు ఉండేవి కాదు, మాథదయస్ గారితో మీటింగులు చేయదలిచాను. ఆ

రోజుల్లో నా భార్య ప్రసాతి సమయం వచ్చింది. ప్రమాద స్థితికి చేరింది.

అన్నపూరణమ్మ డాకటరుగారు 30 వేలు అడిగారు. బసవ పూరణయ్య డాక్టు

దగ్గరకు నా భార్యను తీసుకొని వెళ్ళాము. మందు ఇచ్చింది. నొప్పులు

వచ్చి, కంటుందని బలపర్చింది. మందులు 6 రూపాయలకు కొనిచ్చాను.

ప్రార్థన చేస్తూనే ఉన్నాను. పాస్టరుగారు అని నన్ను పిలిచి సుఖ ప్రసాతి

కలిగింది అని చెప్పారు. మా పట్ల అద్భుతం చేసినందుకు దేవుని

స్తుతించాము. నేను మీటింగులకు వెళ్ళాను. నా పాట అందరు పాడుట

నాకానందం కలిగింది. సంతోషమే సంబరమే ప్రభు యేసు పుటాటడని పాట

పాడారు. లారి పని చేసేటపుడు అసరభ్యతతో, ముర�తవాంలో జీవించేవాడిని.

ఒకసారి లారి లోడు తీసుకొని వెళుతుండగా నానె ట్యాంకరు పెఫయిల్

అయింది. క్లీనరుకు మంటలు తాకాయి, కాలకు మంటలు అంటుకోగా

కాలు నరికేసారు. కేరళ్ ఆసుప్రతిలో చేర్చాము. నేడు ఆ పని చేసినట్లు

చేయలేము. క్రీస్తుకు ప్రార్థన చేసాను, క్రీస్తును నమ్మితే వర్థిల్ల చేస్తాడని

నమ్మాను. నా గత రోత జీవితాన్ని మధురంగా మార్చారు. మన కొరకు

ప్రాణం పెట్టిన దేవునిని రక్షకునిగా సీవాకరించండి.

గమనిక :

ఎడబాయని నీ కృప పాట రాసిన రచయిత మాథదయస్ గారు కృపా

మనిష్ర్టి నిర్వాహిస్తున్నారు. ఆయన అనుభవాలనుండి పాటలు రాయగలరు.

ఆధ్యాత్మికంగా అనేకులు బలపడుచున్నారు. 2017లో రాసారు. హైందవ

కుటుంబం నుండి వచ్చారు. వీరి బంధువు సీటవెన్గారి సాక్ష్యానికి ఆత్మీయ

బలాన్నిచ్చారు. సీటవెన్ గారు చెడు వ్యసనాలతో ఉండగా క్రీస్తును నమ్మి

అద్భత ప్రార్థనా శక్తితో అద్భుతాలు ఎదురొకని సంఘం ని]్మంచి సేవలో

ఉన్నారు. ఆయన అనుభవాల ద్వారా అందరు క్రీస్తును నమ్మి సాక్షులుగా

జీవించాలని అందరికి నవసకరించి చెపుతన్నారు. వీరి సేవను దేవుడు

దీవించను గాక. ఆమెన్

సాక్ష్యం 12. పూజలు చేసే కుటుంబంలో జన్మించాను.

అందరు ప్రేమించాలని ఆశించి ప్రేమకు దూరమై

నిరాశలో ఉండగా బైబిలు పరిచయంతో విశావాసం తో

క్రీస్తును ప్రేమించాను. దర్శనాల ద్వారా వాగ్దానాలు

ఇచ్చారు. ఇంజనీరుగా విదేశాలలో ఉద్యోగిని

అయయాను. ప్రభువు సేవ్రై పిలిచారు. విశ్వాసితో

వివాహం జరిగింది. సేవలో స్థిరపడ్డాము.

బ్రదర్ డానియేలు గారు,

రౌతులపుడి

ఫోను : 7032805191

యెహోవా నిత్యము నిన్ను నడిపించను. నీవు నీరు కట్టిన తోట

వలైను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి }టవలై ఉందువు. యెష 58:11

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు శుభములు. రౌతులపుడిలో

సేవలో ఉన్నాను. నా సాక్ష్యమును వివరించుటకు

దేవుడిచ్చిన అవవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను.

విగ్రహారాధన కుటుంబంలో నుండి వచ్చాను. మా

అమ్మమ్మ, అమ్మ శివుని పూజించేవారు. అమ్మమ్మ ఉదయం నాలుగు

గంటలకు లేచి సా�నం చేసి 10 రూపాయల కాసు బుట్టు పెట్టుకునేది.

హిందువుల పండుగ గొప్ప పండుగగా చేసేవారం. నేను దేవుళ్ళ పండగకన్నా

సాకలు పసలవులు కదా అని ఆనందించేవాడిని. దేవుళ్ల గురించి అవగాహన

లేదు పట్టించుకోలేదు. నన్ను బలవంతంగా దేవాలయాలకు తీసుకొని

వెళ్ళేవారు. నా జీవితంలో మలుపు తిరిగిన సంవత్సరం 10వ తరగతిలో

ప్రతి అవ్మాయి రక్రైస్తవురాలు. ఒక ఫోటో దగ్గర నాలుగు చకకలుండేవి.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు76

ఆకాశంలో దేవుడు కనిపిస్తాడని తెలిపింది. ఆ అవ్మాయి మాటలు నమ్మాను.

ఒకసారి సాకలు గోడపై ఒక ఆకారం చూచాను. అది యేసు ప్రభువు

పటమని తెలిపింది. నా అనుభవంలో దేవుడిని చూచాను అన్న అనుబూతి

కలిగింది. మా సవాకీయేలకు దేవుని గురించి అవగాహన లేదు. ఆ రోజు

మా వాళ్ళకు యేసును చూచానని తెలిపాను. ఆ పటం చూచుటకు

ఆరంభించాను. నాలో ఒక ప్రపరపణ కలిగింది. రోజు ఇంటిలో 10

రూపాయలు ఇచ్చేవారు. దానితో సిలువ ఉన్న చైను కొన్నాను. రోజు నా

మెడలో ఆ సిలువ ఉన్న గొలసు వేసుకునేవాడిని. ఎవరు చూడలేదు

అనుకున్నాను. ఒక రోజు చొకాక విప్పినపుడు మా తాత చూచి నీ మెడలో

సిలువ ఎందుకు ఉందని ప్రశ్నించారు.

యేసు ప్రభువును చూచాను, ఆయన సిలువ అన్నాను. నీకు కూడ

చూపుతాను అని ఆయన పటం చూపించాను. ఆ కాగితం తాతయ్య

చింేపసారు. నాకు కోపం వచ్చింది. అన్నం తినలేదు. తకుకవ జాతివారు

ఆరాధించే దేవుడు మనకు వద్దని తెలిపారు. నేను సిలువ తీయను అని

చెప్పాను. కొట్టినా తిట్టినా సిలువ తీయలేదు. నా చదువు పూర్తి చేయుటకు

ఇంజనీరింగ�లో చేరాను. నా దగ్గర పారకటు బైబిలు ఉండేది. దానికి

నమసకరించేవాడిని. ఆ బైబిలులో క్రీస్తు గురించి నాకు తెలియదు. నాకు

చక్రి అనే స్నేహితుడుండేవాడు. తరచగా పందెం వేసుకునేవారం. అతను

నాకు ఒక మాట చెప్పేవాడు. అతని దేవుడు గొప్పవాడు మనం ఓడిపోతాము

అనేవాడు. నేను 8వ తరగతి బుజ�రాజ పాలైం రక్రైస్తవ పాఠశాలలో చదివాను.

ఒక అవ్మాయిని ఇష్టపడాను. ఆ తరువాత సాకలు మారాను. అది ప్రేమ

అనుకొని 7 సంవత్సరాలుగా ప్రేమించాను. ఆమె ఒకే చెప్పింది, తరువాత

ఆమె దారవైందని దేవునితో చెప్పుకునేవాడిని. చాలా ప్రార్థించాను జవాబు

రాలేదు. యంటైక�లో చేరాను. మా }రిలో చదువు సరిగా లేదని అమ్మమ్మ

దగ్గర విశాఖలో ఉండి చదివాను. మా తల్లిదండ్రులు క్రీస్తు విశ్వాసుల

సువార్త వల్ల నా తల్లిదండ్రులు, అమ్మమ్మ అనుకోని రీతిగా గొప్ప పూజలు

చేసేవారంతా క్రీస్తును నమ్మి వెంబడించుట చూచి ఆశ్చర్యపడాను. వారితో

నేను కూడ చర్చికి వెళ్ళి ఆరాధనలో పాలుగనేవాడిని. ఒకరోజు ఆదివారం

చర్చికి అందరం వెళ్దాము రమ్మని తెలిపారు. నా పాత స్నేహితులను

చూడాలని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాను. రౌతులపుడి నుండి విశాఖ

బయలుదేరాను. నేను నామకార్థ రక్రైస్తవుడిగా ఉండేవాడిని. ఉదయాన్నే 5

గంటలకు బయలుదేరాను. బండి చాలా సీపుగా నడిేపవాడిని. 120

కిమీ. 2 గంటల 30 ని��లలో వెళ్ళవచ్చుగాని నా సీపడును బట్టి 1 గంటల

30 ని��లలో వెళ్ళేవాడిని. చిన్న గాప్లో ప్రమాదం తప్పించుకున్నాను. నా

బైకు బససును తగిలి వెనుక టై�రులో ఇరుకుకంది. యేసయ్య అని గట్టిగా

అరిచాను. చిన్న సందులో స్గభాగం వెళ్ళాను. బససు డివైడరు వైపు తిప్పారు.

దేవునికి వెు�పెటటగా నన్ను రక్షించాడు. నాకు హెాల్వెుట్ ఉంది. అది

ఎగిరిపోయింది. తలపై కుట్లు పడ్డాయి. దేవుడు కాపాడాడు. కానీ దేవునితో

పరిచయం లేదు.

మరొక అవ్మాయితో ప్రేమలో పడాను. అమ్మ, నాన్న నేను ప్రేమ

నుండి బయటికి రావాలని ప్రార్థించేవారు. ఆ దేవుడే అవ్మాయిని నాకిస్తాడని

ఆశించాను. నారకవరు ప్రేమ పంచేవారు లేరా? అని బాధపడాను. ఆ

అవ్మాయి నన్ను వదిలి వెళ్ళిపోయింది. నిరాశలో ఉన్నాను. యం.టైక�

పూరతయింది. నాకు ఉద్యోగం లభించిననా మనసు పెటటలేని డిపప్రషనులో

2 నెలలు జాబు చేసాను. ఇల్లు చేరి ఖాళీగా గడిపేవాడిని. తల్లిదండ్రులు

దిగులు పేవారు. నీవు ఎక్కడ స్థిరంగా పని చేయువా? అని తల్లిదండ్రులు

అడిగారు. నేను పొగరుగా అహాంకారంతో మాట్లాడేవాడిని. అమ్మ నాన్న

నా కొరకు దు:ఖంతో ప్రార్థించేవారు. నేను ప్రేమంచిన అవ్మాయి ప్రేమ

నాకు దకకలేదని చాలా వేదనపడాను. గడ్డం పెంచుకొని నిరాశకు

లోనయయాను. దేవుడు కలలో కనిపించి చక్కని వాగ్దానముచ్చారు. శావాశవాతమైన

ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. అందరికన్నా ఎకుకగా ప్రేమిస్తున్నాని

తెలిపారు. చాలా దర్శనాలు ప్రభువిచ్చారు. నేను వాటిని అ్రేక్షించాను.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు78

తరువాత ప్రభువు మరొక దర్శనమిచ్చారు. నాకు ఒక టిరకట్టు ఇచ్చి విమానం

ఎకకవున్నారు. మా అమ్మకు కలలో అదే చూపించారట. అబుదాభ నుండి

నాకు లైటరు వచ్చింది. వారు ఇంటరావా చేయగా పసలైక�ట అయయాను. ఇక్కడ

ఉంటే కుమలిపోతావని క్రీస్తు నన్ను దుబాయి పంపారు. దుబాయిలో

శుక్రవారం పసలవు ఇచ్చేవారు. 70 వేల జీతం వచ్చేది, నారకవరు స్నేహితులు

లేరు. చాలా దేశాల నుండి ఉద్యోగం చేయుటకు వచ్చేవారు. నా ఒంటరి

సమయంలో నా బైబిలు సరవాసవాంగా భావించాను. మత్తయి సువార్త నండి

చదువుటకారంభించాను. క్రీస్తు దేవుడని తెలసుకోగలిగాను. గానీ ఆ క్రీస్తు

ఔన్నత్యము, ఎందుకు దేవుడయయాడో అర్థం కాలేదు. వాక్యమే నాకు

బోదించసాగింది. వాక్యం చదువుటకు చాలా ఆసక్తిగా ్రపీతికరంగా

ఉండేది. చర్చికి నామకర్థంగా వెళ్ళాను. విదేశం వచ్చిన తరువాత ప్రభువును

ప్రేమించుటకారంభించాను. వాక్య పఠనం నాలో ఆసక్తిని, భక్తిని పెంచాయి.

క్రమంగా ఆఫీసుకు వెళ్లనపుడు, మధ్యాహ్నాం, సాయంత్రం ఎకుకవగా

ప్రార్థనలో గడిపేవాడిని. అడుగు బయటికి వేయాలన్న ప్రార్థన చేయాలనే

తలంపు కలిగింది. బైబిలు చదువుట వలన ఆత్మీయంగా ఎదిగాను.

దానియేలు లాగ ప్రార్థించేవాడిని. క్రమంగా నా ఆలోచనలు, తలంపులు

అన్ని మారిపోయాయి. ఇంటికి ఫోను చేసి ప్రేమగా మాట్లాడేవాడిని. నాలో

చాలా మారుప కలిగిందని తల్లిదండ్రులు గ్రహించారు.

నా జీతం సంవత్సరానికి 100 దెనారాలు పెంచేవారు. నాకు

నచ్చక జాబుకు రిజైన్ ఉత్తరం అందించాను. కావాలిటి కంట్రోలు ఇంజనీరుగా

పని చేసేవాడిని. ఆ ప్రాజైకుట వివరాలు నా దగ్గర ఉండేవి. వేర ఉద్యోగం

ఉందా అని అడిగారు. జీతం లక్ష రూపాయలకు పెంచారు. తరువాత

సంవత్సరం ఇంక్రివెంటు తకుకవ ఇచ్చారు. రిజైన్ ఉత్తరం ఇవ్వగా వెళ్ళవదు�

అన్నారు. అందరితో మాట్లాడే అవకాశం నాకిచ్చారు. నాలుగవ సంవత్సరం

రిజైన్ చేసాను. పై అధికారి నా గురించి తెలసుకొని, లక్ష యాభైవేలు

పెంచారు. 6 నెలల ముందు నాకు వివాహం జరిగింది. 2014లో అమ్మకు

నీ కుమారుడు పరిచర్య చేయాలని తెలిపారంట. వివాహం అయిన తరువాత

సేవకు సిద్ధంగా లేను. నాకు కలలో వచ్చే ప్రతి దర్శనం రాసుకునేవాడిని.

మొదటి దర్శనంలో వివాహం తరువాత 2014లో సేవ అని తెలిపారు.

పోలీసు ్రడసులో సేవకు వెళుతన్నట్లు చూపారు. దర్శనం వచ్చినా నేను

అంగీకరించలేదు. 2016లో వివాహం జరిగింది. ఆ తరువాత జీతం లక్ష

80 వేలు అయింది. దుబాయి వెళ్ళి కొంత డబ్బు సంపాదించి, సేవ చేయాలని

దుబాయి చేరాను. డబ్బు వచ్చినా నాలో శాంతి లేదు. తిరిగి ఇండియా

వచ్చి విశాఖలో 30 వేల జీతంతో ఉద్యోగంలో చేరాను. చాలా బాధలలో

ఉండగా ప్రార్థన చేసుకునేవారం, సంవత్సరానికి 10 వేలు పెరిగి లక్షా

రూపాయల జీతం వచ్చేది. నా పనిలో 3 సంవత్సరాలు కష్టపడాను. నెలలో

ఒక్కరోజులో 200 రూపాయల భర్యాని తినాలని ఆశించాను. నెమ్మదిగా

ప్రార్థనలో ఎదిగాము. విశాఖలో 6 సంవత్సరాలు పని చేసాను. అక్కడ

కూడ కావాలిటీ కంట్రోల్ వెునేజరుగా చేసేవాడిని. దేవుడు అభివృద్ధి పరచి,

ఆనందం దయచేసాడు. ఆ తరువాత మాకు పాప పుట్టింది. అవసరాలు

పెరిగాయి. పప్రైవేటులో వాక్సిన్ వేయించాను చాలా ఖర్చయింది. మా తగిగంపు

చూచి దేవుడు దీవించాడు. ఉద్యోగం చేసి ఇంకొక పాప పుటాటక సేవ

చేద్దాం అనుకున్నాము.

అకస్మాత్తుగా నా భార్యకు జ్వరం వచ్చింది. నా స్నేహితుడు ప్రవీణ్తో

సంప్రదించాను. నన్ను పాపను దారంగా ఉంచారు. కరోనా అని అనుమాన

పడ్డారు. బయట తిరికగ నాకు రావాలి గాని, ఇంట్లో ఉన్న తనకు ఎలా

వచ్చిందో తెలియదు. కోవిడ్ పరీక్ష పాజిటివ్ వచ్చింది. అమ్మ పాపను

వదలలేదు. నా పాపను చూసుకోవాలి, ఉద్యోగం చేయాలి. మేముండేది

చాలా చిన్న ఇల్లు నాన్నతో చెప్పగా, ఇంటికి రమ్మన్నారు. మేము ఇంటికి

వచ్చేసాము. నా భార్యకు ప్రత్యేకంగా భోజనం ఇచ్చేవాడిని. అమ్మ, నాన్న

సహకరించారు. నా భార్య నన్ను పిలిచి నేను చనిపోతానేమో అని తెలిపింది.

పాపను జాగ్రత్తగా చాసకో అన్నది. ఆమెను ముట్టుకోలేను. బయటికి

యేసు క్రీస్తు మలచిన జీవితాలు80

వెళ�ి పరిస్థితి కాదు. పాపను తిటటకు అన్నది. ఆక్సిజన్ చూడగా 59కి

పడిపోయింది. ప్రార్థన చేయగా మనలను దేవుడు వదిలిపెటటడు అని

నమ్మాను. ఆక్సిజన్ 90కి చేరింది. సజీవుడైన క్రీస్తు మమ్ములను సజీవంగా

కాపాడాడు. ఆమె చెప్పిన మొదటి మాట వెంటనే మనం దేవుని సేవ

చేద్దాం. ఉద్యోగానికి రిజైన్ చేయండి అని తెలిపింది. మేము రెండవ పాప

పట్టిన తరువాత వసతి చూసుకొని సేవ చేయాలని తలంచగా దేవుని

ప్రణాళ్ళక వేరు. నా ఆలోచనలు లోక సంబంధంగా ఉన్నాయని గ్రహించాను.

మా ఆఫీస్ కొత్త ప్రాంతం మారింది. గొప్ప చదువు, గొప్ప ఉద్యోగం,

తలాంతులుండగా ఎలా రిజైన్ చేస్తావు అని నన్ను నిరుత్సాహపరిచారు.

అయినా నా రిజైన్ అప్లికేషన్ కోపంతో అంగీకరించాడు. సేవకు నిరణయించు

కున్నాను. అప్పుడు నా భార్యకు రెండవ సారి గర్బుపఘల మచ్చారు. 2021

సంవత్సరంలో నా డబ్బులు వదులుకున్నాను. జూలై 1వ తేది సంపూరణంగా

దేవుని సేవకు సమర్పించుకున్నాను. పరిచర్యలో ఉన్నాను. భక్త శ్రీరాములు

గారు నా ఆత్మీయు తండ్రి, చాలా ప్రోత్సాహాన్నిచ్చారు. అభిషేకం పొందాను.

దేవునిలో ఎదిగాను. డిపసంబరు నాకు నా భడడ్కు లోపల ఉన్న భడడ్కు

అభిషేకమచ్చారు. సాధారణ ప్రసాతినిచ్చారు. డాక్టు లేకుండానే డెలివరీ

ఇచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక.

గతంలో క్రిరకట్ అనుభవం :

నాకు క్రిరకట్ అంటే చాలా ఇష్టంగా ఉండేది. నా యెడమ కాలు

లింగవెుట్స పక్కనుంటాయి. కర్రతో కొట్టినట్లు దర్శనం కలిగింది. కలలో

కర్రతో కొట్టగా కాలు }గుతుంది. తెల్లజామున లేవగా కాలు బాగయిందని

ఆనందించాను. ఆ తరువాత రోజుల్లో బీచ్లో ఆడుకునే సమయంలో అలలు

వచ్చి నాయెడమ కాలకు తాకగా కలలో దేవుడు కర్రతో కొట్టినట్లుగా

నెరవేర్చాడు. ఒక్కడినే కాపడం పెట్టుకునేవాడిని. అమ్మమ్మ నా కాలను

గమనించింది. కాలు బైణికింంది అని చెప్పాను. క్రిరకట్లో పడిపోయాను

ఎడమ కాలికి డిపప తీసేసారు. ఆపరషను చేసి 12 కుట్లు వేసారు. తరువాత

నేను ఆట ఆడుటకు ఆరంభించాను. మరలా కాలు జారింది. డాక్టు

క్రిరకట్ ఆడవద్దు అన్నారు. దేవుడు గతంలో కలలో క్రిరకట్ ఆడరాదని చెప్పినా

నిర్లక్ష్యం చేసినందుకు పదే పదే ్రశమలపాలయయాను. చివరకు విలువైన

పాఠం నేరచుకున్నాను. ప్రతి విషయాన్ని ప్రతి తలంపును దేవుని చితాతనికి

వదిలేసాను. అదే ఉత్తమమని గ్రహించాను. ఉద్యోగం, అహం, స్వంత

చిత్తం అన్ని వదులుకున్నాను. నేడు దేవుడు మంచి సంఘమును, మంచి

విశ్వాసులను ఇచ్చాడు. దేవుని ఆత్మ ద్వారా నన్ను ముందుకు నడిపిస్తున్నాడు.

దేవుని సేవలో ఘనంగా వాడబడాలని మీరు ప్రార్థించండి. ఎంత గొప్ప

విద్యావంతులైనా, ఎంత గొప్ప జీతం సంపాదించినా, సువార్త ప్రకటించే

పాదాలు సుదరములని సరిగాగ గ్రహించాను. క్రీస్తును సేవించుట గొప్ప

భాగ్యమని, క్రీస్తును సేవించు ధన్యత అందరు పొందాలని నా దీన ప్రార్థన.

దేవుడు మవ్ములను దీవించను గాక. ఆమెన్!

యేసు క్రీస్తు మలచిన జీవితాలు82

Photograph from page 44 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 44

సాక్ష్యం 13. ఒక యవవానసతుల కూడికలో క్రీస్తును

రక్షకునిగా అంగీకరించాను. భక్తసింగ్ గారి

సహవాసంలో ఆత్మీయంగా ఎదిగాను. ఒక గుడిడ్

గాయకుని సాపర్తితో 30 పైగా పాటలు రచించి క్రీస్తును

ఘనపర్చాను. మా పెద్దన్నయ్య జీవన జ్యోతి సంస్థ ద్వారా

ఆనందించాను. ప్రభువు సేవలో సాగిపోతున్నాను..

బ్రదర్ హెన్రీ గారు,

ఖమ్మం, తెలంగాణ

ఫోను : 9948180898

దేవుని స్తుతియించుడి ఎల్లపుడు దేవుని స్తుతియించుడి. కీర్తన 150:1

1. పరిచయం:

ప్రభువు నామములో వందనములు, నీ జల్దరు వృక్షపు

నీడలలో నేనాందబభరితుడనైతిని అనే గొప్ప పాట రచయిత

కొడమంచిలి హెన్రీ గారు, మరెన్నో మంచి పాటలు

రాసారు. దైవజనుడు భక్తసింగ్ గారికి అతి సన్నిహితులు.

వీరి సాక్ష్యం అనుభవాలను నెహ్రూగారు ల్యాంప్ మనిస్రీట ద్వారా

వారి నివాస స్థలం ఖమ్మం వెళ్ళి సేకరించారు. దానిని

బట్టి అనేకులకు ప్రోత్సాహం కలిగించి ఆత్మీయు మేలులు అందించగలవు.

హెన్రీ గారి మాటల్లో వివరణ

ప్రభువునకే మహిమ కలుగును గాక. నా పేరు హెన్రీ ఖమ్మంలో

నివసిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా అశవారావుేపటలో ఉండేవారము.

బాల్యంలో భక్తసింగ్ గారి పరిచర్య ద్వారా ప్రభావితుడనయ్యాను. సి.ఆర్.

కాలేజిలో కృషణగారు నాకు కా�స్మేట్, రూవ్ వేట్గా ఉండేవాడు. ఒకసారి

యాత్ మటింగుకు వెళ్ళాను. ప్రభువు నా హృదయాన్ని వాక్యం ద్వారా

కదిలించారు. కొందరు దైవజనులు నన్ను ప్రభావితం చేసారు. మషనరీలు

ఉండేవారు. మా పెద్దన్న విల్సన్ గారు జీవనజ్యోతి ద్వారా మంచి సేవ

చేసారు. ""ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేరుపమయా" అనే

పాట రాసారు. అందరికి తెలిసిన పాట. నేను నిర్మల్లో ఆదిలాబాదులో

ఉద్యోగిగా ఉన్నాను. అక్కడే వివాహం చేసుకున్నాను. ఎల�ద్దాయి ప్రార్థనా

మందిరానికి భక్తసింగ్ గారు క్రమంగా వచ్చేవారు. అక్కడ ఆ సహవాసంలో

గుడిడ్వాడైన సోదరుడు పాటలు రాసేవాడు. ఆయనతో సన్నిహితంగా

ఉండడం వల్ల పాట రచయితగా మారాను. అనుకోని రీతిగా ఈ సాక్ష్యమును

బయలు పర్చిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను.

భక్తసింగ్ గారి ఆశయాలు, ప్రార్థనా జీవితం నాకు సాపర్తినిచ్చింది.

ఆయనను అనసరించి, ఆరాధించే వాడిని. నన్ను దేవునిని నవ్ముకున్నావా?

రక్షణ పొందావా? అని భక్తసింగ్ గారు అడిగారు. ప్రభువును నవ్ముకొని

హెబ్రోను సహవాసంలో బాప్తిస్మం తీసుకున్నాను. భక్తసింగ్ గారు నాకు

కరచాలనం చేసారు. ఆప్యాయంగా పలుకరించేవారు. నా చుట్టు పక్కల

హిందువులు నివసించేవారు. కొతతగాడెం నుండి హైదరాబాదు వెళ�ిటపుడు

మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవారు. మా ఇల్లు గృహ ప్రవేశానికి

వచ్చారు. ఆయన ప్రార్థన సందేశంతో జరుగుట దేవుని కృపగా భావించాము.

చాలా ఆనందించి, దేవుని స్తుతించాము. ఆయన చివరి దశలో నేను

భక్తసింగ్ గారిని విశాఖలో, గుంటూరులో ఉన్నపుడు వెళ్ళి దర్శించేవాడిని.

నా భార్య తమళ్నాడులో జన్మించింది. ఆమె గుంటూరు చేరింది. నా

స్నేహితులు సువరణరాజు గారు ఆమెను పరిచయం చేసారు. వివాహం

జరిగింది. నాకు ఒక కుమారుడు, ముగ్గురు కుమారెతలు కలిగారు. నా

భార్య పాటలు పాడేవారు. ఆమె వాక్యం అందించేవారు. 1994లో ఆమె

మరణించారు. నాకు ముగ్గురు పిల్లలు. బాబు నాకు సహకరించేవారు.

కాసత ఇబ్బంది ఉన్నా గ్రామాలలో సేవకు వెళ్ళేవాడిని. మారిటన్ గారు నాతో

పరిచయంగా ఉండేవారు.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు84

దేవుని కృప ద్వారా కొన్ని పాటలు వ్రాయగలిగాను. ""తంబుర

సితారతో నా ప్రభుని ఆరాదించెదను" అనే పాట రాసాను. హెబ్రోను

సహవాసంలో పాట రచయిత పేరు చెప్పేవారు కాదు. కొందరికి నా పేరు

తెలసు కాని కొందరు పాటల దొంగలున్నారు. మా పాటలకు వార పేర్లు

పెట్టుకుంటున్నారు. మరో పాట పల్లవరపు కొండల మధ్య అనేపాట.

పల్లవరపు కొండలపైన భక్తసింగ్ గారికి దర్శనం కలిగింది. మధ్య రాత్రిలో

ప్రార్థన చేస్తూనే ఉండేవారు. ప్రభువు చూపిన దర్శనంలో పరలోక పట్టణం,

తొలి ప్రేమ కలిగి అందరము బలమైన క్రీస్తును ప్రకటించి, మారాను

పోలిన ్రశమలన్న కానాను పురముకు చేరుదము. పల్లవరం వద్ద దేవుని

దాసునితో దేవుడు మాట్లాడారు. దర్శనంలో దేవుడు చూపిన స్థలానికి

వెళ్ళాలని చూపారు. పల్లవరం కొండపైన పరలోక దర్శనం కలిగింది.

మరొక ముఖ్యమైన పాట పాడాను

నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద బభరితుడనైతిని (2)

బలు రకకసి వృక్షపు గాయములు ప్రేమా హాసతములతో తాకు ప్రభు (2)

1.నా హాృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి

నీ శిరము వానకు తడిచినను (2) నను రక్షించుటకు వేచితివి (2)

2. నీ పరిమళ్ పుషప సుగంధములు నా రోత హృదయమును నింపినవి

ద్రాక్షా రస ధార్ల కన్న మరి (2) నీ ప్రేమే ఎంతో అతి మధురం (2)

ఇలా దేవుని కృప ద్వారా 30 పైగా పాటలు రాసాను.

దయగల యేసు పాపికాశ్ర్యుడా ప్రియ ప్రభు ్రదోహిని కరుణించుము.

ఓ ప్రభుయేసు నీకు విరోధముగా పాపం చేసిన దురితండను

నీచుడనై నిను వేదించితిని

మరొక పాట

ఓ నాధ నాకు ఆ్రశయమవ్ము లోయలోని పద్మమా వల్లి పద్మమా

షారోను రోజా పావురమా పాడుమా

నేటి రక్రైస్తవులకు సందేశం ఏమనగా క్రీస్తు మీలో ఉండాలి. ఇంకా

పాటకు జీవితానికి సమనవాయం అవసరం, అనుభవం కావాలి. ఇంటరావా

తీసుకున్న నెహ్రూగారు మంచి ప్రశ్నల ద్వారా నా అనుభవాలను

సేకరించారు. ఇది పుస్తక రూపంగా మారి అనేకులు దీనిని చదివి,

మారాలని, ఆత్మీయు మేలులు పొందాలని ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో

దైవజనుల సాహచర్యం వల్ల విలువైన విశ్వాసిగా విలువైన పాటలు

రాయగలిగాను. అవి ప్రజలు ఆదరించుటను బట్టి దేవుని స్తుతిస్తున్నాను.

క్రీస్తు గొప్ప దేవుడు, ఆయన దేవుడుగాగల జనులందరు ధనయలు. దేవుని

దీవెనలు మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్!

యేసు క్రీస్తు మలచిన జీవితాలు86

Photograph from page 46 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 46

సాక్ష్యం 14. రాజా నీ సన్నిధిలో నేనంటనయ్యా అనే పాట

రాసే ధన్యతనిచ్చి గొప్ప సాక్షిగా జీవింపచేసిన క్రీస్తు

గతంలో నా జీవితాన్ని మార్చిన సాక్ష్యం వివరించు

కృపనిచ్చిన క్రీస్తుకే నా కృతజ్ఞతలు. అమ్మ నాన్న గారికి

స్వరంతో నా దీన స్థితిని తెలుపగా రక్షణ పొందాను.

నేను సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ జాన్ గారు,

కలవారి ప్రేమ మనిష్ర్టి

ఫోను : 7286000071, 7286000072

మనమాయనయందు బ్రతకుచున్నాము, చలించుచున్నాము ఉనికి

కలిగియున్నాము. అపో 17:28

1. పరిచయం:

ప్రభువు నామములో వందనములు, నా పేరు జాన్ నేను

పాట రాసినట్లు చాలా మందికి తెలియకపోయినా ప్రభువు

ఘనపర్చబడుట నా భాగ్యం. అవ్మా తేజా మనిష్ర్టిలో నన్ను

ఆహ్వానించగా, నా సాక్ష్యం వివరించే ధన్యత కలిగించిన దేవునికి మరియు

తేజ అన్నయ్య, కలవారి ప్రేమ మనిష్రీట వారికి నా వందనాలు. నేను రాజా

నీ సన్నిధిలో నేనంటనయ్యా అనే పాట రాసాను. దేవుని సన్నిధి అందరు

అనుభవించాలని పాట రాసాను. గుంటూరు జిల్లా కలిదిండి అనే

మండలంలో అమరావతి అనే చిన్న గ్రామంలో జన్మించాను. మా నాన్నకు

నలుగురు అన్నదవ్ములు ఉన్నారు. మేము హిందువులము, మారెమ్మ అనే

గృహ దేవతను ఆరాధించేవారము. మా నాన్న నరసింహ�లు. చివరి

కుమారుడు. మా దేవ పూనకం వచ్చినపుడు కొన్ని కోరికలు కోరది, అవి

తీరచుకుంటా జీవించేవారం. శ్రీరామనవమ రోజు జన్మించిన కారణాన

నాకు రాము అని పేరు పెటాటరు. నాకు జ్వరం వచ్చి పోలియో వల్ల కాలు

చచ్చుబడి పోయింది. లేచి నడువలేని స్థితి. మేము అనయల దేవుడు తకుకవ

జాతివారి దేవుడు అని క్రీస్తును నమ్మలేదు. నా స్నేహితుడు చర్చికి రమ్మని

పిలిచాడు, వెళాిగా ప్రభువు స్వరంతో మాట్లాడారు. నాకు అద్భుత స్వస్థత

లభించింది. పరురగతేత ధన్యత పొందాను. ఏది పోగొట్టుకున్నామో అవి

తిరిగి ఇచ్చేవాడే దేవుడు. మా దేవత నాకు నడక ఇవ్వలేదు, క్రీస్తు నాకు

అద్భుతంగా నడక ఇచ్చాడు. మా అమ్మ, నాన్న క్రీస్తును నవ్మారు, నీటి

బాప్తిస్మం తీసుకున్నాము. పరిచర్యలో వాడబడుతున్నాము. 9 ప్రాంతాలలో

పరిచర్య విసతరించింది. 2017లో ఈ పాట రాసాను. అవసరాలకు పఫీజుకు

డబ్బులుండేవి కాదు. మీటింగులు పెట్టడానికి డబ్బులు ఖరచు పెట్టేవారు.

నాకు బట్టలు కొన్నపుడు ప్రార్థన చేసుకున్న తరువాత వేసుకునేవాడిని.

మంచి ఆహారం ఉండేది కాదు. ఒకసారి సంచి నిండా డబ్బు తెచ్చారు.

మందిరం కొరకు మాకున్న స్థలం అవ్మానని తెలిపారు. నేను తిరుగుబాటు

చేసాను. నేను కూడ సేవకు రావాలని నా కొరకు కన్నీరు కార్చారు. నేను

బైబిలు పట్టుకోను, అని బైబిలు విసిరసాను.

నేను కూలిపోతున్నట్లు ప్రభువు దర్శనంలో చూపారని తెలిపారు.

ఆత్మ ఖడగం అయిన ఆయన వాక్యం అందరికి కావాలి. వాక్యంతో సాతానును

ఎదురించగలం. 2015లో ఒక స్వరం విన్నాను. 2016 నీవు చూడవు

అని వినిపించింది. అమ్మ నాన్న మంచి విశ్వాసులు, నన్ను ప్రార్థన

చేసుకోమన్నారు. నేను చదివి, ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తానని

తెలిపాను. చావు కొరకు ఆత్మహత్య ప్రయత్నం చేసాను, విషం మందు

తాగాను, ఫ్యానకు ఉరసుకున్నాను. వేగంగా బైకు మీద పోవుచుండగా

కిందపడాను. అయినా చావు రాలేదు. 2015లో మీటింగుకు వెళ్ళి

వస్తుండగా భడ్రి� మీది నుండి దాకాలని ప్రయత్నించాను. ప్రార్థన వాక్యముకు

దారమయయాను. ఆ సమయంలో మెల్లని స్వరం విన్నాను. నేను మోషే

తండ్రిని అని పలికారు. ఆ సమయంలో తల్లిదండ్రులకు మీ కుమారుడు

యేసు క్రీస్తు మలచిన జీవితాలు88

మరణావస్థలో ఉన్నాడని తెలిపారు. అప్పుడు వారు నా కొరకు కన్నీటితో

ప్రార్థన చేసారు. మీరు పాపముల చేత అపరాదములచేత చచ్చినవారై

ఉండగా క్రీస్తుతో మవ్ములను బ్రతికించెను. ఎ్రేఫసి 2:1

మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము,

ఉనికి కలిగియున్నాము. అటువలై మనమాయన సంతానమని మీ

కవీశవారులలో కొందరును చెప్పుచున్నారు. అపో 17:28

వాక్యం, ప్రార్థన నాలో లేదు పాపం చేయకుండ ఉండుటకు వాక్యం

మనలో ఉండాలి. వాక్యం మనలో ఉంటే పాపానికి, లోకానికి రాజీ పడము.

ఆరోజు అమ్మ, నాన్న ప్రార్థన నన్ను బ్రతికించింది. ప్రభువు నాతో సాటిగా

మాట్లాడారు. బాబు నీవు వద్దన్న జీవితం నాకు కావాలి. నాపై చేతులుంచారు

నాకు పాటను ఇచ్చారు. ప్రభువు పదాలను చూడరు, హృదయాన్ని చూస్తారు.

చాలా మంది నన్ను ప్రశ్నించారు. నీ పాట ఇంతగా ఎలా గురితంపు పొందింది

అని? ప్రభువే అని జవాబిచ్చాను. రాగము గొప్పదైనా, పదాలు గొప్పవైనా

అనేకుల కళ్ళల్లో కన్నీరు తెప్పించుటకు గల కారణం, రెండు సంవత్సరాలు

ప్రతి రాత్రి ఏడ్చాను. నా భాష, నా పాట ఎవరు గ్రహించగలరు? 2020లో

ఈ పాట బయట పెటాటలని చెప్పారు. ప్రభువు దయవల్ల నా కంఠంతో

పాడిన పాట ప్రజాదరణ పొందింది. దేవునికి మహిమ కలుగును గాక.

చిన్నపుడు రెండు కాళ్ళు చచ్చుబడి, నడువలేని స్థితిలో, విశ్వాసి ద్వారా

క్రీస్తును చేరగా, నాలో అద్భుతం జరిగించారు. దాని వల్ల అమ్మ, నాన్న

ప్రభువును నవ్మారు. నన్ను సేవకు అంకితం చేసి, నా పేరు జాన్గా

మార్చారు. నాన్న పేరు నరసింహ�లు నుండి మోషేగా మార్చారు. నీటి

బాప్తిస్మం పొంది, అనేక ప్రాంతాలలో సేవ చేస్తూ ఆత్మల జాలరిగా పని

చేస్తున్నారు. నేను సేవలో సాగిపోవుచున్నాను. నా జీవితం ప్రభువుకు

అంకితమచ్చాను. పాట ద్వారా ప్రభువు గురితంపునిచ్చారు.

పాట వివరణ :

ప��రాజా నీ సన్నిదిలోనే ఉంటనయ్య

మనసారా ఆరాదిస్తు బ్రతికేస్తానయ్య ��2��

నేనుండలేనయ్య నే బ్రతకలేనయ్య ��2��

నీవే లేకుండా నేనుండలేనయ్య

నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్య ��2����రాజా��

1.నీ సన్నిధానములో సంపూరణ సంతోషం

ఆరాదించుకొనే విలువైన అవకాశం ��2��

కోలోపయినవన్ని నాకు ఇచ్చుటకును

బాధల నుండి బ్రతికించుటకును ��2��

నీవే రాకపోతే నేనేవైపోదునో ��2����నేనుండ��

2.ఒంటరి పోరు నన్ను విసిగించిన

మనుషులైల్లరు నన్ను తపపుపట్టినా ��2��

ఒంటరివాడే వేయి మంది అన్నావు

నేనున్నానులే భయపడకు అన్నావు ��2��

నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ��2����నేనుండ��

3.}పిరాకగవరకు నీతోనే జీవిస్తా

ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా ��2��

విశావానికి కరత నీవే నా గమ్యము

నీ బాటలో నడుచుట నారకంతో ఇష్టము ��2��

నిన్ను మంచిన దేవుడే లేడయయ ��2����నేనుండ��

ప్రభువు నాకు మాట ఇచ్చిన పాట ఇచ్చి గురితంపునిచ్చి అనేక

స్థలాల్లో మహిమ పర్చబడుచున్నారు. అనామకుడనైన నాకు గురితంపునిచ్చిన

దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్

యేసు క్రీస్తు మలచిన జీవితాలు90

Photograph from page 48 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 48

సాక్ష్యం 15. క్రీస్తు తెలియని అన్య కుటుంబంలో

జన్మించాను. నాన్నకు చేతబడులు చేయగా ప్రార్థన శక్తి

ద్వారా విడుదల కలిగింది. క్రీస్తును నవ్మాము. రక్రైస్తవ

స్త్రీతో వివాహం జరిగింది. కాలేజిలో చెడు వ్యసనాలకు

లోనై దొంగతనాలు చేసాను. క్రీస్తు నన్ను రక్షించి

సేవకునిగా పరిచర్యలో వాడుకుంటున్నారు.

బ్రదర్ యోహాను గారు,

బభువనగిరి, హైదరాబాదు

మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన

వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి,

సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయును.

1 యోహాను 1:9

1. పరిచయం:

ప్రభువు నామములో వందనములు, నా పేరు

యోహాను నన్ను రక్షించి సేవలో పాస్టుగా ఉంచిన

దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం వివరిస్తుండగా వినుచున్న

మీకు దీవెనకరంగా ఉండాలని నా దీన ప్రార్థన. నేను హిందు కుటుంబంలో

జన్మించాను. నాకు సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. మా పితరులు

బభువనగిరిలో ఉండేవారు. నా జీవితంలో ప్రభువు గొప్ప కార్యాలు చేసారు.

నేను ప్రథమ సంతానం, నాన్న చెడు అలవాట్లకు బానిపసై, అమ్మను

హింసించేవాడు. కమయానిస్టు పారిటలో ప్రముఖుడుగా పేరుండేది. మా నాన్న

ఆరోగ్యం పాడయింది. రిపోరుటలు నార్మలుగా ఉండేవి. దేవతలను శ్రద్ధగా

వెుకేకవారము. 6 లక్షల డబ్బు ఖరచు పెటాటము. అయినా పఘలితం లేదు.

మా పెద్దనాన్న కుమారెత క్రీస్తును నమ్మి, విశ్వాసిగా ఉండేది. తవ్ముడు,

నాన్నకు జబ్బుపోవాలంటే క్రీస్తును నవ్ముకోండి అని హెచ్చరించింది. నేను

తిటాటను, మాకు దేవుళ్ళు ఉన్నారులే అన్నాను. నా తల్లికి ఆ విషయం

చెప్పాను, ఒక సంవత్సరం గడిచింది. చాలా బలహీనుడయయాడు. అన్నం

ముట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇడ�్ల మాత్రమే తినేవాడు, నాన్నకు

బాగవ్వాలని అక్క చెప్పిన చర్చికి వెళ్ళి చూద్దాం అని తెలిపారు. ఆమె

గతంలో క్రీస్తును నమ్మి ప్రార్థిస్తుంది. రాంనగర్ సాం అబ్రహాం గారి చర్చికి

వెళ్ళాము. ఆదివారం చర్చికి వెళ్ళాము. ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన

చేయించాము. నాన్న కొరకు పాస్టరుగారు ప్రార్థన చేయగానే వెంటనే వెనక్కి

పడిపోయాడు. ఏవేవో మాటలు మాట్లాడుటకు ఆరంభించాడు. చాలా

వింతగా వ్రపర్తించసాగాడు. కేకలు వేస్తూ మాట్లాడాడు, నాన్నలో ఎవరో

మాట్లాడు స్వరం విన్నాము. నాకు చేతబడి చేసారు, నీ కుటుంబాన్ని నాశనం

చేస్తాను, అన్న తరువాత పాస్టు గారు ప్రార్థన చేయగా మా నాన్నలో ఉన్న

దురాత్మలు వెళ్ళిపోయాయి. గతంలో రెండు సంవత్సరాలుగా అన్నం ముటటని

మా నాన్న ఆకలిగా ఉంది. అన్నం పెట్టండి అన్నాడు ఆశ్చర్యపడ్డాము,

చాలా ఆనందించాము. ఒక్క రూపాయి ఖరచు లేకుండ పూర్తి స్వస్థత

లభించింది. మేలు చేసిన దేవునిని నిజ దేవుడు అని నవ్మాము. యేసును

నమ్మి ప్రార్థించాలని పాస్టు హెచ్చరించారు. యేసు పట్ల విశావాసం కలిగి

ప్రార్థించసాగాము.

2000 సం��లో 10వ తరగతి చదువుచున్నాను. యల్.భ. కాలేజిలో

చేరాను. కొంత కాలానికి చెడు వ్యసనాలకు బానిస్నయ్యాను. కాలేజి మాని

సినిమా, షికార్లు తిరగసాగాను. ట్యాంక�బండ్ దగ్గర ఆగి కాలకేషపం చేస్తూ

�పారుక తిరిగి కాలేజికి వెళ్ళలేదు. కాలేజి మాని పని చేయదలిచాను.

ఫ్యాకటరిలో చిన్న పని చేస్తూ, సిగరట్లు తాగుతా మందుకు బానిస్నయ్యాను.

పని చేయగా వచ్చిన డబ్బు మందు కొరకు వాడేవాడిని. పెద్ద కుమారుడుగా

సంపాదించి, ఇంటిని నడపాలని తల్లిదండ్రులు ఆశించగా, నా ఇషాటను

సారంగా జీవించసాగాను. తరువాత డ్రైవింగు నేరచుకున్నాను. కార్లు, ఆటో

నడిపించుటకు డ్రైవరుగా చేరాను. చిన్న కార్ల నుండి బైంజ్ కార్ల వరకు

డ్రైవింగు చేయసాగాను. నా స్నేహితుల వల్ల పతనమయయాను. వారు ఏది

చెభతే అదిచేసాను. మంచిదా, కాదా అని ఆలోచించలేదు. చాలా దారం

యేసు క్రీస్తు మలచిన జీవితాలు92

స్నేహితులతో కలిసి టార్కు వెళ్ళేవాడిని, అమ్మ నాన్నలను తిట్టేవాడిని,

నాన్న మీద చేయి చేసుకున్నాను. ప్రేమించేవాడిని కాదు. గొడవలలో లీనమై

దెబ్బలు తినేవాడిని. నాలో సాతాను ఉన్నందువల్ల నాకు నేనే గాయపరచు

కునేవాడిని. చాకుతో కోసుకుని రాళ్ళతో కొట్టుకునేవాడిని. 2004 వరకు

వ్యర్థ జీవితం జీవించాను. తల్లిదండ్రులు చాలా దిగులుపడి ఏడ్చేవారు.

కగదెలకు వెుద్దు కడితే మాటా వింటాయి. అలాకగ వివాహం చేసేత మారుతాడని

వివాహం చేసారు. 2004లో వివాహం జరిగింది. నా భార్యను ప్రేమతో

చూడలేదు. స్నేహితులతో జీవిస్తూ, నేను తినేది వారికి తినిపిస్తూ అవసరాలకు

వసతువులు కొని పెట్టేవాడిని. నా స్నేహితుల కొరకు సిగరెట్లతో గురతులు

ఏరపరచుకున్నాను. నా భార్య నా పరిస్థితి చూచి చాలా ఏడ్చేది. నా ప్రేమ

కొరకు కనిపెట్టేది. డబ్బులు చాలా అ్రకమంగా సంపాదించేవాడిని. నేను

డ్రైవింగు చేసేటపుడు కారు పంక్చిరు అయిందని 200 భల్లు వేసేవాడిని.

హార్ను వైరు, లైట్లు వైరు కతితరించి డబ్బులు తీసుకొని వ్యసనాలకు

బానిస్నయ్యాను. ఇంజన్లు మార్చి సొవ్ము పొందాను. ఇంజను పఘ్యూజులు

తీసి రిపేరుకు తీసురకళ్ళి వెకానిక� దగ్గర డబ్బులు అడిగేవాడిని.

అన్ని అబద్ధాలు చెప్పిచేవాడిని. వ్యర్థంగా చాలా పాపాలు చేసాను.

భార్యను, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి గర్వంతో జీవిస్తూ కుటుంబాన్ని

దారం చేసుకున్నాను. మా యజమాని చీటిని తీసుకొని డిజిల్ పోయించే

వాడిని. 50 �టర్లలో 20 �టర్లు దొంగిలించేవాడిని. రాత్రి వేళ్ కార్లలో

తిరిగి జీవితాన్ని వ్యర్థపరిచేవాడిని. పెద్ద ఉద్యోగసతుల డ్రైవర్లతో స్నేహం

చేస్తూ మందు సీసాలు నా దగ్గర ఉంచుకునేవాడిని. స్నేహితుల కుటుంబ

అవసరాలకు దొంగ సొవ్ము వాడేవాడిని. నా వివాహం రక్రైస్తవ పద్ధతిలో

జరిగింది గనుక నా భార్య, తవ్ముడు, అమ్మ నాన్న అనేక ఉపవాస ప్రార్థనలకు

వెళ్ళి కన్నీటితో ప్రార్థించేవారు. నన్ను చర్చికి రమ్మని దైవజనుడు

ఆహ్వానించినా నిరాకరించేవాడిని. నా భార్య ఆత్మహత్య ప్రయత్నాలు చేసేదట.

అడుగడుగున నా భార్యను ప్రభువే రక్షించారు. నాకు చాలా ప్రమాదాలు

జరిగాయి. కానీ అందరి ప్రార్థనల వలన దేవదాతలు కాపాడారు. నన్ను

దేవుడు అడుగడుగున కాపాడాడు. ఆ సత్యం గ్రహించలేకపోయాను.

యజమానుల సంతకం ఫోర�రీ చేయుట నేరచుకున్నాను. ఆ డబ్బుతో వ్యర్థంగా

జల్సా చేసేవాడిని. ఎవరికి భయపడేవాడిని కాదు. నా స్నేహితులతో కలిసి

మంచం మీద మందు ్రతాకగవారం. నా త్రాగుడుకు మాంసం వేపుడు

చేయించేవాడిని, భార్యను చాలా బాధపెటైటవాడిని. నాకు స్నేహితులే

ముఖ్యమని చెప్పేవాడిని. నా స్నేహితులు తాగిన వైకంలో నా భార్యను

పాడు చేయదలచినపుడు దేవుడు కాపాడాడు, నా పాపాలు బయట పడ్డాయి.

నా యజమాని సంతాకాలు తణికీ చేయగా పట్టుబడాను. నన్ను ఇంటికి

పిలిచి, భయంకరంగా కొటాటడు. తరువాత పోలీసులకు ఫోను చేసాడు,

నాకు ఇచ్చిన బైకు తీసుకొని, నన్ను రగంటేసాడు. ఉద్యోగంలో నుండి

తీసేసారు, ఇంటికి వెళ్ళాను. నా భార్య బండి ఏదని అడిగింది. నా

ే్నేహితుడికి పెళ్ళి పనుల కొరకు ఇచ్చాను అని అబద్దం చెప్పాను.

ఉద్యోగానికి వెళ్ళడం లేదు, ఇంటి భయయం లేవు పోషణ

కష్టమయింది. సిటి బ్యాంకులో 23 వేలు లోను తీసుకున్నాను. ఇనసురెనసు

తీసుకున్నారు. ఆ డబ్బులంతా ్రతాకగసాను. డబ్బులు లేవు, నా స్నేహితులను

50 రూపాయలు కావాలని అడిగాను. నా స్నేహితుల పిల్లలకు బట్టలు

కొనిచ్చి సాకలు ఫీజు కటాటను. కాని వారు నాకు సహాయం చేయలేదు.

ఇంటి వారంతా నిందించారు. ఎందకు నీ బ్రతకు అని అవమానించారు,

చాలా దు:ఖంతో కుమలిపోయాను. బార్లో తాగి భర్యాణి తిన్నాను. ఎవరు

ఆదరించలేదు, ఒక్కపూట భోజనం కూడ పెట్టలేదు. ప్రతి దినం గండంగా

గడిచేది. వేదనతో బ్రతకుపై విరక్తి కలిగింది. మరణించదలిచి ఆత్మహత్య

చేసుకుంటున్నాను అని చీటి రాసి మంచం మీద దిండు కింద ఉంచాను.

రైలు కింద పడి మరణించాలనుకున్నాను. ఇల్లు అద్దె కటటలేదు, భయ్యం

కూడ లేవు. తరువాత రోజు మరణించాలనుకున్నపుడు నా తవ్ముడు,

భార్య బిడ్డలు గురతుకు వచ్చారు. నేను చనిపోతే ఎలా అని పాస్టు గారితో

ఫోనులో మాట్లాడాను. చర్చిలో భోజనం పెడతారని ఆలోచించాను. దేవుడే

ఆ తలంపు ఇచ్చారని ఈనాడు దేవుని స్తుతిస్తున్నాను. నేను గ్లోరి భర్తను

మీటింగులు ఉంటే వారిని మీటింగుకు తీసుకొని వెళ్ళండి అని అడిగాను.

యేసు క్రీస్తు మలచిన జీవితాలు94

Photograph from page 50 of Yesu Kreesthu Malachina Jeevithaalu
పేజీ 50

పాస్టు గారు నమ్మ లేదు. పాస్టు గారు నీవు ఏ స్థితిలో ఉన్నావు అడిగారు

తరువాత ఇద్దరిని పంపారు. నేను రైలు పటాటల మీద పరురగతతగా వారు

నన్ను పట్టుకొని చర్చికి తెచ్చారు. ఆ రోజు పాస్టు గారు నీవు కృంగిపోకు,

నీ పాపాలు ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు అని ప్రోత్సహించాడు.

చాలా ఆదరణ పొందాను.

నేను కళ్ళు మాసుకొని నా పాపాలు అన్ని ఒప్పుకున్నాను. 5

గంటలు సమయం వరకు దేవునికి నా పాపాలు క్షమించమని అడిగాను.

7 రోజులు ఉపవాస ప్రార్థన చేయగలవా? గొప్ప మారుపను చూస్తావని

తెలిపారు. వాక్యం చదువుతా ప్రార్థించుట వల్ల నాలో ఉన్న చెడు అలవాట్లు

సమసిపోయాయి. దికుకలేనివాడిగా నిన్ను చేరాను. నీవు నాకు పాప విముక్తి

కలిగించావు. వందనాలు ప్రభువా! అని ప్రార్థించి 7వ రోజు మా ఇల్లు

చేరాను. సురష్ నీ బండి వచ్చి తీసుకో అని యజమాని మనిషిని పంపారు.

నీబైకు నీకు ఇచ్చారని చెప్పాడు.

7 రోజులలో నా బైకు నాకు ఇప్పిసేత నా జీవితం నీ కొరకు

సమర్పించుకుంటనని తీరా�ణం చేసుకున్నాను. అది దేవుడు నెరవేర్చాడు.

నా తల్లిదండ్రులను, భార్య పిల్లలను ప్రేమతో చూసుకోసాగాను. అందరితో

మార్యాదగా మాట్లాడుట ప్రభువు నేర్పించారు. నాకు వాక్య పరిచర్య చేసే

తరీపుదునిచ్చారు. మందిరం ఇచ్చి సేవకు అప్పగించారు. అందరం క్రీస్తు

ప్రేమలో సాగిపోతున్నాము. మాకు స్వంత స�లమచ్చారు. మందిరం నిర్మాణం

చేసాము. 27 కుటుంబాలు మందిరంలో చేర్చబడ్డారు. నా సాక్ష్యం, వాక్యం

పరిచర్య ద్వారా మందిలో కొతతవారు చేరుతున్నారు. నా సాక్ష్యం ద్వారా

అనేకులు ఆత్మీయు మేలులు పొందాలని నా ప్రార్థన. నా పరిచర్య కొరకు

ప్రార్థించండి, క్రీస్తు ఎంత ఘోర పాపినైన క్షమించి, తన సేవలో

వాడుకోగలరు. అందరం క్రీస్తుకు సాక్షులుగా జీవిద్దాం. దేవుడు మవ్ములను

దీవించను గాక. ఆమెన్

సాక్ష్యం 16. భక్తి గల కుటుంబంలో జన్మించాను. గొప్ప

స్థితిలో విద్యాభ్యాసం పూర్తి చేసాను. యోగయడగు

భర్తను పొందాను. అత్తమామల ఆప్యాయతతో ఇద్దరు

భడడ్లను పొందాను. నా జీవిత అనుభవాలను

సాక్ష్యంగా అందించే కృప్రై దేవుని స్తుతిస్తున్నాను.

సిస్టర్ వినీల అల్లారి కాస్రనేని గారు,

మరనాథద టైంపుల్, విజయవాడ

ఫోను : 9394247333

ఇదిగో నేనొక నాతనక్రియ చేయుచున్నాను ఇపుే అది

మొలుచును మీరు దానినాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ

కలుగజేయు చున్నాను ఎడారిలో నదులు పారజేయు

చున్నాను. యెషయా 43:19

1. పరిచయం:

ప్రభువు నామములో వందనములు, ప్రభువు

దీవించిన పరిచర్య మరనాథద టైంపుల్ విజయవాడ

సంస్థాపకులగు శ్రీ గుళ్ళపల్లి మోజైస్ చౌదరి గారి

మనుమరాలగు వినీలా సాక్ష్యము వివరించగా సేకరించి ప్రచురించు

భాగ్యము కొరకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఆమె నాన్న గారు డాక్టు

విశ్వా ప్రసాద్ గారు, వారి సతీమణి శ్రీమతి మధులత పెంపకంలో,

విశావాసంలో పెరిగి గొప్పింటి వసంధర గారి కోడలుగా పుట్టింటికి

వెుట్టినింటికి కీర్తినందిస్తూ అమాల్య సంపదగా ఇద్దరు భడడ్లకు

మాతృమార్తిగా నిలిచి అందించిన విలువైన సాక్ష్యం.

మరనాథద సమాజ సంఘంలో పుట్టి పెరిగిన నేను, కూడి వచ్చిన

మీ మధ్య నా సాక్ష్యం వివరించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికే

స్తుతి. మీ అందరిముందు ఉండుట చాలా సంతోషంగా ఉన్నది. బాల్యం

యేసు క్రీస్తు మలచిన జీవితాలు96

నుండి ఈ మందిరంలోనే పెరిగాను. ఎందరో సాక్ష్యములు చెేపపటపుడు

నేను నా పిల్లల గురించి, భర్త గురించి ఎప్పుడు సాక్ష్యం చెప్పాలి? అని

ఆశించేదాన్ని. నా పట్ల దేవుడు చేసిన అద్భుతాలు వివరించాలని తపనతో

ఉండేదానిని.

వివాహం అయిన మాడు సంవత్సరాలు పిల్లలను పొందుకోవాలని

ఆశించలేదు. మా ్రరీర్ గురించి తలంచాము. మేము భడడ్లను పొందాలని

ప్రార్థించుకున్నాము. ప్రార్థించిన 3 నెలల్లో గర్బువతిగా గుర్తించాను.

2019లో గర్బుం దా*్చిన తరువాత 6 వారాలు డాక్టు దగ్గరకు వెళ్ళవలసి

వచ్చింది. అంతా సవ్యంగా ఉంది. లోపల పిండం బాగానే ఉందన్నారు.

ఎదుగుదల బాగంది, దేనికి చింత పడవద్దు అన్నారు. డాక్టు చెప్పిన

తరువాత ఆశాజనకంగా తోచింది. దానికొరకు ప్రత్యేకంగా ప్రార్థించాను.

దేవుడే మా ప్రార్థనలకు జవాబునిచ్చాడని తలంచాను.

కొద్ది రోజులకు డాక్టు దగ్గరకు వెళ్ళగా గండె చప్పుడు ఉంది

కానీ ఎదుగుదల లేదు 6 వారాలలో ఉన్నంతనే ఉందని తెలిపారు.

సాదారణంగా ఇలాంటి విషయాలు బయటికి చెప్పలేము 3 నెలలు నిలిచాక

చెప్పుట పరిపాటి. కొంత కాలం కనిపెట్టి చూద్దాము అన్నారు. ఒక వారం

కనిపెట్టుట నా దృష్టిలో 100 సంవత్సరాలుగా గడిచింది. ఆందోళ్నతో

గడిపాను. వెంటనే దేవుని ప్రార్థించాను. ప్రభువా నీ చిత్తంలో ఆరోగ్యకరమైన

భడడ్లను దయచేయండి లేదా నేను ఈస్థితిని అదిగమంచుటకు శక్తిని

దయచేయండి అని ప్రార్థించాను. ఆ రోజుల్లో నా భర్త విదేశాల్లో ఉండగా

మా అతతమ్మగారితో ఆసుప్రతికి వెళ్ళాను. డాక్టు పరీక్ష చేసి పిండం కదలడం

లేదు గనుక ఆ పిండమును తొలగించవలసి వస్తుందన్నారు. అబార్షను

చేయాలని తెలిపారు. నాకు మాత్రలిచ్చారు, నేను విజయవాడ తల్లి దగ్గరకు

వచ్చాను. మామాలుగానే నొప్పులు వచ్చి పిండం పోగొట్టుకోవలసి వచ్చింది.

ఆ తరువాత నా గదిలో కుర్చోిని యండగా, మా నాన్న గారు నా దగ్గరకు

వచ్చారు. ఆయనను ఆలింగనం చేసుకొని ఏడ్చాను. నాకు ఇలా ఎప్పుడు

జరుగలేదు. నాకు ఎందుకు జరిగిందని చాలా ప్రశ్నలు తలైతాతయి. నా

శరీరం ఎందుకు అపజయానికి లోనైంది, నన్ను నేను నిందించుటకు

ఆరంభించాను. నేను ఒక్కదానినే కాదు నాలాగ పరిస్థితులు ఎదురొకనేవారు

చాలా మంది ఉంటారు కదా అని తలంచాను. ఈ స్థితిలో ఉన్నవారితో

సంప్రదిసేత ధైర్యం వస్తుందని తలంచాను. అన్నిటికి మంచి సహాయం

లభిస్తుందని తలంచాను. చాలా మంది సాక్ష్యాలు విని ఆశ్చర్యపడాను.

దేవుని సహాయం ఎలా పొందాలి? ఈ రీతిగా నాలుసార్లు గర్బుస్రావం

అయిన వారి సాక్ష్యాల అనుభవాలను విన్నాను. పసైనసు వల్ల చాలా వివరాలు

తెలిసిపోతున్నాయి. నేను అసహాయ స్థితిలో మీరు నాతో మాట్లాడండి, మీ

దగ్గర నుండి నాకు సహాయం కావాలని వినయంతో ప్రార్థించాను. నాకు

విదేశాల నుండి గర్బుస్రావం గురించి వివరాలు తెలియచేసేవారు. ముగ్గురు

స్రీతలలో ఒకరికి ఈ స్థితి తప్పదు, అది సాధారణ అనుభవం. నా భర్త

కసిన్ సోదరి నా పరిస్థితి విన్న తరువాత నాకు కూడ మాడు అబార�న్లు

జరిగాక మంచి భడను పొందానని తెలిపింది. దేవునిపై చాలా ఆధార

పడాను. బైబిలు వాక్యం ఇవ్వగా ఆ వాక్యం ధ్యానిస్తూ జవాబు చూడాలని

ఆశించి ప్రార్థన చేసాను.

ఇదిగో నేనొక నాతనక్రియ చేయుచున్నాను ఇపుే అది

మొలుచును. మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ

జేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా 43:19

నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుస్తాడని నమ్మాను. నాకు

పరిశుద్ధాత్మ ప్రపరపణ ద్వారా స్రీతల గరించి తెలసుకోవాలనే ఆలోచన

కలిగింది. వారి పట్ల దేవుని చిత్తం ఎలా నెరవేరిందో గ్రహించాను.

అద్భుతంగా నేను మరలా గర్బువతినయ్యాను. దేవుడు నన్ను జ్ఞాపకం

చేసుకున్నాడని చాలా ఆనందించాను. ఈసారి కూడ నా శరీరం

సహకరిస్తుందా, లేదా అని ఆలోచించసాగాను. నా శరీరం కంటై, నా

కంటై గొప్ప దేవుడు నాకు ఉన్నాడని అభయం పొందాను. ఆ రీతిగా

దేవునిపై సంపూరణంగా ఆదారపడుతా వచ్చాను. ఈ విధంగా 12 వారాలు

గడిచాయి. డాక్టు అన్ని పరిస్థితులు సవ్యంగా ఉన్నాయని తెలిపారు. అదే

↑ పైకి / Back to top