పదవ దర్శనం
పదవ దర్శనం (Luke 24: 20-53)
చివరిగా, మన ప్రభువు తన ఆరోహణకు ముందు బేతనీయ యొద్ద తన శిష్యులకు దర్శనమిచ్చెను (Luke 24: 50). లోకమంతటికిని వెళ్లి సువార్తను ప్రకటించుమని ఆయన వారికి ఆజ్ఞ ఇచ్చెను. "ఒక మేఘము ఆయనను వారి కన్నులకు కనబడకుండ కొనిపోయెను. ఆయన ఆరోహణమగుచుండగా వారు ఆకాశమువైపు తేరిచూచుచుండగా, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు ఆకాశమువైపు తేరిచూచుచు నిలుచుండి యున్నారు? మీయొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, ఆయన పరలోకమునకు వెళ్లుట మీరు ఏలాగు చూచితిరో ఆలాగే ఆయన తిరిగివచ్చును అని చెప్పిరి" (Acts 1: 9-11). ఈ విధముగా వారు ఆయన ఆరోహణమునకు సాక్షులుగా చేయబడి, ఆయన మహిమాన్వితమైన రెండవ రాకడ వాగ్దానమును పొందిరి, అప్పుడు John 14: 3 చొప్పున, ఆయన తనవారిని తనయొద్దకు చేర్చుకొనుటకు తిరిగివచ్చును. దేవుని ప్రణాళిక చొప్పున చుట్టుపక్కలనున్న ప్రజలకు సువార్తను ప్రకటించుచు, మనము ప్రతిదినము పునరుత్థాన శక్తిని అనుభవించగలము. క్రమముగాను, నమ్మకముగాను ఆదివారపు ఆరాధన సమావేశములోను, రొట్టెవిరుచుటలోను పాల్గొనుటద్వారా, ఇతర విశ్వాసులు ఆయన రెండవ రాకడకు సిద్ధపడుటకు సహాయపడుచుండగా ఈ శక్తి కూడ వృద్ధిచెందును.
మన అవసరములన్నింటి కొరకు ఆయన పునరుత్థాన శక్తిని వినియోగించుకొనుటకు ప్రభువు మనకు సహాయము చేయునుగాక.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
