ప్రశ్నలు మరియు జవాబులు
ప్రశ్న 1:
మీ సందేశం ప్రకారం, దేవుని మహిమ వ్యక్తపరచబడాలంటే భారతదేశంలోని సువార్తికమిషనరీ సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
జవాబు:
మనం మనలను మనం అడగవలసిన మొదటి విషయం: "దేవుని వాక్యం ప్రకారం దేవుని మహిమను చూడాలని మనం నిజంగా ఆత్రుతగా ఉన్నామా?”
ప్రతిచోటా, భారంతో ప్రార్థిస్తున్న ప్రజలు ఉన్నారు. కొందరు, "ప్రభూ, పునరుజ్జీవనం పంపు" అని అంటారు. మరికొందరు పనిలో పునరుద్ధరణ కోసం, లేదా ఒక క్రొత్త ఉత్తేజం కోసం ప్రార్థిస్తారు. కానీ దీని అడుగున ఏదో నిజమైన లోపం ఉందని, ఏదో లోపిస్తుందని ఒక సాధారణ స్పృహ ఉంది. మరో మాటలో, తమకు లేనిది ఏదో వారు కోరుకుంటున్నారు!
ఇప్పుడు మనమందరం ప్రార్థించడం మొదలుపెట్టవచ్చు. మనం సమూహంగా ఎప్పుడూ అంగీకరించము—ఇది వ్యక్తిగత విషయం, ఎందుకంటే వెల చెల్లించడానికి సిద్ధపడేవారు మాత్రమే ఈ విధంగా శ్రమించగలరు. ఆయన మహిమ యొక్క వ్యక్తీకరణ మీకు కావాలంటే, హన్నా వలె వెల చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉండాలి.
ఆరంభంలో ప్రభువు నాతో వ్యవహరించడం మొదలుపెట్టింది ఇలాగే. ఇక్కడక్కడ నా ప్రయాణాలలో, ఆత్మీయ బీడుభూమిని నేను చూశాను, ప్రార్థించడానికి దేవుడు నాకు ఒక భారాన్ని ఇచ్చాడు. నేను ప్రార్థిస్తున్నప్పుడు ఆహారం, నిద్ర, ఇతర ప్రతిదానిపైనా నా కోరిక అంతా కోల్పోయాను. దేవుడు పూర్తిగా పనిచేయడం చూడాలనేది నా భారం: "ప్రభూ, నీవు పనిచేయగలవని నాకు తెలుసు, నీ వాక్యం అలాగే చెబుతుంది, నేను దానిని నమ్ముతున్నాను".
మీ ప్రశ్నలలో మీరు నిజాయితీగా ఉంటే, ప్రార్థనలో ప్రబలడానికి దేవుడు మీకు కూడా ఒక భారాన్ని ఇస్తాడని మీరు కనుగొంటారు. అది రాత్రులంతా, పగళ్లంతా కావచ్చు. దేవుడు మీకు ఎలా చూపిస్తాడంటే మీరు హన్నా, సమూయేలు, దావీదు లేదా సొలొమోను వలె ఆయన భాగస్వామిగా కావచ్చు. మీరు ఈ నలుగురిలానూ కావచ్చు, కానీ కాకపోతే, ఆయన మీకు చూపించే ఏ విధంగానైనా ఆయన భారంలో పాలుపంచుకోవడానికి మీరు సిద్ధంగా, సంతృప్తిగా ఉండాలి.
మనం సమూహంగా ఎక్కువగా సాధించగలమని నేను అనుకోను. దేవుని మహిమ వెల్లడి కావాలని ఖచ్చితంగా భారం మోసేవారు మాత్రమే అంగీకరించగల సందేశం ఇది. దేవుడు మీకు ఏమి చూపించినా, మీరు మీ వాటాను తీసుకోవాలి. ఎక్కువ సమయం ప్రార్థనలో గడపమని దేవుడు మీకు ఆజ్ఞాపిస్తే తప్పకుండా అలా చేయండి. తన వాక్యం నుండి దేవుడు మీకు ఏదైనా చూపిస్తే, దానిని నెరవేర్చడంలో, మీ సహకార్యకర్తలతో పంచుకోవడంలో నమ్మకంగా ఉండండి.
ప్రశ్న 2
నేటి భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ మిషనరీలు స్వదేశీయమైన, నూతన నిబంధన మాదిరిలో పనిచేసే స్థానిక సంఘాన్ని లేదా సభను స్థాపించడం సాధ్యమని మీరు భావిస్తున్నారా?
జవాబు:
మొదటిగా నేను ఎవరినీ 'విదేశీయుడు'గా భావించను. దేవుడు ఏ దేశం నుండైనా ఒక వ్యక్తిని తీసుకువస్తాడు, మనం అతనిని దేవుని దూతగా స్వీకరిస్తాము. మనం అతనిని 'అమెరికన్' లేదా 'ఇంగ్లీషు' లేదా 'జపాన్' వాడిగా స్వీకరించము. రెండవదిగా, 'సంఘాన్ని' అందరూ స్థాపించలేరు. అపొస్తలిక పరిచర్య—అపొస్తలిక పిలుపు, అనుభవం ఉన్నవారిని మాత్రమే దేవుడు ఈ విధంగా ఉపయోగిస్తాడు; వారు ఏ దేశం నుండైనా కావచ్చు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో వివిధ ప్రదేశాల నుండి దేవుడు మనుష్యులను ఉపయోగించడం మనం చూస్తాము. యెరూషలేము, అంతియొకయ, ఎఫెసు, లేదా కొలొస్సైనుండి మాత్రమే మనుష్యులను ఎన్నుకోవాలని ఆయన కట్టుబడలేదు. ఆయన పిలిచినవారిని, ఈ ప్రత్యేక పని కోసం ఆయన అభిషేకించాడు. ఇది జాతీయ లేదా విదేశీ ప్రశ్న కాదు. తన పిలుపుకు స్పందించే ఎవరినైనా దేవుడు ఉపయోగించగలడు. మనం ప్రసంగించవచ్చు, బోధించవచ్చు, కానీ అది 'సంఘాన్ని' స్థాపించదు—అది అంత సులభం కాదు. ఆ వరాన్ని మీరు కోరుకుంటున్నారా?
ప్రశ్న 3
స్వతంత్రంగా విడివిడిగా పనిచేసే విశ్వాసుల ద్వారా కంటే, విశ్వాసుల సమూహమైన సంఘం ద్వారా దేవుడు మరింత పరిపూర్ణంగా పనిచేస్తాడనే సూత్రం విశ్వాసుల సమూహమైన సంఘం ద్వారా మరింత పరిపూర్ణంగా పనిచేస్తాడనేది లేఖనం నుండి స్పష్టమవుతుంది. అయితే, సంఘ చరిత్రలో అనేక సూచనలు ఉన్నాయి, అపొస్తలుడైన పౌలు, ఇతర దేవుని మనుష్యుల వంటి, పూర్తిగా స్వతంత్రంగా పనిచేసే మనుష్యుల ద్వారా దేవుడు ఉపయోగించడంలో అంతే శక్తివంతమైన పని జరుగుతుందని చూపిస్తాయి. పౌలు తన మొదటి మిషనరీ యాత్ర తరువాత, తన కదలికల కోసం ఒక స్థానిక లేదా పంపే సంఘాన్ని సంప్రదించిన సమయం చాలా అరుదని మనం చూస్తాము, నేడు బోధించబడుతున్నట్లుగా సంఘ లోబడటం యొక్క సూచనలు లేవు. అతడు తన బృందాన్ని సంప్రదించవచ్చు, ఎవరినైనా సంప్రదిస్తే, కానీ సాధారణంగా అతడు తన స్వంత మార్గదర్శకత్వంతోనే వెళ్తాడు.
జవాబు:
అవును, సంఘం—విశ్వాసుల శరీరం ద్వారా దేవుడు మరింత పరిపూర్ణంగా పనిచేస్తాడనేది సాధారణ లేఖనానుసారమైన సూత్రమని మీతో నేను ఏకీభవిస్తున్నాను. లేఖనం స్పష్టంగా ఉంది—మరి దానిని ఎందుకు నమ్మకూడదు? దీనిలో నాకు ఏ మాత్రం సందేహం లేదు. కానీ స్వతంత్రంగా పనిచేసే మనుష్యులను దేవుడు ఉపయోగించలేడని నేను ఎప్పుడూ చెప్పలేదు. దేవుడు సర్వాధికారి అని, ఆయన ఎవరినైనా—బిలామును కూడా—ఉపయోగించగలడని నేను చాలాసార్లు చెప్పాను; కానీ అది ఒక వ్యక్తి దేవుని ఎదుట పరిపూర్ణుడని రుజువు కాదు. దేవుడు నా ద్వారా పనిచేసి, అనేక ఆత్మలను తన వద్దకు తీసుకురాగలడు, గొప్ప బాహ్య ఫలితాలు ఉండవచ్చు, కానీ దేవుడికి ఇష్టం లేని ఏదో నాలో ఉండవచ్చు.
ఈ రెండు విషయాలను గందరగోళపరచుకోకండి. ప్రతి దేశానికి చెందిన బోధకులను, ప్రసంగీకులను, దేవుని మనుష్యులను లేఖనాలను వివరించడానికి, ఆత్మలను గెలవడానికి దేవుడు ఖచ్చితంగా ఉపయోగించగలడు, ఉపయోగిస్తున్నాడు, కానీ సంఘం ద్వారా పనిచేసే దేవుని పరిపూర్ణతను మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు దేవుని ప్రణాళికలోకి రావాలని నేను నొక్కిచెబుతున్నాను—వేరే మార్గం లేదు.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, 'నేను స్వభావరీత్యా స్వతంత్రుడినా లేక దేవుని ఆజ్ఞ ప్రకారం స్వతంత్రుడినా?' కొందరు మనుష్యులు ఇతరులతో కలిసి పనిచేయడం కష్టంగా ఉన్నందున స్వతంత్రంగా ఉంటారు—వారు ఒంటరిగా ఉండటంలో ఎక్కువ సంతోషంగా ఉంటారు, అయినప్పటికీ వారు మంచి మనుష్యులే. దేవుడు నిన్ను స్వతంత్రంగా ఉండమని పిలిచాడని నీవు నిజాయితీగా చెప్పగలవా? నా స్వంత అనుభవం ఏమిటంటే, ఏడు సంవత్సరాలు ఒంటరిగా నా స్వంత పథకాలు వేసుకుంటూ పనిచేసిన తరువాత, ఇప్పుడు నేను ఇష్టపడేది ఒక బృందంతో పనిచేయాలి—సాధారణంగా 10 లేదా 12 మంది వ్యక్తులతో. యావత్తు సంఘము యొక్క ప్రార్థనా సహవాసాన్ని ఆనందించడం నాకు ఎన్నడూ తెలియదు, కానీ అప్పటి నుండి ఇతరులతో సహకారంతో పనిచేయడం నాకు బలానికి మూలంగా ఉంది. సంఘముల ప్రార్థనా సహవాసం కలిగి ఉండటం ఇప్పుడు నాకు ఎంతో అర్థవంతంగా ఉంది, మరియు వారి ప్రార్థనల వలన నేను అనేక తప్పులనుండి రక్షింపబడ్డానని నాకు తెలుసు. సంఘంగా మేము కలిసి ప్రార్థన చేస్తాము మరియు ప్రభువు మాకు అద్భుతమైన ఆశీర్వాద సమయాలను ఇస్తున్నాడు, అంతకుముందు ఎన్నడూ ఎరుగనంతగా. కానీ దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా వెలుపల ఎవరూ వాడబడటం లేదని నేను చెప్పడం లేదు. మేము ప్రతిచోటా ఉన్న దేవుని ప్రజల కొరకు ప్రార్థిస్తాము, కానీ సంఘమును కట్టడమనే విషయానికి వస్తే—అది దేవుని పథకము చొప్పున ఉండాలి.
మీ ప్రశ్నలోని రెండవ భాగానికి జవాబిచ్చేందుకు, పౌలు తన మిషనరీ యాత్రలు ముగించిన తరువాత స్థానిక సంఘమును లేదా బృందమును సంప్రదించలేదని చెప్పడం చాలా బలవంతమైన ప్రకటన అని నేను భావిస్తున్నాను. చూడండి, బైబిలు అన్ని వివరాలను ఇవ్వదు. మొదటిగా, ఈ దైవిక సూత్రాలను తొలి సంఘాలకు అంత గట్టిగా, నమ్మకంగా బోధించినది పౌలే; కాబట్టి అతడు తానే వాటిని ఆచరించకుండా ఉంటాడా? అతడు తానే వీటికి మాదిరిగా ఉండాలని కోరుకోడా? ఇప్పుడు అతడు సంఘమును సంప్రదించలేని పరిస్థితులు ఉండి ఉండవచ్చు, మరియు మనతో ప్రార్థన చేయడానికి ఎవరూ లేని సందర్భాలు మన విషయంలో కూడా ఉండవచ్చు. కానీ మనం ధర్మశాస్త్రము క్రింద కాదు కృప క్రింద ఉన్నాము. మనం మన సహోద్యోగులను వ్యక్తిగతంగా సంప్రదించలేకపోతే, మనం తప్పకుండా ఉత్తరము ద్వారా అలా చేయవచ్చు.
యెరూషలేములో పని ప్రారంభమైనప్పుడు ఏ సంఘ క్రమము ఉన్నట్టు కనబడలేదు, మరియు ఆ కాలంలో బర్నబా మరియు సౌలు తమంతట తామే సంచరిస్తుండగా మీరు చూస్తారు. అంతియొకయలో మాత్రమే సంఘ క్రమము స్పష్టమైంది, మరియు అక్కడ నుండియే వారు సంఘము యొక్క ప్రత్యక్ష ప్రభావం క్రింద ముందుకు సాగారు,
పత్రికలన్నింటిలో పౌలు తన కొరకు ప్రార్థన చేయమని సంఘమును వేడుకొనుట మనం చూస్తాము:
సహోదరులారా, ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమును ఆత్మ ప్రేమను బట్టియు, మీరు నాతోకూడ పోరాడవలెనని నేను మిమ్మును వేడుకొనుచున్నాను నాతోకూడ నా నిమిత్తము దేవుని యెదుట ప్రార్థన చేయుటకు పోరాడవలెననియు, యూదయలో అవిశ్వాసులైనవారి చేతిలోనుండి నేను తప్పింపబడుటకును, యెరూషలేమునందు నేను చేయు సేవ పరిశుద్ధులకు అంగీకారముగా ఉండుటకును, తరువాత దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి మీతోకూడ విశ్రాంతి పొందుటకును ప్రార్థించుడి.” (Romans 15, 30-32).
మరియు నేను సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకై నోరు తెరచునప్పుడు, నాకు వాక్యము అనుగ్రహింపబడవలెనని నా నిమిత్తము ప్రార్థించుడి.” (Eph.6.19).
మరియు దేనినిమిత్తము నేను బంధకములలో ఉన్నానో ఆ క్రీస్తు మర్మమును బోధించుటకు దేవుడు మాకు వాక్ప్రసంగపు తలుపు తెరచునట్లు మా నిమిత్తమును ప్రార్థించుడి; నేను దానిని ప్రకటింపవలసిన రీతిగా ప్రత్యక్షపరచునట్లు ప్రార్థించుడి.” (Col.4.3.4)I. ‘
తుదకు సహోదరులారా, ప్రభువు వాక్యము మీయొద్ద నడచినట్టుగానే త్వరితముగా నడిచి మహిమపరచబడునట్లును, అయుక్తులును దుష్టులునైన మనుష్యులనుండి మేము తప్పింపబడునట్లును మా నిమిత్తము ప్రార్థించుడి; ఏలయనగా విశ్వాసము అందరికి లేదు.” (IT Thess.3.1,2).
ఈ లేఖనముల నుండి పౌలు ఎల్లప్పుడూ సంఘముల ప్రార్థనా సహవాసము మీద ఆధారపడి దానిని అడిగేవాడని స్పష్టమవుతుంది. మనం ప్రార్థనా సహవాసమును కోరినప్పుడు, మనం ఇతరుల అభిప్రాయాలచే బంధింపబడతామని దాని అర్థం కాదు, దానికి బదులుగా మనం ఆ ప్రార్థనా సహవాసమును విలువైనదిగా ఎంచుతామని మాత్రమే అర్థం. మన భద్రత యావత్తు సంఘ సహవాసంచే మద్దతు పొందడంలో ఉంది. మనం ఏమి చేస్తున్నామో వారికి తెలియాలి, మరియు మనం కేవలం ఒక వ్యక్తితో కాకుండా యావత్తు సంఘముతో సంభాషించాలి. పౌలు చేసినది అదే.
ప్రశ్న 4
మేము వైద్య పని చేస్తున్నాము, మరియు తరచుగా రోగుల కొరకు ప్రార్థిస్తాము. ఆ రోగులు హిందువులు మరియు ముస్లింలు, వారు మా ప్రార్థనను సంతోషంగా అంగీకరిస్తారు గాని వారికి ప్రభువైన యేసుక్రీస్తునందు జీవముగల విశ్వాసము లేదు. క్రీస్తు నామమునకు మహిమ కలుగునట్లు, వారి స్వస్థత కొరకైన ప్రార్థనకు దేవుడు ఎంతవరకు జవాబిస్తాడని మనం ఆశించవచ్చు? వారికి విశ్వాసం లేనప్పుడు, దేవుడు వారిని స్వస్థపరుస్తాడని మనం ఆశించవచ్చా?
జవాబు:
అది వారి విశ్వాసము మీద కాక మన విశ్వాసము మీద ఆధారపడి ఉంటుంది మాత్రమే. అనేక సందర్భాలలో మన ప్రభువు మనుష్యులకు విశ్వాసం లేకపోయినా వారిని స్వస్థపరచుచునే ఉన్నట్టు కనబడుతుంది. మన విషయంలో, వారి రక్షణ కొరకే కాక వారి స్వస్థత కొరకు కూడా మనం ప్రార్థించాలని నేను భావిస్తాను. వారు కేవలం శరీరము కొరకే వస్తారని నాకు తెలుసు, కానీ నేను సాధారణంగా శరీరము మరియు ఆత్మ రెండింటి రోగము కొరకు ప్రార్థిస్తాను. అది మన ఆధిక్యత ఎందుకంటే మన ప్రభువు ప్రేమగల సృష్టికర్త, మరియు తన కరుణలో ఆయన వారి రోగములను స్వస్థపరచి, వారు ఆయనను వేడుకొనకపోయినా వారిని కష్టములనుండి విడిపిస్తాడు.
ప్రశ్న 5 బయటి ప్రపంచముతో సంబంధము లేని ఒక చిన్న గ్రామములో క్రైస్తవుల ఒక కేంద్రకము ఉన్న సందర్భములో, పెద్దలను నియమించుకొనుటకు వారు ఎలా వ్యవహరించాలని మీరు సూచిస్తారు? పెద్దలను ఎవరు నియమిస్తారు? పెద్దలను దీక్షితులుగా చేయుటకు పౌలు వివిధ వ్యక్తులను ఇక్కడా అక్కడా పంపగలిగాడు, కానీ పౌలు వంటి హోదా గలవారు ఎవరూ లేకపోతే, ఒక గ్రామములో అది ఎలా సాధ్యమవుతుంది?
జవాబు:
సాధారణంగా చెప్పాలంటే, ఏ వ్యక్తుల ద్వారా పని ప్రారంభమవుతుందో వారే దాని అభివృద్ధికి బాధ్యులు. మనం స్వయంగా ఈ పరిచర్యను నెరవేర్చలేకపోతే, 'ప్రభువు వారిని కాయుటకు ఎవరినైనా లేపును గాక' అని ఇతర విశ్వాసుల బృందముల ప్రార్థనలను వేడుకొనుట కొనసాగించాలి. వారి ప్రార్థనల ద్వారా దేవుడు పూర్తి సదుపాయము చేసి, వారితో సహాయము చేయుటకు తగినంత కాలము ఉండుటకు ఎవరినైనా పంపుతాడు. దేవుడు తన గొఱ్ఱెలను ఎన్నడూ విడువడను దైవిక సూత్రము, మరియు ఆయన తన సహోద్యోగులు తనను అడగాలని, తన మందను కాయుటకు తన వాగ్దానమును క్లెయిమ్ చేయాలని ఆయన ఆశిస్తాడు: మరియు ఆయన అలా చేస్తాడు,
ప్రశ్న 6 లేఖనములలో ప్రతి సృష్టికి సువార్త ప్రకటించమని మనకు ఆజ్ఞాపించబడింది. ఆ మేరకు, లోకపు అవసరమే యావత్తు లోకమునకు పిలుపును కలిగిస్తుందని మనం నిశ్చయంగా చెప్పవచ్చు. మీకు తెలిసినట్లుగా, యావత్తు లోకము యొక్క సువార్తీకరణ WEC యొక్క సంవత్సరాల వెంబడి ప్రాముఖ్యతగా ఉంది. దానిని నేను ఒక ప్రాథమిక సూత్రంగా అంగీకరిస్తాను, కానీ దేవుడు ఇప్పటికే మార్గము సిద్ధం చేస్తున్నాడని ఖచ్చిశ్చయంగా దేవుడు ఇప్పటికే మార్గము సిద్ధం చేస్తున్నాడని తెలిసిన చోటనే. ఆ దిశలో మీ వ్యక్తిగత ఆలోచనలను మీరు పంచుకోగలరా? జవాబు:
మొదటిగా, ప్రకటించుటకును బోధించుటకును ఉన్న ఆజ్ఞ ఒక సంపూర్ణమైన ఆజ్ఞ అని నేను నమ్ముతాను. అవి రెండూ కలిసి వెళ్తాయి మరియు ఎన్నడూ వేరుచేయకూడదు. ఈ ద్వంద్వ బాధ్యతను గుర్తించి మేము గ్రామాలలోకి వెళ్ళాము.
సింధులోనే నేను నా పనిని ప్రారంభించాను. నేను ఒంటరిగా ఉన్నాను; మరియు అది భారతదేశంలో అత్యంత కష్టతరమైన మరియు వెనుకబడిన ప్రాంతం. సింధు వీధులలోకి, గ్రామాలలోకి వెళ్ళడానికి చాలా కొద్దిమంది సాహసించారు--అది అంత కష్టమైన స్థలం. నాకు సహాయం మరియు సహవాసం అవసరమని అనిపించింది, కాబట్టి నేను ప్రభువును అడగడం ప్రారంభించాను. ఆయన నాకు కొందరు సహోద్యోగులను పంపాడు. మేము కలిసి పనిచేసాము, కలిసి ప్రార్థించాము మరియు ప్రభువు విషయాలలో సహవాసం పంచుకున్నాము. క్రైస్తవులను వారి పేర్లతో గుర్తుచేసుకుంటూ, నామమాత్రపు క్రైస్తవులలో పునరుజ్జీవనం కొరకు ప్రార్థిస్తూ మేము గంటల తరబడి ప్రార్థించేవాళ్ళము. ప్రతి స్థలానికి దేవునికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది మరియు ఆయన మమ్మల్ని అక్కడ ఐదు సంవత్సరాలు ఉంచాడు. అప్పటికి భారతదేశ ఉత్తర భాగంలోని వివిధ ప్రదేశాలలో ప్రచార సభల కొరకు మాకు దాదాపు ముప్పై ఆహ్వానాలు వచ్చాయి. ఒక ఉదయం దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడి దక్షిణానికి వెళ్ళమని చెప్పే వరకు నేను ఉత్తరానికి వెళ్తానని ఎదురుచూస్తున్నాను. దక్షిణానికి వెళ్ళాలని నాకు కోరిక లేదు; అంతేకాక, దక్షిణానికి వెళ్ళమని ఎవరి నుండీ ఆహ్వానం లేదు. కానీ ఆ ఉదయమే మద్రాసు నుండి మమ్మల్ని మద్రాసుకు రమ్మని ఆహ్వానిస్తూ ఒక ఉత్తరం వచ్చింది. నేను తుది జవాబు ఇచ్చేముందు మరింత ప్రార్థన చేస్తానని వారికి తిరిగి రాశాను. ఆయన నడిపింపు గురించి నేను రెండింతలు నిశ్చయత కలిగి ఉండాలని కోరుకున్నాను. మేము ప్రార్థించాము మరియు ప్రభువు దక్షిణానికి వెళ్ళమని తన వాక్యమును మాకు నిర్ధారించాడు.
1938లో మేము మూడు వారాల పాటు దక్షిణాదిలోని ఒక పట్టణానికి వెళ్ళాము. మేము రాత్రి యావత్తు ప్రార్థనలు ప్రారంభించి 19 రాత్రులు కొనసాగించాము, అర్థరాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. మేము ప్రసవవేదన అనుభవించాము మరియు భారతదేశాన్ని వివిధ విభాగాలుగా విభజించడంలో ప్రభువు తన నమూనాను మాకు వెల్లడించాడు: మరియు ఆ సమయంలో ఉత్తరం కంటే దక్షిణానికే ఎక్కువ భారం ఉందని మేము గ్రహించాము. అయితే, దక్షిణంలో ఉండటం నాకు ఎల్లప్పుడూ ఒక పోరాటంగా ఉండేది—భాషా కష్టం వలన నేను ఎల్లప్పుడూ ఉత్తరంలో ఉండాలని ఆరాటపడుతుండేవాడిని. మేము ఎన్నడూ దాని గురించి ఆలోచించలేదు లేదా కోరుకోలేదు, కానీ ప్రభువు ఎల్లప్పుడూ మమ్మల్ని దక్షిణానికి నెట్టుతున్నట్టు అనిపించేది. మేము ప్రభువుకు విధేయత చూపవలసి వచ్చింది ఎందుకంటే ప్రభువు మా స్వంత ఆలోచనలచేత మరియు కోరికలచేత పరిపాలింపబడడని మేము గ్రహించగలిగాము.
మేము ఏ స్థలంలోనూ ఒక ప్రచార సభను ఎన్నడూ ప్రారంభించలేదు, సభల కొరకు అడుగుతూ ఎవరికీ రాయలేదు, మరియు మేము పటము చేత నడిపింపబడలేదు. మరొక ద్వారము మాకు ఎలా తెరవబడిందో దానికి ఒక సాధారణ ఉదాహరణ నేను మీకు ఇస్తాను.
వెల్లూరు నుండి బాప్తిస్మము కోరుకుంటున్న ఒక యువతి నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరం మూడు నెలలుగా స్థలము నుండి స్థలమునకు నన్ను వెంబడించింది, కాబట్టి మొదట నేను ముందుగా రాలేకపోయినందుకు క్షమాపణ చెప్పాను; కానీ నేను ఆమె స్థలానికి వెళ్ళి ఆమెతో మాట్లాడాను. తరువాత నేను తల్లితో, "మీ కుమార్తె సరైన అడుగు వేస్తుందని మీకు నమ్మకమేనా?" అని అన్నాను. ఆ అమ్మాయి తిరిగి జన్మించిందని ఆమె నాకు నిర్ధారించి, "ఆమె బాప్తిస్మములో దానికి సాక్ష్యమివ్వబోతోందని నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని చెప్పింది. ఆ తరువాత నేను, "ఇదంతా చాలా బాగుంది కానీ మీ సంగతేమిటి? మీ కుమార్తె సరైనది చేస్తోందని మీరు అనుకుంటే మీరు కూడా ఆ మార్గాన్నే అనుసరించాలి—దేవుడు ఏ మినహాయింపులు చేయడు" అని అడిగాను. మా సంభాషణలో ఒక కాటేజ్ మీటింగ్ జరుగబోతోందని ఆమె నాకు చెప్పి, రావాలని నన్ను ఆప్యాయంగా ఆహ్వానించింది. ఆ సభకు వెల్లూరు మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ సిబ్బందిలో చాలామంది వచ్చారు, మరియు దీని నుండి వెల్లూరు కొరకు దేవుని సమయం ఎలా వచ్చిందో నేను చూడగలిగాను. ప్రభువు వాక్యము నాకు స్పష్టంగా వచ్చింది, 'ఆలస్యం చేయకు, ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, ఒక ప్రచార సభను జరిపించు'.
అదేవిధంగా, పూనాలో ప్రవేశించడానికి మాకు ఇలాంటి ఆహ్వానాలు వచ్చాయి; లుషాయి, నాగా మరియు ఇతర గిరిజన ప్రజల మధ్య ఉన్న గొప్ప తెరవబడిన ద్వారంలో ప్రవేశించడానికి అస్సాం నుండి ఆహ్వానాలు వచ్చాయి.
పూనా ద్వారం మేము ఏ పథకాలు వేసుకోకుండానే మాకు తెరవబడింది—మేము కేవలం అందుబాటులో ఉన్నాము. మేము నలుగురం అక్కడ ఉన్నాము. ఒక వ్యక్తి శనివారం నన్ను చూడడానికి వచ్చి, "రేపు మా సంఘ భవనంలో మాట్లాడేవారు మాకు ఎవరూ లేరు, రేపు మీరు మాకు దేవుని సందేశము ఇస్తారా?" అని అన్నాడు. మేము దాని గురించి ప్రార్థించి ఆహ్వానాన్ని అంగీకరించాము. ముందుగా ఎలాంటి ప్రకటన లేకపోయినప్పటికీ చాలా పెద్ద జనసమూహం వచ్చింది—మరియు మూడు రోజులలో మేము వెయ్యికి పైగా నిర్ణయ కార్డులను పంచిపెట్టాము. ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించిన వ్యక్తులచే ఆరు వందల ఏడు నిర్ణయ కార్డులు సంతకం చేయబడ్డాయి. ఆ సమయంలో కూడా పూనాలో పనిచేయుటకు తన సమయం వచ్చిందని ప్రభువు సూచించాడు, కాబట్టి మేము ఒక ఇల్లు తీసుకుని వారికి బైబిలు బోధించడం ప్రారంభించాము.
మేము ఉత్తరము కొరకు చాలా ప్రార్థించాము, మరియు ఇప్పుడు దేవుడు కదులుతున్నాడని, ఉత్తరములో పనిచేయుటకు ఆయన సమయం సమీపిస్తున్నదని మా భావన. ఎక్కడో మేము చెప్పలేము—అది లక్నోలో కావచ్చు లేదా మరొక స్థలంలో కావచ్చు.
గుంటూరులో ఇది ఇలా జరిగింది. నేను బెల్లూలో ఉన్నాను మరియు దేవుడు నన్ను గుంటూరుకు వెళ్ళమని చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళాను కానీ కొన్ని గంటల పాటు మాత్రమే. నేను స్టేషనులో ప్రార్థన చేస్తుండగా ఇద్దరు మనుష్యులు నా వెనుక వచ్చి, "సుమారు నలభై మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామం నుండి కొందరు హిందువులు మిమ్మల్ని పంపమని మమ్మల్ని పంపారు. బాప్తిస్మము కోరుకుంటున్న సుమారు 30 మంది ప్రజలు ఉన్నారు. మీరు వచ్చి వారికి బాప్తిస్మమివ్వగలరా?" అని అన్నారు. నేను దాని గురించి ప్రార్థిస్తానని వారికి చెప్పి, వాస్తవాలను నిర్ధారించుకోవడానికి ముందుగా ఒక స్నేహితుడిని అక్కడికి పంపాను. రెండు నెలల తరువాత మేము ఒక బృందంగా అక్కడికి వెళ్ళాము. ఇప్పుడు అక్కడ విశ్వాసుల ఒక చిన్న సమూహం ఉంది. వారికి తమ స్వంత ఆరాధనా స్థలం ఉంది. అలాగే పొరుగు పట్టణంలో 30 నుండి 40 మంది విశ్వాసులు ప్రతివారం ఆరాధన కొరకు సమావేశమవుతారు, మరియు ఆ విశ్వాసులే ఇప్పుడు మా కొరకు మార్గం తెరవడానికి ప్రభువుచే ఉపయోగించబడుతున్నారు.
పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద సువార్తీకరించడానికి మరియు బోధించడానికి ఉన్న ఆజ్ఞను మేము ఎలా నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నామో దీనికి ఇవి ఉదాహరణలు,
ప్రశ్న 7 (a) నా ప్రశ్న భారతీయ సహోద్యోగుల గురించి. ఒక మిషనుగా, మాలాగే 'విశ్వాస' ప్రాతిపదికన మాతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే భారతీయ సహోద్యోగులను మాకు పంపమని మేము ప్రభువును నమ్ముకుంటున్నాము. ఇతర మిషన్లకు భారతీయ సహాయకులు ఉన్నారు కానీ వారు వారికి జీతం చెల్లిస్తారు.
(b) సంఘము లేని చోట పనిచేసేవారి సంగతి ఏమిటి?
జవాబు:
(a) అదే తప్పు—మీరు ఒక మిషనుగా పనిచేస్తున్నారు. మిషనులో పనిచేయడానికి వచ్చే ప్రజలు సహజంగా జీతం ఆశిస్తారు, అది భారతీయులందరికీ సాధారణంగా అర్థమైన విషయం. కానీ మీరు సంఘ ప్రాతిపదికన పనిచేస్తే, వారు విశ్వాస ప్రాతిపదికన రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే మేము మిషన్లను ఆమోదించము, మరియు కార్యకర్తల కొరకు మేము ఎన్నడూ విజ్ఞప్తులు చేయము.
(b) చూడండి, సంఘ ప్రాతిపదికన పనిచేయడం ద్వారా తొలి సంఘములో చేసినట్లుగా దేవుడు సంఘమునకు (మిషనుకు కాదు) వరములనిచ్చునని మీరు ఆశించవచ్చు. వారు ఉత్తరము నుండి, దక్షిణము నుండి లేదా ఎక్కడి నుండి అయినా, కార్యకర్తలను ఇమ్మని మీరు ఆయనను అడగాలి. ఇది ఇక్కడ కనిపించే ఆయన క్రమము ప్రకారము Ephesians 4.11,12లో కనబడుతుంది. ఇవి దేవుడు సంఘమునకు ఇవ్వాలనుకొనే వరములు. వేరే ఏ విధానమైనా కేవలం యజమాని-ఉద్యోగి ప్రాతిపదికే.
ప్రశ్న 8
ప్రతి సంఘము స్వతంత్రమైనదో లేదా ఏదో ఒక తెగకు చెందినదో అయి ఉంటుంది కాబట్టి—మరియు అత్యంత స్వతంత్రమైన బృందములు కూడా ఏదో ఒక సమాఖ్యచే కలిసి చేరి ఉన్నాయి కాబట్టి, ఒక సంఘము నిజమైన సంఘమా కాదా అని నిర్ణయించడానికి ఒక వ్యక్తి ఏ గుర్తుల కొరకు చూడాలి?
జవాబు:
గుర్తులా? ఇది చెప్పడం కష్టమైన విషయం. నిజమైనట్టు కనిపించే విషయాల ప్రకారం మనం వెళ్ళలేము. నిజానికి, ఒక బృందము యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని నిర్ధారించగల ఏకైక మార్గం వారితో కలిసి జీవించడమే. మరోవైపు, హృదయపూర్వకంగా ఉన్నా బోధన లేని బృందములను మనం చూస్తాము. వారితో జీవించి సహవాసం కోరుకోవడం ద్వారానే వారు పరిశుద్ధాత్మచే నడిపింపబడాలని కోరుకుంటున్నారని మనం నిశ్చయపరచుకోగలము—అదే స్పష్టమైన పని చేసే ఉద్దేశ్యము. ప్రభువు బల్ల వద్ద రొట్టెవిరుచుటకు సమావేశమవడం ద్వారా వారు ప్రభువును ఘనపరుస్తున్నారా? ఆ బృందము ద్వారా పరలోక పథకము నెరవేరాలని వారు కోరుకుంటున్నారా? తమ స్వంత సిద్ధాంతపు ఊహలచే నడిపింపబడాలని వారు కోరుకుంటున్నారా? వారు ఎల్లప్పుడూ ప్రభువు నడిపింపును కోరుకోవడంలో హృదయపూర్వకంగా ఉంటే వారిని స్థానిక సంఘముగా అంగీకరించండి. కనీసం మేము అనుసరించే పరీక్ష అదే.
ప్రశ్న 9
అన్ని మిషనరీలు ఒక సంఘముతో ముడిపడి ఉండాలని మీరు భావిస్తున్నారు కాబట్టి, దీనిని సాధించడానికి మీరు ఏ ఆచరణాత్మక చర్యలను సిఫారసు చేస్తారు?
జవాబు:
కానీ నేను అలా ఎన్నడూ చెప్పలేదు. దేవుని పథకాన్ని అనుసరించాలని కోరుకునేవారు అలా చేయాలని మాత్రమే నేను వ్యక్తపరచాను. దీనిలో అన్ని మిషనరీలు చేరవు. నిజంగా, దేవుడు మనతో వ్యక్తులుగా మాట్లాడినప్పుడే మనం దేవుని పథకములోకి రావాలని గుర్తిస్తాము. దీనిని మీరు ఎవరిమీదా బలవంతంగా రుద్దలేరు; అలాగే అది మానవ జ్ఞానము మరియు తర్కము ద్వారా వచ్చే విషయము కాదు. మీరు కలిసి శ్రమించడం ప్రారంభించినప్పుడు, దేవుని క్రమము సంఘమేనని మీరు ఒప్పుకుంటారు. ఇలాంటి ఒక అడుగు ఎన్నడూ సిఫారసు ద్వారా తీసుకోకూడదు. అది ప్రభువు నుండి ఆ వ్యక్తికే స్వయంగా రావాలి.
ప్రశ్న 10 కొంతమేరకు మిషనరీలకు బైబిలు తర్ఫీదు మరియు ప్రభువు పని అనుభవం ఉంటుంది. చిన్న సంఘములలో మీరు కనుగొనేటటువంటి, తక్కువ పరిపక్వత గల సహోదరుడు లేదా పెద్ద నియంత్రణ క్రింద వారు ఉండవలసిన అవసరం ఉందా?
జవాబు:
ఇది నియంత్రణకు సంబంధించిన విషయం కాదు--బహుశా ఇది వాడటానికి తప్పు పదం కావచ్చు. ఆత్మీయంగా మనం సహవాస ప్రాతిపదికన ఒకరితో ఒకరు సహకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటాము—ప్రతి ఒక్క విశ్వాసి యొక్క సహవాసమును కోరుకుంటాము. దేవుని సేవకులుగా మేము ఒకే ఒక నియంత్రణను గుర్తిస్తాము, అది దేవుని నియంత్రణ; మేము మనుష్యుని నియంత్రణ క్రింద లేము. సంఘ పెద్దలు ఉంటే, వారు అక్షరాస్యులైనా నిరక్షరాస్యులైనా, పరిపక్వులైనా తక్కువ పరిపక్వులైనా, నేను వారిని పెద్దలుగా గౌరవిస్తాను. నేను వారిని దేవుని సేవకులుగా అంగీకరిస్తాను మరియు ఆ సూత్రం మీద నేను వారి సహవాసమును కోరుకుంటాను. మాకు ఇది గొప్ప విలువైనది--పరస్పర ఆధారపడటం మరియు గౌరవం కానీ నియంత్రణ కాదు. ఇప్పుడు దేవుడు మీకు ఈ నడిపింపును లేదా ఆ నమూనాను ఇవ్వలేదని మీరు భావిస్తే, కేవలం వేచి ఉండండి. అసహనంగా ఉండవలసిన అవసరం లేదు.
నా అనుభవం ఏమిటంటే పెద్దలు తమ మార్గాలను, ఆలోచనలను మనమీద బలవంతంగా రుద్దరు. వారు పెద్దలుగా ఉండటానికి దేవునిచే పిలువబడ్డారని మనం గుర్తించిన తర్వాత, వారితో సహవాసం కలిగి ఉండటం మరియు వారితో కలిసి పనిచేయడం ఒక సంతోషము మరియు ఒక ఆధిక్యత.
ప్రశ్న 11
WECలో అభ్యర్థులు పరీక్షింపబడి మిషనరీ పనికి తగినవారుగా అంగీకరించబడే ఒక వ్యవస్థ మాకు ఉంది. క్షేత్రంలో మరో రెండు సంవత్సరాల పరీక్షాకాలం కూడా ఉంటుంది. ఆ తరువాత, ఇతర క్షేత్ర సభ్యులతో సహవాసంలో ఆత్మ నడిపించినట్లుగా నిర్ణయించుకోవడానికి మరియు పరిచర్యలో నిమగ్నం కావడానికి వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. పూర్తి-సమయ కార్యకర్తల అంగీకారము మరియు గుర్తింపు కొరకు మీకు ఏ పథకం ఉంది?
జవాబు:
నిజానికి మాకు ఏ పథకం లేదు.' మా వద్దకు సహోద్యోగులుగా వచ్చేవారు ఒక సంవత్సరము మాతో ఉంటారు, కొందరు పది సంవత్సరాలు, కొందరు అంతకంటే తక్కువ కాలము ఉంటారు. మాకు నిర్ధిష్టమైన కాలవ్యవధి లేదు. మేము వారిని ఆహ్వానిస్తూనే ఉంటాము మరియు వారు పరిపక్వులై, సిద్ధంగా ఉన్నారని, ఒక పరిచర్యను నెరవేర్చడానికి నమ్మదగినవారని మేము గుర్తించినప్పుడు వారిపై దేవుని పిలుపును మేము గుర్తిస్తాము.
కొందరు వివిధ కారణాల వల్ల వెళ్ళిపోతారు. మేము వారిని బలవంతం చేయము: బదులుగా చొరవను ఆ వ్యక్తికే వదిలేస్తాము. తమ స్వంత ఇష్టప్రకారం మాతో పనిచేయాలని ఎంచుకుని, పరీక్షింపబడాలని కోరుకునేవారు మాతో కొనసాగుతారు. వారు బహిరంగ సభలు, కాటేజ్ మీటింగులు మరియు సువార్తీకరణ పనిలో నిమగ్నమవుతారు, మరియు దీని ద్వారా మేము వారి సామర్థ్యాలను మరియు వ్యక్తిగత వరములను కనుగొంటాము. మా వద్దకు ఎంతటి వైవిధ్యం గల ప్రజలు వస్తారో! కొందరు సాదాసీదా గ్రామస్తులు, కొందరు విద్యావంతులు మరియు ప్రతిభావంతులైన ప్రజలు. ప్రతి ఒక్కరినీ వారి వరములు మరియు పిలుపును నిర్ధారించడానికి వేర్వేరుగా పరీక్షించవలసి ఉంటుంది. కానీ మీరు ఒక బృందంగా సంబంధించినంతవరకు, మీరు ఏదో ఒక పథకాన్ని అనుసరించవలసి ఉంటుందని నేను అంగీకరిస్తున్నాను.
ప్రశ్న 12
తొమ్మిది ఆత్మీయ వరముల కార్యనిర్వహణతో పాటు సంఘమునకు ఇవ్వబడిన ఐదు పరిచర్యలను గుర్తించడంలో సంఘము కొరకు పరలోక పథకము ఏమిటని మీరు భావిస్తారు. మీరు సమర్థిస్తారా ఈనాటి సంఘములలో ఈ పరిచర్యలను?
జవాబు:
దానిని బలవంతంగా అమలు చేయాలని నేను భావించను. పరిశుద్ధాత్మకు పూర్తి బాధ్యత ఇవ్వాలి. ఆయన పనిచేస్తున్నప్పుడు, ఈ విభిన్న వరములు మరియు ప్రతిభలు ఏకత్వంలో మరియు ఐక్యతలో పనిచేయడం మీరు కనుగొంటారు. ఏ రకమైన సమస్య వచ్చినా పరిశుద్ధాత్మయే బాధ్యత వహిస్తున్నాడని మేము నిర్ధారించుకుంటాము.
రెండవదిగా, మేము ఏ పద్ధతికీ బద్ధులం కాము. వాస్తవానికి, ప్రతి సమావేశానికి తరచుగా మాకు ఒక కొత్త పథకం ఉంటుంది. ఆత్మ పనిచేస్తున్నప్పుడు ఆయనను ఎందుకు పనిచేయనివ్వకూడదు? ఏదైనా అస్తవ్యస్తంగా జరుగుతున్నట్టు మేము గమనిస్తే వెంటనే దానిని ఆపేస్తాము. పరిశుద్ధాత్మ బాధ్యత వహిస్తున్నప్పుడు, ఆయన తాను ఎంచుకున్న విధంగా అనేక మార్గాలలో తనను తాను వ్యక్తపరచుకుంటాడని మేము నమ్ముతాము—కొన్నిసార్లు అన్ని వరముల ద్వారా, కొన్నిసార్లు కొన్ని మాత్రమే ద్వారా. కానీ ఆయన ఒక నిర్దిష్ట విధంగా లేదా అదే విధంగా పనులు చేయాలని మేము పట్టుబట్టము.
వరముల యొక్క ఏదైనా ప్రత్యేక వ్యక్తీకరణ విషయంలో మేము సాధారణంగా జాగ్రత్తగా ఉంటాము. అది దేవుని నుండి వచ్చినదా లేక సైతాను నుండి వచ్చినదా అని మేము వివేచించాలి, లేకపోతే మనుష్యుని సాక్ష్యంచేత మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రతి పరీక్షను వర్తింపజేస్తాము మరియు అంతరంగిక శాంతి, క్రమము, ఐక్యత మరియు ఏకత్వం ఉన్నట్టు మేము కనుగొన్నప్పుడు, దానిని దేవుని నుండి వచ్చిన వ్యక్తీకరణగా మేము అంగీకరిస్తాము.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
