లేఖనములలోని ఉదాహరణలు – పాపము, యజ్ఞము
యజము 23 తా
ఆది తల్లిదండ్రులగు ఆదాము హవ్వలు దైవాజ్ఞు మీరి పతితులైన తరువాత దేవుడు వారి పాపప్రాయశ్చిత్తారథమై ఒక జంతువును వధించి దాని రక్తముద్వారా వారికి విమోచన అనుగ్రహించి, దాని చర్మముతో వారికి చొక్కాయిలను చేయించి, వారికి తొడిగించెను (ఆది 3:20,21). అటు తరువాత వారికి పుట్టినవారును తమ పాపప్రాయశ్చిత్తార్థము గొట్టెలను, మేకలను, ఆవులను, కోళ్ళను బలిగా వధించిరని బుగ్వేదాది అర్పేయము లేమి, బైబిలు, ఖురాన్ షరీఫ్ మొదలగు గ్రంథములేమి సాక్ష్యమిచ్చుచున్నవి సుమా !
అయితే ఆయా బలులు “రాబోవువాటి ఛాయగలవేగాని, నిజస్వరూపము క్రీస్తులో యున్నది” (కొలొస్స 2:17). ఎందుకనగా “యజ్ఞోవా అవతి తస్య ఛాయ క్రియతే” అనగా యజ్ఞమే రక్షించుచున్నది; దాని నీడ జరుపబడుచున్నది అని గ్రహింపవలెను. సూర్యుడు ఉదయించువరకు ఆయా దీపములను మనుజులు వెలిగించెదరు కాని, సూర్యోదయానంతరము వెలిగింపరు. రాత్రులందు సూర్యుడున్నను భూమి గుండ్రముగా యున్నందున దాని అగ్ని అన్ని భాగములలో వెలుగు ఒకేసారి ప్రకాశింపదు. అలాగే నీతి సూర్యుడగు క్రీస్తు మొదట ప్రాచ్యులగు తూర్పు దేశీయుల వారికిని, అటుతరువాత పశ్చిమ దేశీయులకును తన సువార్త ప్రకాశమును ప్రసరింపజేసెనని తెలియుచున్నది. ఆయనకు పక్షపాతము లేదు.
యేసుక్రీస్తు పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాల పర్యంతము ప్రత్యక్షమగుచుండెను (మీకా. 5:2) అయితే కాలము సంపూర్తియైనప్పుడు ఆయన కన్యయు స్త్రీయునగు మరియకు జన్మించి మానవులు స్వీకృత పుత్రులు కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్చవారిని విమోచించుటకై తానుకూడ ధర్మశాస్త్రమునకు లోబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను సమాధి చేయబడెను. లేఖనముల (ప్రకారము మూడవ దినమున లేపబడెను (కొలొస్స 4:4,5; 1కొరింథీ 15: 3,4).
క్రీస్తు మృత్యుంజయుడు గనుక తనను నమ్మినవారిని విమోచించుటకు నిరంతరము జీవించుచున్నాడు. “నిత్యుడగు ఆత్మద్వారా తననుతాను నిర్లోషిగా అర్చించుకొనిన క్రీస్తుయొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును” (హెబ్రీ 9:14).
కావున “క్రీస్తు మరణించిన తరువాత పాపులను ఎవరు ఉద్ధరిస్తున్నారు?” అని ఆర్యసమాజమువారు ప్రశ్నించుట నిరర్థకమై యున్నది. మరియు వారు - “కైస్తవలు పాపులైన అగుదురుగాక క్రైస్తవులు కానివారు మాత్రము పాపులుగారు” అని వ్రాయుట అసత్యము. ఎందుకనగా - “కామక్రోధ వశాస్సర్వే దేవషిన్ పిత్రు మానవాః” అనగా దేవతలు, షిత్రు దేవతలు మానవులందరు అరిషడ్ వర్గములగు కామక్రోధాదులకు వశమైనవారేనని హిందూ మత (గ్రంథములు ఘోషించుచున్నవి. కనుక -
“పాపోహం, పాపకర్మాహం, పాపాత్మ పాపసంభవః త్రాహిమాం కృపయా దేవ శరణాగతిః వత్సలా దయనియోను ధన్యోస్మి. తనకో అత్రజగత్రయే” అని భారతీయుడు ప్రార్ధించుచున్నాడు. అనగా, ఓ దేవా! నేను పాపిని, పాపము చేయుచున్నాను. పాపములో పుట్టితిని, పాపాత్ముడను నన్ను రక్షింపుము. నీవు కృపగలవాడవు, మూడు లోకములలో నీయెదుట దయను పొందవలసినవాడనగు నేనున్నాను. మరియు “అన్యధా శరణం నాస్తిత్వమేవ శరణం మమ పాపి నామ్ అహమేవ అగ్రే, దయాతూనామ్ త్వంఅగ్రణీః” అనియు పప్రార్థించుచున్నాడు. అనగా - వేరొక దిక్కు లేదు. నీవే నాకు దిక్కు పాపులలో నేను మొదటి వాడను, దయగలవారిలో నీవు అగ్రగణ్యుడవు. కాబట్టి, ఆర్యులేమి, అనార్యులేమి పాపులేయని ధర్మశాస్త్రములు ప్రతిపాదించుట సత్యముసుమా | ఆర్యులు ఈశ్వర పుత్రులనియు, అమృత పుత్రులనియు, వారు పాపులు కారనియు నేటి ఆర్యసమాజము వారు చెప్పుచున్నారు. అయితే ఆర్య బుషులేమని ప్రార్థించిరో బుగ్వేదము సాక్ష్యమిచ్చుచున్నది గమనించుడు -
1 మంత్రము అవతే హేళోవరుణ నమోభిరవ యజ్లేభిరీ మహేహవిర్భిః | క్షయన్న సభ్య మసుర ప్రచేత రాజన్నేనాంపి శిశ్రధఃకృతాని॥
భావము : ఓ రాజగు వరుణా, నీ కోపమును నమస్కారములతో పోగొట్టుకొనుచున్నాము. అనిష్టము తొలగించునట్టి అధిక ప్రజ్ఞగల యోవరుణా ! మాకొరకిచట నివసించుచు మేము చేసిన పాపములను వదలింపుము. ( బుగ్వేదము 1వ మండలం, 6వ అనువాకం, 24వ సూక్తం, 257వ బుక్కు.
24 యజము ఠా
£2 మంత్రము మనో మహంతముత, మానో అర్భకం మాస ఉక్షంతము తమాస ఉక్షితః । మానోవధీః పితరం మోతమాతరం మానః పప్రియస్తన్యో రుద్రరీరిషః ॥ (యజుర్వేదము 16వ అధ్యాయం 15వ మంత్రం)
అనగా ఓ రుద్రా, దుఃఖరూపములగు పాపఫలములిచ్చును దుష్ప్రులను ఏడ్చించు పరమేశ్వరా ! నీవు మాయందలి చిన్న పెద్దలను, గర్భమును, తల్లిదండ్రులను, ప్రియులను, బంధువర్గమును, శరీరులను చంపుటకు మమ్ములను (ప్రేరేపింపకుము. నీ దండనకు పాత్రులము గాకుండునట్టి మార్గములందు మమ్ములను నడుపుము.
3 యగథానో మిత్రో, వరుణో, యథా రుద్రచ్చ కేతలి ! యథా విశ్శేశ జోషసహ ॥ (బుగ్వేదము 1-42-38)
తాత్పర్యము : మిత్రుడు (సూర్యుడు), వరుణుడు, రుద్రుడు (శివుడు) సమాన ప్రీతిగల సర్వ దేవతలు మమ్ములను అనుగ్రహించుట యెటులనో తెలిసికొందురుగాక !
డే శ్లో॥ ఇంద్రియాణాంచ సర్వేషాం, యడద్వేకం క్షరతీంద్రియమ్ 1 తేనాస్యక్షరతి ప్రజ్ఞాద్రుతేః పాదాది ఓదకమ్ ॥ (మనుస్మృతి రెండవ అధ్యాయం, 99వ శ్లోకం)
అనగా - తోటు సంచిలోని నీరంతయు (దానికిగల నాలుగు కాళ్ళలోని) ఒక కాలుకట్టు విప్పినంతనే కారిపోయినరీతి, ఇంద్రియములలో నొక ఇంద్రియము విషయాసక్తమైనయెడల అన్ని ఇంద్రియముల (కర్మేంద్రియములగు - చేతులు, కాళ్ళు మొదలగు వానియొక్కయు జ్ఞానేంద్రియములగు చెవులు, కన్నులు, ముక్కు నాలుక చర్మముల యొక్కయు) సంబంధమైన బుద్ధి వ్యవస్థ లేక పాడైపోవును. ర్, దేవీ భాగవతము, షష్టమస్కంధము, 10వ అధ్యాయములో శ్లో। పాపం కరోతి మనుజస్తధా దేవాల యోపిచ । తథా నారాయణో రాజనృరశ్చధర్మ జూవుభౌ! జాతౌ కృష్ణార్జునే కామం శౌనారాయణస్యసౌ। పురాణపీఠికేయం వైమునిఖిః పరికీర్తి తౌ ॥
తాత్పర్యము : ఓ రాజా, మనుష్యులు పాపము చేయుచున్నారు. అలాగే దేవతలును పాపము చేయుచున్నారు. ధర్ముని పుత్రులగు నారాయణుడు, నరుడుయను బుషులును అటులే పాపము చేసినందున వారు నారాయణుని అంశవలన కృష్ణార్జునులై పుట్టిరి. ఇది మునులచే చెప్పబడిన పురాణపీఠికయందున్నది; అని వ్యాస మహర్షి చెప్పెను.
పైన వ్రాయబడిన ప్రమాణ వాక్యమువలన ఈశ్వర పుత్రులని, అమృత పుత్రులని చెప్పబడిన ఆర్యులు, బుషులు, మునులు, తపోధనులందరు పాపాత్ములేయని బుజువగుచున్నది. బైబిలులోకూడ “మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమైయుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారము, వెండి, రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచిచూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతట అందరు మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్చాడు. మృతులలోనుండి క్రీస్తును లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేసియున్హాడు” అని వ్రాయబడియున్నది (అపొ.కార్య 17:26-81).
