Part 5 of 7

ద్విజత్వ సిద్ధి

ద్విజత్వ సిద్ధి

2 యజ్ఞము

ప్రశ్న : ద్విజత్వమెట్లు సిద్ధించును?

జవాబు : శ్రు॥ జన్మనాజాయతే శూద్రః కర్మణాజాయతే ద్విజః వేదపాఠంతు విప్రాణాం. బ్రాహ్మజ్ఞానంతు (బ్రాహ్మణః అను వజ్రసూచికోపనిషత్తు వాక్యానుసారముగా పుట్టుకచేత (ప్రతివాడు శూద్రుడై కర్మచేతనే ద్విజుగడగుచున్నాడు. ద్వి = అనగా రెండవసారి; జ = జన్మించుచున్నాడు. అట్టివాడు వదపరనచే విప్రుడును, బ్రహ్మ జ్ఞానముచే (బ్రాహ్మణుడునగుచున్నాడు. జందెము వేసికొనుట వలన శూద్రత్వము పోదు; కాని యజ్ఞకర్మవలననే ద్విజత్వము వచ్చుననుట నిశ్చయము. క్రీస్తు బలివలననే మనము ద్విజులమై దేవుని రాజ్యమునకు వారసులము కాగలము. “అతడు తనకుతానే అపరాధ పరిహారార్థ బలిచేయగా అతనికి సంతానము కలుగును” అని యెషయా ప్రవక్త ప్రవచించెను. (యెషయా 58:10). కావున క్రీస్తును యెందరంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారేగాని, రక్తమువలనైనను శరీరేచ్చృవలనైనను మనుష్యేచ్చవలనైనను పుట్టినవారు కారు (యోహాను 1: 12,18).

బళ్ళారిలో పూర్వము వకీలుగానుండి కీ॥!శే!॥ శ్రీ కోలాచలము శ్రీనివాసరావు, ఎం. ఏ.యల్‌.యల్‌.బి.గారు నరమేధ అశ్వమేధాది యజ్ఞములు అను పుస్తకమునందు (ప్రాసినదేమనగా - తైత్తీయారణ్యకములో మృత్యు దేవతా ! జనములను నశింపజేయు నీ సేవనంతయును నేనీయాగ రహస్యమువలన నశింపజేయుదును అని యున్నది. ప్రపంచ సృష్టికర్త పురుష రూపమేన తనను తాను బలిగానిడుకొనుటయే యీ యాగమ రహస్యము. దైవరూపముననున్న పురుషుడు అప్పటికి నమృతత్వము లేని దైవములకుగాను నర్ధమర్య దేహమును ధరించి మర్యదేహమును బలిగానిడెను. శతపథ బ్రాహ్మణములో - భూతకోటి క్షేమమునకు సృష్టికర్త తాను బలిపశువయ్యెనని యున్నది. అనగా ప్రపంచము వారిరాశియై నిలచి నశించు కాలమున పురుషుడు ప్రపంచోద్దారకుడై యాగమ విధిచే తనను తాను బలిగనిడుకొని సర్వమునందు తాను వ్యాపించి ప్రపంచమును రక్షించెను. ఇదే ధర్మమును బైబిలు కూడ స్థాపించున్చది. అందరికిగాను నొక్కరు మృతినొందుటచే అందరు మృతినొందినట్లని, ఆయన జీవించుటచే అందరు ఆయనలో జీవించునట్లని వ్రాయబడెను (2 కొరింథీ 5:14,15). అందరిని పాపవిముక్తులుగాజేసి రక్షించుటకై పురుషుడొకడు తన దేహమును బలిగా నర్చ్పించుకొనెనని హిందువుల సిద్ధాంతము. ఈ పురుషమేధ రహస్యమే క్రీస్తు మరణ పునరుత్థాన వృత్తాంతమును సైతము స్థిరపర్చుచు పురాతనకాలమునుండి నమ్మియుండిరనునది తెలుపును.

గొప్ప విద్వాంసుడును, పరిశుద్ధుడునైన పౌలు యిట్లు వ్రాసెను. ఆ లేఖనముల (ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతినొందెను. సమాధి చేయబడెను. లేఖనముల (ప్రకారము మూడవ దినమున లేపబడెను (1 కొరింథీ 15:8,4). క్రీస్తు స్వయముగా చెప్పినదేమనగా - లేఖనములయందడు మీకు నిత్యజీవము కలదని తలంచుచూ వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి (యోహాను 5:89). మరియు ఆయన “నేనే మార్గమును, సత్యమును, జీవమునై యున్నాను” అని చెప్పెను (యోహాను 14:6).

పురుష సూక్తమందు వ్రాయబడిన విధముగా యాగముగ నర్పించుకొనిన విరాట్‌ పురుషుని వలన తప్ప వేయి కర్మల వలనైనను మోక్షప్రాప్తి కలుగదని శాయనాచార్యులవారు భాష్యమందు బ్రాసిరి. “నాన్యం పంధావిద్యతే ఆయనాయ” ఇదిగాక వేరొక మార్గము లేదు. (బ్రాహ్మణ పండితుడైన పురుషోత్తమును క్రీస్తును తన స్వంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత కొన్ని పుస్తకములు బ్రాసిరి. “కులాచార పరీక్ష”? యను పొత్తమునందు వారు పవ్రాసినదేమనగా -

శ్లో చతుర్వేద విదో విప్ర సూక్ష్మ (బ్రహ్మం నవిదతి॥ వేదభార భరక్రాంత స్సవై (బ్రాహ్మణగర్భభః॥

అనగా గంధపు చెక్కలను మోసి వాటి సువాసన నెరుంగని గాడిద యెటువంటిదో, చతుర్వేద విద్వాంసుడైయుండి సూక్ష్మ బ్రహ్మమును తెలియని విప్రుడును అటువంటి వాడేయని తాత్పర్యము.

కావున నో భారతీయులారా ! దేవ శాస్త్రములలో వ్రాయబడినటుల మానవులను రక్షించుటకై భువిపై నవతరించి యజ్ఞమై మృత్యువును జయించి లేచి నమ్మిన భక్తులకు కన్పించి పరమునకేగి మరల భువికి వచ్చి పాపముులేని, హింసలేని వసుదైక రాజ్యమును స్థాపించి పాలించనై యున్న ప్రజాపతి ప్రభువైన క్రీస్తేయని గమనించియనయందడు విశ్వాసముంచి ఆత్మ రక్షణ బొంది ఇహపర సుఖములకు యోగ్యులగుదురుగాక. క్రీస్తు రాజ్యములో మృతులైన భక్తులు సమాధులలోనుండి బయటకు వచ్చి మహిమ శరీరములను ధరించి పాలింతురు. (ప్రకటన £20:4,6; ఫిలిప్పీ 3:21). యేసుక్రీస్తు దేవుడైతే ఎందుకు సిలువ వేయబడెను? అని పప్రశ్నించువారు గమనించవలసినదేమనగా - యజము 21 తా

1 యేసుక్రీస్తు అను గ్రీకు పదముల కర్ధమేనమగా, రక్షణాభిషిక్తుడు. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకాపేరు పెట్టబడెను (మత్తయి 1:21). పాపులకు ప్రతిగా విమోచనక్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకై క్రీస్తు సిలువ వేయబడెను (మత్తయి 20:28). తన ప్రాణము బలిగా పెట్టుటకును దానిని తిరిగి తీసికొనుటకును తనకు అధికారము కలదని క్రీస్తు చెప్పెను. (యోహాను 10:17). రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు (హెబ్రీ 9:22). కనుక క్రీస్తు సిలువ వేయబడెను.

ల్లి కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును (సామెతలు 16:6). ప్రాణదానము చేయనిదే ప్రపంచమునకు పుణ్యము లేదు. మరియు కృపాసత్యములు కలిసికొనవు. కాబట్టి క్రీస్తు సిలువ వేయబడెను.

8. ప్రజాపతి మరణమును జయించి మానవునకున్న మరణ భయమును బాపవలసియున్చది. కావున ఆ పిల్లలు (మానవులు) రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా సాతానును మరణము ద్వారా నశింపజేయుటకును. జీవితకకాలమంతయు మరణ భయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను (హెబ్రీ 2: 18,14). కాబట్టి మరణమును జయించి మరణ దాసత్వమునుండి మర్యులను రక్షించుటకు క్రీస్తు సిలువ వేయబడెను.

4. పూర్వకాలమందు ఆర్యులేమి, అనార్యులేమి, యూదులేమి యొనర్చిన ఆయా యజ్ఞయాగములు రాబోవుదాని ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో యున్నది (కొలొస్స 2:17). కావున వాటికి సంపూర్ణ సిద్ధి కలిగించుటకై క్రీస్తు సిలువకప్పగించు కొనెను. క్రీస్తు మన పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్కబలిని అర్పించి.... ఒక్కఅర్చణచేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు (హెబ్రీ 10:10-14).

5. సకల మానవులు పాపపురుషుని జయించలేక ఓడిపోయిరి. క్రీస్తు ఆ పాపపురుషుని జయించి సిలువచేత ఓడించి వాని ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా కనుపరచుటకై సిలువ వేయబడెను (కొలొస్స £2:15).

6. మన పాపములవలన మనము దేవుని శత్రువులమైయుండగా క్రీస్తు మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడినవారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము (రోమా 5:10). క్రీస్తు అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి ఆయనద్వారా సమస్తమును అవి భూలోకమందున్చవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రికి అభీష్టమాయెను. గనుక క్రీస్తు సిలువ వేయబడెను (కొలొస్స 1:17,22).

7. అందరికొరకు ఒకడు మృతినొందెను గనుక అందరును మృతి నొందిరనయి, జీవించువారికమీదట తమకొరకు కాక తమ నిమిత్తము మృతినొంది తిరిగిలేచినవానికొరకే జీవించుటకు క్రీస్తు అందరికొరకు మృతినొందెననియు నిశ్చయించుకొనుటకై యేసు సిలువ వేయబడెను (1 కొరింథీ 5:14).

8. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను మనము విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయవస్తువులచేత మనము విమోచింపబడలేదు గాని తన అమూల్యమైన రక్తముచేత మనలను విమోచించుటకై క్రీస్తు సిలువ వేయబడెను. ఆయన జగత్తు పునాది వేయబడకమునుపే నియమింపబడెను. గాని విశ్వాసులైనవారి నిమిత్తము కడసరికాలమందు ప్రత్యక్షపరచబడెను (1 పేతురు 1:18,19),

9. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను (మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మనము స్వస్థత పొందితిమి (1 పేతురు 2:24).

10. మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో ్రతికింపబడి, పాపము విషయములలో ఒక్కసారే శ్రమపడెను. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతలమీదను, అధికారులమీదను, శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్కమున ఉన్నాడు (1 పేతురు 38:18-23).

11. సిలువ వేయబడుటకు పూర్వమే యేసు పదేపదే తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దలచేతను ప్రధానయాజకులచేతను 22 యజము ఠా

శాస్త్రుల చేతను అనేక హింసలు పౌంది చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని తన శిష్యులకు తెలియజేయుటేగాక, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము అని చెప్పియుండెను. గనుక ఆయన సిలువవేయబడెను (మత్తయి 16:21; 17:22-38; £20:18,19. 26,28).

12. కయప అను ఒకడు ప్రధానయాజకుడైయుండి వారితో మీకేమియు తెలియదు. జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని చెప్పెను. మరియు అతడు యేసు ఆ జనము కొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనై యున్వాడని ప్రవచించెను. కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి కాబట్టి క్రీస్తు సిలువవేయబడెను (యోహాను 11:49-52).

యేసుక్రీస్తు మృత్యుంజయుడై లేచిన తరువాత - “నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాపములను చూచుచు, నన్ను పట్టి చూడుడు. నాకున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలను, మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను, పాదములను వారికి చూపెను. ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి పవ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు (గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి - క్రీస్తు (శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారుమనస్సును, పాపక్షమాపణను ప్రకటించబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులని చెప్పి పరలోకమునకు ఆరోహణుడాయెను (లూకా 24:87-51).

లేఖనముల ప్రకారము క్రీస్తు 'మ్రానుపై యజ్ఞము చేసెను. అప్పుడు కొన్ని గంటలలో వందల సంవత్సరాలకు పూర్వమే ప్రవక్తలు వ్రాసిన ఆయా లేఖన భాగములు నెరవేరెను.

ఆర్యయువక పరిషక్‌వారు తననుతాను రక్షించుకోలేని క్రీస్తు యితరులనెట్లు రక్షిస్తాడు? అను తమ పత్రిక 1వ పుటలో ప్రకటించినదేమనగా......

“పుట్టిన ప్రతిప్రాణి మరణించుట సహజము. మరియు అవసరము “జాతస్య్వహి ధృవో మృత్యు” అట్టిచో పాపులే మరణించెదరనుట ప్రకృతి విరుద్ధము మహా పురుషులెల్లరు మరణించినారు. క్రీస్తు మరణించినాడు, వీరంతా పాపులేనా? పాపులను ద్దురించుటకు క్రీస్తు పుట్టినచో 2000 సంవత్సరములకు పూర్వపువారెవరు పాపముల నుండి ఉద్ధరింపబడలేదా? అతడు మరణించిన తరువాత పాపులను యెవరు ఉద్ధరిస్తున్నారు? క్రైస్తవులు పాపులైన అగుదురు గాక. కాని క్రైస్తవులు కాని వారు మాత్రము పాపులు కారు” (1వ పేజీలో),

విమర్శ : ఆది మానవ దంపతులగు ఆదాము హవ్వలు తల్లిదండ్రులకు పుట్టలేదు. దేవుడైన యెహోవా వారిని సృజించెను. (ఆదికాండము 1:27). ఆయన వారిని యువతీయువకులుగానే సృష్టించెను. వారు యవ్వనులేయని బుగ్వేదములోకూడ (వ్రాయబడింది. (మండలం 8, సూక్తం 80 బుక్కు. ఆదాము మనుస్మృతిలో స్వాయంభువ మనువని లిఖింపబడెను. 'మననాత్‌ మానవః” అతడు ఆలోచించువాడు గనుక మనువనియు, తల్లియు తండ్రియు లేనివాడు గనుక స్వాయంభువుడనియు పిలువబడెను. అతని సంతతివారు మనుజులని చెప్పబడిరి. “మనుసంతతిః మానవః మనోరపత్యాని మానవః” అది మనువగు అతని సంతతివారే మానవులని మనుస్మృతి ద్వితీయాధ్యాయమందు గలదు. అతనినుండియే (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జనించిరని మొదటి వేదమగు బుగ్వేదములో దశమ మండలం, తొంబదియవ సూక్తం, పండ్రెండవమంత్రంలో వ్రాయబడింది.

“పాపాదవశ్యం మరణం ప్రయాతి” అను నీతిశాస్త్ర వచనానుసారముగా అది నరులగు ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను మీరినందున పాపులైరి గనుక వారు పాపఫలితమగు మరణమును పొందిరి. “దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను; గాని, వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనియున్నారు” (ప్రసంగి 7:29). “ ఏ భేదము లేదు; అందరును పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” (రోమా 8:28). కనుక పాపులై పతితులవబడుచున్నారు.

కాబట్టి ఆర్యులేమి, అనార్యులేమి ఆది తల్లియగు “హవ్వవతి” అని భవిష్యత్‌ పురాణం, ప్రతిసర్గ పర్వములో చెప్పబడిన “హవ్వ”కు పుట్టిన వారేయని గ్రహింపగలము.

↑ Back to top

↑