యజ్ఞములు – పురుషమేధము, అశ్వమేధము మొదలైనవి
10 యజ్ఞము
స్తుతులు, బల్యర్పణ మీరెండు మార్గములే దైవములకు దృప్తికరములగునవి యని వారు తలంచిరి. కాబట్టి వేదశాస్త్రములను పరిశీలించి జూచిన యజ్ఞమే మోక్షదాయకముగా వివరించబడినది. భగవద్గీతలో - శ్లో। యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యనే సర్వకిల్చిషైః (8వ అధ్యా॥ 138 శ్లో)
అని కలదు. అనగా సమస్త పాపములనుండి విముక్తుడగుటకు యజ్ఞమే తరుణోపాయము. యజ్ఞమనగా -
“యజతే యజ్ఞః యజదేవపూజా సంగతి కరణదావేషు” ఈ ధాతువు నుండి యజ్ఞ శబ్ధము సిద్ధమగుచున్నది. అగ్ని హోత్రము మొదలుకొని అశ్వమేధ పర్యంతము జగదుపకారమునకై చేయబడునది యజ్ఞము. యజ్ఞమే యాగము. “యజుర్యజనాత్తూని విద్యారణ్యులు చెప్పిరి. అనగా యాగము నెరవేర్చునది. యజుర్వేదమని తాత్పర్యము యాగ శబ్దమునకు కర్మయే యర్థము.
ఆర్యులు ప్రాయశ్చితార్థమైన నరమేధ, గోమేధ, అజామేధ, అశ్వమేధాది యజ్ఞములు చేయుచుండిరని అర్నేయములు సాక్ష్యమిచ్చుచున్నవి. అటులైన యజ్ఞముల నెవరు నియమించిరి? బుగ్వేదము ప్రథమ మండలము 164వ సూక్తమునందు పవ్రాయబడినదానిని బట్టి -
సృష్టికర్త యాగమనిధుల నేర్చరచెను. యాగమాచరణ సహాయమున ప్రపంచముద్భవించెను. ఆ శక్తి సహాయమున ప్రపంచము నిలిచినది. ప్రపంచముయొక్క గర్భమే 'యాగమనిధి” యని తెలియుచున్నది. భగవద్గీత 8వ అధ్యాయములో - శ్లో। సహయజ్ఞాః ప్రజాసృష్ట్వాపురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వమేష నోస్త్విష్ట కామదుక్! సర్వే ప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః॥ యజ్ఞశిష్టామృత భుజోయన్తి బ్రహ్మస్సనాతనమ్!॥ నాయంలోకోస్త్య యజ్ఞస్యకుతోన్యః కురుసత్తమా?
అనగా, యజ్ఞములు ఆదియందే ప్రజలతో కూడ ప్రజాపతివలన సృజింపబడిన సమస్తమైన కోరికలను యిచ్చుచున్నవి. యజ్ఞమువలన పాపక్షమను బొంది శాశ్వత పబ్రహ్మము బొందవచ్చును. ఓ కురు శ్రేష్టుడా ! అవి లేనివారికి ఇహలోకము లేదు. ఇక పరలోకమెట్లుండును? అని పవ్రాయబడెను.
“ప్రార్లనావిధి యొక్కటే చాలును, యజ్ఞ కర్మమేల” యని ప్రశ్నించిన యెడల దానికి సమాధానము వేదములోనే గలదు. థె గో జ్ఞ కర్మ! ల
“బ్రహ్మయజనము నొక్కటిగనుండును. యజనమని పలికినపుడంతయు (పబ్రహ్మమధ్యాహారముగ నున్చదని తెలియవలెను. అబ్రహ్మయజనము దైవ ప్రీతికరముగనుండదు అని బుగ్వేదము 7వ మండలము £26వ సూక్తము ఒకటవ బూక్కు తెలియజేయు చున్చది.
కావున యజ్ఞము లేకుండ ప్రార్ధన చేసి పాపక్షమాపణ, లేక పరిహారమొందుట అసాధ్యము. ఇక యజ్ఞయాగములను గురించి వేద శాస్త్రములేమని సాక్ష్యమిచ్చుచున్నవి?
(శ్రు। ఇయంచేదిః పరోఅస్తః వృదివ్యా అయం యజ్ఞోభువనస్యనాభిః (బుగ్వేదము 1 మం. 164సూ, 85సం!!) అనగా యీ వేది భూమికి చిట్టచివర ఈ యజ్ఞము సర్వభూత జాతమునకు ఆధారము మరియు “ప్రధమాని ధర్మాణి” (ధ్రమ ధర్మములు. “యక్సేసర్వం ప్రతిష్టితం” యజమే సర్వమును ప్రతిష్టించును. “యతజ్లేనవా దేవా దివంగతా?” యజమువలననే దేవతలు స్వర్గము
ఇ 6 ఇ 6 ఇ ఇ () జెందిరి. “యజ్ఞోవైసుతర్యానౌః” ( బుగ్వేద బ్రాహ్మణము 1,3,18). అనగా యజ్ఞమే సుకరముగా తరింపజేసెడి నావయనియు “బుతస్యనః పధానయాతి విశ్వానిదురితా?” (బుగ్వేదము 10 మం. 31 సూ. 6 మం!) యనగా యజ్ఞమును మార్గము ద్వారా లోకపాపముల నుండి తొలగంచి దోడ్కొని పొమ్మనియు వేదములు ఘోషించుచు యజ్ఞము పాపనివారణ కొరకు తప్పక చేయవలసిన ముఖ్య కర్మయని బోధించుచున్నవి.
కావుననే క్షీర మృతాది అర్చణలకు బదులుగా వానిని గలిగించు గోవులు, మేకలు, గొట్టెలు బలులుగా నిలిచెను. వానిని గాపాడు మనుజుని సైతము పూర్వులు బలిగ నివ్వసాగిరి. యజమానుడు తనకు మారుగా పశు నరులలో నొకరిని బలిగ యిచ్చుచుండును. పురుషసూక్తమునుబట్టి నరమేధమును, విరాజయ జనమునుబట్టి యశ్వమేధమును, పూషుణునకు మేకపై యజము 11 తా
బ్రీతియని అజా (మేక) మేధములను ఆర్యులొనరింపసాగిరి. వారు యాగమ విధులను నేర్చుటకై శాస్త్రమేర్చరిచిరి. త్యాగధనులగు నార్యులు దైవభక్తిచేత నరమేధమొనర్చుట యచ్చరువు గాదని శ్రీ భట్టాచార్యులభిప్రాయపడిరి. డాక్టరు రాజేంద్రలాల్ విత్తుగారు పురుషమేధము వేదయాగమునకు పూర్వమే కలదని తెల్చిరి.
1. పఫురుషమేధము
శు॥ సప్తాస్యాసన్సః ధయంః త్రిన్సప్త మిథః కృతా! దేవాద్వయజ్ఞం తన్వానాః అబధ్బన్సురుషమృతుమ్! (బుగ్వేదము 10 మం. 18 అను 90 సూ. 7 మం.) తాత్పర్యము : దేవతలు యజ్ఞమును చేయుచున్నవారయి జీవుని పశువుగా నియమించినంత ప్రాణపంచకము, అహంకార బుద్ధులనెడి ఏడును పరిధులయ్యెను. భూత పంచకము, తాన్మత్ర పంచకము, జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, మనస్సు అనెడి ఇరువది యొకటియు సమిధులుగా చేయబడినవి. (అనగా దేవతలచే చేయబడి యజ్ఞమునందు పంచభూతాలు సాధనములయి ్రవర్తించినవి).
బు॥ తం యజ్ఞమృర్ హిషి ప్రౌక్షన్ పురుషజాత మగ్రత। తేనదేవా అజయస్త సాధ్య బుషయశ్చయే॥ (బుగ్వేదము 10,18,90,8)
తాత్పర్యము ఆ యజ్ఞమునకు ఆరంభమందు పుట్టిన జీవుని యజ్ఞములో సంస్కరించిరి. అనగా లీనము చేసినంత జ్ఞానులును బుషులును ఆ జీవుని పూజించిరి. అనగా తమ తమ దేహములలోనుండెడి జీవాత్మను సమర్పించి భగవంతుని పూజించిరి. మరియు యజ్ఞపశువుగ నొనర్చబడిన శునశ్శేపుని సూక్తములు బుగ్వేదము ప్రథమ మండలము, £24వ సూక్తము నుండి 84వ సూక్తములు బుగ్వేదము ప్రథమ మండలము, £24వ సూక్తము నుండి 84వ సూక్తమువరకు నున్నవి. ఐతరీయ బ్రాహ్మణములోను, కృష్ణ యజుర్వేద 'బ్రాహ్మణములోను శుక్షయజుర్వేదమునకు సంబంధించిన ఖిల్లాలోను, శతపథ (బ్రాహ్మణాంత్య భాగములోను నరమేధయాగము సూచింపబడినది.
2. గోమేధము (&)
మం॥ త్రోణోమేక ఉదరకంగామ, వాజవి మాంసమేకః పింతతి। సూనయాభృతం, అనిమ్బచః శకృదేకో అపాభరిత్మింస్విత్సుత్రేభ్యః పితరా ఉపాసతుః ॥ (బుగ్వేదము మం. 1 అను £22£2 సూక్తం 161, బుక్కు 10) తాత్పర్యము : ఒకడు గోవునుండి వచ్చు రక్తమును (గ్రుమ్మరించుచున్నాడు. మరియొకడు కోతులతో మాంసమును సంపాదించు చున్నాడు. నిశ్శేషముగా మాంసమును ఛేదించిన తరువాత దానిని కడుపులోనున్న పేడను ఒకడు పారవేయుచున్నాడు. ఇట్లు పుత్ర
స్థానీయులగు బుషులీవిధమున చేసిన తరువాత తల్లిదండ్రులు (అనగా, యజ్ఞమును చేయించుచున్న యజమాన దంపతులు) ఏమి పొందుదురు” (లేక) యజ్ఞమునందేమి కార్యమును చేయవలసియున్నది?
పై మంత్రము ప్రకారము “ ఆర్యులు సంపూర్ణ మాంస భక్షకులుగా నుండిరి. ఇంతియేగాక గోమేధము పుణ్యకార్యముగా భావింపబడుచుండెను. నరమేధము కూడ నచ్చట నవలంబింపబడుచుండెను. భవభూతి యుత్తర రామచరిత్రములో వాల్మీకి ఆతిథ్యమొసంగు సందర్భమున,, జాగరూకులై పరీక్షించినచో వసిసష్టకెట్టి తజీపి పెయ్యను జంపి విందుజేసినది తెలియజగలదు” (ఆర్యకవి కుతంత్రము £20వ పుట).
(8) “నరమధము”
“సోమకుడు తన కుమారుని జంపి నరమేధము చేసెను” (భారతము అరణ్యపర్వము 8వ అధ్యాయములో)
12 యజము ఠా
3. అశ్వమేధము
పురుషమేధమును పోలినదే అశ్వమేధము. బుగ్వేదము ప్రథమ మండలము 162వ సూక్తములో 1 నుండి 2£2 వరకు గల బుక్కులలో యశ్వమేధమును గూర్చి వివరించబడినది. యాగార్హమగు అశ్వము (గుట్జిము)ను ఆర్యులిట్లు ప్రార్థించిరి ా బూు॥ సుగవ్యనోవాజీ స్వత్వ్యం పుంసః పుత్రాఉత విశ్వాపుషంరయమ్ అసగాస్త్యంనో అదితిః కృషోతుక్షత్రంనో అశ్యోవనతా హవిష్మ్యాన్!!
తా! చదువబడుచున్న అశ్వము మాకు సకలమును బోషించునట్టి మంచి గోవులు గలట్టి ధనమును కలిగించును గాక! హవిస్సుగానైన యీ యశ్వము మాకు క్షాప్రతేజము గలిగించునుగాక ! దైన్యములేని అశ్వము పాపము లేకుండ జేయుగాక ! అట్లు కొన్ని మంత్రములు చదివిన తదుపరి గుట్టిమును బలిగ నివ్వవలెను.
ఈ యశ్వమేధము కేవలము పారలౌకిక విధియగుటయేగాక యైహిక కామ్యఫలప్రదాయిగరు, రాజగౌరవ స్థాపకముగను బరిణమించెను. బుగ్వేదము 1వ మండలము 168 సూక్తములో యాగార్హమగు నశ్వర్ధనయు దానిని సూర్య యమాగ్బులతో బోల్చుటయు మొదలగు విషయాలున్నవి. మరియు -
“యేచార్యతే వచనం సంభరంతి” అనగా చంపిన యశ్వమును (కోసి పండినట్లు కనబడుచున్నది. “యత్తేగా త్రాదగ్ని నాపచ్యమానా” అని గుట్టిము మాంసమును పచనము చేసినట్లు గలదు. “గాత్రాణ్యసినా మిధుకః” అనగా కత్తితో సశ్వావయవములను కోసినట్లు గలదు. (ఆంధ్ర బుగ్వేదము 449 పుట). కావున మంత్రములలో హింస లేదను ఆర్య సమాజకుల మాటలు నిర్ధ్భకములు కావా?
4. అజామధము
సర్వమును నడిపించువాడు పూషణుడు సర్వులను రక్షించువాడును అతడేయనియు, అతనికి మేకపై బ్రీతియనియు ఆర్యులు యజామేధమును చేయుచుండిరి. అశ్వమేధ సమయమున యితర జంతువులతో బాటు మేకలను బలిగనిచ్చుటయు గలదు. అశ్వమేధ సమయమున చదువబడు బుగ్వేద మంత్రములలో మేకను గూర్చియు కొన్ని మంత్రములు గలవు. బుగ్వేదము (ప్రథమ మండలము 162వ సూక్తము 8వ బుక్కునందు - ఈ మేక సర్వ దైవములకు ప్రీతిగ పూషణుని భాగముగ నేర్చడి గుజ్జము వెంబడి ముందరికి తీసికొనిపోబడును. త్వష్ట బలికి నర్హమగు అశ్వమువెంట దానితో యశో మార్గమునకు బంపబడును అని గలదు.
ఆర్యులు పూర్వ కాలమున దైవములకుగాను, అజామేధమునెటులొనర్చునది మున్ముందు వివరింపబడును. స్మారులు నేటికిని మేకను బలిగ నర్చ్పించుచుందురు.
మహమ్మదీయులు కూడ యజ్ఞకర్మను సూచించు “బకరీద్” (అనగా యజామేధము) అను పండుగను ఆచరించుచున్నారు. దానికి “ఈ దిఖోర్భాన్” “ఈదుల్ జుహ”ి బల్యర్పణ పండుగ అను నామములు కలవు. అది వారికి మిగుల పుణ్యకరమైనదియు, ప్రతి మహమ్మదీయుడు నాచరింపవలసినదై యున్నది.
మహమ్మదువారు ఈ పండుగను ఆచరించునప్పుడు రెండు మేకపిల్లలను తెప్పించి దానిలో నొకదానికి తన నిమిత్తమును తన కుటుంబము నిమిత్తమును, రెండవదానిని ముస్లిముల నిమిత్తమును దేవునికి బలిగా నర్చింతురు. “బకరీదు” పండుగనాడు ముసల్మానులు చేయు “పజు” అను పేరుగల హస్తపాదాద్రి ప్రక్షాళనలో - “ఓ దేవా ! ఈ బల్యర్పణను మా పాప పరిహారము కొరకు అంగీకరించి మాలోని దుర్మార్గములు తీసివేసి మా మతమును పవిత్రము చేయుమని స్మరింతురు.
యూదులు కూడ అజామేధమును చేయుచుందురు. దీని విషయమై క్రీ.పూ. 1500సం॥ పూర్వమే వ్రాయబడిన వారి
ధర్మశాస్త్రమునందు ప్రాయబడినదేమనగా యాజకుడు ఇశ్రాయేలీయుల సమూహము నొద్ద నుండి పాపపరిహారార్థబలిగ నొక పొట్టేలును తీసుకొని రావలెను. అప్పుడు పాప పరిహారార్థ బలిగ నొక మేకను యాజకుడు వధించిన తదుపరి రెండవ మేక యజము 13 తా
తలమీద తన రెండు చేతులు వుంచి ఇశ్రాయేలీయుల పాపములన్నియు, వారి యతిక్రమములన్నియు దానిమీద నొప్పుకొని, ఆ మేక తలమీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి ప్రదేశమునకు భరించి పోవును. యాజకుడగు “అహరోను” తనకొరకు, ప్రజలకారకు దహనబలిని అర్పించి, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. (లేవీయకాండము 16 అధ్యా. 15, 21-24 వచనములు).
అ. రాజసూయము
అశ్వమేధము చేసిన తరువాత సార్వభౌమాధికారమును సూచించుటకై చేయబడినది రాజసూయము, రాజసూయమందు రక్తము చిందింపరాదు. ధర్మరాజు ఒనర్చిన రాజసూయమందు కృష్ణుడు తన మేనత్త కుమారుడగు శిశుపాలుని శిరస్సు ఖండించుట చేతనే పాండవులు అరణ్యవాసము చేయవలసి యుందునని వ్యాసుడు ఆ సమయమున యధిష్టరునకెతింగించెను. రాజసూయమండు సద్యోఘృతమును అగ్నిహోత్రమందు దహింతురు రాజసూయయాగ సమయంబున చక్రవర్తి (బ్రాహ్మణులకు ఆయా దానము లొసంగి సత్కరించును.
6. వాజపేయము
రాజసూయమనంతరం రారాజు వాజపేయమును చేయవలెను. అప్పుడు పురోహితుడు అతనితో నీవు బలియై తిరిగి రావలెనని చెప్పును. అంతట చక్రవర్తి నేనెటుల చనిపోయి తిరిగి బ్రతకగలనని చెప్పినంత పురోహితుడు నీవు కాదు, రానున ప్రజాపతియే ప్రజల రక్షణార్థము మృతిజెంది తిరిగి బ్రతికి రాజ్యమేలునని చెప్పి ఒక పొట్టేలును అతనికి బదులుగా బలి చేయును.
“అశ్వమేధ తంత్రము” అను సంస్కృత గ్రంథమును పరించినయెడల అశ్వమేధ, గోమేధ, నరమేధ, అజామేధాది యజ్ఞముల సంగతి విశదముగా తెలియగలదు. ఈ (గ్రంథము మదరాసునందుగల అడయారు (గ్రంథాలయములోను, తార్వాలాఫాల్ లైబ్రరీ, బొంబాయిలో మాత్రమే లభ్యము కాగలదు. పైనుదహరించిన యాగములేకాక పంచయజ్ఞములను గూర్చి మనువు వ్రాసెను. అవి ప్రస్తుత కాలములో ప్రాముఖ్యతనందియున్నవి. అవేవనగా -
శో బుషి యజ్ఞః దేవ యజ్ఞః భూతయజ్ఞంచ సర్వదా || నృయజ్ఞ పితృ యజ్ఞంచ యధాశక్తి సహాపయేత్॥ (మనుస్మృతి 4అ. 21 శ్లో) శ్లో। అధ్యాపనం బ్రహ్మయజ్ఞః పిత్రుయజ్ఞశ్చ తర్చణమ్ 1 హోమో, దైవో, బలిర్భూతో, నృయజ్ఞో అతిథి పూజనమ్!॥ (మనుస్మృతి 8అ. 70 శ్లో) . దేవ యజ్ఞము - అగ్ని హోత్రునియందు దేవతలకు హోమము చేయుట; పితృ యజ్ఞము - పితరులకు స్వభాకారముతో జలతర్బ్చణాదులు; . భూత యజ్ఞము - ఆయా జీవులకు భూతములకు అన్నదానాది బలిదానము. వ మనుష్య యజ్ఞము - అతిధులకన్నదానము - బ్రహ్మ యజ్ఞము - వేదమును పఠించుట.
లా సలు సం
“దైవోబలి” ఇదియు పంచయజ్ఞములోనిదేయని కొందరందురు. దోషముల నిమిత్తము పరిహారార్థముగ పంచ యజ్ఞములను చేయవలెను. లేకున్న దుఃఖము దుర్దతి తప్పదని హైందవుల నమ్మకము.
ఎవరి పాపములను వారు అనుభవించినరీతి వాటి ఫలితమును కూడా అనుభవించవలసినదేయనియు, పాపక్షమాపణకు మార్గమే లేదనియు వాదించినచో ఆర్యులు వరుణుని ఏమని ప్రార్ధించిరో గమనించుడ :
మం॥ అవతే హేళో వరుణ నమోభిరవ యజ్ఞేభిరీ మహేమవిర్భిః ! క్షయన్న స్మభ్య మసురప్రతచేతారాజన్నేంనాంపిశిశ్రధః కృతాని ॥
14 యజము ఠా
తాత్పర్యము : రాజగు వరుణా ! నీ కోపమును నమస్కారములతో బోగొట్టుకొనుచున్నాము. యజ్ఞములచేతను హవిస్సులచేతను బోగొట్టుకొనుచున్నాము. అనిష్టము దొలగించునట్టి యో వరుణా ! “మాకొరకిచ్చట నివసించుచు మేము జేసిన పాపములను వదలించుము” ( ఆంధ్ర వేదము ర్4వ పుట £267వ బుక్కు),
పైరీతిగా ప్రార్ధించిన ఆర్యులు దైవావతారము నపేక్షించినటుల కూడా విశదమగుచున్నది. వరణుడు సర్వత్రా వ్యాపించి యుండువాడని ఆర్యులు నమ్మినయెడల తమ మధ్య అతడు నివసింపవలెనని ఎట్లు ప్రార్థించగలరు? గావున కర్మఫలమనుభవించి తీరవలసినదేయనియు, దేవునికవతారమే లేదనియు వాదించువారి మాటలు వేదోక్తులకెట్లు సరిపోగలవు?
పూర్వకాలమందు ఆయా మతస్థులొనర్హుచుండిన బలులేమి ఆర్యులొనర్చిన నరమేధ, అశ్వమేధ, అజమేధాది యజ్ఞములేమి సూర్యోదయమునకు పూర్వము రాత్రివేళ ప్రకాశించు నక్ష్మత్రములు రానున్న దివాకరుని సూచించు విధమున సృష్టికర్త మానవ రక్షణార్థమై భువిపై నవతరించి చేయనైయున్న మహాయజ్ఞమునకు ఛాయామాత్రములై యుండెను. ఇందుకు ప్రమాణము వేదశాస్త్రములేమని వాకొనుచున్నవో గమనింతుము.
అ) ప్రవాహ్యతే అదృథా యజ్ఞరూపాః (మందకోపనిషత్తు £2వ ఖండము, 7వ మంత్రము) అనగా యజ్ఞరూపములగు తెప్పకొయ్యలు గట్టివి కావు
ఆ) ప్రవాహ్యతే సురా యజ్ఞాః న సంశయః ॥ (స్కాంద పురాణము, యజవైభవ ఖండము 7వ అ.) ఓ దేవతలారా ! యజ్ఞములు తెప్పకొయ్యలవంటి వి. అవి గట్టివి కాదనుటకు సంశయము లేదు.
ఇ) యజ్ఞోవా అపతితస్య ఛాయా క్రియతే! (తాండియ మాహా (బ్రాహ్మణము) (ప్రజాపతి) యజ్ఞమే రక్షించుచున్నది దానియొక్క ఛాయయే జరుపబడుచున్నది ఈ) ఆత్మదా బలదాః యన్యఛాయామృతం, యన్య మృత్యుః (బుగ్వేదము 10 మం. 121 సూ. 2 బుక్కు) అనగా యెవని యొక్క ఛాయయును మృత్యువును అమృతమగునో అతని ఛాయా మృత్యువులు ఆత్మలకు బలమునిచ్చునవిగ నున్నవనియు జెప్పబడియుండుటచే ప్రాచీనులర్పించు బలులు జగద్రక్షకుని బలికి సూచనలు మాత్రమే. మరియు “వ్యవస్థా భవిష్యన్మజ్ఞలానాం ఛాయా రూపాతతో హేతోర్చిత్వం దీయామానై రేక విధైర్వాషిక బలిభిః శరణాగత లోకాన్ కర్తుం కదాపిశకో” అనగా ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియేగాని, వస్తువుల నిజస్వరూపముగలది కాదు. కనుక యాజకులు ఏటేట యెడతెగకుండ అర్చించు ఒక్కటే విధమైన బలులు శరణాగతులకు ఎన్నడును సంపూర్ణసిద్ధి గలుగజేయనేరవు. ఐతరేయ (బ్రాహ్మణమునందు - (శ్రు। యజమానః పశుః యజమానమేవ సువర్గలోకం గమయతీ!॥ అనగా యజ్ఞము చేయువాడే యజ్ఞపశువు. అతడే స్వర్గలోకమేగునని కలదు. శతవధ (బ్రాహ్మణమునందు “ప్రజాపతి ర్యజ్ఞం” అనగా ప్రజాపతియే యజ్ఞమనియు “తస్య ప్రజాపతేరర్థమేవ మర్త్వ మాసీరర్థ మమృతం” ఆ ప్రజాపతి సగము మర్యుదుగను సగము అమర్ద్యుదుగనుండి మర్త్య శరీరమును బలిగనిడి, అమర్య శరీరముచే మృత్యువు నోడించుననియు కలదు. సామవేద తాండియ మహా బ్రాహ్మణములో రా
శ్రు॥। (ప్రజాపతిర్ధేవేభ్య ఆత్మనాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ |
అనగా ప్రజాపతి ఆత్మల రక్షణార్థము (తనను తానే) యజ్ఞముగా సమర్పించుకొని ప్రాయశ్చిత్తము చేసెననియు, బృహదారణ్య కోపనిషత్తు నందు - యజము 15 తా
“సోకామయతే నేపధ్యంను ఇందస్సాత్ ఆత్మస్యనేనస్సామ్” అనగా నతడు యజ్ఞములకు తగిన రూపమును ధరించుకొనవలెనని కోరుకొనెననియు, బుగ్వేదమందు
(శ్ర! విశ్వకర్మా సర్వాణి భూతాని జుహవాంచకార । స ఆత్మామంతతో జుహవాంచకార!
అనగా సృష్టికర్త సకల సృష్టములను బలిగనిచ్చి తుదకు తానే బలిగ నర్పించుకొనెననియు వ్రాయబడుటచే లోకాధిపతియగు నా పరాత్పరుడు మర్యామర్య్యమును వహించి, దైవమానవుడై యవతరించి ఈ భూలోకమందు తానే యజ్ఞపశువై మానవులను తరింపజేయుటకై యజ్ఞమగుటయే నిజమగు ముక్తిదాయకమగు మహాయజ్ఞమని తెలియుచున్నది.
దేవుడు భూలోకమందు అవతరించినగదా ఆయన పాప ప్రాయశ్చితార్థ బలిగా - తానే బలిగ అర్పించుకొనుట అని యందురేని దేవునికి అవతారమున్నట్టు వేదశాస్త్రములే సాక్ష్యమిచ్చుచున్నవి. (బుగ్వేదములోని 10వ మం! 90వ సూక్త 7వ బుక్కునందు).
(శ్రు। అజాయ మానో బహుధా విజాయతే । తస్యధీరాః పరిజానంతియోనిమ్!॥
అనగా జన్మించినవాడు తరచుగా జన్మించుచున్నాడు. దానియొక్క కారణమును పండితులు తెలిసికొనుచున్నారు. దీనిని బట్టి దేవునికవతారమున్నట్లు తెలియుచున్నది. ఈ మంత్రమును అవతారపరముగానే మధ్యరామానుజాచార్యులు భాష్యమందు వ్రాసిరి. ఈ బూుక్కుతైతై యారణ్యకము 8వ ప్రపాఠకమందును, శుక్ల యజుర్వేదము యొక్క 31వ మండలమందును, అధర్వ వేదముయొక్క 19వ కాండమందును ఉన్నది.
“నారాయణ” శబ్దార్థములోనే దేవుడవతారమెత్తునను విషయము స్పష్టమగుచున్నది. “నరస్సేదం నాశం అవతారేషు నారంవపురయితి నారాయణః” (గురుబాల ప్రబోధిక) నరసంబంధమైన శరీరము నారము; అవతారములయందు నరశరీరమును బొందువారు నారాయణుడని భావము. మరియు “స్వయంభువు” శబ్ధార్థమును బట్టి (యంః స్వయం భవతి సస్వయాం భూరీశ్వరః ) తనంతట తానే పుట్టినవాడు, ఎవనినుండి గాని, దేనినుండిగాని యుత్పన్నమైనవాడు కాదు; కాబట్టి పరమాత్మకు “స్వయంభు”వని పేరు దేవుడు సర్వశక్తిమంతుడు గనుక అవసరమైనయెడల అవతరించగలడు. మృత్యువునొంది మృతిని గెల్వగలడు గనుక మృత్యుంజయుడనియు ఆయనకు పేరు కలదు.
(ప్రశ్న : నేపదార్థము యొక్క స్వరూప మేక దేశీయమో దాని గుణకర్మ స్వభావములను ఏక దేశీయములగును గదా? అటులేనియతడు ఈశ్వరుడు కాజాలను. ఎందుకన ఈశ్వరుడు సర్వవ్యాపకుడుకదా?
జవాబు : దేవుడు పరలోకమందు స్థిరముగనున్నను వేగముగ పరుగెత్తుచున్న నితర వస్తువులను అతిక్రమించుచున్నారు. సర్వ ప్రపంచము పరమాత్మయందు ఏక దేశీయమై యుండినను ఆయన ప్రతి పరమాణువు నందునుండగలడు. ఆయన దూరముననున్నాడు, దగ్గరున్నాడు. ఏకకాలమునందే భూమ్యాకాశములందుండగల విభుడగుటచే ఆయన మానవ రక్షణార్థము భువిపై నవతరించిన మాత్రమున ఆయన సర్వవ్యాపకత్వాది గుణములు నష్టమైపోవు. ఆయన సర్వశక్తిమంతుడు.
సూర్యుడు గగనమందొక స్థలమునవేయబడినను అతని స్వరూప కాంతులను అనేక దేశస్థులు ఏకకాలమందే జూచుట లేదా?
దేవునిచే సృణించబడిన ఒక జ్యోతికే అంత శక్తిసామర్థ్యములు కలిగియుండ ఇక దేవుడెంత సమర్థుడో యెవరికెరుక?
1) జననము : మనుష్యుడు దేవుని కుమారుడై యుండుటచే ప్రతివాని యందు భగవదంశయందును. 2) ఆవేశము : జ్ఞానులు పలుకు వాక్కు పరబ్రహ్మ స్వరూపమందురు. బుషి, ప్రవక్త సైగంబరు, దీర్ధదర్శి దైవాత్మచే ఆవేశింపబడి దేవోక్తులు పలుకుచుందురు. 8) అవతారము. ఇది మానవ బుద్ధికి అందదు. కాని దానిని అంగీకరించవలసినదేనని బుద్ధిమంతులు చెప్పుదురు.
దేవుడు తన భక్తులగు దీర్థదర్శులకు లోక రక్షణార్థమై చేయనున్న యజ్ఞములను వందల, వేల సంవత్సరములకు పూర్వమే
