అజామేధము – యజ్ఞపశువు క్రీస్తు
16 యజ్ఞము
తపస్సమాధిలోనో లేక దర్శనాయంత్రమందో ప్రత్యక్షపరచుటచే వారు జరుగనున్న ఆ మహా బలిని భూత భవిష్యత్కాలానుగుణముగా ప్రవచించిరి.
ఆర్య, యూదా, మహమ్మదీయ మత గ్రంథములండదు గల “అజామేధము”ను గురించి తెలిసికొంటిమేని అది జగ(ద్రక్షకుడగు ప్రజాపతి చేయనైయున్న మహా యజ్ఞమున కెట్లు సాదృశ్యముగానున్నదో గ్రహించగలము.
అజామధము
మచ్చలేని మేక కావలెను.
దాని తలకు బలుసుకంప చుట్టవలెను.
దానిని యూప స్థంభమునకు కట్టవలెను.
నాలుగు కాళ్ళలోను మేకులు కొట్టవలెను.
మేకకు కప్పిన పచ్చడమును నలుగురు బుత్వికులు పంచుకొనవలెను. దాని ఎముకలలో నొకటియు విరువరాదు.
మేకకు సోమరసము త్రాగించవలెను.
దానిని వధించిన పిమ్మట ప్రాణప్రతిష్ట చేయవలెను.
దాని మాంసమును భుజింపవలెను.
ఏ 2 2. 2 1 2 2 3
అని వివరింపబడుటచే రానున్న నిష్కళంక దైవావతారమూర్తి యొక్క లోక రక్షణార్థ మరణమందు పై సూచనలకు సరియైన యర్థానుగుణ్యమగు సంగతులు జరుగవలెనని బోధపడుచున్నది. కాని భగవంతుడవతరించి పాపులను రక్షించుటకై యజ్ఞపశువుగా చనిపోయి మృత్యుంజయుడైనట్లు మన దేశపు అవతార చరిత్రలయందు గానరాదు. అయితే మన ఆసియా ఖండమందే మధ్యధరా సముద్ర తీరమందున్న భూమధ్య దేశమగు పాలస్తీనా దేశము ( ఇశ్రాయేలు) నందొక పరిశుద్ధ కన్యక గర్భమున నుద్భవించిన దైవావతారునియందీ లక్షణములన్నియు నున్నటుల (గ్రహించగలము. కేవలము నిష్కళంకుడై పరమ పవిత్ర జీవితము గలిగియుండి మర్యా మర్యతలు అనగా దైవత్వ, మానవత్వములు మూర్తిభవించి కలసియుండిన ఈయన తాను మానవ రక్షణార్థము యజ్ఞమై చనిపోయి మృత్యుంజయుననై జీవింతునని మొదటినుండియు చెప్పియుండెను. పాపాసక్తులై ఈయన బోధనా జీవితము జూచి అసూయచే తనను జంపనుద్ధేశించిన దుర్మార్గులకు తనంతట తానే పట్టుబడి, పురుష సూక్తమందటి విరాట్బురుష యజ్ఞమువలె నా దుష్ట్ప్రులచే జంపబడి మరణమును జయించి లేచిన విధమును జూడగా బుగ్వేదమందు యజ్ఞ పశువునుగూర్చి వివరింపబడినదంతయు నీ క్రింది విధముగా నీయనయందు నెరవేరినట్లు విశదమగుచున్నది.
యజ్ఞపశువు క్రీస్తు
1. మచ్చలేని మేక యున్నటుల. ఈయన పాపములేని దైవ మానవుడు
2. దానితలకు బలుసుకంప చుట్టిరి. ఈయన తలకు ముండ్ల కిరీటము బెట్టిరి.
3. దానిని యూప స్థంభమునకు గట్టిరి. ఈయనను సిలువయను కొరతమ్రానిపై నంటగట్టిరి.
4. దాని నాలుగు కాళ్ళలోను రక్తము కారునట్లు ఈయన హస్తపాదములందు ఇనుప మేకులు కొట్టిరి. మేకులు కొట్టిరి
5. మేకకు కప్పిన పచ్చడమును నలుగురు బుత్విక్కులు క్రీస్తును సిలువ వేసినవారు ఆయన వస్త్రమును పంచుకొనిరి. పంచుకొనిరి
6. దాని ఎముకలలో నొకటియు విరువకూడదు. ఈయన ఎముకలలో నొకటియు విరువబడలేదు.
7. మేకకు సోమరసమును శ్రాగించిరి. ఈయనకు చిరకనిచ్చిరి.
8. వధానంతరము దానికి ప్రాణప్రతిష్ట చేయవలెనన్నట్లు ఈయన మృత్యుంజయుడై లేచెను.
9. దాని మాంసము భుజింపవలెనన్నట్లుగా. క్రీస్తు లోకరక్షణార్థమై - యజము 17 తా
తాను యజ్ఞముగా నర్చించుచున్నతన శరీర రక్తములను తన భక్తులు భుజించి పానించవలెననియు, అందుకు సూచనగా తన మరణమును తరచుగా జ్ఞాపకము చేసికొనుచు, రొట్టెను మరియు (ద్రాక్షారసమును పుచ్చుకొనవలెననియు, తన మరణాత్పూర్వము తన భక్తుల కాజ్జాపించి యొక ఆచారమును నిర్ణయించెను. ఇప్పటికిని అట్లే జరుగుచున్నది.
ఇట్లు ఇశ్రాయేలు దేశములో వెలిసిన దైవావతారమందే పాపాత్ముల రక్షణకై ప్రాయశ్చితార్థ యాగము నెరవేర్చబడియుండుటచే, నిదియే పాపాత్ములు ముక్తికై నమ్మవలసిన సత్యమైన విరాట్పురుషావతారమని స్పష్టమగుచున్నది. ఈ సత్యమును ఇంకను (గ్రహించక ఐతరీయ బ్రాహ్మణ్యములో పవ్రాయబడినరీతి నేటికి స్మార్సులు మేకను బలిగ నర్చించుచున్నారు. మరికొందరు పిండితో మేకనుజేసి అర్పించుచున్నారు. మహమ్మదీయులు యజ్ఞ కర్మను సూచించు “బకరీదు” యను పండుగ నాచరించుచున్నారు. అట్లే యూదులును ఆయా బలులర్పించుచున్నారు. అట్లే అయితే యజ్ఞయాగములను గురించి సత్యవేదమందేమని పవ్రాయబడియున్నదో గమనింపుడు.
“యత ఏతాని ఛాయా స్వరూపాణి. క్రీస్తు సత్యమూర్తి ః క్రీప్టః అనగా ఇవి (బలులు) రాబోవువాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో యున్నది. (కొలొస్స £ అ. 17వ) లోకపాపములను మోసికొనిపోవు దేవుని గొట్జెపిల్ల క్రీస్తే సుమా ! (యోహాను 1:29).
వేదములందు వ్రాయబడిన నరమేధ, అశ్వమేధ, అజామేధాది యజ్ఞములు క్రీస్తు సిలువమ్రానుపై నెరవేర్చి మహాయాగమునే సూచించుచున్నవి.
యుగయుగముల తన రక్షణ సంకల్పమునుబట్టి జగద్రక్షణకై తనను తానే సమర్పించుకొనిన పరమాత్ముడు తన ప్రవక్తకకు దర్శనమును (గ్రహించినప్పుడు అతడిట్లు వచించెను. “తతో జగతః సృష్టి కాలాచ్చేదిత స్సమేషవత్సః” (ప్రత్యక్షీకరణము 18:8).
అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొటజ్జపిల్ల క్రీస్తు ఎప్పుడు సిలువ వేయబడెను? లోకము పుట్టుటకు పూర్వమే. ఆయన లోకమందవతరించి యిప్పటికి 2000 సం॥లే గదా? అవును; కాని ఆయన లోకము పుట్టుటకు పేర్వమేయున్చవాడు. యోహాను 17:5-24వ. అప్పుడాయన చేసిన యజ్ఞమేది? అదియే బుగ్వేద పురుష సూక్తమందు వివరింపబడిన మానవ యజ్ఞము కావుననే “యాగ మాచరణ సహాయమున ప్రపంచముద్భవించెను. ఆ శక్తి సహాయమున ప్రపంచము నిలిచినది. ప్రపంచము యొక్క గర్భమే యాగమ విధియని వేదము పల్కెను. బుగ్వేదము ప్రథమ మండలము 164వ సూక్తములో ఒక వేదాంతి ఇట్లు చెప్పెను - 11089 116 08160095 | 566 1116 11170095 (6113661 0039) అనగా బాహ్య సిలువద్వారా నేను అంతరంగ సిలువను చూచితిని. అయితే కాలము సంపూర్ణమైనప్పుడే ఆయన లోకములో అవతరించి భూత, వర్తమాన, భవిష్యత్కాలములకు సరిపోగల ఒకేనొక మహా యజ్ఞము నెరవేర్చెను. (గలతీ 4:4; హెబ్రీ 9:26).
ప్రశ్న : క్రీస్తుకు పూర్వకాలమందున్న పిలాతు గతి ఏమి?
జవాబు : క్రీస్తు బలి ద్వారానే భక్తులగు పితరులు పరలోకగతులైరి. అంతదనుక వారు స్వర్గ పాతాళ లోకములకు భిన్నమైన నొక స్థలమందుండిరి. దీనినే అదృశ్య లోకము లేక పరదైసు యందురు. (లూకా 16:22,28). సమూయేలు అనబడిన ప్రవక్త అచటనే యుండెను. పితృ దేవతలలోనుండి అతడు పైకి వచ్చి సౌలు రాజుతో మాట్లాడెను (1 సమూయేలు 28:18-15). రక్షకుడు సిలువ వేయబడినప్పుడు ఆయనతోకూడా సిలువ వేయబడిన యిద్దరు దొంగలలో నొకడు పశ్చాత్తాపపడి - యేసూ, నీవు నీ రాజ్యముతో వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము అనెను. అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. కావున క్రీస్తు లేఖనము ప్రకారమే సిలువ వేయబడి చనిపోయినంతనే అదృశ్య లోకమగు పరదైసులోనికి దిగి అచ్చటగల పితరులతో మూడు దినములుండి మరణమును జయించి లేచి తన బలికై నిరీక్షించి తాత్కాలిక యజ్ఞ యాగములు చేసి ఆయన ధర్మశాస్త్రానుసారముగా నడుచుకొనిన ప్రాచీనులకు సద్గతి నొసంగుటకై వారిని పరలోకమునకు చేర్చెను. అందుచేత ఆయన ఆరోహణుడైనప్పుడు చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెనని ప్రవక్త చెప్పుచున్నాడు. ఆరోహణమాయెననగా (మొదట) ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము లన్నిటికంటె మరిపైకి ఆరోహణమైన యున్నాడు (ఎఫెసీ 4:8-10) ఐతరీయా బ్రాహ్మణములో పవ్రాయబడినదేమనగా ా పూర్వకాలమున దైవములు (ఆర్యులు) మానవుని బలిగ నిచ్చుచుండిరి. అప్పుడు బలిసారము మానవునినుండి వెడలి గుజ్జిమును వదలి ఎద్దును చేరెను. దానిని గని ఎద్దును బలిగా నిడిరి. అది మేకను జేరగా దానిని బలిగ నిడిరి. బలిసారము భూమిలో జొచ్చెను. దానిని వెదకుటకు భూమిని 18 యజ్ఞము
త్రవ్విరి. బలిసారము బియ్యములోను, గోధుమలోను జేరియుండెను. పశ్వాది బలులనుండి ఎంత బలిసారము దొరకుచుండెనో అంత సారము బియ్యమునందును గోధుమలందును నుండుటచే తెలిసినవారీ వస్తువులనే బలి (పూజా (ద్రవ్యము)గ నిడుదురు.
యూదులు కూడా గోధుమపిండిలో నూనెపోసి సాంబ్రాణి వేసిన నైవేద్యమును యెహోవా దేవునికి బలిపీఠము మీద హోమముగా దహించిరి. (లేవీయకాండము 2: 1-3). కాబట్టి క్రీస్తు ప్రభువు తననుతానే గోధుమ గింజతో పోల్చుకొని తాను సిలువ వేయబడినప్పుడు అనగా బలియైనప్పుడు అందరిని తనయొద్దకాకర్షింతునని చెప్పెను. (యోహాను. 12:23-82).
భూమి నుండి మొలచిన సత్యము క్రీస్తే (కీర్తన 85:11). నేనే సత్యమును జీవమునై యున్నాను అని ఆయన చెప్పెను (యోహాను. 14:6).
ఆత్మీయమైన ఆకలిదప్పులు గలవారు జీవాహారమైన క్రీస్తును భుజించి, అనగా ఆత్మీయముగా ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగినచో నిత్య జీవము గలవారై యుందురు. వారు మరణించినను అంత్యదినమున వారిని లేపుదునని ప్రభువు సెలవిచ్చెను (యోహాను 6:35; 52:58).
ఇక్కాలపు హైందవులాచరించు పంచయజ్ఞములు కూడా క్రీస్తు రక్షణార్థమై చేసిన మహాయజ్ఞమందే కలసిపోయినవి. ఎట్లనగా -
1) దేవయజ్ఞము : దైవత్రిత్వములో రెండవవాడగు క్రీస్తు (దేవునిలో దేవుడై యుండి) యజ్ఞ పశువుగా వధింపబడి దేవునికి ప్రీతికరమగు హోమమాయెను.
2) పితృ యజ్ఞము : పితరులకు క్రీస్తు బలిద్వారా సంపూర్ణసిద్ధి కలిగెను (హెట్రీ 11:40). ఇందుకు సాక్ష్యముగా సమాధులు తెరువబడెను. చనిపోయిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేపబడెను. (మత్తయి 27:52).
8) భూత యజ్ఞము గై క్రీస్తు సిలువవేయబడుటచే పశుబలి నాపి ప్రపంచ పునర్జన్మకు పునాది వేసెను. (రోమా 8:21). రానున్న క్రీస్తు రాజ్యములో హింసలేనందున క్రూర జంతువులు సాధు జంతువులతో నుండి గడ్డి మేయును (యెషయా 11:6-9).
4) మనుష్య యజ్ఞము : పాప, మరణ, నరకములనుండి మానవులను విడిపించుటకై ఆయనే బలియాయెను. (రోమా 6:14; హెబ్రీ 2:14,15; రోమా 8:1).
5) బ్రహ్మ యజ్ఞము : క్రీస్తే దేవుని వేదము అనగా జ్ఞానము. (1 కొరింథీ 1:24). ఆయనే వాక్యమై యున్నాడు (యోహాను 1:1). కనుక అక్షర బ్రహ్మమగు ఆయనను ప్రతిదినము పఠింపవలెను.
మానవులొనరించెడి పంచ మహా పాతకముల పరిహారార్థమై రక్షకుడు పంచ గాయములను బొందెను. సిలువను గూర్చి వార్త నశించుచున్నవారికి వెళితనముగాయున్నది. గాని రక్షింపబడుచున్నవారికి దేవుని శక్తి, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెళ్టితనముచేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయెను (1 కొరింథీ 1:18,21).
(ప్రశ్న : యజ్ఞము లేకుండా దేవుడు పాపములను క్షమించలేడా? ఆయన కృపగలవాడుగదా !
జవాబు : దేవుడు సత్యమై యున్నాడు. ఆయన (ప్రేమయైయున్నాడు. సత్యమునుబట్టి ఆయన పాపులను శిక్షించవలసియున్నది. ఆయన (్రేమగలవాడు గనుక కృపతో పాపులను క్షమింపవలెను. అయితే కృపా సత్యములు ఒకదానికొకటి విరుద్ధములై యున్నవి. సత్యము నెరవేర్చవలెనన్న కృపయు, కృపను నెరవేర్చవలెనన్న సత్యమును అడ్డగించును.
శిబిచక్రవర్తిని గూర్చి గాక ఈ విషయమున స్మరించుట యవసరము. శిబి చక్రవర్తి దయగలవాడగుటచేత తన శరణుజొచ్చిన పావురమును రక్షింతునని అభయమొసంగెను. అంతట డేగ యొకటి అచ్చకరుదెంచి తానా పావురమును భక్తింపకున్నచో ఆకలిచే మరణింతుననియు, న్యాయము చొప్పున జరిగింపగోరినచో ఆ పావురమును వదలక తప్పదనియు వాదించెను. అప్పుడు శిబి బాగుగా ఆలోచించి ఆ పావురమంత మాంసమును డేగకిచ్చుటకు ఒప్పించి తుదకు తానే తన మాంసమును బలిగా డేగకర్పించెను. గనుక కృపా సత్యములకు చిహ్నములైన ఆ రెండు పక్షులు సంతసించి రాజీపడెను. ఇదే సత్యమును పరిశుద్ధ గ్రంథము బోధించుచున్నది సుమా ! ఆదియందు వాక్యమైయున్న అనగా శబ్ద (బ్రహ్మమగు ఓంకారమైయున్న దేవుడే శరీరధారియై కృపాసత్య యజము 19 తా
సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను (యోహాను 1:1-5, 14). దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది. (కొలొస్స £2:9). పాపులను రక్షించుటకై క్రీస్తు సిలువ వేయబడుటచే మానవులు పొందవలసిన శిక్షను తానే పొంది సత్యమును నెరవేర్చెను.
అట్లే వారి పాపములను క్షమించి కృపను నెరవేర్చెను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము ప్రవచనామసారమైనది (ప్రకటన 19:10). కావున దీర్ధదర్శి క్రీ.పూ. 1000 సం॥ల నాడే యిట్లు ప్రవచించెను - “కృపా సత్యములు కలిసికొనినవి; నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దుపెట్టుకొనినవి; భూమిలోనుండి సత్యము మొలచును. ఆకాశములోనుండి నీతి పారజూచును” (కీర్తన 85:10,11). ఈ వచనముల భావము క్రీస్తు సిలువవేయబడినప్పుడే నెరవేరెను, కాబట్టి మహా జ్ఞానియగు సొలోమోను చెప్పినట్లు “కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును” (సామెతలు 16:6).
శో యద్గురుయజ్ఞ కర్మంచ, యజ్ఞంచ సర్వసిద్ధియేత్
యజ్ఞయేవ సర్వస్యాధ్యంచ, యజ్ఞకర్మ పరాత్పరమ్॥
(గురుగీతలు) అనగా జగద్గురువు యజ్ఞము చేయగా ఆ యజ్ఞము వలన సర్వము సిద్ధించును. దానివలననే సర్వము సాధ్యమగును. (కావున) యజ్ఞకర్మయే పరాత్సరమైయున్నది. మరియు -
శో నపుణ్యం దానధర్మ నకర్మశ్చ పుణ్యం భవతే।
నపుణ్యో ప్రాణదసశ్చ జగత్పుణ్యం నాస్తి; నాస్తి ॥ అనగా దానధర్మములచేతను కర్మచేతను, పుణ్యము కలుగదు. ప్రాణదానము లేకుండ ప్రపంచమునకు పుణ్యమేలేదు.
ఇట్లు ప్రాణదానము చేయ సమర్థుడు బరబ్రహ్మమగు గురువైయున్హాడు. “గురుదేవ పరబ్రహ్మ” మరియు “మంత్రోగురు?” మంత్రమే గురువు. (బుగ్వేదము 1 మం. 147 సూ. 4 మ.).
“అమంత్రం అక్షరం నాస్తి” కావున ఆ గురువు మొదటి అక్షర బ్రహ్మమగు ఓంకారమే యోగదర్శనమందు పతంజలి ఇట్లు వ్రాసియున్హాడు. “తస్యవాచకః ప్రణవః” అనగా “ఓమ్” ఈశ్వరుని నామము. ఇట్లు ఆదియందు వాక్యమైయున్న క్రీస్తు యేసే నిజమగు గురువు తానేనని పలికెను. (మత్తయి 28:10) ఆది గురువు మహా దేవుడగు యేసుక్రీస్తే సుమా ! (తీతు 2:18). యోగదర్శిని ఈ విషయమునే సమర్థించుచున్నది. “స ఏషపూర్వేషామసి గురుః కాలేన, పచ్చేదాత్” (యోగదర్శిని 1:26). అనగా ఆ యేసు ఆది గురువైయుండి కాలముచేత వేరుచేయబడలేదు. “సత్యోమంత్రః సత్యము (బుగ్వేదము 1:152-2) సత్యమే క్రీస్తు (యోహాను 14:6) కావున జగద్గురు యజ్ఞముద్వారానే తప్ప పాపక్షమాపణ కలుగదు.
దేవోక్తులు యూదులపరము చేయబడెను (రోమా 8:2). కావున యూదా ప్రవక్తలు క్రీస్తుయేసు సిలువనుగూర్చి వందల సంవత్సరములకు పూర్వమే తేటగా లిఖించిరి. వారిలో దీర్ధదర్శియగు యెషయా క్రీ.పూ. 700సం॥ల క్రిందట యిట్లు వ్రాసెను. “మన అతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపర్చబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది (యెషయా ర్3: ర్).
ప్రశ్న : మన పాపములకొరకు క్రీస్తు సిలువ వేయబడినచో ఒకని ఆకలికొరకు మరియొకడు అన్నము తినినయెడల మొదటి వాని ఆకలి తీరునా?
జవాబు : తల్లి ఆకలితీర అన్నము తినుటచే ఆమె పాలు త్రాగి బిడ్డ ఆకలి తీర్చుకొనగలదు. బిడ్డ జబ్బుకు తల్లి పథ్యము చేయుటచేతనే అతనికి ఆరోగ్యము చేకూర్చుచున్నది. ఒకరు వెలిగించిన దీపము అనేకులకు కాంతి నిచ్చుచున్నది. యేసుప్రభువు అందరికి తల్లివంటివాడు. ఆయనే లోకమునకు వెలుగై యున్నాడు. (యోహాను 8:12). బుణస్థుడు అప్పు చెల్లించనియెడల మధ్యవర్తి చెల్లించవలసియుండును.
“దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తుయేసను నరుడు” (1 తిమోతి 2:5) మరియు “మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాదు. కాని దేవుడొక్కడే” (గలతీ 8:20).
క్రీస్తు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చితినని చెప్పెను (మత్తయి 20:28).
