ఉపోద్ఘాతము
6 యజ్ఞము ఉపోద్దాతము
ఆర్యుల మతానుసారము మానవోనృత్రికి మూడు మార్గ దర్శకములు గలవు. అందొకటి ధర్మసూత్రములు, రెండవది గృహ్య సూత్రములు, మూడవది (శ్రౌత సూత్రములు మనుష్యునకు కావలసిన ధర్మములను తెలియజేయునవి ధర్మసూత్రములనియు, తదానుసారము ననుసరింపదగిన సంస్కార విధులను తెలియజేయునని గృహ్యసూత్రములనియు, యజ్ఞయాగాదులను తెలియజేయు శ్రాత సూత్రములు - పై రెంటి ననుసరించి వేదానుకూలముగా జేయదగినవనియు తెలియునది. శ్రాత సూత్రములలో నొక్కొక్కటి ఒక్కొక్క వేదమునకు ముఖ్యము. యజుర్వేదమునకు కాత్యాయన (శ్రౌతసూత్రము ముఖ్యము. ఇయ్యది వేదాంగములలో నొకటి కల్పసూత్ర, వేద, శాస్త్ర్రానుసారమే ఆర్యులు యశ్వమేధ, నరమేధ, అజామేధాది యజ్ఞములను చేయుచుండిరి.
చత్వారింశతి సంస్కారములు జీవాత్మ పరిశుద్ధతకై ఏర్పడినవి. ఆ నలుబదింటిలో పాకయజ్ఞములు ఏడు, హవిర్యజ్ఞములు ఏడు, సోమ యజ్ఞములు ఏడు, పంచ మహా యజ్ఞములు పోను మిగిలినవి గర్భాదానము, పుంసదనము, సీమంతము, జాతకర్మ, నామకరణము, నిష్క్రమణము, అన్నప్రాసన, చౌలము, ఉపనయనము, ప్రాణాపత్యము, వివాహము, స్పాతకము, వానప్రస్థము, సన్మానము. వీనిలో కొన్ని ప్రతిదినము చేయవలసినవి. కొన్ని ఆయా కాలములలో చేయవలసినవి. పంచయజ్ఞములతో పాటు జెపాసన, అగ్ని హోత్రము అనుదినము చేయవలసినవి. ధర్మపూర్ణమాసమును హవిర్యజ్ఞ పదునైదు రోజులకొకమారు చేయునది, జొపాసన పాకయజ్ఞములో చేరినది. తదితర పాకయజ్ఞములు సంవత్సరములనకొకమారు చేయునవి. సోమ యజ్ఞములు ఏడును; ఇతర సంస్కారములును జన్మలో నొక పర్యాయము చేసిన చాలునందురు.
పరిపాలన పరమేశ్వరుని చిత్తానుసారము మారుచుండునని మనువు చెప్పెను. ప్రమాణములు రెండు. ఒకటి వధాయకతా (ప్రామాణ్యము, రెండు అనుష్టానుకత ప్రామాణ్యము మొదటిది సదా నిలిచియుండును. రెండవది దేశకాల పరిస్థితులను బట్టి మారుచుండును. కావున నేడు భారతీయులలో అనేకులు ఆయా యజ్ఞయాగములందు జంతు బలిచ్చుటకు ఒప్పుకొనరు. అవి యొకప్పుడాచరింపబడినవే. ప్రస్తుతము పంచ మహాయజ్ఞములు మాత్రమే ఆచరింపదగినవందురు.
సత్యవేదమగు బైబిలునందు పాత, క్రొత్త నిబంధనలను రెండు నిబంధనలు గలవు. పాత నిబంధనలో ఆవులను, మేకలను, గొత్జెలను, పొట్టేళ్ళను సమాధానార్థ బలిగను, దహనబలిగను, ప్రాయశ్చితార్థబలిగను యూదులు అర్పించుటను గూర్చి వ్రాయబడినది.
అన్యులు అర్చించు ఆయా బలులు ప్రజాపతి యజ్ఞమునకు సాదృశ్యము లయినటులనే, యూదులర్పించు నానా బలులు యేసుక్రీస్తు చేసిన మహా యజ్ఞము (సిలువునకు ఛాయామాత్రములై యున్నవి. ప్రజాపతి ఆత్మలను రక్షించుటకై తననుతానే యజ్ఞపశువుగా అర్పించుకొనెనని అర్ప్నేయములు సాక్ష్యమిచ్చుచుండ, అందరిని రక్షించుటకొరకే లోకపాపములను మోసికొనిపోవు యేసుక్రీస్తు అను దేవుని గొట్జెపిల్ల బలియాయెనని బైబిలు దృఢపరచుచున్నది. వాస్తవమునకు పురుషమేధ రహస్యమే క్రీస్తు ప్రభువుని సిలువ మరణ పునరుత్థాన రహస్యమని సమన్వయదృష్టితో జూచువారు (గ్రహించగలరు.
లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. అటుపిమ్మట ఐదు వందలకంటె ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయవమందే కనబడెను (1 కొరింథీ 15:3-6). ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తియై యున్నాడు (రోమా 10:4). ప్రాచీనులర్చించు ఆయా యజ్ఞ యాగములు ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులోనే యున్నది. (కొలొస్స 2:17, హెట్రీ 10:1). కాబట్టి ఆర్యులేమి, యూదులేమి, క్రైస్తవులేమి ఆయా పశుపక్షులను ప్రస్తుతము యజ్ఞయాగములలో జంపవలసిన అవసరము లేదు.
కాగా నేడు సర్వలాచరింపవలసిన దశయాగములు మాత్రమే నిలిచి యున్నవి. అవి బైబిలునందును, మనుస్మృతియందును ఉపోదా్వాతము 7 యు
వ్రాయబడినవి. అవేవనగా - 1. విశ్వాసయాగము; (ఫిలిప్పీ 2:17). £. స్తుతి యాగము; (హెబ్రీ 18:15). 8. ఈవుల యాగము (ఫిలిప్పీ 4:18). 4. ఉపకార ధర్మయాగము; (హెబ్రీ 18:16). 5. సజీవయాగము అనగా సమర్పణ; (రోమా 12:2) 6. బ్రహ్మ యజ్ఞము. 7. దేవ యజ్ఞము; రి పితృ యజ్ఞము; 9. మనుష్య యజ్ఞము; 10. భూత యజ్ఞము.
ప్రజాపతియగు క్రీస్తు మానవపాప ప్రాయశ్చితార్థమై చేసిన మహా యజ్ఞమునందు సమస్త యజ్ఞయాగముల యుద్దేశ్యము నెరవేర్చబడినది. మానవులాయజ్ఞమందు విశ్వాసముంచుటద్వారా పాపక్షమాపణ కలిగి ద్విజులై పరిశుద్ధాత్మనుబొంది పరలోక
రాజ్యమునకు చేరుట సత్యవేద సమ్మతము. ద్విజులగువారు అనగా దేవుని బిడ్డలు (యోహాను 8:5). అనుదినమును ఉపరోక్తాదశ యాగములాచరించుచు ఇహపర సుఖములను బొంది లోక కళ్యాణము కొరకు పాటుబడెదరు గాక. తథాస్తు.
“లకేఖనములయందు మీకు నిత్యజీవముగలదని వాటిని పరిశోధించుచున్నారు. అనే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది” అని క్రీస్తు చెప్పెను (యోహాను 5:39).
- రచయిత యతజము ఇం
శు॥ యథాచారీ తధాభవతి సాధుకారీ సాధుర్భవతి పాపకారీ పాపోభవతి పుణ్యః పుణ్యేన కర్మణాభవతి పాపః పాపేనా!
అని బృహదారణ్యకోపనిషత్ 6వ అధ్యాయము 5వ మంత్రమందు గలదు. అనగా, ఎట్లు ఆచరించువాడో అట్టివాడగును. మంచి పనులు చేయువాడు మంచివాడగును. పాపము చేయువాడు పాపియగును. పుణ్యము కలుగు పనులు చేయుటచేత పుణ్యమును, పాపము గలుగు పనులు చేయుటచేత పాపమును కలుగుచున్నది.
పాపమనగానేమి? “ఆజ్ఞాతిక్రమమే పాపము” (యోహాను 8:4); “సకల దుర్చీతియు పాపము” (5:17). పాపము చేయువారు లేరా? ఏ భేదమును లేదు, అందరును పాపముచేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారని సత్యవేదము సాక్ష్యమిచ్చుచున్నది. దేవీభాగవతము, షష్టమ స్కంధము 10వ అధ్యాయంలో
శ్లో। పాపం కరోతి మనుజస్తథా దేవాద యోపిచ తథా నాయరణో రాజన్న రశ్చ ధర్మజావుభౌ ! జాతౌ కృష్ణార్జునే కౌమంశౌ నారాయణస్య సౌ పురాణ పీఠికేయం వై మునిభిః పరికీర్తి తౌ॥
తా॥ ఓ రాజా ! మనుష్యుడు పాపము చేయుచున్నాడు. అట్లే దేవతలును పాపము చేయుచున్నారు. ధర్మని పుత్రులగు నారాయణును, నరుడు అను బుషులును అటులనే పాపము చేసినందున వారు నారాయణుని అంశవలన కృష్ణార్థునులయి పుట్టిరి. ఇది మనుషులచే జెప్పబడిన పురాణ పీరికయందున్చది అని వ్యాసమహర్షి చెప్పెను. మరియు స్కాందపురాణము శ్రీరంగ మహాత్మ్యము 7వ అధ్యాయములో స
శ్లో కామక్రోధవశాస్సర్వే దేవ బుపషిక్ పితృమానమానవా ॥
అనగా సమస్త దేవతలును, పితృ దేవతలును మానవులును కామక్రోధములకు వశులైనవారేయని వ్రాయబడి యున్వది. హేమాద్రి ప్రాయశ్చిత్త కాండములో మహా సంకల్పమునందు (ప్రాయబడిన ప్రకారము -
శో జాగ్రత్స్వప్ప సుషుష్తవస్తాను; జ్ఞానతోజ్ఞాతశ్చ కామతో కామతః, స్వతః పరమేరణయావా సమ్భావితానాం సర్వేషాం పాపానామిమ పనోదనార్ధం ఇష్టదేవతా ప్రీత్యర్ధమ్!॥ “సమస్త మానవులు జాగ్రతావస్థ, స్వప్పావస్థ, సుషుప్యావస్థల యందును - జ్ఞానమువలనగాని, అజ్ఞానమువలన గాని, కోరికచేతగాని, కోరికలేకుండగాని నానావిధములైన పాపములు చేసి వాటిని బాపుకొనుటకై ఇష్ట దేవతలను ప్రార్ధించుచున్నారని తెలియుచున్నది” కావుననే భారతీయుడు ఇట్లు ప్రార్ధించుచున్నాడు.
శ్లో। పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః త్రాహిమాం కృపయాదేవా శరణాగతి వత్సలా ॥ అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ....
అనగా నేను పాపిని పాపము చేయుచున్నాను. పాపాత్ముడను పాపమందు పుట్టితిని; ఓ కృపగల దేవా! నీ శరణుజొచ్చిన నన్ను రక్షింపుము. నాకు వేరే శరణం లేదు; నీవే నాకు శరణాగతి. అదియును గాక, మనుస్మృతి ద్వితీయాధ్యాయములో-
శ్లో ఇంద్రియాణాంచ సర్వేషాంయడ్యే కంక్షరతీంద్రియమ్ తేనాస్యక్షరతి ప్రజ్ఞాద్రుతేః పాదాది ఓదకమ్!!
యజము 9 తా
అనగా తోలుసంచిలోని నీరంతయు ఒక కాలుకట్టు విప్పినంతనే కారిపోయినరీతి, యింద్రియములలో నొక యింద్రియము విషయాసక్తమైన యెడల నన్ని ఇంద్రియముల సంబంధమైన బుద్ధి వ్యవస్థ లేక పాడైపోవును.
అయితే పాపమువలన శిక్షయేది?
“పాపదవశ్యం నరకంప్రయాతి” అను నీతిశాస్త్ర వాక్యానుసారము నరకమే గతి. భగవద్గీతలో - శ్లో! నానాచిత్త విభ్రాంతా మోహజాల సమావృత్తాః ప్రశాక్తా కామభోగేషు పతన్తినరకే అశుచౌ !
నానావిధములైన చిత్త విబ్రాంతులచే మోహమనెడి జాలము (వల) చేత చుట్టబడినవారై, కామ భోగములచేత కూడుకొనిన వారై ఆత్మశుద్ధి లేక నరులు నరకమందు పడుచున్చారని గలదు.
అటులైన నరకము నుండి తప్పించుకొను మార్గము, లేక ఉపాయమేది? “అలౌకికోపాయ బోధకత్వం” వేదత్వం అనగా లోక సామాన్యమునకు తెలియని ఉపాయమును తెలియజేయుట వేద లక్షణము వేదము ప్రభు సంహిత, అదియొక కార్యమును చేయుమని శాసించునేగాని ఎందుకు చేయవలెను? అని ప్రశ్నించిన ప్రత్యుత్తరమివ్వదు. అయినను మనము వేడోక్తులను పాటించియే తీరవలెను. “నాన్యః పంథా విద్యతే ఆయనాయ” వేరొక మార్గము లేదు; ఇదియే మార్గము.
పాపక్షమాపణ పొందినయెడల నరకముండదు. అయితే పాప పరిహారమెట్లు గలుగును? కూర్మ పురాణములో - శ్లో। అకృత్వా విహితం కర్మకృత్వా నిన్దితా మేవవా॥ దోషమాప్పోతి పురుషః ప్రాయశ్చిత్తమ్ వినిశోధనమ్!॥
అనగా పురుషుడు అనుకూలించిన కర్మను చేయకను, దూషించదగిన దానిని జేసియును పాపము బొందుచున్నాడు. ప్రాయశ్చిత్తము శుద్ధిని గలుగచేయునది. ప్రాయశ్చిత్తమన చిత్తశుద్ధి చేసిన తప్పునకు శిక్ష లేనిదే చిత్తశుద్ధి ఎట్లు కలుగును? కావున యజమానుడు తానే బలిగా నిడుగొనుట ప్రథమ ధర్మము, లేదా అతనికి బదులుగ పశు, నరులలో నొకరిని బలిగా నిచ్చిన యెడల అతనికి మోక్షమునిచ్చుననియు, సర్వ పాపములను హరించి సర్వ సుఖములనిచ్చి విముక్తి నొసంగునను యాగమ విధులన్నియు ఆర్యులు నమ్మిరి. సామవేద తాందీయ మహా (బ్రాహ్మణములో గా
శ్లో సర్వపాప పరిహారో రక్తప్రోక్షణ మవశ్యకమ్
తద్రక్తం పరమాత్మేస పుణ్యదాన బలియాగమ్!!
అనగా సర్వపాప పరిహారార్థము రక్త'ప్రోక్షణమవసరమై యున్నది. ఆ రక్తము పరమాత్ముని కొరకు పుణ్యమైన దానమును బలియును యాగమై యున్నది. మరియు “అపరం వ్యవస్థానుసారేణ రుధిరపాతం వినా పాప విమోచనం నభవిచితి” అనగా ధర్మశాస్త్ర ప్రకారము రక్తము చిందింపకుండ పాపవిమోచన కలుగదని సత్య వేదోక్తి. ఆర్యుల ధర్మశాస్త్రమగు “మనుస్మృతి” పంచమాధ్యాయములో స్వయంభువు పశువులను యజ్ఞార్థము సృజించి నాడు కావున యజ్ఞములలో వానిని చంపుట దోషము కాదు. అవి యాగముల కొరకు చావునొంది తిరుగ జాత్యుత్మ్కర్హము నొందుచుండును. ఇట్టి పట్టుదలతో వేదతత్వార్థవేత్తయగు (బ్రాహ్మణుడు (యజ్ఞము చేయునపుడు) పశువులను జంపుచు నా పశువులను తన్ను యుత్తమగతిని బొందించునని గలదు. అయితే జంతుబలులిచ్చుట హింసకాదా? యని ప్రశ్నించినయెడల “సహింస్యాత్సర్వా భూతాని” యని వేదమే చెప్పుచున్నది. కనుక యజ్ఞ యాగములలో చేయబడు హింస, హింసగా పరిగణించబడదని ప్రాచీన సిద్ధాంతము. “అధర్వ”మని యాగమునకు నొక పదము తరచుగా వేదమునందు ప్రయోగింపబడెను. దాని యర్థము భాష్యకర్తలు అధర్వమన హింసలేనిదని ట్రాసిరి. ఒకప్పుడు విషమమృతమయినట్లు హింసయు ఉపకారము కావచ్చును. పశు హింసవలన లోకమునకు ఏమి క్షేమము గలదో! లోక సామాన్యమునకు తెలియని యుపాయములను తెలియజేయుటేగదా వేద లక్షణము ! పూర్వము మాంసాహారమే దేవతాప్రీతి యని విధించి ఆర్యులు ప్రాసిరి. అంచేత - చంపవలెను, అని సర్వత్రా భాష్యములలో నర్థము కలదు. పురుషసూక్తములో “దేవాయజ్ఞ మతన్వత” అనగా దేవతలు యజ్ఞము చేసిరని కలదు (ఆంధ్ర వేదములను రచించిన శ్రీ బంకుపల్లె మల్లయ్యశాస్తిగారు).
యజ్ఞకర్మకు (52011069) అగమవిధియని మరియొక నామము. ఈ యజ్ఞకర్మ మార్యులకు (బ్రాముఖ్యమైనది. ఆర్యుల మతము, జీవనము సర్వము దీనిపై నాధారపడినవి.
