దేవుని సన్నిధిలో గొప్ప ధైర్యం
దేవుని సన్నిధిలో గొప్ప ధైర్యం
10వ అధ్యాయంలో, పాత నిబంధన అర్పణలు ఆచారములచేత, సంప్రదాయములచేత, కర్మకాండలచేత ఇశ్రాయేలీయులను పరిపూర్ణులుగా చేయలేకపోయాయని మనం మళ్ళీ గుర్తుచేయబడుతున్నాము. సిలువపై యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన బలి మాత్రమే ఎవరినైనా పరిశుద్ధులుగా చేస్తుంది.
ఆయన బలి యొక్క మరో గొప్ప ఆశీర్వాదం, ఆయన అమూల్యమైన రక్తం యొక్క సామర్థ్యం మూలంగా అతిపరిశుద్ధస్థలములోనికి ప్రవేశించు ధైర్యం, “కావున సహోదరులారా, యేసు రక్తమువలన అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించుటకు, తెరద్వారా, అనగా తన శరీరమను మార్గము ద్వారా, ఆయన మనకొరకు ప్రతిష్ఠించిన నూతనమైన జీవముగల మార్గము ద్వారా మనకు ధైర్యము కలిగియున్నందున, మరియు దేవుని మందిరముపైన ఒక గొప్ప యాజకుడు మనకు ఉన్నందున, మనము చేరుదము...” (19-22 వచనములు). ఆయన రక్తం యొక్క శక్తిచేత మనం ఏ అవసరమునకైనా ఎప్పుడైనా అతిపరిశుద్ధస్థలములోనికి వెళ్ళగలము. ఆయన ప్రధానయాజక పరిచర్యను మనం ఎంత ఎక్కువగా వినియోగించుకుంటే, ఆయన సన్నిధిలో అంత ఎక్కువగా ధైర్యాన్ని అనుభవిస్తాము (21వ వచనం). ఆయన బలిచేత, ఆయన మధ్య అడ్డుగోడను పడగొట్టాడు. ఈ ధైర్యాన్ని అనుభవించుటలో మనం విఫలమైనప్పుడల్లా, మన హృదయాలను పరిశోధించి, మన వైఫల్యములను ఒప్పుకొని, ఆయన అమూల్యమైన రక్తంలో మనలను మనం శుద్ధీకరించుకోవాలి. అప్పుడు మనం ఆయన సన్నిధిలో గొప్ప ధైర్యాన్ని మళ్ళీ అనుభవిస్తాము. అధ్యాయం XI గొప్ప విశ్వాసం గల మనుష్యులు
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
