పరిచయం
నేను మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మంచి విద్యాభ్యాసం చేసి అమెరికాలో ఉన్నత స్థాయిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వివిధ సంస్థలలో వ్యాపారాలు చేస్తూ మంచి భార్య బిడ్డలతో జీవించే సమయంలో డాక్టర్లు పరీక్ష చేసి 3వ స్టేజి కాన్సర్ అన్నారు. బైబిల్‌లో లోకమంతా సంపాదించి నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకేమి లాభం అనే విషయం తెలుసుకొని క్రీస్తును ఆశ్రయించాను. అద్భుతంగా స్వస్థత పొంది క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను.
బ్రదర్ యం.జె. మనోజ్ మత్తయి గారు, వర్జీనియా, యుఎస్ఎ.
ఆయనే నా రక్షణ దుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే నేను కదిలింపబడను. కీర్తన 62:6
ప్రభువు పరిశుద్ధ నామములో మీకు శుభము కలుగును గాక. నేను నా సాక్ష్యం వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా పేరు యం.జె. మనోజ్ మత్తయి. నా వివరాలు తెలియచేయగలను. మేము వాషింగ్టన్ డి.సిలో మెట్రో ప్రాంతంలో నివసిస్తున్నాము. ఫెడరల్ గవర్నమెంటులో సాఫ్ట్‌వేర్ వ్యాపార రంగంలో ఉన్నాము. వేరువేరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పని చేస్తున్నాము. నాకు ఇద్దరు కుమార్తెలు, వారికి వివాహమైయింది. నా భార్య బిడ్డలతో కలిసి ఉన్నాను. కుమార్తెలు విద్యావంతులు, అల్లుళ్లతో కలిసి ఉద్యోగాలు చేసుకుంటూ వారి పిల్లలతో కలిసి సుఖంగా జీవిస్తున్నారు. మాకు 6 మంది మనుమలు మనుమరాండ్రు కలరు.
2023 సంవత్సరంలో నా జీవితంలో సంభవించిన పరిస్థితి ద్వారా నా స్వీయ అనుభవం ఆరంభమయింది. మేము దీవించబడిన రీతిని బట్టి రెండు గృహములను పొందాము. ఫిబ్రవరి 11వ తేదిన గృహ ప్రవేశం కూడిక జరిగింది. నా తండ్రి ఆశీర్వాదం కోరి ఇండియా నుండి మా తండ్రిగారు రావాలని ప్లాన్ చేసాము.