ఈ పుస్తకములో వెతకండి
1 నా జీవితములో నేను ఎదుర్కొనిన సమస్త శోధనలలో దేవుని ఉనికిని ఆయన సువార్త సత్యమును సంశయించుట అతి చెడ్డది, భరింపగలవాటిలో అతి చెడ్డది; ఈ శోధన వచ్చినప్పుడు అది నా నడికట్టును నాకు తీసివేయును, నా క్రిందనుండి పునాదిని తొలగించును: ఆహా! సత్యముతో మీ నడుము కట్టుకొనుడి అను వాక్యమును, పునాదులు పాడైపోయినయెడల నీతిమంతుడు ఏమి చేయగలడు అనుదానిని తరచుగా తలంచితిని.
2 కొన్నిసార్లు పాపము చేసిన తరువాత దేవుని చేతినుండి తీవ్రమైన శిక్ష కనిపెట్టినప్పుడు, ఆయననుండి నాకు వెంటనే వచ్చినది ఆయన కృప వెల్లడియే. కొన్నిసార్లు ఓదార్పు పొందినప్పుడు బాధక్రింద అట్లు మునుగుటకు నన్ను మూఢునిగా పిలిచితిని. మరల క్రుంగినప్పుడు అట్టి ఓదార్పునకు దారి ఇయ్యుట జ్ఞానము కాదని తలంచితిని; ఈ రెండును అట్టి బలముతోను భారముతోను నాపై ఉండెను.
3 ఒక సంగతిని గూర్చి మిక్కిలి ఆశ్చర్యపడితిని, దేవుడు తనను గూర్చిన అతి ధన్య వెల్లడితో నా ఆత్మను సందర్శించినను, తరువాత అట్టి ఘడియలు నన్ను వెంబడించెను గనుక నా ఆత్మలో అంత చీకటి నిండెను, నేను తాజాపరచబడిన ఆ దేవుడు ఆ ఓదార్పు ఏమో ఒక్కసారైనను గ్రహింపలేకపోతిని.
4 కొన్నిసార్లు బైబిలు ఒక పంక్తిలో నేను నిలువలేనంత ఎక్కువ చూచితిని; మరొకసారి బైబిలు అంతయు నాకు కఱ్ఱవలె ఎండిపోయినట్లు ఉండెను; లేక నా హృదయము దానికి అంత మృతముగాను ఎండినట్లుగాను ఉండెను గనుక దానినంతటిని చూచినను తాజాదనము గ్రహింపలేకపోతిని.
5 సమస్త భయములలో క్రీస్తు రక్తమువలన చేయబడినవి ఉత్తమము; సమస్త ఆనందములో క్రీస్తుపై దుఃఖముతో కలిసినది అతి మధురము: ఆహా! దేవుని సన్నిధిని క్రీస్తును మా బాహువులలో పట్టుకొని మోకాళ్లూని ఉండుట మనోహరము: ఈ సంగతులలో కొంత నాకు తెలియునని నిరీక్షించుచున్నాను.
6 ఈ దినమువరకు నా హృదయములో ఏడు అసహ్యములు కనుగొంటిని: 1. అవిశ్వాసమువైపు మొగ్గుట; 2. క్రీస్తు వెల్లడించు ప్రేమను కనికరమును అకస్మాత్తుగా మరచిపోవుట; 3. ధర్మశాస్త్ర క్రియలవైపు ఆనుకొనుట; 4. ప్రార్థనలో తిరుగుడులును చల్లదనమును; 5. నేను ప్రార్థించినదాని కొరకు కావలి కాయుట మరచిపోవుట; 6. నాకు ఇంకను లేనందున సణుగుటకు సిద్ధము, అయినను నాకున్నదానిని దుర్వినియోగము చేయుటకు సిద్ధము; 7. దేవుడు నాకు ఆజ్ఞాపించు వాటిలో ఏదియు నేను చేయలేను, నా భ్రష్టతలు తమను తాము లోపలికి నెట్టుకొనును. నేను మేలు చేయగోరినప్పుడు కీడు నాతో ఉన్నది.
7 ఈ సంగతులను నిరంతరము చూచి అనుభవించి వాటివలన బాధపడి అణచబడుచున్నాను, అయినను దేవుని జ్ఞానము వాటిని నా మేలుకై క్రమపరచును; 1. అవి నన్ను నేను అసహ్యించుకొనజేయును; 2. నా హృదయమును నమ్మకుండ నన్ను కాపాడును; 3. అంతర్గత నీతి అంతటి అసమర్థతను నాకు నమ్మింపును; 4. యేసునొద్దకు పారిపోవుట అవసరమని చూపును; 5. దేవుని ప్రార్థించుటకు నన్ను నొక్కును; 6. కావలి కాయుటయు మితముగా ఉండుటయు నాకు అవసరమని చూపును; 7. ఈ లోకముగుండా నన్ను సహాయపడి మోయుమని క్రీస్తు ద్వారా దేవుని ప్రార్థించుటకు నన్ను రేపును.
