కృప ద్వారా – స్వాతంత్ర్యం మరియు విశ్రాంతి
"కాబట్టి ఆయన విశ్రాంతిలో ప్రవేశించుటకు వాగ్దానము మనకున్నప్పుడు, మీలో ఎవడైనను దానికి వెనుకబడిన వానివలె కనబడకుండునట్లు భయపడుదము.
ఏలయనగా వారికిస్వలె మనకును సువార్త ప్రకటింపబడెను గాని వినినవారికి విశ్వాసముతో దానిని పొందుపరచనందున ఆ వాక్యము వారికి ప్రయోజనము కలుగజేయలేదు. విశ్వసించిన మనమైతే ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము; అందునుగూర్చి ఆయన సెలవిచ్చినదేమనగా, నా కోపమువలన నేను ప్రమాణము చేసినట్టు, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపనే ప్రవేశింపరని చెప్పెను; అయితే జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన కార్యములు సమాప్తములైయుండెను. ఏలయనగా ఆయన ఏడవదినమునుగూర్చి యొక చోట, దేవుడు తన కార్యములన్నిటి నుండి ఏడవదినమున విశ్రమించెనని చెప్పియున్నాడు. మరియు ఈ చోటను, వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పబడియున్నది. కాబట్టి కొందరు దానిలో ప్రవేశింపవలసియున్నదని, మొదట సువార్త వినినవారు అవిశ్వాసమువలన ప్రవేశింపలేదని కనబడుచున్నది" (Heb. 4: 1-6).
"విశ్రాంతి" మన ప్రభువు మనకిచ్చే ఆ సంపూర్ణ శాంతిని సూచిస్తుంది. దాస్యం శాంతిని తీసివేస్తుంది. దేవుడు ఏడవదినాన సంపూర్ణ శాంతితో విశ్రమించాడు, మనం ఆ శాంతిలోకి ప్రవేశిస్తాము. మన ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి 11:28లో చెబుతాడు, "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును." నీతిమంతులు కావడానికి మనం ఏమీ చేయనవసరం లేదు, ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం మన దహనబలిగా, సమాధానబలిగా, నైవేద్యముగా, అపరాధబలిగా చనిపోయాడని మనం హృదయపూర్వకంగా విశ్వసిస్తే చాలు, అలా మనం నీతిమంతులం అవుతాము. ఆయన మన బలి, సున్నతి, సబ్బాతు అయ్యాడు, ఇప్పుడు మనం స్వతంత్రులం.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
