సూత్రాలు 73–95
73. ఈ పాపపరిహార పత్రికల జోరును ఆపటానికి నేర్పుగా ఉపాయాలుపన్నే వాళ్ళమీద సహజంగా పోపు ఎంతమండి పడతాడో..
74. అంతకంటే ఎక్కువగా పాపపరిహార పత్రికల్ని సాకుగా పెట్టి ప శుద్ధప్రేమను, సత్యాన్ని అడ్డగించే వాళ్ళమీద పోపు మండిపడతాడు.
75. దేవమాతను చెరపడంలాంటి అసాధ్యమైన పాపం చేసినవాడ్ని సైతం క్షమించేంత గొప్పవి ఈ పాపపరిహార పత్రికలు అని అనుకోటం వెర్రితనం.
76. దానికి బదులుగా మెమేం చెపుతున్నామంటే - అపరాధానికి సంబంధించి క్షమించదగిన అతిచిన్న పాపాన్ని సైతం పాపపరిహార పత్రికలు తీసెయ్యలేవు.
77. పరిశుద్ధుడైన పేతురు ఇప్పుడు పోపుగా ఉన్నాసరే ఇంతకుమించిన మహాక్రుపలేవీ ఇవ్వలేడని చెప్పటం పరిశుద్ధుడైన పేతురుకి, పోపుకు వ్యతిరేకంగా చేసే దైవనింద.
78. దానికి బదులుగా మళ్ళీ మేమేం చెపుతున్నామంటే - ఇప్పుడున్న పోపు మాత్రమే కాకుండా ఇంకా ఏ పోపైనా సరే మొదటి కొరింథీ పత్రిక పన్నెండో అద్యాయంలో చెప్పబడ్డ సువార్త, ఆత్మశక్తులు, స్వస్తతా వరంలాంటివి కలిగుంటే పాపపరిహార పత్రికలిచ్చే వాటికంటే మరిన్ని క్రుపల్ని వాళ్ళివ్వ గలరు.
79. పాపపరిహార పత్రికల్ని శ్రుంగారించటానికి వాటినమ్మే బోధకులు ఆపత్రికలమీద వేసిన పోపు ముద్రలోఉన్న శిలువగుర్తుకు, క్రీస్తు శిలువతో సమానమైన శక్తి ఉందని చెప్పటం దేవుడ్ని నిందించటమే అవుతుంది.
80. ఇలాంటి తప్పుడు బోధలు ప్రజల్లో వ్యాపిస్తుంటే చూస్తూ వూరుకొనే బిషప్పులు, చిన్న పాదుర్లు, వేదాంతులు దేవుడికి లెక్క అప్పచెప్పాల్సినవాళ్ళె ఉన్నారు.
81. పాపపరిహార పత్రికల గురించి అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ఈ ప్రచారంవల్ల తనమీదపడే అభాండాలకారణంగాను, సంఘస్తులు యుక్తిగావేసే ప్రశ్నల కారణంగాను పోపు పోగొ ట్టుకుంటున్న గౌరవాన్ని కాపాడటం జ్ఞానవంతులకు సైతం కష్టసాధ్యమైన పని.
82. వరసగా చెప్పాలంటే:- గుడికట్టటానికి దిక్కుమాలిన డబ్బు సంపాదించటంకోసమని పర్ల్గెటరీలొంచి ఆత్మల్ని విడిపించటానికి బదులుగా పరిశుద్ధమైన ప్రేమనుబట్టి, ఆత్మలకున్న అఘోరమైన అక్కరనుబట్టి పోపు ఎందుకు పర్లెటరీని ఖాళీ చెయ్యకూడదు? మొదటిదేమో తుచ్చమైంది, రెండోదేమో సమంజసమైంది.
83. విడుదల పొందిన ఆత్మలకోసం ప్రార్ధన చెయ్యటం తప్పుకదా, అలాంటప్పుడు చచ్చిపోయినవాళ్ళ కోసం సంస్మరణ ఆరాధనలు, సాంవత్సరిక ఆరాధనలు ఇంకా జరిగించటం ఎందుకు? వాళ్ళ పేరుతో దానధర్మాలు చెయ్యటానికి ఏర్పాటుచేసిన జ్ఞాపకార్థ నిధుల్ని తిరిగి ఇచ్చెయ్యటంగాని, లేదా వాళ్ళ బంధువులు ఆడబ్బును వాపసు తీసుకోటానిగ్గాని ఎందుకు అనుమతించరు?
84. ఇంకా:- దేవుడికిష్టమైన భక్తుడి ఆత్మని ఆ ఆత్మకున్న స్వంత అవసరాన్నిబట్టి, శుద్ధమైన ప్రేమతో విడిపించటానికి బదులుగా, అవిశ్వాసి, విరోధి అయిన ఓ వ్యక్తి డబ్బిచ్చి ఆ ఆత్మను పర్లెటరీలోంచి విడిపించేందుకు అనుమతించటంలో దేవుడికి, పోపుకు ఉన్న ఈ సరికొత్త భక్తి సూత్రం ఏంటి?
85. ఇంకా: - నిజానికి పశ్చాత్తాపానికి సంబంధించిన సంఘ శాసనాలు చాలాకాలంగా వాడుకలోలేనందున కొట్టివేయబడి మ్రుతమైన స్థితిలోఉన్నప్పుడు, అవింకా బ్రతికేఉన్నట్టు, వాటికింకా సత్తాఉన్నట్టు పాపపరిహార పత్రికలిచ్చి ఇప్పుడు త్రుప్తిపరచటమెందుకు?
86. పేద విశ్వాసుల డబ్బుతో కాక ఒకప్పటి మహాధనవంతుల సంపదకు మించిన ఆస్థిపాస్తుల్ని కలిగున్న పోపు, తన స్వంత డబ్బుతో పరిశుద్ధ పేతురు దేవాలయాన్ని ఎందుకు కట్టకూడదు?
87. ఇంకా:- తమ పూర్ణ పశ్చాత్తాపాన్నిబట్టి సర్వపాపక్షమాపణ పొందటానికి, పరలోకభాగ్యాన్ని అనుభవించటానికి అర్హతపొందిన వాళ్ళకి, మళ్ళీ పోపు అదనంగా కొట్టేసేది, అనుగ్రహించేది ఏముంటుంది?
88. ఇప్పుడు రోజుకు ఒక్కసారిచేస్తున్న పోపు ఇకపై రోజుకు వందసార్లుచేసి ప్రతీ విశ్వాసికి పాపక్షమాపజ్ణి, పరలోకభాగ్యాన్ని దయచేయటానికంటే గొప్పదైన ఏ దీవెన సంఘానికొస్తుంది?
89. తన పాపక్షమాపణ పత్రాలద్వారా డబ్బు సంపాదించాలనికాక ఆత్మల్ని రక్షించాలని పోపు అనుకుంటున్నప్పుడు వీటితో సమానమైన శక్తికలిగినవైన, తానిదివరలో మంజూరుచేసిన పాపక్షమాపణల్ని ఎందుకు రద్దుచెయ్యాలి?
90. సంఘస్తులు లేవదీసిన ఈ వివాదాల్ని, సందేహాల్ని తీర్చడానికి తగినకారణాలు చూపించకుండా బలవంతంగా అణచివెయ్యాలనుకుంటే సంఘాన్ని పోపును వాళ్ళ శత్రువులు గేలిచేసేలా చేసి క్రైస్తవుల్ని దుఃఖపరిచినట్లవుతుంది.
91. కాబట్టి పాపక్షమాపణ పత్రికలు పోపు అభిప్రాయాలకు అనుగుణంగా బోధించబడ్డప్పుడు ఈ అనుమానాలన్నీ వెంటనే తొలిగిపోతాయి, సమసిపోతాయి.
92. కనుక శాంతిలేనప్పుడు శాంతి శాంతి అని చెప్పే ప్రవక్తలందరూ వెళ్ళిపోవాలి.
93. సిలువ లేనప్పుడు క్రీస్తు ప్రజలకు సిలువ సిలువ అని చెప్పే ప్రవక్తలు ధన్యులు.
94. శిక్షావిధుల ద్వారా, మరణం ద్వారా, నరకం ద్వారా తమ శిరస్సైన క్రీస్తును వెంబడించటంలో మెళకువకలిగి ఉండేలా క్రైస్తవులకు బోధించబడాలి.
95. ఆ విధంగా శాంతి సమాధానం యొక్క అభయాన్నిబట్టికాక అనేక శ్రమలద్వారా పరలోకరాజ్యంలో ప్రవేశిస్తామన్న ద్రుఢనిశ్చయాన్ని కలిగుండాలి.
సంబంధించిన శిక్షావిధులకు చెందినవి.
