సూత్రాలు 1–24
1. మన ప్రభువు బోధకుడైన యేసు క్రీస్తు మారు మనస్సు పొందండి“ అని అనటంలో, విశ్వాసుల యావజ్జీవితం పశ్చాత్తాపంతో కూడిందై ఉండాలన్నది ఆయన ఉద్దేశ్యం.
2. ఇది మత గురువులచేత ఆచరించబడే పాపాల్ని ఒప్పుకోవడం, త్రుప్తి పొందటం లాంటి సంస్కార సంబంధమైన పశ్చాత్తాపం వంటిదని అనుకోకూడదు.
3. ఇంకా దీన్ని అంతరంగంలో కలిగే పశ్చాత్తపమని కూడా అనుకోకూడదు. ఎందుకంటే శరీరాన్ని శుష్కింప చేసుకోడం లాంటి బాహ్య చర్యలద్వారా వ్యక్తపరచబడనప్పుడు అది అంతరంగ పశ్చాత్తాపమని అనబడదు.
4. కాబట్టి ఈపాపశిక్షావిధి మనల్ని మనం త్యజించుకుంటున్నంతవరకూ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇదే నిజమైన అంతర్గత పశ్చాత్తాపం కనుక అది మనం పరలోకంలోకి ప్రవేశించేంతవరకూ కొనసాగుతుంది.
5. సంఘ శాసనాల ద్వారా, తనకున్న అధికారం ద్వారా విధించే శిక్షల్ని తప్ప మిగిలిన వాటిని తగ్గించటానిక్కాని, తగ్గించాలనుకోటానిక్కాని పోపుకు వీల్లేదు.
6. దేవుడు కొ టైయ్యాలనుకొ ంటున్న శిక్షల్ని అవి దేవుడిచేత కొ టైయ్యబడ్డాయని ప్రకటించడంతప్ప మరెలాంటి శిక్షనీ పోపు తగ్గించలేడు. ఇంకాచెప్పాలంటే తన తీర్పుకు లోబడిన శిక్షల్ని మాత్రం అతడు కొట్టెయ్యొచ్చు. అయితే శిక్షల్ని తగ్గించటానికి తనకున్న అధికారాన్ని అశ్రద్ధచేసి వాటిని కొట్టెయ్యకపోయినా అవతలివాడిలో పాపం అలాగే నిలిచుంటుంది.
7. తనకు బదులుగాఉన్న సంఘ గురువుకు అన్ని విషయాల్లో విధేయుడ్ని చెయ్యకుండా దేవుడెవరి శిక్షనూ కొట్టెయ్యడు.
8. పశ్చాత్తాపానికి సంబంధించిన సంఘశాసనాలు బ్రతికున్నవాళ్ళకు విధించటానికేతప్ప, చచ్చిపోయినవాళ్ళకు విధించటానికి వీల్లేదని ఆ శాసనాలే చెపుతున్నాయి.
9. అందుకనే పోపు తానిచ్చే తీర్పుల్లో మరణానికి సంబంధించిన విధివిధానాల విషయంలో ఎప్పుడూ మినహాయింపులు ఇచ్చేలా పరిశుద్ధాత్ముడు మన పట్ల దయచూపిస్తున్నాడు.
10. సంఘ శాసనాలప్రకారం మరణ సమయంలో పాటించాల్సిన పశ్చాత్తప విధులు పర్లెటరీలో చెయ్యటానికి అట్టిపెట్టుకోనిచ్చే సంఘ గురువుల పనులు బుద్ధిలేనివి, దుర్మార్గమైనవి.
11. సంఘ శాసనాలకు సంబంధించిన శిక్షావిధి పర్గెటరీకి సంబంధించిన శిక్షావిధిగా మార్చబడటమన్న ది, బిషప్పులు తాము చెయ్యాల్సిన పనులుమాని నిద్రపోతున్నప్పుడు సంఘంలో విత్తబడ్డ ఓ కలుపుమొక్క లాంటిది.
12. గతంలో సంఘశాసనాలకు సంబంధించిన శిక్షా విధులు నిజమైన పశ్చాత్తాపాన్ని పరీక్షించటంకోసం పాపక్షమాపణకు ముందే విధించబడేయిగాని తర్వాతకాదు.
13. చనిపోతున్నవాళ్ళు తమ మరణాన్నిబట్టి అన్ని శిక్షావిధులనుండి విడుదల పొందుతారు. సంఘ శాసన విధుల విషయంలో సైతం వాళ్ళు మ్రుతులేకాబట్టి వాటినుండికూడా విడుదలపొందే హక్కు వాళ్ళకుంటుంది.
14. తమలోని ఆత్మీయ అనారోగ్యం, ఇంకోమాటలో చెప్పాలంటే అరకొరగాఉన్న ప్రేమ చనిపోతున్నవారిలో మరింతగా భయాన్ని కలిగిస్తోంది. ప్రేమ తక్కువయ్యేకొద్దీ వాళ్ళలో భయం ఎక్కువౌతుంది.
15. ఈ భయమూ భీతీ మహా నిరాశకు చేరువగా ఉంటాయి కాబట్టి పర్లెటరీలోని శిక్షావిధులన్నిటికీ ఇవే సరిపోతాయి.
16. నిరాశ - నిరాశ పడటం - రక్షణ అభయం అన్నవి ఎలా వేరు వేరు అంశాలో అలాగే నరకం - పర్లెటరీ - పరలోకం కూడా వేరు వేరు విషయాలే.
17. పర్లెటరీలోని ఆత్మల్లో భయం తగ్గి ప్రేమ పెరగటం అవసరమేమో అనిపిస్తుంది.
18. ప్రేమలో ఎదిగి మంచి కార్యాలు చెయ్యగల స్తితిలో వాళ్ళు లేరు అని అంటానికి లేఖనపరమైన రుజువులేవీ లేవు.
19. అలాగని తమ రక్షణ స్థితికి సంబంధించిన అభయాన్ని వాళ్ళు రూఢిగా కలిగిఉన్నారని చెప్పటానిక్కూడా వీల్లేదు.
20. కాబట్టి "అన్ని శిక్షావిధుల్నీ పూర్తిగా కొట్టెయ్యడం” అనే విషయం “అన్నిటికీ” కాకుండా "తనచేత విధించబడిన వాటికి మాత్రమే” వర్తిస్తుందని పోపు భావిస్తున్నాడు.
21. కాబట్టి పోపు ఇచ్చే పాప పరిహార పత్రికల ద్వారా ఒక వ్యక్తి అన్ని శిక్షావిధుల్నుండి విడిపించబడి రక్షించబడతాడని చెప్పే పాపపరిహార పత్రికల బోధకులందరూ అబద్ధికులే.
22. బ్రతికున్నప్పుడు పొందాల్సిన శిక్షావిధులేవైనా ఇంకా మిగిలిపోయిఉంటే, వాటిల్లో ఏఒక్కదాన్నీ పర్లెటరీలోని ఆత్మల విషయంలో కొట్టెయ్యడానికి సంఘశాసనాల ప్రకారం పోపుకు వీల్లేదు.
23. ఒకవేళ అన్ని శిక్షావిధులూ కొ టైయ్యబడటమంటూ జరిగితే అది కేవలం సర్వ సంపూర్ణులైన వాళ్ళ పట్ల మాత్రమే జరుగుతుంది. అయితే అలాంటి వాళ్ళు ఏకొద్దిమందో ఉంటారు.
24. కాబట్టి ప్రాయశ్చిత్తానికి సంబంధించిన అన్ని శిక్షావిధుల్నుండి విడుదల పొందుతారంటూ చెప్పే వాగాడంబరమైన, అవివేక వాగ్ధానాలవల్ల చాలామంది మోసపోతున్నారు.
