Part 3 of 5

సూత్రాలు 25–48

సూత్రాలు 25–48

25. మొత్తానికి పోపుకు పర్ల్గెటరీమీదున్న అధికారాన్ని గురించి చెప్పాలంటే, అది ప్రతీ బిషప్పుకూ తన సినడ్‌ మీద, ప్రతీ పాస్టరుకు తన పారిష్‌ మీద ఉన్న అధికారం లాంటిదేనని చెప్పొచ్చు.

26. పోపు పర్లెటరీలోని ఆత్మలకు పాపక్షమాపణ ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని తనకున్న తాళపుచెవుల అధికారాన్ని బట్టికాక దేవునికి విజ్ఞాపనలు చెయ్యటం ద్వారా ఇస్తే మంచిది.

27. చందా పెట్టెలో డబ్బులు గలగలమనగానే పర్లెటరీలోంచి ఆత్మ రయ్యిమంటూ ఎగిరిపోతుంది అని చెప్పే బోధ మానవ కల్పితమైంది.

28. చందాపెట్టెలో డబ్బులు గలగల లాడటంవల్ల లాభమూ లోభీతనమూ రెండూ పెరుగుతాయి. అయితే సంఘం యొక్‌క విజ్ఞాపనల ఫలితం మాత్రం దేవుని శక్తికి మాత్రమే లోబడి ఉంటుంది.

29. పరిశుద్ధులైన సెవేరినస్‌ పాస్కల్‌ కు సంబంధించిన ఇతిహాసంలో చెప్పబడ్డట్టుగా పర్గెటరీలోని ఆత్మలన్నీ విడిపించబడటానికి ఇష్టపడుతున్నట్టు ఎవరికి తెలుసు?

30. తన పశ్చాత్తాపం మనః పూర్వకమైందనిగాని, తన పాపాలు సంపూర్ణంగా క్షమించబడ్డాయని గాని ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు.

31. యదార్ధంగా పశ్చాత్తాపపడేవాళ్ళు ఎంత అరుదుగా ఉంటారో అలాగే పాపక్షమాపణా పత్రాలు నిజంగా పాపాల్ని పరిహరిస్తాయని నమ్మి వాటిని కొనేవాళ్ళు కూడా అంతే అరుదుగా ఉంటారు.

32. పాపక్షమాపణాపత్రాలు తమదగ్గరున్నందున తమకు రక్షణ కలుగుతుందని నమ్మేవాళ్ళూ, అలా బోధించేవాళ్ళూ నిత్య నాశనం పొందుతారు.

33. పోపు ఇచ్చే పాపక్షమాపణ దేవునితో మానవుడ్ని సమాధానపర్చే ఓ అమూల్యమైన వరమని బోధించేవాళ్ళ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

34. ఎందుకంటే ఈ "క్షమాపణా క్రుపలు” కేవలం మనుషులు నియమించిన సంస్కార సంత్రుప్తికి

35. డబ్బులిచ్చి ఆత్మల్ని పర్లెటరీలోంచి విడిపించాలనుకుంటున్నవాళ్ళు లేదా పాపపుటోప్పుకోలు పత్రికలు కొన్నవాళ్ళు ఇక ఏమాత్రం పశ్చాత్తాపపడనవసరం లేదని చెప్పేవాళ్ళు క్రైస్తవ సిద్ధాంతాన్ని బోధించటం లేదు.

36. పాపక్షమాపణ పత్రికలతో నిమిత్తం లేకుండానే అన్ని శిక్షావిధుల్నుండి, అపరాధం నుండి విడుదలపొందే హక్కు నిజ పశ్చాత్తాపం చెందే ప్రతీ క్రైస్తవుడికీ ఉంటుంది.

37. పాపక్షమాపణ పత్రాలతో నిమిత్తం లేకుండా నిజమైన ప్రతి క్రైస్తవుడూ - సజీవుడైనా - మ్రుతుడైనా - దేవుడనుగ్రహించిన క్రీస్తు యొక్క, సంఘం యొక్క సకలాశీర్వాదాలలో పాలిభాగస్తుడై ఉంటాడు.

38. అలాగని పోపు ఇచ్చే పాపక్షమాపణ, ఆశీర్వాదాలను ఎంతమాత్రం తక్కువైనవిగా ఎంచకూడదు. ఏందుకంటే నేను ఇదివరకే చెప్పినట్టు అవి దేవుడిచ్చే పాప క్షమాపణల యొక్క ప్రకటనలై ఉన్నాయి.

39. నిజ పశ్చత్తాపం యొక్క అవసరాన్ని గురించి, సమ్రుద్ధిగా దొరికే పాప క్షమాపణల్ని గురించి ఒకేసారి ప్రజలకు విడమర్చి చెప్పటమన్నది పండితులకు సైతం కస్టసాధ్యమైన పని.

40. నిజమైన పశ్చాత్తాపం శిక్షావిధుల్ని కోరుకుంటుంది, ప్రేమిస్తుంది. ఆయితే విచ్చలవిడిగా దొరికే పాప క్షమాపణా పత్రికలు శిక్షావిధుల తీవ్రతని తగ్గించటమేకాకుండా ఒక్కోసారి ఆ పత్రికల మీద అసహ్యం కలిగేలా

41. ప్రేమతోకూడిన ఇతర మంచి కార్యాలకంటేకూడా పాపక్షమాపణా పత్రాలు మంచివని ప్రజలు అపోహ పడకుండా వాటి గురించి చాలా జాగ్రత్తగా బోధించటం అవసరం.

42. పాపపరిహార పత్రికల్ని కొనడం ఏమాత్రం కనికరయుత కార్యాలతో పోల్చదగింది కాదన్నది పోపు అభిప్రాయమని క్రైస్తవులకు బోధించాలి.

43. పేదలకు సాయం చేసేవాడు, అవసరంలో ఉన్నవాళ్ళకి అప్పిచ్చేవాడు పాపపరిహార పత్రికల్ని కొనడంకంటేకూడా మంచి పని చేస్తున్నాడని క్రైస్తవులకు బోధించాలి.

44. ఎందుకంటే ప్రేమపూర్వకమైన పనులు మరింతగా ప్రేమను పెంచి ఒకడ్ని మంచి వాడ్ని చేస్తాయి. అయితే పాపపరిహార పత్రికలు కొనడంద్వారా కేవలం శిక్షావిధుల్నుండి తప్పించబడతాడేగాని మంచివాడు మాత్రం కాలేడు.

45. అవసరంలో ఉన్నవాడ్ని చూసికూడా ముఖం తప్పించివెళ్ళి, పాపపరిహార పత్రికలు కొనేవాడు పోపు ఇచ్చే క్షమాపజణ్ణి కాదుగాని, దేవుని ఉగ్రతనే కొంటున్నాడని క్రైస్తవులకు బోధించాలి.

46. తమ స్వంత కుటుంబ అవసరాలకు చాలినంత అట్టిపెట్టుకున్నాక, తమ అవసరాలకు మించి ఇంకా ఏమైనా మిగిలిపోతే ఆడబ్బుతో పాపపరిహార పత్రికలు కొనొచ్చుగాని అనవసరంగా డబ్బులు పాడుచేసుకోకూడదని క్రైస్తవులకు బోధించాలి.

47. పాపపరిహార పత్రికలు కొనాలా వద్దా అన్నది తమ ఇష్టాయిష్టాలమీద ఆధారపడి ఉంటుందేతప్ప అదేమీ ఆజ్ఞాపూర్వకమైంది కాదని క్రైస్తవులకు బోధించాలి.

48. ప్రజలుతెచ్చే డబ్బుకంటేకూడా భక్తియుతమైన వాళ్ళ ప్రార్ధనలు తనకెంతైనా అవసరమని, అవే పోపు కోరుకొంటున్నాడని క్రైస్తవులకు బోధించాలి.

↑ Back to top

↑