ప్రకటన గ్రంథం సారాంశం (భాగం 1 / 2)
ప్రకటన గ్రంథం యొక్క సందేశము అంత్యదినముల కొరకైనది, మరియు ఈ గ్రంథము మాటలను వినుచు వాటిని గైకొనువారికి ఒక ప్రత్యేక ఆశీర్వాదము వాగ్దానము చేయబడినది, మనము దీనిని Revelation 22లో చదువుచున్నాము, 22:7 ...ఈ గ్రంథము మాటలను గైకొనువాడు ధన్యుడు... ఈ గ్రంథము సమస్తమును జయించి స్వాస్థ్యముగా పొందగోరువారి కొరకు ఇవ్వబడినది. మనము జయించుటకు నేర్పించుటకే ఇది ఇవ్వబడినది. మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను మనకు బయలుపరచుటకే ఇది ఇవ్వబడినది.
ఈ గ్రంథములో ఏడు విభాగములు ఉన్నవి, ప్రతి విభాగము క్రీస్తు మహిమలోని ఒక అంశమును బయలుపరచుచున్నది.
Rev. 1. మన నిత్యమైన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మహిమ.
Rev. 2 మరియు 3. తన సంఘములో ప్రభువైన యేసుక్రీస్తు మహిమ.
Rev. 4 మరియు 5. పరిపూర్ణమైన పరలోక సంఘములో ప్రభువైన యేసుక్రీస్తు మహిమ.
Rev. 6 నుండి 19 వరకు. ఆయన తీర్పుల మహిమయు, ఆయన తీర్పులలో ఆయనతో సహకరించు ఆయన సహకార్యకర్తలముగా మనము.
Rev.20: 1-6. క్రీస్తు వెయ్యేండ్ల రాజ్యపరిపాలన మహిమ.
Rev.20: 7-15. మహా తెల్లని సింహాసన తీర్పు మహిమ.
Rev. 21 మరియు 22. రాబోవు తన నూతన సృష్టిలో ప్రభువైన యేసుక్రీస్తు మహిమ.
ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మన నిత్యమైన ప్రధానయాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు మహిమను చూపించుచున్నది. అపొస్తలుడైన యోహాను పత్మాసు ద్వీపమునకు బహిష్కరింపబడెను. అతడు ఆసియా మైనరులోని సంఘములలో నున్న తన సహోదరులను, క్రీస్తునందు తన పిల్లలను గూర్చి ఆలోచించుచుండెను, అప్పటికే ప్రారంభమైయున్న ఆత్మీయ క్షీణత కాలమును గూర్చి తలంచుచుండెను; తన పత్రికలలో సూచించినట్లు ‘ప్రతిక్రీస్తులు’ (Rev. 1:9-10).
2 Timothy 4: 16 చూపించునట్లు ఆ కాలములో అనేకులు అపొస్తలుడైన పౌలును విడిచిపెట్టిరి, అతడు ఇందులో వ్రాసినట్లు 2 Timothy 4: 10 --“దేమా నన్ను విడిచిపెట్టెను.” అనేకులు యిటు నటు చెదరిపోయిరి, వారి విశ్వాసమును కోల్పోవుచుండిరి, అనేకులు మోసపోయిరి.
ఈ గ్రంథము ఆత్మీయ పునరుద్ధరణ కొరకు ఇవ్వబడిన సందేశము. మనము దైవిక నియమములకు లోబడినయెడల ప్రతి నష్టమును తిరిగి పొందవచ్చును. యోహాను తన వెనుక ఒక గొప్ప స్వరమును వినెననియు, తనతో మాటలాడిన స్వరమును చూచుటకు వెనుకకు తిరిగెననియు మనము చదువుచున్నాము. యోహాను తప్పుడు దిక్కులో చూచుచుండెను (Rev. 1:10-12). మనము కూడా తప్పుడు దిక్కులో చూచుటవలన నిరుత్సాహపడుదుము. పేతురు అలలను చూచినప్పుడు మునిగిపోవుటకు మొదలుపెట్టెను (Matt. 14: 29-31). అతని కన్నులు ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉన్నప్పుడు అతడు క్షేమముగా ఉండెను. పరిస్థితులు ఏమైనప్పటికిని, మన కన్నులు ప్రభువైన యేసుక్రీస్తు మీదనే ఉండవలెను. మనము ఆయనను ప్రదర్శింపవలెను, ఆయనను ప్రకటింపవలెను, మరియు మన కన్నులు ఆయన మీద ఉంచవలెను.
లో Rev. 1:20 లో ప్రభువైన యేసుక్రీస్తు ఎటువంటి సంఘమును కట్టుచున్నాడో మనము చూచుచున్నాము. ఏడు బంగారు దీపస్తంభములను గమనించండి. బంగారము దైవిక జీవమును సూచించుచున్నది. Rev. 21: 18 లో మనము పవిత్రమైన బంగారు పట్టణము యొక్క అద్భుతమైన వర్ణనను చదువుచున్నాము. ప్రభువు సహవాసములనుగాని, తెగలనుగాని, వర్గములనుగాని కట్టుటలేదు. ఆయన తన సంఘమును కట్టుచున్నాడు. జీవము పూర్తిగాను స్వేచ్ఛగాను ప్రవహించనిదే ఆయన సంఘమును కట్టలేము.
Rev. 1: 13 క్రీస్తును నిత్యమైన ప్రధానయాజకునిగా చూపించుచున్నది. Hebrews 7: 21-28 ఆయనను నిర్మలుడుగా, పాపులకు వేరైనవానిగా, ఆకాశముల కంటె హెచ్చైనవానిగా వర్ణించుచున్నది: మన కొరకు విజ్ఞాపనము చేయుటకు ఎల్లప్పుడు జీవించుచున్నవాడు. ఒక విశ్వాసి పడిపోయియుండవచ్చును, కాని దేవుని వాక్యమును గాని విలువైన రక్తమును గాని దూషింపనంతవరకు అతనికి నిరీక్షణ కలదు. 1 John 2:1 క్రీస్తు మన న్యాయవాదిగా పిలువబడుచున్నాడు. ఆయనతో విశ్వాసి ఇందులో ఇవ్వబడిన ఆయన వాగ్దానముల ద్వారా క్షేమముగా ఉన్నాడు Psalm 37: 24- “అతడు పడిపోయినను బొత్తిగా పడద్రోయబడడు’ దీనికి Micah 7:8 ఇంకనూ కలుపుచున్నది, “...నేను పడిపోయినను తిరిగి లేతును.”
2 Cor. 4: 9 మనతో చెప్పుచున్నది, మనము పడద్రోయబడవచ్చును కాని నశింపబడము. మనము పడిపోవచ్చును, ఏలయనగా మనము మనుష్యులము, అనేక తప్పులు చేయుదుము, కాని ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధానయాజకుడు.
మన హృదయములలో ప్రధానయాజకుని కార్యమును అనుభవించుటకు, మనము ప్రార్థన కొరకు, దేవుని వాక్య పరిచర్య కొరకు జరుగు కూటములలో సహవాసము కొరకు రావలెను. ఆదివారము ఒక కూటము మాత్రమే చాలదు. ఒంటరిగా ఉండి ఆదివారము మాత్రమే సహవాసము కొరకు వచ్చువారికి గొప్ప నష్టము కలుగును. ఒంటరి విశ్వాసులు అనేక శోధనలకు గురియగుదురు.
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఏడు లక్షణములు
1. ఆయన తల మరియు వెంట్రుకలు గొఱ్ఱెబొచ్చు వలె తెల్లగా ఉండుట:
ఆయన తల మరియు వెంట్రుకలు ఇందులో అద్భుతముగా వర్ణింపబడినవి Rev. 1:14. ఆయన వెంట్రుకలు గొఱ్ఱెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ప్రభువు నెరిసిన వెంట్రుకలు నిత్యమైన జ్ఞానమును, పరిపక్వతను, అనుభవమును సూచించుచున్నవి (Dan. 7:9). అనేకమంది జుట్టు నెరవుటను ఇష్టపడరు; అవి కనిపించినప్పుడల్లా వాటిని పీకివేయుదురు! అయితే మానవ జ్ఞానము తప్పులు చేయగలదు, దైవిక జ్ఞానము ద్వారానే మనము దేవుని మర్మములను గ్రహింపగలము. James 1:5 మనతో చెప్పుచున్నది, మనకు జ్ఞానము కొదువగా ఉన్నయెడల దేవుని అడుగవలెను, ఏలయనగా నిజమైన జ్ఞానము శాంతముగలది, సులభముగా ఒప్పింపదగినది. Prov. 8:1-5; 25-30 నిజమైన, ఆత్మీయమైన పరలోక జ్ఞానమును వర్ణించుచున్నది. Prov. 9:1 పరలోక జ్ఞానము యొక్క ఏడు స్తంభములను గూర్చి చెప్పుచున్నది.
James 3:17 మనతో చెప్పుచున్నది, దేవుడిచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, సాధువైనది, సులభముగా ఒప్పింపదగినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండినది, పక్షపాతము లేనిది, వేషధారణ లేనిది. ఆ జ్ఞానము మనకు ఎంతగా అవసరమో! మీ బైబిలును తీసికొని, మోకరించి ప్రార్థించండి: “ప్రభువా, ఈ అధ్యాయము యొక్క భావమును నీవే నాకు నేర్పుము”.
2. ఆయన కన్నులు అగ్నిజ్వాలవలె ఉండుట:
“యెహోవా కన్నులు లోకమందంతట సంచరించుచున్నవి” (2 Chron. 16:9). Psalm 32: 8 ఈ వాగ్దానము ఇచ్చుచున్నది: “నా కన్నుతో నిన్ను నడిపింతును”, లేక అంచు వ్రాతలో ఇచ్చినట్లు “నా కన్ను నీ మీద ఉన్నది”, మనము “దీనిని గూర్చి ఏమి? దానిని గూర్చి ఏమి?” అని అడిగినప్పుడు, ప్రభువు చెప్పుచున్నాడు: “నాకు తెలియును, నేను చూడగలను”. John 1:46-48 లో, యేసు చెప్పుచున్నాడు, “నీవు నతనయేలువు; నీవెవరో నాకు తెలియును.” నతనయేలు ఆలోచించుకొనుచున్నాడు: “ప్రభువైన యేసుక్రీస్తుకు నేనెవరో ఎలా తెలియును?” Luke 19: 5 లోని జక్కయ్య మరియొక ఉదాహరణ. ప్రభువు అతడెవరో, ఎక్కడ ఉన్నాడో ఎరిగియుండెను. ఆయన సమస్తమును ఎరిగియున్నాడు, మనలను శుద్ధి చేయుటకు పరిస్థితులను అనుమతించును. మనలను సాధువుగాను శుద్ధముగాను ఉంచుటకు శ్రమ అవసరము, శుద్ధి చేయుటకు అగ్ని అవసరము.
3. ఆయన పాదములు మేలిమి యిత్తడివలె ఉండుట:
లో John 3:14 లో మనము యిత్తడి సర్పమును గూర్చి చదువుచున్నాము. ఆ కథ ఇందులో ఇవ్వబడినది Num. 21:9. అగ్ని సర్పముచే కరువబడి చనిపోవుచున్న ఇశ్రాయేలీయుడు యిత్తడి సర్పమును చూచి బ్రదికెను, కాని ఆ సర్పమునకు తనంతట తనకు శక్తి లేదు, 2 Kings 18:4 లో, ప్రజలు ఆ సర్పమును పూజింపనారంభించిరనియు, అందుచే దేవుడు దానిని నశింపజేసెననియు మనము చదువుచున్నాము. యిత్తడి తీర్పును సూచించుచున్నది. బలిపీఠము యిత్తడితో చేయబడెను. ప్రభువు పాదములు యిత్తడివలె ఉండెను. Gen. 3:15 లో సర్పము తల నలుగగొట్టబడునని ప్రవచనము ఇవ్వబడినది మరియు Romans 16: 20 లో సమాధానకర్తయైన దేవుడు త్వరలో సాతానును దేవుని ప్రజల పాదముల క్రింద నలుగగొట్టునని వాగ్దానము ఇవ్వబడినది.
అపవాది క్రీస్తు సిలువ మరణము ద్వారానే ఓడింపబడెను, అద్భుతముల ద్వారా కాదు. మహమ్మదీయులు ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతములను, ఆయన కన్యక జననమును, ఆయన సిలువవేయబడెననియు, ఆయన తిరిగి వచ్చుననియు నమ్ముదురు, కాని ఆయన చనిపోయి తిరిగి లేచెననని నమ్మరు.
1 Cor. 1: 18 దేవుని శక్తి క్రీస్తు సిలువయందున్నదని, అద్భుతములయందు కాదని దృఢపరచుచున్నది. మనము మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు అతిశయపడవలెను, Gal. 6:14; మరియు అపవాదిని ఓడించుటకు మనము ప్రభువైన యేసుక్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానములో ఆయనతో మన ఏకత్వమును మనకొరకు స్వీకరింపవలెను (1 Cor. 15: 3-4),
4. ఆయన స్వరము విస్తార జలముల ధ్వనివలె ఉండుట:
Rev. 1: 15; 19:6. Isaiah 30:21 ఇట్లు చెప్పుచున్నది:‘నీ వెనుక నుండి ఒక మాట నీ చెవులకు వినబడును.” I Kings 19:12-18 లో దేవుడు మెల్లని స్వరములోను, ఉరుముధ్వనితోను కూడా మాటలాడెను.
5. ఆయన చేతిలో ఏడు నక్షత్రములు ఉండుట:
ప్రభువు సంఘములను తన చేతిలో పట్టుకొనియున్నాడు; తన సేవకులతో మాటలాడుటకు ఆయన ఎల్లప్పుడు దూతలను పంపడు. మన రక్షణ కొరకు ప్రభువు దూతలను పంపవచ్చును, మనమిది చూచుచున్నట్లు Josh. 5:13-15. Gen. 32:1 లో, దేవుని దూతలు యాకోబును కలిసికొనిరి, కాని వారెల్లప్పుడు కనబడరు. కొన్నిసార్లు ప్రభువు మనలను శోధనల గుండా వెళ్లనిచ్చును, కాని ఎల్లప్పుడు అన్ని పరిస్థితులలోను మనము ఆయన చేతులలో పట్టుకొనబడియున్నాము.
6. ఆయన నోటినుండి పదునైన రెండంచుల ఖడ్గము బయలుదేరుట:
_ Hebrews 4:12 లో దేవుని వాక్యము పదునైన రెండంచుల ఖడ్గముతో పోల్చబడినది, దేవుని వాక్యము ద్వారానే మనము అపవాదిని ఓడించుదుము (Eph. 6:17), అటులనే Matt. 4:4,7,10 లో, ప్రభువైన యేసుక్రీస్తు తానే దేవుని వాక్యము ద్వారా అపవాదిని ఓడించెను.
7. చివరిగా, ఆయన ముఖము సూర్యుడు తన బలముతో ప్రకాశించునట్లు ఉండెను:
లో Mal. 4:2 లో నీతిసూర్యుడు అను మాట ప్రభువును వర్ణించుటకు వాడబడినది. ప్రతి క్రిమి సూర్యకాంతిచే చంపబడును, కావున సందేహము, భయము, సందేహాస్పదత అను ఆత్మీయ క్రిములనుండి విడుదల పొందుటకు మిమ్మును ప్రభువైన యేసు సూర్యకాంతిలో ఉంచుకొనుడి. ప్రభువు అపొస్తలుడైన యోహానుకు తనను గూర్చిన నూతన దర్శనమునిచ్చెను. క్రీస్తును, ఆయన బోధను మాత్రమే గాక ఆయన పరలోక మహిమను సౌందర్యమును కూడా ప్రదర్శింపుడి. Rev, 19:16 ఆయనను రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను బయలుపరచుచున్నది.
ప్రకటన గ్రంథము అధ్యాయము 2:
ప్రకటన గ్రంథము అంత్యదినముల కొరకైన ఒక ప్రత్యేక సందేశము, “ఈ ప్రవచన వాక్యములను” వినుచు గైకొనువారికి ఒక ప్రత్యేక ఆశీర్వాదము వాగ్దానము చేయబడినది Rev. 22:7. “జయించువాడు సమస్తమును స్వతంత్రించుకొనును’ Rev 21:7, మరియు ఈ గ్రంథము మనము ఎలా జయించవలెనో నేర్పించుచున్నది. ఈ అధ్యాయములో ప్రభువైన యేసు సంఘముల మధ్యన ఉండుట చూడబడుచున్నాడు (Matt. 16:18).
అధ్యాయములు 2, 3 లో ప్రభువైన యేసుక్రీస్తు అపవాదిని ఎలా ఓడించునో మనము చూచుచున్నాము. అపవాది నాలుగు విధములుగా వచ్చును.
1. 1 Pet. 5:8 లో వలె, గర్జించు సింహమువలె.
2. Acts 20:29 లో వలె, క్రూరమైన తోడేలువలె, సంఘములలోనికి తప్పుడు బోధను, దేవుని ప్రజలలో కలహమును తీసికొనివచ్చుచు.
3. 2 Cor. 1:14 లో వలె, వెలుగుదూతవలె.
4. Isa. 59:19 లో వలె, వరదవలె.
ఈ అధ్యాయము యొక్క సందేశము ఏడు భాగములుగా విభజింపబడవచ్చును, ప్రతి భాగము ఒక చారిత్రిక కాలమును సూచించుచున్నది. మొత్తము ఏడు సందేశములు ఉన్నవి , మరియు ప్రతి సందేశము మరల ఏడు భాగములుగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తుకు ఏడు బిరుదులు ఇవ్వబడినవి. దీని ద్వారా ఆయన తనను ఏడు సంఘములకు తెలియజేసికొనుచున్నాడు, మరియు ప్రతి సంఘములోను లేక యుగములోను, ఆయన తనను తాను పరిచయము చేసికొనిన పాత్రలో ఆయనను గూర్చిన జ్ఞానమే విశ్వాసులను జయించుటకు శక్తినిచ్చెను.
మొదటి కాలము (Rev. 2:1-7)
మొదటి కాలము ఎఫెసు సంఘము ద్వారా వర్ణింపబడినది లేక చిత్రింపబడినది. Rev. 2:1, ఎఫెసు సంఘపు దూతతో మాటలాడుచు, క్రీస్తు తన కుడిచేతిలో ఏడు నక్షత్రములను పట్టుకొనువానిగా తనను తాను పరిచయము చేసికొనుచున్నాడు. మనము అపాయములో ఉన్నప్పుడు మనలను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. మనము పరిస్థితులను చూడకూడదు, ఏలయనగా ప్రతి పరిస్థితితోపాటు అవసరమైన సహాయము వచ్చును. రక్షణకు వారసులైనవారికి పరిచారము చేయుటకు ఆయన దూతలను ఆత్మలుగా చేసియున్నాడు (Heb.1:14).
Acts 12:7 లో, దూతలు మనతో పూర్తి దూరమంతటికి రారు. దూత పేతురును కొంతదూరము మాత్రమే తీసికొనిపోయెను. పేతురు తన చెప్పులను, పాత వస్త్రమును మరచిపోవుననియు దేవుడు ఎరిగియుండెను, కావున దూత వాటిని తీసికొనుమని అతనికి జ్ఞాపకము చేసెను. తరువాత దూత అతనిని విడిచిపెట్టెను. దేవుడు తన ప్రజలను కాపు కాయు దూతలు కలిగియున్నాడని మరువకుడి.
క్వెట్టా (భారతదేశము)లో ఒక భూకంపము ద్వారా పదునెనిమిది సెకనులలో 58,000 మంది చనిపోయిరి. జనాభాలో 92 శాతము నాశనమైనప్పటికిని, ఒక్క విశ్వాసి మాత్రమే చనిపోయెను.
ప్రభువు తనను ఈ సంఘమునకు ఏడు బంగారు దీపస్తంభముల మధ్యన నడచువానిగా కూడా పరిచయము చేసికొనెను.
హింసచే అనేకులు చెరసాలలో వేయబడిరి, చెదరగొట్టబడిరి, Acts 12:1!-2, మరియు యోహాను “సంఘము భవిష్యత్తు ఏమిటి?” అని ప్రశ్నించియుండవలెను. ప్రభువు జవాబిచ్చెను, “బాహ్య పరిస్థితులను చూడకుము, నేను సంఘముల మధ్యన ఉన్నాను. నేను నా సంఘమును కట్టుచున్నాను మరియు దీనికొరకు నేను భవనములమీద ఆస్తులమీద ఆధారపడను.”
దీపస్తంభముల బంగారము దైవిక జీవమును సూచించుచున్నది. సంఘములు దైవిక జీవముతో కూడియుండు చోట, ప్రభువైన యేసుక్రీస్తు తలత్వము క్రింద అవి కట్టబడును. తన సందేశములో క్రీస్తు మొదట సంఘమును మెచ్చుకొనుచున్నాడు, “నీ క్రియలను, నీ ఆసక్తిని, నీ ప్రయాసమును నేనెరుగుదును, నీవు తప్పుడు బోధను ఎట్లు సహింపవో, నీవు కార్యకలాపముతో ఎట్లు నిండియున్నావో, దర్శించుచు ప్రకటించుచు, భారము మోయుచు సొమ్మసిల్లకయుండుటను నేనెరుగుదును.”
అటుపిమ్మట ఆయన సంఘము మీద ఒక గంభీరమైన నేరారోపణ చేయుచున్నాడు: “నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టితివి. నేను నిన్ను ఉపయోగింపజాలను. నీవు ప్రభువుమీద నీ ప్రేమను కోల్పోయితివి.” ప్రభువుమీద ప్రేమ లేనిదే ఆయన మనలను ఉపయోగింపజాలడు. మనము కార్యకలాపముతో నిండియుండవచ్చును, కాని మన హృదయములలో ప్రేమ లేనియెడల మనము వ్యర్థులమే. మనము ప్రార్థింతము: “ప్రభువా, గుడ్డితనములో ఉన్న ప్రజలయెడల నాకు ప్రేమను దయచేయుము,” ఏలయనగా ప్రజలయెడల మనకు ప్రేమ లేనియెడల ప్రభువు కార్యము చేయజాలడు. మనము జ్ఞానముతో నిండియుండవచ్చును, కాని చల్లారి ప్రేమలేనివారమై యుండవచ్చును. ఎఫెసు సంఘమును ఖండించుటకు మనకు హక్కు లేదు, ఏలయనగా వారియెడల నిజమైనది మనయెడల కూడా నిజమైనదే. మనము ప్రేమను చూపవలెను.
మనము నికొలాయితుల బోధను అర్థము చేసికొనునంతవరకు, వారు ప్రసంగీకుడికిని ప్రజలకును మధ్య ఒక తేడాను, లేక ఒక గీతను గీచిరి, మరియు అట్లు చేయుటలో ప్రసంగీకుడిని మహిమపరచు ధోరణి కలిగియుండిరి.
ఈ సంఘమునకు వాగ్దానము చేయబడిన బహుమానము ఏమనగా, జయించువానికి క్రీస్తు జీవవృక్ష ఫలము తినుటకిచ్చును (Revelation 2:7). Genesis 2:9 లో జీవవృక్షము తోట మధ్యలో ఉండెను, జీవవృక్ష ఫలము తినుట ద్వారా మనుష్యుడు సమస్తమును నిత్యజీవమును అనుభవించియుండగలిగెడివాడు. ఇప్పుడు, జయించుట ద్వారా, దేవుడు మనకొరకు ఉంచిన సమస్తమును మనము అనుభవింపగలుగుదుము. ఇప్పటికే పెండ్లికుమారుడు పరలోక విందును సిద్ధపరచుచున్నాడు, జయించువారు ఆ విందులో పాలుపొంది జీవవృక్ష ఫలము తినెదరు (Matt. 26:29). నిత్యత్వపు సంగతులను మనము పూర్తిగా అనుభవించుట జీవవృక్ష ఫలము తినుటమీద ఆధారపడియున్నది. మన హృదయములు ప్రేమతో నిండియున్నయెడల మనము జయించుటను నేర్చుకొనుచు దేవుని వాక్యమంతటిని అనుభవించెదము.
చారిత్రికముగా ఎఫెసు సంఘము సంఘ చరిత్ర ఆరంభము నుండి 90 A.D. వరకు ఉన్న అపొస్తలుల కాలము.
మనము చూచినట్లు, క్రీస్తు ఈ సంఘముతో తనను గూర్చి బంగారు దీపస్తంభముల మధ్యన నడచువానిగాను, తన కుడిచేతిలో ఏడు నక్షత్రములను పట్టుకొనువానిగాను చెప్పుకొనెను. ఆయనే తన సంఘములో కేంద్రము మరియు సర్వోన్నత అధికారము.
ఈ సంఘము యొక్క ప్రమాదము ఏమనగా, ఆమె తన మొదటి ప్రేమను విడిచిపెట్టెను. ఆమెకిచ్చిన హెచ్చరిక జ్ఞాపకము చేసికొని మారుమనస్సు పొందుమని. చల్లారిపోవుటకును ఫలము లేకుండుటకును పరిష్కారము క్రీస్తుమీద మన మొదటి ప్రేమకు తిరిగి రావుటయే.
పాఠకుడు హెచ్చరింపబడుచున్నాడు: “చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న సంగతులను వినునుగాక”.
నమ్మకత్వమునకు బహుమానము జీవవృక్ష ఫలము తినుటయే.
మనము ప్రార్థింతము: “ప్రభువా, నన్ను ప్రేమగలవానిగాను కోమలుడనుగాను ఉంచుము”. ఎవరును నేను ఎన్నడూ విఫలము కాను అని చెప్పలేరు (Luke 22:31-32). పడిపోయినవారికొరకు ప్రార్థించుటను, వారి యొద్దకు వ్యక్తిగతముగా వెళ్లి వారితో కలిసి ప్రార్థించుటను మనము నేర్చుకొనవలెను.
లో Galatians 2:11-?2 లో పేతురు హృదయము చల్లారెననియు, అతనికి అందరిపైన ఒకే ప్రేమ లేకపోయెననియు మనము చదువుచున్నాము, మనము మన శత్రువులను ప్రేమించుటను నేర్చుకొనవలెను, మనలను ద్వేషించువారిని మరియు పడిపోయినవారిని కూడా. మన హృదయములు దయగలవిగాను కోమలముగాను ఉన్నవని మనము నిశ్చయపరచుకొనవలెను, ఏలయనగా మన హృదయములలో ప్రేమ లేకుండిన, ఇతరుల భారములను ఎట్లు పంచుకొనవలెనో మనకు తెలియకుండిన, మన బోధకు విలువ లేదు (Gal.6:2),
రెండవ కాలము (Rev. 2:8-11)
రెండవ కాలము స్ముర్న సంఘము కాలము, ఈ సంఘము 90 A.D. నుండి 325 A.D. మధ్య చురుకుగా ఉండెను. ఈ పేరు శ్రమను సూచించుచున్నది, బోళము (myrrh) అను పదము అదే మూలము నుండి వచ్చినది. John 19:39 లో మనము చూచునదేమనగా, బోళము శవములకు పూయుటకు వాడబడును, కాని ముందు దానిని పొడిగా చేయవలెను. అదే విధముగా మనము శ్రమపడి మధురమైన సువాసనను వెలువరించుటకు పిలువబడియున్నాము. కొన్ని పుష్పములు అత్యంత చీకటి రాత్రియందు తమ మధురమైన సువాసనను వెలువరించును. శ్రమలో మనకు ప్రార్థనకొరకు అత్యధిక భారము కలుగుననుట నిజము. వైభవము సాధారణముగా విశ్వాసులలో నిస్సారత్వమును తీసికొనివచ్చును. ఈ దేశములోను పాశ్చాత్య దేశములోని అనేక ప్రాంతములలోను ఉన్న కష్టము ఏమనగా, మిక్కిలి వైభవము ఉండుటయే. ఈ పత్రిక వ్రాయబడిన కాలములో, విశ్వాసులు తమ ఆస్తిని కోల్పోయిరి, గుహలలో సమకూడియుండిరి. “నేను జీవించు క్రీస్తును,” అని ప్రభువు అట్టి సంఘముతో Rev, 2:8 లో ప్రకటించెను. హింస సంఘమును చంపజాలదు. విశ్వాసులు బీదవారుగా ఉండవచ్చును, కాని హింసలో వారు ఆత్మీయముగా ధనవంతులు. విశ్వాసులను మోసగింప గోరువారు కొందరుండిరి, వారిని బలపరచుటకు పరీక్ష అనుమతింపబడెను. “...మీకు పది దినములు శ్రమ కలుగును,” అని ప్రభువు వారితో చెప్పెను, “మరణమువరకు నమ్మకముగా ఉండుము.” సంఖ్య 10 పరీక్షను సూచించును, పరీక్షలో నిలిచినవారికి జీవకిరీటము లభించును (James 1:12).
లో 2 Timothy 4:8 లో దీనిని నీతి కిరీటమని పిలిచిరి, క్రీస్తు ప్రత్యక్షతను ప్రేమించు అందరికి ఇది వాగ్దానము చేయబడినది. ఆయన ప్రత్యక్షతను ప్రేమించి ప్రతి శోధనను జయించు అందరు జీవకిరీటమును పొందుదురు.
అపొస్తలుడైన పౌలు తానే అనేక శ్రమలను పరీక్షలను సహించెను, కాని అతని వైఖరి జయించువాని వైఖరియే, తాను “రెండవ మరణము వలన హాని పొందడు” అని ఎరిగియుండెను. ఇందులో నలుబది శ్రమలు పేర్కొనబడినవి 2 Cor. 6:4-10, 11:24-29 అయినను అపొస్తలుడు ఎల్లప్పుడు ఆనందించుచుండెను. అతడెన్నడును సణుగలేదు, కాని శ్రమపడుటను ఒక భాగ్యముగా ఎంచెను: ‘నేను నేర్చుకొంటిని’ అని అతడు చెప్పెను, ‘ఏ స్థితిలో ఉన్నను దానితో తృప్తిపడుటను,’ Phil. 4:11, మనమందరమును ఆ తృప్తి ఆత్మను కలిగియుండవలెనని దేవుని కోరుకొందుము.
లో Heb. 13:5a లో మన ప్రవర్తన లోభము లేనిదిగా ఉండవలెనని మనతో చెప్పబడినది. ధనాశనుండి, భౌతిక ఆస్తులయెడల వాంఛనుండి విడుదల పొందుమనియు, మనకు కలిగియున్న వాటితో తృప్తిపడవలెననియు మనము హెచ్చరింపబడుచున్నాము. కొందరు ఎన్నడును తృప్తిపడరు. వారు ఎల్లప్పుడు కొత్త సామానులను, కొత్త కారును, లేక మరియేదో కొత్తదానిని కోరుకొందురు. మనము కృతజ్ఞతగలవారమై ఉండవలెను, అప్పుడు మాత్రమే మనము ఆత్మీయముగా ఎదుగగలము.
రెండవ సంఘమునకు వాగ్దానము (Rev, 2:11) ఏమనగా, జయించువాడు రెండవ మరణమువలన హాని పొందడు. Rev. 20:6 దీనినిగూర్చిన మరియొక వాగ్దానము. “మొదటి పునరుత్థానములో పాలుపొందువాడు ధన్యుడు, పరిశుద్ధుడు; అట్టివారిపైన రెండవ మరణమునకు అధికారము లేదు.”
ఈ జయించువారు ఎవరు? Rev. 20:4 నుండి వారందరు విశ్వాసులేనని మనము గ్రహించుచున్నాము. అనేకులు ప్రతిక్రీస్తుచే మోసగింపబడెదరు, అనేకులు మృగమునకు లేక దాని ప్రతిమకు నమస్కరించి పూజించెదరు లేక దాని ముద్రను తమ చేతిమీద లేక నుదుటిమీద ధరించెదరు. జయించువారు క్రీస్తుతో కూడ వెయ్యి సంవత్సరములు జీవించి రాజ్యపరిపాలన చేసెదరు. కాని మృగము ముద్రను ధరించువారు లేక ప్రతిక్రీస్తు పక్షము వహించువారు జయించువారు కాజాలరు (Rev.13:4). వారు రెండవ మరణముచే జయింపబడెదరు, వెయ్యేండ్ల రాజ్యపరిపాలనలో పాలుపొందరు.
ప్రభువు ఈ సంఘము యొద్దకు “మొదటివాడు మరియు కడపటివాడు”గాను, “చనిపోయి తిరిగి బ్రదికినవాడు”గాను వచ్చుచున్నాడు. ఆయనే మరణము గుండా వెళ్లియుండెను, కావున ఆయన వారితో ఉన్నప్పుడు వారు మరణమునకు ఎందుకు భయపడవలెను?
మూడవ కాలము (Rev. 2:12-17)
మూడవ కాలము పెర్గములో సంఘము కాలము. క్రీస్తు “రెండంచుల వాడియైన ఖడ్గము గలవాడు”గా తనను తాను ప్రదర్శించుకొనుచున్నాడు,
ఆయన చెప్పుచున్నాడు, “నీ క్రియలను, నీవు నివసించు స్థలమును, సాతాను సింహాసనమున్న స్థలమును సహా నేనెరుగుదును” (v. 13). రాజైన కాన్‌స్టంటైను ప్రభువైన యేసుక్రీస్తుకు బదులుగా సంఘమునకు తలగా ఉండెను.
రాజైన హెన్రీ VII ఎన్ బోలిన్‌ను వివాహము చేసికొనుటకు కేథరైన్ ఆఫ్ అరగాన్‌ను విడాకులు చేసికొనగోరెను. కావున అతడు రోమన్ కేథలిక్ సంఘమునుండి వేరుపడి ఇంగ్లండు సంఘమునకు తలగా ఆయెను. కాని ఒక మనుష్యుడు తలత్వమును క్లెయిము చేసికొను సంఘములో క్రీస్తు రాజ్యపరిపాలన చేయజాలడు.
విగ్రహములకు అర్పింపబడిన వాటిని తినకూడదని సంఘము హెచ్చరింపబడుచున్నది. Numbers 23:4-11 లో బిలామను ఇశ్రాయేలీయులను శపించుటకు బదులు దీవించెననియు మనము చదువుచున్నాము. అతడు ఇట్లు చేయగోరలేదు, కాని దేవుడు అతని నోటిని బలవంతముగా వారిని దీవించునట్లు చేసెను. తరువాత, Numbers 25:1 లో, బిలాము తప్పుడు సలహా ఇచ్చెను. అతడు యుక్తిగా ఇశ్రాయేలీయులలో కొందరిని మిశ్రమ వివాహములు చేసికొనునట్లు ప్రేరేపించెను, ఫలితముగా ప్రజలు విగ్రహములను పూజింపనారంభించిరి, ఇశ్రాయేలు బయల్పెయోరుతో కూడుకొనెను (Num. 31:16). బిలాము బోధను మిశ్రమ వివాహముల బోధ, అనగా విశ్వాసులు అవిశ్వాసులను వివాహము చేసికొనుట అను బోధ అని పిలువవచ్చును, 2 Cor. 6:14-18 లో అవిశ్వాసులతో సంబంధము ఎందుకు హానికరమో మనము చదువుచున్నాము. “నేను అతనిని సంపాదించుకొనుటకు అతనితో స్నేహము చేయుచున్నాను” అని చెప్పుట తప్పుడు వాదన. అది ఆత్మీయ గుడ్డితనమును తీసికొనివచ్చుటకు అపవాది యొక్క బలమైన ఆయుధము. విశ్వాసియు అవిశ్వాసియు వివాహములోను వ్యాపారములోను ఎట్లు ఒక్కటి కాగలరు? Amos 3:3 జవాబిచ్చుచున్నది: “ఇద్దరు ఏకీభవించకుండ కూడి నడవగలరా?”
ఈ సంఘములో నికొలాయితుల బోధను నమ్మువారు కూడా ఉండిరి (Rev. 2:15). ప్రజలను ఆకర్షింపగలిగిన ఒక ప్రసంగీకుడిని ప్రజలు దేవునివలె పూజింపనారంభించిరి, దీనిని దేవుడు ద్వేషించెను. ఇది దేవుని సంఘములో మనుష్యులు నియమించిన తలత్వము యొక్క బోధ. ఆంగ్లికనులు కూడా బిషప్‌ను పూజించి అతనికి నమస్కరించెదరు, దీనివలన పొడవైన వస్త్రములు తీసికొనిరాబడెను, ప్రజలు యాజకుని పూజించి అతని పాదములకు ముద్దుపెట్టుకొందురు. అయితే, దేవుడు ఇందులో చెప్పుచున్నాడు Rev. 2:16 ఆయన ఇట్టి సంగతులకు వ్యతిరేకముగా తన నోటి ఖడ్గముతో యుద్ధము చేయుననియు. ఆ ఖడ్గము దేవుని వాక్యము, దేవుని వాక్యము గౌరవింపబడవలెను. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కనికి మాత్రమే మనము ప్రార్థనలో నమస్కరించి మోకరింపవలెను, Phil. 2:10 లో ప్రతి మోకాలు ఆయనకు వంగవలెనని మనము చదువుచున్నాము, మరియు Ephesians 3:14 లో అపొస్తలుడు చెప్పుచున్నాడు, “నేను మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియెదుట నా మోకాళ్లూనుచున్నాను.”
తొలి సంఘములో ప్రార్థించునప్పుడు మోకరించుట ఆచారము, ఏలయనగా మోకరించుట ఆరాధనకు గురుతు. దీనిని మనమిందులో చూచుచున్నాము Acts 20:36 లో అపొస్తలుడు ఎఫెసు సంఘపు పెద్దలతో మోకరించి ప్రార్థించెను, మరల Acts 21:5 లో తూరు వద్ద అపొస్తలుడు సముద్రతీరమున పురుషులతోను స్త్రీలతోను పిల్లలతోను మోకరించి ప్రార్థించెను. Acts 7:60 లో స్తెఫను రాళ్లతో కొట్టబడుచుండగానే మోకరించి ప్రార్థించెను. Acts 9:40 లో పేతురు తబితా శవము యొద్ద మోకరించి ప్రార్థించెను. విశ్వాసులు ఇప్పుడు కూర్చొని ప్రార్థించెదరు, కాని ఇది చీకటిని తీసికొనివచ్చును. మీ వ్యక్తిగత జీవితములో, కుటుంబ జీవితములో, సంఘ జీవితములో దేవుని వాక్యమునకు లోబడుడి. విశ్వాసుల కూటములలో, ముఖ్యముగా యువకులలో, తరచుగా చాలా వినోదము జరుగుచుండును. కాని మనము వారిని గద్దించి, యువకులకు దేవుని ఎట్లు గౌరవింపవలెనో నేర్పింపవలెను. విశ్వాసులకు తమ చెవులను దేవుని వాక్యమునకు సున్నితముగా ఉంచుకొనుటను నేర్పింపవలెను.
ప్రతి సందేశములో ఒక బహుమానము ఉన్నది. ఇక్కడ వాగ్దానము చేయబడిన బహుమానము మరుగైన మన్నా, నూతన జీవమునకు మనకు అవసరమైన ఆత్మీయ ఆహారము (Rev. 2:17). 1 Kings 19:5-8 లో దూత ఒక అప్పమును సిద్ధపరచి నీళ్లు తీసికొనివచ్చెను, ఈ ఆహారము ప్రవక్తకు నలుబది దినములు ఆగకుండ రేయింబవళ్లు నడచుటకు బలమునిచ్చెను. అది సాధారణ ఆహారము కాదు. దూతలు సిద్ధపరచిన ఆహారమునకు అదనపు బలము కలదు; అది పరలోకపు ఆహారము, భూసంబంధమైనది కాదు. కావున దేవుడు తన ప్రజలు శోధింపబడినప్పుడు, హింసింపబడినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు వారికి ప్రత్యేక బలమునిచ్చును. మనము మోకాళ్లమీద కనిపెట్టుచు దేవుని వాక్యమును చదువుచున్నప్పుడు ఆ అదనపు బలము మనకు లభించును. దేవుని విశ్వమునందు ఎక్కడికైనను వెళ్లుటకు మనకు మరుగైన మన్నా ఇవ్వబడును. మనుష్యులు చంద్రునిమీద నిలువజాలరు కాని దేవుడు మనలను పంపినయెడల మనమెక్కడికైనను వెళ్లగలము.
జయించువానికి తెల్లరాయి కూడా వాగ్దానము చేయబడినది. Numbers 27:21 లో మనము ఊరీమును గూర్చి చదువుచున్నాము, దీని ద్వారా ప్రధానయాజకుడు దేవుని చిత్తమును కనుగొనగలిగెను. తెల్లరాయి సహాయముతో మనము కూడా దేవుని చిత్తమును కనుగొనగలము. మనము దేవుని వాక్యమును చదువుచు ప్రార్థించుచున్నప్పుడు, దేవుడు తన చిత్తమును చూపు ఒక వచనమునిచ్చును. దేవుడు తెల్లరాయి ఇచ్చునప్పుడు, దానితోపాటు అన్ని ప్రశ్నలకు జవాబిచ్చు సామర్థ్యమును కూడా ఇచ్చును.
నాలుగవ కాలము (Rev. 2: 18-29)
సంఘ చరిత్రలో నాలుగవ కాలము తుయతైర సంఘము కాలము.
అది మనుష్యులు రక్షణ పొందుటకు నకిలీలను, పరిశుద్ధ జలమును, ఇతర సాధనములను ప్రయత్నించిన కాలము. క్రీస్తు తనను “అగ్నిజ్వాలవంటి కన్నులును, మేలిమి యిత్తడివంటి పాదములును గల” దేవుని కుమారునిగా పరిచయము చేసికొనుచున్నాడు. ఆయన చెప్పుచున్నాడు: “నా కన్నులను చూడుడి!” ఆయన సన్నిధిలోనికి వచ్చుటవలన, నేను ఆయన కన్నుల అగ్నిలోనికి చూడగలను. నేనలా చేయుటకు తెగింతునా? ఆయన పాదములు యిత్తడివలె ఉండెను. యిత్తడి తీర్పును సూచించుచున్నది. John 3:14 లో యిత్తడి సర్పమును గూర్చి ప్రస్తావింపబడినది. ఆ కథ ఇందులో ఉన్నది Numbers 21:4-9 లో, ప్రజల తిరుగుబాటుకొరకు అగ్నిసర్పముల రూపములో తీర్పు వారి మధ్యకు పంపబడెను. సర్పము లేక సాతాను సంఘము మధ్యన కలవరమును కలుగజేయును, అతడు కలుగజేయు పాపము తీర్పు తీర్చబడనంతవరకు మనము అపవాదిని జయింపజాలము.
లో Genesis 3:15 లో క్రీస్తు సర్పము తలను నలుగగొట్టుననియు, సర్పము ఆయన మడిమను నలుగగొట్టుననియు వాగ్దానము ఇవ్వబడినది. పిలాతు ఎదుట మనుష్యులు కేకలువేసిరి: “అతనిని సిలువవేయుము, సిలువవేయుము!” కాని ఆ నలిగిన మడిమయే మనుష్యునికి విజయమునిచ్చెను (1 Cor.1:18; 1 Cor. 2:2;Gal. 6:14).
Rev, 2:19 లో క్రీస్తు ఈ సంఘము యొక్క క్రియను, ప్రేమను, విశ్వాసమును, సహనమును మెచ్చుకొనెను, కాని అపవిత్రత జరుగుచుండెను. “ఆ స్త్రీయైన యెజెబెలు” తన కపట ప్రవచనములచే, అనైతికతను, విగ్రహములకు అర్పింపబడిన వాటిని తినుటను బోధించుచు అనేక కలవరములను కలుగజేయుచుండెను. ప్రభువు భయంకరమైన తీర్పులను వాగ్దానము చేయుచున్నాడు, కాని Rev. 2:24 లో ఆయన ‘సాతాను లోతైన సంగతులను’ ఎరుగనివారికి ఆదరణ మాటలు చెప్పుచు, దేవుడు వారికి బయలుపరచినదానిని గట్టిగా పట్టుకొనుమని చెప్పుచున్నాడు (Rev. 2:25). తుయతైరలో అనుమతింపబడిన సంగతులను, ముఖ్యముగా మధ్యయుగములలోని రోమన్ కేథలిక్ సంఘపు భయంకరమైన ఆచారములతో పోల్చవచ్చును.
మీ దైవిక జీవితములోనికి బాగ్-స్నాచర్లను (సంచులు దొంగిలించువారిని) అనుమతింపకుడి, ఏలయనగా దీని ద్వారా శత్రువు సందేహమును భయమును తీసికొనిరాగలడు.
జయించువారికి వారు రాజ్యపరిపాలన చేయుదురను వాగ్దానము ఇవ్వబడినది (Rev. 2:26). కాని అందరు రాజ్యపరిపాలన చేయజాలరు. 1 Cor. 6:3 పరిశుద్ధులు దూతలకు తీర్పు తీర్చెదరని మనతో చెప్పుచున్నది. వాగ్దానము చేయబడిన బహుమానము ఇందులో వేకువచుక్క Rev. 2: 28. మరల దేవుని ప్రజలు దేవుని స్వరమునకు సున్నితముగా ఉండుమని చెప్పబడుచున్నారు. మెల్లని స్వరము ఆయనకు దగ్గరగా జీవించుటవలననే వినబడును (i Kings 19:12),
మనము ప్రభువైన యేసుక్రీస్తును ఆయన నిజమైన మహాత్మ్యములో చూచునప్పుడు, అంత్యదినముల చెడుతనమును జయించుటకు మనము శక్తిమంతులమగుదుము. అధ్యాయములు 2, 3 లలో యుగములుగా విప్పబడుచున్న ఆయన సంఘపు చరిత్రను మనము చూచుచున్నాము. ఆయన సేవకులు మరణించినను దేవుని కార్యము ఆగిపోదు.
ప్రకటన గ్రంథము అధ్యాయము 3
ఐదవ కాలము (Rev. 3:1-6)
ఐదవ కాలము సార్దీసు సంఘపు కాలము. చారిత్రికముగా ఇది సంస్కరణ కాలము, రోమన్ కేథలిక్ సంఘములో జరిగిన దుష్టాచారముల కారణముగా, నిరసనయు వేరుపాటును జరిగిన కాలము. వారికి జీవము గలదను పేరు ఉండెను కాని వారు చనిపోయినవారే, ఏలయనగా వారు రోమన్ సంఘపు వస్త్రములను, కొవ్వొత్తులను, అనేక ఆచారములను, ప్రార్థన గ్రంథములను నిలుపుకొనిరి. మన జీవితములలో పరిశుద్ధాత్మకు తన మార్గము లేనియెడల మనము కూడా అనేక ఆచారములచేతను సంప్రదాయములచేతను తీసికొనిపోబడెదము. దేవుని దృష్టిలో వారు ఇంకను చనిపోయినవారే, ఏలయనగా వారు రోమన్ పద్ధతి యొక్క ఆచారములను, సంప్రదాయములను, పద్ధతులను నిలుపుకొనిరి.
ప్రభువైన యేసుక్రీస్తు తనను దేవుని ఏడు ఆత్మలు గలవానిగా పరిచయము చేసికొనుచున్నాడు (Rev. 3:1). ఇవి ఇందులో కూడా పేర్కొనబడినవి Rev. 1:4 మరియు 5:6.
లో Zechariah 4:2 లో ఏడు దీపములు పరిశుద్ధాత్మ యొక్క ఏడు రెట్ల కార్యమును సూచించుచున్నవి. ఇది ఒక పరిపూర్ణమైన కార్యము, కేవలము ఒక అనుభవము మాత్రమే కాదు. దీపములు నిరంతరము నింపబడవలెను. మనకు అవసరమున్నప్పుడు మనము మరల మరల నింపబడవలెను, Acts 13:9, మన జీవితములలో పరిశుద్ధాత్మ కార్యమును మనము సరిగా అర్థము చేసికొనవలసియున్నది.
1. పరిశుద్ధాత్మకు ఏడు నామములు కలవు.
2. మన జీవితములలో పరిశుద్ధాత్మ యొక్క ఏడు అంతర్గత కార్యములు కలవు.
3. పరిశుద్ధాత్మ యొక్క ఏడు బాహ్య కార్యములు కూడా కలవు మరియు
4. ప్రభువైన యేసుక్రీస్తు జీవితములో పరిశుద్ధాత్మ యొక్క ఏడు రెట్ల కార్యము కలదు.
పరిశుద్ధాత్మ యొక్క ఏడు నామములు.
1. Hebrews 9:14. నిత్యుడైన ఆత్మ నిత్యత్వముకొరకును నిత్యమైన సంగతులకొరకును మనలో వాంఛను కలుగజేయును.
2. Romans 1:4. పరిశుద్ధత ఆత్మ మనలను క్రీస్తు వలె చేయుటకు మనలో కార్యము చేయును. నేను ఆయనవలె ఉన్నానా? ప్రభువు నా జీవితమునందు తృప్తిపడుచున్నాడా?
3. John 14:16, ఆదరణకర్త, దేవుని ప్రేమను మనము పూర్తిగా అనుభవించునట్లు చేయును; అది ఏదో ఒక భావోద్వేగము కాదు, కాని దేవుని పవిత్రమైన ప్రేమయే (Romans 5:5), జ్ఞానమునకు మించిన ప్రేమ (Ephesians 3:19). మనము ఆయన సంపూర్ణతతో నింపబడవలెననునదే మనకొరకైన దేవుని చిత్తము.
4, John 14:17, సత్యస్వరూపియైన ఆత్మ, మనకు అన్ని సంగతులను నేర్పించును. (John 15:5) “నేను లేకుండ,” అని ఆయన చెప్పుచున్నాడు, “మీరు ఏమియు చేయలేరు.”
5. Galatians 4:6. ఆయన కుమారుని ఆత్మ మనలను ధైర్యముగా ‘నా తండ్రీ’ అని పలుకునట్లు చేయును, ఆయనే స్వయముగా చెప్పినట్లు: “నా తండ్రియు మీ తండ్రియు” (John 20:17). ఆత్మ నేను ఆయనను నా తండ్రి అని పిలువగలనను హక్కు భావమును నాకిచ్చును.
6. 2 Timothy 1:7. శక్తియు ప్రేమయు స్వస్థబుద్ధియు గల ఆత్మ. మనము బైబిలు గ్రంథమంతటిని ఉపయోగింపవలెను, ఇది తప్పుడు బోధలనుండి మనలను కాపాడును.
7. 1 John 2:27. అభిషేకము. ఆత్మ ద్వారా మనము మన జీవితమంతటను నేర్చుకొనుచునే యుందుము. మనము ఒక్క దినములోనే అన్నిటిని నేర్చుకొనజాలము, కాని మనము స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు అభిషేకము ద్వారా మనకు నేర్పబడును, Matt. 13:17.
పరిశుద్ధాత్మ యొక్క ఏడు రెట్ల అంతర్గత కార్యములు. వృక్షము వేళ్ల వలె ఇవి కనబడవు.
1. Eph. 1:13. మనము వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మతో ముద్రింపబడియున్నాము, ఇది మనము ప్రభువు స్వాస్థ్యమని చూపించుచున్నది.
2. 1 Cor, 12:13. మనము ఒక్క ఆత్మచేత బాప్తిస్మము పొంది ఆయన శరీరముగా ప్రభువుతో కూర్చబడియున్నాము.
3. Eph. 1:14. ఆత్మ మన స్వాస్థ్యమునకు మాచ్చెరవుగా ఉన్నాడు, పరలోక స్వాస్థ్యము యొక్క డిపాజిటు, 1 Peter 1:4, పరలోకమునందు మనకొరకు కాచియుంచబడినది, అక్కడ మనకు ఒక భాగము కలదు. క్రీస్తునందు సమస్తమును నాకు చెందియున్నవి.
4, Eph. 1:17, ఆయన జ్ఞానమును ప్రత్యక్షతయు గల ఆత్మ. Matt. 16:22 లో పేతురు అర్థము చేసికొననందున ప్రభువైన యేసుక్రీస్తును గద్దింపనారంభించెను. కాని ప్రభువు అతనిని ఎత్తయిన కొండమీదికి తీసికొనిపోయెను, (Matt. 17:1) అతడు అర్థము చేసికొనలేని సంగతులను అతనికి చూపించుటకు.
5. Eph. 3:16. ఆయన బలపరచు ఆత్మ కూడా.
6. 1 Peter 1:2, ఆయన పరిశుద్ధపరచు ఆత్మ. విధేయతకొరకు మనకు రక్తపు ప్రోక్షణ అవసరము.
7. 1 John 2:27. ఆయన బోధించు ఆత్మ.
మన జీవితములలో దేవుని పరిశుద్ధాత్మ కార్యమును మనము పూర్తిగా అనుభవించుచున్నామని మనము నిశ్చయపరచుకొనవలెను.
మన జీవితములలో పరిశుద్ధాత్మ యొక్క ఏడు రెట్ల బాహ్య కార్యములు.
వృక్షము కాండము, కొమ్మల వలె ఇవి కనబడును.
I. Rom. 8:9 అంతర్నివాస ఆత్మ. పరిశుద్ధాత్మ మనలను తనకు తగిన నివాసస్థలముగా చేయును. ఆయన మనలను ప్రేమతోను, ఆనందముతోను, సమాధానముతోను, సాధుత్వముతోను నింపును. మనము మనంతట మనము వినయస్థులము కాజాలము. దేవుని నివాసస్థలముగా ఉండుటకు ఆయనచేత సిద్ధపరచబడవలెననునదే మన వాంఛగా ఉండవలెను.
2. Rom. 8:11 జీవదాయక ఆత్మ మన మర్త్యశరీరమును జీవింపజేయును; దినపు అవసరతకొరకు ఆయన మనకు అదనపు బలమునిచ్చును; మన పనులను నమ్మకముగా చేయుటకు మనకు సహాయపడును; సువార్త కార్యము చేయుటకు మనకు బలమునిచ్చును.
3. Rom. 8:14 మార్గదర్శక ఆత్మ ఆయనచేత నడిపింపబడుటను మనకు నేర్పించి దేవుని చిత్తమును కనుగొనుటకు మనకు సహాయపడును.
4. Rom. 8:15 దత్తపుత్రత్వ ఆత్మ మనలను పరిపక్వతకు తీసికొనివచ్చును. ఒక కుమారుడు యుక్తవయస్సు వచ్చినప్పుడు, తన తండ్రి పత్రములమీద సంతకము చేయు అధికారము అతనికియ్యబడి, ఇంటి తాళపుచెవి ఇయ్యబడుట ఆచారముగా ఉండెను. అనేకమంది విశ్వాసులు ఆత్మీయముగా పసిపిల్లలుగానే ఉండిపోవుదురు. వారు కూటములకు మాత్రమే వెళ్లి ఇంటికి తిరిగివచ్చెదరు. వారు వారము వారము అదే స్థానములో కూర్చొందురు, కాని ఏ బాధ్యతను తీసికొనజాలరు. మీరు దేవుని కొరకు స్వయముగా ఏమి చేయగలరో చూచుటకు చుట్టుప్రక్కలను చూడుడి, ఎవరును మీకు నేర్పించవలసిన అవసరము లేదు.
3. Rom. 8:16 సాక్ష్యమిచ్చు ఆత్మ, పరలోక స్వాస్థ్యములో మనకు క్లెయిము చేసికొనవలసిన భాగము కలదని మనకు నేర్పించును. జయించువాడు సమస్తమును స్వతంత్రించుకొనును. పరిశుద్ధాత్మ మనకు నేర్పించుటకును, పరలోక స్వాస్థ్యములో మన భాగమును క్లెయిము చేసికొనుటకు మనకు సహాయపడుటకును అక్కడ ఉన్నాడు.
6. Rom. 8:26 బోధించు ఆత్మ మనకు ఎలా ప్రార్థింపవలెనో నేర్పించును. ఆయన దేవుని చిత్తానుసారము ప్రార్థించుటకు మనకు సహాయపడును (1 John 5:14) మరియు దేవుని మనస్సును తెలిసికొనుటకు.
7, Rom. 8:27 విజ్ఞాపన చేయు ఆత్మ మనకొరకు విజ్ఞాపన చేయును. కొందరు శోధనలలో పరీక్షలలో గుండా వెళ్లుచుందురు, మనము ప్రార్థించుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ ఎందుకో మనకు తెలియకపోయినను అట్టివారికొరకు ప్రార్థించు భారమును మనకిచ్చును. కొన్నిసార్లు దేవుడు నన్ను రాత్రి ప్రార్థనా భారముతో మేల్కొల్పియున్నాడు.
ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించి పరిశుద్ధాత్మ యొక్క ఏడు రెట్ల కార్యము
I. Luke 1:34, 35 ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ చేత గర్భము దాల్చబడెను.
2. Matt. 3:16 ఆయన బాప్తిస్మము పొందిన తరువాత దేవుని ఆత్మ ఆయనమీదికి వచ్చెను.
3. ప్రభువైన యేసు ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడెను (Matt. 4:1). శోధనకు ముందు ఆత్మ ఆయనను సిద్ధపరచెను. మన ముందున్న సంగతులకొరకు ఆయన మనలను కూడా సిద్ధపరచును.
4, Isaiah 9:6 ప్రభువైన యేసు పరిశుద్ధాత్మచేత అభిషేకింపబడెను, Isaiah 11:2. తాను వచ్చిన కార్యమునకు తనను సన్నద్ధపరచుటకు జ్ఞానమిచ్చు ఆత్మ ఆయనకివ్వబడెను, Isa. 61:2-5. ఈ విధముగా ఆయన అధికారముతో మాటలాడగలిగెను; Matt. 7:29; John 7:46; Luke 4:22, 32.
5. Isa. 42: 1-3 ఆయన అన్నిటిని మిక్కిలి సహనముతో సహించెను, దేవుని ఆత్మ ఆయనమీద ఉన్నందున ఆయన నిరుత్సాహపడలేదు.
6. Isa. 61:1-3 పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సహనముతోను ప్రేమతోను సువార్తను ఇచ్చెను (Acts 10:38). ఆయన మాటలాడినది అధికారము క్రిందనుండెను.
7. Rom. 1:4 పరిశుద్ధత ఆత్మ చేతను, మృతులలోనుండి పునరుత్థానము చేతను ఆయన దేవుని కుమారుడని నిరూపింపబడెను.
ఈ సంగతులన్నిటిని కలుపుకొనగా, పరిశుద్ధాత్మతో నింపబడుట అనగా ఏమిటో మనము అర్థము చేసికొనగలుగుదుము, మనము మనమే ఆత్మతో నింపబడియున్నామా అని తెలిసికొనగలుగుదుము. మనము గత అనుభవమేదో దానిమీద ఆధారపడజాలము.
ఏడు ఆత్మలు (Rev. 3:1)
అనేకులు సాధారణ వస్త్రములు, మాంసము తినకుండుట, మఠములో నివసించుట, పరిశుద్ధ బూడిద, పరిశుద్ధ తైలము వంటి బాహ్య సంగతులను బట్టి నడుచుకొందురు. కాని ఇవి మనము ఆత్మతో నింపబడియున్నామని రుజువుచేయవు. మనము నింపబడగలమను మాట నిజమే, కాని దేవుని ఏడు ఆత్మల భావమును అర్థము చేసికొనినప్పుడు మాత్రమే మనము నింపబడగలము.
మనము ఆయన పరిపూర్ణ చిత్తములోనికి రానంతవరకు ప్రభువు తృప్తిపడడు (v.2). మనము ప్రతిదానిని మనుష్యులకు చేయుచున్నట్లుగాక ప్రభువుకు చేయుచున్నట్లు మనఃపూర్వకముగా చేయవలెను, Col. 3:23.
దేవుని మంచిదియు, అనుకూలమైనదియు, పరిపూర్ణమైనదియునైన చిత్తమేదో మనము పరీక్షింపవలెను. మరియు మనము దేవుని పరిపూర్ణ చిత్తములో జీవించుచున్నామేగాని, ఆయన అనుమతి చిత్తములో కాదని మనము నిశ్చయపరచుకొనవలెను, Rom. 12 :2.
మనము లోకసంబంధమైన సహవాసములన్నిటినుండి విడుదల పొందియుండవలెను, Rev. 3:4. విశ్వాసికి అతిపెద్ద ప్రమాదము లోకసంబంధమైన సహవాసములనుండి వచ్చును. లోకముతో సహవాసము చేయువారు వస్త్రధారణను, కేశాలంకరణను, సంభాషణను అనుకరించెదరు. మనము లోకమును అనుకరింపకుండునట్లు జాగ్రత్తపడవలెను. శరీరముచే మురికిపడిన వస్త్రమునైనను మనము ద్వేషింపవలెను (Jude 23). ఫ్యాషనులు కామవాంఛలను రేకెత్తించుటకును మనుష్యులను కామమునకు బానిసలుగా చేయుటకును రూపింపబడినవి, చివరకు వారు ఫ్యాషనుకొరకు మాత్రమే గాక కామముకొరకే వస్త్రధారణ చేసికొందురు. విశ్వాసులు లోకమును అనుకరించినయెడల, వారి హృదయములు అపవిత్రతతో నిండియుండును. మన సౌందర్యము పరిశుద్ధతయే (v.45); 1 Chron. 16:29; Psalm 110:3. 1 Peter 3:2-5 నిజమైన సౌందర్యము యొక్క రహస్యమును మనతో చెప్పుచున్నవి. v.5 లో జయించువానికి వాగ్దానము చేయబడిన తెల్లని వస్త్రము పరలోక సౌందర్యమును సూచించుచున్నది.
జయించువాని పేరును జీవగ్రంథము నుండి తుడిచివేయననికూడ ఆయన వాగ్దానము చేసియున్నాడు. ఆయన నామమును ధైర్యముగా ఒప్పుకొనువారికి ఇది ఒక ప్రత్యేక వాగ్దానము. మనము ఆయనను ధైర్యముగా ఒప్పుకొనినయెడల మనము బహుమానము పొందుదుము (Luke 12:4-9). అనేకమంది విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి మాటలాడుటకు సిగ్గుపడుదురు, కాని మన ధైర్యమైన సాక్ష్యము ద్వారా మనము జయించువారిగా ఒప్పుకొనబడి బహుమానము పొందుటకు యోగ్యులమగుదుము.
ఆరవ కాలము (Rev. 3:7-13)
ఆరవ కాలము, ఫిలదెల్ఫియా కాలము (Rev. 3:7) మిషనరీ కాలము, సువార్త లోకమునకు తీసికొనిపోబడనారంభించిన కాలము. 1000 సంవత్సరములపాటు ఇతరులకొరకు భారము లేకపోయెను. నశించినవారికొరకు శ్రద్ధ లేకపోయెను, దీనికారణముగానే వెస్లీ బహిరంగప్రదేశములలో సువార్తను ప్రకటించినందుకు హింసింపబడెను. ఇక్కడ ప్రభువు తనను మూయువానిగాను ఎవడును తీయజాలడు, తీయువానిగాను ఎవడును మూయజాలడు అని పరిచయము చేసికొనుచున్నాడు.
ఒకసారి ఒక యువ జిప్సీ బాలికను ఒక చిత్రకారుని స్టూడియోకు పిలిచిరి. ఆ స్టూడియోలో సిలువవేయబడుటను చిత్రించు ఒక చిత్రపటము ఉండెను. ఆ పేద బాలిక అంతకుముందెన్నడును అటువంటి చిత్రమును చూడలేదు, దాని భావమును చిత్రకారుని అడిగెను. క్రీస్తు ప్రేమను త్యాగమును గూర్చిన కథను వినుచుండగా, ఆమె ఆయన రక్షణను అంగీకరించి నూతనజన్మ పొందెను. ఆమె చనిపోవుచుండగా, క్రీస్తు మరణమును గూర్చి తనకు తెలియజేసినందుకును, అది తనకు తెచ్చిన ఆనందమునకు సమాధానమునకును కృతజ్ఞతలు తెలుపుటకు చిత్రకారుని పిలిపించెను. చిత్రకారుడు తానే తాను ఆమెకు చెప్పిన రక్షణను అంగీకరింపలేదని. అనేకదినములు ఆ ఆలోచన అతనితోనే ఉండెను, చివరకు అతడు కూడా క్రీస్తువైపు తిరిగి ఆయన రక్షణను అంగీకరించెను. అటుపిమ్మట అతడు సిలువవేయబడుటను చిత్రించు మరియొక చిత్రపటమును చిత్రించెను, దాని క్రింద ఈ మాటలను వ్రాసెను; “నీకొరకు నేనీ సమస్తమును చేసితిని, నా కొరకు నీవేమి చేసితివి?” కొన్ని సంవత్సరముల తరువాత ఒక సరదా యువ కౌంటు ఆ చిత్రపటము వ్రేలాడదీయబడిన గ్యాలరీని సందర్శించెను. అతడు రక్షకుని ముఖములోని వేదనను చూచుచు ఆ మాటలను చదువుచు, గంటలతరబడి దాని ఎదుట నిలిచియుండెను. అతడు మార్పుచెందిన మనుష్యుడై బయటికి వచ్చెను, తన ఐశ్వర్యమంతటిని క్రీస్తు పాదములయొద్ద పెట్టి, ఈ రక్షణ యొక్క శుభవార్తను ఇతరులకు తెలియజేయుటకు మొరేవియన్ మిషనును స్థాపించెను.;
Rev. 3:7 ధైర్యమైన సాక్ష్యము ద్వారా సువార్త ఇతర దేశములకు ఎలా తీసికొనిపోబడెనో మనతో చెప్పుచున్నది. మనము అధికారముతో ప్రకటించుచున్నప్పుడు, ఎవడును మూయజాలని ఒక తెరచిన తలుపు మన ముందు ఉంచబడును. కాని ఈ తెరచిన తలుపును కనుగొనుటకు, మనము దేవుని చిత్తమును తెలిసికొనవలసియున్నది.
నేను మొదట ప్రభువుకొరకు కార్యము చేయనారంభించినప్పుడు, నేను ప్రతిచోటికి కరపత్రములను పంచిపెట్టితిని కాని ఏమియు జరుగలేదు. తరువాత నేను దేవుని చిత్తమును కనుగొనుటను నేర్చుకొంటిని. తలుపులు మూయబడిన చోట, వాటిని తీయుటకు ప్రయత్నింపకుడి. దేవుడు మీరెక్కడికి వెళ్లవలెనని కోరుచున్నాడో కనుగొనుడి. వాతావరణమును బట్టి వెళ్లకుడి! ఒకనాడు నేను వర్షములో ప్రకటించుచుండగా, ఆత్మలు నూతనజన్మ పొందెను. నామమాత్రపు క్రైస్తవులు ఎగతాళి చేయుదురు, కాని తరువాత దేవుడు మీతోనున్నాడని వారు అంగీకరించెదరు (v.9).
Rev. 3:10 వచ్చుచున్న కాలములో శత్రువు మిక్కిలి క్రియాశీలముగా ఉండుననియు, కాని ఓర్పుచేతను సహనముచేతను మనము అతనిని జయించెదమనియు మనతో చెప్పుచున్నది (Matt. 24:13).
v.11 లో, ప్రభువు తన మలిరాకడకు మన హృదయములను సిద్ధపరచుటకు వారము వారము రొట్టె విరుచుటను మనకిచ్చియున్నాడని ప్రకటించుచున్నాడు. మనమిందులో చూచుచున్నాము 1 Cor. 11:26 ఇది ఒక క్రతువుగానీ ఆచారముగానీ కాదనియు, ఆయన వచ్చువరకు మనము మెలకువగాను ప్రార్థనాశీలురముగాను ఉండుటకు సహాయపడుటకేననియు.
v.12 లో జయించువారికి ఆయన వాగ్దానము నాలుగు రెట్లుగా ఉన్నది. జయించువాడు “నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా” ఉండును. ఇతర విశ్వాసులకు బలము యొక్క మూలముగా. అతడు “నా దేవుని పట్టణము పేరును, నా క్రొత్త పేరును, అన్నిటికంటె మిన్నగా నా దేవుని నామమును” ధరించును. క్రొత్త పేరు అనగా మనము దేవుని ఆమోదమును గెలుచుకొంటిమని అర్థము. అబ్రాహాము పేరు ఇరువది ఐదు సంవత్సరముల తరువాత మార్చబడెను. సౌలు పౌలు అని పిలువబడెను, (Acts 13:2). దీని భావమేమనగా, మనము నమ్మదగినవారము, దేవునిచే ఆమోదింపబడినవారము, పూర్ణ విధేయతలో ఉన్నవారము, పరిపూర్ణముగా పరీక్షింపబడి, శోధింపబడి, మిక్కిలి సన్నిహిత సంబంధములో వేరుపరచబడినవారము. మనకు నూతన యెరూషలేము పేరు ఇయ్యబడును, ఏలయనగా మనము జయించినప్పుడు, నూతన యెరూషలేములో మన భాగమును అర్థము చేసికొందుము, మరుగైన మర్మములను కూడా అర్థము చేసికొనగలుగుదుము, (Gen.18:17; Deut. 29:29). రహస్య సంగతులు బయలుపరచబడును, భవిష్యత్తులో ఏమి జరుగనున్నదో మనకు తెలియజేయబడును,
ఏడవ కాలము (Rev. 3:14-22)
ఇది లవొదికయ కాలము. ప్రభువు తనను ఆదియు అంతమునుగా పరిచయము చేసికొనుచున్నాడు. ఆయనే సృష్టియందు ఆదియైయున్నాడు. ఆయన మాటలాడగా అది వెంటనే జరిగెను, శతాబ్దములపాటు కాదు. v.15 లో ఆయన సంఘముతో వారు తన దృష్టిలో మిక్కిలి వేడిగాగాని చల్లగాగాని లేక వెచ్చగా ఉన్నారని, దేవుని కార్యముకొరకు ఆకలి లేకుండ, కేవలము యథావిధిగా, మంచివారుగాను గౌరవప్రదులుగాను కనిపించవలెనని, అనేక పుస్తకములు, భవనములు, ధనమును కలిగియుండవలెననే వాంఛను కలిగియున్నారని చెప్పుచున్నాడు. v.18 లో ఆయన వారితో బంగారమును కొనుమని చెప్పుచున్నాడు, అనగా జీవముగల విశ్వాసమును కలిగియుండుమని, (1 Pet.1:7) ప్రభువును మన నీతిగా ఎట్లు క్లెయిము చేసికొనవలెనో నేర్చుకొనుమని.
ఈ భావమును మనమిందులో కలిగియున్నాము Col. 3:4, క్రీస్తు మన జీవము, లేనియెడల మనము దేవుని ఎదుట దిగంబరులమై యున్నాము. ఇతరులు మన దిగంబరత్వమును చూడగలరు, ఆయన జీవమును నీతిని క్లెయిము చేసికొనుటవలననే మనము కప్పబడెదము. ఆయన వారికి కంటిమందు వాడుమని సలహా ఇచ్చుచున్నాడు. కళ్లజోళ్లు లేని కాలములో ప్రజలు కంటిమందును వాడిరి, ఆత్మీయముగా మనము స్పష్టముగా చూడలేనప్పుడు మనకు ఆత్మీయమైన కంటిమందు అవసరము. మన ప్రార్థన ఇట్లుండవలెను, “ప్రభువా, నా కన్నులను ముట్టుకొనుము”. మనము పెద్ద పుస్తకములచేతను, హీబ్రూ, గ్రీకు భాషలచేతను ఈ సంగతులను అర్థము చేసికొనజాలము, ప్రభువు మన కన్నులను తెరచినప్పుడే మనము అర్థము చేసికొందుము (1 John 2:27),
ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించును (v.19), మనము ఆయన పరిశుద్ధతలో పాలుపొందవలెనన్నయెడల మనము శిక్షింపబడవలెను (Heb. 12:10).
ప్రభువు తలుపు తట్టినప్పుడు, వెంటనే తలుపు తెరువుడి (Rev. 3: 20). ఒకసారి ఒక్క దినములో ఐదుసార్లు ప్రకటించిన తరువాత నేను మిక్కిలి అలసటతో పండుకొంటిని. అప్పుడు నేను తలుపు తట్టుటను వింటిని, కాని నేను తలుపు యొద్దకు వెళ్లినప్పుడు అక్కడెవ్వరును లేరు. మరల తలుపు చప్పుడు వచ్చెను, ప్రభువు చెప్పెను: “లేచి ప్రార్థింపుము”. ఇది నాకు ఐదు రాత్రులు జరిగెను. ఆదివారపు సందేశము తరువాత నేను ప్రజలను వెనుక ఉండుమని పిలిచితిని, సాక్ష్యము గలవారెవరైనను మాటలాడవలెనని చెప్పితిని. పది సంవత్సరముల వయస్సుగల ఒక బాలుడు సాక్ష్యమిచ్చెను. అటుపిమ్మట అదే వయస్సుగల మరియొక బాలుడు స్పష్టమైన సాక్ష్యమిచ్చెను. అటుపిమ్మట ఉపాధ్యాయుడు ప్రార్థనకొరకు అడిగెను, వెంటనే ఒక గొప్ప రోదన లేచెను. ప్రజలు కనికరముకొరకు ఏడ్చిరి. నేనడిగితిని, “మీలో ఎంతమంది నూతనజన్మ పొందలేదు? అందరు నూతనజన్మ పొందువరకు మనము ఇంటికి వెళ్లము”. కావున అందరు నూతనజన్మ పొందువరకు మనము ఏడు గంటలు ప్రార్థనలో కొనసాగితిమి. తలుపు చప్పుడు విశ్వాసికొరకైనది, అవిశ్వాసికొరకు కాదు. ప్రభువు తలుపు తట్టినప్పుడు, తప్పక వెంటనే తెరువుడి.
ప్రకటన గ్రంథము యొక్క సందేశము Rev.21:7 లో కేంద్రీకృతమైయున్నది, “జయించువాడు వీటినన్నిటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనైయుందును, అతడు నాకు కుమారుడైయుందును.” ప్రేమగల దేవుడు నూతన సృష్టి యొక్క సమస్త సంగతులను మనకిచ్చుటకు వాంఛించుచున్నాడు, కాని మనము జయించనియెడల వాటిని అనుభవింపజాలము. ఈ గ్రంథములో మనము ఎలా జయించవలెనో నేర్పబడుచున్నాము. అధ్యాయములు 4, 5 లలో మనము పరలోక సంఘములో ప్రభువైన యేసుక్రీస్తు మహిమను చూచుచున్నాము. ప్రభువైన యేసుక్రీస్తుతో మన ఏకత్వము యొక్క ఒక సంగ్రహదర్శనము మనకివ్వబడినది. ఏలయనగా, మనము ఆయనను చూచునప్పుడు, మనము ఆయనవలె ఉందుము. ఇంజనీర్లు ఒక భవనము పూర్తియైనప్పుడు అది ఎలా ఉండునో చిత్రము ద్వారాను నమూనా ద్వారాను చూపగలరు. అదే విధముగా ఈ అధ్యాయములు పరలోకములో పరిపూర్ణమైన సంఘమును చూపించుచున్నవి. Rev. 4:2 ఆయన సింహాసనము యొక్క మహిమను బయలుపరచుచున్నది. “...ఆసీనుడైయున్నవాడు సూర్యకాంతమణివలెను రక్తవర్ణపు రత్నమువలెను కనబడెను” (v.3). ఈ రత్నములు మండునంత తేటదనముతో నిర్మలముగా ఉండును. అవి దేవుని పవిత్రతను పరిశుద్ధతను సూచించుచున్నవి.
ఇంద్రధనుస్సు దేవుని నిబంధనకు గురుతు-పరిశుద్ధమైన వెలుగు తన ఏడు రంగులుగా విభజింపబడినది Gen.9 :11-17. ఇక్కడ మొదటి ఇంద్రధనుస్సు మనుష్యులతో దేవుని నిబంధనకు ఒక సూచనగా ఉండెను. దేవుని సింహాసనములో పాలుపొందవలెనను వాంఛ మనకు కలిగినప్పుడు, ఆయన ఇందులో వాగ్దానము చేసినట్లు Rev. 3:21, మనము ఇన్ని మానవ పరిమితులతో అది ఎట్లు చేయగలమని ఆశ్చర్యపడుదుము. మనము మనమెలా ఉన్నామను దానిని బట్టి కాదుగాని దేవుని నిబంధనను బట్టి సింహాసనములో పాలుపొందెదము (Psalm 89:34). ఆయన వాగ్దానము చేయుచున్నాడు: “నా నిబంధనను నేను భంగము చేయను”. దేవుడు దేవుడైయున్నందున ఆయన తన వాగ్దానములను నెరవేర్పవలెను. దేవుడు అబద్ధమాడజాలడు, ఆడడు. ఆయన నిబంధన నిలుపు దేవుడు (Num. 23:19). ఆయన మారని ఒక శాసనమును చేయును (Psalm 148:6). ఆయన పిలిచునప్పుడు, ఆయన నమ్మకమైనవాడు (1 Thess 5:24). ఇంద్రధనుస్సు దేవుని నమ్మకత్వమునకు గురుతు. మనము నమ్మి ఆయన వాగ్దానములను క్లెయిము చేసికొనవలెను.
కార్యారంభములో దేవుడు మనకు ఒక పెద్ద ఆవరణమును చూపి ఇందులో తన వాగ్దానమునిచ్చినప్పుడు మనకీ అనుభవము కలిగెను 1 Chron. 29:1 - “... ఈ నగరు మనుష్యునికొరకు కాదు, యెహోవా దేవునికొరకు”, ఆ ఇంటి వెనుక భాగము శిథిలావస్థలో ఉండెను, నివసించుటకు క్షేమకరముగా లేకుండెను. ఆ ఇల్లు ఖాళీ అగుటకు అవకాశమేదైన కలదేమోయని మేము విచారించితిమి, మాకు చెప్పబడినది: “అవును, కాని ఇంటియజమాని ఏ మరమ్మతులు చేయించడు!” జూలై 12వ తేదీన ఆ ఇల్లు ఖాళీ చేయబడవలసియుండెను. అప్పుడు మేము ఇంటియజమానిని కలిసి కార్యము దేవునికొరకైనదని చెప్పితిమి, అతడు వెంటనే చెప్పెను, “నేను భవనమును మరమ్మతు చేయింతును. మీరు లోపలికి వచ్చి ఉండవచ్చును, మరమ్మతులు పూర్తియగువరకు అద్దె చెల్లింపవలసిన అవసరము లేదు”. ఆ తరువాత అద్దెకొరకు డబ్బు వచ్చెను.
దేవుడు చెప్పినదానిని మనము నమ్మి దానిని పట్టుకొనవలెను. ఒకసారి ప్రభువు నన్ను విదేశములకు వెళ్లుటకు సిద్ధపడుమని చెప్పి నాకిచ్చెను Zech. 9:10. భారీ బుకింగులు ఉండెను, పొడవైన వెయిటింగు లిస్టు ఉండెను. మానవదృష్టిలో ఏ అవకాశము లేకుండెను. నా నిశ్శబ్ద సమయములో ప్రభువు నాకిచ్చెను Isa. 43:16, “సముద్రములో మార్గము చేసెదను”. నేను బుకింగు కార్యాలయములోనికి నడచుకొనిపోయినప్పుడు, అధికారి చెప్పెను: “భారత ప్రభుత్వ ఉద్యోగికొరకు ఒక్క స్థానము మాత్రమే కలదు. మీరు ప్రభుత్వ ఉద్యోగినా?” నేను దేవుని సేవకుడనని అతనితో చెప్పితిని: “అది సరిపోవును” అని అతడు చెప్పి నాకు ప్రయాణ టికెట్టు ఇచ్చెను. దేవుని వాగ్దానములను ఎలా పట్టుకొనవలెనో మనము నేర్చుకొనవలెను.
ఇంద్రధనుస్సులో ఏడు రంగులు కలవు, అవి ఏడు నిబంధనలను సూచించుచున్నవి:
ఏడు నిబంధనలయందు మనము నమ్మినప్పుడు మనము ఆత్మీయముగా ఇంకను ఇంకను హెచ్చుగా ఎదుగగలము. మనవంటివారితో నిబంధన చేయుటకు దేవుడు దిగివచ్చుట అంతయు కృపయే. అటువంటి దయకు మనము యోగ్యులము కాము (1 Cor. 15: 10). ఆయన ఇచ్చునది, ఆయన తన నిస్సంశయమైన కృపనుండి ఇచ్చును. పాతనిబంధన కాలములోని దైవజనులు దేవునికి ఆయన వాగ్దానములను జ్ఞాపకము చేసిరి. మనము కూడా దేవుని వాగ్దానములను క్లెయిము చేసికొనుట ద్వారా ముందుకు సాగుటకు బలము పొందగలము, 1. దేవుడు ఆదాముతో ఒక నిబంధన చేసెను ఇందులో Gen. 3:15, సాతాను తనకు విజయము వచ్చెనని తలంచెను, కాని హవ్వ మోసగింపబడినప్పటికిని, స్త్రీ సంతానము సాతాను తలను నలుగగొట్టుననియు దేవుడు వాగ్దానము చేసెను. క్రీస్తునందు నేను జయింతును, ఏలయనగా ప్రభువైన యేసుక్రీస్తు ఓడింపబడలేదు, ఓడింపబడజాలడు. నేను పడిపోవచ్చును, కాని ప్రభువైన యేసుక్రీస్తు విజయవంతుడు. నేను కూడా ఆయన విజయమును స్వీకరించినయెడల విజయవంతుడనగుదును. Micah 7:8, “నేను పడిపోయినను తిరిగి లేతును”. Psalm 37:24 “అతడు పడిపోయినను బొత్తిగా పడద్రోయబడడు”, మనము బైబిలు జ్ఞానముచేతగాని, సంకల్పబలముచేతగాని, సూచనలచేతగాని, అద్భుతములచేతగాని ఎన్నడును సాతానును జయింపజాలము. మనము విలువైన రక్తమును సిలువ విజయమును క్లెయిము చేసికొనవలెను.
లో Ephesians 1:16 నుండి 22 వరకు మనము క్రీస్తు విజయమును గూర్చి చదువుచున్నాము, అధ్యాయము 2:1 లో అది మనవరకు విస్తరించుచున్నది. క్రీస్తు విజయము మనకొరకైనది, మనము ఆయన పునరుత్థాన శక్తిని స్వీకరించి, ఆ విజయమునే క్లెయిము చేసికొనుచున్నప్పుడు.
Rom. 8:37 క్రీస్తు ద్వారా మనము అత్యధిక విజయము పొందినవారమని మనకు నిశ్చయత నిచ్చుచున్నది. కొందరు జ్ఞానముకొరకును సూచనలకొరకును అద్భుతములకొరకును ఆరాటపడుదురు, కాని శక్తి సిలువయందు, సిలువ ద్వారానే వచ్చును, ఏలయనగా సిలువయే దేవుని శక్తి (1 Cor. 1:18).
2. దేవుని రెండవ నిబంధన నోవహుతో చేయబడెను. (Gen. 9:9-11) దేవుని కనికరములు అంత గొప్పవి (Isaiah 44:22 మనము మనుష్యులతో నిర్భయముగా చెప్పగలుగుదుము, వారి పాపము ఎంత గొప్పదైనను, వారు దేవుని యొద్దకు తిరిగివచ్చి క్షమాపణ పొందగలరని. మిక్కిలి చెడ్డ రకమైన మనుష్యులు కూడా క్షమింపబడగలరు. అనేకులు తాము విఫలమైతిమని భావింతురు, కావున వారెట్లు జయించువారు కాగలరు? మనము ఆయన కనికరములను క్లెయిము చేసికొనవలసినదే (Psalm 89:1). మనము క్రీస్తు యొక్క విలువైన రక్తమును దూషింపనంతవరకు మన పాపములు క్షమింపబడగలవు,
3. దేవుని మూడవ నిబంధన అబ్రాహాముతో-ఒక నిత్యనిబంధన (Gen. 17:19). తన వృద్ధాప్యములో దేవుడు తనకొక కుమారుని అనుగ్రహించుననియు అబ్రాహాము నమ్మెను. మొదట అటువంటి స్పష్టమైన అసంభవమును నమ్ముటలో అతనికి కష్టముగా ఉండెను, కాని తరువాత నమ్మెను. దేవుడు చెప్పెను, “యథార్థముగా నడువుము. నీ కర్రను పారవేయుము”. అతడు నమ్మి తరువాత ఇంకను ఆరుగురు పిల్లలను కనెను (Gen. 25:1,2; Rom 4:17-24).
విశ్వాసము ద్వారానే మనము జయించెదము. దేవుడు మనకు బలమైన విశ్వాసమునిచ్చుటకు అనేక సాధనములను ఉపయోగించును. దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమాయెను ఇందులో ఆదికాండము 12, మరియు అబ్రాహాము నమ్మెను. కాని దేవుడు తృప్తిపడలేదు; ఆయనకు ఇంకను బలమైన విశ్వాసము కావలెను. దేవుడు తనకు చూపదగిన నూతనమైన ఒకరకమైన శక్తిని కలిగియున్నాడని, అనగా పునరుత్థాన శక్తినికూడా అబ్రాహాము నమ్మవలసివచ్చెను. బలమైన విశ్వాసము మానవుని అర్హత కాదు, కాని దేవుని బహుమానము. ఎన్నోసార్లు ఆందోళనతో భయము అవిశ్వాసము కారణముగా మనము కన్నీరు కార్చుచునే యుందుము,
కొన్నిసార్లు ఆ భయము మనుష్యుల భయమే. ప్రజలు మిమ్మును గూర్చి ఏమి చెప్పగోరుదురో చెప్పనీయుడి. మనము ఈ దేవుని కార్యమును ప్రారంభించినప్పుడు, అనేకులు వ్రాసి మనలను నిందించిరి, కాని మనలను మనము సమర్థించుకొనుటకు మనమేమి ప్రయత్నింపలేదు, ఆయన వాక్యమునకు నిజముగా, మనకు వ్యతిరేకముగా చేయబడిన ఏ ఆయుధమును వర్ధిల్లనీయకుండ దేవుడు కాచెను (Isa. 54:17). కావున భయమునకు అవిశ్వాసమునకు దారియీయకుడి. Phil, 4:6 లో మనము దేనినిగూర్చియు చింతింపవద్దని చెప్పబడుచున్నాము. దేవుని పిల్లలలో ఎందరు ఇంటి అద్దెనుగూర్చి, సామానులనుగూర్చి, భవిష్యత్తునుగూర్చి చింతింతురో. ఈనాడు నాకు కొదువ ఉన్నను, ఒకనాడు ఆయన నన్ను సమస్తమును అనుభవించునట్లు చేయును.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
