మే
మే 1
“అమాలేకీయులు కొనిపోయినదంతయు దావీదు తిరిగి పొందెను... చిన్నదేదైనను పెద్దదేదైనను వారికి లేకపోలేదు.” (1 Sam.30. 18-19).
దావీదును అతని మనుష్యులును గొప్ప భారమైన నష్టమును అనుభవించియుండిరి. వారి ఇండ్లన్నియు తగులబెట్టబడియుండెను, వారి భార్యలును పిల్లలును ఆస్తులును అమాలేకీయులచేత చెరపట్టబడియుండెను. వారి నష్టము ఎంత గొప్పదైనదనగా, వారు బలిష్ఠులైనప్పటికిని, అందరును బిగ్గరగా ఏడ్వ సాగిరి. ఇక్కడ బలమైన సైనికులు, కన్నీళ్లు కార్చుటకు ఇక ఏమియు లేకుండునంతగాను, అంతటి గొంతెత్తియు ఏడ్చుచుండిరి (వ.4). వారి కన్నీళ్లు అన్నియు ఇంకిపోయియుండెను, వారి గొంతులు వేడిగా ఉండెను, వారి తలలు నొప్పిపెట్టుచుండెను, ఇక వారు ఏడ్వలేకుండిరి. వారి నష్టము మానవుని దృష్టిలో పునరుద్ధరణ ఆశకు అతీతమైనంత గొప్పదిగా ఉండెను.
దేవుని సహాయముచేతను కృపచేతను, వారు కోల్పోయినదంతయు, దానికితోడు మరి ఎంతో తిరిగి పొందిరి, అంతగా వారు గత సంవత్సరములలో వారు తెచ్చుకొన్న అప్పులన్నిటిని కూడ చెల్లించగలిగిరి. వారికి ఆశ్రయమును ఆహారమును ఇయ్యబడియుండెను. ఇప్పుడు దావీదు చూపిన దయలను గుర్తించుటకును, తన అప్పులను తిరిగి చెల్లించుటకును బహుమానములను పంపెను. మనము కోల్పోయినదానిని తిరిగి పొందుట ఒక విశేషమైన ఆనందము, మరీ ముఖ్యముగా పునరుద్ధరణకు ఏ ఆశయు లేనప్పుడు.
మన తప్పులవలనను వైఫల్యములవలనను మనకు అనేక ఆత్మీయ నష్టములు కలవు. వాస్తవముగా తమ ఆనందమును కోల్పోయిన అనేకులు కలరు. కొందరు, కష్టములవలనను శోధనలవలనను, తమ విశ్వాసమును కోల్పోయియుందురు. మరికొందరు దేవుని సన్నిధి పట్ల తమ చైతన్యమును కోల్పోయియుందురు. మరికొందరు దేవుని చిత్తమును కనుగొను రహస్యమును ఇంకను నేర్చుకొనలేదు. వారు మొదట తిరిగి జన్మించినప్పుడు కలిగియుండిన పాత శక్తిని అనేకులు కోల్పోయియుందురు. మరికొందరు తమ మొదటి ప్రేమను కోల్పోయియుందురు. నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “భయపడకుము... నీ ప్రార్థన వినబడినది.” Luke1:13
మే 2
“అతడు తీయబడిన నేలను సేద్యపరచుటకు యెహోవా దేవుడు అతనిని ఏదెను తోటనుండి బయటికి పంపెను. ఈలాగున ఆయన ఆ మనుష్యుని వెళ్లగొట్టెను.” ( Gen.3:23,24 ).
ఎంతమంది హృదయములు కొంత ఆత్మీయ నష్టముతో ఉన్నవో. వారు తమ బైబిళ్లను మునుపటివలె ఆస్వాదించుటలేదు. వారికి ఒకప్పుడు ఉండిన ప్రార్థనా భారము వారికిప్పుడు లేదు. కొందరు బహిరంగముగాను కొందరు రహస్యముగాను ఏడ్తురు, కాని తాము కోల్పోయినదానిని తిరిగి పొందుటకు వారికి విశ్వాసము లేదు. వారు దానిని తిరిగి పొందగోరుదురు కాని ఎట్లు పొందవలెనో వారికి తెలియదు, మరియు అంతకంటె అధ్వాన్నముగా వారు పునరుద్ధరణ ఆశను కోల్పోయియున్నారు. వారు తమ హృదయములలో, “బహుశా నేను నా పూర్వపు ఆనందమును శాంతిని మరల ఎన్నడును పొందకపోవచ్చును” అని చెప్పుకొనుచున్నారు. వారు ‘నేను ప్రభువు సేవను మునుపటివలె ఎన్నడును చేయలేను’ అని చెప్పుకొనుచుండవచ్చును. మీరు ఆత్మీయముగా కోల్పోయినది ఏదైనను, మీకు ఆశ కలదు. మీ నష్టము తిరిగి పొందబడగలదు. మరీ ముఖ్యముగా, మీరు కోల్పోయినదానికంటె చాలా ఎక్కువగా మీరు పొందగలరు.
ఆరంభమున ఆదాము సమస్తమును కోల్పోయినను, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా మనుష్యుడు సమస్తమును తిరిగి పొందగలడు. Gen. 1:28నందు, దేవుడు ఆదామును ఏదెను తోటలో ఉంచెను. ఆయన అతనికి భూమి అంతటిమీదను, చేపలమీదను, పక్షులమీదను, జంతువులమీదను శక్తిని ఆధిపత్యమును కూడ ఇచ్చెను. చాలా వాస్తవమైన అర్థములో అతడు భూమి అంతటికి రాజు. అయినను అధ్యాయము 3లో అతడు దొంగవలె వెళ్లగొట్టబడెను, మరియు దేవుడే స్వయముగా అతనిని వెళ్లగొట్టెనని దేవుని వాక్యము చెప్పుచున్నది. ఆరంభమున అతడు దేవునితో మనుష్యుడు మనుష్యునితో మాట్లాడినట్లు మాట్లాడగలిగెను, కాని ఇప్పుడు అతడు దేవుని సన్నిధినుండి వెళ్లగొట్టబడుచుండెను. అతడు ఏదెను తోటలోని తన నివాసమునుండి వెళ్లగొట్టబడి, తన హక్కులన్నిటిని అప్పగింపవలసి వచ్చెను. ఎంత గొప్ప నష్టము! మొదటి మనుష్యుడైన ఆదాము కలిగించిన నష్టమును ఏ మనుష్యుడును అంచనావేయలేడు. కాని Revelation 21 మరియు 22లో, పాతదానికంటె అధిక మహిమగల నూతన సృష్టిని మనుష్యుడు ఏలుటను మనము కనుగొందుము.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం:
“మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు. I John.4:4.
మే 3
“మీ వస్త్రములనుకాదు మీ హృదయములను చించుకొనుడి, మీ దేవుడైన యెహోవావైపు తిరుగుడి”. Joel.2:13.
వాస్తవముగా దేవుడు మనుష్యులకు Genesis 3నందు కోల్పోయినదానికంటె ఎక్కువగా ఇచ్చెను. దేవుడు సిలువ శక్తిచేత పునరుద్ధరణను ప్రారంభించెను. కల్వరి బలిదానములో వెల్లడైనట్లు, ప్రతి పాపి యొక్క ప్రతి నష్టమును, ప్రతి విశ్వాసి యొక్క ప్రతి నష్టమును దేవుని కృపచేతను ఆయన సహాయముచేతను తిరిగి పొందవచ్చును. మీరు దేవునికి ఏమైనను ఉపయోగపడుచున్నారా? దేవుడు మీ జీవితములోని ఏదైనను ఉపయోగించెనని మీరు చెప్పగలరా? దయచేసి మీతోమీరు నిజాయితీగాను సత్యముగాను ఉండుడి.
మీ పాపములు క్షమింపబడవలెనని మీరు ఇష్టపడుచు కోరుకొనుచున్నారా? యేసుక్రీస్తు లోకములోనికి వచ్చి మరణించి తిరిగి లేచెను, మనము ప్రతి నష్టమును తిరిగి పొందుటకు. మనమీ సంవత్సరములన్నియు మన జీవితములను వ్యర్థము చేసియున్నను, ఇప్పుడు మనము మరల దేవుని జతపనివారుగాను భాగస్వాములుగాను అగుదుము ( I Cor.3:9 ).
మీ పాపములవలన కలిగిన ప్రతి నష్టము తిరిగి పొందబడగలదు. మీ పాపములవలన మీరు మీ స్వంత పేరుమీదను, మీ కుటుంబ పేరుమీదను, మీ దేవుని పేరుమీదను నింద తీసికొనివచ్చియున్నారు. మీ పాపములద్వారా మీరు మీ జీవితమును, ఆరోగ్యమును, శరీరమును నాశనము చేసియున్నారు. మీ పాపములవలన మీరు దేవునికి దూరముగా ఉన్నారు. దేవుని విషయములపట్ల మీకు కొంచెమైనను అవగాహన లేదు. మీరు దేవుని ఎదుట మూర్ఖులు మరియు మీరు చేయుచున్నదంతయు వ్యర్థము. మీరు ఆశలేకుండా చనిపోయెదరు.
మీరు మార్చబడగోరుచున్నారా? మా యొద్ద మీకొరకు ఒక సందేశము కలదు. ప్రభువైన యేసుక్రీస్తు పాదములయొద్దకు రండి. మీ పాపములకు చింతించుచు, పశ్చాత్తాపముగల హృదయముతో రండి. ఈ దినమున ప్రభువు మిమ్మును క్షమించి మిమ్మును మార్చును. అందుకనే ఆయన మిమ్మును వెదకుటకును రక్షించుటకును ఈ లోకములోనికి వచ్చెను.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం:
“యెహోవా తన ముఖకాంతిని నీమీద ప్రకాశింపజేసి, నిన్ను కరుణించునుగాక” Num.6:25.
మే 4
“నేను వారి భ్రష్టత్వమును స్వస్థపరచెదను, నేను వారిని ఉచితముగా ప్రేమించెదను.” “నీ దేవుడైన యెహోవావైపు తిరుగుము.” (Hosea.14:1-4).
ముప్పది ఒక్క సంవత్సరముల క్రితము నా జీవితము వ్యర్థమగుచుండెను; పూర్తిగాను, సంపూర్ణముగాను వ్యర్థమగుచుండెను. అప్పుడు నేను సిగ్గు, ఓటమి, గొడ్రాలుతనము యొక్క జీవితమును జీవించుచుంటిని, కాని నేనిప్పుడు చెప్పునదియు చేయునదియు అంతయు నిత్యముగా నిలుచు విలువ కలదని నేను సాక్ష్యమివ్వగలను. నేనేదైనను తప్పు చేసినయెడల, నన్ను సరిదిద్దుటకును, గద్దించుటకును, తిరిగి తీసుకొనివచ్చుటకును నా ప్రభువు అక్కడ ఉన్నాడు.
దావీదు తన జీవితకాలములో నాలుగు గొప్ప నష్టములను అనుభవించెను, మనము కూడ విశ్వాసులముగా మన జీవితకాలములో గొప్ప నష్టములను అనుభవించుచున్నాము. దేవుని కృపచేతను ఆయన సహాయముచేతను దావీదు ఈ నష్టములన్నిటిని తిరిగి పొందెను. మరియు అతడు కోల్పోయినది మాత్రమేగాక, దానికితోడు మరి ఎంతో కూడ. మనము కూడ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసులముగా, సందేహములవలనను మూర్ఖత్వమువలనను, గుడ్డితనమువలనను ఓటమివలనను అనేక నష్టములను అనుభవించుచున్నాము, కాని దేవుని వాక్యమునుండి విశ్వాసియొక్క ప్రతి ఆత్మీయ నష్టము ఇప్పుడు తిరిగి పొందబడగలదని మనము చూడగలము.
మీరు దేవుని వాక్యముపట్ల మీ ఆసక్తిని కోల్పోయియున్నారు, ప్రార్థనాభారమును కోల్పోయియున్నారు, దేవుని వాక్యముపట్ల మీ అవగాహనను కోల్పోయియున్నారు, మరియు దేవుని వాక్యమును ఆస్వాదించుటకు మీకు తెలియదు, దేవుని సన్నిధిని ఆస్వాదించుటకును మీకు తెలియదు. దేవుని ఆలయములో అనేక ఆధిక్యతలను మీరు కోల్పోయియున్నారు. దయచేసి మీ నష్టములన్నిటిని దేవునికి బాహాటముగా చెప్పి, ఆపై ఇట్లు ప్రార్థించుడి: ‘ఇప్పుడు, ప్రభువా, నా నష్టములన్నిటిని తిరిగి పొందుటకు నాకు సహాయము చేయుము.’ మీరు కోల్పోయినదానికంటె చాలా ఎక్కువగా మీరు తిరిగి పొందుదురని దేవుని వాక్యమునుండి మీకు హామీ ఇయ్యబడినది.
మీరు కోల్పోయినదానికంటె చాలా ఎక్కువగా ఆయన మీకిచ్చును. కాని మీరు నిజాయితీగాను సత్యముగాను నిష్కాపట్యముగాను ఉండి మీ నష్టమును గురించి అంతయు ఆయనతో చెప్పవలెను. మనము మరింత అభ్యసించుచుండగా, దావీదు తన నాలుగు నష్టములను ఎట్లు తిరిగి పొందెనో, మరియు మనము ఆత్మీయముగా కోల్పోయినదంతయు ఎట్లు తిరిగి పొందగలమో దేవుని వాక్యమునుండి మనము చూతుము.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం:
“యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధస్థలములో దేవుని స్తుతించుడి.” Psalm.150:1
మే 5
“సంతోషించుడి ఆనందించుడి; యెహోవా గొప్ప కార్యములు చేయును.” (Joel.2:21).
ఆత్మీయముగా కోల్పోయిన దేదైనను తిరిగి పొందబడగలదని లేఖనము మనకు చెప్పుచున్నది. అది అసాధ్యమైనట్లు తోచవచ్చును, కాని దేవుని సహాయముచేత, ఆయన కృపచేత, ఆయన వాక్యముచేత, అది తిరిగి పొందబడగలదు.
ఆ సరళమైన పాఠము 2 Kings 6:1-7 నందలి యువ ప్రవక్తల గురించిన కథలో మనకు బోధించబడినది. ఆ యువకులు ఎలీషాతో కూడ చదువుకొనుచుండిరి, వారికి ఆ స్థలము మిక్కిలి చిన్నదిగా తోచెను. వారికి పెద్ద యిల్లు కావలెను, దీనికొరకు వారికి కర్రలు కావలెను. కర్రలు నరుకుటకు వారు యొర్దాను దాటి వెళ్లవలసివచ్చెను; కావున వారందరు కలిసి అక్కడికి వెళ్లిరి, మరియు వారు యువకులైనను, ప్రవక్తల కుమారులైనను, వారికి కొంత జ్ఞానముండెను, మరియు వారు ఎలీషాను తమతోకూడ తీసుకొనిపోయిరి (వచనం 3). నేటి యువకులు తమకు తమ పెద్దలకంటె ఎక్కువ తెలియుననుకొందురు. కావున తమ వ్యక్తిగత సమస్యలతో అటువంటి వృద్ధులయొద్దకును వృద్ధురాళ్లయొద్దకును ఎందుకు వెళ్లవలెనని యువకులు ప్రశ్నించుదురు.
అయితే ఈ యువకులకు అవగాహన కలిగియుండెను, మరియు ఎలీషాను తమతోకూడ రమ్మని కోరుటద్వారా వారది చూపించిరి. వారు అక్కడ కర్రలు నరుకుచుండగా, ఒక యువకుని గొడ్డలి తలభాగము ఊడి నీటిలో పడెను (వచనం 5). ఆ గొడ్డలి అతనిదికాదు కాని అతడు దానిని తిరిగి ఇవ్వగోరుచుండెను. అయితే జ్ఞానముగల యువకుడగుటచేత, అతడు యువకులయొద్దకుకాక వృద్ధుడైన ఎలీషాయొద్దకు వెళ్లెను (వచనం 6).
అతడు ‘అయ్యో, నా యజమానీ, నా అజాగ్రత్తవలన, నేను గొడ్డలి తలభాగమును పోగొట్టుకొంటిని. అది అప్పుగా తీసికొన్నదిగనుక దానిని నేను తిరిగి ఇవ్వగోరుచున్నాను. నా యజమానీ, నేనేమి చేయవలెనో నాకు చెప్పుము?’ అని చెప్పెను. ఎలీషా, ‘గొడ్డలి పడిన స్థలమును నాకు చూపుము’ అని చెప్పెను. కావున ఆ యువకుడు దానిని చూపగా, ఎలీషా ఒక చెట్టుకొమ్మను నరికి నీటిలో వేసెను. వెంటనే ఆ గొడ్డలి తేలుటకు ప్రారంభమయ్యెను. ఇది ప్రతి ఆత్మీయ నష్టము ఎట్లు తిరిగి పొందబడగలదో మనకు బోధించుటకు లోతైన అర్థముతో నిండిన ఒక సరళమైన కథ.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం:
“బుద్ధిహీనులు కాక ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకొనువారై యుండుడి.” Eph.5:17
మే 6
“మీతో ఆశ్చర్యకరముగా వ్యవహరించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించుడి, నా ప్రజలు ఎన్నడును సిగ్గుపడరు.” (Joel.2:26).
మీరు ఎక్కడికైనను వెళ్లునప్పుడెల్లా, మీరు ఎక్కడికి వెళ్లినను, నిజమైన ఎలీషాయైన ప్రభువైన యేసుక్రీస్తు మీతోకూడ వచ్చుటను నిశ్చయపరచుకొనుటను ఒక నియమముగా చేసికొనుడి. రెండవదిగా, మీరు దేనినైనను పోగొట్టుకొన్నప్పుడు, దానిని ఒప్పుకొనుటకు సిగ్గుపడకుడి. మీ తప్పులను వెంటనే ఒప్పుకొనుడి. మీ మూర్ఖత్వమును నటనను దాచకుడి; మరియు సహాయముకొరకు ఇతరులయొద్దకు వెళ్లకుడి, ప్రభువైన యేసుక్రీస్తుయొద్దకు నేరుగా వెళ్లుడి. ఆయన పాదములయొద్దకు వెళ్లుడి. మిమ్మును మీరు దీనపరచుకొని మీ నష్టమును వైఫల్యములను ఆయనతో ఒప్పుకొనుడి. మీ ప్రార్థన ఇట్లుండనిండు: ‘అయ్యో, నా యజమానీ, నేనేమి చేయవలెను?’ నష్టము కలిగిన స్థలమునకు క్రీస్తు మిమ్మును తీసుకొనిపోనిండు. దేవుడు మీకు ఎట్లు సహాయపడునో చూచుటకు ఇష్టపడుచు, సిద్ధముగా ఉండుడి. ఎలీషా నరికిన ఆ కర్ర ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను సూచించుచున్నది. మన పాపములకొరకు ఆయన చెట్టుమీద వ్రేలాడి మనకొరకు మరణించెను, మరియు అదే సిలువచేత మన నష్టము తిరిగి పొందబడగలదు. మన జీవితములలో మనము విశ్వాసముచేతనే సిలువను వర్తింపజేయుదుము, మరియు దానిద్వారా ప్రతి నష్టము తిరిగి పొందబడుటను మనము చూతుము.
ఈ సరళమైన నియమమును జ్ఞాపకముంచుకొనుడి. అన్నిటికంటె మొదట, మీ జీవితములో నష్టము ఆరంభమైన స్థలమును ఆయనకు చూపి ఆ స్థలమునకే వెళ్లి ఇట్లు చెప్పుడి; ‘అవును, ప్రభువా, అటువంటి తేదీన, అటువంటి సమయమున, నేను మూర్ఖునివలె ప్రవర్తించితిని, అందుకనే నా జీవితములో ఈ నష్టము ఉన్నది! మీరు ఆ ఒప్పుకోలుతో ప్రభువుయొద్దకు వెళ్లినయెడల, సిలువ శక్తిచేత, ప్రతి నష్టమును తిరిగి పొందుటకు ఆయన మీకు సహాయపడును. సిలువ దేవుని శక్తి, మరియు విశ్వాసము అవసరము—సరళమైన, జీవముగల విశ్వాసము. మన ప్రభువు మనతోకూడ ఉన్నాడు. ఆయన: ‘ఇదిగో నేను ఎల్లప్పుడు మీతోకూడ ఉన్నాను’ అని చెప్పెను. ఆయనయొద్దకు వెళ్లుటకు వెనుకాడకుడి. మీ నష్టములను ఆయనతో చెప్పుడి. మీ నష్టములకొరకు ఆయన సిలువమీద మరణించెనని కూడ నమ్ముడి. ఆ నష్టములను తిరిగి పొందుటకు మీకు సహాయపడుటకు మీ తరుపున ఆయన సిలువమీద మరణించెనని కూడ నమ్ముడి, నేటి క్యాలెండర్ బైబిల్ వచనం:
“ఆయన సమస్తముకంటె ముందుగా ఉన్నవాడు, ఆయనయందు సమస్తమును నిలిచియున్నది.” Col. 1:17
మే 7
“వారు వెంటనే ఆయన కార్యములను మరచిపోయిరి; వారు ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనలేదు.” (Psa. 106.13).
మీ నష్టము ఎంత గొప్పదైనను, దాని కారణమేదైనను, అది తిరిగి పొందబడగలదు, మరియు వాస్తవముగా, పునరుద్ధరణలో మనము కోల్పోయినదానికంటె చాలా ఎక్కువగా మనము పొందుదుము. అయితే, దేవుని వాక్యమునకును, ఏ మనుష్యుడును మార్చలేని ఆయన దైవిక ధర్మములకును మనము లోబడుటకు ఇష్టపడవలెను. దావీదు మంచివాడు, జ్ఞానముగలవాడు, దయగలవాడు, దేవుని హృదయానుసారమైన మనుష్యుడైనప్పటికిని, అతడు నాలుగుసార్లు సాతానుచేత మోసగింపబడి నాలుగు గొప్ప నష్టములను అనుభవించెను, కాని దేవుని సహాయముచేతను ఆయన కృపచేతను అతడు అన్నిటిని తిరిగి పొందెను. ఈ నాలుగు నష్టములకు కారణములను చూచి, ఆపై అతడు కోల్పోయినదంతయు ఎట్లు తిరిగి పొందెనో చూతము. మొదటిది 1 Samuel 29:1-4 నందు కలదు. దావీదు సౌలుకు వ్యతిరేకముగా ఫిలిష్తీయుల సైన్యములో చేరగోరెను. సౌలు దావీదుకు శత్రువు, మరియు సౌలుకు బదులుగా దావీదును రాజుగా దేవుడు ఏర్పరచుకొనియుండుటచేత, సౌలు అనేకమార్లు అతనిని చంపుటకు ప్రయత్నించెను.
ఫిలిష్తీయులు, తమ అధిపతులచేత నడిపింపబడుచు, కూడుకొని సౌలుకు వ్యతిరేకముగా యుద్ధమునకు వెళ్లిరి. దావీదు వారితోకూడ వెళ్లెను కాని ఫిలిష్తీయుల అధిపతులు దావీదును నమ్మలేదు మరియు అతడు మిక్కిలి దుఃఖముతోను నిరాశతోను వెనుకకు వెళ్లవలసి వచ్చెను. సమూయేలుచేత సౌలు రాజుగా అభిషేకింపబడెననియు, సౌలు దేవుని వాక్యమునకు అవిధేయుడైయున్నను, అతడు ఇంకను దేవుని అభిషిక్తుడేయనియు దావీదుకు తెలియును. అందుకనే దేవుడు దావీదును సౌలును ముట్టనీయలేదు, కాని దావీదు అసహనమునొందెను. అనేకమార్లు దేవుడు తనతోకూడ ఉండి తనకు సహాయపడెనని దావీదుకు తెలియును, అయినను ఈ సందర్భములో, దేవునితో సంప్రదింపకుండగనే, అతడు ఫిలిష్తీయులతో చేరెను.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం:
“నా కుమారుడా, దేవుడే తనకొరకు సిద్ధపరచుకొనును.” Gen. 22:8
మే 8
“దావీదు యెహోవాయొద్ద విచారించెను: ... ఆయన అతనితో, “తరుముము, నీవు తప్పక వారిని కలిసికొని, తప్పకుండ అందరిని విడిపించెదవు” అని జవాబిచ్చెను. (1 Sam. 30:8).
దావీదును అతని మనుష్యులును సిక్లగుకు తిరిగివచ్చినప్పుడు, వారి ఇండ్లు తగులబెట్టబడియుండుటను వారు కనుగొనిరి. వారి భార్యలును పిల్లలును వెళ్లిపోయియుండుటను, వారి వస్తువులు అమాలేకీయులచేత దోచుకొనబడియుండుటను వారు కనుగొనిరి. ఇదంతయు దావీదు వైఫల్యమువలననే. ఫిలిష్తీయులయొద్దకు వెళ్లుటకుముందు అతడు దేవునితో సంప్రదింపవలసియుండెను, కాని ఆ సమయమున అతడు తన స్వంత జ్ఞానముమీదను బలముమీదను ఆధారపడియుండెను.
అప్పుడు అకస్మాత్తుగా అతడు తెప్పరిల్లెను (వచనం 6). ఈ మాటలను గీతగీయుడి, మీ ప్రియులచేత మీరు విడువబడినప్పుడును, మీరు ప్రేమించువారే మిమ్మును విడిచిపెట్టినప్పుడును, ఇవి ఒకనాడు మీకు సహాయపడును. దావీదు యెహోవాయందు తనను తాను బలపరచుకొనెను. అతడు తెప్పరిల్లి, “దేవా, నా వైఫల్యములకొరకు నన్ను క్షమింపుము, నేను ఫిలిష్తీయులతో చేరకముందు నీ చిత్తమును కనుగొనకపోయినందుకు. ప్రభువా, నన్ను క్షమింపుము” అని చెప్పెను. అప్పుడు దావీదు అబ్యాతారు యాజకుని పిలువనంపి, “దయచేసి నాకొరకు దేవుని చిత్తమును కనుగొనుము. మేమేమి చేయవలెను? మా శత్రువులైన అమాలేకీయులకు వ్యతిరేకముగా వెళ్లవలెనా?” అని అడిగెను. దేవుడు, ‘అవును, వెళ్లుము’ అని చెప్పెను. మరల అతడు, “ఇప్పుడు, ప్రభువా, మేము వెళ్లినయెడల మేము కోల్పోయినదంతయు తిరిగి పొందుదుమా?” అని చెప్పెను. దేవుడు: (వచనం 8, చివరి భాగం) ‘తప్పకుండ, తప్పకుండ, మీరు అందరిని తిరిగి పొందుదురు’ అని చెప్పెను.
అమాలేకీయులు దిగినస్థలమును దావీదు కనుగొనెను, మరియు వారు తినుచు, త్రాగుచు, ఆనందముతో నాట్యమాడుచుండిరి. అకస్మాత్తుగా దావీదును అతని మనుష్యులును వారిమీద పడి తమ భార్యలను పిల్లలను వస్తువులను తిరిగి పొంది, అమాలేకీయులను కూడ కొల్లగొట్టిరి. కొల్లసొమ్ము ఎంత గొప్పదైనదనగా, వారు తాము తెచ్చుకొన్న అప్పులన్నిటిని పూర్తిగా చెల్లించగలిగిరి. దావీదు తాను నివసించిన ప్రజలందరికిని బహుమానములను కానుకలను కూడ పంపెను.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం:
“నిలువుము, దేవుని ఆశ్చర్యకార్యములను ధ్యానించుము.” Job37:14
మే 9
“నీ ఆలోచనచేత నీవు నన్ను నడిపింతువు.” (Psa. 73.24).
మనం 1 Sam. 31:3-6 నందు సౌలుకు వ్యతిరేకముగా ఫిలిష్తీయుల యుద్ధమును గురించి కలదు. ఆ యుద్ధములో సౌలు మరణించెను. దావీదు సౌలును చంపుటకు ప్రయత్నించినప్పుడు, సౌలు దేవుని అభిషిక్తుడగుటచేత, దేవుడు అతనిని ఆ విధముగా చేయనీయలేదు. ఇప్పుడు సౌలును అతని కుమారులును యుద్ధములో చంపబడియుండిరి. దావీదు సౌలుకు వ్యతిరేకముగా పోరాడవలసిన అవసరము ఏమాత్రము లేకపోయెను. దావీదుకు తెలియకుండగనే, దేవుడు అతని తరుపున పనిచేయుచుండెను. దేవుడు దావీదును ఒక గొప్ప ఉన్నత సేవకొరకు ఏర్పరచుకొనియుండెను. అతడు కేవలము దేవుని రాజు మాత్రమేగాక, ప్రవక్తగా కూడ దేవునిచేత ఎన్నుకొనబడియుండెను. అతడు కేవలము దేవుని ప్రవక్త మాత్రమేగాక, దేవునినుండి ఆయన పరలోక ప్రణాళికను కూడ పొందగలవాడు. అందుకనే అతడు అనేక శుద్ధీకరణ అగ్నులలో శుద్ధిచేయబడవలసియుండెను. మనము కూడ, విశ్వాసులముగా, మిక్కిలి ఉన్నతమైన ఉద్దేశ్యముకొరకు దేవునిచేత ఎన్నుకొనబడియున్నాము, అందుకనే మనము కూడ ఆ పిలుపుకొరకు సిద్ధముగా ఉండుటకు అత్యంత బాధను అనుభవింపవలసియున్నది. మన జీవితములకొరకు దేవుని చిత్తమును కనుగొనుటయే మనము చేయవలసినది.
దేవుడే స్వయముగా నా ప్రధాన యాజకుడు. నేను ఎప్పుడైనను ఆయనయొద్దకు వెళ్లగలను. యాజకునికి ఊరీము తుమ్మీము అను రెండు రాళ్లు ఇయ్యబడెను, కాని ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నాలో ఈ రెండు రాళ్లను, దైవిక వెలుగును దైవిక సత్యమును ఉంచెను. Psalm 43:3 ప్రకారము నేను దేవుని చిత్తమును కనుగొనుటకు దేవుని ఆలయములోనికి వెళ్లునప్పుడు, నా హృదయములో వసించు క్రీస్తుగా, ఆయన వెలుగు ఆయన సత్యము నన్ను నడిపించును.
ఇప్పుడు దేవుడు మీ నష్టములను తిరిగి పొందునని మాత్రమేగాక, మీరు ప్రభువుయొద్దకు తిరిగివచ్చునప్పుడు మీ దుఃఖములు ఆనందముగా మార్చబడుననియు మీరు మీకుమీరే రుజువుచేసికొనగలరు. ఫిలిష్తీయులమీదను మీ స్నేహితులమీదను ఆధారపడక, క్రీస్తు ఒక్కనియందు మాత్రమే మీ నమ్మకమునుంచుటను నేర్చుకొనుడి. ప్రతి పరిస్థితిలోను దేవుని విచారించుటను, ఆయన చిత్తమును తెలిసికొనుటకు వెదకుటను, ఆయన స్వరమును వినుటను, ఆయనకు లోబడుటను నేర్చుకొనుడి, మరియు పరిస్థితి అసాధ్యమైనట్లు తోచినను, అయినను ఆయనకు లోబడుడి. నేటి క్యాలెండర్ బైబిల్ వచనం:
“నీవు భూమిని దర్శించి దానిని తడిపెదవు....” Psalm 65:9
మే 10
“యెహోవాను ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి.” (Psa.105:4).
ఇప్పుడు దావీదు కలిగించుకొన్న రెండవ గొప్ప నష్టమును చూతము. దేవుని మందసమును తిరిగి దాని స్థలమునకు తీసుకొనిరావలెనని దావీదు ఎంత ఆసక్తితోను శ్రమతోను వెదకెను. కాని అయ్యో! సంఖ్యాకాండము 4, 7లలో దేవుడు ఆజ్ఞాపించిన విధముగా ఇశ్రాయేలీయులను, అహరోను కుమారులను, కహాతీయుల కుమారులను సమకూర్చుటకు బదులుగా, అతడు తన స్వంత మానవ జ్ఞానమును ఆసక్తిని ఉపయోగించి మందసమును క్రొత్త బండిమీద మోసెను. ఇది ఫిలిష్తీయులచేత 1 సమూ. 6లో చేయబడియుండెను.
దేవుడు ఇంత స్పష్టముగా numbers 4:15 మరియు 7:9లలో ఆజ్ఞాపించెను, దేవుని మందసము లేవీయుల కుమారులైన కహాతు కుమారులచేత మాత్రమే వారి భుజములమీద మోయబడవలెనని. అది ఎన్నడును బండిమీద మోయబడకూడదు. మందసము క్రొత్త బండిమీద ఉంచబడెను, మరియు మార్గములో ఎద్దులు తొట్రుపడగా, ఉజ్జా మందసమును నిలుపుటకు తన చేయిచాపినప్పుడు, యెహోవా కోపము ఉజ్జామీద రగులుకొని ఆయన అతనిని కొట్టెను. ఈలాగున వారు మందసమును దాని స్థలమునకు తీసుకొనిరాలేకపోయిరి. ఇప్పుడు దావీదు దేవుని వాక్యములో వెల్లడైన దైవిక క్రమమునకు లోబడి దానిని అనుసరించుటకు ప్రారంభించినప్పుడు, గొప్ప ఆనందముతో అతడును ప్రజలందరును దేవుని మందసమును దాని స్థలమునకు తీసుకొనిరాగలిగిరి (1Chron. 15: 28).
ఈ గొప్ప సంఘటన తర్వాత దావీదు కీర్తన 105గా మనకు ఉన్న అద్భుతమైన కృతజ్ఞతాగీతమును వ్రాసెను, “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమునుబట్టి ఆయనను ప్రార్థించుడి, ప్రజలలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి మాటలాడుడి” మొదలగునవి (వ. 1-7,14,15). మనము దేవుని సన్నిధిని నిరంతరము వెదకి, మన కార్యకలాపములలో, బాధ్యతలలో, ప్రణాళికలలో - అది ఇంటిలోనైనను సంఘములోనైనను - ఆయన క్రమమును కనుగొనుటకు ప్రయత్నించనియెడల, మనము మిక్కిలి భారమైన నష్టమును అనుభవింపవలసివచ్చును. మన ఆసక్తిచేతను, జ్ఞానముచేతను, నిర్ణయముచేతను మనము పరిపాలింపబడలేము. నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “మీరు వెలతో కొనబడితిరి: కావున మీ శరీరమునందు దేవుని మహిమపరచుడి.” 1 Cor.6:20.
మే 11
“మీలో... మంచి కీర్తిగలవారును, పరిశుద్ధాత్మతోను జ్ఞానముతోను నిండినవారునైన మనుష్యులను చూచుకొనుడి.” (Acts.6.3).
నేడు దేవుని ప్రజలలో మిక్కిలి గొప్ప నష్టము కలదు, దేవుని వాక్యమును అనుసరించుటలో వైఫల్యమువలననే. పెద్దలను ప్రార్థనచేత కనుగొనుటలో నమ్మకముంచు ఆ ప్రజలు కూడ, ఈ మిక్కిలి ప్రాముఖ్యమైన కార్యములో ఎంత అజాగ్రత్తగాను నిర్లక్ష్యముగాను అగుచున్నారనగా, దేవుని సేవకులుగాను జతపనివారుగాను ఈ విషయమును గురించి కలిసి ప్రార్థింపకుండగనే, వారు ఒక మనుష్యుని మానవ అర్హతలచేతను, అతని మాట్లాడు సామర్థ్యముచేతను, లేదా అతని లోకసంబంధమైన స్థానముచేతను ఇతర వనరులచేతను పరిపాలింపబడుచున్నారు. ఫలితము గొడ్రాలుతనమును ఆత్మీయ శైశవస్థితియు, మరియు ప్రజలు కూటములనుండి ఆకలిగొని వచ్చి ఆకలిగొనియే వెళ్లిపోవుచున్నారు.
దావీదు తన తప్పుకు పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు అతనిని క్షమించెను, ఎందుకనగా దేవుడు కనికరముగలవాడు, కృపగలవాడు, మనము మనలను దీనపరచుకొని మన వైఫల్యమును తప్పును ఒప్పుకొన్నయెడల ఆయన మనలను క్షమించి, ప్రతి నష్టమును తిరిగి పొందుటకు మనకు సహాయపడును.
ఇప్పుడు దేవుని మందసము ప్రభువైన యేసుక్రీస్తునే గురించి చెప్పుచున్నది. నిజముగా తిరిగి జన్మించినవారును ఆయనచేత పిలువబడినవారును మాత్రమే ఆయన హక్కులను సమర్పించుటకును, రక్షణ మార్గమును ప్రజలకు చూపించుటకును ఆధిక్యతను కలిగియున్నారు. అయ్యో! ఈ దినములలో దేవునిచేత తన సేవకొరకు ఎన్నడును పిలువబడని ఎంతోమంది మనుష్యులు, కేవలము మిషను క్షేత్రములలోనికి తోసివేయబడుటను మనము మరల కనుగొందుము. ఫలితము ఏమనగా, పడమటినుండి బయలుదేరు మిషనరీలలో అరవై అయిదు శాతముకంటె ఎక్కువమంది, తమ మొదటి ఐదు సంవత్సరముల కాలము పూర్తియైన తర్వాత తమతమ మిషను క్షేత్రములకు ఎన్నడును తిరిగిరారు.
అదేవిధముగా అనేకమంది వ్యక్తులు తమ ధనమునుబట్టిగాని స్థానమునుబట్టిగాని క్రైస్తవ వర్గములలో స్థానములు ఇయ్యబడియున్నారు, కాని ఆ సేవకొరకు వారు ఎన్నడును దేవునిచేత పిలువబడలేదు, అందుకనే వారు దేవుని చిత్తానుసారముగా సంఘ వ్యవహారములను నడిపింపలేకున్నారు. నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “ఆత్మనుబట్టి నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరాశను నెరవేర్చరు.” Gal.5:16
మే 12
“దేని విషయమైనను చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాస్తుతులతో మీ మనవులు దేవునికి తెలియజేయుడి.” (Phil. 4.6).
వివాహమును గురించి మనము దేవుని చిత్తమును కనుగొనవలెను. యువకులముగా ఆ జంట ఒకరినొకరు ఇష్టపడుదురు. బహుశా ఆ సమయమున వారు జీవిత భాగస్వాములుగా కలియవలెనని దేవుడు కోరుచున్నాడని వారు నిశ్చయముగా భావింతురు, కాని వారు ఎన్నడును ప్రభువు సన్నిధిని వెదకరు. దేవుని చిత్తమును కనుగొనుటకు ప్రార్థనచేత తమకు సహాయపడగల ఇతరులతో ప్రార్థించుటను వారు తిరస్కరింతురు, అందుకనే ఎంతోమంది సంతోషములేని ఇండ్లు ఉన్నవి. వారు గొప్ప నిరీక్షణలతో తమ వైవాహిక జీవితమును ప్రారంభింతురు, కాని కొద్దికాలములోనే ఆ జంట తాము కలిసియుండలేమని కనుగొందురు, మరియు కుటుంబములో నిరంతర కలహము, మరియు వారి స్వంత హృదయములలో సంతోషములేమి ఉండును.
మేము మా పరిచర్యకొరకు దేవుని ప్రణాళికను వెదకుటచేత, మేము ఎన్నడును డబ్బుకొరకు అడుగవలసివచ్చుటలేదు. కొన్నిసార్లు అవసరత మిక్కిలి గొప్పదిగా ఉండెను, కాని మేము కలిసి ప్రార్థించితిమి, మరియు అది ప్రభువు పని అగుటచేతను ఆయన మా అవసరతలకు బాధ్యుడగుటచేతను, ఆయన ఎల్లప్పుడు దానిని సమకూర్చెను. ఏ బిల్లునైనను చెల్లించుటకు మేము ఒక్క దినమైనను వేచియుండవలసివచ్చుటలేదు. దేవుని సేవలో మేము మోయవలసిన బాధ్యత ఏదైనను మేము ఎల్లప్పుడు దేవుని సన్నిధిని ఆయన ప్రణాళికను వెదకవలెను. మనము క్రొత్త కాలములో, వేరొక దినములలో జీవించుచున్నామని చెప్పుచు, దేవుని వాక్యమును మార్చుటకు ఎన్నడును ప్రయత్నింపరాదు. దేవుని వాక్యము ఎన్నడును మారదు, కావున ప్రతి నష్టమును తిరిగి పొందుటకు ప్రభువు మీకు సహాయపడునని ప్రార్థించుడి.
మీ వైవాహిక జీవితములో మీరు నిజముగా ఇద్దరును మీరు చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి, దేవుని క్షమాపణను అడిగినయెడల, ఆయన నిశ్చయముగా మిమ్మును క్షమించును, మరియు మీరు ప్రతి నష్టమును తిరిగి పొందుటయేగాక, ఇతరుల ఆశీర్వాదముకొరకు మీ జీవితములు ఆయనచేత ఉపయోగింపబడును.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “దేవుని ప్రేమించువారికి మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి.” Rom. 8:28.
మే 13
“మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి.” (Matt. 26:41).
2 సమూయేలు 11లో దావీదు యొక్క మూడవ నష్టము యొక్క కథ విశ్వాసులకును అవిశ్వాసులకును ఒక సందేశమును కలిగియున్నది. అన్నిటికంటె మొదట, మనుష్యుని హృదయము యొక్క దుష్టత్వమును మోసమును మనము చూచునట్లు చేయబడుచున్నాము. మనమెవరమైనను, బాహ్యముగా మనము ఎంత మంచిగాను చక్కగాను కనబడినను, మనమందరము అంతరంగికముగా సమానముగా అపవిత్రులమును, మురికిగలవారమును, కల్మషముగలవారమును. మన జీవితములలో సత్యము లేదు. మన నిజమైన స్థితిని తెలిసికొనుటకు మనము ఇష్టపడము. దానిని గురించి మనకు చెప్పబడినప్పుడు, మన అహంకారము గాయపడును. అందుకనే దేవుని వాక్యమును చదువునప్పుడు అనేకమంది కోపగించుకొని, గాయపడుదురు. ఇప్పుడు 2 సమూయేలు 11లోని దావీదు కథను చూతము.
తన బాల్యమునుండి అతడు దేవునియందు భయభక్తులుగలవాడుగను, జ్ఞానముగలవాడుగను, నిజాయితీగలవాడుగను, మంచివాడుగను ఉండెను. అతడు దేవునిచేత కూడ ఎన్నుకొనబడెను. అతడు మంచివాడు, అనేక సంవత్సరములు మంచి జీవితమును జీవించెను. అతడు దుష్టత్వమును ద్వేషించి దానికి దూరముగా ఉండెను. కాని దావీదుకు తెలియకుండగనే ఎక్కడో దాగియున్న దుష్టస్వభావము ఉండెను, మరియు దేవుడు అతనిని పూర్తిగా మార్చనిదే, అతడు ఏ గొప్ప కొలతలోను ఉపయోగింపబడలేకపోయెడివాడు. దావీదు తనను దేవుడు చూచినట్లే తనను తాను చూచుకొనునట్లు 2 సమూ. 11లోని సంఘటన దావీదు జీవితములో జరిగెను.
దావీదు యుద్ధముచేయు మనుష్యుడు, బలవంతుడు, కాని అతడు చేయవలసిన విధముగా యుద్ధమునకు వెళ్లకుండ, యెరూషలేములో ఇంటిలో ఉండెను. బాహ్యముగా ఇది మిక్కిలి చిన్న వైఫల్యము మాత్రమే. రెండవ వచనము అది సాయంకాలమని, దావీదు బలవంతుడైనప్పటికిని అతడు సాయంకాలమువరకు నిద్రించుచుండెనని మనకు చెప్పుచున్నది. ఈ సూక్ష్మమైన విధముగా ఆ బలవంతుడు సోమరిపోతుగా మారుటవంటి అనేకమంది ఉన్నారు, మరియు రాజభవనము పైకప్పుమీద విశ్రాంతిగా నడచుచుండగా, అతడు శోధనను ఎదుర్కొనుటకు తీసుకొనిరాబడెను.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “నా విశ్రాంతిదినములను ఆచరించి నా పరిశుద్ధస్థలమునందు భయభక్తులు కలిగియుండుడి. Lev. 19:30
మే 14
“హృదయము అన్నిటికంటెను మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధిగలది; దానిని ఎవరు తెలిసికొనగలరు?” (Jer.17.9).
తర్వాత, ఈ పాపమును కప్పిపుచ్చుటకు, దావీదు అనేక మార్గములను ఉపాయములను పద్ధతులను తలంపవలసివచ్చెను. తాను చేసిన పాపమును కప్పిపుచ్చుటకు అతడు మరిన్ని మార్గములను తలంచి పాపము చేయవలసివచ్చెను, ఆ విధముగా వేషధారియాయెను. తన పాపము కనిపెట్టబడబోవుచున్నదని అతడు కనిపెట్టినప్పుడు, అతడు ఆ స్త్రీ యొక్క భర్తయైన ఊరియాను పిలువనంపెను. ఊరియా వచ్చినప్పుడు, దావీదు యుద్ధమును గురించి అతనిని ప్రశ్నించుటకు ప్రారంభించెను. అప్పుడు అతడు అతనితో, ‘ఊరియా, నీవు మిక్కిలి అలసియున్నావు. నీవు ఇంటికి వెళ్లి వేడినీళ్లస్నానము చేసి పండుకొనవలెను’ అని చెప్పెను.
ఊరియా రాజభవనమునుండి బయలుదేరిన వెంటనే, ఒక మనుష్యుడు రాజుభోజనశాల నుండి రుచికరమైన ఆహారపు పళ్లెములను అతనికి తీసుకొనిపోయెను. ఆ దినమున దావీదు రాజు ఊరియాకు ఎంత దయగలవాడుగా ఉండెనో! ఒక పాపము రెండవ పాపమునకు, ఆపై మూడవదానికి, ఆపై నాలుగవదానికి నడిపించును! ఒక గొప్ప జ్ఞానముగల రాజు, ఒకే పాపమును కప్పిపుచ్చుటకు, మొదటితరగతి వ్యభిచారియు, ఆపై మోసగాడును, ఆపై వేషధారియు, ఆపై అబద్ధికుడును ఆయెను. అయితే ఊరియా ఇంటికి వెళ్లక, రాజభవన ద్వారమునొద్దనే నిద్రించెను. దావీదు మరల అతనిని ఒత్తిడిచేసెను: ‘ఊరియా, నీవు ఇంకను మిక్కిలి అలసియున్నావు, నీవు కొన్ని దినముల సెలవు తీసికొనవచ్చును.’ అయినను ఇప్పటికిని ఊరియా చేయలేదు! చివరకు, యోవాబుద్వారా అతడు ఊరియా మరణమునకు కారణము కావలసివచ్చెను. అతడు ఎన్నడును ఊరియాను హత్యచేయగోరలేదు. అతడు వ్యభిచారియగుటను గురించి ఎన్నడును తలంచలేదు. తన స్వభావములోని ఆ దాగియున్న భాగము అతనికి ఎన్నడును తెలియదు. శోధన వచ్చినప్పుడే తన హృదయము ఎంత దుష్టమైనదో అతనికి తెలిసెను.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “దేవుని చిత్తమంతటిలో సంపూర్ణులుగాను పరిపూర్ణులుగాను నిలువుడి”. Col.4:12
మే 15
“దేవుడు అంగీకరించు బలులు నలిగిన మనస్సే; నలిగి నొచ్చిన హృదయమును, దేవా, నీవు తృణీకరింపవు.” (Psa.51:17)
మనమందరము పాపస్వభావముతో పుట్టుచున్నాము, కాని ఆ పాఠము దావీదుచేత అతడు పాపము చేసిన తర్వాతనే నేర్చుకొనబడెను, అతడు Psalm 51నందు, ‘ఇదిగో నేను దోషమందు రూపింపబడితిని’ అని చెప్పుచున్నాడు. దావీదును తన ఏర్పరచుకొనిన పాత్రగా దేవుడు చూచుటకుముందు, ఆయన అతనిని మార్చి, రూపాంతరపరచి, పవిత్రపరచి, శుద్ధిచేసి, కడుగవలసివచ్చెను. దావీదు Psalm 51నందు. తాను ఏమిటో, తన హృదయము యొక్క నిజమైన స్థితి ఏమిటో అతడు గ్రహించియుండెను (వచనం 7, 9, 19). ఆ దావీదే నలిగిన హృదయముతో ఈ ఒప్పుకోలును చేయుచున్నాడు. ‘దేవా, నాకు శుద్ధమైన హృదయమునిమ్ము. నాకు క్రొత్త హృదయమునిమ్ము. నాకు పవిత్రమైన హృదయమునిమ్ము, నన్ను శుద్ధిచేసి, నన్ను పవిత్రపరచి, నన్ను సంపూర్ణముగా కడిగి, నా దోషములన్నిటిని తుడిచివేయుము’.
మీరు ఖచ్చితముగా ఏమిటో దేవునితో ఒప్పుకొనుడి. మీ స్థితిలో ఏవిధమైన మార్పులను చేయుటకు ప్రయత్నింపకుడి. ‘అవును, ప్రభువా, నేను పాపిని’ అని చెప్పుడి, కాని ‘నేను నా పొరుగువానికంటె ఎంతో మేలైనవాడను’ అని చెప్పకుడి. దేవుడు మిమ్మును ప్రేమించుచున్నాడు గనుక, మీ నిజమైన స్థితిని ఆయనతో చెప్పి, ఆయన ఎదుట ఇట్లు చెప్పుడి: ‘ప్రభువా, నన్ను కడుగుము. నేను మురికిగలవాడను అపవిత్రుడను. దేవా, నాలో శుద్ధమైన హృదయమును సృష్టింపుము. నా పాత స్వభావమును తీసివేయుము.’ ఈ విధముగా మీరు ప్రతి నష్టమును తిరిగి పొందుదురు. మీ నశించుచున్న జీవితము సమృద్ధిగా ఫలభరితమగును. మీరు పలుకు ప్రతి మాటయు మీరు చేయు ప్రతిదియు నిలుచు ఫలమును ఫలింపజేయును మరియు మీ పాపభరిత జీవితము యొక్క జ్ఞాపకముకూడ పోవును. దేవుడు క్షమించునప్పుడు, ఆయన శాశ్వతముగా క్షమించును.
మీ పాపములు శాశ్వతముగా క్షమింపబడును. అవి తుడిచివేయబడును, ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు మీకు బదులుగా మరణించి మీ పాపపు అప్పు మొత్తమును చెల్లించెను. ‘దేవా, నాలో పవిత్రమైన శుద్ధమైన హృదయమును సృష్టింపుము. నన్ను కడిగి, నన్ను శుద్ధిచేసి, నన్ను సంపూర్ణముగా పవిత్రపరచుము’ అని మీరు చెప్పుదురా? మీరు ఆయన ఎదుట నిష్కాపట్యముగాను దీనముగాను ఉన్నయెడల ఆయన వినును జవాబిచ్చును.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “క్రీస్తు వాక్యము సర్వజ్ఞానముతో మీలో సమృద్ధిగా నివసింపనిండు.” Col.3:16.
మే 16
“మిడుత తినివేసిన సంవత్సరములను, పసరుపురుగు తినివేసినవాటిని, గొంగళిపురుగు తినివేసినవాటిని, చీడపురుగు తినివేసినవాటిని నేను మీకు తిరిగి ఇచ్చెదను.” (Joel 2:25).
మీ పాపములు క్షమింపబడనిదే మీ జీవితము దేవుని దృష్టిలో వ్యర్థమైనది తప్ప మరేమియుకాదని మీకు తెలియునా? యోవేలు.1:4లో రైతు పంటలను తినివేయు నాలుగు రకముల పురుగుల గురించి మనము చదువుదుము,---చీడపురుగు, మిడుత, పసరుపురుగు, గొంగళిపురుగు. కొన్నిసార్లు రైతులు గొప్ప నిరీక్షణతో నేలను దున్ని విత్తనమును విత్తుటకు రేయింబవళ్లు మిక్కిలి కష్టపడుదురు. విత్తనము మొలకెత్తును కాని పంటకోతకు సమయము వచ్చినప్పుడు, ఏదో వచ్చి పంటలను నాశనము చేసియుండుటను వారు కనుగొందురు. బహుశా పంటలో ఒక భాగము చీడపురుగుచేత తినివేయబడియుండవచ్చును, పొలములో మరొక భాగము మిడుతచేత, మూడవ భాగము పసరుపురుగుచేత, నాలుగవ భాగము గొంగళిపురుగుచేత తినివేయబడియుండవచ్చును. జీవితమెంత? ఏమియు లేదు! అంతయు పోయెను! దేవుడు ఏమి చెప్పుచున్నాడు? ‘ఓ! పాపులారా, మీరు మీ జీవితమును ఎందుకు వృథాచేయుచున్నారు?’ మీ జీవితము చీడపురుగు, పసరుపురుగు, మిడుత, గొంగళిపురుగుచేత తినివేయబడుచున్న ఆ పొలమువలె ఉన్నది.
వాస్తవముగా, ఇది నేడు మీ స్థితి కావచ్చును. మీ జీవితము వృథా చేయబడియుండెననియు వృథా చేయబడుచున్నదనియు మీకు తెలియును. మీకొరకు కూడ ఆశ కలదు. మీరు ప్రతి నష్టమును తిరిగి పొందగలరు. మీ నష్టము ఎంత గొప్పదైనను, ఎంత దీనపరచునదైనను, ఇంకను మీ నష్టము తిరిగి పొందబడగలదు. మీ జీవితము సమృద్ధిగా ఫలభరితమగగలదు, మరియు మీరు వెచ్చించు ప్రతి నిమిషమును నిత్యమైన ఫలమునిచ్చును. ప్రభువైన యేసుక్రీస్తునందు నిలిచియుండుటచేతనే మనము నిలుచు ఫలమును ఫలింపజేయగలము. అదియే రక్షణ యొక్క అద్భుతమైన మహాత్కారము. మనము మన జీవితమును అనేక పాపభరితమైన, సిగ్గుకరమైన మార్గములలో వృథాచేసియున్నను, ప్రభువైన యేసుక్రీస్తులోనికి వచ్చుటచేతను, ఆయనతో జతచేయబడుటచేతను, మనము సమృద్ధిగా ఫలభరితులము కావచ్చును.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “మరణమువరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటమునిచ్చెదను” Rev 2:10.
మే 17
“పాపమువలన వచ్చు జీతము మరణము.” (Rom.6:23). “పాపము చేయు ప్రాణమే చనిపోవును” (Ejek. 18:4)
కొన్నిసార్లు అనుకోని నష్టములు మనకు వచ్చును. మనము II Kings 4:38నందు చదువుదుము, అకస్మాత్తుగా గొప్ప కరవు వచ్చెనని. వర్షము లేకపోవుటచేత ఎక్కడను ధాన్యము లేకుండెను. గొప్ప బీడు, పంటలేమి ఉండెను, మరియు ప్రజలు ఆహారముకొరకు ఏదైనను సమకూర్చుకొనుటకు ఇక్కడక్కడ వెళ్లవలసివచ్చెను. వారికి బియ్యముగాని గోధుమలుగాని కూరగాయలుగాని లేకుండెను. వారు ఆకుకూరలమీద జీవించిరి.
అదే స్థితి ఇప్పుడు కూడ లోకములో ఉన్నది. ఒకవైపు, ప్రజలు లోకసంబంధమైన విద్యనుగూర్చియు, ధనమునుగూర్చియు, పురోగతినిగూర్చియు అతిశయపడుచున్నారు. మరొకవైపు, వారు పాపభరితమైన స్థలములలో మురికిలోను అపవిత్రతలోను కుళ్లిపోవుచున్నారు. వారు సినిమాలలోను దుష్ట స్థలములలోను ఎంత సమయము గడుపుచున్నారో. వారు తమవెంట తీసికొనిపోవు మురికి పత్రికలను చదువుటలో ఎంత సమయము గడుపుచున్నారో.
ఈ మనుష్యులు II Kings 4:39నందు, ఆకుకూరలను ఏరుకొనుటకు అడవిలోనికి వెళ్లినప్పుడు, వారు కొన్ని అడవి తీగలను చూచిరి. ‘మేము అద్భుతమైనదానిని కనుగొంటిమి. మేము మంచి భోజనము చేయబోవుచున్నాము’ అని వారు దానిని వండుచు చెప్పుకొనిరి. కాని, ఆహారము వడ్డింపబడి వారు తినుటకు ప్రారంభించినప్పుడు, కొందరు జ్ఞానులు ఆహారములో ఏదో తప్పు ఉన్నదని కనిపెట్టిరి. కావున అతడు, ‘ఓ దేవుని మనుష్యుడా, కుండలో మరణమున్నది’ అని కేకవేసెను.
‘మేము విషము తినినందున చావబోవుచున్నాము. దయచేసి ఇప్పుడు మాకు సహాయము చేయుము. కొద్ది నిమిషములలోనే మేము చావబోవుచున్నాము’. అతని ఆజ్ఞమేరకు వారు కొంత పిండిని తీసుకొనివచ్చిరి మరియు అతడు దానిని కుండలో వేసెను, మరియు విషము యొక్క ప్రభావము తొలగింపబడెను. ప్రభువైన యేసుక్రీస్తు, ‘నేను జీవాహారమును, నన్ను తినుటవలన మీరు నిత్యము జీవించెదరు’ అని చెప్పెను. పాపమువలన కలిగిన మీ జీవితములోని విషమును తీసివేయగల ఏకైక ఆహారము ఇదియే.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “నీవు నమ్మినయెడల దేవుని మహిమను చూతువు.” John.11:40.
మే 18
“నేను జీవాహారమును... ఎవడైనను ఈ ఆహారము తినినయెడల, వాడు నిత్యము జీవించును”. John 6:57. ఇప్పుడు ఆ ప్రజలు ఆకలిగొనియుండిరి. ‘మా ఆకలిని తీర్చుటకు మేము ఆహారమును ఎట్లు పొందగలము?’ అని వారు అనుకొనుచుండిరి. అప్పుడు ఇరువది యవల రొట్టెలను దేవుని మనుష్యునికి తీసికొనివచ్చిన ఒక మనుష్యుడు వచ్చెను మరియు ప్రవక్త, ‘ప్రజలకు వడ్డింపుము’ అని చెప్పెను (వ.43). ఎంతోమంది మనుష్యులుండిరి మరియు కేవలము పండ్రెండు రొట్టెలు మాత్రమే ఉండెను. ఇరువది రొట్టెలను వారిమధ్య పంచవలెను. కావున సహజముగా సేవకుడు, ‘పండ్రెండు రొట్టెలు వారి ఆకలిని ఎట్లు తీర్చగలవు?’ అని చెప్పెను. దేవుని మనుష్యుడు, ‘ప్రజలు తినుటకు వారికిమ్ము, ఎందుకనగా యెహోవా ఈలాగు చెప్పుచున్నాడు, వారు తిని మిగిల్చెదరు’ అని చెప్పెను. కావున, వారు ఇక తినలేనంతవరకు తినిరి; వారు గొంతువరకు నిండియుండిరి, కాని ఇంకను చాలా మిగిలియుండెను.
మీ కడుపును, నరములను, మెదడును ప్రభావితము చేయు ఒక విషమున్నది. అది మిక్కిలి నెమ్మదిగా పనిచేయును. పాపము కూడ అంతే! పాపములో జీవించుటవలన మీరు ప్రతిదినము విషమును తినుచు త్రాగుచు మీ జీవితమును నాశనము చేయుచున్నారు. కావున ఈ దినమున విశ్వాసముచేత జీవాహారమును తినుడని మేము మిమ్మును బతిమాలుచున్నాము. ప్రతి నష్టమును తిరిగి పొందుటను మీరు ప్రారంభింపగలుగుటకు, మీ స్వభావములోని పాపవిషపు ప్రభావములను అది తొలగించును. అది మిమ్మును నిత్యజ్ఞానులుగను, నిత్యధనవంతులుగను, నిత్యబలవంతులుగను, నిత్యసంతృప్తులుగను చేయును, మరియు గత నష్టమంతయు సంపూర్ణముగా తిరిగి పొందబడును. అదేవిధముగా, మూర్ఖత్వముచేతను పాపముచేతను అపవిత్రతచేతను కలిగిన నష్టపు నష్టమంతయు తిరిగి పొందబడగలదు. యేసుక్రీస్తు చేతులనుండి మాత్రమే జీవాహారమును తినుడి. ప్రభువైన యేసుక్రీస్తు ఎలీషాకంటెను, సమస్త ప్రవక్తలకంటెను, ఇతర మనుష్యులందరికంటెను గొప్పవాడు. ఆయన నేడు ఈ జీవాహారమును మీకు అర్పించుచున్నాడు.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “తన భూమిని సేద్యపరచువానికి సమృద్ధిగా ఆహారము కలుగును” Prov.28:19.
మే 19
“విశ్వాసమునుబట్టి అబ్రాహాము బయలుదేరవలసివచ్చినప్పుడు... విధేయుడై, తాను ఎక్కడికి వెళ్లుచున్నాడో యెరుగకయే బయలుదేరెను.” Heb.11:8
పోరాటమును ఆయుధములను రెండిటిని మనకు చూపించుటకు దేవుడు దావీదు కథను బైబిల్‌లో నమోదుచేసియుండెను. దావీదు రెండు రకముల నష్టములను, వ్యక్తిగత నష్టమును జాతీయ నష్టమును అనుభవించెను. దావీదు వ్యక్తిగత నష్టములో మనము చూచినది అతని స్వంత వైఫల్యములవలనను, అజాగ్రత్తవలనను, నిర్లక్ష్యమువలననే, అయినను అతడు అన్నిటిని తిరిగి పొందవలెనని దేవుడు కోరుకొనెను. అదేవిధముగా, అతని వైఫల్యమువలనను మూర్ఖత్వమువలనను జాతీయముగా కోల్పోయినదంతయు తిరిగి పొందబడవలెనని దేవుడు కోరుకొనెను.
యెహోవా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన గొప్ప సారవంతమైన దేశమును గురించి మనము విన్నాము. ఈ కథ ఆదికాండము గ్రంథము, అధ్యాయము 12లో ప్రారంభమగును. కల్దీయుల ఊరు అను పట్టణపు అబ్రాహాము అను మనుష్యుడు ఉండెను. కల్దీయ దేశము అత్యంత నాగరికతగల దేశము, ఇది పురావస్తు శాస్త్రజ్ఞులచేత రుజువుచేయబడినది. అబ్రాహాము ధనవంతుడు, పుష్కలముగా బంగారము వెండి, సేవకులు, ఆస్తి, భూములు కలిగియుండెను. ఒకనాడు యెహోవా అకస్మాత్తుగా అతనికి కనబడెను మరియు అతడు దేవుని స్వరమును మిక్కిలి స్పష్టముగా ఇట్లు వినెను; ‘అబ్రాహామా, నీ దేశమునుండియు నీ బంధువులయొద్దనుండియు నీ తండ్రియింటనుండియు నేను నీకు చూపించు దేశమునకు బయలుదేరుము.’ అబ్రాహాము ఆ మాటను నమ్మెను. తాను దేవుని స్వరమును వినెనని అతనికి తెలియును, అందుకనే అతడు లోబడెను. దేవుడు అబ్రాహాముకు ఒక గొప్ప వాగ్దానమును Genesis 12:2, 3లో ఒక గొప్ప వాగ్దానమునిచ్చెను; ‘నిన్ను గొప్ప జనముగా చేసెదను. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పచేసెదను మరియు నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించువారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను శపించువారిని నేను శపించెదను, మరియు నీయందు భూమిలోని జనములన్నియు ఆశీర్వదింపబడును.
ఒక మనుష్యుడు దేవునికి లోబడినప్పుడు, ఆయన అతనిని ఆశీర్వదించును.
నేటి క్యాలెండర్ బైబిలు వచనం:
“ఆయన మీతో చెప్పునది ఏదైనను చేయుడి.” John 2:5.
మే 20
“నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ ఆశీర్వాదములన్నియు నీమీదికి వచ్చి నిన్ను పట్టుకొనును” Duet.28:2.
అబ్రాహాము సంతానము ఐగుప్తును విడిచి కనానుకు వెళ్లునప్పుడు, ఆ దేశములో ఏడు జనములు నివసించుచున్నవని ద్వితీ.7:1లో మోషేద్వారా దేవుడు వారికి చెప్పెను. నాలుగువందల ఏబది సంవత్సరములకుపైగా ముందు, దేవుడు ఆ దేశమును అబ్రాహాముకును అతని సంతానమునకును ఇచ్చెదనని వాగ్దానము చేసియుండెను. దేవుడు మరచిపోలేదు. దేవుడు ఎన్నడును మరచిపోడు. దేవుడు ఏమి చెప్పినను, ఆయన జ్ఞాపకముంచుకొని దానిని చేయును. ఆయన చేయు వాగ్దానములను ఆయన నెరవేర్చును. కాని ఆయన ఆ వారసత్వముకొరకు తన ప్రజలను సిద్ధపరచుటకు అనేక శతాబ్దములను వెచ్చించెను.
ద్వితీయోపదేశకాండము యొక్క అదే అధ్యాయములో, ఆ ఏడు జనములన్నియు ఆ దేశమునుండి పూర్తిగా వెళ్లగొట్టబడుననియు దేవుడు తన ప్రజలతో చెప్పెను. అప్పుడు దేవుడు ఇట్లు కూడ చెప్పెను; ‘వారితో ఏ నిబంధనగాని సంధిగాని చేయకుడి. వారి కుమార్తెలను భార్యలుగా తీసికొనకుడి, మీ కుమార్తెలను వారికి వివాహము చేయకుడి. వారి తోపులను విగ్రహములను పడగొట్టుడి.’ దేవుడు ఇంత స్పష్టముగా మాట్లాడెను, అయినను వారు పూర్తిగా లోబడలేదు. అది వారి మొదటి వైఫల్యము.
మనము దేవునికి లోబడగోరుచున్నప్పటికిని, మనము ఆయనకు పూర్తిగా లోబడనిది ఎన్నిసార్లు జరుగుచున్నదో. కేవలం కొన్ని విషయములలో మాత్రమే మనము ఆయనకు లోబడకపోవచ్చును. యెహో.1:12 దీనిని చూపించును. వారు, ‘ఇప్పుడు ఈ మనుష్యులు మా బానిసలు. మాకు నీళ్లు తెచ్చుటకు మేము వారిని ఉపయోగించుకొందుము’ అని చెప్పిరి. ఈవిధముగా సాతాను నేలను గెలుచుకొనెను. తర్వాత వివాహమునందు తప్పులు వచ్చెను, మరియు దేవుని ప్రజలు దేశములోనికి వచ్చినను, వారు విగ్రహారాధన చేయుటకు కూడ ప్రారంభించిరి, వారు ఆ దేశమును ఆస్వాదింపలేకపోయిరి.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “మీరు నా నామమున ఏమి అడిగినను నేను చేసెదను.” John 14:13.
మే 21
“నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొని ఆయన మార్గములలో నడచినయెడల, యెహోవా నిన్ను తనకు పరిశుద్ధ జనముగా స్థిరపరచును.” Duet.28:9.
బెన్యామీను మనుష్యులు కొంతమంది యెబూసీయులను యెరూషలేములో ఉండనిచ్చిరి. వారు మొదట అక్కడ బానిసలుగా నివసించుచుండిరి. తర్వాత వారు మిక్కిలి బలమైన జాతిగా మారిరి. దావీదును అతని మనుష్యులును యెరూషలేమునకు వచ్చినప్పుడు, యెబూసీయులు దావీదును ఎగతాళి చేయుటకు ప్రారంభించిరి. వారు, ‘దావీదు ఎవరు? గుడ్డివాడు కూడ దావీదుతో వెళ్లి పోరాడగలడు’ అని చెప్పుటకు ప్రారంభించిరి. వారు యెరూషలేములో దేవుని మనుష్యుడైన దావీదును ఎగతాళిచేసి పరిహసించునంతగా నేలను గెలుచుకొనియుండిరి.
మనము విశ్వాసులముగా కూడ అనేక నష్టములను అనుభవించుచున్నామని చూచుట ఎంత దుఃఖకరము. తిరిగి జన్మించితిమని చెప్పుకొను వారితో నేనిప్పుడు మాట్లాడుచున్నాను. సందేహములేకుండ కొద్దికాలము వారికి సమృద్ధియైన ఆనందము, గొప్ప ఆసక్తి, గొప్ప శాంతి, దేవుని వాక్యముపట్ల గొప్ప ఆకలి ఉండెను; కాని ఇప్పుడు మనము వారిని చీకటిలోను, ఓటమిలోను, వైఫల్యములోను, మత్సరములోను, గొడ్రాలుతనములోను చూతుము, ఎందుకనగా ఒక్క యెబూసీయుడేగాక అనేకమంది యెబూసీయులు వారి హృదయములలోనికి, వారి ఇండ్లలోనికి, వారి కుటుంబములలోనికి తమ మార్గమును కనుగొనియున్నారు.
ఆ యెబూసీయులను వెళ్లగొట్టుట దావీదుకు తేలికైన పనికాదు. దేవుడు తన స్వంత విధముగా అతనిని సిద్ధపరచవలసివచ్చెను. అన్నిటికంటె మొదట దేవుడు దావీదును సౌలుద్వారాను అబ్షాలోముద్వారాను ఇతరులద్వారాను ఎనిమిది సుదీర్ఘ సంవత్సరముల బాధాకరమైన శ్రమగుండా తీసుకొనిపోయెను. అప్పుడు ఆయన అతనిని హెబ్రోనుకు తీసుకొనివచ్చెను. అక్కడ ఆయన అతనిని ఏడు సంవత్సరముల ఆరు నెలలు ఉంచెను, మరియు అక్కడనుండి ఆయన అతనిని సియోనుకు తీసుకొనివచ్చెను. అప్పుడు మాత్రమే అతడు సియోనునుండి వారిని వెళ్లగొట్టగలిగెను. అప్పుడు పరలోక ప్రణాళిక వచ్చెను, అప్పుడు మందిరము వచ్చెను, అప్పుడు మహిమ వచ్చెను.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “నేను ప్రేమించువారందరిని గద్దించి శిక్షించెదను.” Rev.3:19
మే 22
“దేవుడు తనను ప్రేమించువారికొరకు సిద్ధపరచిన సంగతులు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్యుని హృదయములోనికి రాలేదు.” (2 Cor.2.9)
ఇవి రెండు రకముల నష్టములు; వ్యక్తిగత నష్టము, సామూహిక నష్టము. మొదటి నష్టము మనము వ్యక్తిగతముగా కలిగించుకొనునది, రెండవది సంఘము మొత్తముచేత కలిగించుకొనబడునది. ఇప్పుడు మనము విశ్వాసులముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము యొక్క అవయవములమని దేవుని వాక్యము చెప్పుచున్నది. శరీరము యొక్క ప్రతి అవయవము మిక్కిలి అవసరమైనదిగను విలువైనదిగను ఉన్నది. కొన్ని చిన్న అవయవములు, కాని శరీరములో అవి మిక్కిలి ప్రాముఖ్యమైన కార్యమును నిర్వహించును. ఒక అవయవము బాధపడినప్పుడు శరీరమంతయు బాధపడును. మనము విశ్వాసులముగా నష్టపు గొడ్రాలుతనపు జీవితమును జీవించునప్పుడు, శరీరమంతయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘము, బాధపడును. మన నష్టము సంఘము మొత్తమునకు నష్టము. అదేవిధముగా మన పునరుద్ధరణ అందరికిని ఆనందముగను ఆశీర్వాదముగను ఉండును.
మరల ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు ఒక గొప్ప ఆత్మీయ వారసత్వమున్నదని మనకు తెలియును; అది పరలోకమైన వారసత్వము, అపవిత్రతలేనిది, ఎన్నడును వాడిపోనిది. ఏ మనుష్యుడును దానిని పూర్తిగా గ్రహింపలేడు. అయినను మనము ఓటమి వైఫల్యముల జీవితమును జీవించుటను కొనసాగించుచున్నాము, ఎందుకనగా మన పరలోక వారసత్వమును ఎట్లు ఆస్వాదించవలెనో మనకు తెలియదు. దేవుడు కనబడి అబ్రాహాముతో మిక్కిలి స్పష్టముగా, ‘నీ దేశమును, నీ ఆస్తిని, నీ బంధువులను విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము’ అని చెప్పెను. అతడు దేవునికి లోబడెను. కాని ఒక చిన్న తప్పు అతని జీవితములోనికి భారమైన నష్టమును తీసికొనివచ్చెను. ఇది తప్పుడు భాగస్వామ్యముద్వారా కలిగిన నష్టము.
లోతువలన, దేవుడు అబ్రాహాముతో స్పష్టముగా మాట్లాడలేకపోయెను. దేవుడు ఆరంభమునుండి అతనిని నడిపించుచుండెను, కాని చివరకు అతడు ఆగిపోయెను. ఎందుకనగా, లోతువలన, అబ్రాహాము దేవుని సన్నిధి యొక్క చైతన్యమును కోల్పోయియుండెను. పునరుద్ధరణ కలుగవలెనన్నచో అది వేరుపడుటద్వారానే సాధ్యమగును.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “యెహోవా చేసిన గొప్ప కార్యములన్నిటిని మీ కన్నులు చూచినవి.” Deut 11:7.
మే 23
“లోతు అబ్రాహామునొద్దనుండి వేరుపడిన తర్వాత యెహోవా అబ్రాహాముతో, నీ కన్నులెత్తి చూడుము అని చెప్పెను.” (Gen 13.14)
దేవుడు అబ్రాహాముకు మరల కనబడెను, కాని లోతు అతనినుండి వేరైన తర్వాతనే. బైబిల్‌లోని ఈ వాక్యభాగమును దయచేసి గుర్తుంచుకొనుడి: ‘లోతు అతనినుండి వేరైన తర్వాత’. తాను అతనికిని అతని సంతానమునకును శాశ్వతముగా ఏ గొప్ప వారసత్వమును ఇచ్చుచున్నాడో అబ్రాహాముకు చూపించుటకు దేవుడు ఇప్పుడు సమర్థుడాయెను. మీ జీవితములో ఏదో లోతువలన మీరు దేవునితో నిజమైన సహవాసమును ఆస్వాదింపలేకున్నారు. అబ్రాహాము తనను తాను లోతునుండి వేరుపరచుకొన్నప్పుడు, దేవుడు అతనికి వాస్తవమాయెను, అతడు దేవునితో మనుష్యుడు మనుష్యునితో మాట్లాడినట్లు మాట్లాడగలిగెను, అందుకనే దేవుని నిమిత్తము అతడు తన దేశమును పశువులను ఇతర విలువైన వస్తువులను వదిలిపెట్టగలిగెను. దేవుడు అతనికి వాస్తవముగా ఉండెను.
లోతు అతనితోకూడ ఉన్నప్పుడు, దేవుడు మౌనముగా ఉండెను. అతడు కొన్నిసార్లు, ‘నేనేమి చేయవలెను?’ అని తలంచియుండవచ్చును. కాని లోతు అతనినుండి వెళ్లిపోవువరకు దేవుడు అతనికి జవాబియ్యలేదు.
హెబ్రోను విషయమునకు వచ్చిన, అది గురించి చెప్పు మొదటి విషయము సహవాసము, మొదటిగా తోటివిశ్వాసులతో సహవాసము. లోతుతో స్నేహము మిమ్మును ఈ సహవాసములోనికి తీసుకొనిరాదు; మీరు మీ లోకసంబంధమైన స్నేహములను సంబంధములను విడగొట్టవలెను, అప్పుడు దేవుడు మీకు నిత్యత్వముకొరకు తన స్వంత స్నేహమునిచ్చును.
హెబ్రోను గురించి చెప్పు రెండవ విషయము విశ్వాసము. Joshua 14:11-13 నందు కాలేబు అను మనుష్యుని గురించి మనము చదువుదుము. అతడు యెహోషువయొద్దకు వచ్చి, ‘నాకు హెబ్రోనునిమ్ము. అక్కడ అనేకమంది మహాకాయులున్నను నేను వారిని జయించగలను. నేను అనేక సంవత్సరములు దేవుని రుజువుచేసికొనియున్నాను’ అని చెప్పెను. కావున హెబ్రోను విశ్వాసమును గురించి చెప్పుచున్నది. మహాకాయులకు భయపడకుడి, కాని వారికి వ్యతిరేకముగా పోరాడుటకు సిద్ధముగా ఉండుడి. మీ జీవముగల విశ్వాసముద్వారా మీరు ప్రతి మహాకాయుని, అడ్డంకిని, ఆటంకమును జయించగలరు.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “మీరు వెలతో కొనబడితిరి; మనుష్యులకు దాసులు కాకుడి.” I Cor 7:23
మే 24
“యెహోవా కత్తిచేతను ఈటెచేతను రక్షింపడు; యుద్ధము యెహోవాదే.” (1 Sam.17:47).
అరౌనా యొక్క కళ్లపు కథ దావీదు యొక్క నాలుగవ నష్టము యొక్క కథ. దేవుడు దావీదును రెండుసార్లు కళ్లమునకు తీసుకొనిరావలసివచ్చెను (I Chron 13 మరియు II సమూ.24). కళ్లము అనునది గోధుమను నూర్చు స్థలము, పొట్టునుండి గింజను వేరుచేయుటకు. అప్పుడు, తూర్పారబట్టుటద్వారా, గాలి పొట్టును గోధుమనుండి వేరుచేయును.
ఇప్పుడు II సమూయేలు 24లో, దావీదు తన సేనాధిపతియైన యోవాబుకు, ‘వెళ్లి మా రాజ్యములోని యోధులను లెక్కించుము’ అని ఆజ్ఞాపించిన విధమును మనము చదువుదుము. తన స్వంత బలముచేతగాని తన సైన్యపు శక్తిచేతగాని తాను ఎన్నడును ఏ యుద్ధమును గెలువలేదని దావీదుకు పూర్తిగా తెలియును. అయినను, ఇప్పుడు అతడు తన రాజ్యములో అందుబాటులోనున్న యోధుల సంఖ్యను చూపించుకోగోరెను. అతడు అహంకారియైయుండెను, మరియు తన విజయముకొరకు తన సైన్యముమీద ఆధారపడుచుండెను. యోవాబు అతనితో, ‘మహారాజా! మీరు మీ స్వంతముగా ఏ యుద్ధములను గెలువలేదు. మీకొరకు పోరాడినది దేవుడే. మీరు ఈ మనుష్యులను ఎందుకు లెక్కించగోరుచున్నారు? నీ దేవుడైన యెహోవా ప్రజలను, వారు ఎంతమందిగా ఉన్నను, నూరురెట్లు చేయునుగాక; అయినను వారు మిమ్మును రక్షింపబోవుటలేదు. మీకు సహాయపడినవాడు దేవుడు మాత్రమే.’ అయితే, దావీదు అహంకారియై ప్రజలను లెక్కించవలెనని పట్టుబట్టెను. కావున రాజు మాటయే నెగ్గెను. దావీదు పశ్చాత్తాపపడి యెహోవాకు మొరపెట్టుకొనెననునది నిజము; ‘నేను చేసిన దానియందు ఘోరముగా పాపము చేసితిని; మరియు ఇప్పుడు, నిన్ను వేడుకొనుచున్నాను, నీ దాసుని దోషమును తొలగింపుము; ఎందుకనగా నేను మిక్కిలి మూర్ఖముగా చేసియున్నాను,’ కాని దావీదు పాపము ఫలితముగా దేవుడు దేశములోనికి మూడు దినముల తెగులును పంపెను మరియు డెబ్బది వేలమంది మనుష్యులు మరణించిరి. ఎంత నష్టము! ఎంత భయంకరమైన నష్టము!
చివరకు దేవుడు నాశనము చేయు దూత చేతిని అరౌనా కళ్లమునొద్ద ఆపెను.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు కూడ ప్రభువు.” Mathew 12:8.
మే 25
“ఇదంతయు, దావీదు చెప్పెను, యెహోవా తన హస్తము నామీద ఉంచి వ్రాతమూలముగా నాకు గ్రహింపజేసెను, ఈ మాదిరి యొక్క పనులన్నిటిని కూడ.” ( I Chron. 28:19).
లో 2 Chron. 3:1 నందు అదియే మందిరపు స్థలముగా తర్వాత మారిన స్థలమని మనము చదువుదుము, మరియు దావీదుకును జాతికిని కలిగిన ఆ భయంకరమైన నష్టమునుండి, దేవుడు క్షమాపణను సంపూర్ణ పునరుద్ధరణను మాత్రమేగాక దానికితోడు మరి ఎంతో ఇచ్చెను. దావీదు కుమారుడైన సొలొమోను చేత తర్వాత కట్టబడబోవు మందిరము యొక్క పరలోక మాదిరిని దేవుడు దావీదుకిచ్చెను, సొలొమోను తన తండ్రియైన దావీదు ఇచ్చిన సూచనలన్నిటిని నెరవేర్చెను. అతడు మందిరమును కట్టెను, మరియు పని పూర్తియైనప్పుడు, మందిరము సంపూర్ణమైనప్పుడు, సొలొమోను మందిరములో బలులు అర్పించెను. అది జాతి అంతటికిని అత్యంత ఆనందకరమైన దినము. అనేక శతాబ్దముల నష్టమంతయు తిరిగి పొందబడియుండెను. వారు దేవుని మహిమను చూచిరి, మరియు దేవుడు వచ్చి వారిమధ్య నివసించెను. మందిరములో కెరూబులమధ్యనుండి ఆయన వారితో మాట్లాడగలిగెను, మరియు జనములన్నియు వచ్చి సొలొమోను ఎదుట సాష్టాంగపడవలసివచ్చెను. వారు జాతిగా గొప్ప నష్టములను, భయంకరమైన నష్టములను కలిగించుకొనియుండిరి. కాని ఇప్పుడు కథ మార్చబడెను. ఇప్పుడు వారు దేవుని ప్రజలు మరియు దేవుడు తన సంపూర్ణ మహిమలో వారితోకూడ ఉండెను. ఇప్పుడు నిజమైన పునరుద్ధరణ ఉండెను, మరియు వారు నిజముగా దేవుని ప్రజలని పిలువబడగలిగిరి.
సియోనులో, యెహోవా దావీదును మందిరపు దృష్టికి తీసుకొనివచ్చెను. దేవుడు దావీదును మానవ జ్ఞానమునుండి పూర్తిగా విడుదల చేయబడిన స్థలమునకు, పూర్తిగా విరిగి పొట్టునంతటినుండి ఖాళీచేయబడిన స్థలమునకు తీసుకొనివచ్చెను; ఆపై అతనికి మందిరపు దృష్టిని బయలుపరచెను. పని పూర్తియైనప్పుడు, దేవుని అగ్ని దిగివచ్చెను మరియు ఆయన మహిమ ఆ స్థలమును నింపెను. దేవుడు స్పష్టముగా మాట్లాడుటకు ప్రారంభించెను. అదియే సియోను, పరలోక ప్రణాళిక ప్రకారము దేవుడు ప్రతి హృదయములోను ప్రతి సంఘములోను ఏలు నిజమైన సియోను. సియోనుద్వారానే ఆయన తన జ్ఞానమును శక్తిని చూపించును, మరియు అక్కడ మాత్రమే మనము దేవుని సంపూర్ణతను మహిమను చూడగలము. నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “ఆయన మీతో చెప్పునది ఏదైనను చేయుడి.” John 2:5.
మే 26
“మా సహవాసము తండ్రితోను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోను నిజముగా ఉన్నది”. 1 John.1:3 “ఆయన వెలుగులో ఉన్నప్రకారము మనము వెలుగులో నడచినయెడల, మనమొకనితో ఒకడు సహవాసము కలిగియుందుము”. 1 John.1:7.
ఇప్పుడు మనుష్యులముగా మనము కలిగించుకొను రెండు రకముల నష్టములు కలవు. మొదటి రకమైన నష్టము మనకు రక్షణ యొక్క అనుభవము లేనప్పుడు కలుగును, మరియు అప్పుడు మనము ఏమి చేసినను సమస్తమును వైఫల్యమే నష్టమే.
రెండవ రకమైన నష్టము తిరిగి జన్మించినవారికి కూడ కలుగును, బహుశా జ్ఞానము లేకపోవుటవలననో, లేదా తమ స్వంత మూర్ఖత్వముద్వారానో. ఇప్పుడు ప్రతి నష్టమును తిరిగి పొందుటకు మనము ఉపయోగించగల ఆయుధములను మార్గములను అభ్యసింతము. మన నష్టములను తిరిగి పొందుటకు దేవుడు ఉపయోగించు రెండు గొప్ప మార్గములు కలవు, అవి, హెబ్రోను, సియోను. ఈ రెండు సాధనములద్వారా దేవుడు తన ప్రజలమీదికి వచ్చిన ప్రతి నష్టమును తిరిగి పొందించెను. హెబ్రోను అనగా సహవాసము: మొదటిగా, దేవునితో సహవాసము, అనగా తండ్రితో, రెండవదిగా, 1John 1:3మనమందరిమధ్య సహవాసము, మనము ,4,7లో చూచునట్లు. ఒక పాపి దేవునితో మాట్లాడలేడు, ఆయనచేత నివసింపబడలేడు. ఒక పాపి దేవుని చిత్తమును కనుగొనలేడు, దేవుని ప్రణాళికను గాని ఉద్దేశ్యమును గాని రహస్యములనుగాని అర్థముచేసికొనలేడు.
మన పాపములు క్షమింపబడి మన హృదయములు శుద్ధిచేయబడినప్పుడు, దేవుని సన్నిధిలో ఉండవలెనను ఆరాటము మన హృదయములలో కలుగును. దేవునితో ఆ సహవాసము ఆయన ప్రజలతో నిజమైన సహవాసమును కలిగియుండుటకు మనలను శక్తులనుగా చేయును. మనము దేవునితో ఎంత ఎక్కువగా నడచుచు దేవునికి సమీపముగా జీవించుచున్నామో. అంతగా మనము దేవునితోను ఆయన ప్రజలతోను సహవాసమును ఆస్వాదింపగోరుదుము; ఈ రెండును కలిసియుండును అవి వేరుచేయబడలేవు.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “చెడ్డదైనదానిని అసహ్యించుకొనుడి; మంచిదైనదానిని హత్తుకొనుడి. Rom. 12:9.
మే 27
“నీవు నమ్మగలిగినయెడల, నమ్మువానికి సమస్తమును సాధ్యమే.” (Mark 11:23). Matt .17:20 ప్రకారము విశ్వాసముద్వారా పర్వతములు కూడ తీసివేయబడగలవు. హెబ్రోను అనగా ఈ విశ్వాసమే. మరల హెబ్రోను ఆశ్రయస్థలముగా కూడ ఉండెను Joshua 21:10,11,27. హెబ్రోను యొక్క మూడవ అర్థమేమి? ఆత్మీయముగా బలహీనులైనవారు పడిపోయినప్పుడు లేదా ప్రమాదములో ఉన్నప్పుడు, వారి భారమును మనము మోయవలెను, పరిశ్రమతోను పట్టుదలతోను ప్రార్థించి, ప్రేమచేతను దయచేతను వారిని లేవనెత్తవలెను.
నాలుగవదిగా, హెబ్రోను దేవునిమీద సంపూర్ణ ఆధారపడుటను సూచించును. అనేకమంది విశ్వాసులును దేవుని సేవకులును తమ ప్రణాళికలకొరకు దేవుని ఎట్లు సంప్రదింపవలెనో తెలియకపోవుటవలన భారమైన నష్టములను అనుభవించుచున్నారు. దావీదు 2 Samuel 2:1నందు హెబ్రోనుకు వచ్చినప్పుడు, అతడు ఖాళీచేయబడినవాడుగను, దీనుడుగను, విరిగినవాడుగను అయియుండెను. ప్రతి విషయములోను అతడు దేవుని విచారించెను. ‘నేను వెళ్లవలెనా? నేను వెళ్లవలెనా? నేను ఎక్కడికి వెళ్లవలెను? నేనెప్పుడు వెళ్లవలెను? అది ప్రతి నష్టమును తిరిగి పొందు నాలుగవ మార్గము. ప్రతి ఆత్మవిశ్వాసమునుండి మిమ్మును ఖాళీచేసికొని ప్రతిదానికొరకు దేవునియొద్దకు వెళ్లుటకు సమయమును కనుగొనుడి. మీ డబ్బును ఎట్లు వెచ్చించవలెనో కూడ ఆయనను అడుగుడి!
అదేవిధముగా ప్రతి సంఘ విషయములోను దేవుడు సంప్రదింపబడవలెను. హెబ్రోనులో, ప్రతి కార్యమును గురించి, ప్రతి కదలికను గురించి, వ్యక్తిగతముగాను సామూహికముగాను దేవుని విచారింపవలెనని మీరు నేర్చుకొందురు, ఇట్లు చెప్పుచు: “మేమేమి చేయవలెను? మేమెక్కడికి వెళ్లవలెను? మరల, మనము చూచినట్లు, వివాహమును గురించి దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలెనో అనేకమంది ప్రజలకు తెలియదు.
ఈ విధముగానే అనేకమంది విశ్వాసులు నాశనమొంది, సంతోషములేని నాశనమైన ఇండ్లను కలిగియున్నారు, ఎందుకనగా ప్రభువును ఎట్లు విచారించవలెనో ఆ పాఠమును వారు ఎన్నడును నేర్చుకొనలేదు. దావీదుకు కూడ, అనేక సంవత్సరముల బాధల తర్వాతనే అతడు ఆ పాఠమును నేర్చుకొనెను: ‘ప్రభువా, నేను వెళ్లవలెనా? నేను వెళ్లవలెనా?
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “మీ మాటలు ఉప్పువేసి రుచిపరచినట్లు ఎల్లప్పుడు కృపాసహితముగా ఉండనిండు.” Col 4:6.
మే 28
“దావీదు అంతకంతకు ఘనుడగుచుండెను; సైన్యములకధిపతియగు దేవుడైన యెహోవా అతనికి తోడైయుండెను.” 2 Sam 5:10.
కొన్ని దైవిక సూత్రములను అనుసరించుటద్వారా అతని వ్యక్తిగత జాతీయ నష్టములన్నిటిని తిరిగి పొందించుటకు దేవుడు దావీదును హెబ్రోనుకును సియోనుకును ఎట్లు తీసుకొనివచ్చెనో మనము చూచియున్నాము. దావీదు హెబ్రోనులో ఏడు సంవత్సరముల ఆరు నెలలు ఉండిన తర్వాత, అతడు సియోనుకు వచ్చెను. దేవుడు మొదట దావీదును హెబ్రోనులో సిద్ధపరచవలసివచ్చెను, అక్కడ అతడు సహవాసము యొక్క సంపూర్ణ అర్థమును నేర్చుకొనెను. హెబ్రోను తర్వాత దావీదు సియోనుకు తీసుకొనిరాబడెను. ద్వితీ.7 ప్రకారము ఇశ్రాయేలీయులు ఆ దేశములో నివసించుచున్న ఏడు జనములన్నిటిని వెళ్లగొట్టవలసియుండెను, మరియు వారితో ఏ నిబంధనగాని కలిసి వివాహము చేసికొనుటగాని చేయకూడదు.
అయితే వారి మానవ జ్ఞానమువలన, వారు దేవునికి విఫలమైరి; ఏడు జనములన్నియు అక్కడనే ఉండిపోయెను, మరియు ఇశ్రాయేలు జాతి అంతటికిని గొప్ప నష్టమును కలుగజేసెను. 2 సమూ. 5లో దావీదు యెబూసీయులనుండి సియోనును తీసుకొని ఆ పట్టణములో తన సింహాసనమును స్థాపించిన విధమును మనము చదువుదుము. అయ్యో! తన పాపభరిత అహంకారములో అతడు ప్రజలను లెక్కించవలెనని పట్టుబట్టెను, దానికి దేవుడు అతనిని శిక్షింపవలసివచ్చెను. అప్పుడు ప్రవక్త ఆజ్ఞమేరకు, దావీదు అరౌనా కళ్లమునకు వెళ్లి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి అట్లు దేవుని మందిరముకొరకు స్థలమును కనుగొనెను. అదియే సియోనును గురించిన మొదటి దైవిక సూత్రము: అది దేవుని మందిరము యొక్క స్థలము.
మనము మొదట దేవుని స్వంత మార్గములోనికి తీసుకొనిరాబడవలెను మరియు రెండవదిగా ఆయన సేవకొరకు మన స్వంత జ్ఞానముమీదను, నేర్పుమీదను, అర్హతమీదను మనము ఆధారపడకూడదు. దేవుడు దావీదుకు తన మందిరముకొరకు స్థలమును బయలుపరచిన తర్వాత, ఆయన అతనికి తర్వాత మందిరము యొక్క మాదిరిని వ్రాతమూలముగా ఇచ్చెను. ఇది సియోను యొక్క రెండవ దైవిక సూత్రము: మన వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సంఘ జీవితముకొరకు పరలోక ప్రణాళిక. (1 దిన,28: 11).
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “మన విశ్వాససంబంధమైన మనఃపూర్వక ఒప్పుకోలును జారిపోనియ్యక గట్టిగా చేపట్టుకొందము.Heb. 10:23
మే 29
“జ్ఞానముగల నిర్మాణాచార్యునివలె నేను పునాదివేసితిని... వేయబడిన పునాదికంటె వేరొక పునాదిని ఎవడును వేయలేడు, అది యేసుక్రీస్తే. 1 Cor 3:10, 11.
‘యుద్ధములలో గెలిచిన కొల్లసొమ్మునుండి, వారు యెహోవా మందిరమును పోషించుటకు ప్రతిష్ఠించిరి’. మూడవ దైవిక సూత్రము ప్రణాళికను నెరవేర్చుటకు వస్తువులను సమకూర్చుటయే. మనము దేవుని ఆలయములోనికి అవసరమైన వస్తువులను తీసికొనిరాగల ఆధిక్యతను కలిగియుండుటకు, దేవుడు మన జీవితములలో యుద్ధములను అనుమతించును.
దావీదు యెహోవా మందిరముకొరకు స్థలమును కనుగొని, ప్రణాళికను పొంది, వస్తువులను సమకూర్చిన తర్వాత, తర్వాత అతడు కోరుకొన్నది ఒక జ్ఞానముగల నిర్మాణాచార్యుడు. దేవుడు సొలొమోనును ఎన్నుకొన్నప్పుడు (1 Kings 2:12; 3:11) అతడు దేవుని తనకు జ్ఞానమునిమ్మని అడిగెను (1 Kings 3:5, 9). ఈ విధముగా అతడు జ్ఞానముగల నిర్మాణాచార్యుడాయెను. దేవుని పని శాంతముగా సాగవలెనన్నచో, అపొస్తలిక దృష్టిని అనుభవమును గల మనుష్యులు ఉండవలెను. దేవుని పనికొరకు, దేవునికి అన్ని రకముల పనివారు అవసరము. దేవునికి లోకమునందలి ప్రతి భాగమునుండి నేర్పరులైన పనివారు అవసరము. అప్పుడు మాత్రమే పని సజావుగా సాగగలదు.
వారు కట్టుటకు బరువైన రాళ్లను పెద్ద కలపను, భారీ దూలములను ఉపయోగించుచున్నను, మందిరములో ఏ రకమైన పనిముట్టు ధ్వనియు వినబడలేదు. దేవుని పని పరిపూర్ణ ఐక్యతతోను సామరస్యముతోను సాగుటకు, దేవుని ప్రణాళికను తెలిసికొనుట మిక్కిలి అవసరము.
సొలొమోను ప్రార్థన ముగించినప్పుడు, దేవుని అగ్ని దహనబలులను బలిని దహించివేసెను, మరియు యెహోవా మహిమ ఆ మందిరమును నింపెను, పని పూర్తియైనప్పుడు మాత్రమే దేవుని మహిమ దిగివచ్చెను, మనము కూడ ఆయన మహిమను చూతుము. అసంపూర్ణమైన పని దేవుని మహిమకు కారణము కాజాలదు. దేవుడు తన ఉద్దేశ్యములో దావీదును సియోనుకు తీసుకొనివచ్చెను, తనను తన ప్రజలందరికిని బయలుపరచుటకు.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “యెహోవా జ్ఞానముగల దేవుడు, ఆయనచేత క్రియలు తూచబడును. 1Sam. 2:3.
మే 30
“దేవుని పట్టణమా, నిన్నుగూర్చి మహిమగల సంగతులు చెప్పబడియున్నవి.”Psa. 87:3.
సియోనును గురించి మనము మరికొంత నేర్చుకొందుము Ps. 87:2నందు, “యాకోబు నివాసములన్నిటికంటెను యెహోవా సియోను గుమ్మములను ప్రేమించుచున్నాడు.” దేవుని ఉద్దేశ్యములను గ్రహించుటకుముందు యాకోబు అనేక అనుభవములగుండా వెళ్లవలసివచ్చెను. కీర్తన 87:2లోని “యాకోబు నివాసములన్నియు” అతడు తనకొరకు చేయుచున్న దానంతటిని, తన స్వంత ప్రయత్నములను, తన స్వంత పోరాటములను, తన స్వంత యుద్ధములను, దేవుని ఆశీర్వాదమును పొందుటకు తన మానవ ప్రయత్నములన్నిటిని గురించి చెప్పుచున్నవి. అతడు మానవ పద్ధతులద్వారా జ్యేష్ఠత్వపు వంతును పొందుటకు ప్రయత్నించుచుండెను.
“సియోను గుమ్మములు” (వచనం ఒకటి). దేవుని ప్రేమ సియోనువైపు ఉన్నది. “యెహోవా సియోను గుమ్మములను ప్రేమించుచున్నాడు” అని లేఖనము చెప్పుచున్నది. మనము కూడ దేవుని ప్రేమను దాని సంపూర్ణతలో ఆస్వాదింపగోరినయెడల మనము సియోనులో భాగము కావలెను. సియోనులో మాత్రమే మనము ప్రతి నష్టమును తిరిగి పొందగలము, కావున ప్రభువు మన దృష్టిని సియోనువైపు తిప్పుటకు నిరంతరము ప్రయత్నించుచున్నాడు.
Genesis 14:18, 19. దేవుని వాక్యములో సియోనును గురించిన మొదటి ప్రస్తావన ఇదియే. “షాలేము” అను పేరు అర్థము శాంతి; మరియు షాలేము లేదా యెరూషలేము శాంతి పట్టణము. అబ్రాహాము సొదొమ రాజుచేత మోసగింపబడకముందు దేవుడు అతనికి షాలేము రాజును, మహోన్నత దేవుని యాజకుడునైన మెల్కీసెదెకును పంపెను, అతడు అతనిని ఆశీర్వదించెను (వ. 19). కావున, సొదొమ రాజు సమస్త ధనమునిచ్చెదనని చెప్పినప్పుడు, అబ్రాహాము ఒక దారమునుగాని చెప్పులమూతినిగాని ముట్టుటకు కూడ నిరాకరించెను.
అబ్రాహాముకు ఇటువంటి విశ్వాసము ఎట్లు కలిగెను? సియోనునుండి మహోన్నత దేవుని యాజకుడైన మెల్కీసెదెకు వచ్చెను, మరియు అతనినుండి అబ్రాహాము నిజమైన ఆశీర్వాదమును పొందెను, ఎందుకనగా భూమ్యాకాశములకు యజమానియైన మహోన్నత దేవుని నామమున మెల్కీసెదెకు అతనిని ఆశీర్వదించెను.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “నీ యౌవనదినములలో నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసికొనుము. Eccl. 12:1
మే 31
“యెహోవా ప్రమాణము చేసెను, ఆయన మారుమనస్సు పొందడు; నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిత్యము యాజకుడవై యుందువు.” (Ps. 110:4:Heb. 7:4, 12)
మెల్కీసెదెకు అబ్రాహామును ఆశీర్వదించుట మాత్రమేగాక, అతడు సియోనునుండి ఆహారమును కూడ అతనికి తీసికొనివచ్చెను: అతడు అతనికి రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చెను (Gen. 14:18). ప్రతి ఆశీర్వాదము దేవునినుండి వచ్చునని అబ్రాహాము నమ్మెను, అందుకనే అతడు తన దశమభాగమును దేవునికి ఇచ్చెను (Gen.14:20).
దశమభాగము అతని విశ్వాసమును, మరియు కృతజ్ఞతాస్తుతి యొక్క అనుభవమును కూడ గురించి చెప్పుచున్నది. 2 Chron. 3:1 ప్రకారము, మోరీయా పర్వతము అబ్రాహాము తన చివరి పరీక్షను ఉత్తీర్ణుడైన స్థలము (Gen. 22) దేవుడు అబ్రాహాముకు పదిసార్లు కనబడెను, మరియు పదవసారి ఆయన మోరీయా పర్వతమున అతనికి కనబడెను. దేవుని స్నేహితుడగుటకు అతడు ఈ పది పరీక్షలను ఉత్తీర్ణుడవవలసివచ్చెను. తన చివరి పరీక్షను ఉత్తీర్ణుడగుటకు దేవుడు అతనిని సియోనుకు తీసుకొనివచ్చెను.
దీనితర్వాత దేవుడు అబ్రాహాముకు పూర్తిగా కట్టుబడెను. అబ్రాహాము దేవునికి లోబడెను మరియు దేవుడు ఆజ్ఞాపించినదంతయు అతడు చేసెను. అదేవిధముగా మీరు భయముగాని సందేహముగాని లేకుండ సియోనుకు వచ్చినప్పుడు, దేవుడు మీకు కట్టుబడియుండును. మీరు దేవుని దేనినైనను చేయమని ఆజ్ఞాపింపవచ్చును మరియు ఆయన మీకొరకు దానిని చేయును. ఏ మనుష్యుడైనను మనకు ఇంత ఇయ్యగలడా? దేవుని ఇంటికి దూరముగా ఉండకుడి లేదా దానిని తృణీకరింపకుడి. దేవుని పరిశుద్ధుల సహవాసమును తృణీకరింపకుడి, కాని దేవుని ఇంటిలో మీ పూర్తి భాగమును తీసుకొనుడి అప్పుడు మీరు నిశ్చయముగా ప్రతి నష్టమును తిరిగి పొందుదురు.
అబ్రాహాము జీవితమునుండి ఈ రెండు పాఠములు నేర్చుకొనుటకు మిక్కిలి ప్రాముఖ్యమైనవి. మీ ఆస్తిచేత దేవుని ఘనపరచుడి మరియు దేవుడు మాత్రమే మిమ్మును ఆశీర్వదించగలడని ఒప్పుకొనుడి; ఇది మొదటి పాఠము. రెండవది బలమైన కాని సరళమైన విశ్వాసముతో దేవుని ఇంటిలోనికి రావలెననునదే, అప్పుడు మీరు దేవుని ఉద్దేశ్యములో సంపూర్ణముగాను పూర్తిగాను కట్టబడియుందురు.
నేటి క్యాలెండర్ బైబిల్ వచనం: “నేను యెహోవా మందిరములో నిత్యము నివసించెదను.Ps.23:6.
↑ పైకి వెళ్ళండి ← పుస్తకానికి వెనుకకు ← పుస్తక భాండాగారానికి
