#96
యేసుక్రీస్తు దేవుడు
చరణము 1
దేవుని నీతి ప్రతాపం – భువి యేసుని సిలువ ప్రభావందేవుల దేవుని అపూర్పం – భువి యేసుని నామ స్వరూపందేవ యెహోవ సువాక్యం – సౌభాగ్యం – దేవ జనుల హృదయానందం
చరణము 2
||యేసు క్రీస్తు దైవ సుతుడు – యేసుక్రీస్తు మనుజసుతుడు – యేసుక్రీస్తు దేవుడు – యేసే ప్రభువు – స్తుతి పాత్రుడు ||
చరణము 3
ఆద్యంత రహిత కీర్తి అవతార శ్రమార్జనమూర్తిఆకాశ రాసుల ఆదిపతి – అవని సృజనాత్మక ప్రతీతిఅఖిల ప్రపంచ ప్రదాత – అధినేత – అనుదిన కృపాలిడు సుఖదాత
చరణము 4
పాపము భయపడు నామం పాపాత్ముడు కృపగను హోమంపతితుల వెదకిన ప్రేమస్వరం పరలోక సుఖాల విహారంపాప క్షమాపణ గానం – బహు – అనవరతము నిజబలిదానం
చరణము 5
జనుల జీవాధిపతి – జగమంతటి నేలెడు జ్యోతి జీవుల అంతిమ న్యాయపతి జీవాత్మలు క్రోలెడి నీతిజనన మరణ జయశీల – నరపాల – జగతిని మార్చెడి శుభజ్వాల