#95
క్రీస్తు దైవత్వము
పల్లవి · Pallavi
యేసు క్రీస్తుడు నిత్య దేవుడు – ఎరిగి నమ్మండి మనుజులారామోస మొందక మోక్షపతికింక – దాసులై – బ్రతుకండి రండి ||యేసు||
చరణము 1
ఆరు దినములలోపలనే – ఆకాశము భూలోకములను – ప్రకటముగ జేసినాడు – ప్రకాశుడాయన ప్రజ్వలింతుడు ||యేసు||
చరణము 2
ఆది పురుషుని యాదిసృష్టింక – హస్తములతోనంటి చేసెను – మేదినిన్ ఫలవనములోన – సాధులై నివసింప నిచ్చెను ||యేసు||
చరణము 3
వారలిద్దరి దేవునాజ్ఞను – కోరికలతో మీరినప్పుడు – గారడీ పిశాచ తంత్రము – వారి పరమై పాపులైరి ||యేసు||
చరణము 4
వీరలందరూ వారి సంతతి – వేరులేరీ ధరణిలో దు – ష్కార్యులై దేవుని యాజ్ఞలు – మీరి రందరు నరక పాత్రులు ||యేసు||
చరణము 5
ఇంత పాపభరితులైకా – సంత సత్యము లేని నరుల – నేంతగానో ప్రేమించెనో తన – సొంత ప్రాణము బలిగ బెట్టెనట్లు ||యేసు||
చరణము 6
పాపమించుకలేని కరుణా – పావనుడు నరుడాయెను – శాపగ్రస్తులమైన మన – శాపములు తానే చేతబూనెను ||యేసు||
చరణము 7
ఎన్నరాని బాధలొందుచు – పుణ్యరక్తము చిందినలను – ఎన్నడూ నీలాటి ప్రేమ – వన్నెలేదు యన్నలారా ||యేసు||
చరణము 8
మనల పాపమునుండి బాపను – మనుజుడై మరణంబునొంది – మన ప్రభువు మూడవ దినంబున – మహిని లేచి పరము వెళ్ళెను ||యేసు||