#94

యేసునకు సమానులు ఎవరు?

రచయిత: చెట్టి భానుమూర్తి

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
సమానులెవరు ప్రభో – నీ – సమానులెవరు ప్రభో – సమస్త మానవ – శ్రమాను భవమును – సహించి వహించి – ప్రేమింపగల నీ ||సమాను||
చరణము 1
సమాన తత్వము – సహోదరత్వము – సమంజసముగాను – మాకు దెలుప నీ ||సమాను||
చరణము 2
పరార్థమై భవ – శరీర మొసగిన – పరోపకారా – నరావతారా ||సమాను||
చరణము 3
దయాహృదయ యీ – దురాత్మ లెల్లరినన్ – నయాన భయాన – దయాన బ్రోవ నీ ||సమాను||
చరణము 4
ఓ పావనాత్ముడా – ఓ పుణ్య శీలుడా – పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుతుని ||సమాను||