#89

యేసునకు వందనము

రచయిత: పురుషోత్తము చౌదరి

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
వందనమయ్యా – యేసు నీకు – వందనమయ్యా – మా కోరిక – లందియ్యవయ్యా – వందనమయ్యా నీ సుందర పాదార – విందములకు భక్తి – వినుతులు గావింతు – సందియంబులు లేని పరమానందమున నీయందు డెందము – పొందుపడజేయవయ్య యెహోవా – నందనా పాప బంధనాగ్ని ||వందనమయ్యా||
చరణము 1
నరదైవత్వములు – రెండుగూడి – పరిపూర్ణమైన – దేహాత్మలు – ధరియించి యందు – లేశంబైన – దురితంబు లేని – యవతారము – నెరవుగా దాల్చి – ధరణికి నేతెంచి నిరయార్తులగు సర్వ – నరుల రక్షింప నీ కరుణా ప్రవాహము – విరివిగా పరుగెత్త జేయుచు – విమలమగు నీ ప్రాణరక్తము – లరుదుగా సమర్పణము చేసియు – తిరిగి లేచితివో మహాప్రభో ||వందనమయ్యా||
చరణము 2
నీ పుణ్యమందు – నమ్ముకొనండి – ఏ పాపియైన – తక్షణమున – శాపంబు బాసి – త్రాణగలిగి – నీ సజ్జనుండు – కృపవానిని – కాపాడుచుండు ||
చరణము 3
శమదమ ప్రేమ – కృపా వినయ – సద్గుణముల గల – భూషణముల – నిమిడియున్నట్టి – తనువు దాల్చి – క్రమముగా నందు – దైవత్వము – కనుపరచినావు – విమలోపదేశముల్ వివిధంబుగా శిష్య – సముదయమునకు నుత్తమముగా బోధించి – యమిత పాపహరంబునకు భువి నవతరించిన మేను సిలువను – శ్రమను మృతి గల్పించి మృత్యువును – జంపి జీవించిన మహాత్మా ||వందనమయ్యా||