#88
యేసును స్తుతించుట
పల్లవి · Pallavi
నమో యేసునాథా – నాథా – నమో జీవనాథాసమాన విరహిత సనాతనాత్మా – సమున్నతోజ్వల ప్రశాంత ధామా ||నమో||
చరణము 1
స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగా – భూవలయాకాశంబుల మించుచు – భువన పాలనము చేసెడి ప్రభువా ||నమో||
చరణము 2
ధరణి మానవ విమోచ నార్థము – కరుణను జీవము లొసగిన ప్రభువా – పరమ కృపాభరితామృతసారా వరసజ్జన హృదయాబ్జ విహారా ||నమో||
చరణము 3
సుందర మలయజ గంధ ధూపముల – చందముననుమా వినుతులు గొనుమా – వందే దేవ దయాసందీప – వందే శుభదానంద స్వరూపా ||నమో||