#87

క్రీస్తుకు నమోనమః

రచయిత: చెట్టి భానుమూర్తి

Category: సాయంతనారాధన · Open in the hymnal app

చరణము 1
సర్వలోక సంపూజ్యా – నమో నమో – సర్వజ్ఞాన సంపూర్ణా – నమో నమో – సర్వసత్య సారాంశా – నమో నమో – దేవా గావో ||
చరణము 2
దీనభక్త మందారా – నమో నమో – దోషశక్తి సంహారా – నమో నమో – దేవా యేసావతారా – నమో నమో – దేవా గావో ||
చరణము 3
దేవలోక ప్రదీపా – నమో నమో – భావలోక ప్రతాపా – నమో నమో – పావనాత్మ స్వరూపా – నమో నమో – దేవా గావో ||
చరణము 4
వేదవాక్యాదర్శమా – నమో నమో – వేదజీవమార్గ బీజమా – నమో నమో – వేదవాక్కును నీవే – నమో నమో – దేవా గావో ||
చరణము 5
శాపగ్రహితుడవైతివి నాకై – నమో నమో – ప్రాణత్యాగివైతివి నాకై – నమో నమో – ప్రాయశ్చిత్తమైతివి నాకై – నమో నమో – దేవా గావో ||