#90
యేసు క్రీస్తుకు స్తుతి
పల్లవి · Pallavi
క్రీస్తునాయక నీ దయను – కీర్తనలుగా బాడుదున్ – నే స్తుతులతో తండ్రి దేవుని – నిత్యమును గొండాడుదున్ ||క్రీస్తు||
చరణము 1
సిలువ మోసిన నీ ప్రయాసను – జెప్పుటకు నోరాడదు – అలుకు నొందక స్వామి నీ ది – వ్యాంఘ్రి చెంతను గూడుదు ||క్రీస్తు||
చరణము 2
నిమిషమైన నా బ్రతుకై గనలొ – నిన్ను నే స్మరియింతును – అమితమౌ దేవా నా క్రోశము – హర్షముగ వర్ణింతును ||క్రీస్తు||
చరణము 3
యేసుప్రభు నా కాలమంతయు – నేమరక నీ నామము – దాసునిగ భజియింతు నిక నే – దప్పకుండను నియమము ||క్రీస్తు||
చరణము 4
చచ్చిన నరు దెంచి మోక్షము – స్వామి నీ యుపకారముల్ – హెచ్చు ప్రేమను బాడుచుందును – యెప్పుడును గైవారముల్ ||క్రీస్తు||
చరణము 5
మలినమౌ నా మతి నాత్మ స – మ్మదిలోన్ ఘృసియింపను – బలిమితోనే పాడుచుందును – భక్తి యుద్దీపింపను ||క్రీస్తు||
చరణము 6
కన్ను మూతలుగాను నీ సమ – ఖంబు నేను బిరాలను – తెన్ను తప్పక ముత్తు నిక హరి – దేవ నన్ను నీవేలను ||క్రీస్తు||
చరణము 7
ముగ్గురొక్కడై వెల్గుచుండెడి – మోక్షరాజ్య గరిష్ఠుడా – యెగ్గుచేయక నన్ను బ్రోవవే – యేసునాథ మహేశుడా ||క్రీస్తు||
చరణము 8
భూతలములో నీ సమానము – బోల్చ నెద్దియు గానము – దాతవై మము సలుపవే నీ – తండ్రికిని సంధానము ||క్రీస్తు||