పల్లవి · Pallavi
భజన చేయుచు భక్తపాలక – ప్రస్తుతింతు నీ నామమును – మృతిని ముండ్లపై జయము నిచ్చిన – విజయుడా నిను వేడుకొందు ||
చరణము 1
దివ్య పదవిని విడిచి నీవు – దీనుడవై పుట్టినావు – భవ్యమైన బోధలెన్నో – బాగుగా ధర నేర్పినావు ||భజన||
చరణము 2
నరుల గావను పరమునుండి – ధరక నీవు వచ్చినావు – పరుడనైన నా కొరకు నీ – ప్రాణము నర్పించినావు ||భజన||
చరణము 3
చెడిన వాడనైన నన్ను – చేరదీసి బ్రోచినావు – పడిన నాదు గోతి నుండి – పైకి లేవనెత్తినావు ||భజన||
చరణము 4
ఎంత ప్రేమ యెంత దయ – యెంత కృప యేసయ్య నీకు – ఇంత యని వర్ణింప నిలలో – నెవరికిని సాధ్యంబు కాదు ||భజన||