పల్లవి · Pallavi
యేసు భజన సేయవే – దోషపు మనసా!వాసిగ నేనే, వర రక్షకుడు – వేసారి వసుధ – నీ వాడనై గానము ||యేసు||
చరణము 1
ధారుణి పాప – భరణా! హరణా! – కారుణ్యకరాయని కోరి భజింపవే ||యేసు||
చరణము 2
శాంతి సునీతి – సదమల భక్తిని – వింతగ నిడు మన – శాంతి సుధాకరు ||యేసు||
చరణము 3
అన్నపూర్ణా! నీవే – అవని తలంబున – నన్ను గనుగొంటివి – నా ధనమంటివి ||యేసు||
చరణము 4
మనసా! నీదు – మలినంబును తాను – మనుగడ, సిల్వపై – మా ప్రేమ హృదయుడు ||యేసు||