#80

క్రైస్తవ విశ్వాసమునకు ప్రేరేపణ

రచయిత: రావూరి లక్ష్మయ్య

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసుని భజింపవే మనసా – నీ దోషములు చనన్ – జేసి కృపతోన్బ్రోచును మనసా – వాసి కెక్కిన క్రీస్తు మోక్ష నివాసిగా నిన్ – వేరులేరని – దోసిలొగ్గి నుతించితే నిన్ను – త్రోసివేయడు దోషకారిని ||యేసు||
చరణము 1
ఏటికీ నీ కీదురాశలు – నీ కెప్పుడును చెవి – నాటవు ప్రభు యేసు వాక్యములు – వాటముగ నా తుది దినమున –నీటుమీరగ నిత్య జీవ కిరీటమును నీకిత్తు నని తన – నోట పల్కిన మాట దప్పడు ||యేసు||
చరణము 2
ఖండనగ నిన్ను చెండీయాడుడు – యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు నతడతడు – అండ బాయక నిన్ను ప్రతిదిన – గండములను హరించునని నీ – వుండ గోరిన నిండు నెమ్మది – దండిగ నీకుండ జెప్పును ||యేసు||
చరణము 3
లోక సైతాను దుర్బోధలు – నీ వాలింపక యా – లోకరక్షకుని సుబోధలు – ఏక మనసుతో రాత్రింబగళ్లు – రాకులేకను గాచు నా ప్రభు – రాకడను నీ వెంచి నను పర – లోక శుభ సుఖ సౌఖ్యమొసగును ||యేసు||
చరణము 4
వంచనలు మది నుంచక హే మనసా – నీ దుర్గుణము త్రుంచి ప్రభునిసేవింపవే మనసా – అంచితముగా క్రీస్తుండ్రిపు – పంచ జనుల భవాభినావగ – నెంచి నీ భవ భార మతనిపై – నుంచి సతము ప్రార్థించు మనసా ||యేసు||
చరణము 5
నిన్ను పాప బంధనముల నుండి – రక్షించుటకు స – ర్వోన్నతుని కుమారుడై వెలసి – ఎన్నడుగ నీవొందు దుఃఖము – లన్నిటిని తాను అనుభవించెను – విన్న తక్షణమే యేసు క్రీస్తుని – విశ్వసించి సుఖించు మనసా ||యేసు||