#78

క్రీస్తు సేవా సాఫల్యత

రచయిత: విలియం దాసన్

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసు భజనయే మనలను ఆ సుగతికినిదీయు – జనులారా దాసజనులు చేయు పనులు – దోషములు మోయు ||యేసు||
చరణము 1
మేలైన కుల శీల వ్రత – జాతి లాధిక మేలచాల మన మీలాగున – గాలావధిగా ||యేసు||
చరణము 2
అక్షయ కరుణేక్ష భువన – రక్షణ ఖలశిక్షాధ్యక్ష బుధ పక్ష కృత – మోక్షాయను దీక్షనన్ ||యేసు||
చరణము 3
మాటికి మిన్నేటికి బో – నేటికి గాల్ నొవ్వ – సూటిగ నరకోటి దురిత – వాటములను మీట ||యేసు||
చరణము 4
శ్రోత్రము అయి పవిత్ర నర చ – రిత్రలు వినబోక – మైత్రిని పరమాత్ముని కథ – మాత్రము విను మనుచునన్ ||యేసు||
చరణము 5
మన జీవనమునకు మారుగ – తన ప్రాణము ఇచ్చెన్ – తన రక్తముచే భావన మొనరించెను మనలన్ ||యేసు||