#77

రక్షకునియందలి విజయము

రచయిత: అలార్రి పెద్ద వీరాస్వామి

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
విజయ గీతముల్ పాడుడి – క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడుడిమృతిని అంతట మీటిన – విజయమిచ్చెడు దేవుని – నిజకుమారునినామమునన్ – హృదయములతో – భజన చేయుచు నిత్యమునన్ ||విజయ||
చరణము 1
మంగళముగ యేసుడే – మనకు రక్షణ – శృంగమై మరి నిలిచెను – నింగిన్ విడిచి వచ్చెను –శత్రుని యుద్ధ – రంగమందున గెలిచెను – రంగము మార్చగదన – రక్త బలము వలనన్– పొంగు నణచగ జేసెను – సాతానుని బల్ – క్రుంగ నలిపి చీల్చెను ||విజయ||
చరణము 2
పాపముల్ దొలగించెను – మనలను తన స్వ – రూపంబునకు మార్చెను – శాపంబంతయునోర్చెను – దేవుని న్యాయ – కోపమునన్ భరించెను – పాపమెరుగని యేసు – పాపమై మనకొరకు – పాపయాగము తీర్చెను – దేవునినీతిన్ – నిపుణడై నెరవేర్చెను ||విజయ||
చరణము 3
సిలువ మరణము నొందియు – మనలను తనకై – గెలువను లేచిన వానికి – చెలువుగను విమలాత్ముని – ప్రేమను మనలో – నిలువను చేసిన వానికికొలువు చేతుము గాని – ఇలను మరువక వాని – సిలువ మోయుచు నీ కృపా – రక్షణ చాల విలువ గలదని చాటుచు ||విజయ||