#76
క్రీస్తు యేసునకు మంగళహారతి
పల్లవి · Pallavi
క్రీస్తు యేసునకు మంగళం మా – కీర్తి రాజునకు మంగళంక్రీస్తు యేసు దైవమంచును – కూడి పాడుదము మంగళం ||క్రీస్తు||
చరణము 1
ప్రవచనంబులు పల్కినట్టి – ప్రాణనాథుడవీ వె నీదు స్తవము చేయుచుమెలగు మనుజుల – సత్ప్రభువుకిదే మంగళం ||క్రీస్తు||
చరణము 2
జగమునేలెడు జీవనాథుడు – జపములందెడు గృహ ప్రకటాక్షుడుఅగణితంబగు ప్రేమజూపిన – అమృతేజుడు మంగళం ||క్రీస్తు||
చరణము 3
ఖలుల బ్రోచెడు కనికరాత్మ – కేంద్ర స్థానము నీపదాబ్జము కలుషమును కడిగి మార్చినట్టి – సిలువ నాథుడే మంగళం ||క్రీస్తు||
చరణము 4
మనము గోరెడు మా హృదీశుడు – మార్గదర్శియు నీవేగావుఅనయమును నిను గొల్చు జనుల – ఆది దేవుడు మంగళం ||క్రీస్తు||
చరణము 5
జనకసుత శుద్ధాత్మ దేవుడు – గనని వినని ప్రేమపూర్ణుడు తనివితీరగ పాడుదము ఈ – ధాత్రి నీకగు మంగళం ||క్రీస్తు||