#75

క్రీస్తుకు మంగళ స్తోత్రము

రచయిత: పురుషోత్తమ చౌదరి

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
మంగళంబని పాడరే – క్రీస్తుకు జయ మంగళంబని పాడరేయేసుకు జయ మంగళంబని పాడరే – మంగళంబని పాడిసజ్జనాంగ పూజితుడై కృపాతరంగి లోక సమూహ పాపవిభంగుడనియు పొంగి జయజయ || మంగళం ||
చరణము 1
సోదరాలి భంగిని భక్తుల నెల్ల నెరి బ్రోచెడి వానినియూద దేశపు వారలధిక బాధలు బెట్టుచు హింసజేసినసాదరంబున త్రిదినములకు ముదముతో గనపడిన ప్రభునకు || మంగళం ||
చరణము 2
ధరణి నొల్లినట్టి దాసజనములను బ్రోచు దైవ తనయుడని నిజమరియు నిలను స్మరించువారికి గురుతరంబగు కలుష జలనిధిదరికి జేర్చు పరమ పదమే యిరువొనర్చెద ననిన ప్రభునకు || మంగళం ||