#74
క్రీస్తునకు మంగళార్చన
పల్లవి · Pallavi
వందనమే యేసునకు – వరుస గుణోదారునకుసౌందర్య ప్రభువునకు సర్వేశ్వరా నీకు || వందనమే ||
చరణము 1
యెహోవా తనయునకు – ఇమ్మానుయేలునకుబహు కరుణాభరణునకు – ప్రభువుల ప్రభువునకు || వందనమే ||
చరణము 2
ఆశ్రిత జనపాలునకు – నఖిల కలుష దహనునకుఇశ్రాయేలు రాజునకు యెహోవా నీకు || వందనమే ||
చరణము 3
మరియా తనయునకు – మహిమ గంభీరునకుపరిశుద్ధాచరణునకు – పరమేశ్వరా నీకు || వందనమే ||
చరణము 4
రాజులపై రాజునకు – రవికోటి తేజునకుపూజార్హ పదాబ్జునకు – భువనావన నీకు || వందనమే ||
చరణము 5
ప్రేమ దయాసింధునకు – క్షేమామృత పూర్ణునకుఆమెనని సాష్టాంగము – అర్పింతుము నీకు || వందనమే ||