#73

క్రీస్తునకు స్తోత్రము

రచయిత: పురుషోత్తమ చౌదరి

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
మంగళమే యేసునకు – మనుజావతారునకుశృంగార ప్రభువునకు – క్షేమాధిపతికి || మంగళమే ||
చరణము 1
పరమ పవిత్రునకు – వరదివ్య తేజునకునిరుపమానందునకు – నిపుణ వైద్యునకు || మంగళమే ||
చరణము 2
దురిత సంహారునకు – వరసుగుణోదారునకుకరుణా సంపన్నునకు – జ్ఞానదీప్తునకు || మంగళమే ||
చరణము 3
సత్య ప్రవర్తనునకు – సద్ధర్మశీలునకునిత్యస్వయంజీవునకు – నిర్మలాత్మునకు || మంగళమే ||
చరణము 4
యుక్తస్తోత్రార్హునకు – భక్త రక్షామణికిసత్యపరంజ్యోతి యగు – సార్వభౌమునకు || మంగళమే ||
చరణము 5
నరఘోర కలుషముల – నూరుమార్గాన నిలకరుదెంచిన మాపాలి – వర రక్షకునకు || మంగళమే ||
చరణము 6
పరమపురి వాసునకు – నరదైవ రూపునకుపరమేశ్వర తనయునకు – ప్రణతింతుము నిన్ను || మంగళమే ||