#72
క్రీస్తునకు మంగళార్చన
పల్లవి · Pallavi
మంగళము పాడరే – క్రీస్తుకు జయ మంగళము పాడరేయో ప్రియులారా – మంగళము పాడరేమంగళము పాడెదము సద్గతిని వీడి ప్రభు –సంగములను గూడి మది బొంగుచు జెలంగుచును || మంగళము ||
చరణము 1
రాజులకు రాజని – దూతలచే పూజగొనువాడనితేజమున సూర్యునికి – దీప్తి నిడు సద్గుణ విరాజితునిసాధుజన రక్షకుని పక్షముగ || మంగళము ||
చరణము 2
కరుణ గలవాడని – పాపుల బ్రోచు బిరుదుగొనినాడనిమరణమును దాని బరి మార్చు ఘన శక్తిగలపరమ గురుడతడె మన పాలి వాడని శుభ || మంగళము ||
చరణము 3
సంగీతము పాడుచు – సువార్త ప్రసంగములను గూడుచునింగికిని భూమికిని – నిత్యముగ నేల దగుశృంగారపు రాజునకు క్షేమమగు ఆమెనని || మంగళము ||