#71

క్రీస్తును స్తుతించుట

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
నీవు నా దేవుండవై యున్నావు యేసు నాథా –నీవలన బ్రోవవే నన్ను గావవే || నీవు ||
చరణము 1
పాప మానవ శాప భారము – నోపి సిలువను బడిన క్షేమాధిపతి సర్వ భూపతి || నీవు ||
చరణము 2
శ్రేయమౌ కాయంబు భక్తుల – కీయ సిద్ధము చేయు యేసు నాయకా మోక్ష దాయకా || నీవు ||
చరణము 3
జీవ మార్గెడి త్రోవ నే బడి – చావనై యున్నాను పతిత పావనా యాత్మ జీవనా || నీవు ||
చరణము 4
జాగుచేయక బాగుచేయను – రాగదె నే ఘోర పాప రోగిని దుఃఖ భాగీని || నీవు ||
చరణము 5
పాపమున నా రూపము మాపి – ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా కృపను చూపవా || నీవు ||