#70
దేవకుమారునికి స్తోత్రము
పల్లవి · Pallavi
దేవకుమారా – దీనోపకారానా వంక దయను చూపి – నా యన్న రారా || దేవ ||
చరణము 1
వృక్షము బాసిన – పక్షి నేనయ్యాఅక్షీణ కరుణచే – రక్షింపవయ్యా || దేవ ||
చరణము 2
పాపుల పాలిటి – పరమదయాళూదీవించు నీ దయ – దీనునికిప్పుడు || దేవ ||
చరణము 3
వినుతింతు సద్గుణ – విమల విచారానన్ను బ్రోవవే యేసు – నామావతారా || దేవ ||
చరణము 4
భజన చేసెద నిన్ను – నిజ రక్షకుండవిజయము చేయవే – జనరేతువాడా || దేవా ||
చరణము 5
కనికర మత్యంత – కరుణయుగలదునిన్ను నమ్ము వాని చేయి – విడి వలదు || దేవ ||
చరణము 6
మహనీయ గుణమణి – మండిత దేవాఇహ బాధ బాపవే – ఇమ్మానుయేలా || దేవ ||