పల్లవి · Pallavi
సర్వదేశములారా – శ్రీ యేసే దేవుండుఉర్వి నుత్సాహముతో – గురుస్తోత్రము చేయను రండి || సర్వ ||
చరణము 1
ఆ ప్రభువే దేవుండు – అధికస్తోత్రార్హుండుభూప్రజల నందరిని – బుట్టించిన భగవంతుండు || సర్వ ||
చరణము 2
మనము దేవుని వారము – మును మరి యాయన ప్రజలముమనయము నా ఘనప్రభువు – నెనరుతో మేపెడి గొర్రెలము || సర్వ ||
చరణము 3
కృతజ్ఞతార్పణలు – కొల్లగను జెల్లింపనాతని యావరణములో – నతి వినయముతో చేరండి || సర్వ ||
చరణము 4
ఆయన దయామయుడు – ఆయన కృపామయుడుఆయన ప్రేమ సత్యం – బనవరతంబుండు నిజమే || సర్వ ||
చరణము 5
శుభనామం మదినుంచి – ప్రభునామం స్తుతియించిఘననామం బతిభక్తిన్ – అనయంము గొలువుడి జనులారా || సర్వ ||
చరణము 6
పితృ పుత్రాత్మకును – ప్రియమహిమ మగుగాకఆదిన నొండిన రీతి – ననవరతంబుండు గాక || సర్వ ||