#68

ప్రభువైన యేసునకు స్తుతి

రచయిత: మిక్కిలి సమూయేలు

Category: సాయంతనారాధన · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఘన భవదుపకృతులను మాటికిని నేను వినుతింతును దేవా –నిజ సత్యము నొనరగా నాపై ననుక్రోశము దగ నూనుమవే క్రైస్తవ జన విహిత || ఘన ||
చరణము 1
ధోరణిగా నా దోషములు ఎంచక – సారెకు నాశ్రిత జనవరదా –పారము దప్పిన పాతకుడగు నేను – నారడిబడ నీ కది బిరుదా || ఘన ||
చరణము 2
జలబుద్బుదముతో సమమని నా స్థితి – తెలియదు నీకది దేహధరా –ఖలమయమగు నా కర్మము బ్రోవను – సిలువను బొందిన శ్రేయస్కరా || ఘన ||
చరణము 3
మందమతినని నా యందు నలక్ష్యము – నొందకు దేవా యేసు నందనా –చందముగా నా డెందము కడు దెలివొందగా – నీ దయ నందుమా || ఘన ||